
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కమార్తె సుహానా ఖానా మరో సారి తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2, ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది.అంతకుముందు (ఏప్రిల్ 17న) ఈ చిత్ర నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలు నటి అనన్య పాండేకు సపోర్ట్‌గా ఈవెంట్‌కు విచ్చేసింది సుహానా. ఆఫ్-షోల్డర్ ఫ్లోవీ బ్లాక్ డ్రెస్, బ్లాక్ హీల్స్‌తో దృష్టిని ఆకర్షించింది, అంతేకాదు కోట్ల విలువైన వాచ్‌ను కూడా ధరించడం హాట్ టాపిక్‌గా నిలిచింది.
తండ్రిలాగే సుహానాకు కూడా ప్రీమియం వాచీలంటే చాలా ఇష్టమట. జోయా అక్తర్ 2023 చిత్రం ది ఆర్చీస్‌తో అరంగేట్రం చేసిన సుహానా ఖాన్ ఇటీవల కేసరి 2 ప్రీమియర్‌లో రూ. 1.4 కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ వాచ్ ధరించి కనిపించింది. రెవర్సో ట్రిబ్యూట్ డ్యూఫేస్ టూర్బిలియన్ ( Jaeger-LeCoultre Reverso Tribute Duoface Tourbillon) దీంతో ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
సస్టైనబుల్ ఫ్యాషన్‌ను సమర్ధించే సుహానా ఈ వాచ్ ధరించి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఖుషీ కపూర్ , ఇబ్రహీం అలీ ఖాన్
నాదానియన్ ప్రీమియర్‌లో కూడా ఇదే వాచ్‌ను ధరించింది. దుస్తులను పునరావృతం చేయడానికి అభ్యంతరం చెప్పదు. అనంత్ అంబానీ వివాహానికి కూడా అదే చేసింది. మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకకు తాను గతంలో ధరించిన దుస్తులనే ధరించింది. ముఖ్యంగా జాతీయ అవార్డును అందుకోవడానికి అలియా తన పెళ్లి చీరను మళ్లీ ధరించిడం తనన ఆకట్టుకుందని చెప్పుకొచ్చిందీ స్టార్‌కిడ్.

ఇక సుహానా కరియర్ విషయానికి వస్తే ఆర్చీస్ తర్వాత తండ్రి మూవీ కింగ్‌లో నటిస్తోంది. 20 ఏళ్ళ తరువాత సిద్ధార్థ్ ఆనంద్ షారూక్‌తో మూవీ ప్రకటించాడు. జవాన్ , పఠాన్ చిత్రాల అద్భుతమైన విజయం తర్వాత షారుఖ్ ఖాన్ తదుపరి పెద్ద ప్రాజెక్ట్ కింగ్. ఈ యాక్షన్ డ్రామాలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ , దీపికా పదుకొనే అతిధి పాత్రలో నటిస్తున్నారు.
కాగా సుహానా తండ్రి షారుఖ్ ఖాన్ దగ్గర విలాసవంతమైన గడియారాల కలెక్షన్ ఉంది. 2024లో, అతను రూ.4.2 కోట్ల విలువైన ఆడెమర్స్ పిగ్యుట్ వాచ్ ధరించి ఫ్యాన్స్‌ను ఆకర్షించాడు. అతను రూ.1.1 కోట్లకు పైగా విలువైన పటేక్ ఫిలిప్ ,రూ.6 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె టూర్బిలియన్ కూడావాచ్ కూడా ఉంది.