Yanamala Ramakrishnudu
-
టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్ ను పీకి పక్కన పడేసిన లోకేష్
-
ఇంత అవమానమా?
సాక్షి, అమరావతి : రాజకీయాల నుంచి తనకు బలవంతంగా, అదీ.. అవమానకరంగా రిటైర్మెంట్ ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడైంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న యనమల మరికొన్నాళ్లు ప్రజాప్రతినిధిగా కొనసాగాలని భావించారు. ఇటీవలే ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ పదవినే రెన్యువల్ చేయలేదు. దీంతో చంద్రబాబు తనను అవమానించినట్లు యనమల భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తనను వాడుకుని చివరి దశలో అవమానకర పరిస్థితుల్లో రాజకీయాల నుంచి నిష్క్రమించేలా చేశారని ఆయన బాధపడుతున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో శాసన మండలిలో తన సభ్యత్వానికి ఆఖరి రోజు అయిన మంగళవారం ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఏడుగురు సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో మండలిలో వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని ఎజెండాలో పెట్టి వారికి ముందే సమాచారం ఇచ్చినా, యనమల మాత్రం వీడ్కోలు కార్యక్రమానికి రాకుండా నిరసన తెలిపినట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం గ్రూప్ ఫొటో కార్యక్రమం ఉందని ముందే చెప్పినా, యనమల దానికీ రాకపోవడం గమనార్హం. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలతో గ్రూప్ ఫొటో దిగేందుకు ఆయన ఇష్టపడలేదని తెలుస్తోంది. ప్రాధాన్యత లేకుండా చేసి.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పార్టీలో సీనియర్ నాయకులందరికీ పొగ పెడుతున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలో యనమల పేరునూ చాలారోజుల క్రితమే చేర్చారు. పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. 2019– 24 మధ్యలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు అప్పగించి, పని చేయించుకున్నప్పటికీ, గత ఏడాది తిరిగి అధికారంలోకి రాగా నే ఆయన్ని పక్కన పెట్టేశారు. ప్రభుత్వంలో, పార్టీలోనూ అస్సలు ప్రాధాన్యత లేకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఆయన ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో చంద్రబాబు ఆయనపై సోషల్ మీడియాలో ఎదురు దాడి చేయించి మరింతగా అవమానించారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా పలు అవమానాలకు గురి చేసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి వీడ్కోలు కార్యక్రమానికి, గ్రూప్ ఫొటోకు రాలేదని చెబుతున్నారు. -
యనమలకు బాబు ‘షాక్’ హ్యాండ్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయాల నుంచి అవమానకరంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సమకాలీకుడు, ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కునేందుకు స్పీకర్‌గా అన్ని విధాలా సహకరించిన సహచరుడు.. యనమలను పట్టించుకోకుండా చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరుతో యనమల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగియనుండగా, ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే ఆయన పాల్గొంటున్న చివరి సమావేశాలుగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో పొసగకపోవడం, ఆయన కోటరీని వ్యతిరేకించడం వల్లే యనమలను పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. మున్ముందు రాజకీయంగా ఆయనకు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన రిటైర్ అయినట్లేనని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కోసం సుదీర్ఘకాలం పని చేసిన వ్యక్తికి ఇంత అవమానకరంగా రాజకీయ ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంపై యనమల స్పందించకపోయినా తనను కావాలని అవమానించినట్లు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కూతురు, అల్లుడికి పదవులు ఉన్నాయనే కారణంతో పక్కకు.. టీడీపీలో ప్రస్తుతం లోకేశ్ మాటే శాసనంగా నడుస్తుండడంతో ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉండడంతో ఇక ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు సైతం భావించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా లేకపోయినా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే అంతకుముందు నుంచే పార్టీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోవడం, దాన్ని యనమల వంటి పలువురు సీనియర్లు వ్యతిరేకించడంతో చినబాబు ఆగ్రహానికి గురై, వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో యనమలకు పూర్తిగా చెక్ పెట్టి రాజకీయాల నుంచే అనివార్యంగా రిటైర్మెంట్ ఇప్పించారనే చర్చ జరుగుతోంది.పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఇటీవల ఆయన కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు పేదల భూములు తీసుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారిని వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నిoచారు. యనమల స్థాయి నాయకుడు ఏకంగా సీఎంని ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. అయితే చంద్రబాబు తన మార్కు రాజకీయంతో పార్టీలోనే యనమల వ్యతిరేకుల్ని, సోషల్ మీడియాను ప్రోత్సహించి ఆయనపై ఎదురుదాడి చేయించడంతోపాటు అసభ్యంగా తిట్లు కూడా తిట్టించారు. అప్పటి నుంచి టీడీపీకి, యనమలకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. వాడుకుని వదిలేయడం బాబుకు అలవాటే ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లోనూ యనమలకు కనీస ప్రాధాన్యం లభించడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో లోకేశ్ ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా యనమల దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు సైతం టీడీపీ సభ్యులు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా అవసరానికి వాడుకుని ఆ తర్వాత పూచికపుల్లలా తీసిపడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటైన విద్యే. కాబట్టి యనమలకు అదే తరహా ట్రీట్మెంట్ లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఐదుగురు సిట్టింగ్‌లూ కరివేపాకులు!
సాక్షి, అమరావతి: ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సిట్టింగ్‌లకు అవకాశం లేనట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉంటే వారిలో ఒక్కరికి కూడా సభ్యత్వాన్ని తిరిగి రెన్యువల్ చేసే పరిస్థితి లేదని నేతలు చర్చించుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరులో పూర్తి కానుండగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేశారు. ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా, మిగిలిన నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం రాజ్యసభ స్థానాలపైనే ఆసక్తి చూపుతూ, ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక స్థానం తమకివ్వాలని కోరుతున్నా, జాతీయ నాయకత్వం ఆ దిశగా టీడీపీకి ఎటువంటి సూచనలు చేయలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ప్రస్తుతం ఆ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. యనమలకు అవమానం!పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని అవమానకరమైన రీతిలో పక్కన పెడుతున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయకపోగా, పార్టీలోనూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా ఆయన్ను పట్టించుకోక పోవడం వెనుక లోకేశ్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి, సొంత మనుషులతో కోటరీ నిర్మించుకుంటున్నారని పార్టీలో గుప్పుమంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా యనమల సహా చాలా మంది సీనియర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో చంద్రబాబు తీరును తప్పు పడుతూ యనమల లేఖ రాయడం ద్వారా కలకలం సృష్టించారు. అప్పటి నుంచి పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీతో సహా మరే పదవులు ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిగిలిన నలుగురికీ నిరాశేఉద్యోగ సంఘాల నేతగా ఉండి టీడీపీలో చేరి, పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్‌బాబు, ఉత్తరాంధ్ర నుంచి గతంలో శాసన మండలికి వెళ్లిన దువ్వారపు రామారావు, రాయలసీమ కోటాలో మండలిలో ఉన్న బీటీ నాయుడి పేర్లను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు మండలిలో చురుగ్గా ఉండి లోకేశ్‌తో కలిసి పని చేసినా, మారిన పరిస్థితుల్లో వారి అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. వారివల్ల అంత ఉపయోగం లేదనే కారణంతో ఎమ్మెల్సీ సభ్యత్వం రెన్యువల్ కోసం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనొకరు ఉన్నారనే విషయమే టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు. -
యనమల గతి ఇక అంతేనా?
అవమానభారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు తెలిసివస్తూంటుంది. స్వపక్షం నుంచే వస్తున్న విమర్శల జడిని నేరుగా తిప్పికొట్టలేక, అలాగని జవాబు కూడా ఇవ్వలేని స్థితిలో యనమల ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలుగుదేశం వాళ్లే ఆయనను బ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణిస్తూండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు యనమల. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉండగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు జరిగిన పరాభవాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎక్కింది మొదలు యనమలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోతోందన్న అంచనాలకు బలం పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆశించిన రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడం ఒక అవమానమైతే.. కాకినాడ పోర్టు యజమాని కేవీరావుపై చంద్రబాబుకు రాసిన లేఖ సొంత పార్టీలో ఆయన్ను పరాయివాణ్ణి చేసింది. పదవి ఇవ్వలేదన్న అక్కసుతో యనమల నేరుగా బాబునే బ్లాక్మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులే దూషణలకు దిగుతారని బహశా ఆయన కూడా ఊహించి ఉండరు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన యనమల 1994లో టీడీపీ హయాంలో స్పీకర్‌గానూ పనిచేశారు. రాజకీయ జీవితంలో ఇదే ఆయనకు మేలిమలుపు అంటారు. నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ కూడా యనమలకు మంత్రి పదవి కానీ, ఇతర పదవి ఏదైనా కూడా ఇచ్చేందుకు సుముఖత చూపలేదని అంటారు. తనకు విశ్వాసపాత్రుడైన గాలి ముద్దు కృష్ణమనాయుడికి స్పీకర్ పదవి ఇవ్వాలన్నది ఎన్టీఆర్ ఆలోచన. అయితే ముద్దుకృష్ణమ ఇష్టం మేరకు మంత్రిని చేశారు. ఈ అవకాశాన్ని వాడుకున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా స్పీకర్ పదవికి యనమల పేరును తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ ను ఒప్పించారు. బాబు కుట్రల గురించి పెద్దగా ఆలోచించని ఎన్టీఆర్అంగీకరించడం.. ఆ తరువాత తొమ్మిది నెలలకే యనమల సహకారంతో ఎన్టీఆర్ పదవీచ్చుతి చకచకా జరిగిపోయాయి... బాబు డైరెక్షన్లో! ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్టీఆర్ ది.యనమల కూడా వారిలో ఒకరు. అయినాసరే.. రాజకీయాల్లో విశ్వాసానికి తావులేదనట్టుగా చంద్రబాబు, యనమల వంటి వారు రుజువు చేశారు. వాస్తవానికి 1994 ప్రాంతంలో చంద్రబాబు వర్గం ప్రధాని పీవీ నరసింహరావును కూడా బుట్టలో వేసుకోగలిగిందని, అందుకే పార్టీ రాష్ట శాఖ ఆలోచనలకు భిన్నంగా పీవీ బాబుకు సాయం చేశాడని అంటారు. శాసనసభ రద్దుకు ఎన్టీఆర్ చేసిన సిఫారసును గవర్నర్ కృష్ణకాంత్ పట్టించుకోకపోవడం, మంత్రిపదవి నుంచి బర్తరఫ్ అయిన చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం, శాసనసభలో జరగాల్సిన బలపరీక్షను స్పీకర్ యనమల చేతిలో పెట్టడం వంటివన్నీ ఇందుకు నిదర్శనాలు. యనమల స్థానంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పీకర్‌గా ఉండి ఉన్నట్లైతే ఎన్టీఆర్ పదవి అంత తేలికగా పోయేది కాదు. చంద్రబాబు తన వర్గం ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి అక్కడకు వెళితే, టీడీపీ వారే చెప్పులు విసిరారు. సినీ రంగంలోను, రాజకీయ రంగంలోను ఎదురులేని మొనగాడిగా అందరి ప్రశంసలు పొందిన ఎన్టీఆర్ కు ఎదురైన దుర్గతి అది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు గవర్నర్ స్వయంగా వెళ్లి ఆయన నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. పిమ్మట అసెంబ్లీ సమావేశంలో తన వాదన వినిపించడానికి ఎన్టీఆర్ పలుమార్లు ప్రయత్నించారు. చంద్రబాబుపై కుట్రలను వివరించే ప్రయత్నం చేసిన ప్రతిసారి స్పీకర్ యనమల మైక్ కట్ చేసేవారు. ఆ అవమానం భరించలేక ఎన్టీఆర్ తన వర్గం ఎమ్మెల్యేలతో వాకౌట్ చేశారు. పదవి కోల్పోయాక ఎన్టీఆర్ మీడియా సమావేశం పెట్టి సొంతపార్టీ వారి చేతిలో, సొంత కుటుంబం చేతిలో పరాభవానికి గురైన తీరు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాజకీయాలలో ఎంత పెద్ద నాయకుడైనా ఒక్కోసారి ఇలా అవమానాలకు గురి అవుతారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు యనమల వంతు. 2019 వరకు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న యనమల, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. 1983 నుంచి 2004 వరకు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2019లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి పొందగలిగారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. అశోక్ గజపతి రాజు వంటి నేతలను తోసిరాజని పార్టీలో చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన తాను కోరితే రాజ్యసభ సభ్యత్వం కష్టం కాదని అనుకున్నారు. భంగపడ్డారు. పార్టీలో బాబుకంటే లోకేష్ ప్రాభవమే ఎక్కువ అవుతూండటం దీనికి కారణంగా చెబుతున్నారు. సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలను బాబు కూడా ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఈ నేపథ్యంలోనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయంగా యనమలను పక్కన పెట్టేశారన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేనట్లుగా యనమల ఏపీ రాజకీయాల నుంచి వైదొలగి పార్లమెంటుకు వెళ్లాలని అనుకున్నా... చంద్రబాబు, లోకేష్‌లు ఆయనకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, పలు అక్రమాల ఆరోపణలు ఉన్న సానా సతీష్ వైపు మొగ్గు చూపారు.నిజానికి ముగ్గురు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన టీడీపీ తన సొంత పార్టీ నేతలకు ఈ పదవులు ఇవ్వలేకపోయింది. పోనీ ఖాళీగా ఉన్న మంత్రి పదవి అయినా ఇస్తారా అని ఎదురుచూస్తే, దానిని నాగబాబుకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంత్రి పదవి, రాజ్యసభ సీటు రెండూ రావడం లేదని స్పష్టమైందన్నమాట. ఎమ్మెల్సీగానే కొనసాగాలన్న మాట. సానా సతీష్ తో పోల్చితే యనమల కచ్చితంగా మెరుగైన రాజ్యసభ అభ్యర్ధి. పార్టీ వాదనను బలంగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవారు. అయితే ఈయన వల్ల ఢిల్లీలో పెద్దగా ఉపయోగం ఉండదని, సానా సతీష్ లాబీయింగ్‌లో దిట్ట అని చంద్రబాబు, లోకేష్‌లు భావించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సెజ్ భూములను కేవీరావు చౌదరి ఎలా దోచేసింది వివరిస్తూ యనమల లేఖ రాయడం సంచలనమైంది. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా కేవీరావు నుంచి లాక్కున్నారంటూ కొందరు వైఎస్సార్సీపీ నేతలపై, ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అధినేతపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు వేసిన ప్లాన్‌కు ఈ లేఖ గండి కొట్టింది. టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయే పరిస్తితి ఏర్పడింది. దాంతో యనమల లేఖలోని అంశాల జోలికి వెళ్లకుండా, ఆయనను తిట్టడానికే టీడీపీలోని కొన్ని వర్గాలు పనికట్టుకున్నాయి. రాజ్యసభ సీటు ఇవ్వలేదనే ఈ లేఖ రాశారని టీడీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. యనమలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేవీరావు చివర చౌదరి అని కులం పేరు తగిలిస్తారా అని మండిపడ్డారు. కమ్మ కులం మద్దతు లేకుండానే యనమల ఈ స్థాయికి వచ్చారా అని వారు ప్రశ్నించారు. అయితే యనమల వెనక్కి తగ్గకుండా ఒక ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ తన చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. తన పేరు చివర యాదవ అని లేనంత మాత్రాన కులం పోదు కదా? అని ప్రశ్నించారు ఆయన. యనమల కుటుంబానికి నాలుగు పదవులు ఉన్నా సంతృప్తి లేదని, అసలు పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవ ఏముందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. యనమల తమ్ముడు అసెంబ్లీ టిక్కెట్ అడిగినా, ఆయనను కాదని ఈయన ఒక కుమార్తెకు తుని టీడీపీ టిక్కెట్ ఇచ్చిన మాట నిజమే. అలాగే వియ్యంకుడు పుట్టా సుధాకర్ కు రాయలసీమలోని మైదుకూరు అసెంబ్లీ సీటును, ఈయన కుమారుడు, యనమల మరో అల్లుడు పుట్టా మహేష్ కుమార్‌కు ఏలూరు లోక్ సభ సీటు ఇచ్చారు.అయితే సుధాకర్, ఆయన కుమారుడికి టిక్కెట్లు రావడంలో యనమల పాత్ర పెద్దగా లేదని, పార్టీకి చేసిన సేవల రీత్యా లభించాయని కొందరి అభిప్రాయం. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్ది పార్టీలు విమర్శిస్తుంటాయని, కాని ఆ వెన్నుపోటు పొడిచింది యనమల అవుతారు కదా అని టీడీపీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈయనకు ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఎవరిరీ లభించలేదని, ఈయన పార్టీలో ఇతరనేతలు ఎవరిని ఎదగనివ్వలేదని కూడా ఆయన అబిప్రాయపడ్డారు. టీడీపీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నేరుగా యనమలపై వ్యాఖ్యానిస్తూ ఆయన వల్ల పార్టీకి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. యనమల బీసీ నేతలను పెరగనివ్వకుండా అణగదొక్కి, తాను మాత్రమే లాభపడ్డారని విమర్శించారు. టీడీపీ అధినాయకత్వం సూచన లేకుండానే సుబ్రహ్మణ్యం ఈ విమర్శలు చేశారా అన్న సందేహం ఏర్పడుతోంది. గతంలో యనమలను ఇంత నేరుగా విమర్శించే సాహసం పార్టీలో ఎవరూ చేసేవారు కాదు. కాని కాలచక్రం మారుతుంది కదా! ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సర్దుకుపోయి అవమానం భరించడం తప్ప యనమల చేయగలిగింది కూడా ఏమీ లేదేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లేఖ కాదు యనమల.. విచారణకు ఆదేశించాలి?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: కాకినాడ సెజ్ భూములపై యనమల రామకృష్ణుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే భూ దోపిడీపై చంద్రబాబుతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. అలాగే, 2014లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగిందని చెప్పుకొచ్చారు. నాడు మంత్రిగా ఉన్న యనమల.. రైతుల పక్షాన ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తన రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబుకు యనమల లేఖ రాశారు. 2002-03లో కాకినాడ సెజ్ కోసం భూసేకరణ ప్రారంభమైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. 2014లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగింది. అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల ఎందుకు సెజ్ రైతుల పక్షాన నిలవలేదు.సెజ్‌కు ముందుగానే తన భూములను ఇచ్చి.. రైతులంతా భూములు ఇచ్చేలా మోటివేట్ చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. సెజ్ రైతులపై యనమలకు చిత్తశుద్ది ఉంటే భూ దోపిడిపై చంద్రబాబుతో విచారణ జరిపించాలి. వేల కోట్లు దోచుకున్న కేవీరావు చౌదరి నుండి సొమ్ములు వెనక్కి తీసుకుని.. సెజ్ రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు తిరిగి చెల్లించాలి. సెజ్ రైతులకు వైఎస్ జగన్ భూములు తిరిగి ఇచ్చేశారు. అలాగే, చంద్రబాబుకు కూడా రైతులకు తిరిగి భూములు ఇచ్చే విధంగా భగవంతుడు ఆయనకు మంచి మనసు ప్రసాదించాలి.సెజ్‌లో నేను ఆరు ఎకరాల భూమి కొన్నది వాస్తవమే. రైతులకు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా రైతుల నుండి భూములు కొనుగోలు చేశారు. సరైన పద్దతిలో భూముల కొనుగోలు చేయడంలో తప్పు లేదు కదా? అని ప్రశ్నించారు. -
యనమలపై దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు
-
ప్రశ్నిస్తే పనిపడతా!
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు ఇప్పుడు పార్టీలోని ఇద్దరు బీసీ నేతల మధ్చ చిచ్చు పెట్టారు. సుదీర్ఘ కాలం నుంచి తనకు బలమైన మద్ధతుదారుగా ఉన్న సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలను జీర్ణించుకోలేక ప్రశ్నించడంతో ఆయనపైకి మరో సీనియర్ నేత, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను ఉసిగొల్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా టీడీపీ సోషల్ మీడియా కూడా యనమలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయి ఆరోపణలతో ట్రోల్ చేస్తోంది. దీనికంతటికీ కాకినాడ పోర్టు వ్యవహారంలో చంద్రబాబు వైఖరికి విరుద్ధంగా యనమల రామకృష్ణుడు ఆయనకు లేఖ రాయడమే కారణం. కాకినాడ పోర్టుకు చెందిన కేవీ రావు చౌదరికి చంద్రబాబు మద్దతు పలుకుతూ రాజకీయంగా ఆయన్ను పావులా వాడుకుంటున్నారు. కానీ యనమల మాత్రం తాను రాసిన లేఖలో కేవీ రావు చౌదరి కాకినాడ సెజ్ భూముల ద్వారా వేల కోట్ల లబ్ధి పొందారని.. బీసీ, మత్స్యకార రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. తనను ధిక్కరిస్తూ లేఖ రాయడంతో చంద్రబాబు.. యనమలను ప్రశ్నించకుండా ఇతర బీసీ నేతలను ఆయనపైకి ప్రయోగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రెడ్డి సుబ్రహ్మణ్యం బహిరంగంగా యనమల రామకృష్ణుడిపై ఆరోపణలు గుప్పించారు. 40 ఏళ్లుగా యనమల బీసీల గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు తనకు పదవి ఇవ్వలేదనే కారణంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు తోడుగా మరికొందరు కింది స్థాయి నేతలు కూడా యనమలపై విమర్శలు చేశారు. టీడీపీ సోషల్ మీడియా అయితే యనమల పార్టీలో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయి ఆడేసుకుంటోంది. చంద్రబాబుకు తెలియకుండానే తిడతారా?పార్టీలో తన స్థాయి ఉన్న ఒక సీనియర్ బీసీ నాయకుడిని, మరో సీనియర్ బీసీ నాయకుడు బహిరంగంగా తిట్టారంటే అందుకు చంద్రబాబు పరోక్ష అనుమతి కచ్చితంగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యనమలకు వ్యతిరేకంగా పార్టీలోనే ఇంత జరుగుతున్నా, చంద్రబాబు స్పందించక పోవడాన్ని బట్టి ఆయన అభిమతం ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు కొందరు బీసీ నేతలు యనమలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ఆది నుంచి తోడు, నీడగా ఉన్న నాయకుడిని ఇలా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా పార్టీలోనే బీసీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడినా, చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనలాంటి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనికితోడు కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో కేవీ రావు చౌదరికి అనుకూలంగా వ్యవహరించడం, రాజ్యసభ స్థానాలను లాబీయిస్టులకు కట్టబెడుతుండడంతో తట్టుకోలేక ఆయన తొలిసారిగా చంద్రబాబును ధిక్కరించి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం నుంచి చంద్రబాబుతో కలిసి పని చేసిన యనమల లాంటి నాయకుడు తిరుగుబాటు స్వరం వినిపించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. -
బడ్జెట్‌పై బహిరంగ చర్చకు రెడీ.. చంద్రబాబుకు కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సీఎం చంద్రబాబుతో సహా మంత్రులకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అవకాశం లేనేలేదని.. అందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనమన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రసంగాన్ని కాకాణి ఖండించారు.‘‘యనమల రామకృష్ణుడుకి మతి భ్రమించి మాట్లాడారు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడే మాటలు ఇవేనా ? సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడానికే జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వంలోనే సమర్దవంతంగా పనిచేసింది. చంద్రబాబు వ్యాఖ్యలు, యనమల రామకృష్ణుడు మాటలు అర్థం పర్థం లేనివి. బడ్జెట్ పత్రాల్లో రాష్ట్రానికున్న అప్పులు రూ. 6.46 లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైనప్పటికీ టీడీపీ ఇంకా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. శాసనమండలిలో యనమల రామకృష్ణుడు రూ.14 లక్షల కోట్లు అప్పులున్నాయని ఇంకా అబద్దాలు చెప్తున్నారు.’’‘‘తెచ్చిన మొత్తం అప్పులను కాగ్‌కు వెల్లడించలేదని యనమల ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులను కాగ్‌కు చెప్పలేదని మరో విచిత్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదునెలలు అయ్యింది. మరి ఈ ఐదునెలల కాలంలో అప్పులు ఇంకా ఉన్నాయి. దాచిపెట్టారని అనుకుంటే ఎందుకు తవ్వి తీయలేదు? అప్పులను దాచేశారని కనిపెట్టి ఉంటే.. ఎందుకు బడ్జెట్ పత్రాల్లో పెట్టలేదు?రూ.2.23 లక్షల కోట్లు బడ్జెట్‌యేతర అప్పులు వైఎస్సార్సీపీ చేసిందని చెబుతున్న యనమల అలా ఉంటే వాటిని ఎందుకు బడ్జెట్ పత్రాల్లో పెట్టలేదు. ఆర్థిక మంత్రిగా పలుమార్లు పనిచేసిన యనమలకు బడ్జెట్ పత్రాలు కూడా అర్థంకాలేదు. రూ.2.23లక్షల కోట్లమేర పూచీకత్తుల కింద అప్పులు తీసుకునేందుకు మాత్రమే ప్రభుత్వానికి పరిమితి ఉందని, అంత వెసులుబాటు ఉన్నా గ్యారంటీలు చూపి కేవలం రూ.1.54 లక్షలకు మాత్రమే చేసిందని కాగ్ చెప్పింది. మరి యనమల పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు? ..అలాగే గ్యారంటీల ద్వారా అప్పులు తీసుకునే వెసులుబాటును బాగా పెంచేశారని కూడా యనమల అబద్ధాలు చెప్పారు. రాష్ట్రం ఆదాయం 1.74 లక్షల కోట్లు అయితే ఇందులో గ్యారంటీలద్వారా అప్పులు 89శాతం కూడా చేరుకోలేదు. మరి యనమల ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు. పూచీకత్తుల ద్వారా అప్పులకోసం వెసులుబాటు పెంచుకుని అప్పులు తీసేసుకున్నారన్నది వాస్తవం కాదు...ఎఫ్ఆర్బీఎం చట్టంలో రిస్క్ అడ్జస్ట్మెంట్ గురించి యనమలకు తెలియదా? పూచీకత్తుల ద్వారా తీసుకున్న అప్పులకు రిస్క్ అడ్జస్ట్మెంట్ నిర్ణయించిన దానికన్నా.. చాలా తక్కువగా ఉందనే విషయం యనమలకు తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. రిస్క్ అడ్జస్ట్మెంట్ చేయకున్నా సరే.. గ్యారంటీల ద్వారా అప్పులు రాష్ట్ర ఆదాయాల్లో 89 శాతం దాటడం లేదు. ఒకవేళ రిస్క్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే గనుక గ్యారంటీల కన్నా తీసుకున్న అప్పులు మరింత తక్కువే. మరి యనమల ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ..చేబదుళ్లు అంటే కూడా అర్థం తెలియని వ్యక్తి యనమల. చేబుళ్లు కింద తీసుకున్నవి వెంటనే కట్టాలి. అలా చేస్తేనే మళ్లీ ఇస్తారు. 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి చేబదుళ్లు కింద రాష్ట్రం ఇవ్వాల్సినవి కేవలం రూ.594 కోట్లు మాత్రమే. కాని.. యనమల రూ.2 లక్షల కోట్లు భారం ఉందని అన్నట్టుగా మండలికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండేచర్కూ, క్యాపిటల్ అవుట్లేకూ తేడా ఉందని చెప్పుకుంటూ ఆరోపణలు చేశారు. క్యాపిటల్ అవుట్ లే ప్రకారం అసలు ఖర్చుపెట్టలేదన్నట్టుగా చెప్పారు. వాస్తవంగా క్యాపిటల్ అవుట్లే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రూ.12,242 కోట్లు అయితే, గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ.23,330 కోట్లకు చేరింది. ..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీ బాగా పడిపోయింది, నెగెటివ్ గ్రోత్ వచ్చిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కి ఎకానమీ అంటూ తెలియదని తప్పుడు మాటలు మాట్లాడారు. వాస్తవం ఏంటంటే వైఎస్సార్సీపీ హయాంలో జీడీపీలో రాష్ట్ర జీఎస్డీపీ 4.83 శాతానికి పెరిగింది. టీడీపీ 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఇది కేవలం 4.42శాతం మాత్రమే. నిన్న(బుధవారం) వైఎస్ జగన్ ప్రెస్‌మీట్, ఆయన చూపించిన సాక్ష్యాధారాలతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి. ఇకనైనా అబద్దాలు చెప్పడం మానుకుంటే మంచిది.’’ అని కాకాణి పేర్కొన్నారు. -
కొండలకు గుండు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం చేతికొచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. అధికారులను బెదిరించి దారికి తెచ్చుకుని కొండలకు కొండలనే మాయం చేసేస్తున్నారు. మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా గ్రావెల్ తవ్వేసి కొండలను పిండి చేస్తున్నారు. అడిగేవాడు లేడనే ధైర్యంతో అడ్డగోలు దోపిడీకి తుని పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు ఇలాకాలో గ్రావెల్ దోపిడీ గడచిన నెల రోజులుగా ఇష్టారాజ్యంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల అండదండలు చూసుకుని తమ్ముళ్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్‌ను దోచుకుపోతూ కొండలను పిండి చేసేస్తున్నారు. దళితులు, బలహీనవర్గాల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం డి.పట్టా భూములను ఇచ్చి సాగుకు మలుచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అటువంటి సాగుకు అనుకూలంగా లేని భూమిని చదును చేయిస్తున్నామనే కుంటి సాకులతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. గతంలో ప్రభుత్వాలు దళితులు, బీసీల స్వయం సమృద్ధి కోసం ఇచ్చిన పట్టా భూములను కూడా వదిలి పెట్టడం లేదు. ఇందుకు తుని పరిసర ప్రాంతాలలో ఉన్న కొండలను తమ్ముళ్లు ఒకటొకటిగా మాయం చేస్తున్నారు. అడ్డూ, అదుపూ లేదనే ధైర్యంతో.. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రాతినిధ్యం వహిస్తోన్న తుని నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా బరితెగిస్తోంది. తుని రూరల్ మండలం డి.పోలవరం శివారు అశోక్‌నగర్ గండి సమీపాన ఎ.నాయుడికి గతంలో ప్రభుత్వం 1.15 ఎకరాలు కేటాయించింది. ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగించాలనేది డి పట్టాభూములు ఇవ్వడంలో ప్రభుత్వ ఆశయం. అటువంటి డి పట్టా భూమికి మైనింగ్, రెవెన్యూ సహా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే లారీలకు లారీలలో గ్రావెల్‌ను తవ్వేసి ఇప్పటికే రూ.లక్షలు వెనకేసుకున్నారు. డి.పట్టా భూమి నుంచి అనుమతి లేకుండా తట్ట గ్రావెల్‌ను కూడా తరలించే వెసులుబాటు ఎవరికీ లేదు. అటువంటిది గ్రావెల్ తవ్వకాలు జరిపి తుని–నర్సీపట్నం రోడ్డును ఆనుకుని ఉన్న రూ.లక్షల విలువైన 40 సెంట్ల స్థలాన్ని మెరక చేశారు. డి.పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పీఎస్ రావు అధికార అండతో గ్రావెల్ తవ్వేసి రూ.లక్షలు మింగేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల తిరగకుండానే గ్రావెల్, రాయి తవ్వేసి ట్రాక్టర్లపై తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకున్నారు. గడచిన రెండు నెలల్లోనే ఈ డి పోలవరం పరిధిలో రూ.కోటికి పైనే ఎర్ర గ్రావెల్‌ను కొల్లగొట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు. డి పోలవరం నుంచి డైలీ పాతిక, ముప్పై లారీలకు తక్కువగాకుండా రాత్రి, పగలు అనే వ్యత్యాసం లేకుండా అడ్డగోలుగా తవ్వేసుకుపోయారు. తమ వెనుక యనమల ఉన్నారని తమకు అడ్డూ, అదుపూ లేదనే ధైర్యంతో తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు.పోలవరం ఎడమ కాలువ మట్టినీ తరలించారుఇందుకు తీసిపోని రీతిలోనే కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి అతి సమీపాన తుని రూరల్ మండల పరిధిలో తేటగుంట శివారు రాజులకొత్తూరులో ఇదే దందా నడుస్తోంది. రాజులకొత్తూరు సమీపాన జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న జిరాయితీ భూమి చదును చేసుకుంటున్నామంటూ దొడ్డిదారిన గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్, మండల స్థాయి నాయకుడు కుమ్మక్కై రెడ్ గ్రావెల్ తవ్వకాలతో అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఇక్కడి నుంచి నిత్యం 10, 12 టైర్ల లారీల్లో 50 వరకు గ్రావెల్‌ను తరలించేసి రూ.లక్షలు కూడబెడుతున్నారు. అటవీ భూములు అక్రమంగా తవ్వేస్తున్నారన్న ఫిర్యాదుతో రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సర్వే జరిపి జిరాయితీ భూమికి, అటవీ భూమికి సరిహద్దులు ఏర్పాటు చేశారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా గ్రావెల్ తవ్వకాల దందాకు మాత్రం అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోవకొత్తూరు, తేటగుంట సమీపాన పోలవరం ఎడమ ప్రధాన కాలువ గట్ల వెంబడి ఎర్రమట్టిని కూడా అయినకాడికి తెగనమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. కాలువల నుంచి తీసిన మట్టితో పాటు గట్లను కూడా పెకలించి వేసి మట్టిని దోచుకుపోతున్నారు. డైలీ లారీల్లో ఎడమ కాలువ మట్టిని తవ్వి లారీకి రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వంతున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. -
మోదీ మాస్టర్ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే యత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్ సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో అబద్దాలు రాస్తున్నారు. జగన్ తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ హామీగా ఉండబోరట. బహుశా ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
నా భార్య చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేశా..మోసం చేసాడు
-
యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు?
