నేడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ బడ్జెట్‌ను కేబినేట్ అమోదించింది. మంగళవారం ఉదయం 11:45 గంటలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే స్థోమతకు మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో కూడా అప్పులతో పాటు రాని ఆదాయ వనరులను చూపిస్తూ కాగితాలపై భారీగా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. రూ.2,26,177.53 కోట్ల కేటాయింపులతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.