Assembly budget meetings
-
త్వరలో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులందరికీ మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో దాదాపు మూడు గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు.భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్షి్మ, చారకొండ వెంకటేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో భాగంగా నిరుద్యోగుల డిమాండ్ల గురించి సీఎం ఆరా తీశారు. సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులతో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబ్ కేలండర్ ప్రకారం భర్తీకి ప్రయత్నాలు: సీఎం ‘నిరుద్యోగులకు ఇచి్చన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్–1,2,3 ఉద్యోగాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. జాబ్ కేలండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రయతి్నస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తున్నాం.ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూలంకషంగా కసరత్తు చేస్తోంది. కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చేస్తున్న కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రాజకీయ పారీ్టలు, స్వార్ధపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు. గత ప్రభుత్వం లాగా మేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిబంధనలు మారిస్తే చట్టపరంగా తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్: టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కు తీసుకుని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పోస్టుల సంఖ్యను పెంచి కొత్తనోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.12 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు 4 లక్షల మంది హాజరయ్యారని, ప్రిలిమ్స్‌ను పూర్తి చేశామని, నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని, అదే జరిగితే మళ్లీ నోటిఫికేషన్ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనల మార్పు న్యాయపరంగా చెల్లుబాటు కాదని, బయోమెట్రిక్ పద్ధతి పాటించలేదన్న ఏకైక కారణంతో హైకోర్టు గ్రూప్–1 పరీక్షను రెండోసారి రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు ఉదహరించారు. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచి్చంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాగా గ్రూప్–2, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉండడంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయని, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని వివరించారు. కాగా టీజీపీఎస్సీ, విద్యాశాఖలు చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటాయని సీఎం వారికి హామీ ఇచ్చారు. -
వా‘ఢీ’.. వే‘ఢీ’!
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది రోజులపాటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నడుమ తీవ్ర వాగ్యుద్ధాల నడుమ సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024–25 సమావేశాలు శనివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన భేటీలో ‘తెలంగాణ సాగునీటి రంగంపై శ్వేతపత్రం’పై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమైన సమావేశాలు 8 రోజులపాటు సాగాయి. 8 రోజుల్లో 45 గంటల 32 నిమిషాలపాటు సభ జరగ్గా, 59 మంది సభ్యులు ప్రసంగించగా, జీరో అవర్‌లో 64 మందికి మాట్లాడే అవకాశం దక్కింది. రెండు ప్రభుత్వ తీర్మానాలు, మూడు బిల్లులను పెట్టగా, ఒక స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలిసారిగా సభకు ఎన్నికైన సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించడంతోపాటు వారి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో సుదీర్ఘంగా జీరో అవర్ నిర్వహించారు. మేడిగడ్డ సందర్శన.. చలో నల్లగొండ ఈ నెల 8న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. 10న రూ.2.75లక్షల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశ పెట్టారు. 11న విరామం ప్రకటించి.. 12న తిరిగి సమావేశమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగాల్సి ఉండగా, ఎజెండాను వాయిదా వేసి ‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు’కు తాము విధించే షరతులను ఆమోదిస్తేనే నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగిస్తామంటూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చ కూడా విమర్శలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పక్షాలను ఆహ్వానించారు. 13న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎలాంటి ఎజెండాను చేపట్టకుండానే వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా అధికార కాంగ్రెస్‌తో పాటు ఎంఐఎం, సీపీఐ సభ్యులు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ అదే రోజు బీఆర్ఎస్ నిర్వహించిన ‘చలో నల్లగొండ’సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. 14న బడ్జెట్ ఆమోదం ఈ నెల 14న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై అసెంబ్లీ చర్చించగా, 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానంతో ఆమోదం పొందింది. అదే రోజు ద్రవ్య వినిమయ బిల్లుపైనా చర్చించి ఆమోదించారు. 16న కులగణన బిల్లుపై చర్చించి సభ ఆమోదించింది. 17న సాగునీటి రంగం శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతించకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఇరుకైన గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లును సభ ఆమోదించింది. బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేందుకు ఉభయ పక్షాలు పోటాపోటీగా చేసిన ప్రసంగాలు హోరాహోరీగా సాగగా.. పలుమార్లు రగడకు దారితీశాయి. విపక్ష బీజేపీ, ఎంఐఎం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్పై సున్నిత విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకున్నాయి. సీపీఐ ఏకైక సభ్యు డు కూనంనేని సాంబశివరావు అధికార కాంగ్రెస్‌ను సమర్థిస్తూనే ఉభయ పక్షాల వైఖరిని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ సభకు గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ పదేపదే ప్రస్తావించింది. -
రేపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శనివారం (10న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 11న విరామం ఇచ్చి.. 12న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చించనున్నారు. 13న బడ్జెట్‌ను ఆమోదించి, ఇరు సభలను వాయిదా వేయనున్నారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిల అధ్యక్షతన వేర్వేరుగా సమావేశమైన ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశ మందిరంలో అసెంబ్లీ, శాసన మండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. తర్వాత సభలను వాయిదా వేశారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమై.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపి, ఆమోదిస్తాయి. శనివారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ‘2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్’ను ప్రవేశపెడతారు. 11న ఆదివారం విరామం. 12న అసెంబ్లీ, మండలి వేర్వేరుగా సమావేశమై బడ్జెట్ అంశాలపై చర్చిస్తాయి. 13న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదిస్తారు. దీనితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే.. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన తీర్మానా లు, అంశాలు చర్చకుపెడతారని సీఎం రేవంత్‌రెడ్డి బీఏసీ భేటీలో సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ఆయా అంశాలను సభ ముందు పెట్టే అంశంపై మరోమారు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. మరోవైపు గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన శాసనమండలి బీఏసీ కూడా.. శాసనసభ తరహాలోనే ఈ నెల 13 వరకు సమావేశం కావాలని నిర్ణయించింది. ’ బీఏసీలలో ఎవరెవరు? శాసన మండలి, శాసనసభల నిర్వహణ షెడ్యూల్, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయడానికి.. అధికార, ప్రతిపక్షాల సభ్యులతో ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’లను ఏర్పాటు చేస్తారు. సమావేశాల ప్రారంభం రోజున ఈ బీఏసీలు స్పీకర్/చైర్మన్ అధ్యక్షతన సమావేశమై.. అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగే తేదీలు, చర్చించే అంశాలను నిర్ణయిస్తాయి. రాష్ట్ర కొత్త శాసనసభ ఏర్పాటైన నేపథ్యంలో ‘బీఏసీ’ని ఏర్పాటు చేశారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బీఏసీ భేటీలో అధికార పక్షం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, విప్ బీర్ల అయిలయ్యకు చోటు కల్పించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చోటు దక్కింది. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ)లకూ అవకాశం కల్పించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనందున ఆ పార్టీ విజ్ఞప్తి మేరకు మహేశ్వర్‌రెడ్డికి చోటు దక్కింది. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో.. డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), మహమూద్ అలీ (బీఆర్ఎస్), ఏవీఎన్ రెడ్డి (బీజేపీ), ఎఫెండీ (ఎంఐఎం), అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
పాడి, ఉద్యాన రంగాలకు ఊతం
సాక్షి, అమరావతి : ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో తృణ, చిరుధాన్యాల పంటల సాగును రాష్ట్రంలో బాగా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఉద్యానవన, పశుగణ, మత్స్య రంగాలు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నడిపించే వృద్ధి చోదకాలుగా గుర్తించి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాట, కొబ్బరి, మిరప పంటల ఉత్పాదకతలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. 2023-24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు మంగళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ♦ భారతదేశంలో మామిడి, కమల, పసుపు ఉత్పత్తిలో రాష్టం 2వ స్థానంలో, సూక్ష్మ నీటి పారుదల (డ్రిప్ ఇరిగేషన్) అమలులో 3వ స్థానంలో నిలిచింది. ♦ దేశంలోనే ఏడాదికి గుడ్ల ఉత్పత్తిలో 2,645 కోట్ల గుడ్లతో ప్రథమ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 10.26 లక్షల టన్నులతో రెండవ స్థానంలో, పాల ఉత్పత్తిలో 154.03 లక్షల టన్నులతో 5వ స్థానంలో ఉంది. ♦ పశు ఆరోగ్య రక్షణలో భాగంగా 1962కు ఫోన్ చేయగానే పాడి రైతు వద్దకు వచ్చేలా రూ.252.91 కోట్ల వ్యయంతో 340 వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏర్పాటు చేసింది. ♦ పాల సహకార సంఘాల బలోపేతానికి అమూల్ ప్రాజెక్ట్‌కు ఎన్సీడీసీ ద్వారా పాడి పరిశ్రమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి రుణంగా రూ.1,362 కోట్లు అందించింది. ♦ రూ.1,868.63 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం కింద 45-56 సంవత్సరాల మధ్య వయసున్న 2.49 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ♦ జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల్లో రూ.20,020 కోట్లు (35 శాతం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాగా ఉంది. రాష్ట్రం పచ్చతోరణం రాష్ట్రంలో 26 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం పని చేస్తోంది. జగనన్న పచ్చ తోరణం కింద 2022-23లో 3.05 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ఐఎస్ఎఫ్ఆర్-2021 (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్) నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణాన్ని 646.9 చ.కి.మీ మేరకు పెంచడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు 2023-24లో రాష్ట్రంలోని 23 ప్రదేశాలలో నగరవనాలు/దేవాలయ ఎకో పార్కులను అభివృద్ధి చేయనుంది. స్వచ్ఛ భారత్ సంకల్పానికి నిదర్శనం ♦ క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాల సేకరణ, నిర్వహణ కోసం 2022-23లో రూ.220.82 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో 70 శాతం మేర ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.417.76 కోట్లతో ప్రతి మండలంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ♦ ప్రభుత్వ చర్యలతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరిలో విశాఖ, విజయవాడ, తిరుపతి మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. ♦ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘క్లీనెస్ట్ స్టేట్/నేషనల్ క్యాపిటల్’ అవార్డు, 10-40 లక్షల జనాభా కేటగిరిలో విశాఖపట్నం ‘క్లీన్ బిగ్ సిటీ’ అవార్డు, సౌత్ జోన్ (50,000 నుండి ఒక లక్ష జనాభా) కేటగిరీలో పులివెందులకు ‘ఇన్నోవేషన్ - బెస్ట్ ప్రాక్టీసెస్’ కింద అవార్డులు లభించాయి. మిలియన్ ప్లస్ సిటి కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ సిటీగా నిలిచింది. ఉపాధి నైపుణ్యాల పెంపు ♦ ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే ఉపాధి నైపుణ్యాల పెంపుపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 45,871 కాంట్రాక్టు, 3.72 లక్షల అవుట్సోర్సింగ్/ఇతర ఉద్యోగాలు కలిపి మొత్తం 6.31 లక్షల ఉద్యోగాలు కల్పించింది. ♦ అవుట్ సోర్సింగ్/ గౌరవ వేతన ఆధారిత ఉద్యోగుల జీతాలు పెంచి, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్‌ను అందిస్తోంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 దశలలో వైఎస్సార్ బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, జిల్లాల్లో నైపుణ్య కేంద్రాలను నెలకొల్పనుంది. నేరుగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ♦ విద్యుత్ రంగంలో.. విద్యుత్ ఖర్చును తగ్గించి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎస్ఈసీఐతో ఒప్పందం చేసుకుంది. కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించి 800 మెగావాట్లు, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించి 800 మెగావాట్ల పనులను పూర్తి చేసింది. ♦ రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించి పారదర్శకంగా నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందిస్తోంది. డీబీటీ విధానం ద్వారా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రీ సర్వే అద్భుతం 17,584 గ్రామాల్లో సమగ్ర రీ సర్వేను చేపట్టిన రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 2000 గ్రామాల్లో 4,38,899 మంది ఆస్తి యజమానులకు ‘శాశ్వత భూ హక్కు పత్రాలు’ పంపిణీ అయ్యాయి. ఈ విషయమై నీతి ఆయోగ్ నుంచి ప్రశంసలు అందుకుంది. రాజకీయ సాధికారతో సామాజిక న్యాయం ♦ మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం పదవులను, రెండో విడతలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో (80 శాతం) నాలుగు పోస్టులను వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం. ♦ 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో తొమ్మిదింటిని (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ్ చట్టం చేశాం. ఇందులో భాగంగా 137 వివిధ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులలో (58 శాతం) వీరినే కూర్చోబెట్టాం. ♦ 56 బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ, ఒక ఎస్టీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వెనుబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. ‘జగజ్జీవన జ్యోతి’ పథకం కింద 15.14 లక్షల ఎస్సీ, 4.5 లక్షల ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. ఇంకా ఎన్నెన్నో.. ♦ వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల సంఖ్యను 26కు, రెవెన్యూ డివిజన్లు 76కు, పోలీసు డివిజన్లను 108కి పెంచాం. 1956 తర్వాత తొలిసారి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ♦ ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం అమలు చేస్తున్నాం. దీనికి నీతి ఆయోగ్ ప్రసంశలు లభించాయి. ♦ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సచివాలయ స్థాయిలో పరిష్కరించడానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశాం. ♦ 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నాం. ♦ నేరాల నియంత్రణలో భాగంగా తీసుకున్న వినూత్న పోలీసింగ్ చర్యలు శాంతియుత వాతావరణానికి దోహదపడ్డాయి. మహిళల భద్రత, రక్షణకు దిశ బిల్లు తెచ్చాం. ♦ రాష్ట్రాన్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా చేయడానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తాం. ♦ రాష్ట్రం ఎగుమతుల్లో 2019-20లో 7వ ర్యాంకులో ఉంది. 2020-21 నాటికి 16.08 బిలియన్ డాలర్లతో నాల్గవ ర్యాంకుకు చేరుకుని మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జాతీయ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను అందిస్తోంది. దీనిని 2030 నాటికి 10 శాతానికి పెంచేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ♦ రూ.4,994 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ రోడ్లు ప్రాజెక్టు చేపట్టాం. గత ఏడాది పీఎంజీఎస్‌వై కింద రూ. 502 కోట్ల వ్యయంతో 992 కిలోమీటర్ల తారు రోడ్లు వేశాం. ఈ ఏడాది 1,236 కిలోమీటర్లు మేర 174 రోడ్లను, 21 వంతెనలను పూర్తి చేయనున్నాం. ♦ రూ.2,173 కోట్ల వ్యయంతో 5,181 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు ప్రభుత్వం చేపట్టింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో రూ.3,013 కోట్ల అంచనా వ్యయంతో 1,260 కిలోమీటర్ల రోడ్ల పనులు నడుస్తున్నాయి. ♦ దేశంలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత అత్యాధునిక సాంకేతికత సాయంతో గ్రామాల్లో రీసర్వే చేస్తోంది. -
వచ్చే నెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. వారం రోజులు సభ నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశాలపై అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. ఈ సమావేశాలను ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 13న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా సమావేశాలను ఆ మరుసటి రోజు నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నేను రాను.. మీరు వెళ్లండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో టీడీపీ పునరాలోచనలో పడింది. సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణాన్ని చూపించి చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. మీడియా సమావేశం పెట్టి బోరున విలపించి అందరిలోనూ నవ్వుల పాలయ్యారు. అప్పట్లో ఆయనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో చంద్రబాబు చేసిన శపథం, హడావుడి నేపథ్యంలో ఈ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పి నానా హడావుడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక చేతులెత్తేయడం, ఏడవడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు తీరును తప్పు పట్టారు. దీంతో తాను అసెంబ్లీకి రానని, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం గతంలో శపథం చేసిన కారణంగా వెళ్లకపోతేనే బాగుంటుందని చెబుతున్నారు. ఏ మొఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి నిరసనలు తెలపాలని సూచిస్తున్నారు. కనీసం గవర్నర్ ప్రసంగం వరకైనా ఉండాలని, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఉండి తర్వాత నిరసన తెలిపి వచ్చినా బాగుంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఈ అంశంపై పలువురు నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తాను వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలను పంపించాలని బాబు భావిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులతో జూమ్‌లో మాట్లాడిన చంద్రబాబు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సాయమందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. విద్యార్థులతో రెండో రోజూ శనివారం ఆయన జూమ్ కాల్లో మాట్లాడారు. విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉక్రెయిన్, పోలండ్, హంగేరీలలో స్థిరపడిన తెలుగువారు (ఎన్నారైలు)ని చంద్రబాబు సంప్రదించారు. విద్యార్థులకు అవసరమైన డబ్బు, ఆహారం, హోటల్ ఖర్చులు అందించాలని వారిని కోరారు. ఆ ఖర్చును టీడీపీ నుంచి తిరిగి చెల్లిస్తామని తెలిపారు. పరిస్థితి క్లిష్టంగానే ఉందని, ఎవరూ వారి ప్రాంతాల నుంచి బయటకు రావద్దన్న ఇండియన్ ఎంబసీ సూచనలను పాటించాలని చెప్పారు. -
పాత పద్ధతిలోనే ఎన్పీఆర్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)–2020ను పాత ఫార్మాట్లోనే నిర్వహించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ నిర్వహణకు వినియోగించిన ఫార్మాట్‌నే ఈసారీ వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ భేటీలో నిర్ణయించింది. తాజాగా పాత ఫార్మాట్లోనే ఎన్పీఆర్ నిర్వహణపైనా తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కేరళ, పశ్చిమ బెంగా ల్ ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్పీఆర్ పనులను పూర్తిగా నిలిపేయగా రాజస్తాన్, పంజాబ్ శాసనసభలు ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. బిహార్‌లో ఎన్నార్సీ జరపబోమని, ఎన్పీఆర్ను సైతం పాత ఫార్మాట్లోనే నిర్వహిస్తామని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్డీఏ పాలనలో ఉన్న బిహార్ తరహాలోనే రాష్ట్రంలోనూ పాత ఫార్మాట్లో ఎన్పీఆర్ నిర్వహించేలా తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఏవైనా 45 రోజులపాటు ఎన్పీఆర్ను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్పీఆర్ నిర్వహణపై శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భయాందోళనలను దూరం చేసేందుకు... ఎన్పీఆర్–2020 కరదీపికలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ప్రతి పౌరుడు తనతోపాటు తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం వివరాలను కచ్చితమైన సమాచారంతో ఇవ్వాల్సి ఉంది. అయితే అత్యధికం మంది వద్ద పుట్టిన తేదీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఇతర ఆధారాలు లేవు. అలాగే చాలా మందికి కచ్చితమైన పుట్టిన తేదీ తెలియదు. దీనికితోడు చనిపోయిన తల్లి దండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం తెలిసి ఉండే అవకాశం తక్కువే. నిరక్షరాస్యులైన పేదల వద్ద వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండవు. ఎన్పీఆర్–2020 ఫార్మాట్లో అడిగే ప్రశ్నలన్నింటికీ ప్రజలు ‘స్వచ్ఛందంగా’ఆధారాలు చూపించాలని కేంద్రం పేర్కొంటోంది. మరోవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత హింసకు గురై 2014 డిసెంబర్ నాటికి భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైనులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. ఎన్నార్సీకి ఎన్పీఆర్ డేటాబేస్ మూల ఆధారమని కేంద్ర హోంశాఖ వెబ్సైట్ పేర్కొంటోంది. ఎన్పీఆర్, సీఏఏ, ఎన్ఆర్సీలలో ఒకదానితో మరొకటికి సంబంధం లేదని కేంద్రం పేర్కొంటున్నా దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్సీలో చోటు సంపాదించని వారిలో ముస్లిమేతరులందరికీ సీఏఏ కింద పౌరసత్వం లభించనుందని, చివరికి తమ పౌరసత్వమే ప్రశ్నార్థకం కానుందని ముస్లింలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలను దూరం చేసేందుకు ఎన్పీఆర్ను పాత ఫార్మాట్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పాత ఫార్మాట్ సులువు... ఎన్పీఆర్–2011 ఫార్మాట్‌ను వినియోగిస్తే 15 ప్రశ్నలకు సాధారణ రీతిలో సమాధానమిస్తే సరిపోనుంది. పేరు/కుటుంబ పెద్దతో సంబంధం/తండ్రి పేరు/తల్లిపేరు/జీవిత భాగస్వామి పేరు (ఒకవేళ వివాహితులైతే)/లింగం/పుట్టిన తేదీ/వివాహితులా కాదా?/పుట్టిన ప్రాంతం/జాతీయత/ప్రస్తుత చిరునామా/ప్రస్తుత చిరునామాలో ఎన్నాళ్ల నుంచి నివాసం/శాశ్వత చిరునామా/వృత్తి/విద్యార్హతల సమాచారాన్ని ఎన్యూమరేటర్లు కోరనున్నారు. ఒకవేళ ఎన్పీఆర్–2020 ఫార్మాట్‌ను వినియోగిస్తే ఇవే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని మరింత లోతుగా, ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలతో ప్రజలు ఇవ్వాల్సి రానుంది. -
సంప్రదాయానికి భిన్నంగా నేడూ సభ..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. శాసనసభ, శానసమండలిలో శనివారం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు. ఆదివారం సెలవుగా ఖరారు చేశారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అధ్యయనం కోసం అసెంబ్లీకి సెలవు ఉంటుంది. అయితే ఉభయసభలను శనివారం సైతం నిర్వహించాలని శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)లు నిర్ణయించాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ అధ్యక్షతన శాసనమండలి బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బోడికుంటి వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌రావు ఇందులో పాల్గొన్నారు. ఈ రెండు సభల బీఏసీలోనూ సోమవారంతో సభను ముగించాలని నిర్ణయించారు. సంతాపం అనంతరం చర్చలు శనివారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. దివంగత మాజీ గవర్నర్ నారాయణ్‌దత్ తివారీతోపాటు 15 మంది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభలో సంతాపం తెలుపుతారు. జీఎస్టీ, పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతుంది. అనంతరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. ఇటు శాసన మండలిలో నారాయణ్‌దత్ తివారీకి సంతాపం ప్రకటించిన అనంతరం బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. ఆరోగ్యకరమైన చర్చ జరగాలి: ప్రశాంత్‌రెడ్డి ప్రతిపక్షాలు ప్రస్తావించే అన్ని అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. బడ్జెట్‌పై కాంగ్రెస్ తరపున ఇద్దరు సభ్యులు చర్చను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. అదేరోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తవుతుందని వెల్లడించారు. -
28 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. 17 రోజుల పాటు సభ నిర్వహించనున్నారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 9, 10, 11, 17, 18, 24, 25 తేదీల్లో సభకు సెలవులుగా నిర్ణయించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. -
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో 2018–19 బడ్జెట్‌ను ఈ నెల 8న ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.30కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఇవి 14వ అసెంబ్లీ 11వ సమావేశాలు కాగా, శాసన మండలికి 13వ సమావేశాలు. ఈ సమావేశాలకు ప్రతిపక్షం వైఎస్సార్సీపీ హాజరవుతుందా, లేదా అన్నది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడంపై ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేవరకూ అసెంబ్లీకి హాజరు కాబోమని వైఎస్సార్సీపీ గతంలోనే ప్రకటించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులు శాసనసభ, మండలి గత సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, శాసన మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలసి వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష పడినందున, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయనను అనర్హుడిగా ప్రకటించాల్సి ఉన్నా స్పీకర్ ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. ఈ అంశాన్ని కూడా వైఎస్సార్సీపీ నేతలు స్పీకర్ వద్ద ప్రస్తావించారు. దెందులూరు స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించాలని కోరారు. ఫిరాయింపుదార్లపై చర్యలు చేపడితే తమ సభ్యులంతా మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే రాష్ట్ర శాసనసభ, శాసన మండలి చరిత్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. ఈ పరిణామం పట్ల రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు. ప్రతిపక్షం లేకపోతే సభలో అధికార పక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని చెబుతున్నారు. -
ఇష్టారాజ్యానికి ఓ ‘నల్ల’ చట్టం!
