క్యారెక్టర్‌ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి | Bigg Boss Telugu 8: Vishnu Priya Tongue Slip on Rohini in Auto Lo Prayanam Challenge | Sakshi
Sakshi News home page

నిఖిల్‌కు ట్రై చేశావ్‌, సెట్టవకపోయేసరికి పృథ్వీతో.. విష్ణు బండారం బయటపెట్టిన రోహిణి

Published Fri, Nov 22 2024 4:33 PM | Last Updated on Fri, Nov 22 2024 6:02 PM

Bigg Boss Telugu 8: Vishnu Priya Tongue Slip on Rohini in Auto Lo Prayanam Challenge

హౌస్‌లో చివరిసారి చీఫ్‌ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్‌బాస్‌ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్‌ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్‌ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్‌ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్‌ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. 

అందర్నీ తోసేసిన ప్రేమపక్షులు
మీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్‌ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్‌ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్‌, ఎమోషనల్‌ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్‌ ఉంది, సపోర్ట్‌ చేస్తానని ఎందుకన్నావ్‌? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్‌ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్‌ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్‌ అంది.

నోరు జారిన విష్ణు
దాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్‌ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్‌ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్‌ నిఖిల్‌కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్‌ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.

నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు
తన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్‌ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్‌ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్‌ ఇచ్చింది. నేనేదీ క్రియేట్‌ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది.

 

చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement