un known
-
స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ యూజర్లకు మరో తీపికబురు అందించారు.మార్క్ జుకర్‌బర్గ్ . ఇటీవలి కాలంలో పలు అప్డేట్స్, కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా వాట్సాప్‌లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్‌ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్‌పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్లకు చెక్ చెప్పేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్కమింగ్ కాల్లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం, స్పామ్, స్కామ్స్ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం . సైలెన్స్ అన్నోన్ కాలర్స్‌తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తులనుంచి అవాంఛిత కాల్‌లను ఆటోమేటిక్‌గా స్క్రీన్ అవుట్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) WhatsApp announced silence unknown callers feature and privacy checkup! The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa — WABetaInfo (@WABetaInfo) June 20, 2023 ఎలా పని చేస్తుంది సెటింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నోన్ నంబర్లనుంచి వచ్చే కాల్స్ ఫోన్లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్‌లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్ విషయంలో వినియోగ దారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చన్నమాట. దీనికి ముందు ప్రైవసీ చెకప్ అనే ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయా? వాట్సాప్ ఏం చెప్పిందంటే..
గత కొన్ని రోజులుగా వాట్సాప్ (WhatsApp)లో యూజర్లకి అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్షాట్లను పంపడం వంటివి చేస్తే చాలు నగదు, ఇతర బహుమతులు వస్తాయంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు దుండగులు. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? ఈ అనుమానాస్పద కాల్స్ కు సంబంధించి వాట్సాప్ వివరణ ఇచ్చింది. స్పామ్‌ను ఆపడానికి అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను గుర్తించి చర్య తీసుకోవడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సీఎన్‌బీసీ టీవీ18 వార్తా సంస్థ ద్వారా తెలియజేసింది. ఫిర్యాదుల స్వీకరణకు భారత్ లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించవచ్చని సూచించింది. ఇలా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలను యూజర్లు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ స్కామ్‌ల నుంచి రక్షణకు వాట్సాప్ లో అంతర్నిర్మితంగా ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ అండ్ రిపోర్ట్ గోప్యతా నియంత్రణల వంటి భద్రతా సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి “స్టే సేఫ్ విత్ వాట్సాప్” పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్, సందేశాలు ఎక్కువయ్యాయంటూ ట్విటర్ లో పోస్టింగులు హోరెత్తాయి. ఇలా వస్తున్న కాల్స్ లో ఎక్కువ భాగం +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా) +84 (వియత్నాం)తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తున్నాయి. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించవద్దని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు కూడా ట్విటర్ ద్వారా వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్‌లో స్కామర్లు తన స్నేహితుడిని మోసగించి రూ. 5 లక్షలు ఎలా కాజేసారో బిలియనీర్, జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలియజేశారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం -
గుర్తు తెలియని వైరస్ సోకడంతో ఇంగ్లాండ్ క్రికెటర్లకు అస్వస్థత
-
తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. బాధితులకు తెలియకుండా వారితోనే కాల్ డైవర్షన్ యాక్టివేట్ చేయిస్తున్నారు. ఆపై వారి వాట్సాప్‌ను తమ అధీనంలోకి తీసుకుని డబ్బు కోరుతూ పలువురికి సందేశాలు పంపుతున్నారు. నగరానికి చెందిన ఓలా గ్రాడ్యుయేట్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు.. నగరానికి చెందిన బాధితురాలికి మంగళవారం 96––––––44 నుంచి ఫోన్ వచ్చింది. జియో సర్వీస్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి సర్వీస్‌లో ఇబ్బందిపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేశారా? అని అడిగాడు. తాను అలాంటి ఫిర్యాదులేమీ చేయలేదని బాధితురాలు చెప్పింది. తమ రికార్డుల్లో ఫిర్యాదు నమోదై ఉందని చెప్పిన కేటుగాడు అది క్లోజ్ కావాలంటే తాను చెప్పినట్లు చేయాలన్నాడు. ]401] తర్వాత 709–––––57 నంబర్ జోడించి రింగ్ చేయాలని చెప్పాడు. అతడి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలానే చేశారు. దీంతో నేరుగా ప్రమేయం లేకుండా తెలియకుండానే ఆమె ఫోన్లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయింది. ఆమెకు రావాల్సిన కాల్స్ అన్నీ కేటుగాడు సూచించిన 709–––––57 నంబర్‌కు వెళ్తున్నాయి. అంతటితో ఆగని అతగాడు ఆమె వాట్సాప్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ యాప్ యాక్టివేట్ కావాలంటే అందులో వినియోగదారుడి ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఆపై దానికి ఎస్సెమ్మెస్ లేదా కాల్ రూపంలో వచ్చే ఆరు అంకెల యాక్టివేషన్ కోడ్ పొందుపరచాలి. చదవండి: రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే కేటుగాడు తన ఫోన్లోని వాట్సాప్‌లో బాధితురాలి నంబర్ పొందుపరిచి, కాల్ రూపంలో యాక్టివేషన్ కోడ్ వచ్చే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో బాధితురాలి ఫోన్‌కు రావాల్సిన ఈ కాల్ డైవర్షన్ కారణంగా కేటుగాడు పొందుపరిచిన 709–––––57 నంబర్‌కు వచ్చింది. దీని ద్వారా ఆ యాప్ యాక్టివేట్ చేసుకోవడంతో బాధితురాలి వాట్సాప్ అతడి అధీనంలోకి వెళ్లిపోయింది. ఆపై అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాడు ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న అందరికీ సందేశాలు పంపాడు. అత్యవసరంగా రూ.10 వేలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బదిలీ చేయాలని వాటిలో సూచించాడు. ఆ మొత్తాన్ని 709–––––57 నంబర్‌కు పంపాలని కోరాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ నమ్మవద్దు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దు. సరిచూసుకోకుండా ఆ ఫోన్లు చేసిన వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వ్యక్తిగత డేటాను కోల్పోవాల్సి వస్తుంది. ]401]తో ఏ నంబర్ కలిపి డయల్ చేస్తామో ఆ నంబర్‌కు కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని గమనించిన వాళ్లు డీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్లోని కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఈ–బైక్స్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో నగరవాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు డీలర్షిప్ అంటూ ఎర వేశారు. అతడు సరి చూసుకోకుండా నమ్మేయడంతో రూ.12 లక్షలు కాజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ వలలో పడకుండా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ -
అజ్ఞాత విరాళాలతో రూ. 3,370 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ పార్టీలన్నీ కలిసి 2019–20 కాలంలో రూ. 3,377.41కోట్లను గుర్తుతెలియని వనరుల(అన్నౌన్ సోర్సెస్) నుంచి సమీకరించాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫా మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. పార్టీల మొత్తం ఆర్జనలో ఈ అజ్ఞాత విరాళాల ద్వారా ఆర్జించిన మొత్తం 70.98 శాతానికి అంటే ముప్పావు వంతుకు సమానమని తెలిపింది. ఈ నిధుల్లో సింహభాగం అంటే రూ. 2,642. 63కోట్లు బీజేపీ సమీకరించగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్(రూ.526కోట్లు), ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, బీఎస్పీ ఉన్నాయని తెలిపింది. మొత్తం సొమ్ములో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ద్వారా రూ. 2,993.82 కోట్లు లభించాయని ఏడీఆర్ వెల్లడించింది. 2004–05 నుంచి 2019–20 మధ్య కాలంలో ఈ అంతుచిక్కని మార్గాల్లో పార్టీలు సమీకరించిన మొత్తం రూ. 14,651. 53కోట్లని వివరించింది. 2019–20 కాలంలో పార్టీలు సేకరించిన నగదు రూపంలో సేకరించిన మొత్తం రూ.3.18లక్షలు మాత్రమే కావడం గమనార్హం. రూ.20వేలకు పైబడిన విరాళాలకు పార్టీలు రసీదులు జారీ చేయాల్సిఉంటుంది. అయితే రూ.20వేల లోపు ఇచ్చే విరాళాల దాతల వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇలా రూ. 20వేల లోపు విరాళాన్ని ఇచ్చే వర్గాలను అజ్ఞాత వర్గాలంటారు. వీటిని ఐటీ పత్రాల్లో అన్నౌన్ సోర్సుగా పేర్కొంటారు. ఈ నిధులు ఇచ్చిన సంస్థలు, వ్యక్తుల వివరాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల విక్రయాలు, రిలీఫ్ పండ్ లాంటివన్నీ ఈ అజ్ఞాత మార్గాల కిందకు వస్తాయి. -
సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సీరియల్ కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడున్నరేళ్లుగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్‌లో నెంబర్1 స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ వస్తుందంటే అన్ని పనులు పక్కనపెట్టి మరీ సీరియల్‌ను చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. మలయాళంలో వచ్చిన ‘కరుతముత్తు' అనే సీరియల్ రీమేకే కార్తీకదీపం. ఈ ఒక్క సీరియల్‌తో కేరళలో బాగా పాపులర్ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్. దీంతో రీమేక్‌లోనూ ఆమెనే తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1991 డిసెంబర్2న కేరళలలో జన్మించిన ప్రేమీ విశ్వనాథ్ తండ్రి పేరు విశ్వనాథ్ కాగా, తల్లి కాంచన. లా చదివిన ప్రేమీ విశ్వనాథ్ ఓ ప్రైవేటు సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది. ఇక సీరియల్స్‌లో నటించేకంటే ముందే మోడల్‌గానూ రాణించిందని సమాచారం. అంతేకాకుండా సొలోమన్ 3డీ అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈమె అన్నయ్య శివప్రసాద్ ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్ కూడా సోదరుడి లాగే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పనిచేసిందట. ఇక ప్రేమీ విశ్వనాథ్ భర్త డా.వినీత్ భట్ ఆయన ఆస్ర్టాలజీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు సైతం గెలుచుకున్నారు. ఈయన వద్దకు పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన వాళ్లు వస్తుంటారట. వినీత్ భట్ సూచనలతో తమ పేర్లలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రేమీ విశ్వనాథ్-వినీత్ భట్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కార్తీకదీపంతో బాగా పాపులర్ అయిన వంటలక్కకు తెలుగులో పలు సినీ అవకాశాలు వస్తున్నాయట. కానీ ఇప్పటివరకు ఆమె ఒక్క ప్రాజెక్టుకు కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు (టౌన్): కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని కాలిన రోగుల వార్డు పక్కన ఉన్న విశ్రాంతి భవనం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతునికి సంబంధించిన వివరాలను మూడో పట్టణ సీఐ మధుసూధన్‌రావు ఆదివారం విలేకరులకు వివరించారు. సుమారు 55 సంవత్సరాల వయస్సు, 5.2 అడుగుల ఎత్తు కలిగి నలుపు రంగులో ఉన్నట్లు తెలిపారు. మాసిన గడ్డం, నలుపు రంగులో తల వెంట్రుకలు, నస్యం రంగు హాఫ్ షర్టు, నీలం, గులాబి రంగు కలిగిన పలుచని దుప్పటి, బూడిద రంగు జీన్స్ ప్యాంటు వేసుకున్నట్లు తెలిపారు. కుడిపక్క కడుపు వద్ద నల్లటి పుట్టు మచ్చ, మెడ కింద పుట్టు మచ్చ ఉందని తెలిపారు. చాలా రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేక విశ్రాంతి భవనంలో ఉన్నాడని ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల మద్య చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్నారు. ఆచూకీ తెలిసిన వారు సిఐ 94406–27735 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.