Suhana khan
-
షారుక్ ఖాన్ కూతురు సుహానా గ్లామరస్ (ఫోటోలు)
-
తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్ కూతురిపై ట్రోలింగ్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు. పైగా వారి అంచనాలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి. వాటిని అందుకోవడానికి సెలబ్రిటీ కిడ్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది.ఆదిలోనే ట్రోలింగ్ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ కాన్ కూతురు సుహానా గతేడాది 'ద ఆర్చీస్' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తను పోషించిన వెరోనికా పాత్రకు గానూ విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా సుహానా ఓ సెల్‌ఫోన్ యాడ్‌లో నటించింది. ఇందులో ఆమె ఓ డైలాగ్ చెప్పి తర్వాత వచ్చే మ్యూజిక్కు స్టెప్పులేస్తుంటుంది. ఇప్పుడు మరోసారిఈ యాడ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తండ్రికున్న చరిష్మా కూతురికి లేదని విమర్శిస్తున్నారు. 'తన స్క్రీన్ ప్రెసెన్సే నెగెటివ్‌గా అనిపిస్తోంది, 10 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆ యాడ్ చూడలేకపోతున్నా..', 'తను సైడ్ క్యారెక్టర్లకే పనికొస్తుంది తప్ప ప్రధాన పాత్రలకు కాదు' అని హేళన చేస్తున్నారు. అందరి నోళ్లు మూయిస్తుంది!కొందరు మాత్రం తన హెయిర్ స్టైల్ బాగోలేదని, డైరెక్షన్ కూడా సెట్టవలేదని.. అందుకు పూర్తిగా సుహానాదే తప్పని నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సుహానా ప్రస్తుతం తన తండ్రితో కలిసి కింగ్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో అయినా తనను విమర్శించేవారి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
‘తిర ఫ్లాగ్షిప్’ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
షారుఖ్ ఖాన్ కుమార్తెపై యంగ్ హీరో ఇంట్రెస్టెంగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ, నటి సుహానా ఖాన్‌పై యంగ్ హీరో వేదాంగ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మేకప్ వేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని, షూటింగ్ సమయంలో ఆమె టీమ్ అంతరాయం కలిగించేదని చెప్పారు. ఆయన కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఆలియా బట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వేదాంగ్ రైనా మీడియాతో ముచ్చటించారు. (చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో?)ఈ సందర్భంగా తొలి సినిమా కోస్టార్ సుహానా ఖాన్‌పై ఎప్పుడైనా కోపం వచ్చిందా అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై వేదాంగ్ స్పందిస్తూ.. ‘సుహానా చాలా మంచి అమ్మాయి. అందరితో కలిసిసోతుంది. కోపం వచ్చేలా ఆమె ప్రవర్తించదు. కానీ ఒక విషయంలో మాత్రం నాకు కొంచెం చిరాకుగా అనిపించేంది. ఆమె రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. షూటింగ్ సమయంలో మేమంతా రెడీ అయి ఆమె కోసం ఎదురు చూసేవాళ్లం. దాదాపు గంట లేట్‌గా సెట్‌పైకి వచ్చేది. (చదవండి: పెళ్లి గురించి అమితాబ్ ప్రశ్న.. జునైద్ ఖాన్ ఆన్సర్‌కు తండ్రి షాక్)షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ‘జుట్టు బాలేదు..మేకప్ సరిగా లేదు’అంటూ ఆమె టీమ్ మధ్యలో అంతరాయం కలిగించేంది. దాని వల్ల మా బృందం అంతా ఇబ్బంది పడింది. ఇందులో సుహానాది తప్పులేదు. ఆమె పాత్ర అలా డిజైన్ చేశారు. అందుకే మేకప్‌కి ఎక్కువ సమయం తీసుకునేది’అని వేదాంగ్ చెప్పారు. -
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్‌ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్‌లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్‌తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
కూతురుతో కలిసి షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు (ఫోటోలు)
-
రిసెప్షన్లో లావణ్య ధరించిన చీర చాలా స్పెషల్.. ధర ఎంతో తెలుసా..?
టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.. ఇరు కుటుంబాలు, వారి స్నేహితుల మధ్య పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అక్కడి నుంచి వారు హైదరాబాద్ తిరిగి వచ్చాక తాజాగా నవంబర్ 5న టాలీవుడ్ స్నేహితులతో వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిలు నూతన వధూవరులుగా చేయి చేయి కలిపి సంతోషంగా సందడి చేశారు. ఈ జంట సొగసైన దుస్తులను ధరించి కలర్ఫుల్గా కనిపించారు. లావణ్య మెటాలిక్ చీర దరించిగా.. వరుణ్ తేజ్ బ్లేజర్‌తో మిరుమిట్లు గొలిపేలా కనిపించారు. లావణ్య, వరుణ్ తమ వివాహ వేడుక కోసం బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ఎంచుకున్నారు. ఆయన బాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన రేఖ, శ్రీదేవి, రవీనా టాండన్ ,కాజోల్ , సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, అనుష్కా వంటి స్టార్స్‌కు ఎన్నో రకాల దుస్తులను డిజైన్ చేసి పేరు గడించాడు. దక్షిణ- భారత శైలికి అనుగుణంగా.. హిందూ వివాహం సాంప్రదాయ ప్రకారం లావణ్య-వరుణ్ వివాహ వేడకల నుంచి రిసెప్షన్ వరకు దుస్తుల విషయంలో మనీష్ మల్హోత్రానే చూసుకున్నాడు. అయితే రిసెప్షన్ కోసం లావణ్య త్రిపాఠి ధరించిన చీరను మనీష్ మల్హోత్రా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ధర రూ. 2.75 లక్షలు. గతంలో ఇదే మోడల్ చీరలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మెరిసింది. (ఇదీ చదవండి: రిసెప్షన్లో ఆ ఇద్దరి పాదాలకు నమస్కరించిన లావణ్య త్రిపాఠి) బాలీవుడ్‌లోని ఒక ప్రముఖ ఈవెంట్లో సుహానా ఆ చీరలో అదరహో అనేలా కనిపించింది. దీంతో లావణ్య కూడా అదే మోడల్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. బంగారు వర్ణంలో ఉన్న ఆ చీరలో లావణ్య మరింత కలర్ఫుల్గా సుహానాకు ఏ మాత్రం తగ్గకుండా మెరిసిపోయిందని చెప్పవచ్చు. లావణ్య పెళ్లి సమయంలో ఎరుపు వర్ణంలో చీరను ధరించింది.. దాని ధర సుమారు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది. ఆ చీరకు ఎక్కువగా బంగారంతో ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్లు సమాచారం. -
Shah Rukh Khan Daughter Suhana Khan: షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఎంత అందంగా ఉందో చూశారా? (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమార్తె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు!
బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ బీటౌన్‌లో సుపరిచితమైన పేరు. బాలీవుడ్లో ఇంకా అరంగేట్రం చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ సెలబ్రీటీల పిల్లలు తరచుగా పార్టీలకు, పబ్‌లకు వెళ్లడం సర్వసాధారణంగా జరిగేదే. అలా వెళ్లేవారిలో అయితే షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఒకరు. తాజాగా తన తల్లి గౌరీ ఖాన్‌తో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరైన సుహానా కెమెరాల కంటికి చిక్కింది. ఆ ఈవెంట్ నుంచి బయటకు వస్తూ కారులో వెళ్తుండగా.. సుహానా ఖాన్‌ను ఓ మహిళ సాయం చేయమని అడిగింది. (ఇది చదవండి: మొన్న ఏజెంట్.. ఇప్పుడు భోళా.. పాపం సుంకర!) దీంతో వెంటనే తన బ్యాగ్‌లోని ఐదువందల రూపాయల నోట్లను ఇచ్చేసింది సుహానా. ఇది చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బంగారం లాంటి మనసు ఉన్న అమ్మాయి అంటూ కొనియాడారు. కష్టాల్లో ఉన్న మహిళలకు సాయం చేయడాన్ని అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబయిలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సుహానా తన తల్లితో పాటు హాజరయ్యారు. సుహానా త్వరలోనే జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ది ఆర్చీస్తో ఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది చివర్లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అయితే మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. ఆర్చీస్‌లో శ్రీదేవి, బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటించారు. (ఇది చదవండి: నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తండ్రి నిర్మాత.. కుమార్తె కథానాయిక
‘అలాంటి ఇలాంటి లాంచింగ్ కాదు.. ఓ రేంజ్లో ఉండాలి’ అన్నట్లు కుమార్తె సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రానికి షారుక్ ఖాన్ రంగం సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే సుహానా నటిగా మేకప్ వేసుకుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో ‘ది ఆర్చీస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు సుహానా వెండితెరపై పరిచయం కావడానికి ఓ సినిమా సైన్ చేసిందని సమాచారం. కుమార్తె అరంగేట్రం అట్టహాసంగా జరగాలనే ఆలోచనతో తనకు ఇటీవల ‘పఠాన్’లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలని షారుక్ అనుకుంటున్నారట. అది మాత్రమే కాదు.. అతిథి పాత్ర కూడా చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కథ రెడీ అవుతోందని సమాచారం. ఇంకా దర్శకుడి ఎంపిక జరగలేదని టాక్. -
రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్
సాక్షి,ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన మహారాష్ట్రలోని అలీబాగ్‌లో భారీ విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. అరంగేట్రంలో రూ. 12.91 కోట్లతో ఆస్తులను కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. సుహానా ఖాన్ తన తొలి సంపాదనతో ఈ ఆస్తులను కొన్నట్టు సమాచారం. మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది అంతేకాదు రిజిస్ట్రేషన్ లో సుహానా పేరును రైతుగా నమోదు చేశారట. సుహానా అమ్మమ్మ సవితా ఛిబ్బర్, ఆమె సోదరి నమితా చిబ్బర్ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆస్తిని జూన్ 1న రిజిస్ట్రేషన్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) భూమి విస్తీర్ణం 1.5 ఎకరాలు, 2,218 చదరపు అడుగుల్లోఉన్న ఇళ్లు ఉన్నాయి. దీనికోసం 77.46 స్టాంప్ డ్యూటీ చెల్లించారు. పఠాన్‌తో భారీ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్‌కు ఇప్పటికే అలీబాగ్ లో సీ ఫేస్డ్ లగ్జరీ బంగ్లా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సునైనా కొనుగోలు చేసిన అలీబాగ్ లో దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు ఇళ్లు కూడా ఉన్నాయి. (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) కాగా జోయా అక్తర్ దర్శకత్వంలో ది ఆర్చీస్ అనే మూవీలో సుహానా తొలిసారిగా నటిస్తోంది. ది ఆర్చీస్ అనేది 1960ల నాటి భారతదేశంలోని లైవ్-యాక్షన్ మ్యూజికల్ సెట్. ఈ సినిమాలో బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో అదరగొట్టిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక సుహానా ఖాన్ స్టడీ విషయానికి వస్తే యూకేలోని సస్సెక్స్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, 2022లో న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి నటనలో పట్టా పొందడం గమనార్హం. You’ve seen the gang in the comics, in books, and even in Riverdale — but this time around, you’ll see them closer to home! Set in the 60's, The Archies builds a world that’s both familiar and new. Here's your first look #TUDUM! pic.twitter.com/uxpS1A3JeX — Netflix India (@NetflixIndia) June 17, 2023 -
షారుక్ ఖాన్ కూతురు సుహానా గ్లామరస్ (ఫోటోలు)
-
వెంకీ శతకం.. 'కింగ్' ఖాన్ కూతురు ఏం చేసిందంటే?
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శతకంతో మెరిశాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అయ్యర్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ కాగా.. కేకేఆర్ తరపున ఇది రెండో ఐపీఎల్ సెంచరీ మాత్రమే. ఇంతకముందు ఐపీఎల్ తొలి సీజన్ 2008లో బ్రెండన్ మెక్కల్లమ్(158*పరుగులు) మాత్రమే కేకేఆర తరపున సెంచరీ సాధించాడు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వెంకటేశ్ అయ్యర్ తన తొలి ఐపీఎల్ శతకంతో మెరవడమే కాదు.. కేకేఆర్ తరపున సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక 49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో శతకం మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్ ఆ తర్వాత మరో నాలుగు పరుగులు చేసి 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే వెంకీ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శతకం సాధించగానే రెండు చేతులతో బ్యాట్‌ను పట్టుకొని భారతీయ సంప్రదాయ పద్దతిలో మొక్కుతూ కనిపించాడు. ఆ తర్వాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ ఈ సెంచరీ మీకోసమే అన్నట్లుగా గెస్టర్ ఇచ్చాడు.. మరి ఆ సైగ ఎవరికి ఇచ్చాడా అని తిరిగిచూస్తే ఎదురుగా కింగ్ ఖాన్.. షారుక్ కూతురు సుహానా ఖాన్ కనిపించింది.వెంకీ అలా చేయగానే ఆమె నవ్వుతూ చప్పట్లతో అభినందించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై, కేకేఆర్ మ్యాచ్ ఏమో గానీ ఇరుజట్లలో కీలకపాత్రల్లో ఉన్న సచిన్ టెండూల్కర్, షారుక్ ఖాన్ల ముద్దుల తనయలు ఈ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఒక ఎండ్‌లో సచిన్ కూతురు సారా టెండూల్కర్.. మరో ఎండ్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్లు తమ జట్లను ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక అర్జున్ టెండూల్కర్ కూడా ఇవాళ్లి మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. History Created... #venkateshiyer is the 2nd player to score 100 for KKR. 🔥🔥 What a Innings 🔥💪#KKRvMIpic.twitter.com/jiemQWEXkN — 𝐁𝐀𝐁𝐀 𝐘𝐀𝐆𝐀 (@yaga_18) April 16, 2023 చదవండి: #venkateshIyer: నొప్పిని భరిస్తూనే.. -
షారుక్ కొడుకే కాదు కూతురు కూడా లవ్‌లో పడింది! ప్రియుడెవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోపక్క అతడి కొడుకు హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా లవ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో సుహానా ప్రేమలో మునిగి తేలుతోందట. ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకలో కుటుంబసభ్యులందరి ముందుకు సుహానాను తన ప్రేయసిగా పరిచయం చేశాడట అగస్త్య. కాగా వీరిద్దరూ ద ఆర్చీస్ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. జోయా అఖ్తర్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్ బర్డ్స్ తమ ప్రేమ విషయాన్ని ఇప్పుడప్పుడే బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదట. ఇకపోతే కొడుకు ప్రేమకు అప్పుడే పచ్చజెండా ఊపేసిందట శ్వేతా బచ్చన్. మరి వీరి లవ్ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలి! చదవండి: దొంగతనం చేస్తూ దొరికిపోయిన బిగ్‌బాస్ విన్నర్ -
అబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నాం.. స్టార్ కిడ్‌పై ట్రోలింగ్
సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లుంటారు, విమర్శించే వాళ్లూ ఉంటారు. వారు ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, ఎలాంటి దుస్తువులు వేసుకున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయితే ఈ నెగెటివిటీ వారి ఒక్కరిపైనే కాకుండా ఆ కుటుంబంపైన కూడా చూపిస్తుంటారు. ఈ క్రమంలో తారల పిల్లలు కూడా కొన్నిసార్లు ట్రోల్స్ బారిన పడుతుంటారు. తాజాగా స్టార్ కిడ్ సుహానా ఖాన్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ కూతురు సుహానా 'ద ఆర్చీస్' అనే సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అయిపోవడంతో అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి ఆమె రెడ్ కలర్ టైట్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు చూసిన నెటిజన్లు సుహానాపై విమర్శలు గుప్పిస్తున్నారు. 'మలైకా అరోరాలా నడుస్తూ ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు?', 'అబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నాం.. డిస్లైక్ బటన్ ఉంటే బాగుండు..', 'ఏం తల్లీ.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని సినిమాలో ఎంట్రీ ఇస్తున్నావా?', ' ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే ఆ రేంజ్లో రెడీ అవుతున్నావా? నీకవసరమా?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై షారుక్ ఫ్యాన్స్ మండిపడుతూ.. సుహానాపై ఎందుకంత విషాన్ని చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నటి మాళవికకు నయనతార కౌంటర్ మోడల్‌తో డిన్నర్ డేట్‌కు టైటానిక్ స్టార్ -
బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో..
బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్ – దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ మూవీలో మిహిర్ అహుజా, డాట్, యువరాజ్ మెండా కూడా నటిస్తున్నారు. శనివారం ‘ద ఆర్చీస్’ గ్యాంగ్ ఇదే అని ప్రకటించి, ఫొటోని రిలీజ్ చేశారు. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది. The sun is out, the news is out! Come meet your new friends. Presenting to you the cast of The Archies, directed by the fantastic Zoya Akhtar. pic.twitter.com/vOtm29V0gP — Netflix India (@NetflixIndia) May 14, 2022 View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు
Aryan Khan Bollywood Debut As Director To A Web Series: బాలీవుడ్ బాద్షా కుమారుడు ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆర్యన్ హీరోగా ఏదో ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇప్పటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. బాలీవుడ్‌కు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. దానికి కథను కూడా ఆర్యన్ ఖాన్ అందించాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టెస్ట్ షూట్‌ను ముంబైలోని ఓ స్టూడియోలో జరిపినట్లు తెలుస్తోంది. ఈ టెస్ట్ షూట్‌కు ఆర్యన్ ఖాన్ పూర్తి బాధ్యతను తీసుకున్నాడట. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన ఉండాలనేది ఆర్యన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ముందుగా ఏప్రిల్ 8, 9 తేదిల్లో టెస్ట్ షూట్ నిర్వహించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి ఆర్యన్ ఖాన్‌కు తనలా హీరో కావాలనే ఆలోచిన లేదని, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలు తనకు నచ్చేవని ఇదివరకూ పలుమార్లు షారుఖ్ ఖాన్ తెలిపాడు. ఇక షారుఖ్ ఖాన్ రెండో సంతానం, కుమార్తె సుహానా ఖాన్ ఓ వెబ్ సిరీస్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే ఈ వెబ్ సిరీస్‌కు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అర్చీస్ కామిక్ ఆధారంగా తెరకెక్కనుంది. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు -
కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు
Suhana Khan Spotted With Mystery Friend in Car: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్టార్ డైరెక్టర్ జోయా అక్తర్ దర్శకత్వంలో డెబ్యూ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే స్టార్ కిడ్ గుర్తింపు ఉన్న సుహానా బీ-టౌన్ వెండితెర ఎంట్రీకి ముందే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. చదవండి: భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా.. తరచూ ఫొటోషూట్స్‌తో పాటు తన అప్డేట్స్ ఇస్తూ సామాజికి మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక బాద్షా తనయగా ఎంతో పాపులారిటీ ఉన్న సుహానా తాజాగా మీడియా నుంచి ముఖం చాటేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మన్నత్ సమీపంలో ఆమె కారులో ఓ వ్యక్తితో కనిపించింది. వారిని చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పడంతో వారిద్దరూ ముఖాన్ని చేతులతో కప్పెసుకోవడం ఆశ్చర్యకరం. దీంతో వారు ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందందని, అంతేకాదు ఇంతకి సుహానా పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? అతడితో సుహానా రిలేషన్ ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చదవండి: ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు, ట్వీట్ వైరల్ ఈ నేపథ్యంలో సుహానా సీక్రెట్ రిలేషన్లో ఉందని, అతను తన సీక్రెట్ ఫ్రెండ్(బాయ్‌ఫ్రెండ్ అయ్యింటాడు) అని, ఇప్పుడు మీడియాకు అడ్డం బుక్కవడంతో ఇద్దరు ముఖాలు చాటేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుహానా నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. 2019లో న్యూయార్క్ యునివర్శిటీలో ఆమె యాక్టింగ్ స్కూల్లో చేరింది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌లోని ఆర్డింగ్లీ కాలేజీ డిగ్రీ పూర్తి చేసింది. -
ప్రతిభతో నిలదొక్కుకునేందుకు వస్తున్న 'బీటౌన్' వారసులు
వారిస్ వస్తున్నారోచ్.. హిందీలో వారిస్ వస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ విజిటింగ్ కార్డ్‌తో వస్తున్నారు. ఒకట్రెండు సినిమాలకే బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగపడుతుంది. అందుకే టాలెంట్‌తో నిలబడాలనుకుని వస్తున్నారు. ఇప్పుడందరి కళ్లూ ఈ వారిస్ మీదే. ‘వారిస్ ఆ రహే హై’ (వారసులు వస్తున్నారు) అంటూ స్టార్ కిడ్స్‌కి వెల్కమ్ చెప్పడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. త్వరలో పరిచయం కానున్న ఆ వారసుల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో వారసుల ఎంట్రీ లిస్ట్ ప్రతి ఏడాది అప్డేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ పేర్లు చేరిపోయాయి. ఈ ముగ్గురూ జోయా అక్తర్ డైరెక్షన్లో ఓ వెబ్ ఫిలిం చేయనున్నారని టాక్. కామిక్ బుక్ ఆర్చీస్ ఆధారంగా ‘ది ఆర్చీస్’ అనే మ్యూజిక్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది నవంబరులో దర్శకురాలు జోయా అక్తర్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 1960 నేపథ్యంలో టీనేజర్స్ కథలా ఉంటుంది ఆర్చీస్ నవల. ఈ ప్రాజెక్ట్ కోసం తాజాగా అగస్త్య నంద, సుహానా ఖాన్, జోయాల మధ్య ఓ మీటింగ్ జరిగినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ షాప్స్‌లో భాగంగానే అగస్త్య, సుహాన, జోయ కలిశారన్నది బీ టౌన్ టాక్. ఇదే ప్రాజెక్ట్‌లో ఖుషీ కపూర్ కూడా భాగమయ్యారని తెలుస్తోంది. ఖుషీ కపూర్‌కు యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉందని, న్యూయార్క్‌లో శిక్షణ తీసుకుంటోందని గత ఏడాది ఓ సందర్భంలో ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ అన్నారు. తాజాగా ‘త్వరలోనే ఖుషీ కపూర్ కెమెరా ముందుకు వెళుతోంది. ఖుషీ యాక్ట్ చేయనున్న ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ కావొచ్చు’’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. దీంతో ఖుషీ ‘ది ఆర్చీస్’ ప్రాజెక్ట్‌లో భాగమయిందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదండోయ్.. నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీమ్ అలీఖాన్ (సైఫ్–అమృతా సింగ్‌ల కుమారుడు ఇబ్రహీమ్) పేరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం జోయా అక్తర్ పరిశీలించిన పేర్లలో వినిపిస్తోంది. ఆండ్రూస్, బెట్టి కూపర్, వెరోనికా లాడ్జ్, జగ్హెడ్ జోన్స్ అనే నలుగురు టీనేజ్ క్యారెక్టర్ల చుట్టూ ‘ది ఆర్చీస్’ తిరుగుతుంది. మరి.. ఇందులో ఎవరెవరు ఏయే క్యారెక్టర్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ పైన చెప్పిన స్టార్ కిడ్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే మాత్రం ఒకే ప్రాజెక్ట్‌తో నలుగురు వారసుల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రముఖ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ యాక్టింగ్ జర్నీ ఆరంభమైంది. హీరోయిన్ అనుష్కా శర్మ నిర్మిస్తున్న ‘క్వాల’ అనే వెబ్ సిరీస్‌లో బాబిల్ నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ఐదు ఎపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ చిన్న కొడుకు రజ్వీర్ (సన్నీ పెద్ద కొడుకు కరణ్ 2019లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు) ఎంట్రీ కూడా మొదలైపోయింది. ఈ చిత్రానికి ఎస్. అవ్నీష్ దర్శకుడు. మరోవైపు అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తనయుడు (ఆమిర్–రీనా దత్ల కుమారుడు) జునైద్ ఖాన్ ‘మహా రాజా’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా ‘మేదియా’ అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ కూడా ఖరారవుతున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్యన్ యాక్టర్‌గా కన్నా కూడా రైటర్‌గానే ముందుగా పరిచయం కానున్నాడని బీ టౌన్ వార్త. అమెజాన్ ప్రైమ్ వీడియోకు షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతోందట. ఈ ప్రాజెక్ట్ కోసమే ఆర్యన్ రైటర్‌గా మారాడని భోగట్టా. అలాగే ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్‌లో ఆర్యన్ నటించనున్నారట. ఇక ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి ఎంట్రీ కూడా ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. మరికొందరు స్టార్ కిడ్స్ కూడా రావడానికి రెడీ అవుతున్నారు. మరి.. టాలెంట్‌తో నిలబడే వారసులు ఎందరో చూడాలి. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కూతురు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ జోయా అక్తర్ దర్శకత్వంలో డెబ్యూ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరిపేందుకు సుహానా జోయా ఆఫీస్‌ను సందర్శించడం మీడియా కంట పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సుహానా బాలీవుడ్ ఎంట్రీపై బీటౌన్‌లో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇక గతంలోనే తన కూతురు హీరోయిన్గా కనిపించాలనుకుంటుందని షారుక్ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. -
ఆర్యన్ ఖాన్‌కు సోదరి బర్త్‌డే విష్షెస్.. చిన్ననాటి ఫొటో వైరల్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ 24వ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు, కజిన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కజిన్ ఆలియా షేర్చేసిన చిన్ననాటి ఫోటోపై ఆర్యన్ చెల్లెలు సుహానా ఖాన్ స్పందించింది. అన్నయ్యకు ప్రేమగా లవ్ సింబల్‌తో బర్త్‌డే విషెస్ తెలిపింది. ఆ చిన్ననాటి ఫొటోలో చిట్టి సుహానా, అలియా మాట్లాడుతుండగా ఆర్యన్, అతని కజిన్ అర్జున్ ఫొటోకు ఫోజులివ్వడాన్ని మనం చూడొచ్చు. ఆర్యన్ కజిన్స్ అలియా చీబా, అర్జున్ చిబా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ బర్త్ డే బాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యన్ ఖాన్ 24వ పుట్టిన రోజు సందర్భంగా అతని సోదరి సుహానా ఖాన్ షేర్ చేసిన చిన్ననాటి ఫొటో ఇప్పటికే వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ల పెద్ద కొడుకు ఆర్యన్ ఇటీవలె డ్రగ్స్ కేసులో అరెస్టయి ఇటీవలె బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆర్యన్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. -
అనన్యపాండే మొబైల్, ల్యాప్‌టాప్ సీజ్
Ananya Pandays Mobile, Laptop Seized : బాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరయ్యింది. తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఈనెల 2న జరిగిన క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కావాలని ఆర్యన్.. అనన్యకు వాట్సప్ చాట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చాట్‌లో లైగర్ భామ అనన్యతో పాటు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్ హీరోల పిల్లలు కావడంతో అందరికి ఓ కామన్ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. తెలుగులోనూ విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. చదవండి: నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్! బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత -
ముగ్గురు వారసులు.. ఓ సినిమా
హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది స్టార్ల వారసత్వం హిందీ తెరపై కనిపించింది. కానీ ఇప్పుడు ఒకేసారి ముగ్గురు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుండటం బీ టౌన్లో చర్చనీయాంశమైంది. ‘జిందగీ నా మిలేగీ దొబార’, ‘గల్లీభాయ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకురాలు జోయా అక్తర్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్‌ఫిల్మ్ చేయనున్నారు. ఒక అంతర్జాతీయ బుక్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బీటౌన్ బాద్ షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నటించనున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని బీటౌన్ టాక్. మరి.. ఈ వె»Œ æఫిల్మ్‌తో ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తారా? వేచి చూడాల్సిందే. -
నెలకు రూ.లక్ష పైనే, నన్ను పెళ్లి చేసుకుంటావా?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ల ముద్దుల కూతురు సుహానా ఖాన్ నిన్న(మే 25న) 21వ వడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రత్యేక విషెస్ తెలియజేసింది. 'నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సుహానా బర్త్‌డే అని తెలియగానే చాలామంది అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఓ అభిమాని మాత్రం ఏకంగా పెళ్లి ప్రపోజల్ తీసుకురావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'గౌరీ మేడమ్.. నేను నెలకు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తాను. నాకు సుహానాను ఇచ్చి పెళ్లి చేయండి' అంటూ చేతులెత్తి వేడుకుంటున్న ఎమోజీని జత చేశాడు. అయితే అతడి ప్రపోజల్‌ను గౌరీ పట్టించుకుందో లేదో కానీ నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. నీ లక్ష రూపాయలు వారికి ఏ మూలకూ సరిపోవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. Gauri mam meri shadi Suhana ke saath karwado 🙏 🤗 Meri monthly payment 1lakh+ hai — SUHAIB صہیب 🇮🇳 (@SRKmania_) May 21, 2021 ఇదిలా వుంటే సుహానా ఖాన్ న్యూయార్క్‌లో విద్యనభ్యసిస్తోన్న విషయం తెలిసిందే. సెకండ్ లాక్డౌన్ విధించగానే గౌరీ ఖాన్ తన కొడుకు ఆర్యన్‌ను తీసుకుని కూతురి దగ్గరకు వెళ్లిపోయింది. అంటే షారుక్ మినహా కుటుంబం అంతా న్యూయార్క్‌లోనే సేద తీరుతోంది. View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) చదవండి: ఈ ఫోటోలో ఉన్న స్టార్ కిడ్స్‌ని గుర్తుపట్టారా? -
క్యాజువల్ లుక్‌లో కాజల్, సూపర్ క్యూట్‌గా అర్హ
♦ క్యాజువల్ లుక్‌లో కాజల్ అగర్వాల్ ♦ 21వ వడిలోకి అడుగుపెట్టిన షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ♦ ఇది ఏ పాటలోదో చెప్పుకోండంటోన్న అదా శర్మ ♦ స్వర్గం, నరకం రెండూ తానే అంటోన్న నందిత శ్వేత ♦ సోదరికి బర్త్‌డే విషెస్ తెలిపిన నజ్రియా ♦ కిచెన్‌లో చికెన్ వండిన అరియానా గ్లోరీ ♦ సింపులే కానీ అంత ఈజీ కాదంటోన్న ఆర్విక గుప్తా ♦ అర్హ క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు స్నేహారెడ్డి View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aarvika Gupta (@aarvikagupta09) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Ananya (@ananya_x.x) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) -
ఈ ఫోటోలో ఉన్న స్టార్ కిడ్స్‌ని గుర్తుపట్టారా?
ముంబై : రంగుల హోలీ వస్తుందంటే.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగును జరుపుకుంటారు. కరోనా కారణంగా ఆంక్షల మధ్య ఈసారి హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. పలువురు సినీ స్టార్స్ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లాసంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసుకుంది. కింగ్ ఖాన్ షారుక్ కూతురు సుహానా ఖాన్, కపూర్ ఫ్యామిలీకి చెందిన షనయా కపూర్‌తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే. తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో అనన్య దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో మధ్యలో ఉన్నదినటి అనన్య పాండే కాగా, ఆమె కుడివైపు షనయా కపూర్ ఉండగా, ఎడమ వైపు ఉన్నది సుహానా ఖాన్. వీరిద్దరితో బెస్ట్ హోలీ మొమరీస్ ఉన్నాయని గుర్తు చేసుకుంది అనన్య. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా హోలీ జరుపుకోవాలని కోరింది. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) చదవండి : హోలీ సెలబ్రేషన్స్‌లో మన స్టార్స్.. ఫోటోలు వైరల్ సోషల్ హల్చల్: మేనుకు రంగులద్దుకున్న భామలు -
అగస్త్య నందాను అన్‌ఫాలో చేసిన సుహానా
అమితాబ్ బచ్చన్ మనువడు అగస్త్య నందా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో అతను బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అని అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. రెండు రోజుల క్రితమే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన అగస్త్యకు అప్పడే దాదాపు 48 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్, కరిష్మా కపూర్ సహా పలువురు స్టార్ నటీనటులు ఉన్నారు. అయితే ఇటీవలే అతడున పోస్ట్ చేసిన వరుస ఫోటోలు, వాటికి వచ్చిన కామెంట్లతో అగస్త్య పేరు తెగ ట్రెండ్ అవుతోంది. (కేబీసీ: కంటెస్టెంట్ జోక్‌కు ఆగ్రహించిన బిగ్‌బీ ) చిన్ననాటి ఫోటోలు సహా అగస్త్య ఇప్పటి వరకు 12 పోస్టులను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వాటిలో ఓ ఫోటోకు సంబంధించి షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ స్పందిస్తూ అన్‌ఫాలో అని కామెంట్ చేయడం ఇప్పుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. చిన్నప్పటి నుంచి వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కాగా సుహానా అన్ఫాల్ ఎందుకు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక మరో పోస్టులో నేను కృషిని నమ్ముతాను కానీ అదృష్ణాన్ని కాదంటూ అగస్త్య ఓ ఫోటో షేర్ చేయగా అసలు నీ ఉద్దేశం ఏంటో వివరించాలంటూ సోదరి నవ్యా నందా, ఆలియా భట్ కామెంట్ చేయడంతో అగస్త్య పేరు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక శ్వేతనందా, నిఖిల్ నందా కుమారుడైన అగస్త్య ఇటీవలే లండన్‌లోని సెవెనోక్స్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. (భాయ్ ‘మన్నత్’ను అమ్మేస్తున్నారా.. షారుఖ్ రిప్లై! ) View this post on Instagram A post shared by Agastya Nanda (@agastya.nanda) on Oct 26, 2020 at 12:39pm PDT -
సుహానా ఎక్స్ప్రెషన్స్కు నెటిజన్స్ ఫిదా..
