మనిషి పుట్టుక మొదలు చనిపోయే వరకు అన్ని దశల్లోనూ పాల వాడకం ఉంటుంది. పాలు, పాల నుంచి వచ్చే పెరుగు, వెన్న నెయ్యి, తీపి పదార్థాలు అన్నీ మనిషి మనుగడకు ప్రధానం. గ్రామీణ జీవితంలో ప్రధాన ఆదాయ వనరు, ఎంతో మందికి జీవనాధారమైనది పాడి పంట. ఇక అమ్మ పాలు అమృతం. తల్లిపాలు ఎక్కువకాలం తాగే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. పాలలో విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి కాల్షియం, ప్రోటీన్‌తో సహా పెరుగుతున్న శరీరానికి సహాయపడతాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుకుంటారు. ఈ ఏడాది ప్రపంచ పాల దినోత్సవ థీమ్ ‘పాడి రంగంలో సుస్థిరత’. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..
పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
పాలలో మనకు అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి. దీనిని ‘‘ఫుల్ ప్రోటీన్’’ అంటారు. పాలలో లభించే రెండు రకాల ప్రోటీన్లు కాసిన్, పాలవిరుగుడు ప్రోటీన్. కాసిన్ రక్తపోటును తగ్గిస్తే, పాలవిరుగుడు ప్రోటీన్ మానసిక స్థితిని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గిస్తుంది.
పాలు తీసుకుంటే ఈ పోషకాలు మీ సొంతం:
మనం తీసుకునే ఆహారంలో లభించని చాలా పోషకాలు పాలలో దొరుకుతాయి. వైట్ డ్రింక్ పొటాషియం, బి12, కాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు సాధారణంగా చాలా ఆహార పదార్థాల్లో ఉండవు. కానీ ఇవి పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, బి1, బి2, పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి.
ఎముకలు దృఢంగా:
పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, ప్రోటీన్‌ల వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పాలను ప్రతి రోజు తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బరువును తగ్గిస్తుంది:
పాలలో కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసి బరువు తగ్గిస్తుంది.
పాలతో ఆస్టియో ఆర్థరైటిస్‌కు చెక్:
మోకాళ్లలో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌కు ప్రస్తుతం చికిత్స లేదు. అయితే ప్రతిరోజూ పాలు తాగడం ద్వారా ఈ వ్యాధిని అధిగమించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.
క్యాన్సర్ నుంచి రక్షణ:
పాలలో కాల్షియం, విటమిన్-డి ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాపడుతాయి. పెద్దపేగు క్యాన్సర్ లేదా పురీషనాళ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్షియం గట్ లైనింగ్‌ను కాపాడుతుంది. కణాల పెరుగుదల నియంత్రణలో విటమిన్-డి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
జాగ్రత్త.. జీర్ణం కాకపోతే!
అయితే కొంత మంది వ్యక్తులు పాలల్లో ఉండే లాక్టోస్ వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. లాక్టోస్ అనేది పాల ఉత్పత్తులలో కనిపించే ఒక పదార్ధం. లాక్టోస్ అనేది పడకపోతే పాలను జీర్ణం చేసుకోవడం కష్టం. దీనివల్ల పాలు తాగిన తర్వాత కడుపులో ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు తిమ్మిరి వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
(చదవండి: World Milk Day 2021: 30 ఆవులు.. పాలతో పాటు గౌరవం కూడా!)
Comments
Please login to add a commentAdd a comment