
నేను ఎలాంటి ప్రకటన చేయలేదు: పూరి
ప్రస్తుతం డ్రగ్స్ కేసు విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దర్శకుడు పూరి జగన్నాథ్ దే. పూరి టీంలో పని చేసిన చాలా మంది ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది నటులు మీడియా ముందుకు వచ్చి తమ వాదన వినిపించారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.
తాజాగా ఈ ఇష్యూకి సంబంధించి పూరి జగన్నాథ్ ఓ ట్వీట్ చేశాడు. 'నేను ఏ విషయానికి సంబంధించి, ఎవరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నా సినిమా పైసావసూల్ ను పూర్తి చేసే పనిలో ఉన్నా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా పైసా వసూల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి. డ్రగ్స్ కేసులో పూరితో పాటు ఆయన సన్నిహితులు రవితేజ, చార్మీ, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు ల పేర్లు కూడా బయటకు వచ్చాయి.
I have not given any statement regarding anything n anyone till now ..
— PURI JAGAN (@purijagan) 15 July 2017
very busy completing my film #PaisaVasool