సాహస వలంటీర్‌కు నగదు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సాహస వలంటీర్‌కు నగదు పురస్కారం

Published Tue, Aug 1 2023 1:12 AM | Last Updated on Tue, Aug 1 2023 7:44 AM

- - Sakshi

వైఎస్సార్: రైల్వేకోడూరు మండలం ఓ.కొత్తపల్లెలో శనివారం రాత్రి పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన గుండంలో కల్లూరి బాషా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోగా వలంటీర్‌ చాపల సురేష్‌ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వవిప్‌ కొరముట్ల శ్రీనివాసులు సోమవారం వలంటీర్‌ ఇంటికి వెళ్లి సన్మానించి నగదు పురస్కారం అందజేశారు.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందనేందుకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. కాగా పీర్లగుండంలో పడి తీవ్రగాయాలైన బాషాకు మెరుగైన వైద్యం అందించాలని రుయా ఆసుపత్రిలోని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌రాజు, ప్రముఖ న్యాయవాది ఆర్‌సీ సురేష్‌బాబు, ఎంపీటీసీ జనార్దన్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, సుంకేసుల బాషా, తొండం రాజేంద్ర, ధనుంజయ, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement