
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళిపై పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న పోసానిపై నాటకాలాడుతున్నారంటూ రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు ప్రకటన విడుదల చేయకుండా ముందుగానే సీఐ మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోసాని భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోసాని ఆరోగ్యంపై పోలీసులు స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్‌ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది.
హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో పోసాని బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment