
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. 17 రోజుల పాటు సభ నిర్వహించనున్నారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
ఈ నెల 9, 10, 11, 17, 18, 24, 25 తేదీల్లో సభకు సెలవులుగా నిర్ణయించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment