వాట్సాప్ యూజర్లకు మరో తీపికబురు అందించారు.మార్క్ జుకర్‌బర్గ్ . ఇటీవలి కాలంలో పలు అప్‌డేట్స్, కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా వాట్సాప్‌లో సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్‌ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్‌పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్లకు చెక్ చెప్పేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?)
మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్‌కమింగ్ కాల్‌లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం, స్పామ్, స్కామ్స్ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం . సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్‌తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తులనుంచి అవాంఛిత కాల్‌లను ఆటోమేటిక్‌గా స్క్రీన్ అవుట్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం)
WhatsApp announced silence unknown callers feature and privacy checkup!
— WABetaInfo (@WABetaInfo) June 20, 2023
The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa
ఎలా పని చేస్తుంది
సెటింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్‌నోన్ నంబర్లనుంచి వచ్చే కాల్స్ ఫోన్‌లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్‌లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్ విషయంలో వినియోగ దారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చన్నమాట. దీనికి ముందు ప్రైవసీ చెకప్ అనే ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment