తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్‌ కూతురిపై ట్రోలింగ్‌ | Shah Rukh Khan Daughter Suhana Gets Trolled for New Ad, Netizens Say No Charisma | Sakshi
Sakshi News home page

10 సెకన్ల కంటే ఎక్కువ చూడలేకపోయాం.. షారూఖ్‌ కూతురిపై విమర్శలు

Published Fri, Nov 22 2024 5:33 PM | Last Updated on Fri, Nov 22 2024 7:45 PM

Shah Rukh Khan Daughter Suhana Gets Trolled for New Ad, Netizens Say No Charisma

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా సరే టాలెంట్‌ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు. పైగా వారి అంచనాలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి. వాటిని అందుకోవడానికి సెలబ్రిటీ కిడ్స్‌ మరింత కష్టపడాల్సి ఉంటుంది.

ఆదిలోనే ట్రోలింగ్‌
ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ కాన్‌ కూతురు సుహానా గతేడాది 'ద ఆర్చీస్‌' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తను పోషించిన వెరోనికా పాత్రకు గానూ విపరీతంగా ట్రోల్‌ అయింది. తాజాగా సుహానా ఓ సెల్‌ఫోన్‌ యాడ్‌లో నటించింది. ఇందులో ఆమె ఓ డైలాగ్‌ చెప్పి తర్వాత వచ్చే మ్యూజిక్‌కు స్టెప్పులేస్తుంటుంది. 

ఇప్పుడు మరోసారి
ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవగానే నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. తండ్రికున్న చరిష్మా కూతురికి లేదని విమర్శిస్తున్నారు. 'తన స్క్రీన్‌ ప్రెసెన్సే నెగెటివ్‌గా అనిపిస్తోంది, 10 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆ యాడ్‌ చూడలేకపోతున్నా..', 'తను సైడ్‌ క్యారెక్టర్లకే పనికొస్తుంది తప్ప ప్రధాన పాత్రలకు కాదు' అని హేళన చేస్తున్నారు. 

అందరి నోళ్లు మూయిస్తుంది!
కొందరు మాత్రం తన హెయిర్‌ స్టైల్‌ బాగోలేదని, డైరెక్షన్‌ కూడా సెట్టవలేదని.. అందుకు పూర్తిగా సుహానాదే తప్పని నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సుహానా ప్రస్తుతం తన తండ్రితో కలిసి కింగ్‌ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో అయినా తనను విమర్శించేవారి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement