గత కొన్ని రోజులుగా వాట్సాప్ (WhatsApp)లో యూజర్లకి అంతర్జాతీయ నంబర్‌ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్‌షాట్‌లను పంపడం వంటివి చేస్తే చాలు నగదు, ఇతర బహుమతులు వస్తాయంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు దుండగులు.
ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా?
ఈ అనుమానాస్పద కాల్స్ కు సంబంధించి వాట్సాప్ వివరణ ఇచ్చింది. స్పామ్‌ను ఆపడానికి అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను గుర్తించి చర్య తీసుకోవడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సీఎన్బీసీ టీవీ18 వార్తా సంస్థ ద్వారా తెలియజేసింది. ఫిర్యాదుల స్వీకరణకు భారత్ లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించవచ్చని సూచించింది.
ఇలా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలను యూజర్లు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి రక్షణకు వాట్సాప్ లో అంతర్నిర్మితంగా ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ అండ్ రిపోర్ట్ గోప్యతా నియంత్రణల వంటి భద్రతా సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి “స్టే సేఫ్ విత్ వాట్సాప్” పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది.
వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్‌ల నుంచి అనుమానాస్పద కాల్స్, సందేశాలు ఎక్కువయ్యాయంటూ ట్విటర్ లో పోస్టింగులు హోరెత్తాయి. ఇలా వస్తున్న కాల్స్ లో ఎక్కువ భాగం +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా) +84 (వియత్నాం)తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్‌ల నుంచి వస్తున్నాయి.
వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్‌ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించవద్దని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు కూడా ట్విటర్ ద్వారా వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్‌లో స్కామర్లు తన స్నేహితుడిని మోసగించి రూ. 5 లక్షలు ఎలా కాజేసారో బిలియనీర్, జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలియజేశారు.
ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment