కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా సమావేశాలు | Yanamala Rama Krishnudu comments about Assembly Sessions | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా సమావేశాలు

Published Sun, Sep 18 2016 1:38 AM | Last Updated on Tue, Oct 2 2018 4:53 PM

కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా సమావేశాలు - Sakshi

కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా సమావేశాలు

సాక్షి, అమరావతి: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో అసెంబ్లీ భవనంలో ఏర్పాటు తదితరాలపై ఆయన మంత్రి నారాయణతో కలిసి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.  వెలగపూడిలో అసెంబ్లీ భవనం డిసెంబర్ నెలాఖరులోపు అందుబాటులోకి వస్తుందని, బడ్జెట్ సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామన్నారు.

 ప్రత్యేకంగా తాత్కాలిక అసెంబ్లీ భవనం : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం, అసెంబ్లీ ఒకే ప్రాంగణంలో ఉంటే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో వేర్వేరుగా ఉండేలా చూడాలని నిర్ణయించింది.  అసెంబ్లీ భవనం చుట్టూ ప్రహరీగోడ నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement