koramutla srinivasulu
-
కూటమి ప్రభుత్వం పై కొరముట్ల శ్రీనివాసులు ఫైర్
-
‘చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు’
అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థల మీద రాజకీయం చేస్తుంటాడని, ఇప్పుడు ఏదీ లేక వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేసే చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు.వంద రోజుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడని, అసలు పరిపాలన ఏం చేశాడని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చని చంద్రబాబు.. ఇప్పుడు ఆర్భాటాలతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయలేక, యూట్యూబ్‌లో యాడ్స్లాగా డైవర్ట్ చెయ్యడానికి తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ మైసూర్లో ఉంటే, గుజరాత్‌లోని ల్యాబ్‌లో లడ్డు టెస్ట్ చేయించారన్నారు. అందులో మర్మం ఏమిటని శ్రీనివాసులు నిలదీశారు. శ్రీవెంకటేశ్వరస్వామికి ఒక్కసారి కూడా తలనీలాలు ఇవ్వని చంద్రబాబుకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రకు ముందు తరువాత తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు శ్రీనివాసులు. -
టీడీపీ నేతలకు కొరముట్ల శ్రీనివాసులు వార్నింగ్
-
ఎన్నికల ఫలితాలపై కొరముట్ల శ్రీనివాసులు రియాక్షన్
-
కాంగ్రెస్ పార్టీ పై కొరముట్ల శ్రీనివాసులు సంచలన కామెంట్స్
-
కాంగ్రెస్ పార్టీ పై కొరముట్ల శ్రీనివాసులు సంచలన కామెంట్స్
-
సాహస వలంటీర్‌కు నగదు పురస్కారం
వైఎస్సార్: రైల్వేకోడూరు మండలం ఓ.కొత్తపల్లెలో శనివారం రాత్రి పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన గుండంలో కల్లూరి బాషా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోగా వలంటీర్ చాపల సురేష్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు సోమవారం వలంటీర్ ఇంటికి వెళ్లి సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందనేందుకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. కాగా పీర్లగుండంలో పడి తీవ్రగాయాలైన బాషాకు మెరుగైన వైద్యం అందించాలని రుయా ఆసుపత్రిలోని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్‌రాజు, ప్రముఖ న్యాయవాది ఆర్సీ సురేష్‌బాబు, ఎంపీటీసీ జనార్దన్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, సుంకేసుల బాషా, తొండం రాజేంద్ర, ధనుంజయ, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
'ఒక్క మాటతో 24 మంది రాజీనామా చేశారు.. అది మా కమిట్మెంట్'
సాక్షి, తాడేపల్లి: మంత్రి పదవులపై నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదేనని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ఎటువంటి పని చెప్పినా చేయడానికి నేను సిద్ధం. ప్రభుత్వంలోకి తీసుకుంటారా.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది సీఎం ఇష్టం. ఆయన మాటకు మేమంతా కట్టుబడి ఉంటాం. ఆయన చెప్పగానే 24 మంది మంత్రుల రాజీనామా చేశారు. అది మా కమిట్మెంట్. నాకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది 11వ తేదీన తెలుస్తుంది. నాకు ఏ బాధ్యత అప్పజెప్పినా జగనన్న సైనికుడిలా పనిచేస్తానని' ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. చదవండి: (ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు) -
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు
-
ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు
-
కృష్ణా జలాల హక్కులను కాపాడుకుంటాం
రైల్వేకోడూరు అర్బన్: కృష్ణా జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు అన్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం దుందుడుకుగా కృష్ణా జలాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతూ కృష్ణా బోర్డు ఆదేశాలు, ఇరు రాష్ట్రాల ఒప్పందాలను బేఖాతరు చేస్తోందన్నారు. కృష్ణా బోర్డు నిష్పక్షపాతంగా తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ నీటి వాడకం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తాగు, సాగు నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ ప్రభుత్వం నీరు తోడేస్తుండడం దారుణమన్నారు. శ్రీశైలంలో 850 అడుగుల నీరు ఉంటేనే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమకు నీరు ఇవ్వచ్చని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీరు రావాలంటే శ్రీశైలంలో నీరు నిల్వ ఉండాలన్నారు. తెలంగాణలో పులిచింతల, సాగర్‌లలో అవసరం లేకున్నా నీరు వాడుకోవడం వల్ల సీమకు నష్టం జరుగుతోందన్నారు. అక్కడ నిర్మిస్తున్న రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సహకరించకుండా రాజకీయ పబ్బం కోసం తెలంగాణకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించాలని కోరారు. -
టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరించింది..
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఇష్టానుసారం వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకోవడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎమ్మెల్సీలు చేయి చేసుకున్నారన్నారు. మండలిలో లోకేష్ ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు చెప్పినట్టు మండలి చైర్మన్ సభ నడిపారని నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ఆయన్ని దుష్టశక్తులు ఆవహించాయి’
సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌ను దుష్టశక్తులు ఆవహించాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను కరోనా సాకుతో వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబుతో ఈసీ కుమ్మక్కై వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. అమరావతిలో గుంపు గుంపులుగా ధర్నాలు చేస్తున్నారని అక్కడ కరోనా లేదా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. ‘ఆ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీకి సహకరిస్తున్నారని తెలిపారు. రైల్వేకోడూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దారుణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే టీడీపీ నేతలు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేవారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ విమర్శలను శ్రీనివాసులు ఖండించారు. (పల్లె ప్రగతికి విఘాతం ) -
‘40 ఇయర్స్ ఇండ్రస్టీ’ ప్రవర్తన ఇలాగేనా..
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఏనాడు చంద్రబాబు రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో మరణాలను కూడా నమోదు చేయించలేదని మండిపడ్డారు. సిగ్గు పడ్డాలి.. 40 ఇయర్స్ ఇండ్రస్టీ అని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మార్షల్‌తో ప్రవర్తించిన తీరుతో సిగ్గు పడాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు తీరుపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారన్నారు. దిశ చట్టంపై మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దిశ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిస్తూ కేజ్రివాల్ లేఖ కూడా రాశారని తెలిపారు. -
చంద్రబాబు సిగ్గు పడ్డాలి..
-
‘చంద్రబాబు, లోకేష్‌కు టైం అయిపోయింది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మార్షల్ అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూజ్లెస్ ఫెలోస్ అని దూషించడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయనతో పాటు విప్ కొరముట్ల శ్రీనివాసులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా చీఫ్ వీప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు, లోకేష్‌కు టైమ్ అయిపోయిందని, ప్రజలు తమను గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విమర్శించారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే టీడీపీ వాళ్లు వాకౌట్ చేయడం దారుణమన్నారు. అలాగే కొరముట్లు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను పూర్తిగా అమలు చేశారని పేర్కొన్నారు. -
చంద్రబాబూ..భాష మార్చుకో..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తప్పుబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలి పెట్టిన సీఎం పై టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తప్పుడు ఆరోపణలు చేయటం తగదన్నారు. టీడీపీ సభ్యుల పట్ల మార్షల్స్ మర్యాద పూర్వకంగానే వ్యవహరించారని, అయినా గాని సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చంద్రబాబు అనుచిత ప్రవర్తనపై వీడియో కూడా ప్రదర్శించామని చెప్పారు. సభలో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ సభ్యులు ఈ విధంగా వ్యవహరించటం సరైన పద్దతి కాదన్నారు. బిల్లులకు ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
‘ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలోనే’
సాక్షి, వైఎస్సార్ కడప: ధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతుందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేవలం రెండు పేజీల్లో యూనిక్‌గా నవరత్నాల అమలకు.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాంది పలికారని తెలిపారు. ఆదేవిధంగా జగన్మోహన్రెడ్డిని ప్రకృతి ఆశీర్వదించిదని, వాతావరణం పులకరించి.. అన్ని డ్యాంలు నిండు కుండలా ఉన్నాయన్నారు. కాగా తొట్టిగ్యాంగ్ పార్టీ అయిన టీడీపీ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ‘70 ఏళ్లు ఉన్నాయి. పెద్ద మనిషివి కొంచెం మైండ్ పెట్టు. పదేళ్ల వెనక్కి వెళ్లావు’ అంటూ పరోక్షంగా చంద్రబాబుపై కొరముట్ల విమర్శలు చేశారు. -
అసెంబ్లీ చర్చ సమయంలో టీడీపీ తన బుద్ది చూపింది
-
‘వైఎస్సార్సీపీకి 130 సీట్లు పక్కా’
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌ను నమ్ముతున్నారని, వైఎస్సార్సీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వే చేయకుండా అబద్దాలు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది విశాఖపట్నం: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా తమ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. మరో 24 గంటల్లో రాష్ట్రంలో రాజన్న పాలనా రాబోతుందని చెప్పారు. సొంత వదినను చంపిన దేవినేని ఉమామహేశ్వరావు, బుద్ధిలేని బుద్ధా వెంకన్నలు మీడియా ముందుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. -
జాతీయ నాయకులు కూడా బాబుని నమ్మే స్ధితిలో లేరు
-
రైల్వేకోడూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారం
-
సేవా కార్యక్రమాలతో పెద్ద మనసు చాటుకున్న నేతలు
సాక్షి, వైఎస్సార్/నెల్లూరు/చిత్తూరు: నూతన సంవత్సరం సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు అండగా నిలబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సేవా కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు వద్ద రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంతో ఎంతో మంది పేద ప్రజల ఆకలి బాధలు తీరతాయని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల్లో ఒకటైన రాజన్న క్యాంటీన్‌ను రైల్వేకోడూరులో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. పల్లపు సుధాకర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని ఆదుకోవాల్సిందిగా శ్రీధర్‌రెడ్డి పిలుపునివ్వగా.. 4 లక్షల 70 వేల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఈ డబ్బును శ్రీధర్‌రెడ్డి ఆపరేషన్ నిమిత్తం బాధితుడికి అందజేశారు. చిత్తూరు జిల్లా నగిరిలో ఎమ్మెల్యే రోజా నూతన సంవత్సరం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అప్పలాయ గుంటలో ఆమె వైఎస్సార్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ప్రతి మంగళవారం నాలుగు రూపాయలకే భోజనం అందించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగిరిలో కేక్ కట్ చేసిన రోజా కొత్త పేటలో వాటర్ ప్లాంటును ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మంచి నీరు అందించాలని నిర్ణయించారు. -
రైల్వేకోడూరులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన కోరముట్ల
-
జేసీ మరోసారి మాట్లాడితే నాలుక కోస్తాం