Theme
-
World Food Day 2024 : ఆహార భద్రత ఏదీ?
1945లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) స్థాపన తేదీని గుర్తుచేసుకోవడానికి అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకొంటున్నాం. ఆకలి, ఆహార భద్రతకు సంబంధించిన ఇతర సంస్థలు... ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి వంటివి ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి.ఆకలిని ఎదుర్కోవడానికి, సంఘర్షణ ప్రాంతాలలోశాంతికి దోహదపడటానికి, యుద్ధం సంఘర్షణలకు ఆకలిని ఉపయోగించడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ‘ప్రపంచ ఆహార దినోత్సవం 2024’ యొక్క సారాంశం ‘మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు’. 2022 నివేదిక ప్రకారం ఆహార భద్రత కలిగిన మొదటి ఐదు దేశాలు ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లు. అత్యంత ఆహార అభద్రత ఉన్న దేశాలు యెమెన్, హైతీ, సిరియాలు. భారతదేశంలో ఆహార భద్రత ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. 2022లో, ప్రపంచ ఆహార భద్రతా సూచిక పరంగా 113 ప్రధాన దేశాలలో భారత దేశానికి 68వ స్థానాన్ని ఇచ్చింది. 2024లో, ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ –2024) ప్రకారం 127 దేశాలలో భారతదేశం 27.3 స్కోరుతో 105వస్థానంలో ఉంది. దేశంలో 27 కోట్ల మందిఆకలితో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ జనాభాలో అధిక భాగం వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న జనాభా కారణంగా అందరికీ ఆహారం లభించడం సవాలుగా ఉంది. కరవు, వరదల అస్థిర చక్రాలను దేశం అనుభవిస్తున్నందున, వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం ఆహార భద్రత ముప్పులో ఉంది. దేశంలో సగటు కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం మాత్రమే నమోదవుతున్నప్పటికీ, అవపాతం హెచ్చుతగ్గులు వివిధ ప్రాంతా లలో తీవ్రంగా మారుతూ పంటలను అస్థిరపరుస్తున్నాయి. ఆహార భద్రతను మెరుగుపరచడానికి... ఆహారాన్ని వృధా చేయడాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం, వైవిధ్యంపై శ్రద్ధ చూపడం, దిగుబడి అంతరాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆహార అభద్రతకు పరోక్ష కారణాలను పరిష్కరించడం వంటి మార్గాలు అవసరం.– డా. పి.ఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, తిరుపతి -
ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?
కోల్‌కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్‌తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్‌గా 'కోల్‌కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. कोलकाता में मेट्रो की तर्ज पर बना मां दुर्गा का पंडाल 👏❤️ pic.twitter.com/YFYb3D2xAF— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 8, 2024ఇది కూడా చదవండి: బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు -
World Teachers Day : టీచర్ల హక్కుల సాధనకు గుర్తుగా..
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమైన సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యా రంగంలో వారి సేవలను అభినందించడం కోసం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.ఉపాధ్యాయులు వృత్తిపరమైన ఉద్యోగం మాత్రమే చేయరని, వారు చిన్నారులను చక్కని భావిపౌరులుగా తీర్చిదిద్దుతారని ఈరోజు గుర్తుచేస్తుంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 1994లో ప్రారంభమైంది. ఉపాధ్యాయ విద్య- వారి కార్యాలయంలో ప్రమాణాలపై రూపొందించిన సిఫార్సులను యునెస్కోతో పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ఆమోదించినందుకు గుర్తుగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల హక్కులు, వారి పని పరిస్థితులు, వారి వృత్తిపరమైన బాధ్యతలను ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం గుర్తు చేస్తుంది.ప్రతి సంవత్సరం యునెస్కోతో పాటు విద్యా రంగానికి సంబంధించిన సంస్థలు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కోసం ఒక ప్రత్యేక థీమ్‌ను ఎంచుకుంటాయి. 2024 థీమ్ ‘ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం: విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం’. ఉపాధ్యాయుల సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక థీమ్‌ను ఎంచుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, విద్యా నాణ్యత మెరుగుదల, నూతన విద్యా విధానాలపై చర్చిస్తారు. ఇది కూడా చదవండి: ఇంటి భోజనం.. భారం! -
ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్లను తీసుకెళ్లరాదు.పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్బిన్లలో వేయాలి. పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.నేచర్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్‌రికార్డర్, డీజే, మైక్‌లు పెద్ద సౌండ్‌తో పెట్టకూడదు. మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం. స్థానికులకు చాక్లెట్లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు. -
నచ్చినట్లు చాట్‌పేజ్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'.. వివిధ డిజైన్లతో కొత్త చాట్ థీమ్‌లను పొందనుంది. యూజర్ల కోసం సంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేయడంలో భాగంగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.వాటప్స్ పరిచయం చేస్తున్న 'థీమ్ చాట్' అనే ఫీచర్ సాయంతో యూజర్లు చాటింగ్‌కు నచ్చిన థీమ్‌లను ఎంచుకోవచ్చు. థీమ్ మాత్రమే కాకుండా చాట్ పేజీని కూడా నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలుస్తోంది. చాట్ బబుల్స్, వాల్పేపర్ల రంగులు ఎంచుకున్న థీమ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
కన్నుకొట్టిన అనసూయ.. భర్తతో కలిసి పార్టీలో అలా.. (ఫొటొలు)
-
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ బ్యూటీ ఫ్యాషన్ టాలెంట్ అదుర్స్ (ఫోటోలు)
-
World thyroid day 2024 : థైరాయిడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
#World thyroid day 2024: మే 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ వ్యాధి, ఆరోగ్యం చూపే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: థీమ్నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు), థైరాయిడ్ సమస్యలు ప్రపంచ ఆరోగ్య ఆందోళనలో గణనీయమై పాత్ర పోషిస్తున్నాయనే వాస్తవాన్ని తెలియ జేయడం.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: చరిత్ర1965లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ స్థాపన, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మొదలైంది. ఆ తరువాత థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (TFI) 2007లో మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా ప్రకటించింది.థైరాయిడ్ వ్యాధిమెడ దిగువన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథి పేరే థైరాయిడ్. ఇది ముఖ్యమైన రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3). ఈ రెండు హార్మోన్లు హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్ తిసమస్య సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.ఆ గ్రంథి ఈ హార్మోన్లను తగినంతగా లేదా అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ రుగ్మతలు తలెత్తుతాయి. హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజం అని, అధికమైతే హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.హైపోథైరాయిడిజం: అలసట, బరువు పెరగడం , నిరాశ వంటి లక్షణాలుంటాయి.హైపర్ థైరాయిడిజం: బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు.థైరాయిడ్ కేన్సర్: థైరాయిడ్ గ్రంధిలో ప్రాణాంతక పెరుగుదల కేన్సర్‌కు దారతీయవచ్చు.గోయిటర్: తరచుగా మెడలో వాపుగా కనిపిస్తుంది, హైపో- లేదా హైపర్ థైరాయిడిజంలోనే ఇది కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటేచక్కటి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అసవరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందేలా చూసుకోవాలి.వ్యాయామం చాలా అవసరం. ఎలాంటి వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం ముఖ్యం. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్,యోగా ఇలా ఏదో ఒక వ్యాయామాన్ని కనీసం అరగంటలు పాటు చేయాలి. తద్వారా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటినీ అదుపులో ఉంచుకోవచ్చుథైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మద్దతిచ్చే ఆహారంపై శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా సెలీనియం కీలకమైంది.బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్,గుడ్లు, తృణధాన్యాలలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి, రోజులకు కనీసం ఎనిమిది గంటల కూడా చాలా అససరం. ఒక్కసారి థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వైద్య సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎలాంటి అపోహలను, అవాస్తవాలను నమ్మకుండా నిపుణుల సలహాలను పాటించాలి. -
నేషనల్ సేఫ్ మదర్‌హుడ్ డే 2024 : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు. మహిళ ఒక బిడ్డకు జన్మనివ్వడంలో సమాజ బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఏర్పరచుకున్న ఒక రోజు. అన్నీ సవ్యంగా జరిగితే నిజంగా అదొక అద్భుతం. మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు. కానీ మన దేశంలో ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు ఇంకా చాలామందే ఉన్నారు. గర్భధారణ సమయంలో, ఆ తర్వాత కూడా పోషకాహార లోపంతో మహిళలు బాధపడుతున్నారు. ఫలితంగా ముందస్తు ప్రసవాలు, శిశువుల్లో శారీరక లోపాలు లాంటి సమస్యలు తలెత్తు తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల, ఆరోగ్యవంతమైన శిశవులు జననంపై అవగాహన కల్పించేందుకే ఈ జాతీయ మాతృత్వ దినోత్సవం. తద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడంలో పురోగతి సాధించగలం. 2024 థీమ్: ఈ సంవత్సరం ప్రినేటల్ కేర్ (గర్భంధ రించిన తర్వాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు) స్కిల్డ్ బర్త్ అటెండెంట్లు, ప్రసవానంతర సహాయాన్ని మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది. పోషకాహారం, రెగ్యులర్ చెకప్‌లు , గర్భిణీ స్త్రీలకు అవసరమైన సమాచారాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని , ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు! -
మోదీ వాటర్ గన్లపై కాంగ్రెస్ ఆగ్రహం
హోలీ వేడుకలకు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లు కనిపిస్తున్నాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ వాటర్ గన్ల వినియోగంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, కమలం గుర్తు కలిగిన వాటర్ గన్లు విరివిగా విక్రయమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ బీజేపీ వైఖరిపై పలు విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే బ్రాండింగ్‌పై బీజేపీ దృష్టి పెట్టిందని ఆరోపించారు. మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్స్, ఇతర హోలీ సామగ్రి తయారీకి అయ్యే ఖర్చును మోదీ ప్రభుత్వం భరిస్తున్నట్లుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లను వినియోగించరని స్పష్టం చేశారు. -
పది వేల ఏళ్లనుంచి కాపాడుతోంది..మరి మనం ఏం చేస్తున్నాం..?
ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు. పొద్దున్నే మన కిటికీ దగ్గరో, పెరడులోని చెట్టుపైనో పిచ్చుక కిచకిచలు వింటూ ఆనందంగా కళ్లు తెరిచిన క్షణాలు గుర్తున్నాయా? ఆ మధుర స్వరాలు గుర్తున్నాయా అని అనుకోవడంలోనే నానాటికి కనుమరుగైపోతున్న పిచ్చుకల పరిస్థితి అర్థం అవుతుంది. అందుకే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, పిచ్చుకల పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం. వరల్డ్ స్పారో డేని 2010లో నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ప్రతీ ఏడాది ఏదో ఒక ధీమ్ ఉంటుంది. "ఐ లవ్ స్పారోస్" ఇదే. ప్రపంచ పిచ్చుక దినోత్సవం 2024 అధికారిక థీమ్. ఇది పిచ్చుకలు, మనుషుల మధ్య ప్రేమను, పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల బాధ్యతను గుర్తు చేస్తుంది. పిచ్చుకలను రక్షించడం అంటే మనల్ని మనల్ని కాపాడుకోవడమే. హాయి గొలిపే, ఉత్సాహపరిచే పిచ్చుకల కిలకిలారావాలు రాబోయే తరాలకు అందించిన వారమవుతాం. పదివేల సంవత్సరాలుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషించిన చిన్ని జీవి పిచ్చుక. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇవి కనిపించడం లేదు.నగరీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికివేయడం, ఎక్కడబడితే అక్కడ సెల్ టవర్ల నిర్మాణం తదితర కారణాలు పిచ్చుకల పాలిట పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. పిచ్చుకలు-వాస్తవాలు ప్రపంచవ్యాప్తంగా 60 రకాల పిచ్చుక జాతులు ఉన్నాయి. పిచ్చుకలు స్వతహాగా స్వతంత్రంగా ఉంటాయి. సొంతంగా అందమైన గూళ్ళను నిర్మించుకుంటాయి. పిచ్చుకల సగటు వయస్సు 4 నుండి 5 సంవత్సరాలు, పిచ్చుకలు చూడ్డానికి బుల్లిపిట్లలే కానీ, పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బుజ్జి బుజ్జి ముక్కులతో తెగులు కీటకాలను ఏరిపారేసి (తినేసి), మొక్కల్ని తెగుళ్లు, చీడపీడలనుంచి కాపాడతాయి. మొక్కల పెరుగుదలకు సహాయపడే విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) నివేదిక ప్రకారం, భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో వీటి సంఖ్య దాదాపు 80 శాతం తగ్గింది. తీర ప్రాంతాల్లో 70 నుంచి 80 వరకు తగ్గగా, ఇతర ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల కనిపించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) పిచ్చుకను అంతరించిపోతున్న జాతిగా (రెడ్ లిస్ట్) పేర్కొంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో 99 శాతం వరకు వీటి సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. అందుకే బాల్కనీల్లో, ఇంటి పెరడులో వాటి కోసం కాసిన్ని నీళ్లు పెడదాం. బర్డ్ ఫీడర్‌ను ఉంచి వాటిల్లో కొన్ని బియ్యం గింజలు, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇతర తృణధాన్యాల్ని వాటికి ఆహారంగా అందిద్దాం.హే పిచ్చుక..గూడు కట్టుకో అని ఆహ్వానిద్దాం! -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?
International Women’s Day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత,సామాజిక మార్పుపై అవగాహన తోపాటు వీటి సాధనకోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు,పలు సామాజిక సంస్థలు వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి, వారిని గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటా, బైటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దోపిడీ లాంటి అనేక ఇతర సమస్యలు చర్చకు వస్తాయి. 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి? లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించడంలోని ఉద్దేశం. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 ఏడాదికి సంబంధించి ‘ ఇన్స్పైర్ ఇన్‌క్లూజన్’ అని ధీమ్‌తో ఇంటర్నేషనల్ విమెన్స్ డేని నిర్వహిస్తున్నారు. మార్చి 8నే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు? 1908లో న్యూయార్క్ నగర వీధ్లుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి8న అంతర్జతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15 వేల మంది మహిళలు మహిళాహక్కుల ఉద్యమ నేత క్లారా జెట్కిన్ నేతృత్వంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మహిళలు ఓటు వేయాలనే డిమాండ్‌ను కూడా ఇందులో చేర్చారు. కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా ఈ నిరసన సాగింది. ఆ మహిళల జ్ఞాపకార్థం 1909 ఫిబ్రవరి 28న అమెరిఆలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. 1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో, రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. దీంతో రష్యా 'చక్రవర్తి నికోలస్' తన పదవికి రాజీనామా చేశాడు. మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఈనేపథ్యంలోనే యూరోప్ మహిళలు మార్చి 8న శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితానే 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'గా ప్రకటించింది. -
హైదరాబాద్ శరత్ సిటీ మాల్ లో అత్యాధునిక థీమ్ తో A19 క్లబ్, కిచెన్ ప్రారంభం (ఫొటోలు)
-
రిపబ్లిక్ డే 2024: ఈసారి థీమ్ ఏంటంటే..
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి. భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్‌వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. -
రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవ తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తన వెంట రామ మందిర ప్రతిరూపాన్ని తీసుకెళ్లారు. తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి రామ మందిరం నేపథ్యంతో వజ్రాల హారాన్ని తయారు చేయించారు. ఈ వజ్రాల హారంలో ఐదు వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించామని సదరు వ్యాపారి తెలిపారు. హారం తయారీలో రెండు కిలోల వెండిని వినియోగించామన్నారు. అలాగే 40 మంది కళాకారులు ఈ డిజైన్‌ను 35 రోజుల్లో పూర్తి చేశారన్నారు. దీనిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనం కోసం తయారు చేయలేదని, అయోధ్యలోని రామాలయానికి కానుకగా అందజేస్తామని తెలిపారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రపంచంలోని కోట్లాది మంది రామభక్తులు ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటాయన్నారు. సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్‌ఇ, సివిల్ పోలీసులు నిత్యం పహారా కాస్తారన్నారు. కొత్త భద్రతా ప్రణాళికల ప్రకారం ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తామని అన్నారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నదీతీరం గుండా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేడుకల సందర్భంగా 37 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: ఏఐతో మరో కొత్త ఆందోళన! -
నేల, నీరే జీవనాధారం!
వాతావరణ మార్పు వల్ల కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు విరుచుకుపడుతున్న నేపథ్యం ఇది. పంటల సాగు, పశుపోషణ, ఆక్వా సాగులో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్న కలికాలం. మనతో పాటు సకల జీవరాశి మనుగడకు నేల, నీరే మూలాధారాలు. నేలను, నీటిని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటూనే సేద్యాన్ని కొనసాగించేలా ఐక్యరాజ్యసమితికి చెందిన వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రజలు, రైతులను చైతన్యవంతం చేస్తూ పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. రసాయనాల్లేకుండా, లోతుగా దుక్కి దున్నకుండా, ఒకటికి నాలుగు పంటలు కలిపి వేసుకోవటం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించటం ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవటం సాధ్యమవుతుందని సమాజంలో ప్రతి ఒక్కరం గుర్తించాల్సిన తరుణం ఇది. మానవాళికి 95% ఆహారాన్ని అందిస్తున్న నేలలను పరిరక్షించుకోవాలన్న స్ఫూర్తిని కలిగించడానికి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల లేదా భూముల దినోత్సవాన్ని ఎఫ్.ఎ.ఓ. నిర్వహిస్తోంది. ఈ ఏడాది నినాదం: ‘నేల, నీరే జీవరాశి అంతటికీ జీవనాధారం’! ఎఫ్.ఎ.ఓ. ఇంకా ఏం చెబుతోందో చదవండి.. ఈ నెల 8,10 తేదీల్లో విశాఖ ఆర్గానిక్ మేళా గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 8,9,10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 8న ఉ. 10 గంటలకు రైతుల సమ్మేళనం, 9న గ్రాడ్యుయేట్ రైతుల సదస్సు, 10న ఇంటిపంటలపై సదస్సు, 11న సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారుల చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. 78934 56163, 86862 24466. 11న ప్రకృతి సేద్య కార్యకర్తల సమావేశం ప్రముఖ ప్రకృతి సేద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ డిసెంబర్ 11న ఉ.10 నుంచి. మ.1 గం. వరకు హైదరాబాద్ దోమల్‌గూడలోని రామచంద్రమిషన్‌లో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేసే కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ముచ్చటిస్తారు. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని స్వతంత్ర ఉద్యమంగా గ్రామస్థాయిలో రైతుల్లో విస్తరింపజేయటంపై చర్చిస్తారు. వివరాలకు.. సేవ్ స్వచ్ఛంద సంస్థ: 63091 11427. 14 నుంచి పల్లెసృజన శోధాయాత్ర ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు ముఖ్యంగా రైతులు, వృత్తిదారులు, కళాకారుల విజ్ఞానాన్ని తెలుసుకోవటం.. అజ్ఞాతంగా మిగిలిపోయిన గ్రామీణ ఆవిష్కరణలను వెలికితేవటమే లక్ష్యంగా పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ శోధాయాత్రలు నిర్వహిస్తోంది. 47వ చిన్న శోధాయాత్ర అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వెంకట రాజంపేట వరకు డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరుగుతుంది. వలంటీర్లు కాలినడకన పయనిస్తూ ప్రజలతో ముచ్చటిస్తారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రలో పాల్గొనవచ్చు. వివరాలకు.. బ్రిగేడియర్ పి.గణేశం – 98660 01678, 99666 46276, 99859 19342. 9, 10 తేదీల్లో సుందర రామన్ శిక్షణ తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎస్.ఆర్. సుందర రామన్ డిసెంబర్ 9,10 తేదీల్లో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కామ్యవనంలో రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. రసాయనాలతో సాగుచేస్తున్న భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మార్చాలి? నేలలో సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి? ఉద్యాన పంటలకు పిచికారీ లేకుండా సమగ్ర పోషకాలు ఎలా అందించాలి? వంటి అనేక ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ముందస్తు రిజిస్ట్రేషన్ల వివరాలకు.. 94495 96039, 99490 94730. 15న పాలేకర్ ఫైవ్ లేయర్ క్షేత్ర సందర్శన వికారాబాద్ జిల్లా థారూరు మండలం బూరుగడ్డ గ్రామంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో అభివృద్ధి చేసిన ఐదు అంతస్థుల ఉద్యాన పంటల నమూనా క్షేత్రాన్ని డిసెంబర్ 15 (శుక్రవారం)న ఉ. 10.–సా.5 వరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ సందర్శిస్తారు. ప్రతి అంశం వెనుక గల శాస్త్రీయతను పాలేకర్ వివరిస్తారు. 4 రాష్ట్రాల రైతులు పాల్గొంటున్నారు. ప్రసంగం తెలుగు అనువాదం ఉంటుందని విజయరామ్ తెలిపారు. 3 కి.మీ. నడవగలిగిన వారే రావాలి. భోజన ఏర్పాట్లు ఉన్నాయి. నేరుగా వచ్చే వారికి ప్రవేశ రుసుం రూ. 100. హైదరాబాద్ రామకృష్ణమిషన్ దగ్గర గల సేవ్ కార్యాలయం నుంచి బస్సులో వెళ్లే వారికి రూ. 500. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివరాలకు.. 63091 11427. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
వచ్చే ఏడాది సైబర్ వార్.. కోకో టీజర్ చూశారా?
సైబర్ వార్ నేపథ్యంలో రూపొందనున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘కోకో’. జై కుమార్ దర్శకత్వంలో సందీప్ రెడ్డి వాసా నిర్మించనున్నారు. జూన్ మూడోవారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా థీమ్, బ్యాక్‌డ్రాప్‌ను వివరించే గ్లింప్స్ వీడియోను దర్శకుడు సుకుమార్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారత రక్షణ వ్యవస్థకు హాని కలగకుండా ఉండేందుకు రామానుజన్ అనే వ్యక్తి ‘ఆర్ఎఎమ్– ఐఎస్‌యూ’ (వేగం, ఖచ్చితత్వం, శక్తి) కోడ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేషన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను కనుగొంటాడు. తండ్రి రామానుజన్ ఆశయాలు ఆచరణలోకి వచ్చేందుకు, తన కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ నిక్కీ ‘కోకో’ అనే పేరుతో సెల్ఫ్ మేడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తుంది. ‘కోకో’ భౌతికంగా కనిపించదు. మరోవైపు భారతదేశంపై సైబర్ వార్ చేయాలని ఓ చైనీస్ హ్యాకర్ ప్లాన్ చేస్తుంటాడు. పాక్, చైనా మద్దతు ఉన్న హ్యాకర్ల సమూహం భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ ముప్పును విస్తరించడంతో సంఘర్షణ ప్రారంభమవుతుంది. అప్పుడేం జరిగింది? అన్నదే ‘కోకో’ చిత్ర కథాంశంగా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషలతో పాటు తైవాన్, వియత్నాం భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
World AIDS Day 2022: ఒక్క ‘షాట్’తో ఎయిడ్స్‌కు దూరం
ఎయిడ్స్‌పై మానవుని పోరాటం చివరి దశకు చేరింది. అందువల్ల ఎయిడ్స్ రోగులు ధైర్యంగా ఉండవచ్చు. 2020లో జరిగిన అధ్యయనాల ప్రకారం హెచ్ఐవీ రోగుల్లో 40 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. నిజానికి ఎయిడ్స్ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చని రోగులు గుర్తించాలి. ఎయిడ్స్‌పై అవగాహన పెంచడానికి 1988 నుంచీ ప్రతీ ఏడాదీ డిసెంబర్ 1వ తేదీని ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’గా పాటిస్తున్నాము. ఈ ఏడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ‘సంఘీభావంతో – ఎయిడ్స్ నివారణ బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలి’ అనే నినాదాన్ని ఇచ్చాయి. జీవితాంతం మాత్రలు వాడటానికి 70 శాతం రోగులు ఇష్టపడటం లేదు. అందుకే మధ్యలో మందులు ఆపేయడం, అస్తవ్యస్థంగా మందులు వాడడం ద్వారా అర్థాంతరంగా హార్ట్ ఎటాక్ లేదా పక్షవాతం, టీబీ, కేన్సర్లు, అంధత్వం, మెనింజైటీస్, ఇతర అవకాశవాద సంక్రమణ వ్యాధులకు గురవుతూ నిర్వీర్యమై పోతున్నారు. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణవాంగ్మూలం అనేవారు. అయితే నాలుగు దశాబ్దాల్లో శాస్త్రవేత్తలు ఈ వ్యాధిపై విజయం సాధించి చికిత్సను అందుబాటులోకి తెస్తున్నారు. అత్యంతాధునికమైన ‘బ్రాడ్లీ నూట్రలైజింగ్ ఏంటీ బాడీస్’ (బీఎన్ఏబీఎస్) చికిత్స త్వరలో అందుబాటులోకి వస్తుంది. మూడు లేక నాలుగు బీఎన్ఏబీఎస్ల ను కలిపి రోగి శరీరంలోకి పంపిస్తే అవి అన్ని రకాల హెచ్ఐవీ స్ట్రెయిన్స్నీ పూర్తిగా నిర్మూలిస్తాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘నేచర్’ ధ్రువీకరించింది. ‘న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్’లో తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాల ప్రకారం ఓకాబ్రియా ఇంజక్షన్ సంవత్సరానికి ఒకటి లేదా రెండు పర్యాయాలిస్తే హెచ్ఐవీ సమూలంగా నాశన మవుతుందని తేలింది. హెచ్ఐవీని పూర్తిగా నయం చేయడానికి (సీఆర్ఐపీఆర్) ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్’ అని పిలువబడే జీన్ ఎడిటింగ్ విధానానికి అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఏంటీబాడీస్ ఇంజక్షన్లను వాడటం, కిక్ అండ్ కిల్ లాంటి అత్యాధునిక వైద్య విధానాన్ని అనుసరించడం వంటివాటి ద్వారా ఈ రోజో రేపో ఎయిడ్స్‌పై పూర్తి విజయాన్ని మన వైద్యులు ప్రకటించనున్నారు. (క్లిక్: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి) - డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ప్రముఖ వైద్యనిపుణులు, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు (డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం) -
వరల్డ్ స్ట్రోక్ డే 2022: ఈ రెండూ తెలిస్తే చాలు! గండం గడిచినట్టే!
ప్రతీ ఏడాది అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. పక్షవాతానికి కారణాలు, నివారణపై అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును పాటిస్తారు. ఈ వ్యాధి తీవ్ర స్వభావాన్ని, మానవాళిపై చూస్తున్న ప్రభావాన్ని నొక్కి చెప్పడానికే ఈ డేని జరుపుతారు. అలాగే బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా ఉండటం కూడా ఒక లక్క్ష్యం. అయితే ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో ముందస్తుగా గుర్తించడం, సరైన సమయంలో అత్యవసర చికిత్స అందించడం అనే రెండు విషయాలు చాలా కీలకం. ప్రపంచ స్ట్రోక్ డే 2022: చరిత్ర 2006లో వార్షిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎస్వో), 2010లో స్ట్రోక్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ 2004లో అక్టోబర్ 29న డబ్ల్యుఎస్వో వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది. ప్రపంచ స్ట్రోక్ డే 2022: థీమ్ స్ట్రోక్ సంకేతాలు, నాణ్యమైన చికిత్స సకాలంలో అందించేలా అవగాహన పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం. సాధారణంగా ఇలాంటి డేలను జరుపుకునే క్రమంలో ప్రతీ ఏడాది ఒక థీమ్ ఉంటుంది. అలా వరల్డ్ స్ట్రోక్ డే 2022 కి గాను 'మినిట్స్ కెన్ సేవ్ లైఫ్స్.. సమయం చాలా విలువైనది అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ స్ట్రోక్ డే నిర్వహిస్తున్నారు. పక్షవాతం లేదా స్ట్రోక్ అంటే ఏంటి? మెదడుకు రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయినా స్ట్రోక్ వస్తుంది.ఈ సమయంలో మెదడు కణాలు కణజాలు దెబ్బతింటాయి. సమయానికి చికిత్స తీసుకోకపోతే మెదడు తీవ్రంగా దెబ్బ తినడం, లేదా ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. ప్రధానంగా జన్యపరమైన మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. స్ట్రోక్ ప్రస్తుత మరణాలకు రెండవ అతిపెద్ద కారణం. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణం అయినప్పటికీ, దాదాపు అన్ని స్ట్రోక్‌లను ముందే గుర్తిస్తే నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. వీరిలో కొంతమందిలో తీవ్రమైన శారీరక వైకల్యం, కమ్యూనికేషన్ ఇబ్బందులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా, 25 ఏళ్లు పైబడిన నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి 3 సెకన్లకు ఒకరు స్ట్రోక్‌తో బాధపడుతున్నారు, అంతేకాదు ఏడాదికి 12.2 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి. 55 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో యువకులలో ఇది సర్వసాధారణంగా మారుతోంది. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైనఆహారం, కొన్ని మందులు ప్రభావంస్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి గోల్డెన్ అవర్ 60 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఆసుపత్రికి చేర్చితే బెటర్. అయితే పక్షవాతానికి సంబంధించి 4.5 గంటల పరిధిని‘‘ గోల్డెన్ అవర్”గా పిలుస్తారు. ఈ గోల్డెన్ అవర్‌లో క్లాట్-బస్టింగ్ డ్రగ్ tPA దీర్ఘకాల మెదడు దెబ్బతినకుండా నివారిస్తుంది. ప్రతి నిమిషం స్ట్రోక్‌కు గురైన వారికి చికిత్స చేయకపోతే; సగటు రోగి 1.9 మిలియన్ న్యూరాన్లు, 13.8 బిలియన్ సినాప్సెస్ ,ఏడు మిలియన్ల ఫైబర్లను కోల్పోతారు అని ప్రముఖ న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ లక్షణాలు: ఎవరైనా స్ట్రోక్‌తో బాధపడుతున్నారని ఎలా గుర్తించాలి ♦ తీవ్రమైన తలనొప్పి ♦ శరీరంలో ఒక వైపు తిమ్మిరి ముఖ్యంగా ముఖం, చేయి లేదా కాలులో తిమ్మిరి ♦ మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడంలో సమస్య ♦ దృష్టి కోల్పోవడం; కొన్నిసార్లు దృష్టి మసకగా అస్పష్టంగా మారిపోవడం ♦ వికారం ,వాంతులు ♦ అస్థిర నడక; సరిగ్గా నిలబడలేకపోవడం ♦ మైకం ఏమి చేయాలి ♦ రోగిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ముఖ్యంగా పక్షవాతానికి సరైన చికిత్స అందించే సామర్థ్యమున్న ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ♦ మొదటి కొన్ని గంటల్లో సీటీ స్కాన్, కొన్ని పరీక్షల ద్వారా సరైన రోగ నిర్ధారణ చాలా అవసరం. ♦ అత్యంత ఖచ్చితమైన చికిత్స ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ. రక్తం గడ్డకట్టడాన్ని నివారించేలా మెకానికల్ థ్రోంబెక్టమీ చేయాలి. 2015 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చిక్సితలో క్యాథ్ ల్యాబ్‌కి తీసుళ్లి, యాంజియో ద్వారా బ్లాక్ అయిన ధమనిని సరిచేస్తామని వైద్య నిపుణులు చెబుతున్నారు. ♦ రోగి వయసు, తీవ్రతను బట్టి ఎలాంటి చికిత్స, లేదా ఆపరేషన్ చేయాలి అనేది వైద్యులు నిర్ధారిస్తారు. -
కారుపై 'హర్ ఘర్ తిరంగ' థీమ్‌తో హల్చల్ చేస్తున్న యువకుడు: వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతకాన్ని ఎగరువేయాలని భారత ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర వచ్చి ఈ ఏడాదికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆగస్టు13 నుంచి ఆగస్టు 15 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా గుజరాత్‌కి చెందిన ఓ యువకుడు తాను సైతం అంటూ ఈ ప్రచారాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాడు. అందుకోసం హర్ ఘర్ తిరంగ అనే థీమ్‌ని సుమారు రూ. 2 లక్షలు వెచ్చించి మరీ కారు పై వేయించుకున్నాడు. అతను కూడా ఈ "హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూనుకున్నాడు. ఈ మేరకు అతను రెండు రోజుల్లో తన స్వస్థలం సూరత్ నుంచి కారులో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నాడు. తాను ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండు రోజుల్లో తన కారులో గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు పర్యటించానని ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #WATCH | Delhi: A youth from Gujarat spent Rs 2 lakhs to revamp his car on the theme of #HarGharTiranga “To make people aware of the campaign, I drove from Surat (Gujarat) to Delhi in my car in 2 days... we want to meet PM Modi & HM Amit Shah," said Sidharth Doshi pic.twitter.com/yC34603HaY — ANI (@ANI) August 14, 2022 (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
నేషనల్ డాక్టర్స్ డే; ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే
వైద్యునిగా, విద్యావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, వితరణ శీలిగా, ఆధునిక పశ్చిమ బెంగాల్ రూపకర్తగా విశేష సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీసీ రాయ్. ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే (జూలై 1) కావడం విశేషం. ఈరోజును భారత ప్రభుత్వం ‘నేషనల్ డాక్టర్స్ డే’గా ప్రకటించి గౌరవించింది. డాక్టర్ బీసీ రాయ్‌గా సుపరిచితులైన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ 1882లో అఘోర్ కామినీ దేవి, ప్రకాష్ చంద్రరాయ్ దంపతులకు, బిహార్ రాష్ట్రంలో జన్మించారు. వైద్య విద్య నిమిత్తం 1901లో కలకత్తా మెడికల్ కాలేజీలో చేరి వైద్య విద్యను అభ్యసిస్తూనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1909లో లండన్ వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించి వచ్చి కలకత్తా మెడికల్ కాలేజీలో అధ్యాపకునిగా చేరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ రాయ్‌కి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టమని కోరింది. మొదట తిరస్కరించినా... 1948 జనవరి 23న రాయ్ ఆ బాధ్యతలు స్వీకరించారు. తన 80వ ఏట 1962 జులై 1వ తేదీ వరకు అంటే తుదిశ్వాస విడిచేవరకు 14 ఏళ్లపాటు అద్భుతపాలన అందించారు. అంతేకాక ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా వున్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడడం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం డాక్టర్ బీసీ రాయ్ అత్యున్నత సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. – డాక్టర్ టి. సేవకుమార్, గుంటూరు (జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం) -
ప్రపంచ అథ్లెటిక్స్ డే.. ఎలా మొదలైదంటే!
మానవ మనుగడ మొదలైందే అథ్లెట్‌గా అంటే అతిశయోక్తి కాదు. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం ప్రారంభించాడు. మెరుగైన జీవనం కోసం పరుగెత్తాడు. ఆహార అన్వేషణలో భాగంగా విసిరాడు.. దుమికాడు. ఇవన్నీ మనిషి జీవన గమనాన్ని ఊహించలేని స్థితికి చేర్చాయి. నడవడం, పరుగెత్తడం, దుమకడం, విసరడం అనేవి అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ అంశాలైనా.. ప్రతి క్రీడలోనూ ప్రాథమిక అంశాలు. క్రీడాకారుడి(అథ్లెట్)గా ఎదిగేందుకు శిక్షణలో శారీరక బలం, చురుకుదనం, నైపుణ్యం ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి అథ్లెట్‌గా పిల్లలు, యువతలో ఫిట్నెస్ ప్రాముఖ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఏటా మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం జరుపుకుంటారు. అథ్లెటిక్ ఫర్ ఏ బెటర్ వరల్డ్.. మనిషి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగానే ఉంటుంది అనే నానుడిని నిజం చేయాలని 1996లో తొలిసారిగా ప్రపంచ అథ్లెటిక్స్ డే ను అంతర్జాతీయ అథ్లెటిక్ అమెచ్యూర్ సమాఖ్య ప్రారంభించింది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా సర్వమానవాళి ఆరోగ్యంగా ఉండాలనేది ఈ డే ప్రధాన లక్ష్యం. అథ్లెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది ఐఏఏఎఫ్ ప్రధాన నినాదం. (క్లిక్: భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?) యువత, క్రీడ, పర్యావరణం ఏ దేశానికైనా యువతే ప్రధాన వనరు. అలాంటి యువత ఆరోగ్యం, ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దేదే క్రీడ. ఏ క్రీడలోనైనా ప్రావీణ్యం సాధించడానికైన మౌలికంగా అవసరమయ్యే శక్తి, సామర్థ్యాలకు పర్యావరణ పరిరక్షణ తోడైతే ఆ దేశ ఖ్యాతి ఇనుమడిస్తుంది. పురాతన ఒలింపిక్ క్రీడల్లో అగ్రభాగం జంప్, జావెలిన్, డిస్కస్లతో పాటు పరుగుదే. బాక్సింగ్, రథాల పోటీలతో పాటు మల్లయుద్ధం ఉండేవి. ప్రపంచ క్రీడా వేదికైన ఆధునిక ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుడి కల. ఒలింపిక్స్‌లో సైతం అత్యధిక పతకాలు(48 బంగారు పతకాలు) అథ్లెటిక్స్‌లోనే అందిస్తారు. -
మనిషి హక్కుకు గుర్తింపు ఏది?
సాటిమనిషిని మనిషిగా చూడని సందర్భాలెన్నో చూస్తూనే ఉన్నాం. మనల్ని కాపాడిన మానవ హక్కుల పరిరక్షణను మనమే కాలరాస్తున్నాం, హరించివేస్తున్నాం. 1948 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కులను ప్రకటన చేసింది. దాని లక్ష్యం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్షకు గురవ్వకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా అన్న సందేహం రాక తప్పదు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సుమారు 30 ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ మనల్ని మనం కాపాడుకోలేకపోవడం బాధాకరం. మానవ హక్కులు గురించి మాట్లాడుకోవడమే తప్ప ఉల్లంఘన జరిగే తీరు మాత్రం మారడం లేదు. నిరంతరం ఏదో ఒక వార్తతో ప్రతి ఒక్కరు ఉలికిపడుతున్నారు. కోర్టులు మాత్రం హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ నివారణ మాత్రం కష్టతరమవుతోంది. మానవ హక్కులు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993 అక్టోబర్ 12న నాటి ప్రధాని పి.వి. నరసింహరావు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసారు. నేటికి 18 రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను మన దేశంలో ఏర్పాటు చేసాయి. (చదవండి: కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?) 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, ఆదర్శవంతమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను రూపొందించింది. దీన్ని చారిత్రక అంశంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా ప్రతి పౌరుడికి అవగాహన కల్పించడానికి ఆమోదించిన దినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10న ఒక అంశాన్ని ప్రాతిపదికంగా తీసుకొని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో ‘బాగా కోలుకోండి... మానవ హక్కుల కోసం నిలబడండి’ అనే నినాదంతో జరుపుకున్నారు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
Special Wedding Card: వావ్! ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా ?
పెళ్లి వేడుకల్లో ఎన్నో కొత్త పద్దతులు వచ్చాయి. పెళ్లికి ఆహ్వానించే తీరులోనూ వెరైటీలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ యాసలో ముద్రిస్తున్న పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అచ్చంగా ఇదే తరహాలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో బిజీగా ఉండే ఓ డాక్టర్ తన వివాహ ఆహ్వాన పత్రికను వ్యాపార పరిభాషలో.. స్టాక్ మార్కెట్ టర్మినాలజీ అచ్చేయించి పంచాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వెడ్డింగ్ కార్డు నవ్వులు పూయిస్తోంది. మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాకు వజీరాబాద్కి చెందిన డాక్టర్ సందేశ్ 2021 డిసెంబర్ 7న అనస్థిషీయిస్ట్ డాక్టర్ దివ్యని మనువాడబోతున్నాడు. ఈ సందర్భంగా బంధుమిత్రులను ఆహ్వానిస్తూ కొత్త పద్దతిలో వెడ్డింగ్‌ను ప్రింట్ చేయించి పంచాడు. ఈ సందర్భంగా పలు చమత్కారాలకు తెర తీశాడు సందేశ్. మీరు ఓ సారి ఆ వెడ్డింగ్ కార్డుపై ఓ లుక్కేయ్యండి. - వివాహ ఆహ్వాన పత్రికను ఇన్షియల్ పబ్లిక ఆఫర్ (ఐపీవో)గా పేర్కొన్నాడు - వరుడు, వధువులను రెండు వేర్వేరు కంపెనీలుగా తెలిపాడు. అంతేకాడు ఈ రెండు కంపెనీలు కలిస్తే బాగుంటుందని ప్రమోటర్లు నిర్ణయించినందు వల్ల ఈ మెర్జ్ జరుగుతోందంటూ పెళ్లిని రెండు వ్యాపార సంస్థల కలయికతో పోల్చాడు. - పెళ్లి వేదికను స్టాక్ ఏక్సేంజీగా, పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు ఇన్వెస్టర్ల హోదాని ఆపాదించాడు. - పెళ్లి రిసెప్షన్ జరిగే తేదీలను బిడ్డింగ్ డేట్లుగా సంగీత్ కార్యక్రమాన్ని రింగింగ్ బెల్ అంటూ చమత్కరించాడు - లంచ్‌ని డివిడెండ్‌గా వసతి కల్పించడాన్ని బోనస్‌గా పేర్కొంటూ పెళ్లి పత్రిక ఆద్యాంతం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై తనకున్న ఇష్టాన్ని పేర్కొన్నాడు డాక్టర్ సందేశ్ - తన తల్లిదండ్రులను ప్రమోటర్లుగా పేర్కొన్నాడు. - పెళ్లి పత్రిక బాటమ్ లైన్లో సైతం క్రియేటివిటీని పీక్స్‌కి తీసుకెళ్లాడు. మ్యూచువలఫండ్ సహీ హై, బంపర్ లిస్టింగ్, ఓవర్ సబ్స్క్రైబ్డ్ అంటూ సరికొత్త హిత వ్యాఖ్యాలను జోడించాడు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడో చెప్పలేదు కదూ.. 2021 డిసెంబరు 6వ తేదిన పెళ్లి 7వ తేదిన రిసెప్షన్ ఉంది. కళ్యాణ వేదిక కర్నాటకలోని గుల్బర్గా జిల్లాలోని హుమ్నాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్.