ఎస్‌ఐగా ఎంపికై న పేదింటి బిడ్డ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐగా ఎంపికై న పేదింటి బిడ్డ

Dec 26 2023 1:56 AM | Updated on Dec 26 2023 11:29 AM

- - Sakshi

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు... అమ్మమ్మ దగ్గర పెరిగి అనంతరం హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం సాగించాడు..

అన్నమయ్య : చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు... అమ్మమ్మ దగ్గర పెరిగి అనంతరం హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం సాగించాడు.. డ్రైవర్‌గా పని చేసుకుంటూ తాను కలలు గన్న పోలీస్‌ ఉద్యోగాన్ని సాధించాడు పేదింటి బిడ్డ మురళీనాయక్‌. వివరాల్లోకి వెళితే.. కేవీపల్లె మండలం దిగువగళ్ల తాండాకు చెందిన బుక్కే మురళీనాయక్‌ జన్మించిన నెల రోజులకే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనంతరం అమ్మమ్మ శ్యామలమ్మ కూలి పనులు చేసుకుంటూ మురళీనాయక్‌ను పోషించింది. కేవీపల్లె హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి వరకు కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు.

అనంతరం పీలేరులో హాస్టల్లో ఉంటూ పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ చదివాడు. అనంతరం తనను తాను పోషించుకోవడానికి డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చాడు. మరోవైపు ఎప్పటికై నా పోలీస్‌ కావాలనే తపనతో ఎస్‌ఐ రాతపరీక్షకు సిద్ధమయ్యాడు. 167.5 మార్కులు సాధించి ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. చదువుకు, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మురళీనాయక్‌ మాట్లాడుతూ ఇంతటితో ఆగకుండా ఒక్కో మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement