
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఇష్టానుసారం వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకోవడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎమ్మెల్సీలు చేయి చేసుకున్నారన్నారు. మండలిలో లోకేష్ ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు చెప్పినట్టు మండలి చైర్మన్ సభ నడిపారని నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.