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం పలువురు నేతల ఇళ్ళల్లో కుంపట్లు రగిలిస్తోంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ఇద్దరి మధ్యా టిక్కెట్ పోరు రచ్చకెక్కింది. దశాబ్దాలుగా వెంట నడిచిన తమ్ముడిని ఇప్పుడు అన్న దూరం చేసుకున్నాడు. ఇంతకి తుని సీటు కోరిందెవరు? దక్కించుకున్నది ఎవరు? యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్ నాయకుల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయాక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ దశాబ్దాలుగా తన వెంట నడుస్తూ... నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకుడుతున్న యనమల కృష్ణుడికి సీటు ఇప్పించారు. రెండుసార్లు ఓడిపోయినా... మూడోసారి కూడా తనకు సీటు కావాలని కృష్ణుడు డిమాండ్ చేశారు. తనకు ఇవ్వకపోయినా..తన కొడుక్కి అయినా ఇవ్వాలని ఇటు అన్నను.. అటు టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. తన అన్న కోసమే దశాబ్దాలుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నందున తనకు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని కృష్ణుడు ఒత్తిడి చేశారు. కాని పరిస్థితి రివర్స్ అయ్యింది. చంద్రబాబు తర్వాత పార్టీలో తానే సుపీరియర్‌గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు తన తమ్ముడి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈసారి తన కుమార్తె దివ్యకు కాకినాడు జిల్లా తుని అసెంబ్లీ సీటు ఇప్పించుకున్నారు. దీంతో యనమల ఇంట చిచ్చు రగిలింది. ఇదే సమయంలో దివ్య తన ఎన్నికల ప్రచారంలో బాబాయ్ కృష్ణుడు వర్గాన్ని దూరంగా ఉంచుతున్నారు. తనతో ప్రచారానికి రావొద్దని.. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ..ఆఫీస్ పని చూసుకోవాలని కొద్ది రోజుల క్రిందట కృష్ణుడు ముఖ్య అనుచరుడైన శేషగిరికి యనమల కుమార్తె దివ్య స్పష్టం చేశారు. ఇలా తండ్రి..కూతుళ్ళు కృష్ణుడు.. అతని వర్గాన్ని దూరం పెట్టడంతో తునిలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు తుని నుంచి గెలిచిన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయారు. అదే సమయంలో యనమల టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో..ప్రభుత్వ పదవుల్లో బిజీగా ఉండటంతో తునిలో పార్టీ తరపున అన్ని పనులూ ఆయన తమ్ముడు కృష్ణుడు చూసుకునేవారు. కార్యకర్తలకు..పార్టీకి మధ్య వారధిగా పనిచేశారు. అందుకే యనమల రెండుసార్లు సిఫార్సుచేసి సీటు ఇప్పించినా కృష్ణుడు ఓడిపోయారు. మూడోసారి తనకు కాకపోయినా తన వారసుడికి అయినా ఇవ్వాలని కోరినా..అన్న రామకృష్ణుడు చక్రం తిప్పి తన కుమార్తెకు ఇప్పించుకున్నారు. దీంతో కృష్ణుడు అవమానతో రగిలిపోతున్నారు. కనీసం ప్రచారంలో కూడా తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇక అన్నకు..తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్‌బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ్ముడు దూరమైతే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివ్యకు కచ్చితంగా నష్టమే అంటున్నాయి టీడీపీ వర్గాలు. -
యనమల, ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
సాక్షి, కాకినాడ జిల్లా: యనమల అనే ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో తనపై అసత్య కథనాలు రాయిస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తునిలో గృహ సారధులు, వార్డు కన్వీనర్లతో మంత్రి దాడిశెట్టి శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చిన వార్తనే మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాధాకృష్ణ.. యనమల రామకృష్ణుడికి చెంచానో.. యనమలకు రాధాకృష్ణ చెంచానో అర్థం కావడం లేదన్నారు. ‘‘కోటనందూరులో నాకు, నా కుటుంబసభ్యులకు ఎకరం భూమి ఉన్నా.. అది యనమలకు, రాధాకృష్ణకు రాసిస్తానని’’ మంత్రి సవాల్ విసిరారు. దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో యనమలకు ఆస్తులు ఉన్నాయని మంత్రి దాడిశెట్టి అన్నారు. చదవండి: బాబు కొత్త అవతారం.. ఫ్రీగా వరాలిస్తున్న చంద్రం బాబా.. -
యనమలపై వై.ఎస్.ఆర్ అదిరిపోయే సెటైర్లు
-
కృష్ణుడికి శఠగోపం
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పదవి యనమల రామకృష్ణుడి కుటుంబంలో చిచ్చు రేపింది. యనమల రామకృష్ణుడు తన సోదరుడు యనమల కృష్ణుడిని కాదని తన కుమార్తె దివ్యకు ఇన్చార్జి పదవి ఇప్పించుకున్నారు. రెండుసార్లు అక్కడ పోటీ చేసి..ఇన్నాళ్లూ తునిలో పార్టీని నడిపిన తనకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో కృష్ణుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. చంద్రబాబు, తన అన్న యనమల రామకృష్ణుడు తనను మోసం చేశారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. కార్యకర్తల సమావేశం నిర్వహించి ఇటీవల తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన అన్న రామకృష్ణుడి రాజకీయ ఎదుగుదలకు 40 ఏళ్లుగా సహకరించానని, ఆయన ఉన్నత పదవుల్లో ఉన్నా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అవకాశవాదంతో తనను పక్కనపెట్టి ఆయన కుమార్తెను ఇన్చార్జిగా నియమించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు. బాబుని కలవడానికి ఇష్టపడని కృష్ణుడు..! బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి యనమల బ్రదర్స్‌ని చంద్రబాబు పిలిపించుకున్నారు. అయితే కృష్ణుడు రావడానికి ఇష్టపడకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పంపి ఆయన్ను ఇంటికి రప్పించారు. యనమల రామకృష్ణుడి సమక్షంలో కృష్ణుడిని చంద్రబాబు బుజ్జగించి భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తానని, పార్టీకి సహకరించాలని బతిమలాడారు. అనంతరం యనమల కుటుంబంలో వివాదం సద్దుమణిగినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ కృష్ణుడు ఇంకా అసంతృప్తిలోనే ఉన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీ కార్యక్రమాలను నిర్వహించానని కృష్ణుడు గుర్తుచేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణుడు పోటీ చేశారు. ఈ సారి కూడా తనకే పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆయన ఆశిస్తున్న తరుణంలో బాబు ఆయనకు ఝలక్ ఇచ్చారు. దీంతో బాబు తీరును కృష్ణుడు బాహాటంగానే తప్పుబడుతున్నారు. ఇలా అయితే రానున్న ఎన్నికల్లో మరోసారి పార్టీ చావుదెబ్బ తింటుందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.. ఇదండీ చరిత్ర
వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోని ఇతర నేతలు కూడా అదే బాట పడుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కుటుంబ సభ్యలకే రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. తమ ఎదుగుదలకు కృషి చేసిన రక్త సంబంధీకులనే పాతాళానికి తొక్కిపెడుతున్నారు. టీడీపీలోని కొందరు సీనియర్ల వెన్నుపోటు రాజకీయాలు పచ్చ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికి ఎర్త్ పెడితే ఇంకెవరికి లాభం? తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కుటుంబ సభ్యులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడంలో చంద్రబాబు నాయుడునే ఆదర్శంగా తీసుకుంటున్నారు. చంద్రబాబు ఎలా అయితే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నారో..ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తనకోసం ఎంత కష్టపడినా చివరికి వారిలో ఎవరికీ రాజకీయ భవిష్యత్ లేకుండా ఎలా చేశారో..ఇప్పుడు టీడీపీలోని కొందరు నేతలు కూడా అదే తీరును ప్రవర్తిస్తున్నారు. తమ నేత పేటెంట్ హక్కుగా ఉన్న వెన్నుపోటు రాజకీయాలను తాము ఒంటబట్టించుకుంటున్నారు. తమ రాజకీయ ఎదుగుదలలో అనునిత్యం అండగా ఉన్న సొంత కుటుంబసభ్యులనే రాజకీయంగా అణగదొక్కుతున్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఎంతగానో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌ను చంద్రబాబు ధ్వంసం చేశారు. బావమరిది హరికృష్ణను..ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలో ఎదగనీయకుండా అణగదొక్కారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కడే ఎన్టీఆర్ వారసుడిగా టీడీపీలో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్నారు. అది కూడా వియ్యంకుడు కావడం వల్లనే బాలకృష్ణకు ఆమాత్రమైనా గుర్తింపు దక్కింది. కుమారుడు లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ జిల్లాలో వెన్నుపోట్ల పర్వం ఇటీవల కాలంలో తుని అసెంబ్లీ సీటు విషయమై యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు కృష్ణుడు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం సొంత తమ్ముడుకే యనమల వెన్నుపోటు పొడుస్తున్నారు. మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తన కుటుంబ ఆధిపత్యానికి సోదరుడు సన్యాసి పాత్రుడు అడ్డు తగులుతాడని భావించి ఆయన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు. సోదరుడు టిడిపిలో ఉంటే తన కుమారుల రాజకీయ ఎదుగుదలకు అడ్డు తగులుతారని భావించి చంద్రబాబు తరహాలోనే సొంత సోదరుడిని తొక్కి పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చం నాయుడు కూడా తన సోదరుడు ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యత రోజు రోజుకి పార్టీలోనూ, జిల్లాలోనూ తగ్గిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్న రామ్మోహన్నాయుడికి ఇప్పటినుంచి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిది కూడా అదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు విషయమై కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని మధ్య విభేదాలు తలెత్తాయి. తన సోదరుడు సేవా కార్యక్రమాల పేరుతో ఎదిగితే తనకు తన కుమార్తె రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అధిష్టానంతో నాని గొడవ పెట్టుకున్నారు. ఇదండీ వెన్నుపోట్ల చరిత్ర వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి ఒకే సీటు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సీట్ కోసం కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ పోటీ పడుతున్నారు. కృష్ణమూర్తి తన కుమారుడు శ్యాంబాబు సీటు కోసం సోదరుడు ప్రభాకర్ ను ఇప్పటి నుంచే తొక్కేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమా ఫ్యామిలీకి కూడా ఒకే సీట్ అని టిడిపి అధిష్టానం స్పష్టం చేసింది. నంద్యాల సీటు కోసం భూమా అఖిలప్రియ, ఆమె పెదనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరు ఒకే సీటు కోసం పోటీ పడుతున్నారు.. బ్రహ్మానందరెడ్డిని పక్కకు తప్పించేంకు అఖిలప్రియ ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం లో పనిచేస్తున్న టీడీపీ సీనియర్ నేతలంతా ఆయన బాటలోనే నడుస్తూ తమకు మేలు చేసిన వారిని.. తమను నమ్మి వెంట ఉన్న వారిని చంద్రబాబు తరహాలోని వెన్నుపోటు పొడుస్తున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రాష్ట్రంలో వారిద్దరికంటే మించిన తుగ్లక్‌లు ఎవరూ లేరు: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: టీడీపీ హయాంలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కలిసి ఎన్నో చీకటి జీవోలు తెచ్చి ప్రజల గొంతు నొక్కారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. యనమలకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాలు పోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?. చంద్రబాబు పబ్లిసిటి పిచ్చికి ఈ రోజుకి 40 మంది ప్రాణాలు పోయాయి. ఇరుకు సందుల్లో మీ వాహనాలు పోనిచ్చి ప్రజలు తొక్కిసలాటకు గురి కావడాన్ని ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సీఎం జగన్ పాదయాత్ర ఒక చరిత్ర. ఈ రాష్ట్ర భవిష్యత్‌ను మార్చిన పాదయాత్ర అది. ప్రతి ఆవారా చేస్తే అది పాదయాత్ర అవ్వదు. కొవ్వు కరిగించుకునే యాత్ర అవుతుంది. టిడిపి కార్యక్రమాల పేరు చెప్పి నెలకు రూ.15 లక్షలు పేద ప్రజల సొమ్ము కాజేసిన ఘనత యనమలది. యనమల.. చంద్రబాబు కంటే తుగ్లక్‌లు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఉండరు అంటూ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. చదవండి: (చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్‌పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్) -
యనమలపై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం
-
కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు ఎన్నికలకు ముందే కాక పుట్టిస్తున్నాయి. రోజుకో చిత్రం మారుతూ పార్టీ క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. యనమల రామకృష్ణుడి సోదరుల కనుసన్నల్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలపై ఆ పార్టీ శ్రేణులే విస్తుపోతున్నాయి. టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి నాయకుడిగా క్యాడర్ చెప్పుకునే రామకృష్ణుడి వ్యాఖ్యలు, ఒంటిమామిడి, కోటనందూరు సమావేశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ టికెట్ తమ కుటుంబం నుంచి చేజారిపోకూడదనే అంతర్గత అజెండాయే మాజీ మంత్రి వ్యూహమనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. ఆ లీకుల వెనుక కారణమిదీ.. అందరి అభిప్రాయాలూ సేకరించి, అధిష్టానం ముందుంచుతానని వైఆర్కే చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కృష్ణుడికే టికెట్ ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్ల ఫోన్ సంభాషణలను సామాజిక మాధ్యమాలతో పాటు పలు చానెల్స్‌కు వ్యూహాత్మకంగా లీకులు ఇచ్చి ప్రచారం చేశారని చెబుతున్నారు. అధిష్టానం దృష్టికి ఈ రకంగా తీసుకువెళ్లాలన్నదే దీని వెనుక అసలు వ్యూహమని అంటున్నారు. ఇందుకు కొనసాగింపుగా ఒంటిమామిడి మొదలు కోటనందూరు వరకూ జరిగిన సమావేశాల్లో కృష్ణుడికే సీటు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. ఇది కూడా యనమల రాజకీయ డ్రామా అని తెలుస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఇది వర్కవుట్ కాకుంటే చివర్లో తన కుమార్తెను తెర మీదకు తీసుకు రావాలనే ఆలోచన కూడా రామకృష్ణుడి మదిలో ఉందంటున్నారు. తుని సీటు తమ కుటుంబం చేజారి పోకూడదనే అంతర్గత అజెండా బయట పడకుండా కార్యకర్తల అభిప్రాయ సేకరణ పేరిట జరుపుతున్న అన్నదమ్ముల వ్యూహాత్మక రాజకీయం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే. ప్రత్యామ్నాయంపై ఫోకస్ తుని అంటే యనమల సోదరులు.. వారంటేనే తుని.. అన్నట్టుగా నాలుగు దశాబ్దాల పాటు సాగిన రాజకీయం ముగింపు దశకు చేరుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి కృష్ణుడికి సీటు లేనట్టేనని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. యనమల కుటుంబానికి ప్రత్యామ్నాయంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆయన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు పేరును పరిశీలిస్తున్నట్లు తాజాగా తెర పైకి వచ్చింది. చంద్రబాబుతో అశోక్‌బాబు భేటీకి కారణం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది. అశోక్‌బాబుతో పాటు వెలమ సామాజికవర్గం నుంచి సుర్ల లోవరాజు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుని టికెట్ తమ కుటుంబం చేయి దాటిపోకుండా యనమల సోదరులు ద్విముఖ వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం తుని కార్యకర్తల సమావేశంలో తనకు వయస్సు మీరిపోయినందున బరి నుంచి తప్పుకోక తప్పదని కృష్ణుడికి వైఆర్కే (యనమల రామకృష్ణుడు) పరోక్ష సంకేతాలు ఇచ్చారు. పార్టీ కంచుకోట కోన ప్రాంతంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతితో ఆ గ్రామాలు దాదాపు టీడీపీకి దూరమయ్యాయి. అన్నీ వ్యూహంలో భాగమే.. తుని బరిలో యనమల సోదరుల్లో ఎవరు దిగినా గత ఫలితాలే పునరావృతమవుతాయన్నది విశ్లేషకుల మాట. ఇవన్నీ బేరీజు వేసుకున్నాకే యనమల కుటుంబానికి కాకుండా ప్రత్యామ్నాయ నేతలకు టికెట్ కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు భోగట్టా. దీనిపై గోప్యత ప్రదర్శిస్తూ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి గెలిపించుకోవాలని ఐదు రోజులుగా వరుస సమావేశాలలో క్యాడర్‌కు వైఆర్కే చెబుతూ వస్తున్నారు. బాబు ఎలాగూ దూరం పెడతారనే ముందు చూపుతో తామే తప్పుకుంటామనే ప్రచారాన్ని తొలుత అనుయాయుల ద్వారా తెర మీదకు తీసుకువచ్చారు. ఈ అంశంపై ‘అన్నదమ్ముల అస్త్రసన్యాసం’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేయాలంటూ యనమల బ్రదర్స్ బయటకు చెబుతున్నా తమ కుటుంబం చేతుల నుంచి సీటు దాటి పోకుండా పావులు కదుపుతున్నట్టు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఫోన్ సంభాషణ: యనమలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోదరుడు కృష్ణుడు
-
టీడీపీ నేత యనమల సోదరుల మధ్య విభేదాలు
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల సోదరుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తుని సీటు విషయంలో ఇద్దరి మధ్య పంచాయితీ ముదిరింది. తుని నుంచి తన కూమార్తెను బరిలోకి దింపనున్నట్లు యనమల రామకృష్ణుడు సంకేతాలిచ్చారు. దీనిపై ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఈ విషయంపై తొండంగి పార్టీ నేతతో యనమల సోదరుడు కృష్ణుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. గ్రామానికి 40 మంది చొప్పున వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి అంటూ ఆయన పిలుపునివ్వడం ఫోన్ సంభాషణలో స్పష్టంగా ఉంది. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని గట్టిగా చెప్పండి అంటూ అల్టిమేటం ఇచ్చారు యనమల కృష్ణుడు. దీంతో తుని టీడీపీలో రచ్చ మొదలైంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
టీడీపీ సీనియర్‌కు షాక్.. ఎలాగు గెలవరు మీకెందుకు టికెట్?
ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు. చంద్రబాబు తర్వాత అంతటివాడని చెప్పుకునేవారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు అలంకరించారు. కానీ, రెండుసార్లు ప్రజలు ఆయన్ను ఓడించారు. అయినా గత ప్రభుత్వంలో మండలి ద్వారా మంత్రి పదవి పొందారు. టీడీపీలో ఇప్పుడాయన హవా ఆగిపోయింది. వచ్చే ఎన్నికల్లో సీటే ఇవ్వొద్దని పచ్చ బాస్ నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన కథేంటో చూద్దాం. తునిలో బ్రేక్ ఎందుకు పడింది? తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కరలేని నాయకుడు యనమల రామకృష్ణుడు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యనమల ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా, అనేక సార్లు మంత్రిగా పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత రెండు మార్లు ఎమ్మెల్సీ అయ్యారు. 2009 ఎన్నికల్లో మొదటి సారి ఓటమిని చవిచూసిన యనమల అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడుని తునిలో టీడీపీ తరపున పోటీ చేయించినా ఓటమి తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకుంటున్న కృష్ణుడుకి టీడీపీ అధిష్టానం బ్రేక్ వేసింది. అన్న అసలే వద్దు, తమ్ముడి ఊసే వద్దు ఇటీవల టీడీపీ నిర్వహించిన ఒక సర్వేలో యనమల సోదరులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయట. దీంతో కృష్ణుడుకి సీటు ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసిందని సమాచారం. అంతేకాదు.. తనకు సీటు ఇవ్వకపోతే.. తన కుమారుడికైనా సీటు వస్తుందని కృష్ణుడు పెట్టుకున్న ఆశలపై కూడా చంద్రబాబు, లోకేష్‌లు నీళ్లు చల్లేశారట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి యనమల రామకృష్ణుడు తన పెద్ద కుమార్తె దివ్యను పోటీ చేయించాలని భావించారట. కానీ, అక్కడ ఈక్వేషన్స్ సూట్ కాకపోవడంతో తుని నుండే దివ్యను పోటీ చేయించాలని భావించారట. దివ్యకే తుని టీడీపీ బెర్తు ఖాయమనుకున్న సమయంలో.. అనూహ్యంగా తెర మీదకు వచ్చారు తుని మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్ బాబు. ఎలాగు గెలవరు, మీకెందుకు టికెట్? 2009 ఎన్నికల్లో యనమల మొట్ట మొదటిగా ఓటమి చెందింది ఆశోక్ బాబు పైనే. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ఆర్ ఆశీస్సులతో అపట్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు ఆశోక్ బాబు. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఐతే అలాంటి ఆశోక్ బాబును ఇటీవలే తన దగ్గరకు పిలుచుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. దీంతో ఆ ఫోటో ఇప్పుడు లోకల్ పేపర్లు..సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి ఆశోక్ బాబే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు, తునిలో యనమల సోదరులు పట్టు కోల్పోయారని.. సీటు ఇచ్చేది లేదని యనమల సోదరులకు అధిష్టానం స్పష్టం చేసిందని తునిలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఐతే యనమల మాత్రం సీటు తన పెద్ద కుమార్తె దివ్యకే అన్న ధీమా లో ఉన్నారట. పార్టీయే పాతాళంలో కూరుకుపోతే..టీడీపీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. తుని సీటు పోతే పోయింది..ఈసారి తనకు రాజ్యసభ సీటు వస్తుందని యనమల తెలుగు తమ్ముళ్ళకు చెబుతున్నారట. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com. -
Yanamala Brothers: అన్నదమ్ముల అస్త్రసన్యాసం!
సాక్షి, కాకినాడ: ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. వరుస పరాజయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్య నేతలు సైతం వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలన ముందు మళ్లీ పోటీకి వెనుకంజ వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దయనీయ పరిస్థితులపై టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తు అంతా మనదేనంటూ ఊరూవాడా ప్రచారంతో హంగామా చేస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం యుద్ధానికి ముందే అ్రస్తాలు వదిలేస్తున్నారు. వరుస ఓటములకు తోడుగా భవిష్యత్తు ఫలితాలు కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుండటంతో రాజకీయ కురువృద్ధులు సైతం పునరాలోచనలో పడ్డారు. పోటీ అంటే ససేమిరా అంటున్నారు. నేరుగా ఈ విషయం చెప్పలేక చేస్తోన్న వ్యూహాత్మక వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. పోటీ చేయడానికి ధైర్యం చాలక కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఆ పార్టీలోని అసమ్మతి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు ముచ్చెమటలు టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా చలామణీ అయ్యే ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పక్షాన చక్రం తిప్పారు. తెర వెనుక రాజకీయాల్లో ఈయన్ను ఎదుర్కొనేందుకు చాలాకాలం రెండు గ్రూపులు కూడా నడిచాయి. అటువంటి నాయకుడికే వైఎస్సార్ సీపీ ప్రజా సంక్షేమ పాలనతో ముచ్చెమటలు పడుతున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం ఈ నాయకుడిని వెంటాడుతోంది. తాను పుట్టి పెరిగి, రాజకీయంగా ఇప్పుడున్న స్థాయికి కారణమైన సొంత నియోజకవర్గం తుని నుంచి..తాను, వరుసకు సోదరుడైన కృష్ణుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ శ్రేణులకు ఇటీవల రామకృష్ణుడు పరోక్ష సంకేతాలు పంపించారు. ఇవి నియోజకవర్గంతోపాటు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం తునిలో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా రామకృష్ణుడు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పడం గమనార్హం. 70 సంవత్సరాలు వయసు దాటింది.. కృష్ణుడికి కూడా కాస్త అటు ఇటుగా వయస్సు మీరింది..ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీచేసినా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తల సమావేశంలోనే యనమల ప్రకటించారు. రామకృష్ణుడి వ్యాఖ్యలను పార్టీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు అ న్వయించుకుంటున్నారు. యువకులకు అవకాశం కల్పించాలని తానే చంద్రబాబును కోరినట్టు, అందుకు ఆయన సరేనన్నట్టు కూడా ఈ నేత చెప్పుకొచ్చారు. సీనియారిటీ, వయసు మీరడమనేది రాజకీయాల్లో అసలు ప్రశ్నే కాదనే విషయం రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వారిని అడిగినా ఇట్టే చెబుతారు. టీడీపీలో అపర చాణుక్యుడిగా చెప్పుకునే యనమల అంత పెద్ద మాటలు మాట్లాడారంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ మాటల వెనుక మర్మం ఏమిటంటూ తెలుగు తమ్ముళ్లు ఎవరి స్థాయిలోవారు అంచనాలు వేస్తున్నారు. నాటి అరాచకాలు ఇంకా కట్టెదుటే.. అధికారంలో ఉన్నన్నాళ్లు తునిలో సాగించిన అరాచక పాలనతో యనమల సోదరులు ప్రజల ఛీత్కారానికి గురయ్యారు. రామకృష్ణులను వరుసగా మూడు పర్యాయాలు ఓడించిన తరువాత కూడా అక్కడి ప్రజలు గత జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చాలక రామకృష్ణుడు 2009 తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అయినా ఆశను వదులుకోలేక తన రాజకీయ వారసుడిగా (వరుసకు సోదరుడు) కృష్ణుడ్ని తుని నుంచి బరిలోకి దింపారు. రామకృష్ణుడి తరువాత వరుసగా రెండు పర్యాయాలు 2014, 2019లలో బరిలోకి దిగిన కృష్ణుడిని తుని ప్రజలు ఓడించారు. వరుస ఓటములు, గడచిన మూడున్నరేళ్ల జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన వెరసి తునిలో యనమల సోదరులకు రాజకీయ భవిష్యత్తు లేదనే అంచనాలే రామకృష్ణుడు నోటితో ఆ మాటలు పలికించాయనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ మాటలు సాకులే.. 1983 నుంచి వరుసగా రామకృష్ణుడు తునిలో ఆరు పర్యాయాలు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఓటమి తరువాత తుని నుంచి పోటీ చేసే సత్తా లేక చేతులెత్తేసి ఆయన ఇక్కడి రాజకీయాలకు దూరమయ్యారు. సందర్భోచితంగా బంధువులు, సన్నిహితుల శుభ కార్యాలకు రావడం తప్పితే సొంత నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలకు దాదాపు ముఖం చాటేశారని చెప్పొచ్చు. ఈ నాయకుడు ఇంత హఠాత్తుగా తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఒకవేళ పార్టీపై అభిమానంతో ఏర్పాటు చేశారనుకున్నా, వయసు మీరిందని సాకులు చెబుతూ యువకులకు అవకాశం కల్పించాలంటూ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏమై ఉంటుందా అనే కోణంలో కూడా తమ్ముళ్లు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గుకు రావడం కలే అనే నిర్థారణకు రావడంతోనే వయస్సును సాకుగా చూపిస్తున్నారని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో యనమల పలికిన నాలుగు పలుకులు టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే
సాక్షి, కాకినాడ: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. అధికారంలో ఉన్నన్నాళ్లూ అక్రమాలను ప్రశ్నించిన గొంతుకలను కక్షలు, కార్పణ్యాలతో నొక్కేశారు. ఇలా ఆ పార్టీ నేతల అధికార దాహానికి బలైపోయిన కుటుంబాలు కోకొల్లలు. టీడీపీ ఏలుబడిలో వైకల్యాల జ్ఞాపకాలు, నెత్తుటి మరకలు చాలా కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. నాడు అరాచక పాలన సాగించిన నేతలు అధికారం ఇక కల అని తేలిపోవడంతో నేడు ఉనికి కోసం పాటుపడుతున్నారు. ప్రతి అంశానికీ రాజకీయ రంగు పులుముతున్నారు. తమ దాష్టీకాలు ఎక్కడ బయటపడతాయోనని ఈ రకమైన వ్యూహం అనుసరిస్తున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిన్న గాక మొన్న తుని నడిబొడ్డున ఆ పార్టీ నాయకుడు పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగితే వాస్తవాలతో సంబంధం లేకుండా అధికార పార్టీపై బురదజల్లుడుకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి తుని ప్రజల తిరస్కారానికి గురైన యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు ఈ హత్యపై రాజకీయ దుమారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజా ఇందుకు బాధ్యులంటూ దారుణ విమర్శలకు తెగబడ్డారు. ఇదెక్కడి చోద్యం శేషగిరిరావుపై హత్యాయత్నం కేసుపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాజకీయ కోణంలో కాకుండా వాస్తవ దృక్పథాన్ని ప్రదర్శించింది. ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసింది. వారం తిరక్కుండానే ఈ కేసులో ప్రధాన నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించింది. ఈ సంఘటనకు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. శేషగిరిరావు వేధింపులు, బెదిరింపులే కారణమని నిర్ధారించారు. విశాఖ జిల్లా ఆరిలోవ పెద్దగదిలిలోని తన గురువు అభిరామ్ ఆదేశాలతో శిష్యుడు చంద్రశేఖర్ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డట్టు బహిర్గతమైంది. వాస్తవం ఇలా ఉంటే తెలుగు తమ్ముళ్లు రాజకీయాలు ఆపాదించి ప్రభుత్వం, మంత్రి దాడిశెట్టి రాజాపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. తీరా పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగుచూడటంతో టీడీపీ నేతల ఆరోపణలు ఏపాటివో తేలిపోయింది. 2019లో తునిలో కాతా సత్యనారాయణ హత్యోదంతానికి ఇలానే అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాయే కారణమంటూ ఫిర్యాదు చేసి రాజకీయ లబ్ధిపొందాలనుకున్న టీడీపీ నేతలు భంగపడ్డారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చడంతో ఆ పార్టీ నేతలు చివరకు అభాసుపాలయ్యారు. ఇప్పటికీ మరువలేని ఘాతుకాలు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తునిలో సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రామకృష్ణుడు మంత్రిగా ఉన్న సమయంలో తెలుగు తమ్ముళ్లు సాగించిన దాడులకు లెక్కే లేదు. కొన్ని హత్యోదంతాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆస్తి తగాదాలు, సరిహద్దు వివాదాలు, కోర్టు లిటిగేషన్లు, ప్రేమ వ్యవహారాలు, భూకబ్జాలు.. ఇలా వివాదం ఏదైనా నాటి పాలకులే తీర్పులిచ్చేవారు. మాట వినకుంటే దౌర్జన్యమేనని తుని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి: (Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు) రాజకీయ కక్షతోనే తాతయ్యను చంపేశారు గతం నుంచి రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం మాది. ఏ సమస్య వచ్చినా మా ఇంటి వద్దకు వచ్చేవారు. ఒక భూ వివాదంలో అప్పట్లో తాతయ్య మేడపురెడ్డి చంద్రయ్యనాయుడు గ్రామ పెద్దగా తగవు పరిష్కరించాలని చూసినా రాజకీయాల కారణంగా సాధ్యం కాలేదు. కోర్టులో ఆ భూ సమస్యపై నేరం రుజువైన వర్గంతో కలిసి అప్పట్లో అధికారంలో ఉన్న నేతలు తాతయ్య రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకపోయారు. 1996లో తుని కోర్టు సమీపాన మా తాతయ్యను దారుణంగా హత్య చేశారు. మా నాన్న శివగిరి, అమ్మ వెంకట రమణమ్మ సర్పంచ్‌గా పని చేశారు. అమ్మ వెంకట రమణమ్మ ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యురాలు. టీడీపీలో నాటి నేతల దౌర్జన్యాలు చూస్తూ ఉండలేక మా కుటుంబం ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసింది. – మేడపురెడ్డి భానుచంద్ర, ఎన్ఎన్ పట్నం, రౌతులపూడి నాన్నను చంపేసి, నన్ను అవిటివాడిని చేశారు మా నాన్న అన్నంరెడ్డి తాతయ్యనాయుడు టీడీపీ నాయకుడు. తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పని చేశారు. 1998లో తుని నుంచి కేఓ మల్లవరం బస్సులో వస్తుండగా టీడీపీ నాయకులు కిరాతకంగా కత్తులతో నరికి చంపేశారు. ఈ కేసులో 10 మందికి జీవితఖైదు పడింది. ఆ తరువాత 2004లో కక్ష కట్టి టీడీపీ నేతలు నాపై దాడి చేసి కాలు నరికేశారు. నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష పడినప్పటికీ అప్పీల్‌కు వెళ్లడంతో శిక్ష వాయిదా పడింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో వికలాంగ పింఛను ఇస్తే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో కక్ష కట్టి దాన్ని కూడా రద్దు చేశారు. కోర్టుకు వెళితే జన్మభూమి కమిటీ ముందు హాజరవ్వాలన్నారు. హాజరైతే చీడికమ్మతల్లి డిబ్బీని చోరీ చేసినట్టు తప్పుడు కేసుతో వేధించారు. ఇలా మా కుటుంబ సేవలను ఉపయోగించుకుని కూడా నన్ను అవిటివాడిని చేశారు. – అన్నంరెడ్డి శ్రీనివాసరావు, కేఓ మల్లవరం, తుని మండలం ►16 ఏళ్ల క్రితం తెలుగు తమ్ముళ్లు శృంగవృక్షంలో సొంత సామాజిక వర్గానికి చెందిన దూలం రత్నంపై పెట్రోలు పోసి నిప్పటించారు. రత్నంతో పాటు పక్కనే నిద్రలో ఉన్న బాలిక సజీవ దహనమైన సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ►కాంగ్రెస్ మద్దతుదారుడు గోపాలపట్నం మాజీ సర్పంచ్ అచ్చా గోవిందరావు కుమారుడు వెంకట కృష్ణ హత్యోదంతం వెనుక అక్కడి టీడీపీ నేత హస్తం ఉందన్న విషయం పెనుదుమారమే లేపింది. అధికారంలో ఉండటంతో వారి ఆగడాలకు భయపడి బాధిత కుటుంబం మిన్నకుండిపోయింది. ►గోర్సపాలెంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమ వ్యవహారంలో అంతమయ్యాడు. కాకినాడలో హత్య చేయించి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ వ్యవహారంలో బాధిత వర్గాన్ని టీడీపీ నేతలు బెదిరించారనే అభియోగాలున్నాయి. చివరకు యనమల స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ నేతలే బలవంతంగా రాజీ చేశారు. ►తుని ఆచారి స్టూడియో అధినేత ఆస్తుల వ్యవహారంలో టీడీపీ నేతలు తలదూర్చి అంతమొందించారు. చివరకు కొత్తపల్లిలో ఉన్న భూములను దౌర్జన్యంగా స్వా«దీనం చేసుకుని గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ►పాలమాన్పేటలో మత్స్యకారుల ఇళ్లపై సామూహిక దాడి అప్పట్లో యనమల సోదరుల ప్రేరేపణతోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. తమకు ఎదురు తిరుగుతున్నాడని మత్స్యకార నాయకుడు అప్పలరాజును అక్రమంగా కేసుల్లో ఇరికించారు. టీడీపీ దాడుల్లో ఒక వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందితే ఇతనిపై కేసు బనాయించారు. నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డికి అప్పలరాజు కుమార్తె మోసా అనిత విషయాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. -
అప్పుల్లో ముంచిన అపర మేధావి!
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి లాంటి యనమల రామకృష్ణుడు భాగస్వామ్యంతోనే గత సర్కారు రూ.లక్షల కోట్లు అప్పు చేసిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.80 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ప్రభుత్వ ఆర్థిక కష్టాలన్నింటికి యనమల, చంద్రబాబే కారణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మూడేళ్లలో రూ.1.70 లక్షల కోట్లు వెచ్చించి నేరుగా, పారదర్శకంగా అందించిందన్నారు. రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేసిన గత సర్కారు ఎవరికి ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. యనమల నోటి పన్ను తొలగించుకునేందుకు రూ.2 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి సింగపూర్ వెళ్లారని, లోకేష్ విమానాశ్రయాలలో జీడిపప్పు కోసం రూ.20 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేశారన్నారు. అప్పులపై చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వస్తున్న ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయడం తమ బాధ్యతన్నారు. ఇప్పటం ప్రజలకు రూ.50 లక్షలిచ్చి మాట్లాడాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇప్పటంలో సభ నిర్వహించినప్పుడు గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారని మంత్రి అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ సొమ్ము ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. డబ్బులు ఇచ్చిన తరువాత ఆ గ్రామానికి వెళ్తే బాగుంటుందని సూచించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే పవన్ కళ్యాణే కాదు, ఎవర్నైనా పోలీసులు అడ్డుకుంటారన్నారు. -
కళ తప్పిన ‘యనమల’.. ఆ వ్యవహారమే బెడిసికొట్టిందా?
సాక్షి, కాకినాడ జిల్లా: రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం. ఆరు సార్లు ఎమ్మెల్యే. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దశాబ్దకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పచ్చ పార్టీలో నెంబర్ టూ అని చెప్పుకునేవారు. అయితే ఇప్పడాయనకు పార్టీలో కష్టం వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుటుంబానికి సీటు లేదంటున్నారట చినబాబు. చదవండి: టీడీపీ స్పాన్సర్డ్.. ఫేక్ యాత్ర అసలు ‘లోగుట్టు’ ఇదే.. బాబు కంటే సీనియర్ తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు చంద్రబాబు కంటే సీనియర్. ఎన్టీఆర్ హయాంలోను..ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా.. ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఆయన పార్టీలో నెంబర్ టూగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థికాంశాల్లో యనమల మాటను చంద్రబాబు దాటేవారు కాదని టాక్. అలాంటి నేతకు ఇప్పుడు పార్టీలో గడ్డు పరిస్దితులు ఎదురవుతున్నాయి. యనమల శకం ముగిసినట్లే అన్న ప్రచారం కూడా సాగుతోంది. అసలు విషయానికి వస్తే.. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు తూర్పుగోదావరి జిల్లాలో తుని నుండి యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేశారు. ఇక అక్కడ నుండి వరుసగా ఆరు సార్లు అంటే 2004 వరకు.. తుని నుంచి యనమల విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా ఆయన గెలుపునకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా.. శాసనమండలికి వెళుతూ పార్టీలో చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్సీగానే 2014 నుంచి విభజిత ఆంధ్రకు చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. వెన్నుపోటులో కీలక పాత్ర తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో యనమల ముఖ్య ప్రాత పోషించారు కూడా. ఇక 2009 ఓటమితో పోటీకి దూరంగా ఉన్న యనమల రామకృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో తుని నుండి తన సోదరుడు యనమల కృష్ణుడుని టిడిపి అభ్యర్ధి గా పోటీ చేయించారు. ఐతే ఈ రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్ధి చేతిలో యనమల కృష్ణుడు ఓటమి చెందారు. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే తుని నియోజకర్గంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. వచ్చే సాధారణ ఎన్నికల కోసం యనమల రామకృష్ణుడుతో పాటుగా.. ఆయన సోదరుడు కృష్ణుడు కూడా సిద్దమవుతున్నారు. తుని లేదా ప్రత్తిపాడు నుండి యనమల కృష్ణుడు లేదా ఆయన కుమారుడు పోటీ చేయాలని పధకం రచించారు. అలాగే యనమల తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలని అనుకున్నారు. ఇందుకోసం గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్లాన్ వేసుకుని కాకినాడ రూరల్ తిమ్మాపురంలో యనమల ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టించుకున్నారు. బిల్లుతో దెబ్బపడింది.! ఈ మధ్య కాలంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. మరోవైపు పచ్చపార్టీ అధినేత తనయుడు లోకేష్ కూడా ప్రత్యేకంగా అధ్యయనాలు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా తుని నియోజకవర్గంపై చంద్రబాబు కంటే లోకేష్ ఎక్కువ పట్టుదల ప్రదర్శిస్తున్నారని సమాచారం. తాజాగా తుని నియోజకవర్గం నివేదిక లోకేష్ చేతిలో పండిందని సమాచారం. దాని ఆధారంగా యనమల కుటుంబానికి షాక్ ఇచ్చారట చినబాబు లోకేష్. వచ్చే ఎన్నికల్లో మీ కుటుంబానికి సీట్లు ఇచ్చేది లేదని యనమలతో లోకేష్ తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. తుని నియోజకవర్గంలో యనమల కుటుంబం కాకుండా మరో ప్రత్యామ్నాయంపై టీడీపీ దృష్టి సారించినట్లు తెలుగు తముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్ తుని నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి.. యనమల రామకృష్ణుడితో ఆయనకున్న వైరం గురించి పార్టీలో చర్చ సాగుతోంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఓ కాంట్రాక్టర్ బిల్లులు మంజూరు చేయమని లోకేష్ పంపించిన ప్రతిపాదనను అప్పటి ఆర్థిక మంత్రి యనమల వెనక్కి తిప్పి పంపేశారట. ముందుగా సీఎం చంద్రబాబుతో సంతకం చేయిస్తే.. ఆ తరువాత తాను సంతకం చేస్తానని యనమల మొండి పట్టుపట్టారట. దీంతో చేసేది లేక ఆ బిల్లులపై చంద్రబాబుతో సంతకం చేయించి మళ్ళీ ఆర్థిక మంత్రి యనమలకు పంపించారట. ఈ వ్యవహారంతో ఇద్దరికీ బెడిసికొట్టిందని సమాచారం. చినబాబు వంతు పోలవరం బిల్లు వ్యవహారం దగ్గరినుంచి యనమలపై రివెంజ్ తీర్చుకోవడానికి లోకేష్ ఎదురుచూస్తున్నారని సమాచారం. ఇప్పుడా అవకాశం వచ్చింది. తునిలో యనమల కుటుంబ సభ్యులకు సీటిస్తే... గెలిచే అవకాశం లేదని నివేదిక వచ్చిందట. ఇక దాని ఆధారంగా మీ కుటుంబానికి టిక్కెట్ లేదని చెప్పేశారట లోకేష్. వచ్చే ఎన్నికల్లో యనమల కుటంబానికి ఎక్కడా సీటు లభించకపోతే ఇక టీడీపీ రాజకీయాల్లో ఆయన శకం అంతరించినట్లే అనే టాక్ నడుస్తోంది. -
పొలిటికల్ కారిడార్ : యనమలపై కోపాన్ని తీర్చుకుంటున్న నారా లోకేష్
-
ఎంతో మందిని హింసించిన చరిత్ర మీది
తుని: అధికారంలో ఉన్న సమయంలో ఎంతో మంది నాయకులు, మహిళలను హింసించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తాము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. శుక్రవారం కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో అదృçష్టంగా వచ్చిన పదవిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్న నీచ చరిత్ర యనమలదని చెప్పారు. ఆయన, ఆయన తమ్ముడు ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో డిస్కంలకు రూ.80 వేల కోట్లు బకాయిలు పెట్టిన ఘన చరిత్ర యనమలదని చెప్పారు. తుని నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని యనమలకు సవాల్ విసిరారు. యనమల సొంత గ్రామంలో పాఠశాల, రోడ్లు నిర్మించలేక పోయారని, ఆ అవకాశం తనకు దక్కిందని చెప్పారు. యనమల గ్రాఫ్ పడిపోతోందని, వచ్చే ఎన్నికల్లోనూ తాను 30 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రాజా అన్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీకి చెందిన 2,800 మంది పింఛన్లు తొలగించగా, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించానన్నారు. ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి రాజా చెప్పారు. తుని నియోజకవర్గంలో 109 నీటి రిజర్వాయర్లు కట్టిస్తున్నామని, త్వరలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామని అన్నారు. యనమల ఏరియా ఆసుపత్రిని ఆదాయ వనరుగా మార్చుకుని, రోజుకు లక్ష రూపాయలు దండుకున్నారని ఆయన వివరించారు. -
‘యనమల’ పిల్లి శాపాలు.. ఉనికి చాటుకునేందుకేనా?
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏపీలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని.. అది చూసి ఓర్వ లేక యనమల రామకృష్ణుడు, ఇతర టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. సీఎం జగన్ పాలనపై యనమల రామకృష్ణుడు దుమ్మెత్తి పోయడం చూస్తే.. పిల్లి శాపాలు.. అనే సామెత గుర్తుకు వస్తోందన్నారు. ‘పిల్లి శాపాలకు ఉట్లు తెగవు’ అనేది యనమల మాటలకు అక్షరాలా సరిపోతుందన్నారు. చదవండి: ఆ అగ్రిమెంట్లో తప్పేముంది? కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇపుడేమో.. నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారు. సానుకూల దృక్పథం (పాజిటివ్ అప్రోచ్) అనేది వారి పదకోశం (డిక్షనరీ)లోనే ఉన్నట్లుగా లేవు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పనిలో నిరంతరం మేము నిమగ్నమై ఉంటే మా పై రాళ్లేయడమే ఈ బ్యాచ్ పనిగా కనుపిస్తోంది. ఏఏ దేశాల్లో పరిస్థితులు బాగ లేవో మరీ వెతికి పట్టుకుని అలాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వస్తాయని, ప్రజలు నానా అగచాట్లు పడాలని టీడీపీ నేతలు నిరంతరం కోరుకుంటున్నట్లుగా ఉంది. అందుకే నోటికొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తూనే... మరో వైపు అభివృద్ధి వైపు మేము దృష్టి సారిస్తూ ఉంటే... శాపనార్థాలు పెట్టడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మంత్రి నిప్పులు చెరిగారు. ‘‘యనమల 2020-21 సంవత్సర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రమే పదే పదే మాట్లాడతారు. సామి అది కరోనా సంవత్సరం అని చెప్పిన కూడా పదే పదే 2020-21 గురించే మాట్లాడతారు. కరోనా ఎదుర్కొని ప్రజలను కాపాడుకొని 2021-22 లో మెరుగు చెందితే టీడీపీ నాయకులూ మాత్రం కరోనా సంవత్సరం కష్టాలు ఉండాలని కోరుకుంటున్నారు. 2020–21 సంవత్సరంలో ఎందుకిలా జరిగిందో.. రాష్ట్ర ప్రజలకు తెలియని అంశం కాదు. ఆనాడు కోవిడ్ మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించింది. మన రాష్ట్రంలో కూడా విలయతాండవం చేసింది. రాష్ట్రంలో జనజీవితం అతలాకుతలం అయింది. తత్ఫలితంగా ఆదాయవనరులకు బాగా గండి పడింది. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సుమారు రూ 8 వేల కోట్లు తగ్గింది. కరోనా సమయంలో మహామ్మారి కట్టడికి, కోవిద్ వైద్యానికి, టెస్టింగ్ కి, కోవిద్ కేర్ సెంటర్ లు నిర్వహించడం, ఉచిత బియ్యం సరఫరా అదనంగా రూ 7,130 కోట్లు వ్యయం చేసింది. వీటి తో పాటు నవరత్నాలు అమలు చేయడంలో ఎక్కడ వెనకడుగు వేయలేదని’’ మంత్రి అన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుంచి కదల లేకపోయారు. అంతే కాదు, పేద, మధ్య తరగతి కుటుంబాలు కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయి సురక్షితంగా ఉండటానికి తాపత్రయపడ్డారు. ఇలాంటి తరుణంలో వారందరి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఓ వైపు ఆదాయ వనరులు పడిపోతున్నా.. ఏ మాత్రం జంకకుండా సాహసంతో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ 57,512 కోట్లు జమ చేసి వారిని ఆదుకున్నాం. ఇంత మొత్తంలో ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో జమ చేసిన సందర్భం ఎక్కడా కోవిడ్ సమయంలో లేనే లేదు. టీడీపీ హయాంలో అప్పులు అసాధారణంగా పెరిగాయి ఐదేళ్ళ టీడీపీ హయాం లో (2014-19) చేసిన అప్పులు 19.6% పెరిగితే, వైస్సార్సీపీ హయాం లో (2019-22) మూడు సంవత్సరాలలో, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న అప్పులు తో కలుపుకొని చేసిన అప్పులు ( రెండు సంవత్సరాల కోవిడ్ కష్టాలను ఎదుర్కొని కూడా) 15.5% మాత్రమే పెరిగాయి. ఐదేళ్ళ టీడీపీ హయాం లో (2014-19) ఏ రకమైన ఆర్ధిక ఇబ్బందులు లేకుండా కూడా 19.6% వృద్ధితో అప్పు చేశారు. ఐదేళ్ళ టీడీపీ పాలనలో అమలు చేసిన ఆర్ధిక విధానాలతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వములో ఆర్ధిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి. ఎన్ని ఇబ్బందులున్నా వీటిని సమన్వయం చేస్తూ వైస్సార్సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ సంయోజిత వార్షిక ఎదుగుదల రేటు (CAGR) 9.89 % పెరిగినప్పుడు, మన రాష్ట్ర CAGR 16.80% పెరిగింది.. అదే మన ప్రభుత్వ హయాం లో కేంద్ర ప్రభుత్వ CAGR 14.37% పెరిగిన కూడా మన రాష్ట్ర CAGR 13.28% మాత్రమే పెరిగింది.. CAG నివేదికలో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ. 17,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను ఒక కారణంగా చూపి, ఇపుడు మా పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించింది. యనమలకి రాష్ట్ర అప్పులు 8,00,000 కోట్లు అనే లెక్కలు ఎక్కడ నుండి వచ్చాయో మాకు తెలీదు. అది పచ్చి అబద్ధం.. మీరు, మీ వక్తలు కాదు, వాస్తవాలు, గణాంకాలతో రుజువు చేయగలరా? రాష్ట్ర అప్పు పబ్లిక్ సెక్టార్ యూనిట్ల తీసుకున్న అప్పులు తో కలుపుకొని 1,71,176 కోట్ల . ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీ లో వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోతూ రూ.40,000 కోట్ల వర్కుల బిల్లులను పెండింగ్ పెడితే ఆ బిల్లులు మన ప్రభుత్వంపై పెనుభారం అయ్యాయి. విద్యుత్తు కొనుగోలు, పంపిణీ సంస్థలకు సంబంధించిన అప్పును రూ. 46,200 కోట్లు మేర అదనంగా పెంచేసి విద్యుత్తు రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీశారు. దురదృష్టకరమైన రాష్ట్ర విభజన, అనంతర టీడీపీ ఆర్థిక అస్తవ్యస్త పరిపాలన, కోవిడ్ మహమ్మారి విలయతాండవం వంటి కారణాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. అర్థిక పరిస్థితి ఇలా దెబ్బ తిన్నప్పటికీ మా ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ చేస్తూ గతంలో తలెత్తిన ఇబ్బందికరమైన పరిస్థితులను చక్కదిద్దుతూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో మూల ధన వ్యయం మెరుగుపడింది మూలధన వ్యయం గురించి వాస్తవ అంకెలను సీఎం అసెంబ్లీలో వివరించారు. సగటు 2014-19 లో మూలధన వ్యయం సంవత్సరానికి రూ.15,227 కోట్లు కాగా మా ప్రభుత్వంంలో 2019 నుండి ఇప్పటి వరకు సగటు గా రూ.18,362 కోట్లు. మేము చేసిన మూల ధన వ్యయం ముఖ్యంగా - విద్య, ఆరోగ్యంపై చేయడం జరిగింది. కానీ వారి ప్రభుత్వం కాలంలో దేని పైన వారు దేనిపై వ్యయం చేశారో తెలియదు. ఒక నిర్దేశిత దిశా లేదు. ఒక నిర్దేశిత లక్ష్యం లేదు. ఒక వేళ లక్ష్యం ఉన్న, అది అసాధ్యమైన లక్ష్యం. రోడ్ల నిర్మాణాలు, నాడు- నేడు క్రింద స్కూల్స్ మరియు ఆసుపత్రుల ఆధునీకరణ, గ్రామ సచివాలయాలు నిర్మాణం, హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, మొదలగు అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. అప్పపై వడ్డీ మరియు వడ్డీ రేట్లు వడ్డీ శాతం వారి హయాం లో సగటు గా 8.49% కి వారు అప్పు తెస్తే, మేము అధికారంలోకి వచ్చాక 6.96 % కె అప్పు తెచ్చాము.. అంతే చెల్లించే వడ్డీ శాతం కూడా 1.5 % తగ్గింది. వడ్డీలు కడుతున్నాము.. ఎందుకు కడుతున్నాము?.. మీరు ఎడ పెడా చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాము.. మీ హయాం లో రకరకాల కార్పొరేషన్ లు పెట్టి అప్పుల రూపం లో ప్రజా ధనాన్ని పక్క దోవ పట్టించలేదా? రైతు సాధికార సంస్థ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పవర్ సెక్టర్, డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ అన్నవి పెట్టి అప్పును దారి మళ్లించింది మీరు కాదా అని నేను అడుగుతున్న? వైసీపీ ప్రభుత్వంలో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి మా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నవరత్నాలలో భాగముగా 26 సంక్షేమ పథకాలకు ఎస్సి, ఎస్టి, బీసి, పేద మరియు మధ్యతరగితి ప్రజలకు నేరుగా సుమారు రూ 1,70,000 కోట్ల డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయం. గత ప్రభుత్వ హయాం లో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు, రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉన్న వారిని లబ్దిదారునిగా ఎంచుకున్నారు. లక్ష్యం నిర్ణీతం. అర్హత ఉన్నా కూడా ఫలాలు అందేవి కావు.. కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎవరి సిఫారసులు అక్కర లేదు.. కేవలం అర్హత ఉంటే చాలు. వైసీపీ హయాంలో ఆర్ధిక నిర్వహణ మెరుగు పడుతుంది వేస్ అండ్ మీన్స్ అన్నది రిజర్వు బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిన సదుపాయం. ఆయా ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను బట్టి ఎన్ని సార్లైనా వేస్ అండ్ మీన్స్ కు వెళ్ళవచ్చు. మేము కనక నిబంధనలకు విరుధంగా వెళితే ఎందుకు అనుమతిస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవడం తిరిగి చెల్లించడం జరుగుతువుంది. ఇది అదనపు అప్పు కాదు. 2018 -19 సంవత్సరం లో మీకు ఒకసారికి 1510 కోట్లు ప్రకారం 144 రోజులు OD అనుమతి చేస్తే.. మీరు 19,654 కోట్లు OD తీసుకున్నారు. అంటే 107 రోజులు (74.30%) మీరు OD పొందారు. 2019 -20 సంవత్సరం లో మాకు ఒకసారికి 1510 కోట్లు ప్రకారం 144 రోజులు OD అనుమతి చేస్తే.. మేము 17631 కోట్లు OD తీసుకున్నాము. అంటే 57 రోజులు (39.58%) మేము OD పొందాము. 2020 -21 సంవత్సరం లో మాకు ఒకసారికి 2416 కోట్లు ప్రకారం 200 రోజులు OD అనుమతి చేస్తే.. మేము 31812 కోట్లు OD తీసుకున్నాము. అంటే 103 రోజులు (51.50%) మేము OD పొందాము. మరి మీరు చెప్పే కాకి లెక్కలు (330 రోజులు) ఎక్కడ నుండి వచ్చాయి?’ అని మంత్రి రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. -
పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం.. ఎంత నీచ రాజకీయం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను అడ్డుకునే పనిలో పడిందా? ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి రాసిన ఒక లేఖను చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఇందుకు టీడీపీ బరితెగించిందంటే వారి లక్ష్యం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ లేఖ రాశానని యనమల ప్రకటించినట్లు కూడా సమాచారం వచ్చింది. తన పేరుతో ఇలాంటి లేఖ రాస్తే పార్టీకి బాగా నష్టం వస్తుందని సందేహించి యనమలతో చంద్రబాబు రాయించారని అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే కాకినాడ జిల్లాలో కోన అనే ప్రాంతం వద్ద సుమారు 8500 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్ చేపట్టడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడుతో సహా పదిహేడే రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కేంద్రం అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని హిమచల్ ప్రదేశ్, గుజరాత్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. తొంభై రోజులలో డిపిఆర్ పంపితే సుమారు వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించి ప్రాధమిక సదుపాయాలు కల్పించడానికి సహకరించనుంది. ఇది అంతా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రావడానికి ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది ఒక నిదర్శనం. ఈ బల్క్ డ్రగ్ పార్కు తెలంగాణకు ఇవ్వకపోవడం అన్యాయమని ఆ రాష్ట్ర మీడియా విమర్శిస్తోంది. ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయంలో తెలంగాణ పై వివక్ష చూపిందంటూ కేంద్రంపై మండిపడుతున్నారు. కాని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పార్కును ఏపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నది. ఒకవేళ కేంద్రం కనుక తెలంగాణకు ఈ పార్కును ఇచ్చి ఉంటే ఇదే టీడీపీ, ఇదే టీడీపీ మీడియా ఎంతగా గగ్గోలు పెట్టేవి. పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేసేది. యనమల దీనిని వ్యతిరేకిస్తూ లేఖ రాసినా టీడీపీ మీడియా కిక్కురు మనకుండా ఉండడాన్ని కూడా అర్దం చేసుకోవచ్చు. మరో వైపు గుజరాత్ కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో కనీసం ఇలాంటి పారిశ్రామిక పార్కులు ఇవ్వడం కొంతలో కొంత బెటర్. కాని వైసిపి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. అయినా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బల్క్ డ్రగ్ పార్కును స్వాగతించి ఉంటే ఆ పార్టీ పద్దతిగా ఉన్నట్లు అనిపించేది. యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు ఇవ్వవద్దని ఏకంగా కేంద్ర రసాయనాల శాఖ అదికారులకు లేఖ రాశారు. దానికి కారణం బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతంలో పొల్యూషన్ వస్తుందని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వం హయాంలో తుని ప్రాంతంలో కొన్ని కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం ఆ పరిశ్రమలకు ఎలా మద్దతు ఇచ్చింది? అంటే తమ పార్టీ అదికారంలో ఉంటే పొల్యూషన్ ఉన్నా ఫర్వాలేదని చెబుతున్నారా? వేరే పార్టీ అధికారంలో ఉంటే యాగి చేయాలన్నది వారి లక్ష్యమా? నిజమే..ఎక్కడైనా కాలుష్యం అధికంగా ఉంటే వాటిని అదుపు చేయాలని కోరడం తప్పు కాదు. కాని అసలు పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం. ఎంత నీచ రాజకీయం, పరిశ్రమలు తీసుకురండి. కాని కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పవలసిన నేతలు ఇలా దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారంటే వారు టీడీపీకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా?వద్దనుకుంటున్నారా? నిజంగానే పొల్యూషన్ పై అంత శ్రద్ద ఉంటే, తిరుపతిలో అమర రాజా బాటరీస్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యంపై ప్రభుత్వం నోటీసు ఇస్తే టీడీపీ ఎంత యాగీ చేసింది? వీరికి అంతా చిత్తశుద్ది ఉంటే, టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కృష్ణా కరకట్ట పై ఉన్న అక్రమ భవంతిలో నివసిస్తూ కృష్ణా నది కాలుష్యానికి దోహదపడతారా? ఆ మాటకు వస్తే అసలు మూడు పంటలు పండే పచ్చటి వేల ఎకరాల భూమి సేకరించి రాజదాని నిర్మాణం చేపడతారా? అప్పుడు పర్యావరణ పరిరక్షణ మాట ఏమైపోయింది? ఇప్పటికీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ గొడవ చేస్తోందే? తమ రియల్ ఎస్టేట్ అవసరాలకోసం పర్యావరణం పాడైపోయినా ఫర్వాలేదా? గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పాలి. 1999 ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మంజూరు చేసిన వంట గ్యాస్ కనెక్షన్ లను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ భావించింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రోశయ్య, పర్వతనేని ఉపేంద్రలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే పిర్యాదు చేస్తారా అని జనంలో ప్రచారం చేశారు. అదే కాదు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని గత టరమ్ లో ఎవరైనా కేంద్రానికి పిర్యాదు చేస్తే, ఇదే చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు ఇంకేముంది పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. అమరావతి రాజధాని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నారని ప్తత్యర్ది పార్టీలు ఆరోపిస్తే, తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ద్వజమెత్తేవారు. అదికారం కోల్పోయిన తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ పల్లవి మార్చేసింది. ఎక్కడైనా ఎపిలో ఏదైనా మంచి పని జరిగితే దానిని ఎలా అడ్డుకోవాలన్న ఆలోచన చేస్తోంది. చివరికి పేదల ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా కోర్టుకు తీసుకు వెళ్లి అడ్డుపడేయత్నం చేశారు. ఆంగ్ల మీడియం ప్రవేశ పెడుతుంటే తెలుగు నాశనం అవుతోందని గగ్గోలు పెడుతూ ఎపి విద్యార్దులకు కీడు చేయడానికి కూడా వెనుకాడలేదు.ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్న బల్క్ డ్రగ్ పార్కునే అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే సుమారు ఏబై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పదివేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ ,ఉప పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడం తెలుగుదేశం కు ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఇలా అడ్డగోలుగా వ్యతిరేక ప్రచారానికి బరితెగించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా అందులో చంద్రబాబు ఈ అంశం గురించి మాట్లాడలేదంటేనే తేలు కుట్టిన దొంగ మాదిరి భయపడ్డారని అనుకోవచ్చా?ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గ్రూపు ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి క నబరుస్తుంటే టీడీపీ మీడియా ఎంత దుర్మార్గంగా కధనాలు ఇస్తున్ది చూస్తున్నాం. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, కాలుష్యకారక పరిశ్రమలపై స్పష్టమైన విదానం ప్రకటించారు. కాలుష్యం అనుమతించే ప్రసక్తి లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాటిని ప్రారంభిస్తామని అన్నారు. అదే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ మద్య ఒక కర్మాగారం పొల్యూషన్ ను జీరో స్థాయికి తెచ్చిన తర్వాతే దాని ప్రారంబోత్సవానికి ఆయన హాజరయ్యరు. ఈ విషయాలు యనమల , చంద్రబాబు వంటివారికి తెలియవని కావు.కాని తమను ఓడించిన ఎపి ప్రజల పట్ల కక్షతోనో, ద్వేషంతోనో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు.ఒక వేళ ఎపి ప్రబుత్వం తమకు ఈ పార్కు వద్దని చెబితే ఇదే టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసేది? పెట్టుబడులు రావడం లేదని ఎలా ఆరోపణలు చేసేది. ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలకు పాల్పడుతోంది. ప్రభుత్వంపై విద్వంసం అంటూ ఆరోపణలు గుప్పించే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు విధ్వంసం కిందకు వస్తాయని గమనించాలి.తాజాగా ఎపికి సమారు లక్షా పతికవేల కోట్ల పరిశ్రమలు రావడానికి అడుగులు పడుతున్నాయి. వాటిని అడ్డుకోకుండా టీడీపీ వ్యవహరిస్తే మంచిదని చెప్పాలి. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియాను ఎదుర్కోవడం ఎత్తు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ను అభినందించాలి. చంద్రబాబు,యనమల వంటివారిని ,దుష్టచతుష్టయంలో భాగంగా ఉన్న మీడియాను ఎదుర్కుంటూ దైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్న్నికలలో ఏమవుతుందన్నది పక్కనబెడితే, రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి పరిశ్రమలను అడ్డుకోకుండా టీడీపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం. లేకుంటే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
విజయవాడ : బల్క్ డ్రగ్ పార్క్ పై టీడీపీ విషం
-
AP: ‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు
మరీ ఇంత దిక్కుమాలిన రాజకీయాలా? పొరుగు రాష్ట్రం తెలంగాణ.. బల్‌్కడ్రగ్ పార్కు తమకివ్వకపోవటం అన్యాయమంటోంది. వివక్ష చూపిందంటూ కేంద్రాన్ని నిందిస్తోంది. ఇక స్వరాష్ట్రం గుజరాత్‌పై ప్రత్యేక అభిమానంతో ప్రధాని దీన్ని కేటాయించారంటూ ప్రశంసాపూర్వక నిందలు కొన్ని పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అలాంటి పార్కు ఏపీకి వస్తే.. ఇక్కడి ప్రతిపక్షం మాత్రం ఇక్కడ పెట్టవద్దంటోంది. దీన్ని నిలిపేయాలంటూ లేఖలపై లేఖలు రాసి... రాద్ధాంతానికి రెడీ అంటోంది. రాష్ట్రానికి పారి శ్రామికవేత్తలు రావటం లేదని విమర్శలు చేసేదీ వీరే!! అభివృద్ధి లేదనే ఆరోపణలూ వీరివే. తీరా భారీ ఎత్తున ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్కును సాధిస్తే.. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నదీ వీరే!! ఇదీ ఇక్కడి ప్రతిపక్ష టీడీపీ.. దాంతో అంటకాగుతున్న మీడియా తీరు. సాక్షి, అమరావతి: చేతనైతే ఊరికి ఉపకారం చేయాలి.. అపకారం మాత్రం తలపెట్టకూడదు! మాజీ మంత్రి యనమల మాత్రం పురిటిగడ్డకే ద్రోహం తలపెడుతున్నారు! వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు అడ్డుపుల్లలు వేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్టుకుంటున్న విపక్ష టీడీపీ క్షుద్ర రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఔషధాల దిగుమతి తగ్గించుకొని ఫార్మా రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తీవ్ర పోటీ నెలకొన్న ఈ పార్క్‌ల కోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎంపికయ్యాయి. 16 రాష్ట్రాలతో పోటీ పడి మరీ మన రాష్ట్రం దీన్ని సాధించుకుంటే ఆంధ్రపదేశ్‌కు రాకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ మూడు నెలల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడైంది. రూ.వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక పార్క్‌ను రాష్ట్రానికి రాకుండా నిరోధించేందుకు టీడీపీ పన్నిన కుట్రలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి, ఎన్జీటీకి రాసిన లేఖల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆపాలంటూ యనమల లేఖలు కాకినాడ సమీపంలో ఫార్మా రంగ పరిశ్రమల ఏర్పాటుతో రైతులు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బల్క్ డ్రగ్ పార్కు వల్ల తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, దీన్ని రద్దు చేయాలంటూ తాజాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాసిన లేఖలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇవే అంశాలను గత జూలై 16న లేఖ ద్వారా ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయెల్, చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోనల్ కార్యాలయానికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. చదవండి: ‘కాకినాడ’లో.. బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ స్వాగతం.. ఇక్కడ దుర్బుద్ధి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కును దక్కించుకుంది. దీంతో ఈ పార్కును రద్దు చేయాలంటూ యనమల మరోసారి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాయడం టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటూ ఫార్మా నిపుణులు, పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు. ఒకపక్క ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్కు కేటాయించడాన్ని రాజకీయాలకు అతీతంగా అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ స్వాగతిస్తూ భారీ ప్రకటనలు జారీ చేయగా మన రాష్ట్రంలో మాత్రం ఆ పార్కునే రద్దు చేయాలంటూ టీడీపీ పదేపదే లేఖలు రాయడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తుంటాయని, ఇక్కడ టీడీపీ మాత్రం ప్రతిష్టాత్మక బల్క్ డ్రగ్ పార్కును మన రాష్ట్రం దక్కించుకుంటే అభినందనలు తెలపకపోగా రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయడం దారుణమని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ రూ.వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రలపై మండిపడుతున్నారు. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతించిన కంపెనీలే.. ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, అందుకే బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్నామంటూ యనమల పేర్కొనటంపై సోషల్ మీడియా వేదికగా పలువురు విరుచుకుపడుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏమిటి? అక్కడ వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై కనీస అవగాహన లేకుండా దుగ్ధతో లేఖలు రాయటాన్ని తప్పుబడుతున్నారు. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి ఉన్న కంపెనీలు మాత్రమే బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటవుతాయని, ఒక్క చుక్క వ్యర్థం బయటకు వచ్చినా వాటి అనుమతులే రద్దు అవుతాయని స్పష్టం చేస్తున్నారు. అందువల్లే ఈ విషయంలో ఫార్మా కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని ఫార్మా రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. కట్టుదిట్టంగా ట్రీట్మెంట్ ప్లాంట్స్ బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి వచ్చే ఘన, ద్రవవ్యర్థాలను శుద్ధిచేసేందుకు ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వ్యర్థాలు బయటకువెళ్లే అవకాశం ఉండదని నిపుణులు పే ర్కొంటున్నారు. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలున్న హైదరాబాద్‌లో లేని కాలుష్యం కాకినాడకు ఎక్కడి నుంచి వస్తుందంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క రాష్ట్రానికి పరిశ్ర మలు రావడంలేదంటూ దుష్ప్రచారం చేస్తూ మరోపక్క దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే బల్క్‌డ్రగ్ పార్కును ఎందు కు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పార్కుకు అడ్డుపడటం ద్వారా తుని నియోజకవర్గంలో యువతకు ఉపాధి దొరకకుండా యనమల వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గుజరాత్లో స్వాగతిస్తారు రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ రావడం స్వాగతించాల్సిన విషయం. ఇప్పుడు నూతన టెక్నాలజీ ద్వారా పరిశ్రమల వ్యర్థాలను 99 శాతం రీ సైకిల్ చేస్తున్నారు. వ్యర్థాల నియంత్రణకు జీరో లిక్విడ్ డిజార్డ్ (జెడ్‌ఎల్‌డీ) విధానం అందుబాటులో ఉంది. సముద్రంలో 35 వేల పీపీఎం సాల్ట్ ఉంటుంది. దాన్ని రివర్స్ ఆస్మాసిస్ ద్వారా 3 పీపీఎంకి తగ్గిస్తున్నామంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఉన్న అసలైన పొల్యూషన్ పేదరికం, నిరుద్యోగం లాంటివి పోగొట్టాలంటే పరిశ్రమలను పెంచాల్సిందే. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు వస్తే స్వాగతిస్తారు. – ప్రొఫెసర్ మురళీకృష్ణ, జేఎన్టీయూకే, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాజీ సభ్యుడు ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటయ్యే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. దీంతో ఫార్మా కంపెనీలు సొంతంగా వ్యర్థ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ రేటుకే వ్యర్థాల శుద్ధి అందుబాటులోకి తేవడం కంపెనీలకు కలిసొచ్చే అంశం. – ఈశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఎఫ్‌డీఏ అనుమతులున్నవే దేశంలో ఏర్పాటయ్యే బహుళజాతి ఫార్మా కంపెనీలు యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మన దేశ నిబంధనలతో పోలిస్తే ఇవి చాలా కఠినంగా ఉంటాయి. యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ కంపెనీలు ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి. ఈ విషయం తెలుసుకోకుండా ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం ఏర్పడుతుందంటూ యనమల నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. – లంకా శ్రీధర్, రాష్ట్ర పెట్టుబడుల సలహాదారు యువతకు ఉపాధి తీర ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. – గంగిరి నాగేంద్ర, కొత్త పెరుమాళ్లపురం, తొండంగి మండలం -
సీఎం జగన్ విదేశీ పర్యటనపై యనమల విమర్శలు దారుణం
-
లండన్‌లో సీఎం జగన్ ల్యాండింగ్‌పై మంత్రి బుగ్గన క్లారిటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందన్నారు. కనీస విలువలను పాటించాలన్న స్పృహకోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని, వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకూడా దిగజారిపోతున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు ‘గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని సీఎం జగన్ మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడం యనమల లాంటి వారు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతుంది. దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలను వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్ మార్క్ తప్ప మాది కాదు. సీఎం వైఎస్ జగన్ పర్యటన రహస్యమేమీ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగింది. దీనివల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. చదవండి: దావోస్ చేరుకున్న సీఎం జగన్ లండన్‌లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఈలోగా జురెక్‌లో ల్యాండ్ అవడానికి ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. మళ్లీ ల్యాండింగ్‌కోసం అధికారులు రిక్వెస్ట్‌పెట్టారు. ఈప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారు. ఈ విషయాలన్నీకూడా స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే వైఎస్ జగన్‌కు బస ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామునే జురెక్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది. నిజాలు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రిమీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా ప్రతిరోజూ ఆయన మీద బురదజల్లడం, ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుంది’ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. చదవండి: Anantapur: చంద్రబాబు సభలో ‘పరిటాల’ అనుచరులు రచ్చరచ్చ.. -
లావాదేవీలే లేకుండా అవినీతా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నేత యనమల తదితరులు అవాస్తవాలతో అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసుతో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి రూ.48 వేల కోట్లు వెళ్లాయంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించటాన్ని తీవ్రంగా ఖండించారు. అది వాస్తవిక వ్యయం కాదని, ఆ మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అనే విషయాన్ని గ్రహించాలన్నారు. టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన యనమల అవగాహనతో మాట్లాడుతున్నారా? లేక ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. 2020–21లో సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గినా కరోనా సమయంలో పేదలను ఆదుకోవడంలో వెనుకంజ వేయలేదని బుగ్గన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇవీ.. ► సీఎఫ్ఎంఎస్లో స్పెషల్ బిల్లులంటూ ఏవీ ఉండవు. చంద్రబాబు హయాంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా రూపొందించిన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే ఈ గందరగోళానికి కారణం. బిల్లుల చెల్లింపులకు బీఎల్ఎం మాడ్యూల్ పొందుపర్చారు. ట్రెజరీ కోడ్ ప్రకారమే బిల్లుల చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేశారు. ► సీఎఫ్ఎంఎస్ రిపోర్టింగ్ విధానంలో ‘బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్’ను గుర్తించడం కోసం స్పెషల్ బిల్లులు అనే పేరు పెట్టారు. అంతేకానీ స్పెషల్ బిల్లుల హెడ్ అనేది లేదు. ► సీఎఫ్ఎంఎస్ను క్రమపద్ధతిలో వ్యవస్థీకృతం చేయలేదు. అందుకే బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్లు స్పెషల్ బిల్లుల కింద చూపారు. ట్రెజరీ అధికారులకు సీఎఫ్ఎంఎస్లో బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ చేసే వెసులుబాటు ప్రస్తుతం లేనందువల్ల ఈ అధికారాన్ని సీఎఫ్ఎంఎస్ సీఈవోకు ఆర్థిక శాఖ అధికారులు అప్పగించారు. ఈ ప్రక్రియ మొత్తం ఆర్థిక శాఖ, ట్రెజరీ నిబంధనల మేరకే జరిగింది. ► ఇదే విషయంపై ఆర్థిక శాఖ కార్యదర్శి కాగ్‌కు వివరంగా లేఖ రాశారు. ఆర్థిక సంవత్సరం చివరిలో బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అనేది సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ఏర్పడక ముందు ట్రెజరీ అధికారులే మ్యాన్యువల్‌గా చేసేవారు. ఈ వ్యవస్థ ఏర్పడిన తరువాత సీఎఫ్ఎంఎస్ సీఈవోకు ఈ అధికారం కట్టబెట్టారు. ► ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదు. నగదు లావాదేవీలు లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి పద్దుల నిర్వహణలో భాగంగా ట్రెజరీ కోడ్లను అనుసరించి జరిగేవే. ఇంత చిన్న విషయం యనమలకు తెలియదా? గత ప్రభుత్వంలో ఆయన స్వీయ పర్యవేక్షణలోనే ఇలాంటివి అనేకం జరిగినా ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెబుతున్నారు. ► ఏపీ ఫైనాన్స్ కోడ్ 271 (4) ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరిలో పీడీ అకౌంట్లలో ఖర్చు కాకుండా మిగిలిన నిధులను బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ద్వారా ట్రెజరీ అధికారులు నిధులను మురిగిపోయేటట్లు చేస్తారు. ► ఆర్థిక సంవత్సరం చివరిలో ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ప్రకారం ట్రెజరీ అధికారులు నిధులను మురిగిపోయేలా చేసే అవకాశం లేనందున బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్‌ను సీఎఫ్ఎంఎస్ సీఈవోకు అధీకృతం చేశారు. దీనివల్ల నిధులను కేంద్రీకృతంగా మురిగిపోయేలా చేసే అధికారం సీఈవోకు వచ్చింది. ► ఈ విధానం మేం కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. 2018–19, 2019–20లోనూ ఇదే పద్ధతి అనుసరించారు. 2018 –19లో 98,049 బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్లను స్పెషల్ బిల్లులుగా చూపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020–21లో 54,183 బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్లను మాత్రమే స్పెషల్ బిల్లులుగా చూపింది. ఈ తరహా బిల్లుల్లో నగదు లావాదేవీలు ఉండవు. ► కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లింపులు మాత్రమే నగదు రూపంలో జరిగాయి. రూ.224 కోట్ల జీఎస్టీని నగదు రూపంలో చెల్లించాం. 2018–19లోనూ జీఎస్టీ చెల్లింపులు నగదు రూపంలోనే జరిగాయి.. ► కేంద్రీకృత ప్రక్రియపై అకౌంటెంట్ జనరల్ సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ సీఎఫ్ఎంఎస్ సీఈవోకు బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్‌ను చేసే అధికారాన్ని ఇస్తూ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ► గత ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌ను అసంపూర్తిగా వదిలి వేస్తే ఆ లోపాలను మేం సవరించుకుంటూ వస్తున్నాం. ► 2020–21లో మొత్తం ఖర్చు రూ.2,03,448 కోట్లు (స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యయం కలిపి). ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు కాగా అప్పులు, వడ్డీ చెల్లింపులు రూ.33,753 కోట్లు, నగదు బదిలీ, ఇతర పథకాలకు రూ.65,447 కోట్లు ఖర్చు అయింది. ఇవన్నీ పోనూ మిగిలిన ఖర్చు రూ 37,778 కోట్లు. ఇందులో మూలధనం ఖర్చు రూ.18,145 కోట్లు. మూలధనం ఖర్చులో నాడు–నేడు, మనబడి, ఆసుపత్రి పనులు, రోడ్ల నిర్మాణం వంటివన్నీ వస్తాయి. వివరాలన్నీ ఇంత పారదర్శకంగా, స్పష్టంగా ఉంటే రూ.48 వేల కోట్ల అవినీతికి తావెక్కడుందో టీడీపీ పెద్దలకే తెలియాలి. ► టీడీపీ హయాంలో 2018–19లో మొత్తం వ్యయం రూ.1,64,841 కోట్లు కాగా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు అన్నీ కలిపి రూ.53,811 కోట్లు వ్యయం అయింది. అప్పులు, వడ్డీ చెల్లింపులకు రూ.28,887 కోట్లు ఖర్చు చేశారు. నామమాత్రంగా మినహా నగదు బదిలీ పథకాలేవీ అమలు చేయలేదు. సుమారు రూ.82,143 కోట్లు ఇతరత్రా ఖర్చు చేశారు. నీరు–చెట్టు, ఆర్భాటంగా సదస్సులు, విదేశీ పర్యటనలకే వెచ్చించారు. ► రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 103 రోజులు ఓడీకి, 331 రోజులు వేస్ అండ్ మీన్స్కు ఆర్బీఐ వద్దకు వెళ్లిందని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు కల్పించిన సదుపాయాన్ని వినియోగించుకోవడం సర్వసాధారణం. పూర్తిగా నిబంధనలు పాటించాం. టీడీపీ సర్కారు 2018–19లో చేసిందేమిటి? ► తెలంగాణ కూడా 2020–21లో రూ.69,454 కోట్లు వేస్ అండ్ మీన్స్ను ఉపయోగించుకుంది. ► 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,04,539 కోట్లు వేస్ అండ్ మీన్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించినా ఆ మొత్తాన్ని అప్పుడే తిరిగి చెల్లించింది. టీడీపీ హయాంలో 2018–19లో రూ.59,868 కోట్లు వేస్ అండ్ మీన్స్ ద్వారా తీసుకుని రూ.139 కోట్లు తిరిగి చెల్లించకుండా దిగిపోవడం వాస్తవం కాదా? ఎవరి పాలనలో నగదు నిర్వహణ సరిగ్గా జరిగిందో ఈ ఉదంతం చూస్తే చాలు. ► 2021 – 22 వేస్ అండ్ మీన్స్ వివరాలతో అనుబంధ బడ్జెట్ అంచనాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాం. ఇదే విషయాన్ని అకౌంటెంట్ జనరల్‌కు తెలియ జేశాం. కానీ టీడీపీ సర్కారు 2018–19లో ఉభయ సభల ఆమోదం తీసుకోలేదు. ► 2021–22 బడ్జెట్ అంచనాలు రూ.2,29,779 కోట్లు కాగా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,20,634 కోట్లు (స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యయంతో కలిపి) ఖర్చు చేశాం. 96 శాతం నిధులను వ్యయం చేశాం. కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే పేదల జీవన ప్రమాణాలు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పారదర్శకంగా నగదు సాయం అందచేశాం. -
మండలిలో ప్లేటు ఫిరాయించి టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే మరణాలపై చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు. దీంతో ఖంగుతున్న టీడీపీ నేతలు వెంటనే ప్లేటు ఫిరాయించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చి జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు మాటమార్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రే వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలన్న అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి రాదని అన్నారు. అయితే యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని రూల్ పొజిషన్లో చదివి వినిపించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు శాసనమండలి చైర్మన్‌ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ నడపాలని సూచించారు. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్ టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. -
యనమలకు తలనొప్పిగా తుని టీడీపీ పోరు
-
తప్పుడు లెక్కలు తగవు: బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేట్లపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని హేళన చేసిన టీడీపీ అగ్ర నాయకత్వం ప్రతిపక్షంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి జీవనాధారమైన రంగం వృద్ధి రేటును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధిని అంచనా వేసేందుకు స్థిరమైన ధరలను వినియోగిస్తారని, ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రస్తుత ధరలపై వృద్ధి రేట్లతో వంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంచనాలకు మించి పనితీరు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే యనమల కరోనా సంవత్సరాన్ని కూడా కలిపి లెక్కలు కట్టి ఆర్థిక వృద్ధి లేదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. కోవిడ్ వల్ల 2020–21లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలియదా? గత సర్కారు వైదొలగే నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు క్షీణిస్తూ వచ్చింది. రాష్ట్ర జీఎస్డీపీ 2017–18లో 10.09 శాతం వృద్ధి రేటు ఉంటే 2018–19లో 4.88 శాతానికి పడిపోయింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అతి తక్కువ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019–20లో రాష్ట్రం 7.23 శాతం వృద్ధి నమోదు చేసి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2019–20లో రాష్ట్రం వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం, సేవారంగంలో 6.20 శాతం వృద్ధితో అంచనాలకు మించి పనితీరు కనబరిచింది. నిరుద్యోగంపైనా తప్పుడు లెక్కలే రాష్ట్రంలో 6.5 శాతం నిరుద్యోగ రేటు ఉందని చెప్పడం కూడా అవాస్తవమే. కేంద్ర సర్వే సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్ర నిరుద్యోగ రేటు (15 – 59 ఏళ్ల వయసు) 2018–19లో 5.7 శాతం ఉంటే 2019 –20లో 5.1 శాతానికి తగ్గింది. యనమల తప్పుడు లెక్కలతో రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం దురదృష్టకరం. ఎస్‌డీజీల్లో మరింత మెరుగ్గా 3వ ర్యాంకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ, పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనలో రాష్ట్రం మెరుగుపడలేదంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదు. 2018–19 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఏపీ నాలుగో స్థానంలో ఉంది. 2019 –20, 2020–21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీల్లో ఏపీ మెరుగ్గా 3వ స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్రం పెర్ఫార్మర్ కేటగిరీలో ఉంటే ఇవాళ ఫ్రంట్‌రన్నర్ కేటగిరీకి ఎదిగాం. 67 నుంచి 81కి పెరిగిన మార్కులు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పేదరిక నిర్మూలనలో 5వ స్థానంలో నిలిచి ఎస్డీజీ మార్కులను 67 నుంచి 81కి (మొత్తం 100 మార్కులకు) పెంచుకుని పేదలను కరోనా కష్టకాలంలో కాపాడుకున్నాం. రాష్ట్రంలో ఆర్థిక అసమానత 32 నుంచి 43 శాతానికి పెరిగిందని ఆరోపణలు చేస్తున్న యనమల ఏ లెక్కల ప్రకారం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారో చెప్పాలి. చెప్పే సంఖ్యలు, లెక్కలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుకూల మీడియాలో పత్రికా ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం తగదు. ఎస్డీజీ సూచీల్లో అసమానతల తగ్గింపు ఆశయంలో రాష్ట్రం 2018–19లో 15వ స్థానంలో ఉండగా 2020 – 21లో 6వ స్థానానికి మెరుగుపడింది. జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలి ►45వ కౌన్సిల్ సమావేశంలో కేంద్రానికి ఆర్థిక మంత్రి బుగ్గన వినతి సాక్షి, అమరావతి: జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్ర పన్నుల ఆదాయంలో వృద్ధి రేటు తగ్గిపోవడంతో 2022 తర్వాత కూడా పరిహారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌన్సిల్‌కు తెలియచేశారు. జీఎస్టీ అమలుకు ముందు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయంలో సగటు వృద్ధి రేటు 14 నుంచి 15 శాతం ఉండగా 2017లో జీఎస్టీ అమలు నాటి నుంచి 10 శాతానికి పరిమితమైందని బుగ్గన వివరించారు. దీంతో ఏటా పరిహారాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, కోవిడ్ సంక్షోభంతో గత రెండేళ్లుగా జీఎస్టీ ఆదాయం మరింత క్షీణించిందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏటా 14 శాతం వృద్ధి రేటు కంటే తక్కువగా నమోదైన మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే విధానాన్ని 2022 తర్వాత కూడా కొనసాగించాల్సిందిగా కోరారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ విషయంలో రాష్ట్ర నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాట్ పరిధిలో ఉన్న రెండు ఉత్పత్తులను అదేవిధంగా కొనసాగించాల్సిందిగా కోరారు. ఆగస్టు వరకు పరిహారాన్ని త్వరగా ఇవ్వాలి ప్రస్తుతం నాపరాళ్లపై 18 శాతంగా ఉన్న పన్నును 5 శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తిపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సోలార్ పవర్, లిక్కర్ తయారీలో జాబ్ వర్క్‌లపై పన్ను రేట్లను తగ్గించాల్సిందిగా బుగ్గన కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం గణనీయంగా పడిపోయిందని, సంక్షేమ పథకాలు సజావుగా అమలు కోసం ఆగస్టు వరకు జీఎస్టీ పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ రవిశంకర్ నారాయణ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘ఓటాన్’పై యనమల విమర్శలు అర్థరహితం: బుగ్గన
బనగానపల్లె: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శలు అర్థరహితమని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో శుక్రవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలో ‘ఓటాన్ అకౌంట్’ ఒక ప్రొవిజన్ అని, బడ్జెట్‌ను అమలు చేయలేని సమయంలో ఉద్యోగుల జీతభత్యాలు, అత్యవసరాలకోసం ఓటాన్ అకౌంట్‌ను అమలు చేసే విషయం మాజీ మంత్రి యనమలకు తెలిసిందేనన్నారు. రాజకీయ దురుద్దేశంతో యనమల విమర్శలు చేయడం సబబు కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే విషయంలో ఎస్ఈసీ నుంచి స్పష్టత రాకపోవడం, కరోనా సమస్యతో బడ్జెట్ సమావేశాలు జరిపే అవకాశాల్లేకపోవడంతో ఓటాన్ అకౌంట్‌ను అమలు చేయాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. -
యనమల పాత్రపై అనుమానాలు
తుని రూరల్: తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి సొసైటీలో 61 మంది తొండంగి రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి రూ.11 కోట్లను రుణాలుగా మంజూరు చేయడం వెనుక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం ఎస్.అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో చనిపోయిన 9 మంది సహా 61 మంది రైతుల పేర్లతో నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, పోర్జరీ సంతకాలతో 2016–17లో ఈ సొసైటీలో రూ.11 కోట్లు కాజేశారన్నారు. ఈ కుంభకోణం వెనుక అప్పటి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై మాజీ మంత్రి యనమల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఓ గ్రామంలోనే ఇంతపెద్ద మొత్తంలో అక్రమాలు జరిగితే ఇతర గ్రామాల్లో ఎంతమేరకు అక్రమ రుణాలు పొందారో నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్టు చెప్పారు. -
'టీడీపీ క్యాడర్ నిమ్మగడ్డనే ఎక్కువ నమ్ముతోంది'
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎన్నారై పార్టీగా తయారయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్ ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. పక్క రాష్ట్రాలతో కేసులు వేయించారు. పోలవరం భూసేకరణ పూర్తి కాకుండా అడ్డుపడ్డారు. పోలవరం దగ్గర 150 అడుగుల వైఎస్సార్ విగ్రహం పెడతామంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయి..?. 2021 డిసెంబర్‌కు పోలవరం పూర్తి చేస్తాము. టీడీపీ తొత్తుగా నిమ్మగడ్డ నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారు. టీడీపీ అధికార ప్రతినిదిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నిలు చంద్రబాబు పెట్టమంటే పెడుతున్నారు. వద్దంటే మానేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారు. టీడీపీ నేతలతో స్టార్ హోటల్లో కూర్చొని మంతనాలు జరిపిన వ్యక్తి నిమ్మగడ్డ. కరోనా లేని సమయంలో వాయిదా వేశారు. కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోలేదు. టీడీపీ క్యాడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డను ఎక్కుగా నమ్ముతున్నారు. నిమ్మగడ్డ పదవీ విరమణ తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు అనే అనుమానం మాకు ఉంది. చంద్రబాబును దింపి టీడీపీ నేతలు నిమ్మగడ్డకు పగ్గాలు అప్పగిస్తారనే అనుమానం కలుగుతుంది. పేదలకు ఇళ్లు ఇస్తామంటే దేశ చరిత్రలో అడ్డుకున్న పార్టీ టీడీపీ మాత్రమే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారు. ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్') విశాఖ ఎయిర్ పోర్ట్‌పై చర్చకు సిద్ధం విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కాదు నేవి ఎయిర్ పోర్ట్. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో నావీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ మూసేశారు. నాకు ఎలాంటి భూ లావాదేవీలాతో సంబంధం లేదు. నా పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే నాకు లేదా పోలీసులు దృష్టికి తీసుకురండి. రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వారు సమతుల్యం పాటించాలి. రాధాకృష్ణ ఛానెల్, పేపర్ నడపడానికి అనర్హుడు. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై నాతో చర్చకు వస్తే అన్ని విషయాలు చర్చిస్తాను. జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ రామోజీరావు. జర్నలిజం ముసుగు వేసుకొని ఒక పార్టీకి రాధాకృష్ణ కొమ్ము కాస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఖలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేవేయలని ఉంది. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై రామోజీరావు, రాధాకృష్ణ తో చర్చించాలా. రెండు ఎయిర్ పోర్ట్‌ల మధ్య ఎంత దూరం ఉండాలో తెలియదా.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: అవంతి పరిశ్రమల ప్రోత్సాహం అభివృద్ధి సమస్యలపై రేపు జిల్లా సమావేశం జరుగుతుంది. అభివృద్ధికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా పరిశ్రమల అభివృద్ధికి మేము సిద్ధంగా ఉన్నాము. విశాఖ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. శుక్రవారం జరిగే సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ రీ స్టార్ట్ పేరుతో ఈ కార్యక్రమం రూపొందించారు అని మంత్రి అవంతి పేర్కొన్నారు. (తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్) నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది..?: కన్నబాబు చంద్రబాబుకు యనమల కో పైలెట్ లాంటివారని జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు అన్నారు. 'యనమల స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్లా కాకుండా రమేష్ కమిషన్లా నిమ్మగడ్డ పనిచేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. చంద్రబాబు ఏం చెపితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారు. ఎన్నికలు అంటే వైఎస్సార్సీపీకి భయం లేదు. ఎన్నికలకు మేము భయపడలేదు, ప్రజల ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఏముంది. చంద్రబాబు హయాంలో జరగాల్సిన ఎన్నికలను ఎందుకు నిమ్మగడ్డ నిర్వహించలేదు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ('బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే') -
సుజనా, మురళీ మోహన్ ఆశీస్సులు తీసుకోలేదా?
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. (చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు: మల్లాది) మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు. స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు. -
యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా?
సాక్షి, విజయవాడ: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి చీప్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మారెడ్డి విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అసెంబ్లీలో రెండు సార్లు ఆమోదం పొందితే నిబంధనలు ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారన్నది సత్యం. ఈ దశలో కూడా గవర్నర్‌ను ప్రతిపక్షనేత యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. బిల్లులను రాష్ట్రపతికి పంపించమని లేఖ రాయడం వెనుక అంతర్యం ఏమిటి? యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా' అంటూ ప్రశ్నించారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) 'నారాయణ కమిటీ నివేదికతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందంటూ యనమల తన లేఖలో రాశారు. ఇది శివరామకృష్ణన్ కమిటీని కూడా అవమానపరచడమే అవుతుంది. ఏది ఏమైనా ఈ రోజు గవర్నర్ వికేంద్రీకరణ, సీఆర్డీడీయే రద్దు బిల్లులు రెండింటినీ ఆమోదించారు. ఇప్పటికైనా విపక్ష తెలుగుదేశం నేతలు చెంపలు వేసుకుని గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకాలి. రాజ్యాంగబద్ద నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి' అన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. -
గురివిందలా మాటలు.. నక్కజిత్తుల ఆటలు
ఓ కొంగ ఓ చెరువు పక్కన ఒంటి కాలిపై జపం చేస్తున్నట్టు నటిస్తోంది. అది చూసిన చెరువులో చేపలు ఎంతో సంతోషించాయి. తమ శత్రువు ఆధ్యాత్మికంగా మారిపోయాడని ... ఇక తమ బతుకులకు ఢోకా ఉండదని భ్రమపడి పైకి వచ్చి స్వేచ్ఛగా విహరించసాగాయి. అంతే తన దగ్గరకు వచ్చిన ఒక్కో చేపను గుటుక్కున మింగి మళ్లీ జపం చేస్తున్నట్టు నటించేది. కొద్ది రోజులకు కుట్రను గమనించిన ఆ చేపలు దేవుడి దగ్గరకు వెళ్లి ‘మమ్మల్నే కాదు... జపం పేరుతో మిమ్మల్ని కూడా మోసం చేసిందని...మమ్మల్ని రక్షించండని ప్రభూ’ అని వేడుకున్నాయి. ఇప్పటికి కళ్లు తెరిచారు కదా...ఇక నుంచి మీకు రక్షే వెళ్లండ’ని దీవించి పంపించాడు దేవుడు. ఆ కథలోలా అప్పటి సీఎం చంద్రబాబు కొంగ జపం చేసి రాష్ట్ర దళితులను వేధించుకు తినడమే కాకుండా తీవ్ర అవమానాలకు గురిచేశాడు. అయితే ఆ అమాయక చేపల్లా ఇక్కడి దళితులు ఎవరినీ వేడుకోలేదు..ఆ కుట్రలను, మోసాలను గమనించారు. పిడికిలి బిగించి వాస్తవాలను గ్రహించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని దాదాపుగా సమాధి చేశారు. అయినా బుద్ధి తెచ్చుకోని ఆ నేతలు ఇంకా కుటిల రాజకీయాలకు తెరదీస్తూనే ఉన్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: గురివింద గింజ మాదిరిగా మాటలాడుతూ నక్క జిత్తుల రాజకీయాలకు తెరదీస్తున్న టీడీపీ నేతలపై దళిత వర్గ ప్రజలే మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న దళిత ఘటనల్లో స్పందనకు ... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తక్షణ చర్యలకు నక్కకు...నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆ వర్గ నేతలే ఉదాహరణలతో చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్‌లో నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా న్యాయం అందని ద్రాక్షే. బాధితులు న్యాయం కోసం వెళితే అది దక్కకపోగా ఎదురు కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టేవారు. అటువంటి పరిస్థితులన్నీ ఈ ఏడాది కాలంలో పూర్తిగా మారిపోయాయి. తప్పు చేసే వారు ఎంతటి వారైనా చివరకు సొంత పార్టీ వారైనా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వదిలి పెట్టడం లేదు. ఇలా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు, వారి తాబేదారులకు కంటగింపుగా మారింది. మునికూడలి ఘటనలో తక్షణ చర్యలు సీతానగరం మండలం మునికూడలిలో ఇసుక లారీ ఢీకొని ఒక వ్యక్తికి కాలు విరిగిందని (కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు విజయ్ తనను లారీ ఢీకొట్ట లేదని బైక్ బోల్తా పడి పడిపోయానని, తన పేరు, కులాన్ని అనవసరంగా నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు.) దళిత యువకులు లారీ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అటుగా కారులో వెళుతున్న మునికూడలి వైఎస్సార్సీపీ నేత కవల కృష్ణమూర్తి ఆ వివాదాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించగా వారు అతని కారు అద్దాలు పగలగొట్టారు. (ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం) వారించిన అడపా పుష్కరాన్ని కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో ఐదుగురు దళిత యువకులపై వారిచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 20న ఒక నిందితుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి సిబ్బందితో కలిసి చిత్రహింసలకు గురిచేసి జుత్తు కత్తిరించిన ఘటనపై స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్రంగా పరిగణించి జారీ చేసిన ఆదేశాలతో ఇన్చార్జ్ ఎస్సై ఫిరోజ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వరప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. బాధ్యత కలిగిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పినిపే విశ్వరూప్, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆస్పత్రిలో ఉన్న బాధితుడు వరప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇవిగో సాక్ష్యాలు.. ►ఏవీ చర్యలు ? చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు ? ►తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డారు. ►2016లో తుని కాపు గర్జన అనంతరం ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్ కేసులతో వేధింపులకు పాల్పడింది. ►ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు విషయంలో ఆందోళనకు దిగిన పాపానికి దళితులపై అక్కడి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. (ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాబూ) బాబు హయాంలో ఎదురు దాడులే కదా... చంద్రబాబు ఏలుబడిలో రెండున్నరేళ్ల క్రితం అమలాపురం ఎర్రవంతెన వద్ద పెంపుడు కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో పంట కాల్వలో పడి పదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ కుక్క యజమాని అప్పటి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయానా సోదరుడు జగ్గయ్యనాయుడే. హోం మంత్రి సోదరుడు కావడంతో దళిత సంఘాల ఒత్తిడి నేపథ్యంలో చాలా రోజుల తరువాత కేసు నమోదు చేసినా ఆ దళిత బాలుడు పెంపుడు కుక్క తరమడం వల్లే కాల్వలో పడి చనిపోయాడని ఎఫ్ఐఆర్లో ఎక్కడా పేర్కొనలేదు. తన ఇంటికి కూత వేటు దూరంలో నివాసం ఉండే రాజప్ప కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా మనసు రాలేదు. తుని నియోజకవర్గంలో అప్పటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సోదరుడు కృష్ణుడు అవినీతికి అడ్డుపడ్డ వారిని పలు కేసుల్లో ఇరికించి వేధింపులకు పాల్పడ్డ ఘటనలు కోకొల్లలు. తాండవ నదిలో యనమల సోదరుల అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురిపై అక్రమ కేసులు బనాయించారు. 2016లో తుని కాపు గర్జన అనంతర ఘటనల్లో సంబంధం లేని ఎస్సీ, బీసీలపై టీడీపీ సర్కార్ కేసులతో వేధింపులకు పాల్పడింది. ఆ బాధితుల జాబితాలో ప్రస్తుత ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, కోటనందూరు మండలం భీమవరపుకోట మాజీ సర్పంచి జిగటాల వీరబాబు, బీసీ వర్గానికి చెందిన లగుడు శ్రీను, కొయ్యా శ్రీను, రేలంగి రమణాగౌడ్ ఉండటం గమనార్హం. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు సంత మార్కెట్లో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు విషయంలో ఆందోళనకు దిగినందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఎదురు కేసులతో వేధింపులకు దిగారు. ఈ వివాదంలో ఆ నియోకవర్గం మొత్తం మీద 400 మంది దళితులపై కేసులు బనాయించారు. రాజకీయ రంగు... సీఎం స్థాయి నుంచి ఎస్పీ వరకూ అడుగడుగునా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చర్యలు తీసుకున్నారు. ఇంత చేస్తే కేవలం ప్రచారం, రాజకీయ ఉనికి కోసం టీడీపీ తెర వెనుక ఉండి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారానికి దిగుతోంది. దళితులు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా ఉన్నారనే దుగ్ధతో వారిని పార్టీకి దూరం చేయాలనే కుట్రలో భాగంగా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మునికూడలి ఘటనలో బాధితుడు వరప్రసాద్ టీడీపీ క్రియాశీలక కార్యకర్త. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవల కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నాయకుడు. ప్రభుత్వం పార్టీ పక్షాన నిలిచి ఉంటే కృష్ణమూర్తిపై కేసు నమోదయ్యేదా, ఎస్ఐ ఇతర పోలీసుల సస్పెన్షన్, ఎస్సీ,ఎస్టీ అత్యాచార కేసు నమోదు చేసే వారా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిష్పాక్షికత కనిపిస్తున్నా మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి నాయకులు ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నాలు చేయడాన్ని దళిత మేధావులే గర్హిస్తున్నారు. -
గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని, ఆర్టికల్ 243కె (2)కి సార్థకత ఏర్పడిందన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కరోనా సమయంలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీని తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని విమర్శించారు. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహమన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు స్వస్తి చెప్పాలని, ఎస్ఈసీ తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమ్మగడ్డకు సౌకర్యాలు కల్పించాలి: యనమల గవర్నర్ ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల ప్రధానాధికారి కుర్చీలో కూర్చునేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు చుట్టూ డర్టీ డజన్ నాయకులు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజలు కరోనాలో బాధపడుతుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ టెక్నాలజీస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు చుట్టూ యనమల రామకృష్ణుడు, సబ్బం హరి లాంటి డర్టీ డజన్ నాయకులు ఉన్నారని, వారితో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. యనమల కలియుగ శకుని అని తూర్పు జనం అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ రాజకీయ బిక్షతో స్పీకర్ పదవి పొందిన యనమల చంద్రబాబు మాటలతో వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. బాబును చూస్తే భారతంలో దుర్యోధనుడు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పటి కాంగ్రెస్‌కి పట్టిన గతే పడుతుందన్నారు. విశాఖపై విషం కక్కుతున్న టీడీపీని నిలదీయాల్సిన అవసరం ఉత్తరాంధ్ర జర్నలిస్టులపై ఉందని ప్రసాద్రెడడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని యూ టర్న్‌లు తీసుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. ఆకు రౌడీ సబ్బం, కలియుగ శకుని యనమల పతనం చివర దశలో ఉందన్నారు. మున్సిపల్ స్థలంలో సబ్బం హరి నివాసం ఉంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడే చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో విశాఖ నగరం మరో ముంబై, చెన్నై నగరాల సరసన చేరనుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన విశాఖ నుంచి మొదలుపెడితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఇంకా ఎందుకు నవ్వులపాలవుతారు?
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాయడం శోచనీయమని.. దీనినిబట్టి ఆయనకు కనీస పరిజ్ఞానం లేదనేది స్పష్టమవుతోందని.. ఇంకా ప్రజల దృష్టిలో ఎందుకు నవ్వులపాలవుతారని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్‌కు యనమల రాసిన లేఖపై ఉమ్మారెడ్డి ఆదివారం తీవ్రంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ఏం పేర్కొన్నారంటే.. ► శాసనసభల నిర్వహణ అనేది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటుందనే కనీస పరిజ్ఞానం యనమలకు లేకపోవడం శోచనీయం. ► రాష్ట్ర శాసనసభ తొలిసారి ఆమోదించిన ఈ రెండు బిల్లులను జనవరి 22న శాసన మండలికి వచ్చినపుడు అక్కడ గ్యాలరీలో కూర్చుని టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడుగా వ్యవహరించారు. ► సైగలు చేసి ఈ బిల్లులను ఆమోదించకుండా సభను నిరవధికంగా వాయిదా వేయించారు. ► శాసనసభ తొలిసారి ఆమోదించిన బిల్లులపై కౌన్సిల్ మూడు నెలలపాటు నిర్ణయం తీసుకోనందున మళ్లీ వాటిని అసెంబ్లీ ఆమోదించి జూన్ 17న మండలికి పంపిస్తే అక్కడ మళ్లీ యనమల వాటికి మోకాలడ్డారు. ► చివరకు ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించకుండా సభను వాయిదా వేయించి ప్రభుత్వోద్యోగులకు జూలై 1న జీతాలు రాకుండా చేశారు. దీనిని బట్టి యనమలకు రాజ్యాంగం అంటే ఏపాటి గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుంది. ► పైగా ఆ రోజు మండలిలో టీడీపీ సృష్టించిన వీరంగం అందరికీ తెలుసు. ఈ పరిస్థితికి యనమల సిగ్గుపడటం లేదా? ► 192 (2) (బి) ప్రకారం తొలుత అసెంబ్లీ పంపిన బిల్లును మూడు నెలల తరువాత కూడా కౌన్సిల్ ఆమోదించకపోతే.. దానిని ఆమోదించనట్లే. ► ఆ తదుపరి రాజ్యాంగం ప్రకారం మళ్లీ రెండోసారి బిల్లును అసెంబ్లీ ఆమోదించి పంపినప్పుడు మండలి ఆమోదించకపోయినట్లయితే ద్రవ్య బిల్లు అయితే 15 రోజులు, సాధారణ బిల్లు అయితే 30 రోజుల తరువాత ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. ► రాష్ట్ర మంత్రివర్గం ఈ రెండు బిల్లులను ఆమోదించి ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపుతారు. ► ఈ మాత్రం కనీస పరిజ్ఞానం యనమలకు లేదా? గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని సూచించడం అంటే యనమల సంకుచితత్వానికి నిదర్శనం. ► ప్రజలు దీనిని చూసి నవ్వుకుంటున్నారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు అపహాస్యం, అవమానం చేయడమే కాక దానిని పూర్తిగా పక్కనపెట్టారు. ► కేంద్రం నియమించిన కమిటీని పరిగణనలోకి తీసుకోని వారు ఇప్పుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను కేంద్రానికి పంపాలని సలహా ఇస్తారా? మీరేమైనా గవర్నర్‌కు సలహాదారు అనుకుంటున్నారా? ► గవర్నర్ ఆమోదానికి పంపిన బిల్లును ఆమోదించవద్దని చెప్పి ఇంకా ప్రజల దృష్టిలో ఎందుకు నవ్వులపాలవుతారు? ► గవర్నర్ ఆమోదం పొంది చట్టాలు రూపొందాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
ఆ రెండు బిల్లుల్ని ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికగా పరిశీలించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం లేఖ రాశారు. ఈ బిల్లులను ఆమోదించవద్దని, అవసరమైతే భారత అటార్నీ జనరల్ అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. గవర్నర్ పరిశీలించిన తర్వాత ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపాలని లేఖలో కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు బిల్లులు 2014లో పార్లమెంటు ఆమోదించిన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ఒకే రాజధాని నగరం అని అర్థం ఉందన్నారు. ఈ బిల్లులను శాసన మండలి తిరస్కరించలేదని, సెలెక్ట్ కమిటీకి పంపిందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సెలెక్ట్ కమిటీ వద్ద ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో వివరించారు. -
ఉద్దేశ పూర్వకంగానే ప్రజలకు తప్పుడు సమాచారం
టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి అంటూ అవాస్తవాలు ప్రచారం చేశారు. లేని అభివృద్ధిని కాగితాల్లో చూపారు. ఇప్పుడు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వృద్ధి రేటు తగ్గిపోయిందంటున్నారు. ఇది నిజంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా? టీడీపీ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాలతో పోల్చితే వరుసగా తగ్గిపోయింది. ఆస్తులు తగ్గిపోయి అప్పులు పెరిగాయి. సాక్షి, అమరావతి: ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దీని వల్ల ఆయన ప్రజల్లో మరింత చులకనవుతారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గత 13 నెలల కాలంలో సీఎం జగన్ నవరత్నాల ద్వారా 3.99 కోట్ల మంది లబ్ధిదారులకు నేరుగా రూ.43,603 కోట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఆర్థిక ప్రగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం, అప్పులు, రాష్ట్ర ఆదాయం, బడ్జెట్ వ్యయం, రెవెన్యూ, ద్రవ్య లోటు అంశాల్లో యనమల చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకేనని కొట్టి పారేశారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో అన్నీ కోతలే సంక్షేమం విషయంలో టీడీపీ హయాంలో అన్నీ కోతలే. సీఎం జగన్ హయాంలో ఇవ్వడమే తప్ప కోతలు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు నవరత్నాల ద్వారా రూ.30,883 కోట్లు ఇచ్చాం. టీడీపీ 2018–19లో ఆ వర్గాలకు ఇచ్చింది కేవలం రూ.5,689 కోట్లే. – కాపులకు చంద్రబాబు ఐదేళ్ల హయాంలో రూ.3,150 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది మాత్రం రూ.2000 కోట్లే. మా ప్రభుత్వం గత 13 నెలల్లో కాపులకు రూ.2,800 కోట్లు వ్యయం చేసింది. స్థూల ఉత్పత్తి – వాస్తవాలు – 2017–18లో జీఎస్డీపీ రూ.8,03,000 కోట్లుగా పేర్కొనగా, సవరించిన అంచనాల్లో రూ.11,000 కోట్లు తగ్గిపోయింది. 2018–19లో జీఎస్డీపీ రూ.9,33,000 కోట్లుగా పేర్కొనగా, సవరించిన అంచనాల్లో రూ.70,448 కోట్లకు తగ్గిపోయింది. – 2018–19లో తలసరి ఆదాయం రూ.1,51,000 ఉండగా, 2019–20లో అది రూ.1,61,000కు పెరిగింది. ద్రవ్యోల్బణం దేశ సగటు 4.77 శాతం ఉండగా ఏపీలో కేవలం 3.54 శాతమే ఉంది. దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీలో ద్రవ్యోల్బణం పెరుగుదల తక్కువగా ఉంది. – రెవెన్యూ రాబడులు 2018–19లో రూ.1,14,670 కోట్లు ఉండగా, 2019–20లో దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ 1,10,800 కోట్లు ఉంది. కేవలం రూ.3,799 కోట్లే తగ్గింది. – 2018–19లో రెవెన్యూ వ్యయం రూ.1,28,560 కోట్లు ఉండగా, 2019–20లో రూ.1,37,518 కోట్లు అయింది. రూ.8,948 కోట్లు పెరిగింది. బకాయిల వల్లే రెవెన్యూ, ద్రవ్య లోటు – కేపిటల్ వ్యయం తగ్గడానికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు అడుగుకు ఏకంగా రూ.10 వేలతో నిర్మించారు. రాజధాని పేరుతో రహదారులు కిలో మీటర్‌కు రూ.40 కోట్లతో అంచనాలు వేశారు. వాటిని నిలుపుదల చేసి రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వ ధనం ఆదా చేయడానికి సమయం పట్టింది. గత టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం పని చేసింది. – రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరగడానికి గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లుల బకాయిలతో పాటు మరో రూ.20 వేల కోట్లు పౌర సరఫరా సంస్థకు, విద్యుత్ సంస్థలకు బకాయిలు పెట్టింది. వాటిని చెల్లించడంతో రెవెన్యూ, ద్రవ్య లోటు పెరిగింది. – 2018–19లో బడ్టెట్ వ్యయం రూ.1,63,690 కోట్లు ఉంటే 2019–20లో రూ.174,755 కోట్లు వ్యయం చేశాం. – గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ.14,832 కోట్ల బకాయిలను (ధాన్యం సేకరణ, విత్తన సబ్సిడీ, ఎంఎస్ఎంఈ, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యుత్ సంస్థల బకాయిలు, అగ్రిగోల్డ్, రైతులకు సున్నా వడ్డీ బకాయిలు) చెల్లించడంతో ద్రవ్యలోటు పెరిగింది. – రాష్ట్ర సొంత పన్ను ఆదాయంతోపాటు కేంద్ర పన్నుల వాటా రూపంలో 2019–20లో రూ.1,14,733 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజలకు మంచి జరుగుతోందని బాధా? – గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీతో పాటు అసలు చెల్లించాలి. వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే మేమే రుణాలు ఎక్కువగా చెల్లించాం. – 1994–95లో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 18 శాతం ఉండగా, చంద్రబాబు పాలనలో 30 శాతానికి వెళ్లింది. 2004–2014 మధ్య కాలంలో అది 22 శాతానికి తగ్గింది. అయితే 2014 నుంచి టీడీపీ ప్రభుత్వం దీన్ని 28 శాతానికి తీసుకువెళ్లింది. – రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు, జీఎస్టీ పరిహారం, రెవెన్యూ లోటు బకాయిలు, పోలవరం వ్యయం రూ.3,800 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాము. రాష్ట్ర పునిర్విభజన చట్టంలోని రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు మంజూరు చేయాలని విన్నవించాం. – దీంతో పాటు విదేశీ సంస్థ కోవిడ్ నేపథ్యంలో తక్కువ వడ్డీతో పాటు గ్రాంటుతో రుణం ఇస్తామని ముందుకు వస్తే అందుకు అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరాం. దీన్ని ఎలా తప్పుపడతారు? రాష్ట్రానికి మంచి జరగడం టీడీపీకి, పచ్చ మీడియాకు ఇష్టం లేదు. -
యనమల మాటల్లో వాస్తవాలు లేవు
-
యనమల మాటల్లో వాస్తవాలు లేవు: బుగ్గన
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా 2019 నుంచి ఆర్థిక మాంద్యం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు, లక్ష్యాలను ఎప్పుడూ అందుకోలేదని విమర్శించారు. వారి హయాంలో రెండంకెల వృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో మూడేళ్ల అంచాలు వరుసగా తగ్గాయని తెలిపారు. 2018-19లో ఎంతో ఆర్థిక ప్రగతి సాధించినట్టు చెప్పుకున్నారని.. కానీ టీడీపీ నేత యనమల చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవని చెప్పారు. రెవెన్యూ రాబడి 40 శాతం పడిపోయిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు.(కరోనా: సీఎం జగన్ కీలక నిర్ణయం) టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా అంచనాలు పెంచారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సరిచేశామని చెప్పారు. గత ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలోనూ యనమల తప్పుడు లెక్కలే చెప్పారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలరాసిందని కూడా అబద్ధాలు చెప్పారు. 2018-19లో సంక్షేమానికి టీడీపీ 5600 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమానికి రూ. 20,100 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. పేదలకు అన్ని విధాల సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ఉన్నామని.. ఎక్కడ కోత విధించడం కానీ, తగ్గించడం కానీ చేయలేదని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం 3 కోట్లకు పైగా లబ్దిదారులకు రూ. 42 వేల కోట్లు అందించిందని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిపారు.కేంద్రం అన్ని విధాల సహకరిస్తామని చెబితే.. తన ఢిల్లీ పర్యటనపై పచ్చ మీడియాలో అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఏపీకి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా పేదలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. (ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త) -
టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరించింది..
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఇష్టానుసారం వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకోవడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎమ్మెల్సీలు చేయి చేసుకున్నారన్నారు. మండలిలో లోకేష్ ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు చెప్పినట్టు మండలి చైర్మన్ సభ నడిపారని నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
బిల్లులు అడ్డుకోవడానికే టీడీపీ కుట్ర: అనిల్
సాక్షి, అమరావతి: టీడీపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలిలో నిన్న జరిగిన ఘటనలు దారుణమన్నారు. మండలిలో మేం ఏమైనా చేస్తామంటూ యనమల రామకృష్ణుడు మాట్లాడారని, రూల్ 90 నోటీసు ఒక రోజు ముందివ్వాలని చెప్పినా వినలేదని తెలిపారు. సంఖ్యా బలం ఉందని ప్రభుత్వ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. (గడ్డంపై చర్చ: టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కౌంటర్) మండలిలో నారా లోకేష్‌ను వీడియోలు తీయొద్దని చైర్మన్ కూడా చెప్పారని, వీడియోలు తీయొద్దని చెబితే మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నించిందన్నారు.అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని, అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్ళిపోయారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. (నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం) సంప్రదాయం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు చివరిలో ఆమోదిస్తారని.. కానీ టీడీపీ విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. బిల్లులు ఆమోదంపై మిగతా పార్టీల అభిప్రాయం తీసుకోమన్న డిప్యూటీ చైర్మన్ తీసుకోలేదన్నారు. ద్రవ్య వినియమ బిల్లు ఆమోదం పొందకుండా కుట్రలు చేశారని దుయ్యబట్టారు. మండలిలో ఎక్కడ బూతులు మాట్లాడమో టీడీపీ నిరూపించాలన్నారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది టీడీపీ సభ్యులేనన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకొని టీడీపీ సభ్యులు చరిత్రలో నిలిచిపోయారని ధ్వజమెత్తారు. తాను సభలో జిప్ విప్పానంటూ లోకేష్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ నిప్పులు చెరిగారు. మహిళ ఎమ్మెల్సీల ముందు తాను అసభ్యకరంగా ప్రవర్తించానని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఛైర్మన్ దగ్గరకు వెళ్లి వీడియోలు బయట పెట్టమని అడుగుదామని, తాను తప్పు చేసినట్లు తేలితే రాజీనామా చేస్తానని, లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా అంటూ టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. -
టీడీపీకి ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: 'చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం' కాగా మరో ట్వీట్లో.. 'నిన్న యనమల స్టేట్మెంట్తో ఒక విషయం వందోసారి స్పష్టమైంది. టీడీపీకి ప్రజాస్వామ్యం, ప్రజల మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: 'ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు' -
యనమల వ్యాఖ్యలపై మండిపడ్డ బొత్స
సాక్షి, విజయనగరం: ప్రభుత్వం ధనార్జన కోసం చూస్తుందన్న విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఏం సాధించాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు,యనమల కలిసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని ధ్వజమెత్తారు. (ఏపీలో అత్యధిక ‘కరోనా టెస్టులు’ చేసింది అక్కడే..) కరోనా కష్టకాలంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. కమీషన్లు కోసం కక్కుర్తి పడటం టీడీపీ నేతల బుద్ధి అని ధ్వజమెత్తారు. మద్య నిషేధం తమ ఉద్దేశమని, అందులో భాగంగానే ధరలు పెంచామని వివరించారు. అదేవిధంగా మద్యం తాగేవారిని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల యోగక్షేమాలు టీడీపీ నేతలకు అవసరం లేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారా అని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరల పెరగకుండా రూ.3వేల కోట్ల ప్రత్యేక నిధి ద్వారా నియంత్రణ చేస్తున్నామని తెలిపారు. (తండ్రి చాటున దాక్కుని రాళ్లు విసరడమా?) -
‘అలా మాట్లాడటానికి యనమలకు సిగ్గుండాలి’
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయం కోసం మాట్టాడుతన్న టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావులకు సిగ్గుండాలని ఏపీ ప్రభుత్వ విప్ దాడిశేట్టి రాజా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మేము అప్పుటు చేసి రాష్ట్రాన్న దీవాళ తీశామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలించలేరని చెప్పిన మాటలు యనమలకు గుర్తులేదా అన్నారు. బురదలో పందులు దొర్లుతున్నాయి.. మీరు దోర్లుతున్నారు కాస్తా బాధ్యతగా మాట్లాడమని యనమల, వెంకట్రావ్‌లను ఆయన హెచ్చరించారు. (‘ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడివా’) ఇక ఎల్లో మీడియాలో గంటల తరబడి చంద్రబాబు చేస్తున్న ప్రసంగం విని... ప్రజలు మాకీ కర్మేంటి బాబు అంటూ దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల బాగోగులు చూడకుండా ప్రతి అరగంటకు పచ్చ మీడియా ముందు ప్రెస్మిట్లు పెట్టేవారన్నారు. ప్రజల హృదయం తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో మహిళలకు వడ్డిలేని రుణాలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్రమే గుర్తించిందని చెప్పారు. కరోనాను అరికట్టడంలో సీఎం జగన్ విజయం సాధిస్తున్నారన్నారు. అంతేగాక దేశానికి దిక్చూచిగా కరోనాను నివారిస్తారని ఆయన అన్నారు. (ఏపీని అన్ని రాష్ట్రాలు అభినందిస్తున్నాయి..) -
కరకట్ట వదిలి హైదరాబాద్‌కు పలాయనం..
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోను రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకూ సరైనదో టీడీపీ నేత యనమల రామకృష్ణుడి విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సహాయ చర్యల కోసం మీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్‌కు ఒక మెసెజ్ అయిన ఇవ్వగలిగారా? అని ప్రశ్నించారు. మీ అధినేత ఓటుకు నోటు కేసులో హైదరాబాదు వదిలి కరకట్ట మీదకు పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. (ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం) అయితే ఇప్పుడు కరోనా వచ్చిందని కరకట్ట వదిలి హైదరాబాదుకు పారిపోయి ఇంట్లో దాక్కున్నారని ఆయన విమర్శించారు. ముందు తమ వెనకాల ఉన్న మచ్చలు చూసుకుని ఎదుటి వారిని మిమర్శిస్తే బాగుంటుందని హితవు పలికారు. కరోనాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చంద్రబాబును వచ్చి చాడమనండి అని ధ్వజమెత్తారు. కాగా దేశ మొత్తం మీద కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఏపీకి తండ్రిలాంటి వారని ప్రజలకు తండ్రిలా ధైర్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
'లేఖలు, లీకులు అందులో భాగమే'
సాక్షి, అమరావతి: కరోనా వ్యాధి నియంత్రణ కోసమే ముందస్తు చర్యగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశామని ఈసీ చెప్తున్న నేపథ్యంలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల సాయంతో నిర్వహించాలంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేస్తున్న డిమాండ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. 'స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలంటూ యనమల గారు డిమాండ్ చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. సీబీఐని నిషేధించినవాళ్లు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు అంటూ విమర్శించారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం, అనవసర ఖర్చులు తప్ప' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘ఆ విద్యార్ధులను తీసుకురండి’ కాగా మరో ట్వీట్లో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడ కలలు కనడంలో వింతేమీ లేదు. తమ యజమానికి ఇప్పటికీ ఏదో విధంగా సేవ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. లేఖలు, లీకులు అందులో భాగమే' అని చెప్పారు. చదవండి: ఏప్రిల్ 14న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ -
‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..
వరుస పంక్చర్లతో కుదేలైపోతున్న ‘సైకిల్’ సచిత్రమాలిక కళ్లెదుటే కనిపిస్తోంది. వికృత చేష్టలతో, అహంకార పూరిత నిర్ణయాలతో, రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అవరోధం కల్పించేలా వ్యవహరిస్తున్న అధినాయకత్వం ప్రజలకు మరింత దూరమవుతోంది. ఐసుగడ్డను ఢీకొని, ముక్కచెక్కలవుతూ, నడిసంద్రంలో మునిగిపోతున్నట్టుగా మారిన ‘తెలుగుదేశం’ నావను భవిష్యత్తీరాలకు చేర్చడానికి.. చుక్కాని పట్టి నడిపించే భావి నేత కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీలోనే ఉంటే తమ పుట్టి కూడా మునుగుతుందన్న భయంతో ‘తమ్ముళ్లు’ ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి, అత్యంత ప్రజాదరణతో వెలుగొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ నాయకులు ఒక్కొక్కరూ జారిపోతూండడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బేజారెత్తిపోతోంది. అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో విసుగు చెందుతున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరుతున్నారు. ఈ పరిణామాలు చూస్తూ కూడా ఇంకా టీడీపీలో కొనసాగడమంటే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే సమాధి కట్టుకున్నట్టు అవుతుందనే భయం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి జారిపోతున్న నేతలను నిలబెట్టుకోలేక టీడీపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కనిపించాయి. కానీ అప్పటికంటే స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేచిన తరువాతే జిల్లాలో టీడీపీ నుంచి వలసలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండి నరనరానా టీడీపీ రక్తమే ప్రవహిస్తోందని బహిరంగంగా చెప్పుకునే నేతలు కూడా బయటకు పోతున్న పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. వలసలను నిరోధించలేక ఆ పార్టీ ముఖ్యనేతలు దిక్కులు చూస్తున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన త్రిమూర్తులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేరొందారు. పార్టీ పుట్టి మునిగిపోతున్నా ఈ ముగ్గురూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై చూస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా పేరొంది, తెర వెనుక పార్టీని నడిపించిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీసం పార్టీ నేతలను నిలువరించలేకపోతున్నారు. ►పార్టీని నమ్ముకున్నా నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్ సీపీలో చేరి, తిరిగి ప్రలోభాలతో టీడీపీ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూదీ అదే పరిస్థితి. వారానికో, 15 రోజులకో ఒకసారి కాకినాడలో మీడియాతో మాట్లాడటానికే ఆయన పరిమితమవుతున్నారే తప్ప టీడీపీకి కాయకల్ప చికిత్స చేయలేకపోతున్నారు. ►సుదీర్ఘ కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రికార్డుతో పాటు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా పని చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన కూడా దాదాపు కన్నెత్తి చూడడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురంలో కూడా పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతూ రాజప్పకు గట్టి షాక్ ఇస్తున్నారు. నాడు హోం మంత్రిగా పార్టీలో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట వర్గీయులను అమలాపురం పట్టణంలో వెతికి వెతికి మరీ కేసులలో ఇరికించి ఇబ్బందులు పాల్జేసిన నేపథ్యంలో.. వారందరూ ఇప్పుడు టీడీపీని వీడి రాజప్పకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. చదవండి: ఏబీవీ సస్పెన్షన్‌కు ఆధారాలున్నాయ్ ►తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీలో చేరడంతో రామచంద్రపురంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ►ఇటు అమలాపురం పట్టణంలో కూడా తోట ప్రభావం, చినరాజప్పపై ఆగ్రహంతో గంగుమళ్ల కాసుబాబు, అరిగెల బుజ్జి తదితరులు మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీఎన్టీయూసీ నాయకుడు, నరనరానా టీడీపీని జీర్ణించుకున్న గల్లా రాము వంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. అమలాపురం 25వ వార్డు మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజు(చిన్ని) వైఎస్సార్ సీపీలో చేరారు. ►కాకినాడ రూరల్ కరప మండల టీడీపీ నేత పుల్లా ప్రభాకరరావు, పండూరుకు చెందిన ట్యాంకర్స్ యూనియన్ అధ్యక్షుడు బావిశెట్టి వెంకటేశ్వరరావు మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►తునిలో యనమల సోదర ద్వయం ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరారు. ► రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మాజీ జెడ్పీటీసీ యాళ్ళ సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్ టీడీపీని వీడి ఎమ్మెల్యే వేణు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►రాజమహేంద్రవరంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, బీసీ సంఘ నాయకుడు కడలి వెంకటేశ్వరరావులు సీఎం జగన్ సమక్షంలో; పెద్దాపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి పార్టీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►కొత్తపేటలో మందపల్లి శనైశ్చర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సలాది బాబ్జీ, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి, వేమగిరిలో వెలుగుబంటి వెంకటాచలం, దొంతంశెట్టి చినవీరభద్రయ్య, దళిత సంఘం నాయకుడు జంగా బాబురావు.. ఇలా టీడీపీ నేతలు అనేకమంది ఆ పార్టీ మనుగడ కష్టమనే భావనతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ►ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేక టీడీపీ చేతులెత్తేసింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీకి 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి. -
'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట'
సాక్షి, అమరావతి: అధికారం చాటున చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతూ ఉండటంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పీఎస్‌తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్దుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. రూ. 2వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు' అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే) కాగా మరో ట్వీట్లో శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రవర్తించిన తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'కాలం చెల్లిన యనమల ఎత్తుగడలను గుడ్డిగా నమ్మిన బాబు కౌన్సిల్‌నే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట. రద్దు అనేది లాంఛనమే అని వాళ్లకి అర్థమైంది. కౌన్సిల్ పోతే మిగిలిన పదవీ కాలం జీతభత్యాలు చెల్లిస్తానన్న హామీని బాబు నిలబెట్టుకోవాలని డిమాండు చేస్తున్నారట' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..! బాబు తిప్పిన చక్రాలు ఏమయ్యాయో? -
‘పచ్చ’నేతలను కాపాడటానికి వెనుకాడటం లేదు..
గత సర్కార్ అవినీతి వాసనల నుంచి ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు బయట పడలేకపోతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా కోట్లాది రూపాయలు దోచుకున్న‘పచ్చ’నేతలను కాపాడటానికి వీరు వెనుకాడటం లేదు. పారదర్శకత, అవినీతి రహితపాలనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గాలికొదిలేసి కబ్జాదారుల కనుసన్నల్లో కొందరు పనిచేస్తున్నారు. పిఠాపురం శ్రీ సంస్థానం భూములు ఆక్రమణలకు గురైనా దందాదారుల పట్ల వల్లమాలినప్రేమ ఒలకబోస్తున్నారు. ఏకంగా 222 ఎకరాలు టీడీపీ నేతల కబంధహస్తాల్లో చిక్కుకున్నా దేవదాయ శాఖ కుంభకర్ణ నిద్రలో జోగుతోంది. సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: తొండంగి మండలంలో వివిధ దేవస్థానాలు, మఠాలు, సత్రాలకు 2000 ఎకరాలకు పైగా భూములున్నాయి. బాటసారులకు అన్నార్తులకు పట్టెడు అన్నం పెట్టే ఆశయంతో తొండంగిలో 511 ఎకరాలను పిఠాపురం మహారాజా రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ పిఠాపురం శ్రీసంస్థానం సత్రానికి ఇచ్చారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో నిత్యాన్నదాన, విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో ఈ భూములు దేవదాయ శాఖకు దఖలుపడ్డాయి. అప్పటి నుంచి ఈ భూముల వేలం దేవదాయ శాఖే నిర్వహిస్తోంది. మండల కేంద్రం తొండంగిలో 538, 545, 553, 535, 623, 565, 690 తదితరసర్వే నంబర్లలో ఉన్నాయి. 478 ఎకరాలను కౌలుకు ఇస్తున్నారు. ఈ భూముల ద్వారా దేవదాయశాఖకు ఏటా రూ.40 లక్షలు పైనే ఆదాయం వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం శ్రీసంస్థానం సత్రానికి 511 ఎకరాలున్నాయి. అధికారులు 469 ఎకరాలకు మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. అంటే శ్రీ సంస్థానానికి చెందిన 42 ఎకరాల ఆచూకీ లభించడం లేదు. 511 ఎకరాల సత్రం భూములకు ఏటా పన్నులు చెల్లిస్తున్న దేవదాయశాఖ వేలం నిర్వహిస్తున్నది. 469 ఎకరాలకే కావడం గమనార్హం. తొండంగి శ్రీసంస్థానసత్రానికి చెందిన భూములు ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులే ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అదేమంటే భూములు సమగ్ర సర్వే జరగకపోవడమే కారణమంటూ తప్పించుకుంటున్నారు. పిఠాపురం శ్రీసంస్థానం సత్రానికి ఉన్న తొండంగి మండల పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు ఎకరా రూ.20 లక్షలు పలుకుతుండేది. గతంలో ఇక్కడ భూములలో ఒక పంట పండేది. పిఠాపురం బ్రాంచి కెనాల్ అందుబాటులోకి రావడంతో చాలా ఏళ్లుగా రెండు పంటలు పండుతున్నాయి. ఇందుకు తోడుగా తొండంగి పరిసర ప్రాంతాల్లో జీఎమ్ఆర్ పోర్టు బేస్డ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ రానుండటంతో భూముల విలువ పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.40 లక్షలు పలుకుతోంది. పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూముల్లో కనిపించకుండా పోయిన 42 ఎకరాలను లెక్కలేస్తే రూ.16.80 కోట్లుగా ఉంది. ఇన్ని కోట్ల విలువైన భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయంటే దేవదాయశాఖ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన తునికి చెందిన యనమల రామకృష్ణుడు అనుచరులు గుప్పెట్లోనే ఉన్నాయి. అప్పట్లో మంత్రి అండదండలుండటంతో తొండంగి మండల టీడీపీ నేతల స్వాధీనంలో ఉన్న ఈ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి వెనుకంజ వేశారు. అంతెందుకు ఈ భూముల్లో మంత్రి యనమల అనుచరులు నాలుగైదేళ్లపాటు విచ్చలవిడిగా జాగీరుగా మట్టి తవ్వేసి లక్షల్లో సొమ్ము చేసుకున్నా నాడు పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు. కానీ ప్రభుత్వం మారి ఏడు నెలలయింది. అయినా దేవదాయశాఖ ఆ భూముల స్వాధీనానికి చొరవ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఆర్థికపరమైన లావాదేవీలు ఉండటమే కారణమంటున్నారు. నిర్లక్ష్యంతో మరిన్ని ఎకరాలు కబ్జా శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈ 42 ఎకరాలకే పరిమితం కాలేదు. గత మార్చి నెలతో గడువు ముగిసినా దేవదాయశాఖ అధికారులు వేలం నిర్వహించకపోవడంతో మరో 180 ఎకరాలు లీజుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దేవదాయ భూములకు ప్రతి మూడేళ్లకు వేలం నిర్వహించాలి. కానీ ఆమ్యామ్యాలకు కక్కుర్తిపడ్డ కొందరు అధికారులు కావాలనే వేలం నిర్వహించకపోవడంతో ఆ భూములు కూడా లీజుదారుల స్వాధీనంలో ఉన్నాయి. ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే దేవదాయ చట్టం 78, 79 ప్రకారం నోటీసులు ఇవ్వడం న్యాయపరంగా వెళ్లడం వంటి పెద్ద ప్రహసనమే ఉంది. ఇంతటి అవకాశం ఇవ్వడం వెనుక కొందరి స్వార్థం దాగి ఉందంటున్నారు. ఇలా కబ్జాల్లో ఉన్న పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూములు విలువ లెక్కతీస్తే రూ.66 కోట్లు పైమాటగానే కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులకు చీమకుట్టినట్టయినా లేకపోవడమే విస్మయానికి గురిచేస్తోంది. ఆక్రమణలకు గురైన భూములు, సత్రం పేరుతో సొమ్ములు తినేస్తున్నారంటూ ఇటీవల పిఠాపురం మహరాజా వారసుడు చిన్నరాజా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. కుంభకర్ణ నిద్రలో జోగుతున్న ఆ శాఖ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ‘ఈఓతో మాట్లాడి కార్యాచరణ చూస్తా’ పిఠాపురం శ్రీసంస్థానం సత్రం భూముల కబ్జా విషయం నా దృష్టికి రాలేదు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత శాఖలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. శ్రీ సంస్థానం కార్యనిర్వాహణాధికారితో సంప్రదించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకుంటా. దేవదాయశాఖకు చెందిన సెంటు భూమి కూడా వదిలిపెట్టేది లేదు విచారిస్తాను. దర్భముళ్ల భ్రమరాంబ, రీజనల్ జాయింట్ కమిషనర్, దేవదాయశాఖ. -
బిల్లులను అప్రజాస్వామికంగా అడ్డుకున్నారు
సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభ బిల్లులను ఆమోదించి పంపితే శాసన మండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, ఎస్సీ కమిషన్ బిల్లు, ఇంగ్లిష్ మీడియం బిల్లును తెస్తే శాసనమండలిలో వ్యతిరేకించారన్నారు. మండలి అవసరమా.. అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్త చర్చ కోసమే రెండు రోజులు గడువు ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నారంటూ రెండు రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. 1983లో టీడీపీకి బలం లేనప్పుడు ఆ పార్టీ వ్యవహరించిన తీరును బొత్స గుర్తు చేశారు. ప్రస్తు్తతం శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలను ఈనాడు అధిపతి రామోజీరావు సమర్థిస్తున్నారో? వ్యతిరేకిస్తున్నారో? చెప్పాలని నిలదీశారు. ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దును ఈనాడు సమర్థించిందన్నారు. ఇప్పుడు ఆదే ఈనాడు శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తోందన్నారు. మండలిలో నిబంధనలను తుంగలో తొక్కడం రామోజీరావుకి కనపడట్లేదా అని నిలదీశారు. బాబు విధానాలకు రామోజీ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు బాబు, యనమల: చంద్రబాబు, యనమల రామకృష్ణుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లలాంటి వారని బొత్స చెప్పారు. అందుకే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీలకు రూ. 5 కోట్లు, రూ.10 కోట్లు ఎందుకిస్తాం? వాళ్లేమైనా ప్రజా ఆమోదం ఉన్న నేతలా? అని ప్రశ్నించారు. లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడు కాబట్టి.. మండలి రద్దయితే తన కుమారుడి పదవి పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవన్నారు. మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సూచనలు చేయాల్సిన మండలి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు. మండలిలో రాజ్యాంగానికి తూట్లు పొడవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన చెందారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికిపోయారో, టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో ప్రజలు చూశారని అన్నారు. -
బాబుకు లోకేష్ భయం పట్టుకుంది
సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే శాసన మండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన బొత్స.. మండలి అవసరమా అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోందన్నారు. శాసన మండలి నిబంధనలకు తూట్లు పొడిచిందని బొత్స చెప్పారు. కొందరు రాజకీయ లబ్ది కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 5 కోట్ల మంది లబ్ది కోసం పని చేస్తోందన్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నారని 'ఈనాడు'లో తప్పుడు కథనాలు రాస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. 1983లో టీడీపీకి బలం లేనప్పుడు ఎలా వ్యవహరించారో ఆయన గుర్తు చేశారు. మండలి రద్దుకు అంకురార్పణ చేసినప్పుడు రామోజీరావు సమర్థించారని చెప్పారు. ఇప్పుడు జరుగుతోన్న పరిణామాలను రామోజీరావు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. మండలిలో నిబంధనలను తుంగలో తొక్కడం రామోజీరావుకి కనపడట్లేదా? అని బొత్స నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీలకు రూ.5కోట్లు, రూ.10కోట్లు ఎందుకిస్తాం.? వాళ్లేమైనా ప్రజా ఆమోదం ఉన్న నేతలా..? చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎలా? మండలి రద్దయితే లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని, ఎందుకంటే లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడని అన్నారు. స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవని బొత్స అన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. సూచనలు చేయాల్సిన మండలి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు. శాసన మండలిలో ప్రజాతీర్పుని అపహాస్యం చేశారని బొత్స వాపోయారు. రాజ్యాంగానికి మండలిలో తూట్లు పొడవడంపై సీఎం జగన్ ఆవేదన చెందారని బొత్స చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికిపోయారో.. టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో ప్రజలు చూశారని బొత్స అన్నారు. చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లలాంటి వారని చెప్పారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశామని, ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయాడో చూశామని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే వైఎస్సార్సీపీకి తెలుసని బొత్స సత్యనారాయణ అన్నారు. (ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే) చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా -
‘మోసానికి రాజు చంద్రబాబు.. సేనాధిపతి యనమల’
సాక్షి, తాడేపల్లి: మోసానికి రాజు చంద్రబాబు అయితే.. సేనాధిపతి యనమల రామకృష్ణుడని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి యనమల అంటూ నిప్పులు చెరిగారు. మోసాలు, కుట్రలు చేసిన ఆయన ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారనే భ్రమలో యనమల ఉన్నారని దుయ్యబట్టారు. మంత్రులు తాగి వచ్చారని యనమల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దావోస్ వెళ్ళి చంద్రబాబు,యనమల ఏమి సాధించుకొచ్చారని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో విహార యాత్రలు చేశారని.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు, యనమల ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అతితక్కువ కాలంలోనే ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచారన్నారు. అవినీతిలో చంద్రబాబు దేశంలో మొదటి స్థానంలో నిలిచారన్నారు. ‘మండలిలో ఏదో సాధించినట్లు తండ్రి కొడుకులు సన్మానాలు చేయించుకుంటున్నారు. మండలి రద్దు చేస్తే శాసనసభ ఎందుకని యనమల అంటున్నారు. గతంలో ప్రజా మద్దతు లేని మండలి అవసరం లేదని ఎన్టీఆర్ అన్నారు. 2004లో కౌన్సిల్ వల్ల ప్రజాధనం వృధా అని చంద్రబాబు విమర్శలు చేశారని’ అనిల్ గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ సహకరించక పోయినా పర్వాలేదని.. కానీ అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారంటూ యనమల ఆరోపణలను మంత్రి అనిల్ తిప్పికొట్టారు. గతంలో వైస్రాయ్ హోటల్ లో జరిగిందేమిటో యనమల సమాధానం చెప్పాలన్నారు -
ఆయన అంటెండర్‌గా కూడా పనికిరాడు..!
సాక్షి, కాకినాడ: లోకేష్.. చంద్రబాబు కుమారుడు కాకపోతే శాసనమండలిలో అంటెండర్ ఉద్యోగానికి కూడా పనికిరాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. మండలి జరుగుతున్నప్పుడు లోకేష్ ఒక పప్పులా వ్యవహరించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక యువ నాయకుడు ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని లోకేష్‌కు దాడిశెట్టి రాజా హితవు పలికారు. యనమల టెర్రరిజం గురించి ప్రజలకు తెలుసు.. యనమల రామకృష్ణుడు టెర్రరిస్టు కన్నా దారుణంగా వ్యవహరించారని.. యనమల టెర్రరిజం గురించి తుని నియోజకవర్గంలో ప్రతిఒక్కరికి తెలుసునన్నారు. కాపు ఉద్యమ సమయంలో అప్పటి జిల్లా ఎస్పీ, ఎఎస్పీని వెంటేసుకుని జిల్లాను ఏవిధంగా భయబ్రాంతులకు గురిచేశారో జిల్లా అంతా తెలుసునన్నారు. గత ఎన్నికల్లో యనమల, ఆయన సోదరుడిని జిల్లా ప్రజలు తరిమికొట్టిన విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దేశ ద్రోహి యనమల అని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రలోభాల గేట్లు తెరిస్తే.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు పన్నులు కడుతున్నారు తప్ప.. చంద్రబాబు బినామీలు కోసం కాదన్నారు. చంద్రబాబు బినామీల కోసం.. తమ కష్టాలను త్యాగం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. తాము ప్రలోభాల గేట్లు తెరిస్తే..నీ పక్కన కొడుకు, బావమరిది తప్ప మరెవ్వరు ఉండరన్న సంగతి చంద్రబాబు గుర్తించుకోవాలని దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. -
సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారు?
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా బుధవారం శాసన మండలిలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఆర్డీఏ రద్దు, ఏఎంఆర్డీఏ ఏర్పాటు బిల్లులపై సవరణలను సెలెక్ట్ కమిటీకి పంపించాలని యనమల పేర్కొనగా బుగ్గన విభేదించారు. నిబంధనల ప్రకారం చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదని చెప్పారు. ఈ సమయంలో యనమల జోక్యంచేసుకుంటూ మంత్రులు సభలో ఉండకూడదని, వారిని బయటకు పంపించాలంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. చైర్‌ను మీరెలా డిక్టేట్ చేస్తారని బుగ్గన ప్రశ్నించారు. బిల్లులను చర్చకు తీసుకున్నపుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి సెలెక్ట్ కమిటీ అంటూ కొత్త వాదనలను తెరమీదకు తేవడం సరికాదన్నారు. రూల్‌బుక్‌లో నిబంధనలను బుగ్గన చదివి వినిపించారు. తొలుత మోషన్ మూవ్ కాలేదన్న చైర్మన్.. బిల్లులను చర్చకు తీసుకున్న సమయంలో సవరణలకు సంబంధించి ఎటువంటి మోషన్ మూవ్ కాలేదని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. యనమల చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని, క్షుణ్నంగా నిబంధనలు చదివి వినిపించినా సెలెక్ట్ కమిటీకి పంపించాలనడం దారుణమని బుగ్గన పేర్కొనగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బిల్లులను చర్చకు తీసుకున్న సమయంలో ఎలాంటి మోషన్ మూవ్ కాలేదని మండలి ఛైర్మన్ షరీఫ్ తొలుత ప్రకటించారు. సాంకేతికంగా మోషన్ మూవ్ అయితేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని చెప్పగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఈ దశలో చైర్మన్ అశోక్‌బాబు నోటీసులు ఇచ్చారని చెప్పడం పట్ల అధికార పక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నోటీసులు పాత తేదీలు వేసి ఇవ్వవచ్చని, యనమల చాలా మేధావితనంతో మాట్లాడుతున్నారని బుగ్గన అన్నారు. బిల్లును పరిగణనలోకి తీసుకున్న సమయంలోనే నిబంధనల మేరకు సవరణల మోషన్ మూవ్ చేయాలని, అలా మూవ్ చేసినట్లు రికార్డులున్నాయేమో చెప్పాలని చైర్మన్‌ను బుగ్గన కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ బిల్లు పరిగణనలోకి తీసుకున్న విషయం టీడీపీ సభ్యులకు తెలియదన్నారు. కాసేపటి తరువాత రెండు నోటీసులు ఇచ్చారని చైర్మన్ చెప్పారు. మంత్రులవైపు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు గతంలో సీఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఎలా బిల్లు పెట్టారో గుర్తు చేసుకోవాలని, అయినా వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని యనమలకు మంత్రి బుగ్గన చురకలంటించారు. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ టీడీపీ సభ్యులు పోడియం వద్ద గందరగోళం సృష్టించారు. మంత్రులవైపు దూసుకువెళ్లారు. అధికార పక్ష సభ్యులు, మంత్రులు పోడియం వద్దకు చేరుకుని బిల్లులను ఆమోదించాలని చైర్మన్‌ను అభ్యర్ధించారు. మంత్రులు చేతులు జోడించి వేడుకుంటుండగా టీడీపీ సభ్యులు బుద్ధా వెంకన్న, రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బీటెక్ రవిలు మంత్రి బొత్సను దూషించారు. నారా లోకేష్ ఒక్కసారిగా మంత్రులు, అధికారపక్ష సభ్యల వైపు దూసుకురాగా టీడీపీ సభ్యుడు టీడీ జనార్ధన్ వెనక్కు తీసుకెళ్లారు. టీడీపీ సభ్యులు దూషణల పర్వం కొనసాగించగా మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ రకంగా రౌడీయిజం చేస్తారా? అంటూ మంత్రి బొత్స నిలదీశారు. టీడీపీ సభ్యుల తీరు, హావభావాలు, చైర్మన్ వ్యవహార శైలిపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. -
అప్పుడు దోపీడి చేసి ఇప్పుడు నీతులు..
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతిలో భూముల రేట్లు పడిపోతాయని యనమల రామకృష్ణుడు రకరకాల ప్రేలాపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆయన గురువారం జిల్లాలోని అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపీడి చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో యనమలతో పాటుగా ఆయన సోదరుడు, అల్లుడు భూములు కొన్నారని దాటిశెట్టి రాజా విమర్శించారు. ప్రజాధనాన్నీ.. యనమల, చంద్రబాబు కలిసి ఏలా దోచుకున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. పరిశ్రమల పెట్టుబడుల కోసం వైజాగ్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు టీడీపీ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు బస చేసిన ఒక్కో హోటల్‌కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు చెల్లించారని దాడిశెట్టిరాజా మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయాంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ వచ్చిందో యనమల చెప్పాలని రాజా డిమాండ్ చేశారు. కేవలం ఫిషింగ్ సెక్టార్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని.. ఆ సెక్టార్లో వచ్చిన గ్రోత్‌ను పట్టుకుని అన్ని సెక్టార్లలో వచ్చినట్లు మీడియాతో ప్రచారం చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్ అనేది ఓ షాపింగ్ మాల్ లాంటిదని దాటిశెట్టిరాజా అన్నారు. గట్టిగా ఐదువందల మందికి కూడా ఈ కంపెనీలో ఉద్యోగాలు రావని ఆయన రాజా విమర్శించారు. అటువంటి షాపింగ్ మాల్‌కు రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. లూలూ గ్రూప్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని.. యనమలతో పాటు చంద్రబాబు, లోకేష్ బిల్డప్ ఇస్తున్నారని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైజాగ్‌లో పర్యటిస్తే వేలాది మంది వచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబులా తాము పేయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకోమని రాజా అన్నారు. -
పత్తిగింజ కబుర్లు చెబుతున్నాడు..
సాక్షి, అమరావతి: ప్రజలు ఛీకొట్టినా... తన యజమాని కోసం కిరసనాయిలు పిచ్చి రాతలు రాస్తున్నాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎల్లోమీడియా తీరుపై విరుచుకుపడ్డారు. తమ కులదైవం చంద్రబాబు నాయుడు ఉనికి కోల్పోవడం చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయిందని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా టీడీపీ నేత యనుమల రామకృష్ణుడు తీరుపై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘యనమల గారు కూడా నీతి బోధలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన ప్రధాన భాగస్వామి. అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు, వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నాడు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.(చదవండి: అంతమాట అంటారా?) అదే విధంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీలో మొహం చెల్లక పోవడంతో ప్రచారం కోసం గేటు దగ్గర గలాభా సృష్టించాలని చూశాడు. లక్షల కోట్లు దోచుకున్న పొగరుతో మాలోకం మార్షల్ గొంతు పట్టుకుని దుర్భాషలాడిన వీడియోలు అందరూ చూశారు. ప్రచారం కోసం ఇలాంటి ఛీప్ ట్రిక్కుల మీద ఎన్నాళ్లు బాబూ’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. -
టీడీపీ నేతల అవినీతి కేంద్రంగా పోలవరం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో అవినీతి సుడిగుండంలో ఇరుక్కుపోయింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కాకుండా అందినకాడికి దోచుకోవాలనే లక్ష్యంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ హోదా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రం భరిస్తోంది, కానీ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రమే చేపట్టడంతోనే అవినీతికి బీజం పడింది. చంద్రబాబు తన అనుయాయులకు, తెలుగుదేశం నాయకులకు ప్రాజెక్టు పనులను అప్పగించి అవినీతికి తెరతీశారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రాజమహేంద్రవరం ఎన్నికల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా ఈ ప్రాజెక్టు పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించింది. వేగంగా పూర్తి చేసేందుకే రివర్స్ టెండరింగ్.. పోలవరం ప్రాజెక్టు ద్వారా డబ్బు దండుకోవాలనే తప్ప.. సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు. ఈ ప్రాజెక్టు పనులను ఇకపై వేగంగా ముందుకు సాగాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసి టీడీపీ హయాంలో జరిగిన అవినీతి వెలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించటం, పోలవరం కాలువకు ఆనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు తలపెట్టారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ కేవలం తమ ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలోనే చూస్తూ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. దీంతో ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాలేదు. 2018 ఖరీఫ్ నాటికే రైతులకు నీళ్లిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత డెడ్ లైన్‌ను మారుస్తూ వెళ్లారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను చేపట్టింది. అవినీతి బైటపడుతుందని టీడీపీ భయం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును తొలుత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే శరవేగంతో పూర్తి చేస్తామని హామీనిచ్చింది. 2018లో తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అని ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే చంద్రబాబు హడావుడి తప్ప ప్రాజెక్టు పనుల్లో సరైన పురోగతి కనిపించలేదు. పోలవరానికి సంబంధించిన ప్రధాన పనులన్నీ ఇప్పటికే పెండింగ్ లోనే ఉండటం ఖర్చు మాత్రం వేలకోట్లలో అవుతుండటంతో తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిజాలను తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్ టెండరింగ్‌కు వెళుతోంది. ఈ పద్ధతిలో ఎవరు అతి తక్కువ ధరలకు ప్రాజెక్టును నిర్మిస్తామని ముందుకు వస్తే వారికే పనులను అప్పగిస్తారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ విధానం విజయవంతమైతే తాము చేసిన తప్పు, ముఖ్యంగా పోలవరం పేరుతో చేసిన దోపిడీ ఎక్కడ బైటకు వస్తుందోనన్న ఉద్ధేశ్యంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్తూ టీడీపీ నేతలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ అస్మదీయులకే పనులు... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్న టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆర్ధికంగా దివాళా తీయటంతో తన అనుయాయులు, బినామీలను చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల్లోకి జొప్పించారు. ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీగా పేరుపడ్డ సీఎం రమేష్‌కు సన్నిహిత కంపెనీగా పేరుపడ్డ త్రివేణీ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్ఫ్రా కంపెనీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులను కూడా ప్యాకేజీలుగా విభజించి చంద్రబాబు తనవారికి కట్టబెట్టారు. పార్టీలో కీలక స్థానంలో ఉండటంతోపాటు టీడీపీ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు.. తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు వంద కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఒకపక్క ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి బాగా లేదని చెప్పిన యనమల మాత్రం తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం వెంటనే క్లియర్ చేసేవారు. రాజు తచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు టీడీపీ నేత బిల్లు పోవరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగా చెల్లించటంలో యనమల ఆర్ధికమంత్రిగా ఉన్న సమయంలో ఆరి తేరిపోయారు. అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీడీపీ ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్‌లో రూ. 142 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఇదే కాలువ ఆరో ప్యాకేజీ పనులను టీడీపీ తూర్పు గోదావరి జిల్లా నేత సుధాకరరావుకు అప్పగించారు. దీని విలువ 179 కోట్లు. ఇక చంద్రబాబు బినామీగా పేరు గాంచిన ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రవేశపెట్టిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ. 1708 కోట్ల విలువైన హెడ్ వర్క్స్ మట్టి పనిని కట్టబెట్టారు. పోలవరం కుడి కాలువ ఆరు, ఏడు ప్యాకేజీ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ కంపెనీకి అప్పగించారు. ఈ పనుల విలువ 286 కోట్లు. సూర్య కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పనులు అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. అవకతవకలు నిజమేనని తేల్చిన కమిటీ.. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు నిజమేనని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపు ఇస్టానుసారం చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్‌లో రికార్డ్ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌లో 2015-16 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం రూ. 1331 కోట్ల భారం పడింది. ప్రధాన కాంట్రాక్టర్ మొబిలైజేషన్ అడ్వాన్స్ లపై వడ్డీ 84.43 కోట్లు తిరిగి వసూలు చేయాల్సి ఉంది. ఇంప్రెస్ట్ కింద ప్రధాన కాంట్రాక్టర్ కు చెల్లించిన రూ.141.22 కోట్లు రికవరీ చేసుకోవాల్సి ఉంది. స్థలం స్వాధీనం చేయకముందే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి చెల్లించిన అడ్వాన్సులు 787.20 కోట్లు తిరిగి రాబట్టాలి. మొత్తంగా రూ.2400 కోట్లు అదనంగా చెల్లించారు. -
రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో తవ్వే కొద్దీ టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ బాగోతాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం నూతన రాజధాని గురించి అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు తన టీమ్‌కు లీకులు ఇవ్వడంతో పచ్చ కోటరీ అమరావతి ప్రాంతంలో భారీగా భూకొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కుమార్ జూన్ 6, 2014న తాడికొండలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 31, 2014న నేలపాడులోని సర్వే నంబర్ 59లో టీడీపీ నేత నిమ్మకాయల చిన్నరాజప్ప తన కుమారుడు రంగనాథ్ పేరుతో రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఎకరం 7 లక్షలకు కొని కోటి రూపాయలకు చినరాజప్ప అమ్మినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మరో మూడు గ్రామాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూకొనుగోళ్లు బయటపడ్డాయి. కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 23/బీ1లో అక్టోబర్10, 2014న ఎకరం భూమి, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 51/డీలో అక్టోబర్ 10, 2014న ఎకరం 4సెంట్లు, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 63/ఏలో అక్టోబర్ 10, 2014న 67సెంట్లు, కురగల్లులో సర్వే నెంబర్ 8/2 అక్టోబర్ 14, 2014న ఎకరం 29సెంట్లు కూతురు గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2014 నవంబర్ 27న లింగాయపాలెంలో సర్వే నెంబర్ 149లో ఎకరం 25సెంట్లు తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
‘యనమలా.. అంతటి ఘనులు మీరు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసలేని విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని హితవు పలికారు. ఎన్నికలకు ముందు ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్షానికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?’అని పేర్కొన్నారు. -
పరారీలో ఉన్న టీడీపీ నాయకులు
సాక్షి, తుని(తూర్పుగోదావరి) : రాజ్యాంగేతర శక్తిగా అవతరించి దౌర్జన్యాలు చేయడంలో టీడీపీ నాయకులు దిట్ట. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ్ముడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యనమల కృష్ణుడు, ఆయన ఆసరా చూసుకుని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు, అధినాయకుల ప్రాపకం పొందేందుకు మున్సిపల్ మాజీ చైర్మన్ యినుగంటి సత్యనారాయణ అధికార బలంతో చేసిన అరాచకాలు నియోజకవర్గంలో ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉండగా తొండంగి మండలంలో మామూళ్లు ఇవ్వనందుకు హేచరీలపై దాడులకు పురిగొల్పిన యనమల కృష్ణుడు, ఇప్పుడు అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసి ప్రతిపక్షంలో ఉన్నా తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అన్న క్యాంటీన్ అద్దాలను ధ్వంసం చేయడంపై మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దౌర్జన్యకాండకు కారుకులైన ఈ ముగ్గురూ (యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, యినుగంటి సత్యనారాయణ), దిబ్బ శ్రీను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. మరుసటి రోజు దిబ్బ శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురూ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 1984 నుంచి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కీలక పదవులు చేపట్టగా ఆ హోదాను యనమల కృష్ణుడు అనుభవించారు. తమను అడ్డుకునే శక్తివంతులు లేరని రెచ్చిపోయిన కృష్ణుడు, అతడి సన్నిహితులు శేషగిరిరావు, సత్యనారాయణ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పరారైనట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అధికారం లేకపోవడంతో పాటు ప్రజలకు అండగా నిలిచి ఢీకొనేందుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఉండడంతో అధికారుల్లోను, ప్రజల్లో ధైర్యం నెలకొంది. ఇన్నాళ్లు తనపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి లేదని, తన ఇంటి దరిదాపుల్లోకి పోలీసులు రాలేరన్న మొండితనంతో ఉన్న యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, యినుగంటి సత్యనారాయణలు ఇళ్లను వదిలి పరారవ్వడంపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏ అర్ధరాత్రి ఇళ్లకు వచ్చినా అరెస్టు చేసేందుకు పోలీసులు వారి ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. -
యనమల బడ్జెట్‌పై చర్చకు సిద్ధమా?
సాక్షి, విజయవాడ : రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు వింటే నవ్వొస్తుంది.. బడ్జెట్‌పై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ సవాల్ చేశారు. బడ్జెట్ చూసి యనమలకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు పెద్దపీట వేసిందన్నారు జోగి రమేష్. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్ ఉంటే.. యనమల ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యనమల కళ్లు పోయాయా అని ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే.. చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించాడని ఆయన విమర్శించారు. రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పంటల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించామన్నారు. రైతులకు వైఎస్సార్ బీమా, ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు జోగి రమేష్. తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. పథకాలకు రాజశేఖర్ రెడ్డి పేరు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి ద్వారా కొన్ని లక్షల మంది తల్లుల కలలను నేరవేరుస్తాం అని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. అతి త్వరలోనే 30 కమిటీలు వేసి.. తెలుగుదేశం నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామని జోగి రమేష్ హెచ్చరించారు. -
‘కాకిలెక్కలతో బురిడీ కొట్టించారు’
సాక్షి, కాకినాడ : మాజీమంత్రి యనమల రామకృష్ణుడుపై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు. గడిచిన మూడేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ సదస్సుల ద్వారా లక్షకోట్ల పెట్టుబడులు వచ్చాయా అని ప్రశ్నించారు. కనీసం వెయ్యిమంది నిరుద్యోగులకైనా ఉపాధి కల్పించారా అని అన్నారు. రూ.19.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామంటూ కాకిలెక్కలతో బురిడీ కొట్టించి టీడీపీ నేతలు ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెలరోజుల పాలనాకాలంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడాన్ని యనమల జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల టీడీపీ పాలనతో ప్రజలు కష్టాలు, నష్టాలు తట్టుకోలేకే వైఎస్ జగన్‌కు పట్టం కట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజారంజక పాలన చూసి వారికి భయం పట్టుకుందని అందుకే పసలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యనమల విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. -
పూడిక పేరుతో దోపిడీ
సాక్షి, అమరావతి: మూడు మీటర్ల లోతు, 85.5 మీటర్ల వెడల్పుతో తవ్విన కాలువలో 2.5 మీటర్ల ఎత్తున పూడిక పేరుకుపోయిందంటే నమ్ముతారా? ఇది వినడానికే హాస్యాస్పదంగా ఉంది కదా? కానీ.. ఇది వాస్తవమని పోలవరం కాంట్రాక్టర్ చెప్పారు. పూడిక తీయడానికి రూ.1.49 కోట్లను ఖర్చు చేశామని చూపారు. కాంట్రాక్టర్ అడిగిందే తడవుగా అధికారులు బిల్లులు చెల్లించేశారు. ఈ అక్రమాలకు పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ వేదికైంది. అప్పటి ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడికి.. లేని పూడికను ఉన్నట్లు చూపి, దాన్ని తీశారనే సాకు చూపి ప్రజాధనాన్ని దోచిపెట్టడంపై అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం ఎడమ కాలువలో నవంబర్ 30, 2016 నాటికి రూ.110.11 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. కానీ ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లకు పెంచేసి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేషన్ పద్ధతిలో టీడీపీ సర్కార్ అప్పగించింది. ఈ పనులు చేయడానికి రంగంలోకి దిగిన సుధాకర్ నవంబర్ 30, 2016 నాటికి తవ్విన కాలువలో పూడిక పేరుకుపోయిందని.. అందులో పూడిక తీయడానికి వీలుగా వర్షపు నీటిని తోడామని, పూడిక తీశామని.. వాటికి రూ.1.49 కోట్లు ఖర్చయిందని, ఆ బిల్లులు చెల్లించాలని అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)కి సర్కార్ పంపింది. మూడు మీటర్ల లోతున్న కాలువలో 2.5 మీటర్ల ఎత్తున పూడిక పేరుకుపోయిందని చూపడంపై విస్మయం వ్యక్తం చేసిన ఎస్ఎల్ఎస్సీ బిల్లులు చెల్లించడానికి తిరస్కరించింది. కానీ ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు పుట్టా సుధాకర్ సంస్థకు రూ.1.49 కోట్లను చెల్లించేశారు. అంతటితో ఆగని టీడీపీ ప్రభుత్వం పనుల అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అంచనా వ్యయాన్ని రూ.669.40 కోట్లకు పెంచేస్తూ జనవరి 10న సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. అంటే.. పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఖజానా నుంచి రూ.559.29 కోట్లను దోచిపెట్టడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వెల్లడవుతోంది. -
యనమల చెప్పేదేమైనా భగవద్గీతా..
సాక్షి, విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల రామకృష్ణుడు ఎవరంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన లింగమనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యనమల, లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన బొత్స సత్యనారాయణ..యనమల చెప్పేదేమైనా..భగవద్గీతా..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమంగా కట్టారని, అందుకే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇస్తామని తెలిపారు. అది మాజీ సీఎం అయినా సామాన్యుడైనా ఒకటేనన్నారు. తాము ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడటం లేదని బొత్స ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ లోకేష్, చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయంటూ బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు విద్యుత్ కోనుగోళ్ల ఎంఓయూలతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదని గుర్తు చేశారు. బాబు హయాంలో ఎప్పుడూ దోచేద్దామా అన్నట్టుగా పాలన చేశారంటూ గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. విద్యుత్ రేట్లు పెంచిన బాబు ఐదేళ్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తిని పెంచారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష, ద్వేషం లేదని, అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన సిద్ధించడం కోసమే చర్యలు తీసుకుంటున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
యనమల, జేసీ విసుర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీల్లో మంగళవారం టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ లాబీల్లో పరస్పరం ఎదురైన ఈ ఇద్దరు నేతలు మాటలు విసుసురుకున్నారు. రాయలసీమ ప్రాంతంపై కోపం తగ్గిందా అంటూ యనమలను జేసీ ప్రశ్నించారు. మీ వల్లే నష్టం జరిగిందంటూ యనమల ఘాటుగా సమాధానమివ్వడంతో జేసీ చిన్నబోయారు. కాగా, తాను పార్టీ మారతానంటూ వచ్చిన వార్తలను అంతకుముందు జేసీ దివాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఆ పార్టీ నాయకులు ప్రయత్నించడంతో తప్పేంలేదని సమర్థించారు. కాగా, ప్రతిపక్ష నాయకుడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 25 తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. (చదవండి: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం) -
‘లోకేష్‌కు ప్రకాశం బ్యారేజ్.. చంద్రబాబుకు పోలవరం’
సాక్షి, హైదరాబాద్ : ఇవ్వడం మొదలు పెడితే చంద్రబాబు కోసం పోలవరం, ఆయన పుత్రరత్నం నారాలోకేష్ కోసం ప్రకాశం బ్యారేజీ ఇవ్వమంటారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనపై చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘యనమల గారూ... మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు!’ అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. ఇక రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చంద్రబాబు రాసే తొలి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నామని, కానీ తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా? పోతుందా అనే సంశయమనం తప్ప.. ఇంకేమి లేదని విజయసాయిరెడ్డి గురువారం ఈ లేఖపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా? అనే సందేహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్‌పై యనమల ప్రెస్‌మీట్ పెట్టి మరి విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు రాసిన లేఖ మొదటిది కాదని, వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని లేఖరాసారని తెలిపారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?’ అని మరో ట్వీట్లో విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. -
టీడీపీలో యనమల వర్సస్ కుటుంబరావు
-
సీఎస్ సమీక్షలు.. యనమల వితండవాదం!
సాక్షి, అమరావతి : చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తోన్న సమీక్షలను టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే ఎల్లో మీడియాలోనూ అభ్యంతరకరంగా వార్తలు వచ్చాయి. ఇవ్వాళ మరోసారి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మీడియా ముందుకొచ్చి చీఫ్ సెక్రటరీ సమీక్షలను ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సమీక్ష చేసే అధికారమే లేదంటూ ఓ వితండ వాదం వినిపించారు. ఎన్నికల ప్రక్రియతో చీఫ్ సెక్రటరీకి అసలు సంబంధమే లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే యనమల వ్యాఖ్యలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ అధికారాలను తగ్గించే పనిలో టీడీపీ నేతలున్నారని ధ్వజమెత్తుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలతోపాటు అన్ని అంశాలపై సమీక్ష చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉందని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు కార్యనిర్వాహక విధులన్నీ చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉంటాయని, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీదేనని వారు స్పష్టం చేశారు. -
సీఎస్‌పై మంత్రి యనమల విమర్శలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సీఎస్ నియామకాన్ని, నిర్ణయాలను ఓ ప్రకటనలో ఆయన తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్ సూచనలను యనమల విభేదించారు. నిధుల సమీకరణ, విడుదలలో మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్ అని అభిప్రాయపడ్డారు. ప్రధాన కార్యదర్శి సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారని విమర్శించారు. సీఎస్ మంత్రివర్గానికి సబార్డినెట్ అని అలాంటిది ఆయన మంత్రివర్గ నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారనే వాదనను లేవనెత్తారు. కాగా ఇటీవలే ఆర్థికశాఖలోని అడ్డగోలు వ్యవహారాలపై సీఎస్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ప్రాధాన్యత క్రమం లేకుండా చెల్లింపులు చేయడంపై ఆయన...అధికారులను వివరణ కోరారు. సీఎస్ సమీక్షతో నేపథ్యంలో ఉలిక్కిపడ్డ మంత్రి యనమల ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఆర్థిక మంత్రి యనమల ఇలాకలో రిగ్గింగ్
-
యనమల ఇలాకలో రిగ్గింగ్
సాక్షి, తూర్పుగోదావరి : నేడు జరుగుతున్న పోలింగ్‌లో టీడీపీ నేతలు ఇప్పటికే దాడులు, దౌర్జన్యాలకు ఒడిగడుతుండగా.. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులే దగ్గరుండి మరీ ఓట్లు వేయిస్తున్నారు. యదేచ్చగా రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపించి టీడీపీ నాయకులు ఓట్లు వేయిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి.. యనమల అనుచరులు దగ్గరుండి మరీ ఓట్లు వేయిస్తున్నారు. ఇంత బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడినా.. అధికారులు, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రిగ్గింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
మంత్రులా.. అవినీతి జలగలా..!
సాక్షి, అమరావతి : ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాశమే హద్దుగా అవినీతికి పాల్పడుతుంటే.. మంత్రివర్గ సహచరులు నిజాయితీగా ఉంటారా? అస్సలు ఉండరు.. ఉండలేరు! అక్రమార్జనలో చంద్రబాబుతోనే పోటీపడ్డారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని బాగా ఒంటబట్టించుకున్న మంత్రులు..నిబంధనలను ఉల్లంఘించి భారీఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ ప్రజాధనాన్ని కోట్లల్లో దోచుకుంటున్నారు. అస్మదీయులకు ప్రజాధనాన్ని, ఆస్తులను దోచిపెట్టి.. కమీషన్లు దండుకున్నారు. సుపుత్రుడు మంత్రి లోకేష్ అక్రమార్జనకు అంతేలేకుండా పోయింది. జలవనరుల శాఖ మంత్రిని చూసి జలగే సిగ్గుపడుతోంది. సీనియర్ మంత్రి యనమల అవినీతిలోని తన సీనియార్టీని నిలబెట్టుకున్నారు. మంత్రి నారాయణ.. అవినీతి అనకొండగా మారిపోయారు. మంత్రి ప్రత్తిపాటి అక్రమార్జనలో తానుసైతంఘానాపాటిగాదూసుకుపోతున్నారు. మంత్రి గంటాను జనం ‘భూ చోరుడు’ని పిలుస్తున్నారంటే... ఆయన భూ దోపిడి అమరావతి నుంచి వైజాగ్ దాకా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కేఈ, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి.. తమదైన శైలిలో దోపిడీ పర్వానికి తెరదీశారు. 1. లోకేష్.. అక్రమార్జనలో తండ్రిని మించిన ఘనుడు ఆరంగేట్రం చేసిన కొద్ది రోజులకే అంటే ఏప్రిల్ 2, 2017న తనయుడు లోకేష్‌ను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఏకంగా మూడు శాఖలు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను అప్పగించారు. తండ్రి దన్నుతో అధికారాన్ని అడ్డంపెట్టుకుని లోకేశ్ అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటు పేరుతో తక్కువ ధరకే అత్యంత విలువైన భూములను కేటాయించి.. వాటిలో వాటాలతో, కమీషన్ల రూపంలో భారీగా వసూలు చేసుకున్నారు. ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం శాన్ఫ్రాన్సిస్కోలో కేవలం 10ఎకరాలలో ఉంది. విశాఖలోని మధురవాడలో సర్వే నెంబర్ 409లో 40 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించాలని లోకేశ్ చేసిన ప్రతిపాదనను ఎస్ఐపీసీ(స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) తిరస్కరించింది.. కేవలం పది ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందని అప్పటి సీఎస్ దినేష్ తేల్చి చెప్పారు. కానీ ఫ్రాంక్లిన్ సంస్థలో తన సన్నిహితుడుని వాటాదారుగా చేసిన లోకేష్.. ఎకరం రూ.10.16కోట్లు పలికే భూమిని.. రూ.32.50 లక్షల చొప్పున కేటాయించి.. రూ.400 కోట్లకుపైగా ఆ సంస్థకు లబ్ధి చేకూర్చి.. తానూ ప్రయోజనం పొందారు. విశాఖలోని మధురావడలో సర్వే నెంబర్ 409లోని 50 ఎకరాలను తన మిత్రుడికి చెందిన ఈ–సెంట్రిక్ సొల్యూషన్స్ సంస్థకు కేటాయించేలా చక్రం తిప్పారు. ఎకరా రూ.7.26 కోట్లు పలికే భూమిని రూ.50 లక్షల చొప్పున కేటాయించి.. రూ.338 కోట్లు లబ్ధి చేకూర్చి.. కమీషన్లు తీసుకున్నారు. తిరుపతికి సమీపంలో వికృతమల వద్ద ఏర్పాటు చేసిన ఈఎంసీ(ఎలక్ట్రానిక్ మ్యానుపాక్చరింగ్ క్లస్టర్స్)లోనూ 200 ఎకరాలను తక్కువ ధరలకే స్నేహితులకు కేటాయించి.. రూ.400 కోట్లకుపైగా లబ్ధి పొందారు. అధికారాంతమున రూ.15,700 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు పిలిచారు. ఒక్కో జిల్లాను ఒక యూనిట్‌గా ఈ టెండర్లు నిర్వహించారు. అంతకు ముందే నాలుగు కాంట్రాక్టు సంస్థలు మేఘా, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, ఐహెచ్పీలకు 13 జిల్లాల పనులు పంచేసి.. సగటున 4.9 శాతం ఎక్సెస్‌కు కట్టబెట్టి రూ.785 కోట్లకుపైగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. గ్రామీణ రహదారులు అభివృద్ధి చేసే పనులకు రూ.4,200 కోట్లను ఏఐఐబీ (ఆసియా మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు) సమకూర్చింది. వీటికి నిర్వహించిన టెండర్లలోనూ.. ఐదు కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కు అయి.. సగటున 4.5 శాతం అధిక ధరలకు పనులు అప్పగించి రూ.210 కోట్లకుపైగా కాజేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును బినామీ వేమూరు రవికుమార్ ప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టి రూ.రెండువేల కోట్లకుపైగా దోచుకున్నారు. కేవలం రూ.300 కోట్లతో ప్రారంభమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4234 కోట్లకు చేరడం వెనుక ఆంతర్యమిదే. 2. యనమల.. ప్రతి పనికో రేటు టీడీపీలో సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడు ఐదేళ్లుగా ఆర్థిక శాఖ.. శాసనసభ వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్నారు. అక్రమార్జనలోనూ మిగతా మంత్రులను మించిపోయారు. తన వియ్యంకుడు, మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌కు చెందిన పీఎస్కే కనష్ట్రక్షన్కు వేలాది కోట్ల రూపాయాల విలువైన పనులను సబ్ కాంట్రాక్టు కింద ఇప్పించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. పోలవరం ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను వియ్యంకుడికి నామినేషన్‌పై కట్టబెట్టేశారు. వియ్యంకుడికి మద్యం తయారు చేసే డిస్టిలరీకి లైసెన్సు ఇచ్చేలా చక్రం తిప్పి.. భారీగా ప్రయోజనం పొందారు. 3. నారాయణ.. దోపిడీ బినామీ చంద్రబాబు బినామీల్లో పొంగూరు నారాయణ అత్యంత ప్రధానమైన వారు. 2014 వరకూ తెరవెనుక రాజకీయాలు చేసే నారాయణ.. ఎమ్మెల్సీగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనకు ఏరికోరి పురపాలక శాఖను చంద్రబాబు కట్టబెట్టారు. రాజధాని ప్రాంతం ఎంపికలో కీలక భూమిక పోషించిన నారాయణ.. తక్కువ ధరకే బినామీల పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసి దోచుకున్నారు. మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లలో అమృత్ పథకం కింద చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి భారీ ఎత్తున కమీషన్లు తీసుకున్నారు. తాత్కాలిక సచివాలయం, శాసనసభ, మండలి భవనాల పనులు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి, చదరపు అడుగు రూ.2,500లతో పూర్తయ్యే పనులకు రూ.19 వేలు చొప్పున బిల్లులు చెల్లించి భారీగా ముడుపులు పిండేశారు. రహదారులు, భవనాల కోసం రూ.39వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి.. ఐదు సంస్థలకు ఆ పనులను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టి రూ.1500 కోట్లకుపైగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. చివరకు అన్నా క్యాంటీన్ల నిర్మాణంలోనూ అధికంగా బిల్లులు చెల్లించి ముడుపులు దండుకున్నారు. 4. ప్రత్తిపాటి.. అక్రమార్జనలో ఘనాపాఠి ప్రత్తిపాటి పుల్లారావు తొలి రెండున్నరేళ్లు వ్యవసాయ శాఖ..ఆ తర్వాత పౌరసరఫరాల శాఖను నిర్వహించారు. తన అనుచరుల ద్వారా తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేసి.. రైతులను దగా చేసి.. అదే రైతుల పేర్లతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే ఎక్కువ ధరకు అమ్మి రూ.200 కోట్లు దోచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలోనూ ఇది వెల్లడైంది. మార్కెటింగ్ శాఖకు చెందిన 22 మంది అధికారులను సస్పెండ్ చేసిన సర్కార్.. సూత్రధారి అయిన ప్రత్తిపాటిపై చర్యలు తీసుకోలేదు. విత్తన సంస్థలతో కుమ్మక్కైన ప్రత్తిపాటి.. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల కంటే అధిక ధరకు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి.. రైతుల నోట్లో మట్టి కొట్టి రూ.250 కోట్లకుపైగా దోచేశారు. ఆ సొమ్ముతో రాజధానిలోనూ.. అగ్రిగోల్డ్ ఆస్తులు, భూములను తక్కువ ధరలకే కాజేశారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో ప్రత్తిపాటి.. తన భార్య ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ కొనుకొల్లు ఉదయదినకర్ నుంచి సర్వే నెంబర్లు 104/1, 104/3, 104/4, 105/5, 104/6, 103/2లలో మొత్తం ఆరు ఎకరాల 19 సెంట్లు సేల్‌డీడ్ నంబర్ 423/15 తో జనవరి 19, 2015న.. ప్రగడ విజయకుమార్ నుంచి సర్వే నెంబబర్ 104/1, 104/2, 104/3 లలో మరో2.61 ఎకరాలు ఏఫ్రిల్ 17, 2015న.. సర్వే నెంబర్ 104/4లో మరో 57 సెంట్లు సర్వే నెంబర్ 101/1లో 5.44 ఎకరాలు బండ శ్రీనివాసబాబు నుంచి కాజేసి.. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూమికి సంబంధించి భార్య ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ పేరుతో నెంబర్ 246275తో టైటిల్ డీడ్.. పట్టాదారు నకిలీ పాసుపుస్తకం మంత్రి జారీ చేయించారని ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ మాజీ చైర్మన్ మల్లాది శివన్నారాయణ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో అగ్రిగోల్డ్ ఆస్తులను భారీగా కొట్టేసినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక... సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భాల్లో పేదలకు కానుకల పేరుతో నాసిరకం సరుకులను అధిక ధరలకు కొనుగోలు చేసి రూ.200 కోట్లకుపైగా దోచేశారు. 5. దేవినేని.. అవినీతి జలగ సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకోవాలన్న ముందస్తు ఎత్తుగడలో భాగంగా..తనకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమామహేశ్వరరావుకు జలవనరుల శాఖను చంద్రబాబు కట్టబెట్టారు. టెండర్ల విధానాన్ని నిర్వీర్యం చేసి.. ‘ఎంపిక’ చేసిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించడం ద్వారా చంద్రబాబు భారీగా కమీషన్లు దండుకున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల నుంచి మంత్రి దేవినేని కూడా కమీషన్లు వసూలు చేసుకున్నారు. అంతటితో సరిపుచ్చుకోకుండా.. బినామీ కాంట్రాక్టర్లను ముందుపెట్టి.. నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించి భారీఎత్తున దోచుకున్నారు. మంత్రిగా దేవినేని బాధ్యతలు స్వీకరించిన తొలిరోజుల్లోనే.. కృష్ణా డెల్టా ఆధునికకీరణ పనుల్లో గుండేరు డ్రెయిన్ ఆధునికీకరణకు మంజూరు చేసిన రూ.137.8 కోట్లలో రూ.42.79 కోట్ల విలువైన పనులను కృష్ణా డెల్టా సీఈ ద్వారా రద్దు చేయించారు. వాటితో విజయవాడలో జలవనరుల శాఖ కార్యాలయం ఆవరణలో తన క్యాంపు కార్యాలయం, గ్రావెల్ పాత్ నిర్మాణ పనులను తన బినామీ అయిన సూర్య కన్స్ట్రక్షన్స్కు నామినేషన్ పద్ధతిలో అప్పగించేశారు. క్యాంపు కార్యాలయంలో బెడ్ లాక్స్‌తో గ్రావెల్ పాత్(నడక దారి) నిర్మాణానికి మొదట్లో రూ.3,78,56,426లు అంచనా అవుతుందని కేడీఎస్ అధికారులు లెక్క కట్టారు. అదే ధరకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కానీ, ఆ తర్వాత నడక దారికి రూ.7,01,00,000 కోట్లు బిల్లులు దక్కించుకున్నారు. కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువున, దిగువున రూ. 167.51 కోట్ల విలువైన ఘాట్ల నిర్మాణ పనులను బినామీ కాంట్రాక్టర్లు అయిన సూర్య, సోమా సంస్థలకు కట్టబెట్టి.. బిల్లులు చేసుకున్నారు. పోలవరం ఎడమ కాలువలో ఒకటో ప్యాకేజీ మిగిలిపోయిన రూ.38.78కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.171.39 కోట్లకు పెంచేసి బినామీ అయిన సూర్య కన్స్ట్రక్షన్స్కు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేసి.. రూ.132.61 కోట్ల మేర దోచుకున్నారు. ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో 469 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు రూ.6934.49 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. అధిక శాతం పనులు చేయకుండా చేసినట్లు చూపి కాంట్రాక్టర్లతో కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో 22 ఎత్తిపోతల పథకాల పనులను నాసిరకంగా చేసి రూ.35 కోట్లకుపైగా లూటీ చేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అవుకు సొరంగంలో మిగిలిపోయిన పనులను బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, ఉమా దోచుకుంటుండటాన్ని టీడీపీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జూలై 31, 2015న.. హైపవర్ కమిటీ సభ్యుడైన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌కు లేఖ రాయడం గమనార్హం. 6. అచ్చెన్న.. అచ్చెరువొందేలా దోపిడీ కింజారపు అచ్చెన్నాయుడు తొలి రెండున్నరేళ్లు కార్మికశాఖను.. ఆ తర్వాత బీసీ సంక్షేమం, రవాణా, జౌళి శాఖలను నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రహదారులు దగ్గర నుంచి పాఠశాల భవనాల వరకూ.. నీరు–చెట్టు పథకం పనుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణం దాకా.. సింహభాగం పనులు తన సోదరుడు హరివరప్రసాద్‌కు చెందిన సురేష్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు కాంట్రాక్టు దక్కేలా చేసి.. నాసిరకంగా పనులు చేసి వందల కోట్లు కాజేశారు. మంత్రి సోదరుడి సంస్థ చేసిన పనుల్లో నాణ్యత లేదంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సర్కార్‌కు నివేదికలు ఇచ్చినా వాటిని చంద్రబాబు తొక్కిపెట్టారు.. ప్రభుత్వ పాఠశాలలు.. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫారంలు ఇచ్చేందుకు అవసరమైన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని సర్కార్ జారీ చేసిన ఆదేశాలను సాకుగా తీసుకున్నారు. చేనేత సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాసిరకం వస్త్రాలను కొనుగోలు చేసేలా చక్రం తిప్పి భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నారు. తద్వారా నేతన్నల కడుపు కొట్టారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణం, సరుకుల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడి ముడుపులు వసూలు చేసుకున్నారు. 7. గంటా.. భూ చోరుడు మానవనరుల శాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అధికారాన్ని అడ్డంపెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. విశాఖలో.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న భీమిలిలో తన తోడల్లుడు పరుచూరు భాస్కర్‌రావుతో కలిసి భారీ ఎత్తున భూములను కబ్జా చేశారు. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ను అడ్డం పెట్టుకుని పెందుర్తిలో బినామీ పేర్లతో తక్కువ ధరకే పేదల నుంచి 358.47 ఎకరాల అసైన్డు భూమి కాజేశారు. ఈ భూములను ల్యాండ్ పూలింగ్ కింద వుడాకు ఇచ్చి రూ.644.4 కోట్లు సొమ్ము చేసుకోవడానికి ఎత్తు వేశారు. రైతులకు మాత్రం ఎకరాకు రూ.2నుంచి 12 లక్షలే ఇచ్చారు. ఈ వ్యవహారంలో రూ.604.4కోట్లకుపైగా దోచేసే ఎత్తును మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే బహిర్గతం చేయడం గమనార్హం. రాజధాని ప్రాంతంలోనూ పరుచూరు భాస్కర్‌రావును ముందు పెట్టి తక్కువ ధరలకు అసైన్డు, లంక భూములను భారీ ఎత్తున కొనుగోలు చేసి.. వాటిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు అప్పగించి భారీగా లబ్ధి పొందారు. చివరకు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్లర్ల నియామకం నుంచి డీఈవో.. ఆర్జేడీలు, జేడీలు, ఉపాధ్యాయుల బదిలీల వరకూ భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను అధికారాంతమున రూ.4,800 కోట్లకు ఐదు శాతం ఎక్సెస్‌కు ఆరు సంస్థలను హైబ్రిడ్ యాన్యుటి పద్దతిలో కట్టబెట్టి రూ.500 కోట్లకుపైగా దోచేశారు. 8. గుడిని, లింగాన్ని కేఈ మింగేశారు టీడీపీలో అత్యంత సీనియర్ అయిన కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి హోదాను దక్కించుకున్నారు. రెవెన్యూ.. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. అక్రమార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ పరిధిలోని.. తుంగభద్ర నదిని తన తనయుడు కేఈ శ్యాంబాబుతో కబ్జా చేయించి.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి.. హైదరాబాద్‌కు తరలించి భారీ ఎత్తున దోచుకున్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టు చీవాట్లు పెట్టినా కేఈ వెనక్కు తగ్గలేదు. తిరుపతికి సమీపంలో సుమారు రూ.160 కోట్ల విలువైన 16 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని.. అది చెరువు భూమి కాదని.. దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసి.. భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. అధికారాంతమున వివిధ దేవాలయాలకు చెందిన 30 వేల ఎకరాల భూములను కేవలం మూణ్నెల్లలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నంలో భారీగా ముడపులు వసూలు దండుకున్నారు. విశాఖపట్నంలో సంపత్ వినాయక స్వామి దేవాలయానికి ఏడాదికి రూ.2.50 కోట్ల చొప్పున హుండీ ద్వారా ఆదాయం వస్తుంది.. ఇదే ఆలయానికి రూ.వంద కోట్ల ఆస్తి ఉంది. ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నుంచి తప్పించి, ఒక వ్యక్తికి అప్పగించి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. ఇదే పద్ధతిలో సుమారు 30 దేవాయాలను ప్రైవేటు వ్యక్తులకు స్వాధీనం చేసి.. భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకున్నారు. 9. సోమిరెడ్డి.. కమీషన్ల మినిస్టర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు.. ఏప్రిల్ 2, 2017న మంత్రివర్గంలోకి తీసుకుని.. వ్యవసాయశాఖను అప్పగించారు. నెల్లూరు జిల్లా గూడురు ప్రాంతంలో సిలికా స్మగ్లర్లతో చేతులు కలిపిన సోమిరెడ్డి.. భారీగా సిలికాను కొల్లగొట్టి చెన్నై, బెంగుళూరుల్లోని గ్లాస్ ఇండస్ట్రీలకు విక్రయించి వందల కోట్లు కొల్లగొట్టారు. సాగునీటి పనుల దగ్గర నుంచి విద్యుదుత్పత్తి సంస్థల్లో పనుల వరకూ.. అన్నింటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి పర్శంటేజీలు దండుకున్నారు. ముత్తుకూరు వద్ద జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ విస్తరణ పనులలో యాష్ పాండ్ నిర్మాణ వ్యయాన్ని రూ.23 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు పెంచేయించి కమీషన్లు దండుకున్నారు. విత్తన సరఫరా సంస్థలతో కుమ్మక్కై మార్కెట్లో ధర కంటే అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేశారు. వాటినే రైతులకు పంపిణీ చేసి.. రాయితీ నిధులను దక్కకుండా చేసి వందలాది కోట్ల రూపాయలను కమీషన్లుగా వసూలు చేసుకున్నారు. 10. ఆదినారాయణరెడ్డి.. లంచావతారం చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి.. జమ్ములమడుగు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. ఏప్రిల్ 2, 2017న ఆయన్ని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుని పశుసంవర్ధక, మార్కెటింగ్, సహకార శాఖలను కట్టబెట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక మేరకు పత్తి కొనుగోళ్ల కుంభకోణానికి పాల్పడిన 45 మంది ఉద్యోగులను గతంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా.... మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే వారి నుంచి ముడుపులు తీసుకుని సస్పెన్షన్ ఎత్తివేశారు. దళారీల ద్వారా కంది, పప్పుశనగ, వరి, పెసర, మినుములు వాటిని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి.. కనీస మద్దతు ధరకు కొన్నట్లు చూపి వందల కోట్లు దోచేశారు. పశువుల ఆస్పత్రులకు మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు! -
పచ్చదండు..గోదారి దోపిడి
సాక్షి, కాకినాడ : ఇసుక అక్రమార్కుల దాహానికి గోదావరి, తాండవ నదుల గర్భాలు గుల్ల అయిపోయాయి. ఉచితం ముసుగులో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. నదులు, వాగుల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక స్వాహా జరిగింది. వరదలతో వేసిన మేటలను తొలగించేందుకని జిరాయితీ భూముల పేరుతో అనుమతులు తీసుకుని ఇసుకను దోచేశారు. మాన్సాస్ ట్రస్టు భూముల అనుమతుల ముసుగులో ఎక్కడికక్కడ ఇసుకను తోడేశారు. ఈ క్రమంలో కాలువలను, సమాధులను సైతం తవ్వేశారు. ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కల్పతరువుగా తయారైంది. రేవుల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అడ్డూఅదుపూ లేకుండా అనధికార ర్యాంపులు అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో 38 రేవులతో పాటు అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసుకుని స్వాహాకు పాల్పడ్డారు. ఎక్కడ ఇసుక కనబడితే అక్కడే తవ్వేశారు. రూ.3 వేల కోట్లకు పైగా దోపిడీ చేశారు. అధికారం అండతో అనుమతులు తెప్పించుకుని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ర్యాంపుల నిర్వహణ ముసుగులో అధికార పార్టీ నేతలు రూ.కోట్లకు పడగలెత్తారు. గోదావరి పాయలు న్న ప్రతిచోటా దర్జాగా తవ్వేశారు. ఇష్టారీతిన బాటలు వేసి అమ్ముకున్నారు. మాన్సాస్ భూములని కొన్నిచోట్ల, జిరాయితీ భూములని మరి కొన్ని చోట్ల చూపించి, అనుమతులు తెప్పించుకుని రాత్రి పగలనే తేడా లేకుండా పొక్లైన్లతో తవ్వించి, లారీలు, కంటైనర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు. ఇసుక లారీలు, ఇతర వాహనాలు వెళ్లే గ్రామాల్లో రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. ఆ వాహనాల జోరు ప్రమాదాలకు కారణమై ప్రాణాలను బలిగొన్న ఘటనలూ ఉన్నాయి. ఇళ్లు కట్టుకుందామనుకునే సామాన్యులకు ఇసుక అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. సామాన్యులు కొనలేని విధంగా అనధికారికంగా ఇసుక ధరలను పెంచేశారు. ఇసుక దోపిడీలో కీలక పాత్రధారి పెందుర్తి సీతానగరం మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో సాం్థనిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రధానపాత్ర పోషించారన్నది అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల అనంతరం మొదట సింగవరం ర్యాంపు నుంచి అత్యధికంగా ఇసుకను లారీలపై తరలించేవారు. అందులో రూ.110 కోట్లు పైగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాటవరం పంపింగ్ స్కీమ్ వద్ద గోదావరి వరదతో ఇసుక మేటలు వేయడంతో స్కీమ్ పనిచేసేలా తవ్వకాలు అని చెప్పి అనుమతులు తీసుకుని, దానిని ఎమ్మెల్యే తన బినామీలకు అప్పగిండం ద్వారా సుమారు రూ.80 కోట్లు వరకు జేబులో వేసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాటవరం ర్యాంపు నుంచి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే మునికూడలి, రఘుదేవపురం ర్యాంపుల నుంచి ఇప్పటికీ ఇసుకను తరలిస్తునే ఉన్నారు. వీటి ద్వారా ఎమ్మెల్యేకి కోట్లాది రూపాయలు ముడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. హోం మంత్రి అనుచరుడి దందా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు, గంగవరం మండలం కోటిపల్లి గ్రామాల మధ్య ఉన్న గౌతమీ నదీ పరీవాహకాన్ని ఆనుకుని ఉన్న మాన్సాస్ ట్రస్టు భూముల్లో కూడా ఇసుక మేటలను తొలగిస్తామని అనుమతులు తీసుకుని హోంమంత్రి అనుచరుడు ఏకంగా రోజుకి రూ. 50 లక్షల ఇసుకను దోచుకున్నాడు. వశిష్ట గోదావరిని గుల్ల చేసేసి ఇసుకను తోడేశారు. వ్యవసాయ భూముల మేటల తొలగింపునకని, ప్రైవేటు కంపెనీల నిర్మాణాలకని నదీ గర్భాన్ని కబ్జా చేసేశారు. రోజుకి రూ.15 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు దోచేసి, నెలనెలా కోట్లు గడించారు. దాట్ల సోదరుడి కనుసన్నల్లో .. ముమ్మిడివరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుచ్చిబాబు సోదరుడు పృథ్వీ ఆశీస్సులతో గౌతమి, వృద్ధ గౌతమీ నదిపాయలను గుల్ల చేసేస్తున్నారు. రోజుకు వేలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేశారు. నాలుగున్నరేళ్లుగా రూ.50 కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అలాగే పిల్లంక, పల్లవారిపాలెం, అన్నంపల్లి, ఎదుర్లుంక, కేశనకుర్రు పశువుల్లంక ఇసుక ర్యాంపుల్లో అన«ధికార రవాణా కొనసాగింది. నియోజక వర్గానికి ఆనుకుని ఉన్న పాండిచ్చేరి పరిధిలోని యానాం అక్రమార్కులకు అడ్డాగా నిలిచింది. యానాంలో అధికారులకు ఇసుక రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఇసుక మాఫియా రాజ్యమేలింది.ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో పది అనధికార రీచ్లద్వారా కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా తరలించుకు పోయారు. బోడసకుర్రు రేవులో తెలుగుతమ్ముళ్ల అక్రమ తవ్వకాలు మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును అధికారికంగా ఒకసారి, అనధికారికంగా రెండవసారి తెరిపించి టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీ చేశారు. అధికారిక అనుమతి లేకున్నా అధికారపార్టీ మద్దతుదారుడు, ఎమ్మెల్యే ఆనందరావుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఆధ్వర్యంలో ఇసుక దందా జరిగింది. వాకలగరువు, దొడ్డవరం గ్రామాల మధ్య ఉన్న ఇసుక మేటలను పడవల ద్వారా తరలించి అమ్ముకున్నారు. బోడసకుర్రు బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరపరాదన్న నిబంధనను సైతం ఉల్లంఘించారు. పొక్లెయిన్ల సహాయంతో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల బ్రిడ్జికి పెను ముప్పు ఏర్పడింది. ఓడలరేవు తీరాన్ని ఇష్టానుసారం తవ్వేశారు. కొమరిగిరపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆరు ఎకరాల భూమిని సాగుకు యోగ్యంగా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం, అందుకు మైనింగ్ కార్పోరేషన్ అనుమతి ఇవ్వడంతో అవినీతి దందాకు తెరదీశారు. దీనిని అడ్డుగా పెట్టుకుని అందుకు వందరెట్లు ఇసుక తవ్వకాలు చేశారు. యూనిట్ ఇసుకకు బాట చార్జీలు రూ. 100 లోడింగ్ చేసే కూలీల చార్జీలు రూ. 200 ఉచిత ఇసుక విధాన నిబంధనలివి. ఈ మొత్తాన్ని చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు ఉచితం కాక ముందు ట్రాక్టర్ ఇసుక ధర- రూ. 1000 నుంచి రూ.1200 ఉచితం అని ప్రకటించాక - రూ.2000 నుంచి రూ.2500 ఉచితానికి ముందు లారీ ఇసుక ధర - రూ. 3 వేలు ఉచితం అన్నాక - రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఇదీ చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ విధానంతో దాపురించిన వైపరీత్యం నడిగాడిలో లోకేష్ ర్యాంపు! ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో వశిష్టా గోదావరి నదిలో రేయింబవళ్లు యథేచ్ఛగా డ్రెడ్జర్లతో ఇసుకను తోడేశారు. మంత్రి లోకేష్ ర్యాంపుగా చెప్పుకొనే ఎల్.గన్నవరం శివారు నడిగాడి నుంచి పశ్చిమ జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంక వరకూ సుమారు కిలో మీటరు పొడవునా 20 నుంచి 25 అడుగుల లోతున అక్రమ తవ్వకాలు సాగించారు. ఒడ్డుకు బోట్లు ద్వారా ఇసుకను తెచ్చి అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా స్టాక్ పాయింట్ల వద్దకు తరలించి అమ్ముకున్నారు. ఇక్కడ ఇసుక సొమ్ము అంతా మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లిందని టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. అయినవిల్లి, కె.గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి బాగ, పురుగులంకలో మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక, మట్టి దోచుకున్నారు. ఇక్కడ తవ్వకాల వలన పంట భూములు కోతకు గురై నదీగర్భంలో కలిసిపోయాయి. కోతకు నిరోధానికి నిర్మించిన గ్రోయిన్లు కూడా పాడైపోతున్నాయి. కాకినాడలో లారీ ఇసుక రూ.15 వేలు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమని ఆర్భాటంగా ప్రకటించినా టీడీపీ నాయకులుఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. రాత్రివేళల్లో వివిధ ప్రాంతాల్లోని ర్యాంపుల నుంచి ఇసుక లారీలపై ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నారు. పగలు ఇసుక కావల్సిన వారికి అధిక రేట్లుకు విక్రయిస్తున్నారు. ముందుకు చెప్పిన వారికి ఒక రేటు, అర్జంటుగా ఇసుక కావాలంటే ఒక రేటు వసూలు చేస్తున్నారు. ఒక లారీ ఇసుక కావాలంటే రూ. 15 వేలు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ ఇసుక రూ. 5 నుంచి 6 వేలు లోపు ఉండేది. ఇసుకలోనూ కల్తీ పిఠాపురం: టీడీపీ నేతలు నియోజకవర్గంలో ఏలేరు, ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. ఉచిత ఇసుక పేరిట లారీల కొద్దీ ఇసుకను అక్రమంగా రవాణా చేశారు. దొరికిన చోటల్లా వందల యూనిట్ల ఇసుకను తవ్వి భారీ మొత్తంలో నిల్వ చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద వందలాది యూనిట్ల ఇసుకను నిల్వ చేశారు. లారీ ఓనర్లు, వ్యాపారులు కుమ్మక్కై ఇసుక కృతిమ కొరత సృష్టించి రెట్టింపు రేటుకు విక్రయించారు. మూడు యూనిట్ల లారీ ఇసుకను రూ.11 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించారు. గోదావరి ఇసుకతో పాటు గొర్రిఖండి, ఏలేరు ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను తీర ప్రాంతంలో లభించే బొండు మట్టిని కలిపి గోదావరి ఇసుకగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను కూడా కల్తీ చేసిన వారిపై అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కోతకు గురైన పంటభూములు తుని: పంట పొలాలకు నీరు అందించే తాండవ నదిని ఇసుక కోసం తెలుగు తమ్ముళ్లు కబళించారు. ఉచిత ఇసుక జీవో అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ఐదేళ్ల క్రితం ట్రాక్టర్ ఇసుక రూ.800 ఉంటే ప్రస్తుతం రూ.2500కు చేరింది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడి అండదండలు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడి ఆశీస్సులు ఇసుక మాఫియాకు దండిగా ఉన్నాయి. కోటనందూరు నుంచి తుని వరకు ఎక్కడ పడితే అక్కడ అనధికారిక ర్యాంపులను తెరిచారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇసుక తవ్వకాలతో పంటభూములు కోతకు గురయ్యాయి. ఒక అంచనా ప్రకారం ఇసుక రూపంలో ఐదేళ్లలో రూ.20 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇదే సొమ్మును ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ఉపయోగిస్తున్నారు. అయితే తాండవ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న రైతులు తమకు జరిగిన నష్టానికి ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని బహిరంగంగానే అంటున్నారు. తాండవలో యనమల సోదరుడి దందా మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడి ఆశీస్సులతో తాండవ నదిని గుల్ల చేసేశారు. ఐదేళ్లలో రూ.వంద కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. విశాఖ జిల్లా నాతవరం మండలం నుంచి పెంటకోట వరకు తాండవ నది 45 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపారు. కోటనందూరు, బొద్దవరం, తుని మండలం కొలిమేరు, డి.పోలవరం ప్రాంతాల్లో అనధికారికంగా ర్యాంపులు నిర్వహించారు. నదీ పరీవాహక ప్రాంతంలోని పంట భూముల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని కోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. పూర్తిగా తవ్వేసి, ఇసుకను తీసేస్తుండటంతో భూగర్బ జలాలు తరిగి పక్కనున్న పంట భూముల బోర్లు సైతం పనిచేయడం లేదు. తుని మండలం డి.పోలవరంలో తాండవ నదిలో జరుగుతున్న తవ్వకాల వలన రైతులు భూములు కోల్పోతున్నారని తెలుసుకుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వెళితే పోలీసులతో కేసులు కూడా పెట్టించారు. గోరంట్ల, ఆదిరెడ్డి పోటాపోటీ ర్యాంపులు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గపరిధిలో ధవళేశ్వరంలో గాయత్రి ఇసుక ర్యాంపు 1, 2, కేతావారిలంక ఇసుక ర్యాంపులలో లారీకి రూ.200 కప్పం కట్టాల్సిందే. ఈ లెక్కన రోజుకు రూ.లక్షన్నర చొప్పున ఎమ్మెల్యేకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రధాన అనుచరుడు, నగరపాలకసంస్థలో ముఖ్యనేత వసూలు చేసేవాడు. అంతేకాక కుమారి« థియేటర్ ర్యాంపు గురించి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ సరిహద్దు తమదంటే తమదని వాదులాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాతేరుర్యాంపు ఎస్సీ సొసైటీ తరఫున ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా పేరుకు వారిదే అయినా గోరంట్ల అనుచరుడైన కార్పొరేటర్ ర్యాంపును నిర్వహించారు. కడియం మండలంలోని కడియపులంక–వేమగిరి ర్యాంపులో ఉచిత ఇసుక అమలు కావడానికి ముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది. అప్పుడు దాదాపు రూ.2.61 కోట్ల ఇసుక పక్కదారి పట్టినట్లుగా విజిలెన్స్ దాడుల్లో తేలింది. రూరల్ ఎమ్మెల్యే గోరంటకు పోటీగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూడా ఇసుక దందా మొదలు పెట్టారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గం ధవళేశ్వరం వద్ద తన అనుచరులతో ప్రత్యేకంగా ఇసుక ర్యాంపునే సిద్ధం చేసుకున్నారు. నిత్యం కోట్లాది రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. రోజుకు 300 ట్రక్కుల తవ్వకం రాజోలు: రాజోలు నియోజకవర్గంలో టీడీపీ వారు ‘దొరికినంత తవ్వుకో..అయినకాడికి దోచుకో’ అన్న రీతిలో అక్రమ సంపాదనకు తెరతీశారు. గోదావరి ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. రాజోలు మండలం సోంపల్లి, మలికిపురం మండలం రామరాజులంక, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. పేరుకు ఉచితం అయినా రవాణా చార్జీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో రీచ్ నుంచి రోజుకు దాదాపు 100 ట్రక్కుల ఇసుక తరలిపోతోంది. ప్రభుత్వం చేపట్టిన పనులకు, హౌసింగ్ స్కీంలకు మాత్రమే ఇసుక తరలించాల్సి ఉండగా ఆ ముసుగులో ప్రైవేటు పనులకు కేటాయిస్తున్నారు. వారధికి చేరువలోనే.. అల్లవరం (అమలాపురం): అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును ఎలాంటి అనుమతులు లేకుండానే తెరిచి వందలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు బ్రిడ్జిని ఆనుకుని అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో ఇసుక ర్యాంపు నిర్వహించారు. బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరపరాదన్న నిబంధనను ఉల్లంఘించారు. పొక్లెయిన్లతో ఇసుక తవ్వడం వల్ల బ్రిడ్జికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినా తెలుగు తమ్ముళ్లు ఖాతరు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగాయి. -
ఒకే పార్టీ.. ఇద్దరు స్పీకర్లు
సాక్షి, అమరావతి : ఒకే పార్టీ నుంచి అటు పార్లమెంట్లోను, ఇటు అసెంబ్లీలోను ఒకే పార్టీ నుంచి ఎన్నికైన వారు స్పీకర్లుగా వ్యవహరించిన అరుదైన సందర్భం ఇది. తుని ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు 1995–99 వరకూ అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ రామకృష్ణుడే స్పీకర్ కావటం విశేషం. 1998లో ఎంపీగా ఎన్నికైన గంటి మోహనచంద్ర బాలయోగి అదే ఏడాది మార్చి 24న లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. భారత పార్లమెంటులో తొలి దళిత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2002 మార్చి 3న భీమవరం నుంచి ఢిల్లీకి హెలికాప్టర్లో వెళ్తూ కృష్ణా జిల్లా వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి మృత్యువాతపడ్డారు. నాయకుల తల్లి కొత్తపల్లి స్వాతంత్య్ర సమరయోధులు, చరిత్రకారులు, రాజ వంశీయుల పుట్టినిల్లుగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి ప్రసిద్ధి. గతంలో మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో పిఠాపురం తాలూకా ఐదు వేల జనాభాతో అతిపెద్ద గ్రామంగా విరాజిల్లింది. అంతేకాక, దివ్య క్షేత్రంగా, కళా కేంద్రంగా, సంస్కతీ సంప్రదాయాలకు నిలయంగా, సాహితీ మందిరంగా, రాజకీయ చైతన్యానికి ఆనవాలుగా చరిత్రలో కీర్తింపబడింది. స్వాతంత్య్ర సమరయోధులు కొత్తపల్లి రావు అచ్చియ్యరావు, పుత్సల సత్యనారాయణ, రావు వెంకట జగ్గారావు, అల్లిక సన్యాసయ్య, జ్యోతుల కాశీస్వామి, జ్యోతుల శేషయ్య, చిట్టాడ చిన్న ముత్యాలు వంటి వారు కొత్తపల్లిలో జన్మించి దేశ అభ్యుదయానికి కృషిచేశారు. అలాగే, మహాత్మగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహానేతలు కూడా కొత్తపల్లికి వచ్చి సందేశాలను అందజేసి ప్రజలను ఉత్తేజ పర్చారు. అటువంటి కొత్తపల్లి ఫిర్కా, కొండెవరంలో కాకినాడ ఎంపీగా పని చేసిన చెలికాని వెంకట రామారావు, పిఠాపురం తొలి ఎమ్మెల్యేగా పని చేసిన రావు వెంకట జగ్గారావులు జన్మించారు. అలాగే అభ్యుదయ రాజకీయ నాయకుడు సంపర మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ వెంకటరత్నం కూడా కొండెవరంలోనే జన్మించారు. వీరంతా తమ ఆస్తులను అమ్మి ప్రజా సంక్షేమానికి కృషిచేశారు. స్వలాభాపేక్ష లేకుండా పాలించారనడానికి సాక్ష్యాలుగా కొండెవరంలో వారి గృహాలు ఇప్పటికి వారి బీదరికాన్ని గుర్తుకు తెస్తున్నాయి. – వీఎస్ వీఎస్ వరప్రసాద్, పిఠాపురం, తూర్పుగోదావరిజిల్లా -
ఇసుక తోడేళ్లండీ... ఓటేద్దామా చెప్పండీ..!
సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక ఉచితం అనగానే చాలా బాగుందని అనుకున్నారంతా... కానీ ఆ ‘ఉచితం’ టీడీపీ నేతలకనే విషయం అర్థమైన జనం నివ్వెరపోయారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధుల ‘నిధులు’ సంపాదనకు పెద్దపీట వేయడమే కాకుండా తమ అనుచరులకూ చోటు కల్పించడంతో విలువైన సంపదంతా దోపిడీకి గురవుతోంది. కోట్ల రూపాయల విలువైన ఇసుకను వందలాది ట్రాక్టర్లతో తోడేస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. తుని: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన అమాత్యులు సహజ సంపదను అనుచరులు కొల్లగొడుతున్నా అడ్డుకట్ట వేయకపోగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తాండవ నదిలో టన్నుల కొద్దీ ఇసుకను అడ్డదారుల్లో విక్రయించేసి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడి ఇలాకాలో సోదరుడు యనమల కృష్ణుడు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ నదీమతల్లిని నిలువెల్లా చెరిచేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక తాండవనదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి సుమారు రూ.200 కోట్లు అక్రమార్జన చేశారు. ఇప్పుడు అదే నాయకుడు తుని నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అన్న అండదండలతో ఇసుక మాఫియాను నడపించిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటే ప్రజలకు భరోసా ఎక్కడ ఉంటుందని రాజకీయ విశ్లేషుకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘నేను మరాను, మీకు అండగా’ ఉంటానని చెబుతున్నారు. ఐదేళ్లగాలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వని నాయకులు మేలు చేస్తామని వాగ్దానాలు చేస్తుంటే జనం నివ్వెరబోతున్నారు. వందల కోట్లు ఆర్జన... విశాఖ జిల్లా నాతవరం మండలంలో తాండవ ప్రాజెక్టు ఉంది. తూర్పు, విశాఖ జిల్లాలో పరిధిలో సుమారు 55 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. నాతవరం నుంచి పెంటకోట వరకు సుమారు 45 కిలోమీటర్లు మేర తాండవ నరదీ పరీవాహక ప్రాంతం ఉంది. ప్రాజెక్టు నుంచి అదనపు జలాలు సముద్రంలోకి నది ద్వారా వెళతాయి. వరద నీటికి నదిలో వేల క్యూబిక్ మీటర్లు ఇసుక నిల్వలు చేరతాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు తాండవ ఇసుకపై కన్ను వేశారు. చేతిలో అధికార మంత్రదండం ఉండడంతో కోటనందూరు నుంచి తుని వరకు అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరిపారు. రోజుకు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు రవాణా చేశారు. ఐదేళ్ల వ్యవధిలో వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను రూపాయి పెట్టుబడి లేకుండా అమ్ముకున్నారు. సగటున రోజుకు 100 లారీలు, 200 ట్రాక్టర్లు ఇసుకను తరలించారు. లారీకు రూ.5వేలు, ట్రాక్టర్‌కు రూ.1000లు చొప్పున వసూలు చేశారు. ఇందులో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా సొమ్ములు వసూలు చేయించారు. ఎక్కడా అధికార పార్టీ కీలకనేత పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నదిలో కలిసి పోయిన రైతుల భూములు... నదిలో ఇష్టారాజ్యంగా యంత్రాలతో తవ్వకాలు జరపడంతో నదీ గమనం మారిపోయింది. నదికి ఇరు వైపులా పంట భూములు నదిలో కలిసి పోయాయి. కోటనందూరు నుంచి తుని వరకు వందల ఎకరాల భూమిని రైతులు కోల్పోయారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి ఉంది. వ్యవసాయం చేసుకునే అవకాశం లేదు. ఇరిగేషన్ అధికారులు నది విస్తీర్ణం (వెడల్పు) ఎంతో ఇప్పటికీ తేల్చలేదు. నదిలో ఉన్న ఇసుక అయిపోవడంతో సమీపంలో ఉన్న పంట భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇసుక మాఫియా ధాటికి వ్యవసాయ బోర్లు కూడా నిరుపయోగమయ్యాయి. స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు. సార్వత్రిక ఎన్నికల బరిలో అధికార పార్టీ తరఫున యనమల కృష్ణుడు పోటీలో నిలవడంతో ఇసుక మాఫియా ప్రభావం ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతుల పక్షాన ఎమ్మెల్యే రాజా పోరాటం... ఇసుక మాఫియా ఆగడాలను భరించలేక సంబంధిత రైతులు, బాధితులు ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజాను ఆశ్రయించారు. రైతుల భూముల్లో తవ్వకాలు చేయడంపై ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజాపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో పోలీసులు కేసులు పెట్టారు. 2015లో తుని మండలం డి.పోలవరంలో ఏకంగా ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు బనాయించారు. ఇదే రీతిలో ఇసుక తవ్వకాలపై పోరాటం చేసినా పలువురు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టారు. పంట భూమి నదిలో కలసిపోయింది నాకు కోటనందూరులో తాండవ నదిని ఆనుకొని రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇసుక తవ్వకాలతో తాండవ నది గట్టుతోపాటు నా పొలం కూడా నదీ గర్భంలో కలిసిపోయింది. ఇసుకను తవ్వవద్దని చెప్పినా పట్టించుకోవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే రెండు, మూడు రోజులు ఆపి మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇలా నాలుగేళ్లుగా సాగుతోంది. పెద్ద వర్షాలు వస్తే నా పొలం చాలా వరకూ నదిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. – అల్లూరి రాజు, రైతు, కాకరాపల్లి ఇసుక మాఫియా జులుం తాండవ నదిలో ఇసుక తోలకాలతో గట్టు కోతకు గురై పొలాలు ఏటిలో కలసిపోతున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా అవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. నదిలో ఎక్కడికక్కడ పెద్దపెద్ద గోతులు పెట్టేశారు. భవిష్యత్తులో ఏరు భారీగా వస్తే వ్యవసాయ మకాంలకు వెళ్లేందుకు ఏరు దాటేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంతటి దారుణాన్ని మునుపెన్నడూ చూడలేదు. – ఆళ్ల అప్పారావు, రైతు, బొద్దవరం శ్మశానాలనూ వదలలేదు ఇసుక అక్రమార్కులు తాండవ నది ఒడ్డులు, నీటి అడుగు భాగం, చివరకు శ్మశానాలను సైతం వదలలేదు. వేల లారీల ఇసుకను దూర ప్రాంతాలకు తరలించేశారు. ఇంతటి అక్రమాలు జరుగుతున్నా స్థానికులకు మాత్రం ఇసుక కొరత ఉంది. ఇసుక అక్రమాలను ఎవరూ అడ్డుకోలేకపోయారు. అధికారులు, పాలకులే ఇసుక అక్రమాలను ప్రోత్సహించారు. –చింతకాయల సన్యాసిపాత్రుడు, రైతు, అల్లిపూడి కోతకు గురవుతున్న భూములు... విచ్చల విడిగా ఇసుక తవ్వకాలతో విలువైన పంట భూములు తాండవ నదిలో కలసిపోతున్నాయి. నది లోతు పెరిగిపోయింది. భూగర్భ జలాలు క్షీణించి బోరుబావులు పని చేయడంలేదు. 200 అడుగుల వరకూ కొత్త బోరులను తవ్వించాల్సి వస్తుంది. – చిటెకల వరహాలబాబు, రైతు, డి.పోలవరం -
రాజా వర్సెస్ కృష్ణుడు
తూర్పు గోదావరి జిల్లాకు తూర్పు ముఖ ద్వారం లాంటి తునిలో తొలుత రాజరిక వ్యవస్థ ప్రాబల్యం చూపినా క్రమేపీ రాజకీయం సామాన్యుడి చేతుల్లోకి వచ్చింది. నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మజిలీలు కనిపిస్తాయి. తుని పేరు తలుచుకోగానే గుర్తుకొచ్చేది తలుపులమ్మలోవ. పూర్వం తలుపులమ్మలోవకి వెళ్లడం అంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత గొప్పగా భావించేవారు. ఈ లోయలో ఒక జలపాతం ఉంది. గతంలో అందులో నీళ్లు కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉండేవంటారు. ఎన్నికల ప్రచారం నుంచి రాష్ట్ర స్థాయిలో పలు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. తుని ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తారు. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ కాంగ్రెస్, టీడీపీ కోటలో వైఎస్సార్సీపీ పాగా తుని నియోజకవర్గానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో రాజా వి.వి.కె. బహుదూర్ (బుల్లిబాబు) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో రాజా వి.వి.కె. బహుదూర్ (బుల్లిబాబు) కుమార్తె ఎం ఎన్. విజయలక్ష్మిదేవి విజయం సాధించి తుని తొలి మహిళా శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1978లో రెండోసారి గెలిచిన విజయలక్ష్మిదేవి 1981లో టి.అంజయ్య క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి 1982 వరకు తునిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే శాసన సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. రాజా వి.వి.కె. బహుదూర్ (బుల్లిబాబు) కుటుంబానికి చెందిన వారే ఇక్కడి నుంచి ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించారు. అనంతరం టీడీపీ అవిర్భావంతో బీసీ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు రాజ కుటుంబాన్ని ఓడించి శాసన సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2009లో జరిగిన ఎన్నికల్లో యనమల రామకృష్ణుడిపై రాజా ఆశోక్‌బాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆరు పర్యాయాలు గెలిచిన యనమల రికార్డుకు తెర పడింది. 2014 ఎన్నికల్లో యనమల తన సోదరుడు కృష్ణుడ్ని రంగంలోకి దించినా ఫలితం దక్కలేదు. కృష్ణుడిపై వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన దాడిశెట్టి రాజా విజయం సాధించారు. నియోజకవర్గ ఓటర్లు దాడిశెట్టి రాజావైపే మరోసారి మొగ్గు చూపుతున్నారు. యనమల కుటుంబం అరాచకాలు.. మంత్రి యనమల రామకృష్ణుడు పలుసార్లు ప్రాతినిథ్యం వహించిన తునిలో అరాచకం రాజ్యమేలుతోంది. మంత్రి యనమల అధికారం అండతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాని అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి సోదరుడైన కృష్ణుడు ఆగడాలకైతే అడ్డూ అదుపూ లేదు. యనమల కుటుంబం, అనుచరుల అక్రమాలకు అంతు పొంతూ లేకుండా పోయింది. దాదాపు 57 నెలల కాలంలో అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఖాళీ స్థలాలు కబ్జా చేశారు. పోలీసు స్టేషన్, సంస్థానం స్థలాలను సైతం ఆక్రమించేశారు. ఇసుక, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వేసి మింగేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల ముసుగులో నిధులు స్వాహా చేశారు. ఇళ్లు, కార్పొరేషన్ రుణాలు, ఆక్వా అనుమతులు మంజూరు చేసేందుకు ముడుపులు గుంజారు. రూ.వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు. అంతటితో ఆగలేదు... అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. ప్రజలు స్వేచ్ఛగా గళం విప్పే అవకాశం ఇవ్వలేదు. యనమల రామకృష్ణుడు సీనియర్ మంత్రి హోదాలో ఉన్నా నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగు, సాగునీటి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి త్రిముఖ పోరు ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తిరిగి పోటీ చేయనున్నారు. టీడీపీ తరఫున యనమల కృష్ణుడు మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే కృష్ణుడు పోటీ చేస్తున్నట్టు బహిరంగ సభల్లో కూడా ప్రకటించారు. ఆఖరి నిమిషంలో మార్పులు జరిగితే యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్యను బరిలోకి దింపే అవకాశం ఉంది. జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్వివి.కృష్ణంరాజు (రాజా అశోక్‌బాబు) పోటీ చేయనున్నారు. ప్రజల తరపున దాడిశెట్టి రాజా పోరాటం తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిరంతరం ప్రజలు తరపున పోరాడుతూనే ఉన్నారు. మంత్రి యనమల ఒత్తిళ్లతో ఎన్ని కేసులు నమోదైనా వెరవలేదు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో రైలు దగ్ధం ఘటనకు సంబంధించి బనాయించిన అక్రమ కేసులపై ప్రజలు, కార్యకర్తల తరపున పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు అన్ని సామాజిక వర్గాలతో సఖ్యతతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. దివంగత వైఎస్సార్ తమ నియోజకవర్గానికెంతో చేశారని, పేద ప్రజల పాలిట దైవంగా నిలిచారని తుని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తుని ప్రజల ప్రధాన సమస్యలు... 2012 నవంబరు 4న తాండవ నది ఉప్పొంగి ప్రవహించడంతో తుని, పాయకరావుపేట పట్టణాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుని మండలం కుమ్మరిలోవ, పట్టణంలోని రెల్లిపేట, రాజీవ్ గృహకల్ప, అమ్మాజీపేట, సీతారామపురం, కొండవారిపేట, తారకరామానగర్, ఇసుకల పేట, మేదరిపేట, బాలాజీ సెంటర్, రైల్వే కాలనీ, తదితర ప్రాంతాలు నీటమునగడంతో అపార నష్టం వాటిల్లింది. పలువురు జీవనోపాధి కోల్పోయారు. తాండవనది పరీవాహక ప్రాంతంలో వరదనీటి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రతిపాదించిన రక్షణ గోడ నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. 2013లో వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్ట నిర్మిస్తామని ప్రజల సాక్షిగా ఇచ్చిన హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు. కరకట్ట కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. తుని మండలంలోని మెట్ట గ్రామాలకు గోదావరి జలాలు అందకపోవడంతో ఏటా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. కోటనందూరు మండలం జగన్నాధపురం–భీమవరపుకోట రోడ్డులో ఉన్న వెంకటాచలం చెరువుపై 2012 నీలం తుపాను సమయంలో గండి పడింది. ఈ చెరువు కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. గండి కారణంగా చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో సాగునీటికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోటనందూరు మండలం అల్లిపూడిలో రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ మంచినీటి పధకం పనులు నేటికీ కొనసాగుతున్నాయి. 90 శాతం పనులు పూర్తయినా పైపులైను శిధిలం కావడంతో నీటి సరఫరాకు నోచుకోవడం లేదు. జనాభా : 2,97,450 ఓటర్లు - 2,03,043 పురుషులు- 1,01,354 మహిళలు- 1,01,673 ఇతరులు- 16 -
చంద్రబాబు కంటే నేరస్తుడెవరున్నారు?
తూర్పుగోదావరి, తొండంగి (తుని): సొంత మామ ఎన్టీఆర్‌ను నమ్మించి, వంచించి, వెన్నుపోటు పొడిచి, అవినీతి, అక్రమాలకు, కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన నేరస్తుడు, మోసగాడు రాష్ట్రంలో వేరెవ్వరూ లేరని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తొండంగి మండలం కోన ప్రాంతం జి.ముసలయ్యపేట పంచాయతీలోని మత్స్యకార గ్రామం ఎల్లయ్యపేటలో ఆయన సమక్షంలో సుమారు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు, యువత పార్టీ నాయకుడు సింగిరి సింగారం ఆధ్వర్యాన గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగానిర్వహించిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగినంత అవినీతి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదన్నారు. పాకిస్తానీయుల సహకారంతో జరిగిన ఉగ్రదాడిపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం బలపడటం, ఆయనకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నా రు. ఆ భయంతోనే ఎన్నికల ముందు జగన్ ప్రకటిం చిన పథకాలను కాపీ కొడుతున్నారని, అయినప్పటి కీ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అ న్నారు. విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదన్నారు. టీడీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ఆ సమయంలో ప్రజల కోసం ఈ పథకాలేవీ గుర్తుకు రాలేదని రాజా విమర్శించారు. ఆయన కూడా చంద్రబాబు మాదిరిగా కోన ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. నమ్మి ఓట్లేసిన జనం ప్రాణాలను హరించేవిధంగా దివీస్ కుంపటిని పెట్టడంతోపాటు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ దోపిడీ, తీరంలో ఇసుక దోపిడీ, ఒంటిమామిడి పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ స్థలం కబ్జా వంటి అవినీతి, అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన యనమలకు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబు, అనుచరగణం కంటే పెద్ద నేరస్తులు ఎవరుంటారని ప్రశ్నించారు. అక్రమ కేసులతో కోన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తుని నియోజకవర్గంలో యనమల సోదరుల అవినీతిని నడిరోడ్డుకీడుస్తానని రాజా హెచ్చరించారు. యనమల పాలనపై ప్రజలు పూర్తిగా విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు తుని నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం జిల్లా కన్వీనర్ కారే శ్రీనివాసరావు, పార్టీనాయకులు మాకినీడి గాంధీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కొయ్యా శ్రీనుబాబు, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, రాజానగరం మాజీ సర్పంచ్ చోడిపల్లి శ్రీనివాసరావు, మేరుగు ఆనందహరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వింత వ్యాఖ్యలు
-
అర్థంలేని ఆర్థికం
లేని నదిపైన వంతెన నిర్మిస్తానంటూ వాగ్దానం చేసేవాడు రాజకీయ నాయకుడని సోవియట్ యూనియన్ అధినేత నికితా కృశ్చవ్ ఆరవై ఏళ్ళ కిందటే వ్యాఖ్యానించారు. ఆదాయానికీ, ఖర్చుకీ లంగరు అందకుండా అమలు సాధ్యం కాని వ్యయానికి సంబంధించిన అంచనాలతో లేని నిధులు కేటాయిస్తూ బడ్జెట్ ప్రతిపాదనలు శాసనసభలో ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాతికేళ్ళ క్రితమే ఆరంభించారు. ఆర్థికమంత్రి తానైనా, అశోక్గజపతిరాజైనా, యనమల రామకృష్ణుడైనా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ అయినా విభజన తర్వాత మిగిలిన రాష్ట్రమైనా చంద్రబాబునాయుడు హయాంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఆకాశమార్గంలోనే ఉంటాయి. అంకెలు హెచ్చులకు పోతాయి. 2014 ఎన్నికల ప్రణాళికలో చేసిన ఆరు వందల వాగ్దానాలు ఎంత బాగా అమలు జరిగాయో మంగళవారంనాడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో చేసిన హామీలు సైతం అంతే బాగా నెరవేరతాయి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి వల్లించే గణాంకాలు వాస్తవానికి దూరం. దేశ ప్రగతి రేటు 7 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి 11 శాతం ఉన్నదని అలవోకగా ఆర్థికమంత్రి చెప్పారు. పెట్టుబడి వ్యయం (కేపిటల్ ఎక్స్పెండిచర్) అతి తక్కువ ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఇతర రాష్ట్రాలలో కంటే చాలా ఎక్కువ వేగంతో పరుగులు తీస్తున్నదంటే నమ్మడం కష్టం. నిజానికి యనమల రామకృష్ణుడు అనామతు పద్దు ప్రవేశపెట్టవలసి ఉంది. రాబోయే ఎన్నికల వరకూ ఎంత ఖర్చు అవుతుందో, ఆదాయం ఎంత ఉంటుందో చెబితే సరిపోయేది. ఎన్నికలకు మూడు మాసాల ముందు తగుదునమ్మా అంటూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం రాజ్యాంగవిరుద్ధం. కేంద్రంలో పీయూష్‌గోయల్ చేసిన తప్పిదాన్నే ఆంధ్రప్రదేశ్‌లో యనమల చేశారు. రాజ్యాంగాన్ని పనికట్టుకొని ఉల్లంఘిస్తామని అధికారంలో ఉన్న వ్యక్తులు పట్టుబడితే ఎవరు మాత్రం ఏమి చేయ గలరు? ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు ముందూ, పాదయాత్రలోనూ చేసిన వాగ్దానాలలో కొన్నింటినైనా అమలు చేస్తానని చెప్పడం వరకే బడ్జెట్ ప్రసంగం పరిమితం. ప్రతిపక్ష నేత చేసిన వాగ్దానాలను ఎన్నికలకు ముందుగానే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అమలు చేయడం హర్షదాయకమే. ఏదో విధంగా ప్రజలకు మేలు జరుగుతుందని సంతోషించ వచ్చు. కానీ వాగ్దానాల అమలుకు అవసరమైన నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకుంటే ఏమి ప్రయోజనం? చర్వితచర్వణమే అయినా కొన్ని నిష్ఠురసత్యాలు చెప్పుకోక తప్పదు. ఎన్నికల ప్రణాళికలో రైతుల రుణాలు మాఫ్ చేస్తానని తెలుగుదేశంపార్టీ (టీడీపీ) అధినేత చేసిన వాగ్దానం ఖరీదు అక్షరాలా రూ. 87,600 కోట్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల నిబంధనలు పెట్టి దాన్ని రూ. 24వేల కోట్లకు కుదించి అయిదు వాయిదాలలో చెల్లిస్తామని చెప్పి మూడు వాయిదాలు మాత్రమే చెల్లించారు. నిరుడు ఎగకొట్టారు. ఈ సంవత్సరం ఎన్నికల ముందు ఇవ్వడానికి అవసర మైన బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదించలేదు. అంటే రైతులకు శూన్యహస్తం ఇస్తూనే ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ వాగ్దానాన్ని పోలిన ‘అన్నదాతా సుఖీభవ’ అనే పథకాన్ని ప్రతిపాదించి దానికి రూ. 500 కోట్లు కేటాయించారు. ఎట్లా ఇస్తారో, ఎంత ఇస్తారో వెల్లడించలేదు. అంటే ఇంత వరకూ ఆలో చించలేదు. డ్వాక్రా మహిళలకూ అంతే. నాలుగున్నర సంవత్సరాల కిందట సుమారు 80 లక్షల మంది డ్వాక్రా మహిళల రుణభారం రూ. 14,200 కోట్లు. దాన్ని కూడా కుదించి వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు. మాట తప్పారు. ఇప్పుడు పదివేల రూపాయల వంతున 93 వేల మంది డ్వాక్రా మహిళలకు పోస్ట్‌డేటెడ్ చెక్కులు ఇస్తామంటూ ఘనంగా ప్రకటించారు. బడ్డెట్లో మాత్రం అరకొర కేటాయింపులే. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగికి నెలకు రెండు వేల రూపాయల వంతున భృతి ఇస్తామని వాగ్దానం చేసి, జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకూ పంగనామాలు పెట్టారు. నాలుగున్న సంవత్సరాలు మిన్నకుండి కేవలం రెండు మాసాల కింద నిరుద్యోగికి వెయ్యి రూపాయలు ఇస్తామంటూ లబ్ది పొందేవారి సంఖ్యను విపరీతంగా తగ్గించివేశారు. ఎటువంటి అసెట్ (ఆస్తి) సృష్టించకుండా అప్పుల భారాన్ని రూ. 2. 60 లక్షలకోట్లకు పెంచివేసిన ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని ఆశించడం అత్యాశ. నిరుటి బడ్జెట్లో చేసిన కేటాయింపులెన్ని, వాస్తవంగా విడుదల చేసిన మొత్తాలెన్ని వివరంగా చెప్పాలన్న స్పృహ యనమలకు లేదు. వాగ్దానాల అమలులో విఫలమైతే ఒప్పుకోవాలన్న నియమం లేదు. ఎన్నికల సంవత్సరం కనుక సంక్షేమ పథకాలపైన ఖర్చు అధికంగా ఉండటాన్ని అర్థం చేసుకో వచ్చు. కానీ, నిధులు కేటాయించకుండా సంక్షేమమంత్రం వల్లించడం వ్యర్థం. కాపులకు రూ. 400 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.700 కోట్లు కేటాయించడం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలలో ఈ పద్దుల కింద ఏటా ఎంతెంత ఖర్చు చేశారో చూస్తే సర్కారు నిజాయితీ ఏపాటిదో తెలిసిపోతుంది. పార్లమెంటులో తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను ‘పోస్ట్‌డేటెడ్ చెక్’లుగా అభివర్ణించి ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు అటువంటి చెక్కులే ఇస్తానంటూ హామీ ఇచ్చారని గమ నించాలి. తాను చేసిన తప్పులే ఇతరులు చేసినప్పుడు తీవ్రంగా ఆక్షేపించడం, తిరిగి తాను అవే తప్పులు అదే పనిగా చేయడం చంద్రబాబునాయుడిని దేశ రాజకీయాలలో ప్రత్యేకమైన నాయ కుడిగా నిలబెట్టాయి. 2018–19లో రూ. 1.50 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయాన్ని యనమల ప్రతి పాదించారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్న రూ. 65వేల కోట్లు చేతికంది తేనే ఈ స్థాయి వ్యయం సాధ్యం. కేంద్రంలో ఎవరొస్తారో, ఏమిస్తారో? అయినా, మూడు నెలల తర్వాత అధికారంలో ఉంటారో లేదో తెలియనివారి ప్రతిపాదనలకు విలువ ఏముంటుంది? -
యనమలా ఏందిలా..!?
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. పలు పదాలను తప్పుగా ఉచ్ఛరించారు. సవాళ్లను.. శవాలు అని పలికారు. కొన్నిసార్లు చదివిన లైన్లే మళ్లీ చదివారు. కింది లైన్లను పైన, పై వాటిని కింద చదివి కలగాపులగం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించిన యనమల ఆదిలోనే పిల్లల బట్టల కుట్టుకూలిని.. కట్టుకూలి అంటూ తడబడ్డారు. ఆ పరంపర చివరి వరకు కొనసాగింది. చక్కటి జీవనాన్ని.. చీకటి అని సంభోదించారు. యువతను యవత, కేటాయింపుల్ని కేటింపుగా చదివారు. చర్చీల నిర్మాణాన్ని చర్చల నిర్మాణాలుగా, ప్రమాదాన్ని ప్రధమంగా చదివారు. చివరకు ఆయన రోజూ ఉచ్ఛరించే దారిద్య్ర రేఖను, ప్రోత్సాహకాలను, కేంద్రీకృతం వంటి పదాలను సైతం తప్పుగా పలికారు. ఓ దశలో ఈ చర్య అనడానికి బదులు ఈ చర్మ అనేశారు. హాలిడేను హోలీడేగా, షీ టీమ్‌ను టీ టీమ్‌గా, వ్యవసాయాన్ని వ్యవస్థాగతంగా మార్చేశారు. దాదాపు 25 పదాలను ఆయన తప్పుగా చదివారు. -
వంచన బడ్జెట్!
-
అంకెల గారడీ
నాలుగు నెలలకు రూ.76,816.85 కోట్ల వ్యయంతో బడ్జెట్ పద్దులో ప్రతిపాదన రూ.2,26,177.53 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంక్షిప్తంగా.. (అంకెలు రూ. కోట్లలో) మొత్తం బడ్జెట్ 2,26,177.53 రెవెన్యూ వ్యయం 1,80,369.32 కేపిటల్ వ్యయం 29,596.53 రెవెన్యూ ఆదాయం 1,78,269.85 కేంద్ర పన్నుల్లో వాటా 36,360.26 కేంద్ర గ్రాంట్లు 60,721.51 రెవెన్యూ మిగులు 2,099.46 ద్రవ్యలోటు 32,390.67 ఏప్రిల్ నుంచి జూలై వరకూ వ్యయం 76,816.85 సాక్షి, అమరావతి :చివరి బడ్జెట్లో టీడీపీ సర్కారు చిత్ర విచిత్రాలు..! రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు మంగళవారం సమర్పించిన 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అంకెల గారడీ చేసినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014–15 నుంచి 2018–19 వరకు ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లోనూ రంగాలవారీగా భారీగా కేటాయింపులు చేయడం, ఆ తర్వాత నిధులను సమకూర్చలేక చేతులెత్తేయడం రివాజుగా మారింది. ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ తమ ధోరణిని చంద్రబాబు–యనమల జోడి మార్చుకోలేదు. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని భావిస్తున్న తరుణంలో బడ్జెట్లో అంకెల ఆర్భాటంతో కనికట్టు చేసేందుకు ప్రయత్నించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏప్రిల్ నుంచి జూలై వరకు మాత్రమే వర్తిస్తుంది. 2019–20కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొలువు తీరే సర్కారే ప్రవేశపెడుతుందన్నది తెలిసిందే. ఈ నాలుగు నెలకు రూ.76,816.85 కోట్ల వ్యయం అవుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లెక్క కట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలకు మళ్లీ దగా.. గత ఎన్నికలకు ముందు లెక్కకు మించి చేసిన వాగ్దానాలకు గత ఐదు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించకుండా సీఎం చంద్రబాబు హామీలను తుంగలో తొక్కారు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని కమిటీలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర వడపోతల పేరుతో రూ.24 వేల కోట్లకు కుదించారు. అందులోనూ ఇంకా రూ. 8,200 కోట్లు బకాయి ఉంది. దీనికి ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి యనమల నిధులేమీ కేటాయించలేదు. రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు రైతులను నిలువునా మోసగించడంతో వ్యవసాయ రుణాలు గత ఏడాది సెప్టెంబరు నాటికి రూ.1.37 లక్షల కోట్లకు చేరాయి. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిసి తన వంచనను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎన్నికలకు ముందు ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. డ్వాక్రా రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ‘యూ’ టర్న్ తీసుకున్నారు. పెట్టుబడి నిధి కింద ఒక్కో మహిళకు రూ,.పది వేలు ఇస్తామంటూ నాలుగున్నరేళ్ల పాటు సాగదీశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి నెల ముందు పోస్ట్ డేటెడ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ వర్తింపజేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు నుంచి సున్నా వడ్డీ చెల్లింపులకు నిధులివ్వడం లేదు. దీంతో డ్వాక్రా సంఘాల నుంచి బ్యాంకులు ఇప్పటివరకు వడ్డీ కింద రూ.2,400 కోట్లను వసూలు చేశాయి. తాజా బడ్జెట్లో వడ్డీలేని రుణాలకు రూ.1,100 కోట్లనే కేటాయించారు. అంటే ఈ కేటాయింపులు బకాయిలు చెల్లించడానికి కూడా చాలవన్నది స్పష్టమవుతోంది. నిరుద్యోగులను నిలువునా ముంచేశారు.. ‘జాబు రావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. లేదంటే నిరుద్యోగ భృతిగా నెలకు రూ.రెండు వేల చొప్పున ఇస్తాం’ అని గత ఎన్నికల్లో టీడీపీ ఇంటింటికీ ప్రచారం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. కానీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న సిబ్బందినే తొలగిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోంది. భృతి కింద రూ.రెండు వేలు ఇవ్వకుండా దారుణంగా మోసగించింది. ఇదే అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీయడంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ యువతకు భృతి పేరుతో బడ్జెట్లో రూ.500 కోట్లను కేటాయించారు. కానీ ఆ ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2018–19లో నిరుద్యోగ భృతికి రూ.1,000 కోట్లను కేటాయించినా నవంబర్ వరకూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఆ తర్వాత నెలకు రూ.వెయ్యి చొప్పున భృతిగా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలకుగానూ టీడీపీ ఎన్నికల హామీ ప్రకారం ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 3.58 లక్షల మందికి నెలకు రూ.1,000 చొప్పున రూ.116.88 కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు ఎన్నికలకు నెల ముందు నిరుద్యోగ భృతిని రూ.రెండు వేలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. 1.70 కోట్ల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏడాదికి రూ.40,800 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేవలం రూ.1,100 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. బీసీలకు వెన్నుపోటు.. వెనుకబడిన తరగతులకు చెందిన అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటును అందించి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని ఎన్నికలకు ముందు కాపీ కొట్టిన సీఎం చంద్రబాబు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటూ నమ్మబలుకుతున్నారు. గత బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు రూ.1,337.81 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.3 వేల కోట్లను మాత్రమే కేటాయించారు. బీసీల్లో కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఒక్కో కార్పొరేషన్‌కు రూ.80 నుంచి రూ.90 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. వైద్యం నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకానికి సర్కారు గత బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లను కేటాయిస్తే ఆ నిధులు ఏ మూలకూ సరిపోలేదు. ప్రస్తుతం ఆసుపత్రులకు రూ.650 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పడింది. ఈ బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే బకాయిలు పోనూ కేవలం రూ.550 కోట్లే మిగులుతాయి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు చెల్లించే రుసుము పెంచిన నేపథ్యంలో ఈ నిధులు తొలి త్రైమాసికానికి కూడా సరిపోవన్నది తేటతెల్లమవుతోంది. ఇక సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపుల్లోనూ సర్కారుకు చిత్తశుద్ధి లేదని స్పష్టమైంది. సబ్‌ప్లాన్ నిధులను సర్దేశారు... బడుగు, బలహీన వర్గాలకు ఉప ప్రణాళిక కింద 2018–19లో రూ.11,229.10 కోట్లను కేటాయిస్తే.. 2019–20లో రూ.14,367.34 కోట్లు కేటాయించారు. గిరిజనులకు ఉప ప్రణాళిక కింద 2018–19లో రూ.4,176.61 కోట్లు కేటాయిస్తే 2019–20లో రూ.5,385.31 కోట్లు కేటాయించారు. కానీ 2018–19లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధుల్లో రూ.2,137 కోట్లను పసుపు–కుంకుమ పథకానికి మళ్లించేయడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీల జీవనోపాధుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన ఈ నిధులను దారి మళ్లించి ఆ వర్గాల ప్రజలకు చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాదీ కూడా నిధులను అదే రీతిలో దారి మళ్లించరనే గ్యారంటీ ఏమీ లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. -
ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం
సాక్షి, అమరావతి: సంక్షేమం, సమతుల అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వల్లే రాష్ట్రం ప్రగతిబాట పట్టిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఐదేళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అనేక సవాళ్లను అధిగమించి ప్రగతి బాట పట్టిందన్నారు. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.26 లక్షల కోట్లతో, మొదటి నాలుగు నెలలకు సంబంధించి రూ. 76816.85 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంగళవారం ఆయన శాసనసభకు సమర్పించారు. 2019– 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించామని, 2018– 19 కేటాయింపులతో పోల్చితే ఇది 18.38 శాతం ఎక్కువని వివరించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 11.45 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన యనమల సరిగ్గా 1.22 గంటలకు జైహింద్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ‘దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి సాధిస్తుందని మనం ఊహించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కల, రాష్ట్రం జీవనాడి అయిన పోలవరం డ్యామ్ శరవేగంగా పూర్తవుతుందని, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ఊహించామా? ఇవన్నీ ఈరోజు నిజంగానే సాధించాం’ అని యనమల పేర్కొన్నారు. ఉన్నత విద్యకు పెద్దపీట.. సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల పట్ల తమ ప్రభుత్వం పూర్తి జాగరూకతతో ఉందని యనమల చెప్పారు. జాతీయ స్థాయిలో వంద అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఆరు మన రాష్ట్రానికి చెందినవే కావడం ఉన్నత విద్యకు తాము ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. 2019 – 20 బడ్జెట్లో మానవ వనరుల విభాగానికి రూ. 29,955 కోట్లు కేటాయించామని, ఇది మొత్తం బడ్జెట్లో 11.5 శాతమని తెలిపారు. అమరావతిని ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి రూ. 1.09 లక్షల కోట్లు ఖర్చు అమరావతి నిర్మాణానికి రూ. 1,09,023 కోట్లు అవుతుందని అంచనా వేయగా మొదటి దశలో రూ. 39,875 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని యనమల చెప్పారు. తమ ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్రం విద్యుత్తు లోటు నుంచి మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. ‘తల్లి గర్భం నుంచి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. పురుషులతో మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే మా లక్ష్యం. అందుకే పసుపు కుంకుమ కింద ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు మరోమారు 93.81 లక్షల మందికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ.9,381 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. రూ. 24 వేల కోట్ల రుణ భారం నుంచి రైతులను విముక్తులను చేశాం. ఆఖరి రెండు వాయిదాలను త్వరలో జమ చేస్తాం’ అని యనమల పేర్కొన్నారు. పెట్టుబడి రహిత సహజ సేద్యం (జెడ్బీఎన్ఎఫ్)లో రాష్ట్రం అగ్రగామిగా ఉందని ప్రకటించారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి పి.నారాయణ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. యనమల బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు... ►రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే మరో పథకానికి రూ. 5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నా. ►కనీస మద్దతు ధరలు లేని సమయంలో రైతును ఆదుకునేందుకు విపణి ప్రమేయ నిధి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు పెంపు. ►పశువుల బీమా కోసం బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయింపు. ►ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ యువతకు ప్రస్తుతం నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్న నిరుద్యోగ భృతి రూ. 2000కి పెంపు. ఈ పథకం కింద 4.3 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రకటన. ►వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు రూ. 3,000 కోట్లు. జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధుల పంపిణీ. ►అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్షిప్ రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు. ►ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2019 – 20 కేటాయింపులు 28 శాతం పెంచి రూ. 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన. ఎస్టీ సబ్‌ప్లాన్ 33 శాతం పెంచి రూ. 16,226 కోట్లు కేటాయింపు ప్రతిపాదన. ►ఆరోగ్య శాఖ బడ్జెట్ రూ. 8,463 కోట్ల నుంచి రూ. 10,032 కోట్లకు పెంపు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి కేటాయింపులు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,200 కోట్లకు పెంపు. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్
-
ఏపీ బడ్జెట్ : డ్వాక్రా రుణ బాకాయిలకు ఎగనామం!
సాక్షి, అమరావతి : ఎన్నికల వేళ సంప్రదాయబద్ధంగా ఓటాన్ అకౌంట్ (మధ్యంతర) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సిన ప్రభుత్వం.. రాజ్యాంగానికి విరుద్ధంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీ ముందు ఉంచింది. మంగళవారం ఉదయం 11:45 గంటలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే స్థోమతకు మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో కూడా అప్పులతోపాటు రాని ఆదాయ వనరులను చూపిస్తూ కాగితాలపై భారీగా కేటాయింపులు చేసింది. రూ.2,26,177.53 కోట్ల కేటాయింపులతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను యనమల ప్రవేశపెట్టారు. ఆదాయ వనరులు లేకపోయినా.. ఎన్నికల ముందు ఊహాజనిత గణాంకాలతో భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసేద్దామనే రీతిలో సర్కారు వ్యవహరిస్తోంది. రూ.2099.47 కోట్లను రెవిన్యూ లోటు కింద.. రూ.32,390 కోట్లను ద్రవ్యలోటు కింద బడ్జెట్లో పేర్కొన్నారు. నవరత్నాలను కాపీకొట్టిన చంద్రబాబు ఎన్నికల ముందు రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు మరో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్ జగన్ నవరత్నాలను కాపీకొట్టి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం బడ్జెట్లో రూ. ఐదువేల కోట్లు కేటాయించారు. కాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రైతులకు రూ.12500 పెట్టుబడి సాయం ఇస్తామని వైఎస్ జగన్ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పథకాన్నే కాపీ కొట్టి రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా రుణమాఫీ అమలు చేయని చంద్రబాబు.. ఎన్నికల నేపథ్యంలో కొత్త హామీని ప్రకటించి మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు అమలు చేసే అవకాశం లేకపోయినా రైతులను మభ్య పెట్టేందుకే బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాదయాత్రలో బీసీ కులాలకు ప్రత్యే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు యాదవ, తూర్పుకాపు, మత్స్యకారులతో సహా తదితర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. గత బడ్జెట్లో బీసీ కులాలను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం... తాజాగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కార్పొరేషన్లు ప్రకటించింది. డ్వాక్రా మహిళలకు చంద్రబు మళ్లీ టోకరా డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తరువాత మాఫీ చేయబోనంటూ చెప్పి, పెట్టుబడి నిధి కింద ఒక్కో మహిళకు పది వేలు ఇస్తామంటూ నాలుగున్నరేళ్ల పాటుగా సాగదీశారు. ఇప్పుడు ఎన్నికల ముందు మరో పది వేలు ఇస్తామంటూ పోస్ట్ డేటెడ్ చెక్‌లను పంపిణీ చేస్తూ మోసం చేస్తున్నారు. తాజా బడ్జెట్లో కూడా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అన్యాయం చేసింది. వడ్డీలేని రుణాల బాకాయిలు రూ.2,350 కోట్లు ఉండగా, బడ్జెట్లో కేవలం రూ.1100 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించింది. వడ్డేలేని రుణాల బకాయిలు చెల్లించొద్దని నిర్ణయించింది. రెండేళ్లుగా వడ్డీలేని రుణాల బాకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. బడ్జెట్ ముఖ్యాంశాలు మొత్తం బడ్జెట్ రూ. 2,26,177.53 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.1,80, 369.33కోట్లు రెవెన్యూ లోటు రూ. 2099.47కోట్లు ఆర్థిక లోటు రూ. 32,390.6 కోట్లు రెవెన్యూ వసూళ్లు, కేంద్ర పన్నులు రూ.36,360 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటులు రూ.67,701 కోట్లు రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.75,438 కోట్లు రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ. 5,750 కోట్లు అంచనా పసుపు కుంకుమకు రూ. 4వేల కోట్లు బీసీ కార్పొరేషన్‌కు రూ.3వేల కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1200 కోట్లు ( నిరుద్యోగ భృతి రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలకు పెంపు) వడ్డీలేని రుణాలకు రూ. 1100 కోట్లు అన్నా క్యాంటీన్లకు రూ.300 కోట్లు పెన్షన్ల పథకానికి రూ.1000 కోట్లు ల్యాండ్ పులింగ్‌కు రూ.2266 కోట్లు వైద్యారోగ్య శాఖకు రూ. 10,036 కోట్లు హౌజింగ్‌కు రూ. 4,099 కోట్లు పరిశ్రమ శాఖకు రూ.4,194 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.35,182 కోట్లు కాపుల సంక్షేమానికి :రూ.1000కోట్లు బ్రాహ్మణుల సంక్షేమానికి :రూ.100కోట్లు ఆర్యవైశ్యుల సంక్షేమానికి :రూ.50కోట్లు క్షత్రియుల సంక్షేమానికి : రూ.50కోట్లు మైనారిటీల సంక్షేమానికి : రూ.1,304.43కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి : రూ.70కోట్లు ఎస్సీ కాంపోనెంట్ లో కమ్యూనిటీ సౌకర్యాలకు : రూ.600.56కోట్లు 308కాపు భవనాల నిర్మాణానికి : రూ.123కోట్లు మంజూరు ఎస్సీ సబ్ ప్లాన్ కు : రూ.14,367కోట్లు( 28% వృద్ది) ఎస్టీ సబ్ ప్లాన్ కు : రూ.5,385కోట్లు(29% వృద్ది) బీసి సబ్ ప్లాన్ కు : రూ.16,226కోట్లు(33% వృద్ది) -
30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 5వ తేదీన పూర్తి స్థాయి ఓటాన్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూ.రెండు లక్షల కోట్లకు పైగా అంచనాలతో రూపొందించనున్నారు. పలు రంగాలకు రూ.వేల కోట్లు కేటాయించినట్లు ప్రచారం చేసుకోవడమే ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్లోనే ఏప్రిల్, మే నెలలకు ఓటాన్ బడ్జెట్‌కూ అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఆయా రంగాలకు భారీ మొత్తంలో కేటాయించామనే ప్రచారం చేసుకునేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని నిర్ణయించింది. -
‘అమరావతిని నల్లధనం అడ్డాగా మార్చేశారు’
సాక్షి, విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు రంగుల కలగా మార్చడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వం అని కొత్త అర్థం చెప్పారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని నిర్మాణం పేరిట చేస్తున్న దోపిడిపై టీడీపిని కడిగిపారేశారు. రాజధాని నిర్మాణాన్ని తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టె అంశంగా మార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూదందా వెనుక వేలకోట్ల కుంభకోణం ఉందని, అడ్డగొలుగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తాత్కాలికి నిర్మాణాల ముసుగులో వెయ్యి కోట్లు స్వాహా చేశారని జీవిఎల్ ఆరోపించారు. అమరావతిని టీడీపీ తన వ్యాపారాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. మోదీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో.. యనమల మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంటే.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పంటి వైద్యం కోసం సింగపూర్‌కు వెళ్లి లక్షలు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన 1690 ఎకరాల భూమిలో 1070 ఎకరాలను ఫ్లాట్లుగా అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వడంపై మండిపడ్డారు. ఆ కంపెనీ 306 కోట్ల పెట్టుబడులు పెట్టినదానికి 16 వేల కోట్ల విలువైన భూమిని అప్పగిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానికి ఈ అక్రమాలపై సమాచారం ఉందని, ఈ ల్యాండ్ మాఫియాకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. రాబోయే రోజుల్లో రెండు లక్షల కోట్ల అక్రమాలకు అమరావతి కేంద్రం కాబోతోందని ఆరోపించారు. అమరావతిని నల్లధనం అడ్డాగా, మరో స్విస్ బ్యాంక్‌గా చంద్రబాబు మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
యనమలను మళ్లీ గెలిపిస్తారా : పవన్
తుని: తూర్పుగోదావరి జిల్లా తుని నూతన రాజకీయ శకానికి నాంది అవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం పవన్ కల్యాణ్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తుని చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న హాకర్స్‌తో ఆయన మాట్లాడారు. రోజంతా కష్టపడినా కుటుంబ పోషణ భారమవుతోందని, ఉండటానికి సొంత ఇల్లు లేదని పలువురు పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి గొల్ల అప్పారావు సెంటర్లో సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ తుని ప్రజలు యనమల రామకృష్ణుడుకు 30 ఏళ్ల పాటు పట్టం కట్టారని, ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వహించారన్నారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పారిశ్రామికవాడను తీసుకు రాలేకపోయారన్నారు. ఇటువంటి నాయకులకు మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తారా అని అడిగినప్పుడు జనం లేదు.. లేదు అంటూ జవాబిచ్చారు. తుని ప్రజలు చూపించిన ప్రేమ ,ఆప్యాయత, ఆదరణ మరులేనన్నారు. నూతన తరం కోసం జనసేన పుట్టిందని, మీరందరూ ఆశీర్వదిస్తే సుపరిపాలన వస్తుందన్నారు. అధికార పార్టీ నాయకులు కొండలను పల్లీల మాదిరిగా తినేస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.2019లో జరిగే ఎన్నికల్లో ఇటువంటి రాబందులు ఓటు అనే గాలివానలో కొట్టుకుపోతారన్నారు. తుని పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడా గరుదత్‌ప్రసాద్, గెడ్డం బుజ్జి, ముత్తా గోపాలకృష్ణ, శెట్టిబత్తుల రాజ బాబు, తుని నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడిశెట్టి గణేష్, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేయాలి
-
మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతాం
తుని: 2018–19కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను మార్చిలో ప్రవేశపెట్టనున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ ముసాయిదా రూపకల్పన కోసం త్వరలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలకు నిధులు కేటాయిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చి, 13 జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. -
నేడు ఏపీ బడ్జెట్
సాక్షి, అమరావతి: రూ. 1,56,990 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017–18)ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం 10.25కు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి మృతి కారణంగా 13న సభ జరక్కపోవడం, 14న ఆయన మృతికి సంతాప తీర్మానం, దానిపై చర్చ తర్వాత సభ వాయిదా పడిన నేపథ్యంలో 30, 31 తేదీల్లోనూ సభ జరపాలని తీర్మానించారు. నేడు మంత్రివర్గ సమావేశం మరోవైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించడం కోసం బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. -
6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
6 నుంచి అసెంబ్లీ
⇒ సోమవారం ఉ. 11.06 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ⇒ 26వ తేదీతో నోటిఫికేషన్ జారీ చేసిన శాసనసభ సచివాలయం సాక్షి, అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో శాసన సభ, మండలి సమావేశాలు సోమవారం (6వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, గత నెల 26వ తేదీతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం వివాదంగా మారింది. పాత తేదీతో నోటిఫికేషన్ జారీ చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. 13న బడ్జెట్: సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. వాయిదా పడిన తరువాత లేదా మంగళవారం శాసన సభా వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలి, ఏ ఏ అంశాలను చర్చకు చేపట్టాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017–18) వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా సమావేశాలు
సాక్షి, అమరావతి: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో అసెంబ్లీ భవనంలో ఏర్పాటు తదితరాలపై ఆయన మంత్రి నారాయణతో కలిసి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వెలగపూడిలో అసెంబ్లీ భవనం డిసెంబర్ నెలాఖరులోపు అందుబాటులోకి వస్తుందని, బడ్జెట్ సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామన్నారు. ప్రత్యేకంగా తాత్కాలిక అసెంబ్లీ భవనం : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం, అసెంబ్లీ ఒకే ప్రాంగణంలో ఉంటే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో వేర్వేరుగా ఉండేలా చూడాలని నిర్ణయించింది. అసెంబ్లీ భవనం చుట్టూ ప్రహరీగోడ నిర్మించనున్నారు. -
రెండు వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు
ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు విజయవాడ(భవానీపురం) ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలతో భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కర ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారం ఆయన పున్నమి(వీఐపీ) ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అమరావతి రాజధానిలో తొలి కృష్ణా పుష్కరాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పుష్కరాలలో చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ నదులను గౌరవించాలని, పితృదేవతలు దీవించే విధంగా పిండ ప్రదానాలు చేయాలని అన్నారు. -
లక్షన్నర పోస్టులు మాయం
భర్తీ చేసేది 20,244.. సీఎం ఆమోదానికి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, లేదంటే ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలముందు ఊదర గొట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు నిరుద్యోగుల ఆశలపై కత్తి దూశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. ఇంతే కాకుండా జూన్ 2వ తేదీ నాటికి 30 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ పోస్టులతో కలిపితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయరాదని, కేవలం 20,244 పోస్టుల భర్తీతో ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 1.52 లక్షల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలికింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఖాళీల సంఖ్యను కుదించడంపైనే కసరత్తు చేయించారు. ఆ మేరకు 20,244 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీ లేదు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయరాదని నిర్ణయించారు. అంటే పెద్ద చదువులు చదవలేని ఆర్థిక స్థోమత లేని కింద తరగతి, మధ్యతరగతి నిరుద్యోగులకు ఇక సర్కారు కొలువులు ఎండమావేనని తేలిపోయింది. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ మాత్రమే చదివిన నిరుద్యోగులు అటెండర్ లేదా డ్రైవర్, రికార్డు అసిస్టెంట్ వంటి పోస్టులు వస్తాయని భావించేవారు. రాష్ట్రప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయరాదని నిర్ణయించడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. నాలుగో తరగతి ఉద్యోగాలను అవసరాలకు అనుగుణంగా కేవలం ఔట్‌సోర్సింగ్‌లో భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం వివిధ శాఖల్లో 20,244 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది. ఇందులో పోలీసు పోస్టుల భర్తీ మినహాయించి మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఆదేశాలు జారీ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టుల్లో గ్రూప్-1 కేవలం 94 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా పోలీసు శాఖలో 9000 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో కానిస్టేబుళ్లతో పాటు ఎస్ఐ, సీఐ పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్-2 పోస్టులు 1100, గ్రూప్-3 పోస్టులు 1500 భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఇతర రంగాల్లో 6,500 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ రంగాల్లో 550 లెక్చరర్, 500 హాస్టల్ వార్డెన్, 750 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 600 వ్యవసాయ విస్తరణాధికారులు, 200 గణాంక సహాయ ఆఫీసర్లు, 300 గిరిజన సంక్షేమ శాఖ, మత్స్య, పశుసంవర్థక తదితర రంగాల్లో పోస్టులున్నాయని ఉన్నతాధికారి వివరించారు. -
'టీటీడీ ప్రతిపైసాకు లెక్క చూపించాల్సిందే'
తిరుమల : ఏటా రూ.4వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీలో సేవా టికెట్లు, లడ్డూ ధరలు పెంచాలని భావించడం సబబు కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భక్తులపై భారం వేసి ఆదాయాన్ని పెంచుకోవాలన్న ధార్మిక సంస్థ ఆలోచన మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే భక్తులు ముందుకొస్తుంటే సామాన్య భక్తులపై భారం మోపే చర్యలు మానుకోవాలని సూచించారు. టీటీడీ ఆదాయ వ్యయాలకన్నింటికీ ఆడిట్ జరగాల్సిందేనన్నారు. భక్తులు సమర్పించే కానుకల్లో వాడే ప్రతిపైసాకు లెక్కచూపి, భక్తులకు జవాబు చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ నిర్వహించిన కొన్ని స్కీములు, ఎస్వీబీసీతోపాటు ఖర్చులపై ఇంకా ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ వ్యవహారాలపై ఏప్రిల్‌లో సమావేశం నిర్వహించి సమీక్షిస్తామన్నారు. రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్ది, పేదరహిత సమసమాజ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందన్నారు. -
ఖాళీలన్నీ భర్తీ చేయలేం: యనమల
హైదరాబాద్ : ఖాళీగా ఉన్న వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అయితే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని, పెట్టుబడులు వస్తే పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు శుక్రవారం శాసనసభలో ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. 20 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే టీచర్లు, డాక్టర్లు లాంటి 25 వేల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిధులు ఉండే పీడీ ఖాతాల్లో సొమ్ము కూడా వాడుకున్నమాట వాస్తవమేనని అంగీకరించారు. -
ఆర్థిక మంత్రి సమాధానం నేడు
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి యనమల శుక్రవారం సమాధానం చెప్పనున్నారు. వాస్తవానికి గురువారం సమాధానం చెప్పాల్సి ఉన్నా వివిధ కారణాల రీత్యా వాయిదా వేశారు. స్పీకర్ కోడెల ఈమేరకు ప్రకటన చేస్తూ సభను మధ్యాహ్నం 2.06 గంటల ప్రాంతంలో వాయిదా వేశారు. -
అంకెల గారడీ
బడ్జెట్‌పై అన్నివర్గాల పెదవి విరుపు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంతంతమాత్రమే సాక్షి ప్రతినిధి తిరుపతి : రాష్ట్ర శాసన సభలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసినట్టు ఉందని పేర్కొంటున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించడం, మాయ చేయడం తప్ప అచరణలో మాత్రం అమలు కావటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీ-నీవా, గాలేరు- నగరి, తెలుగగంగ ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. ప్రాజెక్టులను మాత్రం ఏడాది లోపు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారని, అదెలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, వ్యవసాయ రుణమాఫీ వంటివాటి ఊసే లేకపోవడంపై రైతులు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలకు గండి కొట్టేలా నిధులు కేటాయింపు ఉందని అన్ని పక్షాల రాజకీయనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి నగరానికి.. తిరుపతిలో సైబర్‌స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కన్వెన్షన్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంక్యూబేషన్ సెంటర్‌కు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 5000 హెక్టార్లలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీలకు.. జిల్లాలోని విశ్వవిద్యాలయాలకు గత ఏడాదితో పోలిస్తే కొద్దిమేర నిధులను పెంచారు. ఎస్వీయూకు రూ.163 కోట్లు, ప ద్మావతికి రూ.43.85 కోట్లు, వెటర్నరీ యూనిర్సిటీకి రూ 139.82, ద్రవిడ యూనివర్సిటీకి రూ.12.09 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టులకు అంతంత మాత్రమే.. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులకు అంతంతమాత్రంగా నిధులు కేటాయించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు రూ.3000 కోట్లకు పైగా నిధులు అవసరం కాగా, రూ.504 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం టెండరు పిలిచిన పనులే రూ.1200 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.2500 కోట్లకు పైగా నిధులు కావాల్సి ఉండగా, రూ.348 కోట్లు మాత్రమే కేటాయించారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు సైతం రూ.78.12 కోట్ల నిధులను కేటాయించడం గమనార్హం. -
పన్నులు పెంచం: యనమల
తాజా బడ్జెట్లో పన్నుల ఆదాయ లక్ష్యాలను పెంచినప్పటికీ కొత్త పన్నులను వేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. 2016-17 వార్షిక బడ్జెట్‌ను గురువారం సభలో ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. 2015-16లో ప్రణాళికా కేటాయింపులు రూ. 34,412 కోట్లుండగా వ్యయం రూ.38,671 కోట్లు అయిందన్నారు. పట్టిసీమతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు అదనంగా రూ.4 వేల కోట్లను ఖర్చు చేయడం వల్లనే ప్రణాళిక కేటాయింపుల కన్నా ఎక్కువగా వ్యయం అయిందని చెప్పారు. సామాజిక పింఛన్లకు తక్కువ నిధుల కేటాయింపుపై స్పందిస్తూ.. కేటాయింపులు ఎంత ఉన్నా అవసరం మేరకు నిధులిస్తామని చెప్పారు. ఉద్యోగులకు మరో డీఏను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇస్తామన్నారు. -
నిధులో రామకృష్ణా..!
నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ‘వంశధార’పైనే అందరి ఆశలు ‘ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం...’ ఎన్నికల ముందు ఈ మాట దాదాపు ప్రతి రోజూ చంద్రబాబు నోట వినిపించింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ మాటను పట్టించుకోలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా సాగునీటి బడ్జెట్లపై కరుణ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. వంశధార, తోటపల్లిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఇంకొన్ని కలలూ బడ్జెట్‌పైనే ఆధారపడి ఉన్నాయి. వంశధార పరిస్థితి ఇలా.. వంశధార ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇప్పుడు రూ.1650 కోట్లకు పెంచారు. అయితే గత బడ్జెట్లో కేవలం రూ. 92 కోట్లు కేటాయించి పాల కులు చేతులు దులుపుకున్నారు. ఈ బడ్జెట్లోనైనా కేటాయింపులు జరగాల్సి ఉంది. అలాగే ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రెండో దఫా శంకుస్థాపన చేశారు. మొదటి దానికే దిక్కులేదు. రెండోసారి శంకుస్థాపన చేయడంపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత బడ్జెట్లో కేటాయింపులిలా.. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు రూ.243.25 కోట్లు కేటాయింపులిచ్చారు. ఇందులో తోటపల్లి కాలువలకు రూ.161.98 కోట్లు, వంశధార ప్రాజెక్టు స్టేజ్-1కు రూ.17.99 కోట్లు, స్టేజ్-2కు రూ.52.28 కోట్లు, ఆఫ్‌షోర్‌కు రూ.6 కోట్లు, మడ్డువలస కాలువలకు రూ. 5 కోట్లు కేటాయించారు. వీటితోపాటు నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టంను గత బడ్జెట్లో మంజూరు చేశారు. ‘భావనపాడు’కు కేటాయింపులు నిల్ గత బడ్జెట్లో భావనపాడు, కళింగపట్నం మినీ పోర్టులు నిర్మిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. భావనపా డు పోర్టు నిర్మాణానికి ప్రైవేటు భాగస్వామ్యంతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకు ఎలాంటి కేటాయింపులు ఇవ్వలేదు. కానరాని పర్యాటకం బారువా తీరంలో పర్యాటకాభివృద్ధికి నిధులు కేటాయించడంతోపా టు టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. జిల్లాలోని తోటపల్లి కాలువ, గెడ్డల (మురుగు నీటి పారుదల వ్యవస్థ) ఆధునికీకరణకు రూ. 271 కోట్లతో గత ఏడాది జలవనరుల శాఖ సమగ్ర నివేదిక ఇచ్చింది. గెడ్డల ఆధునికీకరణ కు రూ. 111 కోట్లుతో గతంలో జలవనరుల శాఖ ఇన్విస్టిగేషన్ డివిజన్ నివేదికను ప్రభుత్వానికి పంపింది. రెల్లిగెడ్డతో సహా మొత్తం 52 గెడ్డల ఆధునికీకరణకు రూ. 90.98 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన నిధులు రాలేదు. నాగావళి, బాహుద, మహేంద్రతనయ నదుల ఓపెన్‌హెడ్ చానెళ్ల ఆధునికీకరణకు నిధులివ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. తోటపల్లి ప్రధాన కాలువలకు లైనింగుతో సహా వివిధ అడ్డంకులను అధిగమించే విధంగా మార్గమధ్యలో కట్టడాలను నిర్మించి పూర్తిస్థాయిలో కాలువలను ఆధునికీకరించేందుకు రూ. 124.83 కోట్లు గతంలో కోరినా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మడ్డువలస... రెండో దశ కింద చేపట్టిన మడ్డువలస జలాశయం నిర్మాణం సహా కాలువల లైనింగు, పిల్ల కాలువల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు రూ. 14 కోట్లు అవసరం ఉందని గత ఏడాది అంచనా. అది ఇప్పుడు రూ.19 కోట్లకు చేరింది. గత బడ్జెట్లో రూ.6 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాలేదు. ‘కరకట్టల’ను కరుణిస్తారా? వంశధార నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణాల పైనా స్పష్టత లోపిస్తోంది. సుమారు రూ. 175 కోట్లు తో 177 కి.మీ పొడవునా నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి. పాత ఒప్పందాల మేరకు కాంట్రాక్లర్లు చేసే పరిస్థితి లేదు. కొత్త రేట్లు ఇచ్చే అంశంపై ఎటూ నిర్ణయం తీసుకోలేదు. హామీల మాటేంటి? తీర ప్రాంతంలో భావనపాడు, కళింగపట్నం ఓడ రేవులకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. భావనపాడు ఓడరేవు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అక్కడ రేవు నిర్మాణంపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఇండియన్ పోర్టు అసోసియేషన్ ఎకనమిక్ ఫీజుబులిటీ (టీఈఎఫ్)పై సానుకూలంగా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం శ్రద్ధ కనబరచింది. ఆదిలోనే ఈ ప్రాజెక్టును ప్ర జలు వ్యతిరేకించడంతో అవాంతరాలు వచ్చి పడ్డాయి. మరో వైపు మూడు సంస్థలు ఈ పోర్టు నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఇప్పటికే విశాఖపట్నం పోర్టు నిర్మాణానికి సానుకూలతతో ఉంది. మరోవైపు నిర్మించు-నిర్వహించు-అప్పగించు (బీఓటీ) పద్ధతితోపాటు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా గానీ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థలతో ఉమ్మడిగా గాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిర్మాణానికి అవసరమైన డిజైన్‌ను రూపొందించిన గత బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఈసారైనా బడ్జెట్లో కేటాయింపులు వస్తాయో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కళింగపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన సర్వేలు జరిపిన ప్రభుత్వం నిన్నటివరకు యాంకరు పోర్టుతోపాటు డ్రె డ్జింగ్ ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. ఇప్పటికే డ్రెడ్జింగ్‌ను అంతర్వేదికి తరలించినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా ప్రకటించడంతో జిల్లా ప్రజలకు ఆ ఆశ అడియాశగా మారింది. ‘ఆశ్రమం’ లేదు జిల్లాలోని వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మారుస్తామని గత బడ్జెట్లో ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో సౌర విద్యుత్ వినియోగం పెంచడానికి 770 సోలార్ పంపుసెట్లు ఇస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత అవసరాలెన్నో అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ప్రభుత్వం తోటపల్లి ప్రాజెక్టుకు గత బడ్జెట్లో కేటాయింపులిచ్చారు. ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో 62 వేల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 58 వేల ఎకరాలు కొత్తగా సస్యశ్యామలం అవుతాయని అంచనా. గత బడ్జెట్లో కేటాయించి నిధులు పూర్తిస్థాయిలో ఖర్చుకాలేదు. పెరిగిన అంచనాలకు అనుగుణంగా ధరలు పెరిగితే తప్ప తోటపల్లి నుంచి పూర్తిస్థాయిలో నీరు అందించడం సాధ్యం కాదు. -
ఎమ్మెల్యే పీఏ ‘శివా’లు
పేరుకు ‘జన్మభూమి మా ఊరు’ ప్రభుత్వ కార్యక్రమం అయినా.. టీడీపీ నాయకుల ఓవర్ యాక్షన్ అంతాఇంత కాదు. వారి చేస్తున్న హడావుడితో లబ్ధిదారులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్నీకావు. గాజువాకలో సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ సభ్యులను చేయి పట్టుకొని గెంటేసే ప్రయత్నం చేశారు. ఆరిలోవలో ఎమ్మెల్యే పీఏ ‘శివా’లెత్తారు. జెడ్సీ, వైద్యురాలిపై నోరుపారేసుకున్నారు. భీమిలి నియోజకవర్గం లోడగలవానిపాలెం, చోడవరం నియోజకవర్గం జన్నవరంలో అధికారులను దర ఖాస్తుదారులు ప్రశ్నించారు. డుంబ్రిగుడలో జన్మభూమి రసభాసగా ముగిసింది. గాజువాకలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉత్తర నియోజకవర్గంలో ఐటీ మంత్రి పల్లెరఘనాథ్రెడ్డి పాల్గొని ప్రభుత్వ పథకాలను వివరించారు. మొత్తం మీద రెండో రోజూ కూడా నిరసనలతో జన్మభూమి సాగింది. ఆరిలోవ: ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డులో ఆదివారం జరిగిన జన్మభూమి సభలో తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యక్తిగత కార్యదర్శి శివ హడావిడి చేశాడు. అధికారులపై జులం ప్రదర్శించి అతని కనుసన్నలో సభ నిర్వహించే ప్రయత్నం చేశాడు. అతని జులుం ముందు అధికారులు తలొగ్గి చెతులెత్తేశారు. సభ నిర్వహించే సమయానికి వేదిక చుట్టూ టీడీపీ జెండాలు కట్టి ఉండడాన్ని గమనించిన జోనల్ కమిషనర్ సత్యవేణి, వాటిని తొలగించారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. ఏ అధికారమూ లేకపోయినా, సభా వేదికపై అధికారుల మధ్య ఆశీనుడైన శివ, అప్పటికే జెండాలు తొలగించడంపై ఆవేశంతో ఉన్నాడు. ప్లెక్సీలు కూడా తొలగించమని ఆదేశించడంతో జెడ్సీపై శివాలెత్తిపోయాడు. ‘జెండాలు పీకేశారు, పోనిలే అని ఊరుకొంటే.. ప్లెక్సీలు కూడా తొలిగించేస్తారా? తొలగిస్తే ఊరుకోను. అలా చేస్తే బాగుండదు. ఖబడ్డార్’ అంటూ జెడ్సీపై నోరు పారేసుకున్నాడు. ఆ మాటలు విని వేదికపై ఉన్న అధికారులంతా నోళ్లు వెళ్లబెట్టుకున్నారు. ఆయన జులుం ముందు అధికారులు తలొగ్గారు. అతని చెప్పినట్లే, అతని సలహాలు మేరకు సభ నడిపారు. ఇలా సభ జరుగుతుండగా, సభా ప్రాంగణంలో నిర్వహించిన సీమంతాల కార్యక్రమం వద్దకు వెళ్లారు. ‘నేను ఈ రోజు వద్దన్నాను కదా.. చెప్పినా వినకుండా ఎందుకు నిర్వహించారు’ అంటూ ఐసీడీఎస్, ఆరిలోవ జీవీఎంసీ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ అనితపై ఫైర్ అయ్యారు. ఆయన తీరుతో అధికారులతో పాటు స్థానిక నాయకులు, వార్డు ప్రజలకు ముక్కున వేలేసుకున్నారు. -
రూ.100 కోట్లతో జిల్లాలో పర్యాటకాభివృద్ధి’
కాకినాడ రూరల్ : రూ. వంద కోట్లతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో కాకినాడ హోప్ఐలాండ్, కోనసీమ ప్రాంతాలను ఇకో టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.70 కోట్లు మంజూరు చేసిందన్నారు. మే 1న కాకినాడ వాకలపూడి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తున్నట్లు యనమల వివరించారు. మంగళవారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో కలిసి సీఎం శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. యనమల మాట్లాడుతూ కాకినాడ సాగరతీరంలో 50 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. స్వదేశీ దర్శన్ పథకం కింద మంజూరైన రూ. 70 కోట్లు కాకుండా ఇక్కడ రెండు వంతెనల నిర్మాణాలకు మరో రూ.10 కోట్లు మంజూరుకాగా మరో రూ.26కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిపారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఉన్నారు. బీచ్‌పార్కు శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన కాకినాడ రూరల్ : బీచ్‌పార్కు అభివృద్ధి పనుల శంకుస్థాపన ఏర్పాట్లను అంతకు ముందు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ ఆర్డీఓ బి.ఆర్.అంబేడ్కర్, పర్యాటకశాఖాధికారులతో కలిసి పరిశీలించారు. మే 1న సీఎం చంద్రబాబు రూ.35 లక్షలతో చేపట్టే ఈ పనులకు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే శంకుస్థాపన ఏర్పాట్ల ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పుల్ల సుధాచందు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ వెళ్లిన సీఎం
హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి బయల్దేరి సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్‌లు కూడా వెళ్లారు. సింగపూర్ పర్యటనలో భాగంగా కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో బాబు సమావేశమవుతారు. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె.షణ్ముగంతో 30వ తేదీన చంద్రబాబు సమావేశమవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)తో వ్యర్థపదార్ధాల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనుంది. 31వ తేదీన సీఎం సింగపూర్ సీనియర్ మంత్రి గో చోక్ టంగ్‌తో సమావేశమవుతారు. 31వ తేదీ సాయంత్రం చాంగై విమానాశ్రయం నుంచి బయల్దేరి అదే రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. -
లాభసాటిగాసాగు.. ఉపాధి కల్పన
♦ బడ్జెట్‌పై చర్చలో ఆర్థికమంత్రి యనమల జవాబు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధి ద్వారా పలు ఉద్యోగావకాశాలు, వృద్ధిరేటు లక్ష్యాలుగా బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రణాళికేతర, రెవెన్యూ వ్యయాలు తగ్గించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత అన్నారు. బడ్జెట్‌పై గురువారం శాసనసభలో జరిగిన సాధారణ చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని కరువు లేకుండా తీర్చిదిద్ది వ్యవసాయ, అనుబంధ రంగాలను ప్రగతిబాటలో నడిపి వృద్ధి రేటు సాధిస్తామన్నారు.ఇప్పటికే 43 లక్షల కుటుంబాలకు రూ.5 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఈ బడ్జెట్లో మరో రూ.4,300 కోట్లు కేటాయించామన్నారు. మిగిలిన అర్హులనూ గుర్తించి 2015-16లో రైతు రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. యనమల ఇంకా ఏమన్నారంటే.. ఓడీకి వెళ్లే పరిస్థితి.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేపో ఎల్లుండో ఓవర్ డ్రాఫ్టు (ఓడీ)కి వెళ్లేలా ఉంది. రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భూములు అమ్ముకుంటే రూ. 20 వేల కోట్లు వస్తాయని బడ్జెట్లో పెట్టుకోవచ్చు. అయితే అది వాస్తవరూపం దాల్చదు. వాస్తవ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపొందించాం. దేశంలో మొదటిసారి రూ. 6,640 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాం. కాపులకు ప్రత్యేకంగా రూ.100 కోట్లు, బ్రాహ్మణులకు రూ. 35 కోట్లు కేటాయించాం. అందుకే విజన్ 2029: తయారీ, ఐటీ రంగాల ద్వారా భారీగా ఉద్యోగాలు కల్పిం చేందుకు చంద్రబాబు ‘విజన్ 2029’ రూపొం దించారు. లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయి. నీటిపారుదల శాఖకు ప్రణాళికేతర పద్దుతగ్గించాం. ప్రణాళిక కింద రూ.5,000 కోట్లు ఇచ్చాం. ‘ఈ ఏడాదితో రైతు రుణమాఫీని పూర్తి చేస్తాం. కొన్నిటికి ఈ ఏడాది సర్దలేకపోయినా భవిష్యత్తులో సర్దుతాం. ఇంటికో ఉద్యోగం వచ్చేలా చూస్తాం. నిరుద్యోగ భృతి కి బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాం. రాజధానిలో పీపీపీ పద్ధతిన అభివృద్ధి రాజధాని భూ సమీకరణలో రైతులకివ్వాల్సిన వాటా పోగా మిగిలే భూములను ప్రభుత్వ-ప్రైవేటు (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేస్తామని యనమల ప్రకటించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో మండలిలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంఘం సిఫారసుల కన్నా, 13వ ఆర్థిక సంఘం సిఫారసులే బాగున్నాయన్నారు. యువత రాబోయే రోజుల్లో మరింత తగ్గిపోనున్నందున చంద్రబాబు ‘పిల్లల్ని కనండి’ అని అన్నారని యనమల పేర్కొన్నారు. ప్రతిపక్షనేతపై విమర్శల పర్వం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ది చంద్రబాబు విజన్ అయితే అధికారం వస్తే ఎలా దోచుకోవాలన్నదే విపక్ష నేత జగన్ విజన్ అని మంత్రి యనమల అసెంబ్లీలో విమర్శించా రు. ప్రతిపక్షనేత 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ‘రాష్ట్రానికి డబ్బు, పరిశ్రమలు రాకూడదన్నదే విపక్ష నేత లక్ష్యం. ఆయన ఇందుకోస మే కష్టపడుతున్నారు. 14వ ఆర్థిక సంఘానికి రూ. 14,000 కోట్ల లోటు చూపడాన్ని తప్పుబడుతున్నారు. ఈ లోటు చూపింది గవర్నర్ పాలనలో నే. గవర్నర్ ఇచ్చిన గణాంకాల ప్రకారమే రూ.16,000 కోట్లు లోటు చూపించాం. అంత లోటు ఎక్కడుం దని జగన్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవం గా బడ్జెట్ తయారుచేసింది ఆయనా? మేమా?’ అని యనమల అన్నారు. ప్రతిపక్షానికి స్పీకర్ రక్షణగా ఉండాలి ఈ మధ్య కాలంలో ఏ చట్టసభల్లోనైనా గలాభాలు జరగడానికి ఉంటున్న కారణాల్లో స్పీకర్ స్థానంలో ఉండేవారి వ్యవహర శైలి కూడా ఒకటి. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చున్నాక తమ పార్టీని పూర్తిగా మర్చిపోవాలి. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి చూస్తే... వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉంది. - సి. రామచంద్రయ్య, మండలిలో ప్రతిపక్ష నేత విపక్షం లేకుండా సభకు గౌరవప్రదం కాదు శాసనసభ నిర్వహణలో హుందాగా వ్యవహరించాల్సిన అధికార పక్షం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదు. విపక్షం లేకుండా అసెంబ్లీ జరగడం గౌరవప్ర దం కాదు. గురువారంనాటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. టీవీల్లో ప్రసారాలు నిలిపేసి విపక్ష స భ్యుల్ని బయటకు పంపాల్సిన అవసరం ఏముంది? - కె.రామకృష్ణ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
బాబు... బురిడీ
రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిగా నవ్యాంధ్ర నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందర్నీ నిరాశ పరిచింది. కరువు కోరల్లో చిక్కుకున్న చిత్తూరు జిల్లా ప్రజల ఆశలను వమ్ముచేసింది. అన్నదాత గుండెగుడిలో గూడుకట్టుకున్న హంద్రీ-నీవా, గాలేరు- నగరి ప్రాజెక్టులను గాలికొదిలేసింది. సీఎం తన సొంత జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నివర్గాల వారు గళమెత్తారు. హైటెక్కుల బాబు అంకెల గారడీ చేసి పేదలను బురిడీ కొట్టించారని మండిపడ్డారు. తిరుపతి: రాష్ట్ర శాసన సభలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను విస్మయానికి గురిచేసింది. సీఎం సొంత జిల్లాపై మమకారం చూపలేదని బడ్జెట్ కేటాయింపుల బట్టే తెలిసిపోయింది. జిల్లా పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నీటి మూటలేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీ-నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. దీంతో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాది లోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేసి జిల్లాలో సాగు, తాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని సీఎం పలుమార్లు ప్రకటించినా ఆ స్థాయిలో నిధులు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి, డ్వాకా మహిళల రుణ మాఫీ వంటి వాటికి నిధులు కేటాయించలేదు. దీంతో ఆయా వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలకు గండి కొట్టేలా నిధుల కేటాయంపులు ఉన్నాయని అన్ని పక్షాల రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నేతలు పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే బడ్జెట్‌గా అభివర్ణించగా, కొంత మంది అంకెల గారడీగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. విమానాశ్రయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు లేవు. కేవలం విద్యాభివృద్ధికి సంబంధించి అరకొరాగానే నిధులు కేటాయించారు. ఈ రోజు శాసన సభలో సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హంద్రీ- నీవా ప్రాజెక్ట్ పనులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 90 శాతం పనులు పూర్తి అయినప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజీ నిర్మించి మూడేళ్లు గడిచినప్పటికీ ప్రాజెక్ట్ పనులు ఇంతవరకు పూర్తికాలేదు. ఈ విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు పలుప్రాంతాల్లో వారానికి ఒకసారి నీరిచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికల హామీలకు.. బడ్జెట్‌కు పొంతన లేదు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు పొంతన లేదు. రైతుల రుణమాఫీ కంటితుడుపైతే, డ్వాక్రా మహిళల రుణమాఫీ పరిస్థితి అంతే. బడ్జెట్లో డ్వాక్రా రుణాలకు తగినంత నిధులు కేటాయించలేదు. 2015-16లో ఇళ్లు లేని వారికి రెండు లక్షల ఇళ్లు ఇస్తామన్నారు కానీ నేడు మొక్కుబడిగా నిధులు కేటాయించారు. 2014-15లో కట్టినఇళ్లకు బిల్లులు ఇవ్వలేదు. ఇళ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంమీద ఈ బడ్జెట్ ఎంతమాత్రం సరిపోదు. కనీసం తాగునీటి కోసం సరిపడ నిధులు కేటాయించకపోవడం దారుణం. - పోకల అశోక్ కుమార్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. -
మాటల బడ్జెట్
ఆశాజనకం బందరులో మెరైన్ అకాడమీ ఏర్పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పోర్టు అభివృద్ధి గన్నవరం విమానాశ్రయ విస్తరణ కూచిపూడిలో నాట్యారామం ఏర్పాటు పర్యాటక కేంద్రంగా భవానీ ద్వీపం స్మార్ట్ సిటీగా విజయవాడ అభివృద్ధి ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులే.. ఎప్పటికి పూర్తయ్యేదీ ప్రశ్నార్థకమే.. నిరాశాజనకం బందరు పోర్టుకు కేవలం రూ.30 లక్షల కేటాయింపు రైతు రుణమాఫీ దశలవారీగానే.. డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు విజయవాడ : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాటల గారడీ చేశారు. శాసనసభలో గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో జిల్లాకు రాజధాని స్థాయిలో నిధులు కేటాయించలేదు. ప్రతి పాదిత అంశాలు 20కి పైగా ఉండగా కొన్నింటిని మాత్రమే మంజూరు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. బందరు పోర్టుకు కేవలం రూ. 30 లక్షలు కేటాయించి జిల్లావాసుల ఆశలపై నీళ్లు చల్లారు. రుణమాఫీ దశలవారీగా జరుగుతుందని చెప్పి రైతుల ఆశలను ఆవిరి చేశారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ ఊసే బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయం. బడ్జెట్‌పై వివిధ పార్టీల నేతలు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.3,168 కోట్లు నూతన రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో రూ.3,168 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. మచిలీపట్నం పోర్టును ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని, గన్నవరం విమానాశ్రయం విస్తరణ చేపడతామని ప్రకటించారు. కూచిపూడిలో నాట్యారామం ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. హస్తకళల అభివృద్ధి కోసం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుచేస్తామని తెలిపారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వ బీసీ బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. జిల్లాలో మరో బీసీ స్టడీ సర్కిల్ ఏరా్పాటు చేస్తామన్నారు. మైలవరంలో నీటిపారుదల కోసం రూ.5.90 కోట్ల నిధులు ఈ బడ్జెట్లో కేటాయించారు. అయితే ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు కావటంతో వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంది. నూతన రాజధాని విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బడ్జెట్లో డ్వాక్రా రుణమాఫీ ప్రస్తావనే లేకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో మాఫీ కావాల్సిన డ్వాక్రా రుణాలు రూ.300 కోట్లు ఉండగా, జిల్లాలో రూ.918 కోట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనా లేకపోవటంపై రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.111.08 కోట్లు కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు రాష్ట్ర బడ్జెట్లో రూ.111.08 కోట్లను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.120.14 కోట్లు కేటాయించగా, రాష్ట్ర విభజన తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కృష్ణాడెల్టా పనులకు కోత పెట్టారు. పులిచింతల ప్రాజెక్టు (కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టు)కు బడ్జెట్లో రూ.20.11 కోట్లు, ప్రకాశం బ్యారేజీ అభివృద్ధి పనులకు రూ.55 లక్షలు, జిల్లాలో ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5.80 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకున్నారు. -
వ్యాట్ వాత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఇతర అంశాలెలా ఉన్నా.. ఈ విషయంలో మాత్రం పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా పలు ఇతర రాష్ట్రాలను చంద్రబాబు ప్రభుత్వం అనుసరించనుంది. గత ఐదు నెలలుగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుండటంతో ఎంతోకొంత సంతోషంగా ఉన్న వాహనదారులను నిరాశకు గురిచేయనుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రస్తుతం విధిస్తున్న వ్యాట్‌ను.. వాటి ధర ల్లో లీటర్‌కు రూ.2 చొప్పున పెంపునకు ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఖజానాకు నెలకు రూ.100 కోట్లకు పైగానే ఆదాయం సమకూరనుంది. వ్యాట్ పెంపు పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వ్యాట్ రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో రూ.400 కోట్ల మేర నష్టం వస్తోందని చెప్పారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే లీటర్‌పై రెండు శాతం చొప్పున సెస్ విధించిందని, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కూడా డీజిల్, పెట్రోల్‌పై ఇటీవల వ్యాట్‌ను పెంచాయని చెప్పుకొచ్చారు. జీతాలకు కూడా డబ్బులు లేవంటున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ జీతాలిస్తామని, వేస్ అండ్ మీన్స్ (ఆర్బీఐ నుంచి చేబదులు)కు, అప్పులకు వెళ్తామని అన్నారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏకంగా 69 శాతం ఫిట్మెంట్ కావాలని డిమాండ్ చేశారన్నారు. దీంతో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అర్థం చేసుకోవాలని చెప్పామన్నారు. కాగా వచ్చే అర్థిక సంవత్సరం బడ్జెట్‌పై ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని శాఖల మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశమవుతుందని తెలిపారు. -
మహాపర్వానికి మోగిన నగారా
సాక్షి, రాజమండ్రి :గోదారమ్మ ముద్దుబిడ్డలాంటి ఈ గడ్డపై మహాపర్వానికి సర్కారు నగారా మోగించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు తేదీలు ఖరారు చేయడంతో పాటు ఇవ్వబోయే నిధుల గురించి ప్రకటన చేయడంతో ఈ దిశగా తొలి అడుగు పడినట్టయింది. తొలుత.. కొండంత అవసరానికి పిడికెడు నిధులే ఇస్తామన్న సర్కారు.. చివరకు ఈ సీమకు పెన్నిధి వంటి జీవనది పట్ల కృతజ్ఞతకు, ఈ జాతి సంస్కృతికి ప్రతీక వంటి ఈ పర్వానికి మొత్తం రూ.900 కోట్లను వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.600 కోట్లు కేందం నుంచి రాబట్టనున్నట్టు తెలిపింది. ఏదేమైనా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాల ప్రకారం తొట్టతొలుతగా దేవాదాయ శాఖకు విడుదలయ్యే రూ.8 కోట్లతో డిసెంబర్లో పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఓం ప్రథమంగా ఏ పనులను, ఎక్కడ మొదలు పెట్టాలి అన్నదానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా కేంద్రం అనుకున్నట్టు నిధులిస్తే.. రూ.900 కోట్లలో రూ.600 కోట్లు తూర్పున, రూ.300 కోట్లు పశ్చిమ న పుష్కర సన్నాహాలకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రం ఇచ్చే ని ధుల్లో అధికభాగం దేవాదాయ శాఖ నుంచి స మీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ రెండు జి ల్లాల్లోని దేవాలయాలను సందర్శించి, వాటి ఆ దాయాలను పరిశీలించారు. ఎక్కువ రాబడి గ ల ఆలయాల నిధులతో జీర్ణాలయాలు, ఆదా యం తక్కువ ఆలయాల్లో పుష్కర పనులు చేసే ప్రతిపాదననూ ఉపసంఘం పరిశీలించింది. సింహభాగం సొంత నిధులే.. కాగా పుష్కరాల్లో కీలకమైన పనులు ఆర్అండ్ బీ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖలతో పాటు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టనున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ రూ.30 కోట్లు, ఇరిగేషన్ శాఖ రూ.45 కోట్లు, ఆర్అండ్బీ రూ.75 కోట్లు, దేవాదాయ శాఖ రూ.30 కోట్లతో ప్రతిపాదనలు అందించాయి. ఇవే కాక పలు అనుబంధ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో ఆయా శాఖల సొంత నిధులను కూడా పుష్కర పనులకు వెచ్చించేలా చూసి, పెద్ద మొత్తంలో పనులు చేశామని చెప్పుకోవాలన్న సర్కారు యోచన అంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి తీరంలో 245 ఘాట్లు ఉండగా వీటిలో 145 తూర్పుగోదావరిలో ఉన్నాయి. వీటిలో చాలా వాటిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దీంతో ముందుగా ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. తదనుగుణంగా అన్ని ఘాట్లనూ అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. పర్వం ప్రారంభం జూలై 14న.. గోదావరి పుష్కరాల ప్రారంభం ఎప్పుడన్న దానిపై సిద్ధాంతకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా చివరికి వచ్చే ఏడాది జూలై 14న ప్రారంభమవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పుష్కర ప్రారంభం ఎప్పుడన్న దానిపై ప్రభుత్వం తొలుత పండితుల అభిప్రాయాలు కోరింది. జ్యోతిష విజ్ఞాన భాస్కర మధుర కృష్ణమూర్తి శాస్త్రి జూన్ 28న, శ్రీశైలం ఆస్థాన విద్వాంసుడు బుట్టే వీరభద్ర దైవజ్ఞ జూలై ఏడున పుష్కర ప్రారంభమని చెప్పగా తం గిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి జూలై 14నే సూచించారు. చివరికి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని జూలై 14న ఉదయం 6.28 గంటలకు పుష్కరాల ప్రారంభానికి ముహూర్తంగా ఖరారు చేసింది. 14 నుంచి 25 వరకూ పుష్కరాలు జరుగుతాయని ప్రకటించింది. -
పుష్కర తంత్రం.. తూతూమంత్రం
* గోదావరి మహాపర్వానికి ఎంతైనా ఇస్తామని తొలుత చెప్పిన ప్రభుత్వం * చివరకు రూ.100 కోట్లే ఇవ్వనున్నట్టు ప్రకటన * అందులోనూ తొలి విడత ఇచ్చేది రూ.30 కోట్లే * ఏ పనులు చేయాలనేదానిపై నేటికీ రాని స్పష్టత సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఘనంగా నిర్వహిస్తామని, ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదంటూ మొదట చేసుకున్న ప్రచారానికి విరుద్ధంగా.. రూ.100 కోట్లు మాత్రమే ఇస్తామంటూ తూతూమంత్రంగా పనులు కానిచ్చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మొత్తంలో తొలుత రూ.30 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ప్రకటించారు. కానీ ఏ శాఖకు ఎంతనేది ఇంకా లెక్క తేల్చలేదు. ఇందుకు మరో రెండు నెలలకు పైగా సమయం పట్టవచ్చని చెబుతున్నారు. అయితే మరో 45 రోజుల్లో కేటాయింపులు ఫైనల్ చేస్తామని యనమల అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే పుష్కరాలకు మూడు నెలల ముందు పనులు చేపట్టి పైపై మెరుగులతో కానిచ్చేసేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిరి గీస్తున్నారు ఇప్పటివరకూ జరిగిన పుష్కరాలకు సంబంధించి ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించేవారు. నాటి పుష్కరాల పనులు మరో పుష్కరాల వరకూ కూడా నిలిచిపోయేలా ఏర్పాట్లు జరిగాయి. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రభుత్వం గిరి గీసుకుని మరీ ఏర్పాట్లకు పూనుకుంటోంది. పుష్కరాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ ఆగస్ట్ ఎనిమిదిన యనమల అధ్యక్షతన రాజమండ్రిలో తొలి సమావేశం జరిపింది. ఇందులో అధికారులు సుమారు రూ.750 కోట్లతో అంచనాలు సమర్పించారు. పుష్కరాలు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామంటూ అంతకుముందు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించడంతో అధికారులు కూడా భారీగా అంచనాలు వేశారు. కానీ ఈ అంచనాలను తారుమారు చేస్తూ పుష్కరాలకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు యనమల ప్రకటించారు. దీంతో అంచనాలను సుమారు రూ.450 కోట్లకు అధికారులు కుదించారు. చివరికి దీనిని కూడా కాదని, రూ.130 కోట్లకు దాటకూడదని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ స్పష్టం చేశారు. కాకుంటే మరో రూ.కోటి అని అప్పట్లో చెప్పారు. ఎంత కుదించినా రూ.271 కోట్లు కావాలని సెప్టెంబర్ 26న రాజమండ్రిలో కలెక్టర్ నీతూ ప్రసాద్‌కు అధికారులు తుది అంచనాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుందని వారు భావిస్తున్న తరుణంలో.. తాను ముందు చెప్పిన రూ.100 కోట్లనే యనమల ఫైనల్ చేశారు. కలెక్టర్ పంపిన నివేదికలను వడబోసి చేపట్టాల్సిన పనులపై సుమారు 45 రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పారు. ముందుగా రూ.30 కోట్లు విడుదల చేయాల్సిందిగా తమ శాఖను ఆదేశిస్తామని చెప్పారు. పుష్కరాల పనుల్లో కీలకమైన ఆర్అండ్బీ, ఇరిగేషన్, దేవాదాయ శాఖలు కనీస ఏర్పాట్లు చేయడానికే రూ.187 కోట్లు కావాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎంత ఇస్తుందో, ఏ పనులకు పరిమితం కావాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. శాఖలవారీగా ప్రతిపాదనలివీ... సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌కు వివిధ శాఖలు ప్రతిపాదనలు అందించాయి. ఆర్అండ్బీ శాఖ రూ.70 కోట్లతో పనులు ప్రతిపాదించింది. జిల్లాలోని వివిధ ఆలయాల మరమ్మతులు, భక్తులకు వసతులు, ఇతర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ రూ.59.24 కోట్లతో ప్రతిపాదనలు అందించింది. ఇరిగేషన్ శాఖ కూడా సుమారు రూ.55 కోట్లతో అంచనాలు ఇచ్చింది. పుష్కరాల ప్రధాన వేదిక అయిన రాజమండ్రిలో ఏర్పాట్లకు రూ.30 కోట్లతో నగరపాలక సంస్థ ప్రతిపాదనలు చేసింది. జిల్లా పంచాయతీ అధికారి రూ.6 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ రూ.కోటి, ఆర్టీసీ రూ.70 లక్షలు, రవాణా శాఖ రూ.5 లక్షలు, ట్రాఫిక్ పోలీసులు రూ.8 లక్షలు, ఈపీడీసీఎల్ రూ.30 కోట్లతో కలెక్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. -
ప్చ్..
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర బడ్జెట్లో జిల్లా విషయంలో స్పష్టమైన వివక్షత కన్పించింది. జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధ వహించారు. జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరి-నగరి సుజల స్రవంతి పథకం నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి ఫలాలందించే పథకాలకు నిధుల కేటాయింపులు లేవు. ట్రిపుల్ఐటీ, యోగివేమన యూనివర్శిటీ, రిమ్స్ వంటి అత్యున్నత విద్యాసంస్థల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాపట్ల రాజకీయ వైరాన్ని ప్రదర్శిస్తున్నారని బడ్జెట్ సాక్షిగా చెప్పకనే చెప్పారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర సంస్థలకు భారీ కోత పెట్టారు. పథకాలను ప్రాధాన్యత పరంగా సమదృష్టితో చూడాల్సిన పాలకపక్షం రాజకీయ వైరంతో అరకొర నిధులను విదిల్చారు. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల ఊసే ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్లో లేకపోవడం విచారకరం. మెట్టప్రాంతాల పట్ల కన్పించని శ్రద్ద.... మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రవేశ పెట్టిన జలయజ్ఞం పనులు కాలక్రమేపి వివ క్షతకు గురవుతున్నాయి. జిల్లాలో 2004-09 హయాంలో నిర్వహించిన పనుల ఆధారంగా జిల్లాకు కృష్ణా జలాలు అందుతాయని ప్రజానీకం పూర్తి ఆశల్లో ఉండే ది. పాలకుల శీతకన్ను కారణంగా పెండింగ్ పథకాల జాబితాలోకి జిల్లా సాగునీటి పథకాలు చేరిపోయాయి. వెనుకబడ్డ రాయలసీమకు సాగునీటి వసతి కల్పించాలనే లక్ష్యంతో జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టారు. అంతే శ్రద్ధతో ఆ పథకాల పూర్తికి చిత్తశుద్ధితో ఆచరణలో చూపెట్టారు. అలాంటి పథకాలకు అరకొర నిధులు కేటాయించి ప్రభుత్వం తన వివక్షతను ప్రదర్శిస్తోంది. మరో రూ.173 కోట్లు వెచ్చిస్తే జీఎన్ఎస్ఎస్ ఫేజ్-1 పనులు పూర్తి కానున్న నేపధ్యంలో ప్రభుత్వం కేవలం రూ.55.14కోట్లు కేటాయించింది. అందులో 50శాతం గ్రాంటు ఆర్‌అండ్‌ఆర్‌కు వినియోగించాలనే నిబంధన విధించింది. కేసీ కెనాల్ ఆధునికీకరణ పట్ల పాలకపక్షానికి చిత్తశుద్ధి లోపించింది. కేవలం రూ.8.4కోట్లు మాత్రమే కేటాయించారు. మైలవరం ఆధునికీకరణకు రూ.8.16కోట్లు, తెలుగుగంగకు రూ.89.6కోట్లు, పీబీసీకి రూ.27.8కోట్లు కేటాయించారు. అనంతపురం జిల్లాలోని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు మాత్రం రూ.128కోట్లు కేటాయించారు. ఎస్సార్బీసీకి రూ.12.48కోట్ల కేటాయింపులు దక్కాయి. వెలిగల్లు, చెయ్యేరు, దిగువ సగిలేరు, ఎగువ సగిలేరు, బుగ్గవంక ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు లేవు. అత్యున్నత విద్యపట్ల అదే వైఖరి.... జిల్లాలోని అత్యున్నత విద్యాసంస్థల పట్ల సైతం ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రదర్శించింది. యోగివేమన యూనివర్శిటీకీ టీడీపీ ప్రభుత్వం అరకొర ఆర్థిక కేటాయింపులే చేపట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.19.39 కోట్లు కేటాయించారు. అందులో రూ.16.92కోట్లు వైవీయూ సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించనున్నారు. ఇతరత్రా వసతులకు రూ.2.47 కోట్లు వినియోగించాలని నిర్ణయించారు. అలాగే ట్రిపుల్ఐటీ, రిమ్స్‌కు ఈమారు నిధులు కేటాయింపులే లేవు. ఐజీ కార్ల్ పశుపరిశోధన సంస్థ ఊసే లేకపోయింది.