ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'.. వివిధ డిజైన్లతో కొత్త చాట్ థీమ్‌లను పొందనుంది. యూజర్ల కోసం సంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేయడంలో భాగంగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
వాటప్స్ పరిచయం చేస్తున్న 'థీమ్ చాట్' అనే ఫీచర్ సాయంతో యూజర్లు చాటింగ్‌కు నచ్చిన థీమ్‌లను ఎంచుకోవచ్చు. థీమ్ మాత్రమే కాకుండా చాట్ పేజీని కూడా నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలుస్తోంది. చాట్ బబుల్స్, వాల్‌పేపర్‌ల రంగులు ఎంచుకున్న థీమ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment