statement
-
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్‌తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్‌పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్‌లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. -
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్ సంచలన ప్రకటన
-
రాజ్ పాకాల నివాసంలో ముగిసిన సోదాలు
-
జన్వాడ కేసు: 8 గంటల పాటు ప్రశ్నించి.. రాజ్ పాకాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జన్వాడ కేసులో రాజ్‌పాకాల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయనను జన్వాడ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు. మరోసారి జన్వాడ నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం రాజ్ పాకాలను మళ్లీ మోకిల పీఎస్‌కు తీసుకెళ్లి విచారించిన పోలీసులు.. 35(3) బీఎంఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. సుమారు 8 గంటల పాటు విచారించారు. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది.కాగా, రాజ్ పాకాల తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు వచ్చారు. రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. మంగళవారం కూడా రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు.ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. కాగా, బుధవారం రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. -
కొండా సురేఖ వ్యాఖ్యలతో మనస్తాపం చెందా.. కోర్టులో కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన అసత్య ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం.. ఈరోజు (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ హజరయ్యారు. ప్రస్తుతం కోర్టు కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌తో పాటు జగదీశ్వర్ రెడ్డి,బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌లు వెళ్లారు. కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్అమెరికాలో ఆరేళ్లు చదువుకున్నానుచదువు పూర్తి అయ్యాక ఇండియా కు తిరిగి వచ్చానుభారత్కు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది2006 ఆగస్ట్ కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారుమళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి2006 నుంచి 2009వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా పనిచేశానుతెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాను 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలో గెలిచానుఐదుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాను2014లో నేను మంత్రి గా పనిచేశాను2023 వరకు నేను మంత్రిగా ఉన్నాను మంత్రిగా ఉన్న కొండాసురేఖ నాపై లేని పోనీ అసత్య ఆరోపణలు చేసిందినాపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిందిఆమె చేసిన వాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందిఆమె చేసిన వాఖ్యలు అనేక ప్రచార మధ్యమాల్లో ప్రచారం అయ్యాయినా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ చేసానని వాఖ్యలు చేశారుఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం బాధ్యత గల పదవిలో ఉన్న మహిళ మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారునేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు ఆరెంజ్ చేస్తా అని కొండా సురేఖ వాఖ్యానించారుసాక్షులు నాకు 18 సంవత్సరాలుగా తెలుసుసాక్షులు కొండా సురేఖ వాఖ్యలను టీవీలో చూసి వారు నాకు ఫోన్ చేశారుకొండ సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల సమాజంలో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నదికొండ సురేఖ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వాఖ్యలు చేసి నాతో పాటు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేశారురాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యలు చేశారుతనపై సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టాలను దిగజార్చాలానే అలాంటి వాఖ్యలు చేశారుఅన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించానుయూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చానుచట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ గురించి కొండా సురేఖ ఏం మాట్లాడారు అని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలు ఉన్నాయని కేటీఆర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ కాపీలోని వివరాల్నే ప్రామాణికంగా తీసుకోవాలా ? స్టేట్మెంట్ ఇస్తారా ? మరోసారి కోర్టు వివరణ అడిగింది. అందుకు స్పందించిన కేటీఆర్.. కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని వివరంగా చెప్పమంటే చెప్తాను అని అన్నారు. అందుకు కోర్టు అనుమతించగా.. కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కేటీఆర్ చదివి వినిపించారు. నాగ చైతన్య విడాకులకు నేను కారణం అని ఆమె అన్నారుఎన్కన్వెన్షన్ విషయంలో సమంత, నా గురించి లేని పోని విధంగా మాట్లాడారునేను ఫోన్లు ట్యాప్ చేశానని వ్యాఖ్యానించారునేను ఒక డ్రగ్ బానిస అని, ఇతరులను డ్రగ్ తీసుకునేలా ప్రేరేపించనని ఆమే వ్యాఖ్యానించారునా వల్ల పెళ్లిల్లు బ్రేక్ అవుతున్నాయనీ ఆమె అన్నారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోతుందని కోర్టు తెలిపింది. తర్వాత కేటీఆర్ తరుఫు సాక్షుల స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయడం ప్రారంభించిందికొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ మనస్తాపంఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో కొండా సురేఖ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా వేశారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాను తీవ్ర మనస్తాపం చెందానని,కొండా సురేఖపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, అందుకు కేటీఆర్ కొంతసమయం అడిగారు. దీంతో విచారణను నాంపల్లి స్పెషల్ కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. కేటీఆర్ ఈ రోజు కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇస్తున్నారు. -
హెజ్బొల్లా పెద్ద తప్పు చేసింది: ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: హెజ్బొల్లా తీరుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మద్దతు కలిన హెజ్బొల్లా తనను, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నించి ఘోరమైన తప్పు చేసిందని’ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇటువటి ఘటనలు శత్రువులపై తాము సాగిస్తున్న న్యాయపరమైన యుద్ధాన్ని నిలువరించలేవని, ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను ఎవరూ ఆపలేరని నెతన్యాహు పేర్కొన్నారు.నెతన్యాహు తన ట్విట్టర్ ఖాతాలో ‘ఇరాన్‌తో పాటు దాని ప్రతినిధులకు నేను ఒకటే చెబుతున్నాను.. ఎవరైనా సరే ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించాలని ప్రయత్నిస్తే, వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మేము ఉగ్రవాదులను, వారిని పంపేవారిని అంతమొందించడాన్ని కొనసాగిస్తాం. మేము మా దేశ బందీలను గాజా నుండి స్వదేశానికి తీసుకువస్తాం. మా ఉత్తర సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి చేరుస్తాం. ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి, రాబోయే తరాలకు ఈ ప్రాంతంలో భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. Israel PM Benjamin Netanyahu tweets, "The attempt by Iran’s proxy Hezbollah to assassinate me and my wife today was a grave mistake. This will not deter me or the State of Israel from continuing our just war against our enemies in order to secure our future. I say to Iran and its… pic.twitter.com/uX2MJvPcJe— ANI (@ANI) October 19, 2024హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి తరువాత గాజాలో ఇజ్రాయెల్ తన ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. గాజాలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 93 మంది మృతి చెందారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడుల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల దాడుల్లో ఇప్పటి వరకు వందలమంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే? -
మా దాడులు ముగిశాయి: ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై తమ దాడులు ముగిశాయని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగకపోతే మా దాడులు ముగిసినట్లేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభిస్తే తాము మరింత తీవ్రంగా, శక్తివంతంగా స్పందిస్తామని తెలిపారు. కాగా, ఐక్యరాజ్యసమతి భద్రతామండలి బుధవారం(అక్టోబర్2) మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులపై సమావేశం నిర్వహించనుంది. ఇరాన్ యుద్ధానికి దిగే దేశం కాదు: అధ్యక్షుడుఇరాన్ ప్రయోజనాలు, పౌరుల రక్షణలో భాగంగానే దాడులు చేశామని, ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అలర్ట్ -
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు.. బాధితురాలి సంచలన ఆరోపణలు!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 3 గంటలపాటు జరిగిన విచారణలో జానీ మాస్టర్ దారుణాలను మహిళ డ్యాన్సర్ పోలీసులకు వివరించింది.షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో జానీ మాస్టర్ బలవంతం చేశాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. తన కోరిక తీర్చమని ఎంతో వేధించాడని.. లేకుంటే ఎలాంటి ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు వివరించింది. అంతే కాకుండా పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు వాపోయింది. బాధిత యువతి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు పోలీసులు.. ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అసలేం జరిగిందంటే??ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు చెప్పింది. -
ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు: మెలానియా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం అతని భార్య మెలానియా తన ఆవేదనను ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల షూటర్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయమయ్యింది.మెలానియా తన భావోద్వేగాలను ఒక ప్రకటనలో పంచుకుంటూ ట్రంప్‌ను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ఘటనలో గాయపడినవారికి సానుభూతి ప్రకటించారు. ఆమె తన ప్రకటనలో.. ‘డొనాల్డ్ అభిరుచిని, నవ్వును, మాటల చాతుర్యాన్ని, సంగీతంపైగల ప్రేమను, అతని స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక అమానవీయ రాజకీయ ఘటన ఇది. ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు. నా భర్త జీవితంలో నాకు నచ్చిన ప్రధాన అంశం అతని మానవతా దృక్పథం.ఆయన ఉదారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మంచి, చెడు సమయాల్లో నేను అతని వెంట ఉన్నాను. ప్రేమకు భిన్నమైన అభిప్రాయాలు, విధానాలు, రాజకీయ ఆటలు హీనమైనవని మనం మరచిపోకూడదు. మా వ్యక్తిగత, నిర్మాణాత్మక జీవిత కట్టుబాట్లు మా మరణం వరకు అలానే కొనసాగుతాయి. దేశంలో మార్పు పవనాలు వచ్చాయని అంటున్నారు. ఈ మాటకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. రాజకీయ విభేదాలకు అతీతంగా స్పందిస్తున్నవారిని అభినందిస్తున్నాను’ అని మెలానియా పేర్కొన్నారు. pic.twitter.com/IGIWzL6SMJ— MELANIA TRUMP (@MELANIATRUMP) July 14, 2024 -
కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ.. కుల్విందర్ కౌర్ అరెస్ట్
బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌ను కానిస్టేబుల్ చెంపదెబ్బ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో కంగనను చెంపదెబ్బ కొట్టిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఆపై ఆమెను అరెస్ట్ చేసింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..బీజేపీ నేత, మండీ లోక్‌సభ ఎంపీ కంగన రనౌత్ చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగు పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్తున్న కంగనను కుల్విందర్ కౌర్ చెంప పగలగొట్టింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా2020లో మోదీ ప్రభుత్వం రైతుల మేలు కోసమేనని చెబుతూ మూడు వ్యవసాయ చట్టాల్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చెపట్టారు. దీంతో తలొగ్గిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంటున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.సింగర్ రిహానా మద్దతుఆ సమయంలో ప్రముఖ సింగర్ రిహానా భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించారు. ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ అంటూ రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని రిహానా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నెట్టింట్లో ట్రెండ్ అవ్వడంతో పలువురు ప్రముఖ ఆమెకు మద్దతుగా నిలిచారు. నోరు పారేసుకున్న కంగనా రనౌత్రిహానా ట్వీట్‌పై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదు ఉగ్రవాదులు. దేశాన్ని ముక్కలు చేసి చైనా కాలనీగా మార్చాలని అనుకుంటున్నారు. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. మేం మాదేశాన్ని అమ్ముకోవాలనుకోవడం లేదు’ అంటూ రిహానాపై కంగానా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్వీట్ చేశారు.టైమ్ మ్యాగజైన్లో బిల్కిస్దీనికి తోడు టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఆయా దేశాలకు 100మంది అత్యంత ప్రభావశీలురు జాబితాను విడుదల చేస్తోంది. 2019లో టైమ్ మ్యాగజైన్ .. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సమీపంలోని షషీన్ బాగ్‌లో వందలాది మహిళలు 100 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ ఉద్యమాన్ని షషీన్ బాగ్ దాదీగా పేరొందిన 82 ఏళ్ల (నాడు) బిల్కిస్ ముందుండి నడిపించారు. బిల్కిస్‌ను ప్రస్తావిస్తూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో బిల్కిస్ పాల్గొన్నారని, ఆమె రోజువారీ కిరాయి ప్రాతిపదికన అందుబాటులో ఉంటారని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఉద్యోమంలో పాల్గొనందుకు ఆమెకు ఆహారం, బట్టలు, అవార్డ్లు, పాకెట్ మనీ ఇస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆట్వీట్‌ను కంగాన రీట్వీట్ చేస్తూ “హ హ హ ఆమె అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో కనిపించిన అదే దాదీ. ఆమె రూ.100 రూపాయలకే ధర్నాలో పాల్గొన్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ప్రతీకారం తీర్చున్న కుల్విందర్ కౌర్ఈ నేపథ్యంలో నాడు కంగానా చేసిన వ్యాఖ్యలపై సీఐఎస్‌ఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఎయిర్ పోర్ట్‌లో ప్రతీకారం తీర్చున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్ పోర్ట్‌లోకి వచ్చిన కంగనాను కుల్విందర్ కౌర్ చెంప చెళ్లుమనిపించారు.అందుకే కొట్టాఅనంతరం రైతులను కంగనా అవమానించినందుకే ఆమె చెంపపై కొట్టినట్లు కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని ఆమె (కంగనా) స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటుందా? ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది అని రైతు కుటుంబానికి చెందిన కౌర్ అన్నది. కాగా, కంగనాను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ విభాగం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. విధుల నుంచి తొలగించింది. -
ఏ పార్టీ ఓటర్లు ఉదాసీనం? జేపీ నడ్డా ఏమన్నారు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో నేడు చివరిదశ పోలింగ్ జరుగుతోంది. నేడు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే 2019తో పోల్చి చూస్తే, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.దీనికి ఒక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన అభిప్రాయం వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్లు ఉదాసీనంగా ఉన్నారని, అందుకే ఆ పార్టీలకు దక్కిన ఓట్లు తక్కువేనన్నారు. ఈ కారణంగానే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులైన ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారన్నారు.దేశంలో అధికార ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత లేదని, గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే అంటే 2019 మొదటి, రెండవ దశ, 2024 మొదటి, రెండవ దశలలో ఓటింగ్‌శాతం బాగానే ఉన్నదన్నారు. దీనిప్రకారం చూస్తే ఉదాసీనత అనేది బీజేపీ మద్దతుదారులలో లేదని, ప్రదిపక్షాల మద్దతుదారులే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు.సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల్లో ఉదాసీనత ఉందని బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు జరుతున్న ఎన్నికలపైనా, మూడోసారి రాబోయే మోదీ ప్రభుత్వంపైనా బీజేపీ మద్దతుదారుల్లో ఉత్సాహం ఉన్నదన్నారు. బీజేపీకి పోటీ లేని స్థానాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నదన్నారు. -
తగ్గిన ఓటింగ్ శాతంతో బీజేపీకి దెబ్బ? రాజ్‌నాథ్ ఏమన్నారు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా ఒక దశ మిగిలివుంది. అయితే 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. ఇది బీజేపీకి దెబ్బ అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే అది బీజేపీకి ప్రతికూలమేమీ కాదని, ఓటింగ్ శాతం తగ్గడానికి ఎండవేడిమి ప్రధాన కారణమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.ఇండియా కూటమి విశ్వసనీయతపై పలు సందేహాలు ఉన్నాయని, ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగినవని అన్నారు. ఇందుకు పంజాబ్‌లోని రాజకీయ పరిస్థితులే ఉదాహరణ అన్నారు. ఇండియా కూటమి ప్రజలకు ఉమ్మడి సందేశాన్ని ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చాలామంది భావిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈసారి కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం ఎండ వేడిమి అని అన్నారు. గత ఎన్నికల్లో ఇంతటి వేడి లేదన్నారు. ఈసారి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో 25 శాతం మంది దారిద్య్ర రేఖ నుంచి బయటపడ్డారని, దేశంలో నిరుద్యోగం గతంలో కన్నా తగ్గిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్‌ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్‌కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్‌చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్‌మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘ పొలిటికల్ హిట్‌మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్‌చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్‌ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్‌సర్‌కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్‌ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్‌చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్‌ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్‌ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
USA: ‘సీఏఏ’ అమలుపై అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: భారత్ తాజాగా అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. సీఏఏ అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘మార్చ్ 11 సీఏఏ నోటిఫికేషన్‌పై మేం ఆందోళనతో ఉన్నాం. ఈ చట్టం అమలు తీరును గమనిస్తున్నాం. మత పరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం అనేవి ప్రజాస్వామ్య మూల సూత్రాలు’ అని మిల్లర్ పేర్కొన్నారు. అయితే హిందూ అమెరికన్లు మాత్రం సీఏఏను స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. US State Department spokesperson, Matthew Miller, provides the State Department's response to CAA, The Citizenship Amendment Act, being implemented in India.#CAAImplemented #CAA #CAAImplementation #CitizenshipAmendmentAct #CitizenshipAct pic.twitter.com/a9kAzL64ft — Diya TV (@DiyaTV) March 14, 2024 పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి డిసెంబర్ 31, 2014కు ముందు వలస వచ్చిన నాన్ ముస్లింలకు సీఏఏ ప్రకారం భారత పౌరసత్వం ఇస్తున్నారు. కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు వలసవచ్చిన వారికి పౌరసత్వం జారీ చేస్తున్నారు. ఈ చట్టం కింద దేశంలోని ఒక్క ముస్లిం కూడా తమ పౌరసత్వాన్ని కోల్పోడని భారత ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దేశంలో అన్ని మతాలు సమానమేనని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డ భారతీయులు ఇదీ చదవండి -
అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ప్రధాని మోదీ చేసిన పర్యటనపై చైనా ప్రకటనను భారత్ ఖండించింది. ప్రధాని పర్యటనపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమైనవని, అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పడూ భారత్‌లో భాగమేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఉన్నతాధికారి వెన్బిన్ చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. భారత్‌లోని మిగిలిన రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే మా నాయకులు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ పర్యటిస్తారు’ అని జైస్వాల్ తెలిపారు. కాగా, మార్చి 9వ తేదీన ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన సేలా టన్నెల్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ పర్యటనపై మార్చ్ 11న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ దక్షిణ టిబెట్‌లోని జాంగాన్(అరుణాచల్ ప్రదేశ్) తమ దేశంలో భాగమని, అరుణాచల్‌ప్రదేశ్ అనే రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని వ్యాఖ్యానించడం భారత్ ఆగ్రహానికి కారణమైంది. ఇదీ చదవండి.. 10 వందేభారత్‌లకు ప్రధాని మోదీ పచ్చజెండా -
అయోధ్యపై టీఎంసీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సువేందు తన ట్విట్టర్ హ్యాండిల్లో తృణమూల్‌పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు. Simply Outrageous. TMC MLA of Tarakeswar Assembly Constituency - Ramendu Sinha Roy, who is also the TMC President of Arambagh Organizational District has labeled the Grand Ram Mandir as 'UNHOLY'. He has also stated that no Indian Hindu should offer Puja at such unholy site.… pic.twitter.com/xBBQuqpTzn — Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024 -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ రెండో ప్రకటన వ్యూహత్మకంగా ఉంది. విదేశాంగ శాఖ గురువారం వెలువరించి ప్రకటన ప్రధాని మోదీ మొదట ఇచ్చిన ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉన్నప్పటికీ తటస్థ వైఖరి కనిపిస్తోంది. మొదట ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్న భారత్.. పాలస్తీనాపై కూడా స్పందిస్తూ శాంతిని ఆకాంక్షించింది. పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యక్ష చర్చలు జరపాలని తాము ఎల్లవేళలా కోరుకుంటున్నామని భారత్ గురువారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత గురించి భారతదేశానికి తెలుసని అన్నారు. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా జీవించే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా చర్యలు ఉండాలని భారత్ భావిస్తున్నట్లు బాగ్చీ చెప్పారు. ప్రధాని మోదీ ప్రకటన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిపిన ఆరంభంలో ప్రధాని మోదీ ప్రకటన భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉంది. ప్రధాని మోదీ పాలస్తీనా పేరు కూడా ఎత్తకుండా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. హమాస్ దాడులను ఉగ్రదాడులుగా పేర్కొంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అరబ్ దేశాలు నోరువిప్పడంతో భారత విదేశాంగ శాఖ, ప్రధాని మోదీ ప్రకటనలలో ఉగ్రవాదంపై వ్యతిరేక వైఖరి ఉమ్మడి అంశంగా ఉన్నప్పటికీ స్వతంత్ర పాలస్తీనా అంశాన్ని కూడా జోడించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పశ్చిమాసియాతో సంబంధాలు కోల్పోకుండా భారత్ వ్యూహంగా ముందుకు వెళుతోంది. యుద్ధం ఆరంభంలో ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ-నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్నారు. గాజాలో జరుగుతున్న దాడులపై అరబ్ దేశాలు నోరువిప్పడంతో పరిస్థితి కాస్త మారింది. దీంతో వ్యూహాత్మకంగా భారత్ విదేశాంగ శాఖ పాలస్తీనా అంశంపై కూడా మాట్లాడింది. అరబ్ దేశాలతో సంబంధాలు అరబ్ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను భారత్ కలిగి ఉంది. భారతదేశం చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇండియా పాలస్తీనాతో కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. పాలస్తీనాకు చట్టబద్ధ గుర్తింపు కోసం 1974లో మద్దతు తెలిపిన ఏకైక అరబ్ దేశం కాని వాటిల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. 2016లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాలస్తీనాను కూడా సందర్శించారు. 2017లో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఇండియాను సందర్శించారు. 1977లోనూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వైఖరి కూడా పాలస్తీనాకు మద్దతుగానే ఉంది. అక్రమంగా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఖాలీ చేస్తేనే పశ్చిమాసియా సమస్య పరిష్కారమవుతుందని అప్పట్లో వాజ్‌పేయీ కూడా అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ సైన్యం -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు
-
పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్
సాక్షి, విజయవాడ: వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. వలంటీర్ పిటీషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పవన్ కేసు ఫైల్ చేసిన వలంటీర్ స్టేట్మెంట్ను శుక్రవారం.. జడ్జి రికార్డు చేశారు. వలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైయానని, న్యాయం చేయాలని మహిళా వలంటీర్ కోర్టుని ఆశ్రయించారు. వలంటీర్ తరఫున లాయర్లు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. చదవండి: అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ -
ఇంకా ఎన్ని కనిపెడతావ్ బాబు ?
-
వివేకా హత్య కేసులో సీబీఐ స్టేట్ మెంట్ లో అన్నీ అబద్దాలే ఉన్నాయన్న అజేయకల్లం
-
మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్ఐఏ ప్రకటన
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆమెతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. వీరిద్దరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటికీ వారు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా మావోయిస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. 2019లో తిరియా ఎన్కౌంటర్లో ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్‌లు పాల్గొన్నారని ఎన్ఐఏ తెలిపింది. వారోత్సవాల్లో భాగంగా వారు భారీ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. ఆర్కే డైరీ ఆధారంగానే శిరీష, దుడ్డు ప్రభాకర్‌లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఇదీ చదవండి: ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష -
మళ్లీ జగనే సీఎం..నాకు అనుభవం లేదు బాబుకు అంత సీన్ లేదు
-
మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ
న్యూఢిల్లీ: మహీంద్రా పాపులర్ వాహనం ఎక్స్‌యూవీ 700 అగ్ని ప్రమాదం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. జైపూర్ జాతీయ రహదారిపై ఎక్స్‌యూవీ 700 మంటలు చెలరేగిన ఘటనపై స్పందించిన మహీంద్ర, ప్రమాద కారణాలపై వివరణ ఇచ్చింది. ఎక్స్‌యూవీ 700 కార్ ఓనర్ కులదీప్ సింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మే 21న, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ దర్యాప్తు నిర్వహించి, వైర్ ట్యాంపరింగ్ వల్లే ఎక్స్‌యూవీ 700 అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) జైపూర్ జాతీయ రహదారిపై తన కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేస్తుండగా సడెన్‌గా మంటలు వ్యాపించినట్టు కులదీప్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. కారు వేడెక్కుతోంది అనే ముందస్తుహెచ్చరిక లేకుండానే, పొగలు వ్యాపించి మంటల్లో చిక్కుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదని, అసలు తన కారు చాలా కొత్తదని కూడా చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించి వాహనం దగ్ధమయ్యేలోపే ప్రయాణికులంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహీంద్రా ఆటోమోటివ్ ప్రకటన అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్నామని,వాహనం అసలు సర్క్యూట్‌ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆఫ్టర్‌మార్కెట్ ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు , నాలుగు యాంబియంట్ లైటింగ్ మాడ్యూల్స్ వల్ల ఇది సంభవించిందని మరో ప్రకటన విడుదల చేసింది. ఎడిషనల్ వైరింగ్ కనెక్షన్ ఒరిజనల్‌ది కాదని , నకిలీ వైరింగ్ జీనును అమర్చినట్టు పేర్కొంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమాచారాన్ని కారు ఓనర్‌కు ఈమెయిల్ ద్వారా అందించినట్టు కూడా తెలిపింది. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 చాలామంది తమ వాహనాలను ఎడిషనల్ ల్యాంప్స్ లేదా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో అప్డేట్ చేయాలనుకుంటారు అయితే, వైరింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే, అది షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. దీంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్ వేడెక్కే ప్రమాదం ఉందని, ఇంజిన్ సరిగ్గా పనిచేసినప్పటికీ, మంటలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే ఆఫ్టర్-మార్కెట్ పార్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు విశ్వసనీయ డీలర్లు, మెకానిక్లపై మాత్రమే ఆధారపడటం చాలా కీలకమని సూచించింది. Here is an update to our official statement with reference to the incident in Jaipur involving the XUV700. Our customers' safety is always our top most priority. pic.twitter.com/HYSQDEBFIu — Mahindra Automotive (@Mahindra_Auto) May 24, 2023 -
అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయా? వాట్సాప్ ఏం చెప్పిందంటే..
గత కొన్ని రోజులుగా వాట్సాప్ (WhatsApp)లో యూజర్లకి అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్షాట్లను పంపడం వంటివి చేస్తే చాలు నగదు, ఇతర బహుమతులు వస్తాయంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు దుండగులు. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? ఈ అనుమానాస్పద కాల్స్ కు సంబంధించి వాట్సాప్ వివరణ ఇచ్చింది. స్పామ్‌ను ఆపడానికి అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను గుర్తించి చర్య తీసుకోవడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సీఎన్‌బీసీ టీవీ18 వార్తా సంస్థ ద్వారా తెలియజేసింది. ఫిర్యాదుల స్వీకరణకు భారత్ లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించవచ్చని సూచించింది. ఇలా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలను యూజర్లు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ స్కామ్‌ల నుంచి రక్షణకు వాట్సాప్ లో అంతర్నిర్మితంగా ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ అండ్ రిపోర్ట్ గోప్యతా నియంత్రణల వంటి భద్రతా సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి “స్టే సేఫ్ విత్ వాట్సాప్” పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్, సందేశాలు ఎక్కువయ్యాయంటూ ట్విటర్ లో పోస్టింగులు హోరెత్తాయి. ఇలా వస్తున్న కాల్స్ లో ఎక్కువ భాగం +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా) +84 (వియత్నాం)తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తున్నాయి. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించవద్దని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు కూడా ట్విటర్ ద్వారా వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్‌లో స్కామర్లు తన స్నేహితుడిని మోసగించి రూ. 5 లక్షలు ఎలా కాజేసారో బిలియనీర్, జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలియజేశారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం -
షమీమ్ స్టేట్ మెంట్ లో కనిపించని వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు
-
బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే..అందులోనూ ఎండాకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయనే భయం ఈ మధ్య కాలంలో కస్టమర్లను పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ కు చెందిన పాపులర్ కారు,అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టా టా నెక్సాన్‌లో మంటలు చెలరేగడం ఆందోళన రేపింది. టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగుతున్న వీడియో వైరల్ కావడం ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో కలవరం రేపింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మంటల్లో కారు కాలి పోయింది. అయితే అధికారులు మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. దీనిపై టాటా మోటార్స అధికారిక ప్రకటన విడుదల చేసింది. టాటా మోటార్స్ అధికారిక ప్రకటన టాటా నెక్సాన్ ఈవీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదానికి కారణం అనధికార సర్వీస్ సెంటర్లో లెప్ట్ హెడ్‌ల్యాంప్‌ను సరిగ్గా మార్చకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సంబంధిత వర్క్‌షాప్‌లో ఫిట్మెంట్, రిపేర్‌లో లోపాలున్నాయని, హెడ్‌ల్యాంప్ ఏరియాలో విద్యుత్ లోపం కారణంగా థర్మల్ సంఘటనకు దారితీసిందని వివరించింది. బాధిత కస్టమర్‌కు అన్ని రకాలుగా సాయం చేస్తున్నట్టు తెలిపింది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం కొత్త టెక్నాలజీ, ఆధునిక ఎలక్ట్రానిక్ భాగాలతో అభివృద్ధి చెందుతోంది, ICE కార్లు, EVలలో శిక్షణ పొందిన నైపుణ్యం అవసరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా, అటువంటి సంఘటనలు జరగకుండా అధీకృత టాటా మోటార్స్ వర్క్‌షాప్‌లలో మాత్రమే తమవాహనాలకు ఆన్-స్పెక్ కాంపోనెంట్స్, యాక్సెసరీస్, స్పేర్ పార్ట్‌లను అమర్చుకోవాలని కస్టమర్లను కోరుతున్నామని విజ్ఞప్తి చేసింది. ఇదే మొదటిసారి కాదు 2022 జూన్‌లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉంచిన టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. -
ఓఐసీ ప్రకటనపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత్ అంతర్గత వ్యవహారాలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా జరిగిన ఘర్షణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఓఐసీ. అయితే.. దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వాళ్ల కమ్యూనల్ మైండ్‌సెట్(మతపరమైన ఆలోచనాధోరణికి) ఇది మరో ఉదాహరణ అని, భారత్ వ్యతిరేక ఎజెండాను ఆ దేశాలు మరోసారి బయటపెట్టాయని భారత్ మండిపడింది. భారత్ అంతర్గత వ్యవహారాలలో ఓఐసీ జోక్యం అక్కర్లేని అంశమని భారత్ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా ముస్లింలు లక్ష్యంగా హింస, విధ్వంసం చోటుచేసుకున్నాయని ఒక ప్రకటనలో ఆరోపించింది. అధికారులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారత్‌లో ముస్లింల భద్రతకు, హక్కులకు భరోసా ఇవ్వాలని ఓఐసీ తన ప్రకటనలో భారత్‌ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే.. భారత్ తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య జనరల్ సెక్రటేరియెట్ పేరిట రిలీజ్ అయిన ప్రకటనను, బాగ్చీ ఖండించారు. అలాగే జమ్ము కశ్మీర్ అంశంలోనూ ఓఐసీ(ఇందులో పాక్ కూడా ఉంది) జోక్యాన్ని అవసరమైన అంశంగా తేల్చారు ఆయన. -
రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా పెళ్లి సాధ్యమేనా? నటి స్టేట్మెంట్ వైరల్
బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్ చద్దాల వివాహంపై కొద్ది రోజులుగా రూమర్స్ జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి ఈ జోడీ కలిసివెళ్లడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఈ విషయంపై నోరుమెదపలేదు. ఈ వార్తలను ఖండించనూ లేదు ఖరారూ చేయలేదు. అయితే తాజాగా పరిణితీ చోప్రా గతంలో ఇచ్చిన ఓ స్మేట్మెంట్కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పరిణితి.. తాను రాజకీయ నాయకులను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్వయంగాపైకి వచ్చినవారు అంటే తనకు ఇష్టమని, తనకు గౌరవం ఇచ్చేవారినే ఇష్టపడతానని పేర్కొంది. పొలిటిషియన్‌ను తప్ప ఏ రంగానికి చెందినవారినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ అమ్మడు గతంలో ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యువ నాయకుడు రాఘవ్ చద్దాతో ఈమె సన్నితంగా మెలగడే ఇందుకు కారణం. ఈమె కొత్త సినిమాలో సహ నటుడు హార్డీ సంధు కూడా.. పరిణితి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఎట్టకేలకు తనకు కావాల్సిన భాగస్వామి దొరికాడని వెల్లడించాడు. ఆమెకు అడ్వాన్స్‌గా.. ఆల్‌ది బెస్ట్ కూడా చెప్పాడు. దీంతో రాఘవ్ చద్దాతోనే పరిణితి వివాహానికి సిద్ధం అవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. వీరి పెళ్లి సాధ్యాసాధ్యాల గురించి జోరుగా చర్చిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడ్ని పెళ్లి చేసుకోనని చెప్పిన పరిణితి ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అటు రాఘవ్‌కు ఇటు అభిమానులకు షాక్ ఇస్తుందా..? లేదంటే పెళ్లికి రెడీ అవుతుందా చూడాలి! చదవండి: సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్.. -
రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!
రూ.2వేల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చి చివరి నాటికి రూ.9.512 లక్షల కోట్లు. అదే 2022 మార్చి చివరి నాటికి రూ.27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలు, కాలానుగుణ ధోరణి మొదలైన వాటి ఆధారంగా బ్యాంకులు అంచనా వేసి ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. కాగా రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయింది. పలు కారణాల చేత ఈ నోట్ల సర్క్యూలేషన్‌ను తగ్గించేసినట్టు తెలిసింది. ఆర్బీఐ గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసినట్టు ఆర్బీఐ ఆ మధ్య తెలిపింది. అయితే అప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. -
కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు.. నటుడిపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య ఆలియా సిద్ధిఖీతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాస్‌పోర్ట్ సమస్యలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలియా ముంబయి బాంద్రాలోని సిద్ధిఖీ ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమెకు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలియా ఆరోపించింది. కనీసం అన్నం కూడా తిననివ్వడం లేదని.. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వట్లేదని వాపోయింది. తాజాగా తన లాయర్‌తో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ దాదాపు రెండేళ్లుగా తన భార్య ఆలియా సిద్ధిఖీతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆలియా తరఫు న్యాయవాది రిజ్వాన్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ఆలియా న్యాయవాది స్టేట్మెంట్లో రాస్తూ..' నా క్లైంట్‌ను అవమానిస్తున్నారు. ఆమెకు ఆహారం తిననివ్వడం లేదు. వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు. ఆమె చుట్టూ బాడీగార్డ్స్‌ను ఉంచారు. ఆస్తి విషయంలో కావాలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతి రోజూ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. నవాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లయింట్‌కు ఆహారం లేదు. ఆమె ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు.' అంటూ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్-ఆలియాల వివాహం నవాజుద్దీన్, ఆలియా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా నవాజుద్దీన్ విడాకుల నోటీసులు పంపించింది. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. లాక్డౌన్ సమయంలో ఇది ఒక అవకాశంగా భావించానని ఆమె వెల్లడించింది. నవాజుద్దీన్, అతని కుటుంబం గృహ హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. -
కందుకూరు ఘటన: డ్రోన్ షాట్ల దారుణమే! ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం
సాక్షి, నెల్లూరు: డ్రోన్ షాట్ల కోసం ఇరుకు కూడలిలో టీడీపీ బహిరంగ సభను నిర్వహించడంతోపాటు భారీగా ఫ్లెక్సీలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్తో తోపులాట చోటు చేసుకుని తొక్కిసలాట జరిగినట్లు కందుకూరు ఘటనలో ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలు విచారణ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చాయి. గత నెల 28వ తేదీన ‘ఇదేం కర్మ’లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ఏర్పాటైన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలోని కమిషన్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పలువురి నుంచి వాంగ్మూలం సేకరించింది. తొక్కిసలాట ఎలా జరిగింది? ఆ సమయంలో ఎంత మంది ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీసింది. వాహనం ఎక్కడ నిలిపారు? తొలుత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అధికారుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం కమిషన్ ఎన్టీఆర్ సర్కిల్‌ను పరిశీలించింది. బహిరంగ సభకు ఎక్కడ అనుమతి ఇచ్చారు? చంద్రబాబు వాహనం ఎక్కడ నిలిపారు? అనే అంశాలతోపాటు ప్రమాదం జరిగిన గుండంకట్ట రోడ్డును క్షుణ్నంగా పరిశీలించింది. ఇరువైపులా ఉన్న రెండు డ్రైనేజీలను పరిశీలించింది. కందుకూరు టీడీపీ ఇన్చార్జి ప్రకటించిన పరిహారం అందలేదని బాధిత కుటుంబాలు కమిషన్ దృష్టికి తెచ్చాయి. దాదాపు 27 మంది నుంచి కమిషన్ వాంగ్మూలం నమోదు చేసింది. -
ఎమ్మెల్సీ కవిత నివాసంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ
-
నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం
న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన తర్వాత.. ఆ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలను కొన్ని జాతీయ మీడియా చానెళ్లు రంధ్రాన్వేషణ చేస్తోన్నాయి. గతంలో ఆయన స్టేట్మెంట్లను.. తాజాగా చేస్తున్న ప్రకటనలనూ కేంద్రంపై విమర్శే అనే కోణంలో ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఐఏఏ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏ విషయంలోనూ నేను అసంతృప్తిగా లేను. పూర్తి సంతోషంగా పని చేసుకుంటున్నా. నా వ్యాఖ్యలతో లేనిపోని వివాదాలు సృష్టించడం ఆపండి అంటూ ఆయన మీడియాకు చురకలు అంటించారు. ‘‘మీడియా అడిగితే అంతా నేను వాస్తవాలే మాట్లాడతా. కానీ, నేను అనని మాటల్ని కూడా నాకు ఆపాదించడం ఎందుకు?. దయచేసి ఓ విశ్లేషణ టీంను నియమించుకుని.. నా ప్రసంగాలను విశ్లేషించండి. అందులో నేను ఏదైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తే.. ఏ శిక్షకైనా నేను రెడీ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ప్రీతిపాత్రుడైన బీజేపీ నేతగా గడ్కరీకి ఓ గుర్తింపు ఉంది. అంతెందుకు ఆయన ప్రకటనలను ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని మోదీ, బీజేపీని విమర్శిస్తుంటుంది. ఈ తరుణంలో గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించాక సైతం విపక్షాలు ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నాయి. అయితే అప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రసంగాలను కేంద్రానికి వ్యతిరేక కోణంలోనే విశ్లేషిస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. నా పాత వీడియోను చూపించి.. సంచలనం సృష్టించాలన్నది కొన్ని మీడియా హౌజ్‌ల అభిమతంగా కనిపిస్తోంది. ఈమధ్య మహారాష్ట్రలో నేను చేసిన ప్రసంగాన్ని ఓ రిపోర్టర్ తప్పుగా చూపించాడు. సిబ్బంది తప్పిదంతోనే అలా జరిగిందని వాళ్లు నాకు వివరణ ఇచ్చుకున్నారు. తప్పులు సహజమే. కానీ, ఇలాంటి తప్పులు అపార్థాలకు దారి తీస్తాయి అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వక్రీకరించొద్దు ఏనాడూ నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీకు దమ్ముంటే.. మీరు ఎవరినైనా విమర్శించాలంటే నేరుగా విమర్శించండి. అంతేగానీ ఈ వ్యవహరంలోకి నన్నులాగడం ఎందుకు?. నా వ్యాఖ్యలను వక్రీకరించడం ఎందుకు? మహారాష్ట్ర ప్రసంగంలో.. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పాను. స్వాతంత్రానికి పూర్వం.. రాజకీయాలు దేశభక్తితో కూడుకుని ఉండేవి. కానీ, తర్వాత అవి దేశ అభివృద్ధి దిశగా సాగుతున్నాయి. రాజకీయాల్లో ఎంత మార్పు వచ్చింది అనే కోణంలోనే నేను మాట్లాడాను. కానీ, రాజకీయాలను వదిలేయాలని ఉందని విమర్శాత్మక కోణంలో వ్యాఖ్యలేమీ నేను చేయలేదు. అక్కడ నేను అనని మాటల్ని నా పేరుతో ఆరు, ఏడేసి కాలమ్స్‌లో రాశారు. అసలు ఏం జరిగిందని గడ్కరీ ఎందుకు అసంతృప్తిగా ఉంటాడు?.. నా పనేదో నేను చూసుకుంటున్నా. సంతోషంగా ఉన్నా. ఎవరి పట్ల నాకు తప్పుడు ఉద్దేశాలు లేవు అంటూ అసంతృప్తి లేదనే విషయాన్ని గడ్కరీ ఇలా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: యాత్రతో అయినా రాత మారేనా? -
బ్యాంక్ లావాదేవీల సాఫ్ట్ కాపీని ఈడీకి సమర్పించిన చికోటి ప్రవీణ్
-
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. బాలిక రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార బాధితురాలి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి వద్ద దింపుతామని ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. బాధితురాలిని వెంబడించి క్యాబ్ బుక్ చేస్తామంటూ నిందితులు ఫోన్ లాక్కున్నారు. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని.. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ బెంజ్ కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాధితురాలి హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు లాక్కున్నారు. కాన్స్ బేకరీ వద్దకు రాగానే ఇన్నోవాలోకి షిఫ్ట్ చేశారు. ఇన్నోవాలో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. చదవండి: అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు -
ఎడమ చేయి లాగుతున్నట్టుగా ఉందని కేసీఆర్ చెప్పారు: వైద్యులు
-
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రెండు రోజులుగా సీఎం కేసీఆర్ నీరసంగా ఉన్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లుగా ఉందని కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. ఈ ఉదయం కేసీఆర్ కాల్ చేసి సమస్య వివరించారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని సూచించగా సీఎం ఒప్పుకున్నారన్నారు. ఆయనకు తొలుత ఈసీజీ, ఆ తర్వాత 2డి ఎకో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. చదవండి: CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత! ఈసీజీ, 2డి ఎకో పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. ఎందుకైనా మంచిదని యాంజియోగ్రామ్ చేశామన్నారు. ఆ పరీక్షల్లో ఎలాంటి బ్లాక్ లేదని తేలిందన్నారు. ఎడమ చేయి ఎందుకు లాగుతుందన్న కారణంగా ఎంఆర్ఐ చేశామన్నారు. మెడకు సంబంధించి ఎంఆర్ఐ, అలాగే బ్రెయిన్ ఎంఆర్ఐ కూడా చేశామని యశోద వైద్యులు వెల్లడించారు. ‘‘షుగర్, బీపీ పరీక్షలు కూడా చేశాం. కంట్రోల్లో ఉండడానికి సూచనలిచ్చాం. ప్రస్తుతానికి పెద్ద సమస్య ఏం లేదు. వారం పాటు విశ్రాంతి సూచించాం. సర్వికల్ స్పెన్ ఎంఆర్ఐలో కొంత రూట్ నర్వ్ పెయిన్ ఉన్నట్లు గమనించామన్నారు. వారం రోజుల విశ్రాంతితో సీఎం కేసీఆర్ నార్మల్ అవుతారని’’ వైద్యులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ డిశ్చార్జి యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్‌కు వైద్యులు సూచించారు. -
సీబీఐ మరో కట్టుకథ: చంపుతుంటే.. పడుకున్నాడు!
సాక్షి, అమరావతి: కళ్లెదుట హత్య జరుగుతోందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు?.. అడ్డుకోడానికి ప్రయత్నిస్తారు లేదా కనీసం నలుగురిని పోగేసి అప్రమత్తం చేస్తారు. కానీ యజమాని హత్యకు గురవుతున్నట్లు తెలిసినా కిటికీలోంచి చూసి ఏమీ పట్టనట్లుగా వెళ్లిపోయి రాత్రంతా హాయిగా నిద్రపోవడం మానవమాత్రుడికి సాధ్యమేనా..? మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్మెన్ రంగయ్యతో సీబీఐ ఇప్పించిన స్టేట్మెంట్ అచ్చం ఇలాగే ఉంది. చదవండి: దస్తగిరి చెప్పిందంతా అబద్ధం చిలక పలుకులే.. తనకు కళ్లు సరిగా కనిపించవని... ఏదీ పెద్దగా వినిపించదని గతంలో సిట్ దర్యాప్తు బృందాలకు చెప్పిన రంగయ్య రెండేళ్ల తర్వాత హత్య జరిగిన రోజు రాత్రి విషయాల గురించి పూస గుచ్చినట్లు చెప్పడం చిలక పలుకులను గుర్తు చేస్తోంది. ఇంతకీ రంగయ్యకు ఏం గుర్తొచ్చిందంటే.. 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో నుంచి బాధతో పెద్దగా అరిచిన అరుపులు వినిపించాయి. అవి విని రంగయ్య కిటికీలోకి తొంగి చూశాడట. కిటికీ అద్దం ఒకటి తెరచి ఉందని, కర్టెన్ కొంత పక్కకు జరిగి ఉందని చెప్పాడు. ఆ చిన్న సందులోంచి లోపలికి చూస్తే ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరితోపాటు మరొకరు హాలులో అటూ ఇటూ తచ్చాడుతూ కనిపించారట. తరువాత కాసేపటికి మిగిలిన ముగ్గురు పారిపోగా... ఆదరబాదరగా వచ్చిన ఎర్ర గంగిరెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నిస్తే ‘నీకెందుకు...? ఎవరికైనా చెబితే నిన్నూ నరికి పారేస్తా..’ అని హెచ్చరించాడట. ఇదీ క్లుప్తంగా రంగయ్య చెబుతోంది. రంగయ్య కథనం నమ్మశక్యమేనా? ►పెరటి తలుపు ముందుగానే తీసి ఉంచి రాత్రి లోపలికి ప్రవేశించిన హంతకులు కిటికీ తలుపు వేయలేదనడం, కర్టెన్ కొద్దిగా పక్కకు జరిగి ఉన్నా పట్టించుకోలేదంటే ఎంతవరకు నమ్మశక్యం? ►లోపల గట్టిగా కేకలు వినిపించాయంటే వివేకా మీద దాడి జరుగుతోందని అప్రమత్తం కావాలి. కిటికీలో నుంచి ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలతోపాటు మరొకరు కనిపించారని రంగయ్యే చెబుతున్నాడు కాబట్టి వాళ్లెవరూ అరవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక మిగిలింది వివేకా మాత్రమే కాబట్టి ఆయనకు ఏమైందో రంగయ్య ఎందుకు అడగలేదు? ►సరే.. రంగయ్య భయంతో అరవలేదని భావించినా కనీసం వీధిలోకి వచ్చి కేకలు వేస్తే జనం పోగై వివేకాను రక్షించే అవకాశం ఉంది. అలా చేయాలని రంగయ్యకు ఎందుకు తోచలేదు? ►ఇంత జరిగాక ముగ్గురు పారిపోగా.. ఎర్ర గంగిరెడ్డి తాపీగా వచ్చి జరిగింది ఎవరికైనా చెబితే నరికేస్తా..! అని రంగయ్యను హెచ్చరించి వెళ్లాడట. తరువాతైనా రంగయ్య లోపలికి వెళ్లి ఏం జరిగిందో చూడాలి కదా? కానీ లోపలికి వెళ్లలేదు. ►మరి అంత భయపడ్డ రంగయ్య ఏం చేయాలి? వెంటనే పారిపోవాలి. అలా కాకుండా ఏమీ జరగనట్లుగా ఆ ఇంటి వాకిట్లోనే నిద్రించాడు. నార్కో పరీక్షల్లో నోరెత్తని వ్యక్తి నేడు.. సిట్ అధికారులు గతంలో రంగయ్యను ఆయన కుమారుల సమక్షంలో విచారించినా తనకేమీ తెలియదనే చెప్పాడు. హత్య జరిగిన మర్నాడు ఆయన పీఏ కృష్ణారెడ్డి నిద్ర లేపేవరకు తనకేమీ తెలియదని చెబుతూ వచ్చాడు. పోలీసులు గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆయనకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేసినా ఏ విషయాలూ చెప్పలేదు. ప్రస్తుతం తెలుగు రాని సీబీఐ అధికారులు ఒక ట్రాన్స్‌లేటర్‌ను నియమించుకుని అడిగిన ప్రశ్నలకు రంగయ్య స్పందించి పలు అంశాలను వెల్లడించాడనటం సందేహాస్పదంగా మారింది. అంటే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు నిర్వహించే నార్కో అనాలసిస్ పరీక్షలకు విలువ లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రంగయ్యను ప్రలోభపెట్టి ఆయనతో ఎవరైనా సీబీఐ ద్వారా వాంగ్మూలం ఇప్పించారా? అనే సందేహాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్రం కౌంటర్
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్రం బలవంతం చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు మంగళవారం 'అపోహలు-వాస్తవాలు' పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఏ రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని కేంద్రం స్పష్టం చేసింది. సౌర విద్యుత్ కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలను ఒత్తిడి చేయడంలేదని వివరించింది. ఓపెన్ బిడ్ ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. విద్యుత్ మీటర్లు, విద్యుత్ కొనుగోళ్ల అంశం రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. పునరుత్పాదక విద్యుత్ కొనాలని తాము ఎక్కడా చెప్పలేదని, కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. అసలు, ఫలానా వారి నుంచే విద్యుత్ కొనాలని చెప్పలేదని, ఏ రాష్ట్రం ఎవరినుంచైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రం విమర్శించింది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రూ.55 వేల కోట్లు అప్పుగా ఇచ్చాయని, కేసీఆర్ అందుకు రుణపడి ఉండాలని హితవు పలికింది. ఇది చదవండి: కేసీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా, చర్చకు సిద్ధం! కానీ.. -
సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నటుడు సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. సెకండ్ హ్యాండ్ బైక్‌ను ఎల్బీనగర్కు చెందిన అనిల్‌కుమార్ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్ తేజ్ కొనుగోలు చేశారని మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదని, బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్ డీసీపీ పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రయాణించిన బైక్‌పై గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడ్ వెళ్లినందుకుగాను రూ.1,135 చలాన్ వేశమన్నారు. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్ తేజ్ కుటుంబసభ్యులు క్లియర్ చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 78 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు పేర్కొన్నారు. దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్ నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ రాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టెక్ చేయబోయి స్కిడ్డై సాయిధరమ్ తేజ్ కిందపడ్డాడని పోలీసులు వెల్లడించారు. తేజ్ నుంచి టూవీలర్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేవలం లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసే లైసెన్స్ మాత్రమే ఉందన్నారు. ప్రమాదం సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్‌కు అపోలో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. చదవండి: సాయి అలాంటి వాడు కాదు, వదంతులు పుట్టించకండి: లక్ష్మీ మంచు -
మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు: సిద్ధార్థ్ కుటుంబం
బాలీవుడ్ నటుడు , బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల ఈ నటుడి మరణవార్త విని ఎందరో బాలీవుడ్ ప్రముఖులు, అతని అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలో నటుడి అంత్యక్రియల అనంతరం అభిమానులు, సన్నిహితులను ఉద్దేశించి సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. సిద్ధార్థ్ మరణంతో తాము షాక్‌లో ఉన్నామని.. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అతని జీవితంలో భాగమైన అందరికి సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్) "సిద్ధార్థ్ జీవితంలో భాగమై, అంతులేని ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. సిద్ధార్థ్ ఎల్లప్పుడూ మన గుండెల్లోనే నిలిచి ఉంటాడని’’ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సిద్ధార్థ్ తన ప్రైవసీకి ఎంతో విలువ ఇచ్చేవాడని, తాము అలాగే ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఆ విషయంలో తమను ఇబ్బంది పెట్టవద్దని సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు కోరారు. అతని అంతిమయాత్రకు సంబంధించి ఎంతో ఓపికతో వ్యవహారించిన ముంబై పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు. (చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు') హిందీలో హిట్ సీరియల్ బాలిక వధుతో గుర్తింపు పొందిన సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతోమంది సెలబ్రీటీలు సంతాపం తెలిపారు. సిద్ధార్థ్ మరణ వార్త తెలిసి అతని ప్రేయసీ, బిగ్‌బాస్ 13 పార్టిసిపెంట్ షెహనాజ్ కంటతడి పెట్టిన వీడియోలు నెటిజన్లను కలిచివేశాయి. వారిద్దరూ ఆ షో నుంచి "సిద్నాజ్"గా గుర్తింపు పొందారు. కాగా, వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా నటించిన హంప్టీ శర్మకి దుల్హనియా సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన సిద్ధార్థ్ అనతరం కొన్ని ప్రైవేట్ వీడియోల్లో నటించాడు. అందులో రెండింట్లో తన ప్రేయసి షెహనాజ్‌తో చేశాడు. సిద్ధార్థ్ తండ్రి చినప్పుడే మరణించగా ప్రస్తుతం తల్లితో పాటు ఇద్దరు అక్కలు ఉన్నారు. -
అప్పుడేదో వ్యంగ్యం ప్రదర్శించా అంతే: రాహుల్ గాంధీ
‘‘నీరవ్.. లలిత్.. నరేంద్ర మోదీ.. ఇలా ఈ దొంగలంతా ఒకే ఇంటిపేరుతో ఉండడం ఎలా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఆ టైంలో రాహుల్‌కి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేశాడు ఓ బీజేపీ నేత. ఈ కేసుకు సంబంధించి గురువారం సూరత్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన రాహుల్.. మేజిస్ట్రేట్ ముందు తన చివరి స్టేట్మెంట్ ఇచ్చారు. సూరత్: తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తుది వాంగ్మూలం ఇచ్చారు. ‘‘నేను ఏ కమ్యూనిటీని లక్క్ష్యంగా చేసుకుని ఆ కామెంట్ చేయలేదు. కేవలం ఆ సమయానికి వ్యంగ్యం ప్రదర్శించా అంతే. అంతకుమించి నాకేం గుర్తులేదు’’ అని రాహుల్ కోర్టుకు తెలియజేశారు. కాగా, ఈ కేసులో స్వయంగా హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని వారం క్రితమే రాహుల్‌ను మేజిస్ట్రేట్ ఏఎన్ దవే ఆదేశించారు. ఇక ఇరువర్గాల స్టేట్మెంట్స్ రికార్డు పూర్తి కావడంతో జులై 12 నుంచి ఈ కేసులో కోర్టులో వాదనలు జరగనున్నాయి. కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్13న కోలార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశాడు. అయితే మోదీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా రాహుల్ మాట్లాడాడని, ప్రధానిని అగౌరవపరిచారని, తన పరువుకూ భంగం కలిగిందని చెబుతూ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ, రాహుల్‌పై దావా వేశాడు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లోనే రాహుల్ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా. చదవండి: ఆత్మనిర్భర్ అంటే..:రాహుల్ గాంధీ -
మావోయిస్టుల కీలక ప్రకటన: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు కమిటీ స్పందించింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసులతో జరిగిన దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని ప్రకటించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మాపై దాడికి యత్నించాయని తెలిపింది. మావోయిస్టులను పూర్తిగా నియంత్రించేందుకు ప్లాన్ వేశారని పేర్కొంది. పోలీసులు మాకు శత్రువులు కాదు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు మావోయిస్టు కమిటీ ప్రకటనలో తెలిపింది. బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మధ్యవర్తుల పేర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రాకేశ్వర్‌ను అప్పగిస్తామని ఆ ప్రకటనలో మావోయిస్టులు పేర్కొన్నారు. అప్పటివరకు తమ దగ్గరే రాకేశ్వర్ సురక్షితంగా ఉంటాడని మావోయిస్ట్ కమిటీ స్పష్టం చేసింది. -
రాసలీలల కేసు: ఢిల్లీలో బాధిత యువతి!?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమే ష్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు బాధిత యువతి ఢిల్లీలో ఉండొచ్చనే అనుమానంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దేశ రాజధాని చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రాసలీల సీడీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఈ కేసులో కీలకంగా మారిన ప్రధాన సూత్రధారి నరేశ్‌గౌడ గురువారం విడుదల చేసిన వీడియోను ఢిల్లీ నుంచే అప్లోడ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీడియో విడుదల చేసిన అనంతరం నరేశ్‌గౌడతో పాటు మిగిలిన వారు ఢిల్లీలో తాము ఉంటున్న స్థలాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్లినట్లుగా కూడా సిట్‌కు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి ఆచూకీ కోసం ఢిల్లీని సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. చదవండి: (రాసలీలల కేసు: ‘ఆ యువతి తెలుసు కానీ..’) (అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు) -
మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని ఆరు రాజకీయపార్టీలు ఉమ్మడిగా చేసిన ‘గుప్కార్ డిక్లరేషన్’ను పాకిస్తాన్ స్వాగతించడంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గట్టిగా స్పందించారు. ‘మేం ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మలం కాము’ అంటూ వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పాకిస్తాన్‌కు అకస్మాత్తుగా ఇప్పుడు ఇష్టం పుట్టుకొచ్చింది. ఢిల్లీకి గానీ, సరిహద్దుల్లో ఉన్న వారికి గానీ.. మేం ఎవరి తొత్తులం కాదని స్పష్టం చేస్తున్నా’ అని తెలిపారు. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్, మరో మూడు పార్టీలు కలిసి ప్రకటించిన గుప్కార్ డిక్లరేషన్ సాధారణ ఘటన కాదు, కీలక రాజకీయ పరిణామం అంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. ‘సాయుధులను కశ్మీర్లోకి పంపడం పాక్ మానాలనీ, భారత్, పాక్‌లు చర్చలు ప్రారంభించాలని ఆయన కోరారు. కశ్మీర్‌లోని ఆరు రాజకీయ పార్టీలు ఆగస్టు 22న శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమై చేసిన ఉమ్మడి ప్రకటనను గుప్కార్ డిక్లరేషన్ అని అంటున్నారు. -
ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైనారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ఆమె ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. (రియాకు ఈడీ సమన్లు జారీ.. స్పందన లేదు) ముఖ్యంగా కోట్లాది రూపాయల ఆస్తులను కలిగి ఉన్న రియా ఆదాయ వనరులను ఆరాతోపాటు, సుశాంత్ తో ఉన్న ఆర్థిక లావాలేవీలపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతోపాటు రియా సోదరుడు బిజినెస్ గురించి అధికారులు విచారించే అవకాశం ఉందని అంచనా. అలాగే గత అయిదేళ్లుగా ఆదాయ పన్ను రిటర్నుల వివరాలను సమర్పించాలని ఆదేశించనున్నారు. ఈ విచారణకు సహకరించని పక్షంలో రియాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ముంబై కార్యాలయంలో తన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలతో పాటు తన ముందు హాజరు కావాలని రియాను కోరింది. కాగా రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్ దాఖలు చేసిన కేసును పట్నా నుంచి ముంబైకి కేసును బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు తన స్టేట్మెంట్ రికార్డింగ్‌ను వాయిదా వేయాలని చక్రవర్తి కోరగా ఈ అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
ఛీ.. ఆమె నా కూతురేంటి: ప్రముఖ గాయని
న్యూఢిల్లీ : బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లి అంటూ కేరళకు చెందిన ఒక మహిళ చేసిన వ్యాఖ్యలపై అనురాధ స్పందించారు. ఆమె తన కూతురు కాదని.. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 45 ఏళ్ల కర్మలా మోడెక్స్.. బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లి అంటూ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనురాధ, ఆమె భర్త తన తల్లిదండ్రులంటూ పిటిషన్లో పేర్కొంది. 1974లో తనకు నాలుగు రోజుల వయసు ఉన్నప్పుడు వేరే వాళ్లకి దత్తత ఇచ్చి వెళ్లిపోయారని, అనురాధ తన సింగింగ్ కెరీర్‌కు ఆటంకం కలగకూడదనే ఇలా చేసిందంటూ పిటిషన్లో పేర్కొంది. తనను వదిలివెళ్లినందుకు పౌడ్వాల్ దంపతులు రూ. 50 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని మోడెక్స్ పేర్కొనడం విశేషం. వీటిన్నింటికి తన దగ్గర ఆధారాలున్నాయని, తనను పెంచిన ఫాదర్ చనిపోయేముందు అన్ని విషయాలు తనకు చెప్పాడని కర్మలా వెల్లడించారు. అంతేకాదు తన తల్లిని కలిసేందుకు ప్రయత్నించి చాలాసార్లు విఫలమయ్యానని పేర్కొన్నారు. 'నేను ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలను పట్టించుకోను. అయినా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆమె నా గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ' గాయని అనురాధ మండిపడ్డారు. ఇదే విషయమై అనురాధ పౌడ్వాల్ ప్రతినిధి మాట్లాడుతూ... కర్మలా ఒక సైకోలాగా ప్రవర్తిసుందని తెలిపారు. అనురాధకు కూతురు ఉన్న విషయం నిజమేనని అయితే ఆమె పేరు కవిత అని పేర్కొన్నారు. వాళ్లిద్దరు నా తల్లిదండ్రులు అని చెబుతున్న కర్మలాకు తండ్రి చనిపోయాడన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే రూ. 50 కోట్లు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేస్తుందో చెప్పాలని మండిపడ్డారు. బాలీవుడ్ గాయనీగా ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన అనురాధను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1969లో అరుణ్ పౌడ్వాల్‌ను ఆమె పెళ్లాడారు. వారికి కొడుకు ఆదిత్య, కూతురు కవితలు సంతానం. -
ఏంటమ్మా.. ఇదీ!
‘‘బాస్ పిలుస్తున్నారు’’.సెక్షన్లోకి రాగానే.. అజయ్‌తో చెప్పింది పూజ. వాల్‌క్లాక్‌లో టైమ్ చూశాడు అజయ్. పదకొండు దాటి తొమ్మిది నిమిషాలైంది. ‘చచ్చాన్రా.. దేవుడా’ అనుకున్నాడు. తొమ్మిది నిముషాలు అలస్యం అయినందుకు బాస్ ఏమీ అనడు. నిన్న ఆఫీస్ టైమ్ అయిపోయాక కూడా తను ఆఫీస్‌లోనే ఉన్నాడు. అందుకు అంటాడు. అదీ అతడి భయం. ఆఫీస్ అవర్స్ ముగిశాక ఆఫీస్‌లో ఎందుకు ఉండవలసి వచ్చిందో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. క్రితం రోజు స్టాఫ్ ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ పంచ్ స్టేట్మెంట్ రోజూ బాస్ కన్నా ముందే అతడి టేబుల్ మీదకు వచ్చి ఉంటుంది. దాన్ని చూసి లోపలికి పిలుస్తాడు బాస్. తన ఔట్‌గోయింగ్‌లో ‘ఓవర్ స్టే’ అని ఉంటుంది. అందుకే తనను పిలిచి ఉంటాడు అనుకున్నాడు అజయ్. బాస్ క్యాబిన్ తలుపు మూసి ఉంది! సాధారణంగా అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఎవరికైనా అక్షింతలు పడబోతున్నప్పుడు మాత్రం అవి మూసుకుని ఉంటాయి. అది ఆయన అలవాటు. మూసి తిడతాడు. అదొక్కటే కాదు. ఇంకా కొన్ని రూల్స్ ఫాలో అవుతాడు బాస్. అవి ఆ బాస్ కన్నా పైవాళ్లు పెట్టిన రూల్స్ కావు. తనకు తను పెట్టుకున్నవి. ఆయనెప్పుడూ ఉమెన్ స్టాఫ్‌ని తిట్టడు. బాగా కోపం వస్తే మెల్లిగా మందలిస్తాడు. ‘ఏంటమ్మా.. ఇదీ!’ అని. దాన్నే తీవ్రస్థాయి అనుకోవాలి! వాళ్లని తిట్టే ఆ మాత్రపు తిట్టును కూడా మగవాళ్లను తిట్టినట్టుగా తలుపు మూసి తిట్టరు ఆయన. తలుపు తెరిచి ఉన్నప్పుడే లోపలికి పిలిపిస్తాడు. మృదువుగా.. ‘ఏంటమ్మా.. ఇది!’ అంటాడు. పూజ దగ్గరికి వచ్చి మెల్లిగా చెవి దగ్గర అడిగాడు అజయ్.. ‘‘ఎంతసేపైంది వచ్చి?’’ అని.‘‘నేనా.. ఇప్పుడే’’ అంది పూజ నవ్వుతూ. అజయ్ కోపంగా చూశాడు. ‘‘నువ్వెప్పుడొస్తే ఏంటి? బాస్ వచ్చి ఎంతసేపైందో చెప్పు?’’ అన్నాడు. ‘‘లోపలికి వెళ్తావుగా.. చెప్తాడులే.. వచ్చి ఎంతసేపైందో’’ అంది పూజ నవ్వుతూ. కొరకొర చూశాడు అజయ్. ‘‘వెళ్లు.. ఇప్పటికే రెండుసార్లు బెల్ కొట్టాడు.. నీ కోసం’’.. అంది.పూజ కూర్చునే వరుసకు రెండు వరుసల అవతల సరిగ్గా ఆమెకు ఎదురుబొదురుగా ఉంటుంది అజయ్ సీటు. అక్కడికి వెళ్లబోతుంటే.. ‘‘ముందు బాస్‌ని కలువు. మళ్లీ బెల్లు కొడతారేమో’’ అంది పూజ. నేరుగా బాస్ క్యాబిన్‌కి వెళ్లి, మూసి ఉన్న తలుపుపై వేళ్లతో తట్టాడు అజయ్.. ‘మే ఐ కమిన్ సర్’ అన్నట్లు!‘కమిన్’ అని అటువైపు నుంచి ఏమీ వినిపించలేదు. బాస్ మెల్లిగా ‘కమిన్’ అన్నాడేమో, తనకు వినిపించి ఉండదనుకుని డోర్ నాబ్‌ని కిందికి తిప్పి తలుపును కొద్దిగా లోపలికి తోసి.. మళ్లీ ‘మే ఐ కమిన్ సర్’ అంటూ తల లోపలికి పెట్టి చూసి.. నివ్వెరపోయాడు అజయ్. పగలపడి నవ్వుతోంది పూజ. పూజ నవ్వు ఆగట్లేదు. అజయ్‌నే చూస్తూ పడీ పడీ నవ్వుతోంది. తనని ఫూల్‌ని చేశానన్న ఆనందం అది. అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకు ఇంతగా ఎందుకు సంతోషపడిపోతారో అతడికి అర్థం కాదు. వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. లాంగ్షాట్లో అతడినే చూస్తూ నవ్వుతోంది పూజ. ఆమె ముఖానికీ, తన ముఖానికీ మధ్య సిస్టమ్ మానిటర్ అడ్డు వచ్చేలా తన కుర్చీని కాస్త కిందికి అడ్జెస్ట్ చేసుకున్నాడు అజయ్. అతడలా కూర్చున్న కొద్దిసేపటికే బాస్ క్యాబిన్ నుంచి బెల్ మోగింది! వచ్చినట్లున్నాడు!సీట్లోంచి పైకి లేవబోయాడు అజయ్. ‘‘పూజా..’’ పెద్దగా పిలిచాడు బాస్.తిట్టేందుకు పిలవకపోయినా, తిట్టినట్టు పిలవడం బాస్ అలవాటు. ‘‘కూర్చోమ్మా..’’ అన్నాడు బాస్, పూజ లోపలికి వెళ్లగానే. ఆయనెప్పుడూ స్టాఫ్‌ని కూర్చోమని అనడు. ఆ అవసరమే రాదు. రెండు ముక్కల్లో చెప్పాల్సింది చెప్పి పంపించేస్తాడు. ‘‘లుక్.. పూజా.. ఆఫీస్ అవర్స్ అయిపోయాక కూడా ఎవరైనా ఆఫీస్‌లోనే ఉన్నారంటే.. నేననుకోవడం.. సమ్ అదర్ ఇన్టెన్షన్ ఏదో వాళ్లకు ఉంటుందని.. అదర్ దేన్ ఆఫీస్ వర్క్. అది నాకు ఇష్టం లేదు. మార్నింగ్ లేట్‌గా వచ్చినందుకు ఈవెనింగ్ లేట్ అయ్యేంత వరకు పని చేయవలసిన అవసరం, అంత పని ఉండే సెక్షన్ ఏమీ కాదు మనది. అజయ్ ఈ మధ్య రిపీటెడ్‌గా.. తన షిఫ్ట్ అయ్యాక కూడా ఆఫీస్‌లోనే ఉంటున్నాడు’’ అన్నాడు బాస్. ఆమెకు కొంచెం అర్థమైంది. ‘‘పనైపోయాక కూడా అజయ్ ఆఫీసులోనే ఉండడం.. నీ కోసమేనని నేను అనుకుంటున్నాను పూజా’’ అన్నాడు బాస్.పూజ మౌనంగా ఉండిపోయింది. ఆయనా ఇంకేమీ మాట్లాడలేదు. కనీసం.. ‘ఏంటమ్మా.. ఇదీ!’ అని కూడా మందలించలేదు. ‘ఈ మాట చెప్దామనే..’ అన్నట్లు మాత్రం చూశాడు. పూజ బయటికి వచ్చింది. బయటికి రాగానే ‘ఏంటటా?’ అన్నట్లు చూశాడు అజయ్. ‘క్యాంటీన్లో చెప్తా’ అన్నట్లు సైగ చేసింది పూజ. ఇదంతా రెండేళ్ల క్రిందటి మాట. ఇప్పటికీ ఆ క్యాబిన్లోంచి అప్పుడప్పుడు ‘పూజా’, ‘అజయ్’ అనే పిలుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి! పూజకు, అజయ్‌కి మాత్రమే కాదు. మిగతా స్టాఫ్‌కు కూడా. అలా వినిపించినప్పుడు.. ‘నాకు వినిపించింది! నీకు వినిపించిందా?’ అన్నట్లు ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. బాస్ ఆత్మ ఇక్కడే తిరుగుతోందని అనుకుంటూ ఉంటారు. కొత్తగా వచ్చిన లేడీ బాస్ కూడా ఒక రోజు స్టాఫ్‌ని అడిగింది.. ‘ఎవరో ఎవర్నో పిలిచినట్లు నాకు అనిపిస్తోంది. మీకు అనిపిస్తోందా’ అని. అలాంటప్పుడు పూజ, అజయ్ బాధగా ఒకర్నొకరు చూసుకుంటారు. వాళ్లిద్దరంటే పాత బాస్‌కు వాత్సల్యం. వాళ్లక్కూడా ఆయనంటే ఇష్టం. ‘‘వాయిస్‌గా కాకుండా, బాస్‌గా ఎదురైతే.. ఆయన్ని నేనొకటి అడుగుతాను’’ అన్నాడు ఓ రోజు అజయ్ ఎమోషనల్‌గా. అంతక్రితమే సెక్షన్లో అందరికీ మళ్లీ ఒకసారి బాస్ గొంతు వినిపించింది!‘ఏమని అడుగుతావ్?’ అన్నట్లు అజయ్ వైపు చూసింది పూజ. ‘‘సార్.. ఆఫీస్ అయ్యాక కూడా మీరింకా ఆఫీస్‌లోనే ఎందుకు ఉంటున్నారు సార్ అని అడుగుతాను’’ అంటూ.. కురుస్తున్న కళ్లపై వేళ్లను అదిమి పెట్టుకున్నాడు అజయ్. పూజ మృదువుగా అజయ్ చేతిని పట్టుకుంది. ‘‘పనైపోయాక కూడా అజయ్ ఆఫీసులోనే ఉండడం.. నీ కోసమేనని నేను అనుకుంటున్నాను పూజా’’ అన్నాడు బాస్. - మాధవ్ శింగరాజు -
వెలుగులోకి చిన్నమ్మ ప్రమాణ పత్రం
‘‘ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యి.. అక్క జయలలిత కారు ముందు సీట్లో.. నేను వెనుక కూర్చుని ఇంటికి వెళ్తామని నమ్మకం, ఆశతో ఉన్నాం. అయితే, ఆమె ఈ లోకం విడిచి మమ్మల్ని తీవ్ర మనో వేదనను మిగిల్చింది. జైలు జీవితం అక్కను తీవ్రంగా కుంగదీసింది. డిసెంబరు 4వ తేదీ అక్క టీవీలో జై హనుమాన్ సీరియల్ చూస్తున్న సమయంలో కాఫీ ఇచ్చాను. సీరియల్ ముగిసిన తర్వాత కాఫీ తాగుతానని ఆమె చెప్పారు. క్షణాల్లో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె శరీరం వణుకుతోంది.. అక్కా.. అక్కా అంటూ నేను అరిచాను.. కళ్లు తెరిచినట్టు తెరిచి చివరకు మూతపడింది. అంతే నేను స్పృహ తప్పిపడిపోయా’’ అంటూ శశికళ విచారణ కమిషన్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సాక్షి, చెన్నై : ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్య వంతురాలుగా పోయెస్ గార్డెన్‌కు అక్క జయలలిత వచ్చేస్తారన్న ఆశతో ఉన్నామని ఆమె నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. హఠాత్తుగా ఆమె ఆరోగ్యం ఆస్పత్రిలో క్షీణించిందని ఆవేదన వ్యక్తంచేశారు. జైలు జీవితం అక్కను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొన్నారు. ఈమేరకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌కు శశికళ వాంగ్మూలం ఇచ్చారు. తమిళ ప్రజల అమ్మ మరణం ఓ మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఈ మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ తీవ్ర విచారణ సాగిస్తూ వస్తోంది. అన్ని కోణాల్లోనూ, జయలలితకు సన్నిహితంగా ఉన్న వాళ్లు, భద్రతాధికారులు, ప్రభుత్వ అధికారులు, ఇంటి పని మనుషుల్ని సైతం ఆ కమిషన్ విచారిస్తూ వస్తోంది. జయలలిత నెచ్చెలి శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉండడంతో ఆమె వాంగ్ములాన్ని ప్రమాణ పత్రం రూపంలో సమర్పించేందుకు ఆదేశించారు. దీంతో ఆమె తరఫు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ 55 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని కమిషన్‌కు గత వారం సమర్పించారు. అందులో ఏముందో అన్న ఉత్కంఠకు తెర పడుతూ ఆ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అపోలోలో చికిత్స–పరామర్శ అపోలో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి డిసెంబరు ఐదో తేదీ వరకు జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, డాక్టర్ల గురించి ప్రమాణ పత్రంలో శశికళ వివరించారు. జ్వరంతోనే ఆస్పత్రికి వచ్చిన క్రమంలో ఆమెకు ఇతర వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో జయలలిత కోలుకున్నట్టు, ఆమె పోయెస్ గార్డెన్‌కు మళ్లీ వచ్చేస్తారన్న ఆశతో ఉన్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబరు 27వ తేదీ కావేరి సమస్య విషయంగా ఆమె అధికారులతో సమావేశం కూడా అయ్యారని వివరించారు. ఈ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ జయలలితను కలిసినట్టు, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, కార్మిక శాఖ మంత్రి నిలోఫర్ కబిల్, భద్రతాధికారులు సైతం జయలలితను చూశారని పేర్కొన్నారు. వారి వద్ద తాను వచ్చేస్తానని, ఎవరూ ఇక రావద్దని జయలలిత స్వయంగా సూచించారని తెలిపారు. గవర్నర్ విద్యాసాగర్ రావు సైతం జయలలితను చూసిన వారిలో ఉన్నట్టు తెలిపారు. ఆమె స్పృహలో లేని దృష్ట్యా, ఆస్పత్రికి తీసుకురాగలిగామని, స్పృహలో ఉండి ఉంటే అంగీకరించే వారు కారని తెలిపారు. జైలు జీవితంతో.. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చాక, అక్క జయలలిత మనో వేదనలో పడ్డారని, తాను పదే పదే దాని గురించి ఆలోచించ వద్దు అని సూచించినట్టు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం ఆమెకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 20 మంది వైద్య నిపుణుల ద్వారా పోయెస్ గార్డెన్‌లోనే వైద్య పరీక్షలు చేశామని పేర్కొంటూ, అందుకు తగ్గ వీడియో క్లిప్పింగ్‌లు, అపోలోలో తీసిన వీడియోలను కమిషన్‌కు సమర్పించడం గమనార్హం. అలాగే, బీ ఫామ్‌లో సంతకం పెట్టే సమయంలో స్పృహలోనే ఉన్నట్టు పేర్కొన్నారు. జ్వరంతో.. సెప్టెంబరు 19న జయ జ్వరం బారినపడ్డారు. ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ శివకుమార్ శబరిమలైకి వెళ్లారు. ఆయన్ను ఫోన్ ద్వారా సంప్రదించి, అందుకు తగ్గ మందుల్ని అందించారు. జ్వరం కాస్త తగ్గడంతో 21వ తేదీ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జయలలిత వెళ్లారు. అక్కడి నుంచి రాగానే, జ్వరం మరింతగా పెరిగింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో 22వ తేదీ ఆమె బయటకు రాలేదు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు మొదటి అంతస్తు నుంచి వచ్చిన జయ కేకతో శశికళ పరుగులు తీశారు. బాత్రూం వద్ద పడి ఉన్న జయలలిత మంచం మీదకు తీసుకొచ్చారు. జ్వరం తీవ్రతకు తోడుగా ఆమె స్పృహ తప్పడంతో డాక్టర్ శివకుమార్‌ను పిలిపించి హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో శశికళ, శివకుమార్ ఉన్నారు. మార్గం మధ్యలో జయలలిత çస్పృహలోకి వచ్చి ఆస్పత్రికి వద్దు అని మారం చేశారు. అప్పటికే అంబులెన్స్ ఆస్పత్రికి చేరింది. అక్కా...అక్కా.. వైద్య పరీక్షలు, చికిత్సలు, పరామర్శలు, వీడియో చిత్రీకరణ తదితర అంశాల గురించి సమగ్రంగా వివరించిన శశికళ, జయలలిత ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిన సందర్భాన్ని ప్రమాణ పత్రం ద్వారా కమిషన్ ముందు పూసగుచ్చినట్టు తెలియజేశారు. డిసెంబరు 4వ తేదీ జయలలిత టీవీలో జై హనుమాన్ సీరియల్ చూస్తున్న సమయంలో కాఫీ ఇచ్చామని, సీరియల్ ముగిసినానంతరం కాఫీ తాగుతానని చెప్పిన అక్క ఆరోగ్యం క్షణాల్లో క్షీణించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శరీరం వణుకుతుండడంతో అక్కా..అక్కా అంటూ అరిచానని, అంతలోపు వైద్యులు పరుగున వచ్చారని తెలిపారు. వారి సూచన మేరకు తాను పదే పదే అక్కా.. అక్కా అని అరవగా, నెమ్మదిగా కళ్లు తెరిచినట్టు తెరచి చివరకు మూత పడిందన్నారు. అదే సమయలో తాను çస్పృహ తప్పానని వివరించారు. అక్క కారు ముందు సీట్లో, తాను వెనుక కూర్చుని ఇంటికి వెళ్తామన్న నమ్మకం, ఆశతో ఉన్నామని, అయితే, ఆమె మరణించడం తనకు తీవ్ర మనో వేదనను మిగిల్చిందని పేర్కొన్నారు. -
విధిలేని పరిస్థితుల్లోనే వైదొలిగాం
సాక్షి, అమరావతి : విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్య వైఖరితో విధిలేని పరిస్థితుల్లోనే కేంద్రం నుంచి వైదొలుగుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పూర్తి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్ట విభజన హేతుబద్ధంగా జరగలేదన్నారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఇలాగే వ్యవహరిస్తే ప్రజలకు జాతీయ పార్టీలపై విశ్వాసం పోతుందని అన్నారు. జాతీయ పార్టీలు జాతి ప్రయోజనాలకు పనిచేయాలని చెప్పారు. జాతీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని, రాష్ర్టానికి రావాల్సిన నిధులపై జైట్లీ నిర్లక్ష్యంగా మాట్లాడటం బాధకలిగించిందన్నారు. ఒక్క రాష్ర్టానికే నిధులన్నీ ఇవ్వడం కుదరదన్న జైట్లీ ప్రకటన అసంబద్ధమని అన్నారు. రాష్ర్టానికి న్యాయం జరుగుతుందనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, విభజన హామీలు అమలు చేస్తారని ఆశించామని అన్నారు. విభజన హామీలన్నీ అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. -
బోని కపూర్‌ను సుదీర్ఘ సమయం విచారణ
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోని కపూర్ వాంగ్మూలాన్ని దుబాయ్ పోలీసులు రికార్డు చేశారు. మొత్తం నలుగురు సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో బోని, వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసినట్టు తెలిసింది. మూడున్నర గంటల పాటు ఆయన్ను విచారించారని, రికార్డెడ్ ఆన్ కెమెరా ముందు బోని స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు వెల్లడైంది. నీళ్లతో నిండి ఉన్న బాత్‌టబ్‌లో శ్రీదేవీ అకస్మారక పరిస్థితిలో ఉన్నట్టు గుర్తించినట్టు బోని చెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాక శ్రీదేవీని రషీద్ ఆసుపత్రికి తరలించిన సమయంలో బోనితో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. అపస్మారక స్థితిలో శ్రీదేవీ బాత్‌టబ్‌లో పడిపోయి ఉన్న సమయంలో, బోని వారికే ముందస్తుగా కాల్ చేసి సమాచారం అందించాడు. అంతేకాక రషీద్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండెంట్ల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. మరోవైపు శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేసింది. ఆ రిపోర్టులో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్‌లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లిన శ్రీదేవీ, బాత్రూంలో కాలు జారి నీళ్ల టబ్‌లో పడిపోయిందని, ఆ సమయంలో ఊపిరాడక చనిపోయినట్టు తెలిపింది. ఘటన జరిగిన తర్వాత కొద్ది సేపటికి హోటల్ గదికి వచ్చిన బోని కపూర్, హోటల్ సిబ్బంది సాయంతో బాత్రూం డోర్లను బద్దలు కొట్టి తెరిచారు. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవీని, హుటాహుటిన దగ్గర్లోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీదేవి ఊపిరి ఆగిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. అయితే శ్రీదేవీ శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొది. అంతేకాక అసలు గుండెపోటు విషయాన్నే ఫోరెన్సిక్ రిపోర్టు ప్రస్తావించలేదు. -
వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
-
‘వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నాం’
వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాపై వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరిచి అందరితో కలిసి హోదా కోసం పోరాడాలని సూచించారు. జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెక్కలపై కమిటీ కాకుండా జరిగిన అన్యాయంపై కమిటీ వేయాలని సూచించారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీపై పోరాటం చేయాలని కోరారు. -
హత్యకేసులో నిందితుడి సంచలన వాంగ్మూలం
తిరువొత్తియూరు: మహిళా, అమె ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా నిత్తిరవిలై, వల్లవిలై తదేయుపురానికి చెందిన విజయదాసన్ కేరళలో జాలరిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య సంగీత (27). వీరికి సంజయ్ (7), బియూభూపర్ (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు నిత్తిరవిలై సమీపం కాంచీపురంలో అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. రెండు వారాల కిందట విజయదాసన్ చేపలు పట్టే పనికోసం కేరళ వెళ్లాడు. ఈ క్రమంలో గత 26వ తేదీ ఉదయం సంగీత, ఇద్దరు పిల్లలు గణపతియాన్ కడవు వంతెన సమీపం తామ్రభరణి నదిలో శవాలుగా తేలుతున్నారు. దీనిపై సంగీత తండ్రి మార్టిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిత్తిరవినై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శవపరీక్షలో ఈ ముగ్గురు హత్యకు గురైనట్టు తె లిసింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు హోమియోపతి డాక్టర్ ఇనయం, బుద్దనతురానికి చెందిన కలయరసన్ (27)లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచా రణలో కలయరసన్ ముగ్గురిని హత్య చేసినట్టు నేరం అం గీకరించాడు. అతను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. తాను విదేశంలో పని చేసి తిరిగి వచ్చిన తరువాత సంగీతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇలాగే ఇంటి సమీపంలో క్లినిక్ నిర్వహిస్తున్న హోమియోపతి డాక్టర్‌తోనూ సంగీతకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పలు సార్లు మందలించినప్పటికీ సంగీత హోమియోపతి డాక్టర్‌తో సంబంధాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలో గత 25వ తేదీ రాత్రి సంగీత ఇంటికి వెళ్లిన సమయంలో ఆమెతో వా గ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెంది ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి బైకుపై తీసుకెళ్లి తామ్రభరణి నదిలో పడవేశాను. తరువాత రోజు ఉదయం సంగీత ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న చిన్నారులను మేల్కొలిపి మీ తల్లి దగ్గరకు తీసుకెళతానని బైకుపై ఎక్కించుకుని వెళ్లి తామ్రభరణి నదిలో తోసి హత్యచేసినట్టు తెలిపాడు. కేసు విచారణ కొనసాగుతోంది. -
మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు
నిత్యామీనన్ అరుదైన అమ్మాయి. ‘జెమ్’ అనుకోండి. అందం, యాక్టింగ్.. వీటి గురించి కాదు. ఆమె అభిప్రాయాలు బోల్డ్‌గా ఉంటాయి. అవునా! ఇదేం గొప్ప సంగతి? ఇప్పటి అమ్మాయిలంతా బోల్డ్‌గానే ఉంటున్నారుగా. నిజమే అనుకోండి, జెండర్ విషయాల్లో నిత్య.. న్యాయంగా ఉంటారు. అంటే.. అబ్బాయిలందర్నీ పట్టుకుని తిట్టేయరు.. ‘వీళ్లింతే’ అని! అలాగే అమ్మాయిల్నీ కారణం లేకుండా వెనుకేసుకురారు. మలయాళం మూవీ ఇండస్ట్రీలో మగాళ్లదే రాజ్యం అయిపోయిందని ఈమధ్య నిత్య కో–స్టార్ పార్వతి అన్నప్పుడు.. మీడియా అంతా నిత్య చుట్టూ చేరింది. ‘నిజమేనా?’ అని! సినిమా పరిశ్రమలో ఆడవాళ్లకు ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ఉండడం లేదన్నది కూడా పార్వతి చేసిన ఒక కామెంట్. ‘ఆ.. నిజమే’ అన్నారు నిత్య. అలాగని ఆమె మగవాళ్లనేం తప్పు పట్టలేదు. ‘‘ఎక్కడ మాత్రం లేదు చెప్పండి మగవాళ్ల రాజ్యం?! ఇళ్లు, ఆఫీస్‌లు.. అలాగే సినిమా ఇండస్ట్రీ. మొత్తం సొసైటీనే ఇలా ఉన్నప్పుడు.. మనకున్న ఒకే చాయిస్.. ఉమెన్‌గా మన ప్రత్యేకత ఏంటో నిరూపించుకోవడం, మన అభిప్రాయం తెలుసుకోవడం తమ అవసరంగా మగవాళ్లు భావించే పరిస్థితి తీసుకురావడం’’ అన్నారు నిత్య. ‘మిసాజనీ’ అనే మాటను కూడా నిత్య నవ్వుతూ కొట్టేస్తారు. మిసాజనీ అంటే.. స్త్రీ ద్వేషం. ‘‘పనిగట్టుకునైతే మగాళ్లు స్త్రీలను ద్వేషిస్తారని అనుకోను. పురుషాధిక్య సమాజం కదా. తీసిపడేయడం అనే ఆ హ్యాబిట్ అలా వచ్చేస్తుంటుంది.. మగాళ్లు ఎంత సభ్యతగా బిహేవ్ చేయాలనుకున్నా..’’ అంటోంది నిత్య. ప్రస్తుతం నిత్య ‘ప్రాణ’ అనే మలయాళం మూవీలో నటిస్తోంది. అందులోని థీమ్.. ఇదే.. భావ ప్రకటన స్వేచ్ఛ. ‘ఆ’ అనే తెలుగు సినిమాలో కూడా నిత్య నటిస్తోంది. -
అతనేం జైరాను వేధించలేదు : ప్రత్యక్ష సాక్షి
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి జైరా వసీమ్ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తీసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఆమెపై ముంబైకి చెందని ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తోటి ప్రయాణికుడు ఒకరు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో నిందితుడు జైరాను వేధించలేదని పేర్కొనటం విశేషం. ఈ మేరకు నిందితుడు వికాస్ సచ్దేవ్ తరపు న్యాయవాది హెచ్ ఎస్ ఆనంద్ బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘నేను అదే విమానంలో ప్రయాణించా. వారికి సమీపానే నేను కూర్చుని ఉన్నా. అతను సీటుపై కాలుపెట్టిన మాట వాస్తవం. అయితే ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్నాక కూడా అతను కాలును అలాగే ఉంచాడు. అతనేం లైంగిక వేధింపులకు పాల్పడలేదు. ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ఆమె అతనిపై గట్టిగా అరిచింది. వెంటనే కాలు పెట్టినందుకు అతను క్షమాపణలు కూడా తెలియజేశాడు. వివాదం అంతటితో సర్దుమణిగింది కూడా’’ అని చతుర్వేది అనే ప్రయాణికుడు ముంబై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిని ఆధారంగా చేసుకుని అతనికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది ఆనంద్ జడ్జిని కోరారు. అయితే మరికొందరు ప్రయాణికులతోపాటు, బాధితురాలి స్టేట్మెంట్ను(సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం) ఇంకా రికార్డు చేయని పక్షంలో అతన్ని కస్టడీకి అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తిని అభ్యర్థించారు. కానీ, నిందితుడు జమ్ము కశ్మీర్‌కు చెందిన వ్యక్తని.. అతనికి సీఆర్పీసీ వర్తించని అతని తరపున న్యాయవాది వాదన వినిపించగా.. దానిని కోర్టు తోసిపుచ్చింది. చివరకు అతనిని డిసెంబర్ 22వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అయితే సచ్దేవ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. దానిపై విచారణను 15వ తేదీకి వాయిదా వేశారు. బాలీవుడ్లో పెరిగిపోతున్న మద్దతు.. కాగా, నటి జైరా వసీమ్‌కు మద్దతు పెరిగిపోతూ వస్తోంది. పలువురు బాలీవుడ్ నటులు ఇప్పటికే ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేయగా.. తాజాగా అమీర్‌ఖాన్ భార్య కిరణ్, నటి కంగనా రనౌత్ స్పందించారు. జైరా స్థానంలో తాను ఉండి ఉంటే అతని కాళ్లు విరగొట్టి ఉండేదానినని కంగనా వ్యాఖ్యానించారు. మరోవైపు క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. -
‘జెరూసలేం’ నిర్ణయంపై తీవ్ర నిరసనలు
న్యూఢిల్లీ: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ శాంతిని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమై ట్రంప్ నిర్ణయంతో తలెత్తిన పరిణామాలను చర్చించనుంది. ట్రంప్ చర్య అన్యాయం, బాధ్యతారహితమని సౌదీ అరేబియా తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఏకపక్ష నిర్ణయం: పాలస్తీనా అథారిటీ ట్రంప్ నిర్ణయం ఏకపక్ష, రెచ్చగొట్టేదిగా ఉందని, ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు, అస్థిర పరిస్థితులకు కారణం కానుందని పాలస్తీనా అథారిటీ హెచ్చరించింది. ఈ మేరకు పాలస్తీనా అథారిటీ..ఐరాసలోని సర్వప్రతినిధి సభకు, భద్రతామండలికి లేఖ రాసింది. జెరూసలేం పాలస్తీనా ప్రజలకు మాత్రమే కాదు..ప్రపంచంలోని ముస్లింలందరికీ సంబంధించినదని పేర్కొంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఖతార్ అమిర్ షేక్ హమద్ అల్–తానీ ఖండించారు. ట్రంప్ తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుని ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పాలని పాక్ కోరింది. అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ పాక్ పార్లమెంట్ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాంతంలో భద్రతకు విఘాతం కలుగనుందని, తీవ్ర పర్యవసానాలు తప్పవని రష్యా హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. పశ్చిమ జెరూసలేంను ఇజ్రాయెల్‌కు, తూర్పు జెరూసలేంను పాలస్తీనాకు రాజధానులుగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రష్యా కోరుతోంది. దీనిపై చర్చించేందుకు శుక్రవారం భద్రతా మండలి భేటీ కానుంది. జెరూసలేంపై అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం రిస్క్‌తో కూడుకున్నదంటూ పలు వార్తా పత్రికలు వ్యాఖ్యానించాయి. అసలే అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్‌టైమ్స్, సీఎన్ఎన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయి తే, చారిత్రక సత్యానికి వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా అధ్యక్షుని నిర్ణయం ఉందని ఫాక్స్ న్యూస్ పేర్కొంది. మా వైఖరిలో మార్పులేదు:భారత్ పాలస్తీనాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై భారత్ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనాపై భారతదేశ వైఖరి మారబోదని, దీనిపై మూడో దేశం ప్రభావం ఉండబోదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. నేడు భద్రతామండలి అత్యవసర సమావేశం జెరూసలేం అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని మండలి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ త్వరలో పాలస్తీనాలో పర్యటించనున్నట్లు భారత్‌లో ఆ దేశ రాయబారి అద్నన్ అలిహైజా శుక్రవారం వెల్లడించారు. అయితే పర్యటనకు సంబంధించిన వివరాలను తెలపలేదు. పాలస్తీనా వ్యాప్తంగా ఆందోళనలు అమెరికా నిర్ణయాన్ని నిరసిస్తూ వందలాది మంది ప్రదర్శనకారులు వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల్లో ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్ దిష్టిబొమ్మలను, అమెరికా, ఇజ్రాయెల్ జాతీయ పతాకాలను దహనం చేశారు. పోలీసులపై పలు చోట్ల రాళ్లు రువ్వారు. అక్కడి∙భద్రతా దళాలతో తలపడ్డారు. బెత్లహాంలో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా తీవ్ర సాయుధ పోరుకు సిద్ధం కావాల్సిందిగా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రజలకు పిలుపునిచ్చింది. మూడు రోజులపాటు దుకాణాలు, స్కూళ్లను మూసివేయాలని పాలస్తీనా వాసులు నిర్ణయించారు. అయితే, శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారవచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
మా పార్టీకి కార్యకర్తలు కావలెను!
ముంబై: కార్యకర్తల కోసం ఓ రాజకీయ పార్టీ పత్రికలో ప్రకటన ఇచ్చిన అరుదైన ఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది. ఫడ్నవీస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహదేవ్ జంకర్ నేతృత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పక్ష(ఆర్ఎస్పీ) ఈ మేరకు ఓ మరాఠీ పత్రికలో కార్యకర్తల కోసం ప్రకటన వెలువరించింది. ‘ఓ జాతీయ పార్టీ కోసం కార్యకర్తలు కావాలి. సామాజిక సేవతో పాటు భారత్, మహారాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తులు అయ్యుండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21న పార్టీ జిల్లా కార్యాలయంలో హాజరుకావాలి’ అని ఆర్ఎస్పీ బుల్ధానా జిల్లా చీఫ్ సుభాష్ రాజ్‌పుత్ ప్రకటన ఇచ్చారు. సుభాష్ మీడియాతో మాట్లాడుతూ అంకిత భావం, విశ్వాసం కలిగిన కార్యకర్తల కోసమే ప్రకటన ఇచ్చినట్లు తెలిపారు. -
ప్రాధేయపడ్డా, నిరాకరించడంతో తగలబెట్టా..
సాక్షి, చెన్నై: పెళ్లి చేసుకోవాలని ఎంతగానే ప్రాధేయ పడ్డా.. అయితే, నిరాకరిస్తూ, తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చ గొట్టడంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని పోలీసులకు ఇందుజా హత్య కేసులో నిందితుడు ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు బుధవారం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రేణుక, నివేదలను వానగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్లో పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఇందుజాను వేళచ్చేరికి చెందిన ప్రేమోన్మాది ఆకాష్ సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. నిందితుడు ఆకాష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పాఠశాల స్థాయిలో పరిచయం, ప్రేమ, ఆ ఇంటికి అన్నీ తానై చేసిన సపర్యలను వివరించాడు. ఆ కుటుంబంలో తాను ఒక్కడిగా భావించి, ఇన్నాళ్లు సేవల్ని అందించానని, అయితే, హఠాత్తుగా తనను దూరం పెట్టడంతో మూడు నెలలుగా తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నాడు. ఈ కాలంలో ఎంతో ప్రాధేయ పడ్డానని, అయితే, ఇందుజా మనస్సును ఆమె తల్లి మార్చేసిందని, చివరకు ఇందుజ కూడా తనను అసహ్యించుకోవడంతో ఉన్మాదిగా మారినట్టు వివరించాడు. సోమవారం రాత్రి ఆ ఇంటికి పెట్రోల్ క్యాన్‌తో వెళ్లినా, హతమార్చాలన్న ఉద్దేశం తొలుత లేదని తెలిపాడు. ఆంటీ రేణుక లోనికి అనుమతించలేదని, ఎంతో ప్రాధేయ పడ్డ అనంతరం ఇందుజాతో మాట్లాడే అవకాశం కల్పించా రని, అయితే, ఇందుజా తనను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హెచ్చరికలు చేయడంతో ఇక, హతమార్చాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చి, పెట్రోల్ పోసి నిప్పంటించానని తానూ పోసుకునే క్రమంలో ఆమె తల్లి, చెల్లి బయటకు రావడంతో వారి మీద కూడా పోసినట్టు, ఇరుగు పొరుగు వారు అక్కడికి రావడంతో మోటార్ బైక్ మీద ఉడాయించానని వివరించాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాని, కుటుంబానికి, మిత్రులకు మెసేజ్‌లు కూడా చేసి, చివరకు గస్తీ పోలీసులకు చిక్కినట్టు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ గస్తీ పోలీసులు తనను అనుమానంతో పట్టుకున్నారని, తర్వాత తానే ఇందుజాను కడతేర్చినట్టు వారి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నాడు. తాను ఆత్మహత్య చేసుకుని ఉంటే బాగుండేదని, అయితే, పోలీసులకు చిక్కినట్టు పేర్కొన్నాడు. దీంతో అతడ్ని బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరిచినానంతరం పుళల్ జైలుకు తరలించారు. ఆందోళనలు ఈ ఘటనతో ఆదంబాక్కం పరిసర వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అక్కడి ప్రజలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ మురళి వారితో చర్చలు జరిపి హంతకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు తగ్గ సెక్షన్లను నమోదు చేసినట్టు వివరించడంతో అక్కడి ప్రజలు వెనక్కు తగ్గారు. తీవ్రంగా గాయపడ్డ రేణుక, నివేదల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆ ఇద్దర్ని మెరుగైన చికిత్స నిమిత్తం కీల్పాకం నుంచి వానగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కఠినంగా వ్యవహరించాలని, మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని పీఎంకే అధినేత రాందాసు డిమాండ్ చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొంటూ, ఇటీవల కాలంగా వన్‌సైడ్ లవ్ వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని, ప్రేమోన్మాదుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టడం కాదని, మరొకరు ఇలాంటి తప్పు చేయని రీతిలో కఠినంగా శిక్షించాలన్నారు. -
పండగ వేళ.. ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సంబల్పూర్–బాన్స్‌వాడి(యశ్వంత్‌పూర్)ల మధ్య విశాఖపట్నం మీదుగా, విశాఖపట్నం– హైదరాబాద్, బెంగళూరు–హౌరా తదితర రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. సంబల్పూర్– బాన్స్‌వాడి(యశ్వంత్‌పూర్) ప్రత్యేక రైలు నం.08301 సంబల్పూర్–బాన్స్‌వాడి వీక్లీ స్పెషల్ ప్రతి బుధవారం 09.30 గంటలకు సంబల్పూర్లో బయలుదేరి 19.00 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 16.40 గంటలకు బాన్స్‌వాడి (యశ్వంత్‌పూర్) చేరుకుంటుంది. అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం.08302తో బాన్స్వాడిలో ప్రతీ శుక్రవారం 00.30 గంటలకు బయలుదేరి అదే రోజు 20.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ 20.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 06.35 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబరు 10వ తేదీ నుంచి డిసెంబర్ 29 వరకు నడుస్తుంది. బర్గారోడ్, బోలంగిర్, టిట్లాఘడ్, కేసింగ, రాయగఢ, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జాలర్‌పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. ∙హైదరాబాద్– విశాఖపట్నం ప్రత్యేక రైలు నం.07148 హైదరాబాద్–విశాఖపట్నం స్పెషల్ సెప్టెంబర్ 28, 30 తేదీల్లో హైదరాబాద్(నాంపల్లి)లో 18.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 29, అక్టోబర్ 1వ తేదీల్లో విశాఖపట్నంలో 19.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 08.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. బెంగళూరు కంటోన్మెంట్–హౌరా రైలు నం.06531 బెంగళూరు కంటోన్మెంట్–హౌరా సూపర్‌ఫాస్ట్ రైలు సెప్టెంబరు 21వ తేదీన బెంగళూరు కంటోన్మెంట్లో 23.40గంటలకు బయలుదేరుతుంది. శనివారం 10.55 గంటలకు హౌరా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం.06532 హౌరా– బెంగళూరు కంటోన్మెంట్ సూపర్‌ఫాస్ట్ రైలు హౌరాలో సెప్టెంబరు 24వ తేదీన ఆదివారం తెల్లవారుజామున 01.05 గంటలకు బయలుదేరుతుంది. మంగళవారం 11.40 గం టలకు బెంగళూరు చేరుకుంటుంది. కృష్ణరాజపురం, బంగార్పేట, జాలర్‌పేట, కాట్పడి, అరక్కోణం, చెన్నై సెంట్రల్, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంరోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగాం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్పూర్కియోంఝర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సాంత్రాగచ్చి స్టేషన్లలో ఆగుతుంది. చెన్నై–హౌరాల మధ్య సువిధ స్పెషల్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు 02841 సాంత్రగచ్చి– చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ రైలు ప్రతీ ఆదివారం సాంత్రగచ్చిలో 12.40గంటలకు బయలుదేరి మరుసటిరోజు 02.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 02.35 గంటలకు బయలుదేరి సోమవారం 15.20గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 02842 నంబర్‌తో చెన్నై సెంట్రల్లో ప్రతీ సోమవారం 18.20గంటలకు బయలుదేరి మంగళవారం 08.15గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 08.45గంటలకు బయలుదేరి మరుసటిరోజు 23.30గంటలకు సాంత్రగచ్చి చేరుకుంటుంది. ఖరగ్‌పూర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. -
నేను ఎలాంటి ప్రకటన చేయలేదు
-
నేను ఎలాంటి ప్రకటన చేయలేదు: పూరి
ప్రస్తుతం డ్రగ్స్ కేసు విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దర్శకుడు పూరి జగన్నాథ్ దే. పూరి టీంలో పని చేసిన చాలా మంది ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది నటులు మీడియా ముందుకు వచ్చి తమ వాదన వినిపించారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. తాజాగా ఈ ఇష్యూకి సంబంధించి పూరి జగన్నాథ్ ఓ ట్వీట్ చేశాడు. 'నేను ఏ విషయానికి సంబంధించి, ఎవరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నా సినిమా పైసావసూల్ ను పూర్తి చేసే పనిలో ఉన్నా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా పైసా వసూల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి. డ్రగ్స్ కేసులో పూరితో పాటు ఆయన సన్నిహితులు రవితేజ, చార్మీ, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. I have not given any statement regarding anything n anyone till now .. very busy completing my film #PaisaVasool — PURI JAGAN (@purijagan) 15 July 2017 -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: గుంటూరు డీఐజీ
ఏలూరు అర్బన్: ఏలూరు మండలం మాదేపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గుంటూరు రేంజ్ డీఐజీ ఎన్.సంజయ్ శుక్రవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నరసాపురంలో జరిగిన క్రిస్టియన్ సమావేశాల్లో మృతుడు జుజ్జవరపు ఉదయరాజు వీడియో చిత్రీకరణ చేశారని, రోజుపాటు తనతో సన్నిహితంగా మెలిగాడన్నారు. అలాంటి వ్యక్తి మృత్యువాత పడటం బాధ కలిగించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించి గుంటూరు తిరిగి వెళ్తూ మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు నగరానికి వచ్చానని చెప్పారు. ప్రమాదానికి రోడ్డు మరమ్మతులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోందన్నారు. మరమ్మతులు చేసే చోట ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవని, వెలుగు లేకపోవడం కూడా కారణమన్నారు. అనంతరం సత్రంపాడులో ఉన్న మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పి.భాస్కరరావు, సీఐలు అడపా నాగమురళి, జి.మధుబాబు ఆయన వెంట ఉన్నారు. -
అమరీందర్ ఆస్తులు 48.29 కోట్లు
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్‌సింగ్ తనకు రూ. 48.29 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. వీటిలో దుబాయ్‌లో ఒక ఫ్లాట్, వారసత్వంగా లభించిన పాటియాలలోని మోతీబాగ్ ప్యాలెస్, బంగారు ఆభరణాలు, వజ్రాలు తదితరాలున్నాయి. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలప్పుడు ప్రకటించిన ఆస్తులతో పోల్చితే ఇప్పుడవి 40% తగ్గాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ పాటియాలా(పట్టణ) స్థానంలో ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్‌పై, లాంబిలో సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌పై రెండు చోట్లా పోటీచేస్తున్నారు. తన భార్యపేరిట ఉన్న రూ.6.09 కోట్ల ఆస్తులతో పాటు తనకు స్థిర, చరాస్తులన్నీ కలిపి రూ. 42.20 కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. -
2,929 పరిశ్రమలొచ్చాయి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 2,929 పరిశ్రమలు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో టీఎస్ ఐపాస్‌పై ప్రకటన చేసిన కేటీఆర్.. మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లో, ఇతర పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలతో 95 వేల మందికి ప్రత్యక్షంగా.. మరో 3 లక్షల మందికి పరోక్షంగా లబ్ది చేకూరుతుందని కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం రావడం గర్వంగా ఉందని అన్నారు. -
నోట్ దిస్ పాయింట్!
-
ప్రజల కంటే దివీస్ ఎక్కువా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజల ఆస్తులు పరిరక్షించాల్సిన చంద్రబాబు సర్కార్ దివీస్ రసాయన పరిశ్రమకు కొమ్ముకాస్తూ బడుగు, బలహీన వర్గాలపై పోలీసులతో దషీ్టకాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. దివీస్ కర్మాగారంతో ఎదురయ్యే సమస్యలను జిల్లా కలెక్టర్‌కు చెప్పుకునేందుకు కాకినాడ వస్తున్న దివీస్ బాధిత గ్రామాల ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి దొరికిన వారిని దొరికినట్టుగా దాడి చేయడం విచారకరమని శనివారం రాత్రి విలేకర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.ఉప్పాడ కొత్తపల్లి మండలం శ్రీరామపురంలో పోలీసులు దౌర్జన్యంగా జీపుల్లోకి తోసేయడంతో సత్యవతి అనే మహిళ తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతోందన్నారు. కాలుష్యకారక దివీస్ కర్మాగారం తొండంగి మండలంలోని తీర గ్రామాల్లోనే ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏదీ లేదన్నారు. ప్రభుత్వం ఇక ముందు కూడా ఇదేరకంగా వ్యవహరిస్తూపోతే పార్టీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు తామ పార్టీ ముందుంటుందని హెచ్చరించారు. -
హోదా కోసం వీధి పోరాటాలకు సిద్ధం
త్యాజంపూడి (దేవరపల్లి) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వీధి పోరాటాలకు సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. దేవరపల్లి మండలం త్యాజంపూడిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ధ్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, రెండు కళ్ల సిద్ధాంతం వల్ల రాష్ట్రం నాశనమైందన్నారు. మహిళలను దారుణంగా కించపర్చే ఉపమానాలతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలను తమకు చెప్పుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏం సాధించారని ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారని ఆళ్ల నాని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు నూరుశాతం నిధులు సమకూర్చుతామని చెబుతున్న కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. దశలవారీగా నిధులు ఇస్తామని చెబుతున్న కేంద్రం ఎంత ఇస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేస్తే దేవీపట్నం వద్ద రూ. 2,200 కోట్లతో ఎత్తిపోతల పథకం దేనికని ఆయన అన్నారు. నియోజకవర్గం సమన్వయకర్త తలారి వెంకట్రావు, నియోజకవర్గం పరిశీలకుడు పోల్నాటి బాబ్జి, మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందన సాయిబాలపద్మ, జిల్లా ప్రచార కమిటీ ఛైర్మన్ నూకపెయ్యి సుధీర్‌బాబు, మండల రైతు విభాగం అధ్యక్షుడు పల్లి వెంకటరత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా పార్క్ ఏర్పాటుకు సీఎం సుముఖం
నరసాపురం : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి సుముఖంగా ఉన్నారని నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్ పార్కు విషయంలో జరుగుతున్న ఆందోళనలు, లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మధుసూదనరావు, మత్స్యశాఖ ఏడీ పి.రామ్మోహన్రావు, ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఫ్రొఫెసర్ ఎస్.సందీప్‌లను నియమించినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారని చెప్పారు. ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి హానికరమైన వ్యర్థాలు వెలువడవని సబ్‌కలెక్టర్ వివరించారు. అది ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించిందన్నారు. వ్యర్థాలను పైప్లైన్ల ద్వారా సముద్రంలో కలపడానికి యాజమాన్యం అంగీకరించందిన్నారు. రూ.11 కోట్లతో పైప్లైన్లు నిర్మించనున్నారని సబ్ కలెక్టర్ చెప్పారు. ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంట్‌గా అందిస్తుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలకు ఈ విషయాలను చెప్పి ఒప్పిస్తామని తెలిపారు. -
ఉత్తర కొరియా అణు పరీక్ష
-
ఉ.కొరియా అణు పరీక్ష
అణు బాంబును పరీక్షించామని ప్రకటన.. ప్రపంచ దేశాల ఖండన సియోల్: అణు బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా సంచలన ప్రకటన చేసింది. తమ దేశ ఉత్తరప్రాంతజలోని అణు పరీక్షల కేంద్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్)తో శాస్త్రవేత్తలు అణు పేలుడు జరిపారని ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది. దీంతో రాకెట్‌కు చిన్ని అణు వార్‌హెడ్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని సంపాదించుకున్నామని పేర్కొంది. శుక్రవారం పుంగ్యెరి అణు కేంద్రం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఉ.కొరియా ఐదో అణు పరీక్ష అయిన తాజా పరీక్షపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఉ.కొరియా జరిపిన క్షిపణి పరీక్షల్లో ఇదే పెద్దదని, దీనికి 10 కిలోటన్నుల పేలుడు పదార్థాలు వాడారని దక్షిణ కొరియా ఆరోపించింది. ఆ అధినేత కిమ్‌జోంగ్ స్వీయ వినాశనం దిశగా వెళ్తున్నారని వ్యాఖ్యానించింది. ఉ.కొరియా తీవ్ర పర్యవనాసాలను, కొత్తగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. దీనిపై ఆయన దక్షిణ కొరియా అధ్యక్షురాలు గుయెన్ హె, జపాన్ ప్రధాని అబేలతో చర్చించారు. అణు పరీక్ష జరిపింది నిజమే అయితే చాలా ఆందోళనకరమని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ యుకియో అమానో అన్నారు. -
మొద్దుగుట్ట ఎన్‌కౌంటర్‌పై రెండో విచారణ
ములుగు : గత సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన గోవిందరావుపేట మండలం మొద్దుగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో భాగంగా అధికారి ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ బుధవారం రెండో విచారణ జరిపారు. విచారణకు తాడ్వా యి, గోవిందరావుపేట మండలాల తహసీల్దార్లు, రంగాపురం, చల్వాయికి చెందిన నలుగురుని, ఇద్దరు పోలీస్ సిబ్బంది, పస్రాకు చెందిన ఓ నాయకుడు హాజరయ్యారు. విచారణలో వారు ఆర్డీఓకు వాంగ్మూలం ఇచ్చారు. కాగా, ఈ నెల 3వ తేదీన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన శృతి, విద్యాసాగర్ తల్లిదండ్రులు, మానవహక్కులు సంఘాల సభ్యులు విచారణ అధికారి ముందు హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించిన విషయం తెలిసిందే. -
హరీశ్‌రావు ప్రకటన అవాస్తవం
కొనసాగుతున్న ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం కొల్చారం : కొల్చారం మండలం చిన్నఘనపూర్లోని ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ఓ వైపు కొనసాగుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఎత్తు పెంపు పనులు జరగడం లేదని కేవలం మరమ్మతు పనులే చేపడుతున్నామని అసత్య ప్రకటన చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. ఆదివారం ఘనపూర్ ఆనకట్టను సందర్శించిన సీపీఎం సభ్యులతోపాటు ఘనపూర్ ఆనకట్ట నిర్వాసితుల ఆధ్వర్యంలో ఎత్తు పెంపు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతు ఓ వైపు అధికారులు ఘన³Nర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనుల్లో తలమునకలై ఉంటే, మంత్రి అదేం లేదనడం రైతులను తప్పుతోవ పట్టించడమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసుతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
కలకలం సృష్టిస్తున్న ‘అర్డర్లీ’ పనులు
♦ హోంగార్డులు - ఎస్పీ మధ్య వైరం ♦ డీఐజీ ఎదుట వాంగ్మూలాల నమోదు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాలుగో సింహం దారి తప్పింది. వక్రమార్గాల్లో పయనిస్తూ ప్రజల్లో చులకన అవుతోంది. కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు పక్కదారి పట్టడంతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. తాజాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఎస్పీ నవీన్‌కుమార్ తమను ఆర్డర్లీ పనులకు వినియోగించుకుంటున్నారని హోంగార్డుల బహిరంగ ప్రకటన ఒకవైపు.. అడిషనల్ ఎస్పీ వెంకటస్వామితోపాటు మరికొందరు కావాలనే తనను ఇరికించారని ఎస్పీ మరోవైపు రచ్చకెక్కడం జిల్లా పోలీసు విభాగానికి మచ్చ తెచ్చింది. సొంత సేవలకు హోంగార్డులను వాడుకోవడం.. వెట్టి కార్మికుల్లాగా వారిని పరిగణించారనే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ వ్యవహారశైలి వివాదాస్పదమైంది. అయితే, ఫొటోల వెనుక పెద్ద కుట్ర దాగుందని, దీనికి సూత్రదారి అదనపు ఎస్పీ వెంకటస్వామేనని ఎస్పీ నవీన్‌కుమార్ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో గతంలో ఎస్పీ ఆఫీసులో సీసీగా పనిచేసిన మహేశ్ ను అవినీతి అభియోగంతో సస్పెండ్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ క్రమంలో రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలను సీరియస్‌గా పరిగణించిన పోలీసు శాఖ.. ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌ను ఆదేశించింది. దీంతో గత రెండు రోజులుగా హోంగార్డుల వాంగ్మూలం నమోదుచేస్తున్న సబర్వాల్.. ఈ ఘటన పూర్వపరాలను ఆరా తీస్తున్నారు. ఆర్డర్లీ పనులు చేశారని గుర్తించిన 18 మంది హోంగార్డులను విడివిడిగా విచారించి నివేదిక రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలోనూ అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా, జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై డీఐజీకి సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మారని తీరు..! గ్రామీణ ఎస్పీగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన శ్రీనివాస్ కూడా ఆరోపణలు మూటగట్టుకొని అనతి కాలంలోనే బదిలీ అయ్యారు. ఇసుక మాఫియా మొదలు యాలాల ఎస్ఐ రమేశ్ ఆత్మహత్య వ్యవహారం ఆయనకు మెడకు చుట్టుకున్నాయి. దీనికితోడు ఆయన హయంలో జరిగిన ఎస్ఐ బదిలీల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో స్వల్పకాలంలోనే తప్పుకోవాల్సివచ్చింది. ఈ పరిణామాల నుంచి కోలుకోకమునుపే ప్రస్తుత ఎస్పీ నవీన్‌కుమార్ కూడా వివాదాల్లో కూరుకుపోవడం జిల్లా పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఇంద్రకరణ్‌రెడ్డికి వారెంట్
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కేసులో ఫిర్యాదుదారుగా ఉండీ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకాని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి నాంపల్లి సీసీఎస్ కోర్టు సోమవారం వారెంట్ జారీ చేసింది. జూలై 11న ఆయన కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి డ్యానీరూథ్ విచారణను వాయిదా వేశారు. గతంలో వాలీబాల్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా ఇంద్రకరణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన హరినాథ్‌రెడ్డి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. హరినాథ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంద్రకిరణ్‌రెడ్డి సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు చేపట్టిన కోర్టు.. ఇంద్రకరణ్‌రెడ్డికి వాంగ్మూలం ఇవ్వాలంటూ సమన్లు జారీచేసింది. వాటిని సీసీఎస్ అధికారులు ఇంద్రకరణ్‌రెడ్డికి అందించారు. అయినా ఇంద్రకరణ్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
పీఎన్బీ డిఫాల్టర్లు 913..బకాయిలు 11,486 కోట్లు
మాల్యా ఎగవేత రూ.597 కోట్లు న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్.. తాజాగా మరో ఎనిమిది మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లను ప్రకటించింది. ఫిబ్రవరిలో వెల్లడించిన పేర్లతో కలుపుకొని ఈ ఉద్దేశపూర్వకు రుణ ఎగవేతదారుల సంఖ్య 913కు చేరింది. వీరంతా కలసి రూ.11,486 కోట్ల రుణాలను ఎగవేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పేర్కొంది. కింగ్ షిషర్ విజయ్ మాల్యా బకాయిలు రూ.597.44 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఈ జాబితాలో రూ.900 కోట్ల రుణాలతో విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యూయలరీ మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఫరెవర్ ప్రీసియస్ జ్యూయలరీ అండ్ డైమండ్స్(రూ.748 కోట్ల బకాయిలు), జూమ్ డెవలపర్స్(రూ.410 కోట్లు), నాఫెడ్(224 కోట్లు), యాపిల్ ఇండస్ట్రీస్ (రూ.248కోట్లు), ఎంబీఏ జ్యూయలర్స్(రూ.266 కోట్లు), రామ్సరరూప్ గ్రూప్ కంపెనీలు(రూ.411 కోట్లు), ఎస్. కుమార్ నేషన్వైడ్(రూ.147 కోట్లు), రాణా గ్రూప్ కంపెనీస్(రూ.169 కోట్లు)లు ఉన్నాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం లో మొండి బకాయిల కోసం పీఎన్బీ రూ.18,367మ కోట్ల కేటాయింపులు జరిపింది. ఫలితంగా ఈ బ్యాంక్‌కు రూ.3,974 కోట్ల నష్టాలు వచ్చాయి. -
బడిని బతికిద్దాం..
♦ ఈ ఏడాది నుంచే స్కూళ్లలో బయోమెట్రిక్ ♦ 25 శాతం పాఠశాలలకు వర్తింపు ♦ బడిబాటలో ఐదు శాతం విద్యార్థుల నమోదు పెరగాలి ♦ ఆ తర్వాత రేషనలైజేషన్‌పై నిర్ణయం డిప్యూటీ సీఎం ప్రకటన అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ బడు లకు ఊపిరిలూదేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడికి ఎగనామం పెట్టే టీచర్ల భరతం పట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఈ యేడు 25 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి కలెక్టర్లు, డీఈఓలు, ఎంఈఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఈ యేడు బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా పెంచేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చే శారు. - పాపన్నపేట పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యాప్రమాణాలే కాదు విద్యార్థుల సంఖ్యా తగ్గిపోతోందని, ఫలితంగా పాఠశాలలు మూతబడుతున్నాయంటూ ఇటీవల తెలంగాణ పేరెంట్ ఫెడరేషన్ తరఫున సాగర్‌రావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో గత నెల 30న జిల్లాలోని సిద్దిపేట, నంగునూర్ మండలాల్లో మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలను సుప్రీం కోర్టు బృందం సందర్శించిం ది. ఈ సందర్భంగా బాగా పనిచేసే టీచర్లను నియమించి, బడులను మళ్లీ తెరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉపాధ్యాయు లు, విద్యార్థుల హాజరు శాతాన్ని, సమయపాలనను క్రమబద్ధం చేసి, పర్యవేక్షణను మెరుగు పరిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం శ ుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యక్తమైంది. బయోమెట్రిక్‌తో జవాబుదారీతనం... బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, సమయపాలన మెరుగుపడుతుందని నిజామాబాద్, వరంగల్ కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. ఒక్కో యూనిట్‌కు రూ.7,500నుంచి రూ.8వేల వర కు ఖర్చు వస్తుందన్నారు. మొదటివిడతగా 25 శాతం బడుల్లో ఈ యేడు బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తామని కడియం ప్రకటించారు. పీఎస్, యూపీఎస్‌లకు సర్వశిక్ష అభియాన్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ రకంగా జిల్లాలో సుమారు 600 పాఠశాలల్లో బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. 5 శాతం అదనపు నమోదు లక్ష్యం... శుక్రవారం నుంచి ప్రారంభమైన బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా నమోదు చేయాలని డిప్యూటీ సీఎం శ్రీహరి సూచించారు. బడిబాటను మొక్కుబడిగా కాకుండా ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులను, ఎస్ఎంసీలను, స్వచ్ఛంద సంస్థలను, ఎమ్మెల్యేలను, అవసరమై తే మంత్రులను భాగప్వాములను చేయాలని సూచిం చారు. బడిబాట కార్యాచరణను ఖరారు చేసే అధికా రం కలెక్టర్లకు అప్పగించారు. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను, జిల్లా డెవలప్మెంట్ ప్లాన్ ను జిల్లా అధికారులు రూపొందించాలని ఆదేశించారు. బడిబాట తర్వాత రేషనలైజేషన్... పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్ అంశాన్ని మెదక్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రస్తావించగా, బడిబాట తర్వాత విద్యార్థుల నమోదు శాతంపై అవగాహన వస్తుందని, ఆ తర్వాతే రేషనలైజేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని కడియం తెలిపారు. అలాగే ప్రాథమిక స్థాయిలో స్నేహబాల పథకాన్ని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. సకాలంలో వీవీల నియామకం ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు త్వరలో విద్యా వలంటీర్లను నియమిస్తామని కడియం తెలిపారు. ఎక్కడైనా సింగిల్ టీచర్ సెలవుపై వెళ్తే సదరు పాఠశాల మూతబడకుండా వెంటనే వీవీలను అక్కడకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరి నియామకంపై కలెక్టర్లకు అధికారాలిస్తామన్నారు. -
స్టేట్మెంట్తో సగం పని అయినట్లే!
గత వారం రిటర్న్ ఎలా దాఖలు చేయాలో నేర్చుకున్నాం. రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఆదాయ వివరాలకి సంబంధించి స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వారం తెలుసుకుందాం. అసెస్సీకి వచ్చే ఆదాయం ఏ రూపంలో ఉన్నా దానికి సంబంధించిన వివరాలనిస్తూ దానికి సరిపడిన ఐటీఆర్ ఫారంతో రిటర్న్ దాఖలు చేస్తాం. దానికంటే ముందు అసెస్సీ ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ తరువాత రిటర్న్ దాఖలు చేయడం చాలా సులువవుతుంది. స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం: అసెస్సీ తన ఆదాయ వివరాలతో సహా వ్యక్తిగత వివరాలు కూడా పొందుపరచి స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అంటే అసెస్సీ పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, ఫోను నంబరు, ఆధార్ నంబరు, ఇన్‌కంట్యాక్స్ రేంజ్/వార్డ్ నంబరు, పుట్టిన తేదీ, పాన్ నంబరు, ట్యాక్స్ స్టేటస్, రెసిడె న్షియల్ స్టేటస్, ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ సంవత్సరం, అసెస్సీకి సరిపడే ఐటీఆర్ ఫారం నంబరు, ఈ మెయిల్ ఇలాంటి వివరాలతో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం వల్ల అనేక లాభాలుంటాయి. ముందుగా అసెస్సీ ఐటీఆర్ ఫారంలో నింపే వివరాలన్నింటినీ కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫైలింగ్ చేయడం సాధ్యపడుతుంది. అంతేకాకుండా అసెస్సీ ఆదాయానికి సంబంధించి ఎంత మేరకు పన్ను కట్టవలసి వస్తుందో లేక అసెస్సీకి ఏమైనా రిఫండ్ రూపంలో వస్తుందో ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుంది. దాన్ని బట్టి అసెస్సీ పన్ను వివరాలు, ఆదాయ వివరాలు సరి చేసుకునే వీలుంటుంది. అసెస్సీకి ఎన్ని రకాలుగా ఆదాయమున్నా సరే స్టేట్మెంట్లో వివరంగా పొందుపరచుకోవచ్చు. ఫైలింగ్ చేయడానికంటే ముందుగానే వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ వివరాలతో పాటు టీడీ ఎస్ వివరాలు కూడా పొందుపరచుకోవచ్చు. ట్యాక్సేషన్ నిపుణులు - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి - కె.వి.ఎన్. లావణ్య