సాక్షి, అమరావతి: మేము తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించరాదంటూ ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చే సాహసాన్ని భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం మాత్రం దీనికి అతీతులట! తన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదంటూ చంద్రబాబు ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ మేరకు ముసాయిదా బిల్లుకు ఇటీవల కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఇది చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా భూములు, రాయితీలు కేటాయించుకోవచ్చు. పరోక్షంగా ప్రయోజనం పొందొచ్చు. ఇదేం అన్యాయం అని అడగడానికి, న్యాయం కోసం కోర్టుకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఆ పిటిషన్లను కోర్టులు అనుమతించొద్దు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు సింగపూర్ తరహాలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తూ 2016 మార్చి 17న ప్రభుత్వం జీవో 87ను జారీ చేసింది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఆర్థికాభివృద్ధి మండలికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ముసాయిదా బిల్లును రూపొందించి ఫిబ్రవరి 21న మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. గతంలో జీవో ద్వారా ఏర్పాటైన సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీని, సీఎం నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిని కూడా ఈ ఆర్థికాభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకొస్తూ వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించే ముసాయిదా బిల్లులోని పలు అంశాలు బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని, పలు శాఖలు చేయాల్సిన పనులపై గుత్తాధిపత్యం సాధించే అంశాలున్నాయని ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా సరే అభ్యంతరాలను తోసిపు చ్చుతూ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి తీసుకునే నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేయడానికి వీల్లేదని, ఎలాంటి ప్రాసిక్యూషన్స్‌కు అవకాశం ఉండదని బిల్లులో స్పష్టం చేశారు. మండలి తీసుకునే నిర్ణయాలతోపాటు అందులో పనిచేసే సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, కన్సల్టెన్సీలపైనా ఏ న్యాయస్థానం లోనూ కేసులు వేయడానికి వీల్లేదని పేర్కొ న్నారు. ఆర్థికాభివృద్ధి మండలి మంచి ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకుంటుందని భావించాలని, ఈ నిర్ణయాలను తప్పుపట్టే పిటిషన్లను ఏ న్యాయస్థానాలు కూడా అనుమతించరాదని తేల్చిచెప్పారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలట! భారీ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను రాబట్టేందుకు ఆర్థికాభి వృద్ధి మండలి దేశ విదేశాల్లో పర్యటించనుంది. నిబంధనల మేరకు విదేశీ పర్యటనల చార్జీలను, టీఏ, డీఏలను ఇస్తే చాలదని, పెద్ద ఎత్తున నిధులు అవసర మని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలని కూడా స్పష్టం చేశారు. అయితే, నిబంధనల మేరకు వర్తించే టీఏ, డీఏలు మాత్రమే వర్తిస్తాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. సొంత ప్రయోజనాల కోసమే... రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయాలను కోర్టుల పరిధి నుంచి తప్పిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ప్రభుత్వ పెద్దలు ఆర్థికాభివృద్ధి మండలి ముసుగులో మరింత ప్రయోజనం పొందడానికి వ్యూహం రచించారు. అస్మదీయులకు భూములు, రాయితీల కేటాయింపుపై ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన సీఎం వ్యూహత్మకంగా పావులు కదిపారు. అందుకే ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించేందుకు వీల్లేదంటూ ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికార వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మార్చి 14 లేదా 15న బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: 2018–19 వార్షిక బడ్జెట్‌ను మార్చి 14 లేదా 15న ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని భావిస్తోంది. పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి వీలుగా సమావేశాలు రెండు వారాలు జరగవచ్చు. పంచాయతీరాజ్ కొత్త చట్టం బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ప్రకటించారు. సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో మరిన్ని జనాకర్షక పథకాలుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాఖల ప్రతిపాదనలు, కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ.61,607 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88,038 కోట్లు కేటాయించింది. ఈసారి భారీ అంచనాలుండటం, ఆదాయ వృద్ధీ ఆశించినంతగా ఉండటంతో భారీ బడ్జెట్‌ను ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. రూ.1.8 లక్షల కోట్ల మేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పెట్టుబడి సాయం.. రైతు బీమా రెండేళ్ల కిందట సాగునీటికి స్పష్టమైన కేటాయింపులతో కొత్త అధ్యాయానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది. ఇది బడ్జెట్‌కు అనుబంధంగా ఉంటుంది. సాగుకు రూ.15 వేల కోట్లు కేటాయించవచ్చు. ఖరీఫ్, రబీ పంటలకు కలిపి ఏడాదికి ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సాయమందించే పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్ నుంచే రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తోంది. ఈ పథకానికి తొలి ఏడాది రూ.12 వేల కోట్లు కావాలని అంచనా. సీఎం తాజాగా ప్రకటించిన మేరకు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, 50 శాతం సబ్సిడీపై నాటు వేసే యంత్రాలు, 75 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు, పంట రుణాలకు వడ్డీ రాయితీ తదితరాల నేపథ్యంలో సాగుకు ఈసారి భారీగా కేటాయింపులుండనున్నాయి. సాగునీటికి పెద్ద వాటా సాగునీటి ప్రాజెక్టులకు ఈసారీ భారీగా నిధులందనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తి చేయటంతో పాటు 50 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందించాలన్న లక్ష్య సాధనకు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పరిపూర్తి తదితరాలకు రూ.30 వేల కోట్ల దాకా కేటాయించవచ్చు. కొత్త పథకాలివే పాత పథకాలకు మెరుగులు దిద్దడంతో పాటు ఈసారి బడ్జెట్లో పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆసరా పెన్షన్ల మొత్తం, పరిధి పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం పెంపు, నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి తదితరాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిరుపేద గిరిజనుల ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పథకానికీ రూపకల్పన చేస్తోంది. అలాగే జనాభాను బట్టి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల దాకా ప్రభుత్వమే నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. -
కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా సమావేశాలు
సాక్షి, అమరావతి: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో అసెంబ్లీ భవనంలో ఏర్పాటు తదితరాలపై ఆయన మంత్రి నారాయణతో కలిసి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వెలగపూడిలో అసెంబ్లీ భవనం డిసెంబర్ నెలాఖరులోపు అందుబాటులోకి వస్తుందని, బడ్జెట్ సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామన్నారు. ప్రత్యేకంగా తాత్కాలిక అసెంబ్లీ భవనం : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం, అసెంబ్లీ ఒకే ప్రాంగణంలో ఉంటే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో వేర్వేరుగా ఉండేలా చూడాలని నిర్ణయించింది. అసెంబ్లీ భవనం చుట్టూ ప్రహరీగోడ నిర్మించనున్నారు. -
రెండోరోజూ అదే లొల్లి
సాక్షి ముంబై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. సభ ప్రారంభమైన తర్వాత రైతుల సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలోని కరువు పరిస్థితి, రైతుల ఆత్మహత్యలపై ధ్వజమెత్తాయి. ఇరు సభల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గందరగోళం సృష్టించాయి. అకాల, వడగళ్ల వర్షం కారణంగా రైతులకు కలిగిన నష్టంపై వెంటనే చర్చలు జరపాలని ప్రతిపక్షాలు ప్రారంభం నుంచి కోరాయి. సెక్షన్ 97, 57 మేరకు నోటీసులు అందించాయి. కాగా, విధానసభలో చర్చలు జరిపేందుకు అధికార పక్షం సిద్ధమైనప్పటికీ స్పీకర్ మాత్రం చర్చలకు నిరాకరించారు. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభను వాకౌట్ చేస్తూ బయటికి వెళ్లిపోయారు. అనంతరం స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ముస్లీం రిజర్వేషన్ల విషయంపై కూడా అసెంబ్లీ బయట తమదైన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశాయి. ముస్లీం రిజర్వేషన్ బిల్లు రద్దు చేసిన జీఆర్ కాపీలను కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు దహనం చేశారు. రైతులకు న్యాయం చేయాల్సిందే: విఖే పాటిల్ రాష్ట్రంలోని రైతులందరికి న్యాయం చేయాల్సిందేనని విధాన మండలి ప్రతిపక్ష నాయకుడు రాధకృష్ణ విఖేపాటిల్ పేర్కొన్నారు. రైతుల సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అన్ని అంశాలను పక్కన బెట్టి రైతుల అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేసినా రైతుల సమస్యపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. మరోవైపు శాసన సభ ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ముండేతో పాటు ఎన్సీపీ నాయకుడు జితేంద్రఅవాడ్ కూడా ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు. భివండీ పరిసరాల్లో ‘లాజిస్టిక్ హబ్’ సాక్షి, ముంబై: భివండీ పరిసరాల్లో 2200 హెక్టార్ల స్థలంలో ‘లాజిస్టిక్ హబ్’ నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విధాన మండలిలో మంగళవారం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఠాణే జిల్లా భివండీ పరిసరాల్లో మఢవీ కంపౌండ్‌లో ఓ రద్దీ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదం విషయంపై ఎమ్మెల్సీ అజయ్ చౌదరీ ప్రశ్న లేవనెత్తారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న గోడౌన్లన్నింటిని పర్యవేక్షిస్తున్నామని, భద్రత విషయంపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణ అనంతరం గోడౌన్లను క్రమబద్ధీకరిస్తామని, నియమాలను సడలించినప్పటికీ క్రమబద్ధీకరణ చేయలేని పరిస్థితిలోఉన్న గోడౌన్లను తొలగిస్తామని చెప్పారు. -
అలక.. ఆగ్రహం
కోమటిరెడ్డి : మేడమ్... నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి : కుదరదు.. మీ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు మాట్లాడారు.. కోమటిరెడ్డి : మేడమ్...నేను డిప్యూటీ లీడర్‌ను...నాకు అవకాశం ఇవ్వండి.. డిప్యూటీ స్పీకర్ : లేదండీ... ఇప్పటికే మీ వాళ్లు మాట్లాడారు... సీన్‌కట్ చేస్తే సభలో కోమటిరెడ్డి లేరు. ఏమయిందోనని అనుకుంటుంటేనే ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి దగ్గరకు వెళ్లారు ఏదో చెప్పి వచ్చారు. మళ్లీ కోమటిరెడ్డి సభలోకి ఎంట్రీ సీఎం : కోమటిరెడ్డి గారు మంత్రిగా పనిచేశారు.. ఆయనంటే మాకు గౌరవం.. ఆయన సభ మీద అలిగివెళ్లిపోతే ఎలా..? కోమటిరెడ్డి : లేదు సార్... నేను అనవసరంగా మైక్ అడిగేవాడిని కాదు... అయినా నేను అలిగింది సభపై కాదు.. స్పీకర్ మీద. * అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారిన కోమటిరెడ్డి * మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని సభనుంచి వెళ్లిపోయిన సీఎల్పీ ఉపనేత * బుజ్జగించిన సీఎం కేసీఆర్ * సభపై కాదు స్పీకర్‌మీద అలిగానన్న మాజీమంత్రి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఇదంతా గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరిగిన చర్చ... ఈ ఉదంతంతో జిల్లాకు చెందిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు. తనకు సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఆయన అలక.. ఆగ్రహాన్ని కలగలిపి వ్యవహరించిన తీరు ఆసక్తిని రేకెత్తించింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో శాంతించిన ఆయన ఒకదశలో తాను రాజీనామాకు కూడా సిద్ధమయ్యానని ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశం వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోమటిరెడ్డి కోరారు. అప్పుడు అధ్యక్షస్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముగ్గురు మాట్లాడారని, కూర్చోవాలని ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రెండు, మూడుసార్లు స్పీకర్‌ను మైక్ అడిగిన కోమటిరెడ్డి ఉన్నట్టుండి సభ నుంచి వెళ్లిపోయారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్న ఆగ్రహంతో వెళ్లిపోయి లాబీలో కూర్చున్నారు. పరిస్థితిని గమనించిన అధికార పక్ష నేతలు కోమటిరెడ్డి అలిగి వెళ్లిపోయారనుకుని ఇద్దరు దూతలను ఆయన వద్దకు పంపారు. టి.రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్), గువ్వల బాలరాజు (టీఆర్ఎస్)లు ఆయన వద్దకు వెళ్లి సీఎం సభలోకి రమ్మంటున్నారని కోరారు. దీంతో సభలోకి వచ్చిన కోమటిరెడ్డిని ఉద్దేశించి సీఎం కూడా సరదాగా మాట్లాడారు. కోమటిరెడ్డి సీనియర్ సభ్యుడని, మంత్రిగా పనిచేసిన ఆయన సభమీద అలిగి వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించారు. అప్పుడు స్పీకర్ కోమటిరెడ్డికి అవకాశం ఇవ్వడంతో తాను అనవసరంగా మైక్ అడిగే వాడిని కాదని, అయినా తాను అలిగింది సభపై కాదని, స్పీకర్‌మీద అలిగానని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. తమ జిల్లాలో అన్నీ సిమెంట్ పరిశ్రమలేనని, వాటి వల్ల వచ్చే దుమ్ము తప్ప జిల్లాకు ఒరిగిందేమీ లేదని, హైదరాబాద్ - నల్లగొండ ఇండస్ట్రీ కారిడార్‌ను మొదటి దశలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంమీద గురువారం అసెంబ్లీలో కోమటిరెడ్డి ఎపిసోడ్ సభ్యులకు కొంత ఉల్లాసాన్ని కలిగించింది. -
ఆదివాసీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు సారపాక(బూర్గంపాడు): ఆదివాసీల సమస్యలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని వైఎస్సార్సీపీ శాసనసభ పక్షనేత, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్టీ వర్గీకరణ కోరుతూ గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సారపాకలోని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట ఆదివాసీలు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ కాబట్టే తాను ఎమ్మెల్యేను కాగలిగానని అన్నారు. ఆదివాసీల న్యాయపోరాటానికి అండగా ఉంటానన్నారు. పాలకులకు ఆదివాసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఏజెన్సీలో నిజమైన ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటాలు కొనసాగించాలన్నారు. వాటికి తన మద్దతు ఉంటుందన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ డిమాండ్‌తో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 1956 నుంచి 1970 వరకు ఆదివాసీలకు అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఇప్పుడు కూడా వర్తింపజేయాలన్నారు. 1970 తర్వాత పెంచిన 2 శాతం రిజర్వేషన్లు యరుకల, యానాది, లంబాడీలకు అమలు చేయాలన్నారు. ఉమ్మడిగా రిజర్వేషన్ల అమలుతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందనే ఆవేదన్య వ్యక్తం చేశారు. ఆదివాసీల భూములు బంజారాలు కొనకుండా కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి దాగం ఆదినారాయణ, పాయం సత్యనారాయణ, ముర్రం వీరయ్య, సొడె చలపతి, గొంది లీలాప్రసాద్, ఇర్పా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేనెల 6 వరకు అసెంబ్లీ
బీఏసీ సమావేశంలో నిర్ణయం..16 రోజులు సమావేశాలు రేపు సాధారణ బడ్జెట్ .. శుక్రవారం వ్యవసాయ బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 6 తేదీ వరకు జరగనున్నారుు. 16 రోజులు సమావేశాలు జరుగుతారుు. శనివారాల్లోనూ సమావేశాలు జరగనున్నారుు. ఈ నెల 21న, 29న, ఆదివారాలు సభ జరగదు. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రభుత్వం బుధవారం సభలో ప్రవేశపెట్టనుంది. శుక్రవారం వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వచ్చే నెల 6న ద్రవ్య వినిమయ బిల్లును, ఆర్థిక సర్వే నివేదికలను సభలో ప్రవేశపెడతారు. పోలీసు శాఖలో సంస్కరణలు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలను రద్దు చేస్తూ జారీచేసిన మూడు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన చాంబర్లో నిర్వహించిన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, మంత్రి మాణిక్యాలరావు, ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీ ఎల్పీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 6వ తేదీతో ముగించాలని భావిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. కీలకాంశాలపై చర్చకు అనుమతించండి సభలో చర్చ కోసం వైఎస్సార్ సీపీ తరఫున 19 అంశాలతో కూడిన జాబితాను జగన్మోహన్రెడ్డి స్పీకర్‌కు అందించారు. నిబంధనల ప్రకారం వేర్వేరు ఫార్మాట్ల కింద ఈ అంశాలను సభలోనే తాము లేవనెత్తవచ్చని, కానీ సభా సంప్రదాయాలను గౌరవించేందుకు బీఏసీలో ముందుగా మీ దృష్టికి తెస్తున్నామని, వీటిపై చర్చకు తగి న సమయం కేటాయించాలని జగన్ స్పీకర్‌ను కోరారు. రాష్ట్రంలో ‘స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్లు(సర్కారీ హత్యలు)’ జరుగుతున్నాయని, వీటిపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించామని, చర్చ జరగాలని స్పష్టంచేశారు. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు కల్పించుకుంటూ ఆ మాట సరికాదని, ఉపసంహరించుకోవాలని అన్నారు. శాంతిభద్రతలపై చర్చ చేస్తే అన్నీ తేలుతాయని, చర్చకు అవకాశమివ్వాలని అడిగారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. వేరే ఫార్మాట్లో వస్తే చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది కదా అని అనడంతో చర్చ అంతటితో ముగిసింది. బిజినెస్ ఏమీ లేనందున విజన్ డాక్యుమెంటుపై రెండు రోజులు చర్చ పెట్టాలని యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా సమస్యలు అనేకం ఉంటే బిజినెస్ లేదని అనడమేమిటని జగన్ ప్రశ్నించారు. వ్యవసాయ, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణ మాఫీ, శాంతిభద్రతలు, సాగునీటి ప్రాజెక్టులు, వైద్య, ఆరోగ్య పరిస్థితులు, రాజధాని ప్రాంతం ఎంపిక వంటి అంశాలతో తాము జాబితా ఇచ్చామని చెప్పారు. బీఏసీలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని అనుసరించి బీఏసీలో ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నా, తమ పార్టీ నుంచి ఇద్దరికే అవకాశమివ్వడం సరికాదని జగన్మోహన్రెడ్డి చెప్పారు. బీఏసీలో అధికార పక్షం నుంచి అయిదుగురికి ప్రాతిని ద్యం కల్పించి, ప్రతిపక్షం నుంచి ఇద్దరికే అవకాశం కల్పిం చారని అన్నారు. స్పీకర్ కల్పించుకొని.. గతం నుంచి ప్రతి పక్షానికి రెండే స్థానాలు కేటాయిస్తున్నారని, అదే సంప్రదాయాన్ని కొనసాగించామని వివరిస్తూ ఆ జాబితాను చూపించారు. ఇప్పుడు అధికార, ప్రతిపక్షాలు రెండే ఉన్నం దున తమకు ప్రాతినిధ్యం పెంచాలని జగన్ కోరారు. -
తెలంగాణలో సెప్టెంబర్‌లో బడ్జెట్ సమావేశాలు
* అసెంబ్లీ సందర్శన.. స్పీకర్, అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ * ఏపీ సమావేశాలతో ఇబ్బంది లేకుండా షెడ్యూల్ * సభలో సీట్ల సంఖ్యను కుదించాలి * అసెంబ్లీ నిర్వహణ ఖర్చులు 58 : 42 శాతం భరించాల్సిందే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 10-13 తేదీల మధ్య ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. అదే సమయంలో అసెం బ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను కుదించాలన్నారు. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జర గనున్నందున తెలంగాణలో 153 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని, అందుకు అనుగుణంగా సభలో సీట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, కార్యదర్శి డాక్టర్ రాజా సదారాం, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులతో సమావేశమయ్యారు. ఆదివారం గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణలో ఇబ్బందులు, ఉద్యోగుల విభజన, ఖర్చుల వివరాలను తెలుసుకున్నారు. సెప్టెంబర్ 10 నుంచే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ సెప్టెంబర్ 13న మెదక్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్నట్లు సమాచారం రావడంతో పునరాలోచనలో పడ్డారు. సెప్టెంబర్ 30లోపు బడ్జెట్ తప్పనిసరిగా ఆమోదం పొందాల్సిన అవసరం ఉన్నందున అదేనెల 10-13 తేదీల మధ్యలో సమావేశాన్ని ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. అసెంబ్లీవర్గాల సమాచారం మేరకు...కేసీఆర్ రెండుగంటలకుపైగా అసెంబ్లీలో గడిపారు. శాసనసభలో కలియదిరిగారు. ప్రస్తుతం ఉన్న సీట్లను పార్లమెంట్ తరహాలో అమర్చే అంశాన్ని పరిశీలించాలని, ఈశాన్యం నుంచి అసెంబ్లీలోకి ప్రవేశించే విధంగా మార్చాలని కోరారు. మొత్తం సీట్ల సంఖ్యను 160 లోపు కుదించాలని, వాటిని 3 వరుసలకే పరిమితం చేయాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌కు ప్రత్యేకంగా బిజినెస్ రూల్స్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కు, చైర్మన్‌కు సూ చించారు. రెండురాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే కొనసాగుతున్నందున అందుకయ్యే వ్యయాన్ని తెలంగాణ, ఏపీ 42 : 58 శాతం వాటా భరించేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్, ఛైర్మన్‌తో కలిసి సీఎం భోజనం చేశారు.