అబుదాబి : బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ కుమార్తె సుహానాఖాన్ ఎక్స్ప్రెషన్స్కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సుహానా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తమ హృదయాలు చాక్లెట్లలా కరిగిపోతున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతరాత్రి ముంబై ఇండియన్స్‌కు, కోల్కత్తా నైట్ రైడర్స్‌కు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను షారూఖ్ తన కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానాఖాన్‌తో కలిసి వీక్షించగా.. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. షారూఖ్ కేకేఆర్‌కు చెందిన హుడీతో పాటు బ్రీతింగ్ మాస్క్‌ను ధరించగా.. సుహానా స్లీవ్‌లెస్ జాకెట్‌ను ధరించి ఆటను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆర్యన్‌ఖాన్ మాత్రం స్లీవ్డ్ రెడ్ టీషర్ట్‌ను ధరించాడు. చదవండి : అవును.. మాకు కరోనా సోకింది -
ట్రోలింగ్; నువ్వు అసహ్యంగా ఉన్నావ్
సుహానా ఖాన్.. సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ల ముద్దుల కూతురు. బీటౌన్ స్టార్ నటుడి కుమార్తె అయినప్పటికీ తనకూ ట్రోలింగ్స్ బెడద తప్పలేదు. తాజాగా తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్‌పై సుహానా స్పందించారు. తన శరీరపు రంగుపై కామెంట్లు చేస్తున్న వారికి ధీటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం సుహానాకు 20 ఏళ్లు,. అయితే 12వ ఏట నుంచే తన శరీరపు రంగు గురించి చెడుగా మాట్లాడుతున్నారని ఆమె వెల్లడించారు. ‘నువు అస్సలు బాగోలేవు, నల్ల పిల్లిలా, మంత్రగత్తెలా ఉన్నావు అంటూ పలువురు నెటిజన్లు తనపై తీవ్ర వివక్షత చూపుతున్నారని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్ తనయ!) "ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఈ సమస్య నాకు మాత్రమే కాదు. అందరికి ఎదురవుతోంది. దీనిని మనం తప్పక పరిష్కరించుకోవాలి. నాపై చేసిన కొన్ని వ్యాఖ్యలను మీకు చెబుతాను. నాకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి నా శరీర రంగు గురించి ఎంతో మంది ఎన్నో కామెంట్లు చేశారు. నా స్కిన్ టోన్ బాలేదని, చూడటానికి అసహ్యంగా ఉన్నానాని అన్నారు. విచారకరమైన విషయం ఏంటంటే మనమంతా భారతీయులం. ఒక్కోక్కరు ఒక్కో రంగులో ఉంటారు. కొందరు తెల్లగా, మరి కొందరు గోధుమ రంగులో కానీ మనం వేర్వేరు రంగులో ఉన్నప్పటకీ సొంత వారిని అసహ్యించుకోవడం బాధాకరం. మీరు 5"7, ఫెయిర్‌గా లేకుంటే మీరు అందంగా లేరని కాదు. నా ఎత్తు 5’’3.. నా కలర్ బ్రౌన్.. నేను ఇలా ఉన్నందుకు ఎప్పుడూ బాధపడను. నిజానికి చాలా సంతోషంగా ఉన్నాను. అంటూ ట్రోట్స్ను తప్పికొట్టారు. (లైంగిక వేధింపులు: బాలీవుడ్ దర్శకుడికి సమన్లు) View this post on Instagram There's a lot going on right now and this is one of the issues we need to fix!! this isn't just about me, it's about every young girl/boy who has grown up feeling inferior for absolutely no reason. Here are just a few of the comments made about my appearance. I've been told I'm ugly because of my skin tone, by full grown men and women, since I was 12 years old. Other than the fact that these are actual adults, what's sad is that we are all indian, which automatically makes us brown - yes we come in different shades but no matter how much you try to distance yourself from the melanin, you just can't. Hating on your own people just means that you are painfully insecure. I'm sorry if social media, Indian matchmaking or even your own families have convinced you, that if you're not 5"7 and fair you're not beautiful. I hope it helps to know that I'm 5"3 and brown and I am extremely happy about it and you should be too. #endcolourism A post shared by Suhana Khan (@suhanakhan2) on Sep 29, 2020 at 9:10am PDT -
బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్ తనయ!
కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం విలవిలాడిపోతుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కాలంలో కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రెటీల విషయానికి వస్తే వంట నేర్చుకోవడం దగ్గర నుంచి, పెయింటింగ్స్, క్రియేటివ్ రైటింగ్ ఇలా కొత్త హాబీలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్ ముద్దుల తనయ సుహానా ఖాన్ ఆన్లైన్లో బెల్లీ డాన్స్ నేర్చుకుంటూ తన లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బెల్లీ డాన్స్ ట్రైనర్ సంజనా ముత్రేజా తన ఇన్‌స్టాలో షేర్చేశారు. న్యూయార్క్‌లో ఉంటున్న సుహానా కరోనా కారణంగా ఇండియాకు వచ్చింది. View this post on Instagram Challenging ourselves with rolls !! Belly dance online classes with @suhanakhan2 #bellydanceclass #bellydanceathome #onlinebellydance #stayhome #skypelessons #artofbellydancewithsanjana #suhanakhan A post shared by Sanjana Muthreja (@sanjanamuthreja) on Apr 2, 2020 at 5:52am PDT బెల్లీ డాన్స్ నేర్చుకోవడంతో పాటు సుహానా మేకప్ ట్యూటర్‌గా కూడా మారిపోయింది. తల్లి గౌరి ఖాన్‌కి ఈ ఖాళీ సమయంలో మేకప్ క్లాసులు చెబుతోంది. దీనికి సంబంధించి ఈ మధ్య గౌరీ ఖాన్ సుహానా ఫోటోని షేర్ చేస్తూ మేకప్ క్లాస్‌లు తీసుకుంటున్నాను అని రాశారు. ఇక ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు షారుక్, గౌరీల చిన్నకుమారుడు అబ్రామ్ క్యాండిల్ పట్టుకున్న వీడియోని కూడా గౌరీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో షారుక్ అభిమానుల్ని అలరిస్తోంది. (కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం) View this post on Instagram 9 pm .. Lego Dia @Cogsnitisheth.. A post shared by Gauri Khan (@gaurikhan) on Apr 5, 2020 at 9:16am PDT చదవండి: లడ్డు తయారుచేస్తున్న బాలీవుడ్ భామ -
మిస్ మార్వెల్ అవుతారా?
మార్వెల్ సంస్థలో ఓ సూపర్ ఉమెన్ చిత్రం తెరకెక్కనుంది. ‘మిస్ మార్వెల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సూపర్ ఉమెన్ పాత్ర కోసం ప్రస్తుతం ఆడిషన్స్ నిర్వహిస్తోంది మార్వెల్ సంస్థ. 16 ఏళ్ల ముస్లిమ్ అమ్మాయి కమాలా ఖాన్ అనే పాత్ర ఆధారంగా ‘మిస్ మార్వెల్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం షారుక్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఆడిషన్స్‌కు హాజరయ్యారని తెలిసింది. మరి.. ‘మిస్ మార్వెల్’గా నటించబోయే ఆ సూపర్ ఉమెన్ ఎవరో నవంబర్ 12న ప్రకటించనుంది మార్వెల్ సంస్థ. -
సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే!
షారుఖ్ ఖాన్ గారాలాపట్టి సుహాన్ ఖాన్ బాలీవుడ్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? ఆమెను ఎప్పుడు వెండితెర మీద చూద్దామా? అని సుహానా ఫ్యాన్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఆమె బాలీవుడ్‌లోకి ఎంటరవ్వడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల లండన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సుహానా ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. మరోవైపు సుహానా బాల్య స్నేహితురాలు అనన్య పాండే ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేశారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా ‘జూమ్’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన బెస్టీ సుహానా ఖాన్ ఎప్పుడు సినిమాలోకి రాబోతుందో తెలిపారు. చదువులో భాగంగా న్యూయార్క్‌లో ఫిలిం స్కూల్‌కు వెళ్లబోతున్న సుహనా తన చదువు పూర్తికాగానే సినిమాల్లోకి వచ్చే అవకాశముందని, చదువు పూర్తయిన తర్వాత తనకు ఎప్పుడు ఇష్టమైతే.. అప్పుడు సుహానా సినిమాల్లోకి వస్తారని తెలిపారు. సుహానా ఎంతో టాలెంటెడ్ అని అంతకుముందు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పొగడ్తల వర్షం కురిపించారు. ‘స్కూల్లో నేను, సుహానా ఎన్నో ఆటలు ఆడేవాళ్లం. తను చాలా మంచి నటి. తన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా. తను చాలా మంచిది. నేను తనకేమీ టిప్స్ ఇవ్వను. నిజానికి తన నుంచి నేను టిప్స్ తీసుకుంటాను’ అని అనన్య వివరించారు. -
‘స్కూల్ ముగిసింది.. నేర్చుకోవడం కాదు’
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. అసలే సుహానా ఖాన్ ఈ మధ్య నెట్టింట్లో హీట్ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ కిడ్‌గా నటనలో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తన చదువు పూర్తయ్యాకే.. సినిమాల్లో నటిస్తుందని బాద్షా తేల్చి చెప్పేశాడు. అయితే తన కూతురి చదువు పూర్తయిందని అసలు ప్రపంచంలోకి ఇప్పుడే అడుగు పెట్టిందని, ముగిసింది స్కూలే.. నేర్చుకోవడం కాదంటూ సుహానాకు సలహాలు ఇస్తున్నాడు షారుఖ్. ‘నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆర్డింగ్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. చివరి పిజ్జా.. చివరి రైలు ప్రయాణం.. నిజమైన ప్రపంచంలోకి తొలి అడుగు పడింది ఇప్పుడే. ముగిసింది స్కూలే.. నేర్చుకోవడం కాదు’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ మధ్య వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సుహానా ఫొటో సెషన్లో పాల్గొంది. అప్పట్లో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 4 yrs have flown by. Graduating from Ardingly. Last pizza...last train ride...and first step into the real world...school ends...learning doesn’t. pic.twitter.com/hKHPIj0ffe — Shah Rukh Khan (@iamsrk) June 28, 2019 -
అదిరే స్టెప్పులతో దుమ్మురేపిన సుహానా
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేయకపోయినా.. తన స్టైలిష్ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు. తాజాగా సుహానా అదిరే స్టెప్పులు వేసిన షార్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్ నటించిన ‘ద ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్’ థీమ్ సాంగ్‌కు షారుఖ్ తనయ స్టైలిష్‌గా స్టెప్పులు వేశారు. త్వరలోనే హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాలనుకుంటున్న ఈ స్టార్ కిండ్ ప్రస్తుతం సుహానా ఇంగ్లండ్‌లో చదువుతున్నారు. చదువు ముగిసిన తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేసే అవకాశముంది. -
ఎంట్రీకి ముందే షారుఖ్ తనయ హల్చల్!
షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ (18) బాలీవుడ్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుహానా ఖాన్ని బాలీవుడ్‌కు పరిచయం చేయడానికి సంజయ్‌లీలా బన్సాలీ నుంచి కరణ్ జోహార్ వరకు ఆసక్తిని కనబరుస్తున్నారని సమాచారం. ఇటీవలే ఓ ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజీపై మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు ఇటలీలోని వెనిస్ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. రేపనేది లేదన్నట్టుగా ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. తన స్నేహితురాలితో కలిసి పడవలో ప్రయాణిస్తూ సుహానా ఫోటోలకు పోజిచ్చారు. కాఫీ బార్, షాపింగ్స్, పడవ ప్రయాణంలో సందడి చేస్తూ తన టీనేజీ హుషారును కుర్రకారుకు పరిచయం చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ కిడ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన టూ పీస్ బికినీ ఫొటోపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఇంట్లో బానే ఉంది. కానీ బయటే కొంచెం కష్టంగా ఉంది. ప్రజలు ఏదైనా నిర్ణయిస్తామనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ దోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్ నుంచి లీకయ్యాయి. చాలా మంది వాటి గురించి మాట్లాడుతున్నారు. విమర్శించే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఈ విమర్శలతో నేను బాధపడటం లేదని మనస్పూర్తిగా చెప్పలేకపోతున్నా. ఇది చాలా బాధను కలిగిస్తోంది. విమర్శించే వారికి నేనో పెద్ద సమస్యగా మారాను’ అని సుహాన తనపై వచ్చిన విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
కొంచెం కష్టంగా ఉంది: షారుఖ్ కూతురు
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గారాల పట్టీ సుహానా ఖాన్(18) సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సుహానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో టూ పీస్ బికినీ ఫోటోను అప్లోడ్ చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ పిక్ హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్ కూడా ఉండటంతో ఆమెపై పలువురు ఘాటుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా సుహానా ఓ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఇంట్లో బానే ఉంది. కానీ బయటే కొంచెం కష్టంగా ఉంది. ప్రజలు ఏదైనా నిర్ణయిస్తామనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ దోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్ నుంచి లీకయ్యాయి. చాలా మంది వాటి గురించి మాట్లాడుతున్నారు. వారికేం తెలియకున్నా.. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శించే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఈ విమర్శలతో నేను బాధపడటం లేదు అని మనస్పూర్తిగా చెప్పలేకపోతున్నా. ఇది చాలా బాధను కలిగిస్తోంది. విమర్శించే వారికి నేనో పెద్ద సమస్యగా మారాను’ అని సుహాన ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: సుహానా..‘నీకసలు సిగ్గుందా?’ -
అందుకే గౌరీని పెళ్లాడాను : హీరో
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు షారుఖ్ చాలా ఓపికగా సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘మీరెందుకు సార్ అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు’ అంటూ అభిమాని ప్రశ్నించగా.. ‘భాయ్.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా వస్తాయి. అయితే నా విషయంలో ఈ రెండు గౌరీ రూపంలో ఒకేసారి వచ్చేశాయి’ అంటూ తాను అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పారు. షారుఖ్ సమాధానానికి ఫిదా అయిన నెటిజన్లు.. ‘కింగ్ ఆఫ్ రొమాన్స్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని, గౌరీపై తనకు ఉన్న ప్రేమని ఎంత హృద్యంగా చెప్పారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీవీ షోలు చేస్తున్న సమయంలోనే షారుఖ్ ఖాన్ గౌరీని ప్రేమించారు. సినిమాల్లో అంతగా గుర్తింపు పొందకముందే 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ జంటగా పేరొందిన వీరికి ఆర్యన్, సుహానా, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. -
‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుటుంబం ప్రస్తుతం సెలవుల్లో భాగంగా యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు షారుఖ్ పిల్లలు. ట్రిప్‌లో భాగంగా నేపుల్స్ చేరుకున్న సందర్భంగా షారుఖ్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ తన చిన్నారి సోదరుడు అబ్రామ్తో కలిసి దిగిన ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అబ్రామ్మై చెయ్యి వేసి నిల్చున్న ఫొటోను పోస్ట్ చేసిన ఆర్యన్... ‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనికి స్పందించిన నెటిజన్లు ‘ఒక పెద్దన్న ఎలా ఉంటారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. మీ సోదరులిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చెల్లెలు సుహానా ఖాన్‌తో పోలిస్తే సోషల్ మీడియాలో ఆర్యన్ కాస్త అరుదుగానే ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్లోడ్ చేసిన ప్రతిసారీ తండ్రి లాగే చమత్కారంతో కూడిన కామెంట్లతో ఆకట్టుకుంటాడు. గతంలో అబ్రామ్ను తలకిందులుగా వేలాడదీస్తూ పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్ చేసిన ఆర్యన్.. ‘హ్యాంగింగ్ ఔట్ విత్ బ్రదర్’ అంటూ చమత్కరించాడు. Nobody lays a hand on my brother. A post shared by Aryan Khan (@___aryan___) on Jul 6, 2018 at 9:49am PDT Hanging out with the brother A post shared by Aryan Khan (@___aryan___) on Feb 5, 2017 at 3:47am PST -
‘నీకసలు సిగ్గుందా?’
మతపరమైన అంశాల విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాసరే సెలబ్రిటీలను ఏకీపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్(18) మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసి విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్ కూడా ఉండటంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘నువ్వొక ముస్లింవి అన్న విషయం మరిచిపోకు. సిగ్గు లేదా?.. చెండాలం.. నీ ప్రైవసీ నీది కావొచ్చు, కానీ, ఇలాంటి ఫోటోలు దేశమంతా చూస్తుందన్న విషయం మరిచిపోకు. నువ్వు సంప్రదాయాలను కూడా పాటిస్తే మంచిది... మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ, గలీజు పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదేం కొత్త కాకపోవటంతో సుహానా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది. గతంలో మెహరీన్ ఖాన్, సానియా మీర్జా, హీనా ఖాన్ తదితరులు ఇలా ట్రోలింగ్‌ను ఎదుర్కున్న వాళ్లే... My hotty babeis 🔥❤ A post shared by suhana khan (@suhanakha2) on Jul 4, 2018 at 5:53am PDT -
బాద్షా కూతురి ఫోటో..నెటిజన్లు ఫిదా
బాలీవుడ్ బాద్షా షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్, భార్య గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కూతురితో కలిసి లండన్‌లో దిగిన ఫోటోలను గౌరీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జీన్స్, టీ షర్ట్స్‌లో గౌరీ, సిల్వర్ కలర్ డ్రెస్‌లో సుహానా ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. లండన్‌లోని ప్రముఖ కాలేజీలో చదువుతోన్న సుహానా తల్లితో కలిసి లండల్లో ఎంజాయ్ చేస్తోంది. కాలేజీ చివరిరోజులు కావడంతో లండన్ మొత్తం చుట్టేస్తోంది. కాగా గౌరీ పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది.సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందని తెలుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుక్ తనయ ఫొటోలు ఎప్పుడూ సోషల్‌మీడియాలో కనిపించినా వైరల్ అవుతూ ఉంటాయి. -
మరోసారి తండ్రి కాబోతున్న హీరో..!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానుల చిలిపి ప్రశ్నలకు షారుఖ్ ఇచ్చే సమాధానాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షారుఖ్.. తనకు ఆకాంక్ష అనే పేరు అంటే ఎంతో ఇష్టమని.. ఒకవేళ తాను మళ్లీ తండ్రి అయ్యే అవకాశం వస్తే పుట్టే బిడ్డకు ఆ పేరే పెడతానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ట్విటర్లో స్పందించిన ఓ అభిమాని.. ‘ ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. మీరు నాలుగోసారి తండ్రి కాబోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరబోతుందంటూ’ క్రేజీ కామెంట్ చేశాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన షారుఖ్.. ‘ఓ మై గాడ్.. ఓ మై గాడ్..! ఒకవేళ నీ కల నిజమైతే అబ్రాం దుస్తులు ఇప్పటి నుంచే దాచి పెట్టాలి. భవిష్యత్తులో పనికొస్తాయి కదా’ అంటూ చిలిపిగా సమాధానమిచ్చారు. కాగా షారుఖ్- గౌరీ ఖాన్ దంపతులకు ఆర్యన్, సుహాన, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే. OMG OMG I JUST REMEMBERED I HAD THIS DREAM WHERE YOU WERE EXPECTING YOUR 4TH CHILD IT WAS SO CRAZYY AND SWETTTT #AskSRK — RAAZ SRK❤️ (@RazJabra) June 6, 2018 OMG OMG!! Better save AbRam’s clothes just for in case your dream comes true..kaam aa jayenge https://t.co/alixtVHmV6 — Shah Rukh Khan (@iamsrk) June 6, 2018 -
యువ క్రికెటర్‌తో సుహానా ఖాన్ ప్రేమాయణం?
సినీ తారలు, క్రికెటర్ల సంబంధాలు సర్వ సాధారణమే. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన వారు ఉన్నారు. తాజాగా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలానే మరో జంట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాద్షా, కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుబ్మాన్ గిల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్ యువ ఆటగాడు గిల్‌తో సుహానా ముచ్చటించడం అందరి ఆకర్షించింది. ప్రస్తుతం వీరు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. సుహానా ఇటీవలే తన 18వ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. -
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా స్టార్ హీరో కూతురు!
కోల్‌కతా : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 11లో శుభారంభం చేసింది. అయితే ఆదివారం రాత్రి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సుహానా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సుహానా ఎవరంటారా.. కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ముద్దుల తనయ. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు వచ్చి షారుక్ చిన్న కుమారుడు అబ్రామ్ మైదానంలో సందడి చేశాడు. ఈసారి బుడ్డోడు అబ్రామ్, సుహానాఖాన్లతో తండ్రి షారుక్ స్డేడియానికి వచ్చి మ్యాచ్ ఆస్వాదించారు. అసలే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుందన్న ఊహాగానాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో సుహానా బెంగళూరుతో కేకేఆర్ మ్యాచ్ చూసేందుకు వచ్చి అట్రాక్షన్‌గా నిలిచారు. తొలుత కేకేఆర్ ఆటగాళ్లు బౌలింగ్‌లో వికెట్లు తీస్తుంటే సంతోషించిన సుహానా తండ్రి షారుక్‌తో కలిసి తమ జట్టుకు మద్దతు తెలిపింది. ఆపై ఛేజింగ్ సమయంలో తమ బ్యాట్స్‌మెన్ ఔటయిన సందర్భాల్లో ఆశ్చర్య పోతున్నట్లు, విచారం వ్యక్తం చేస్తున్నట్లు కనిపించి తన హావభావాలతో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించిన సుహానా తండ్రి షారుక్‌తో కలిసి వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదించారు. త్వరలోనే సుహానాను వెండితెరపై చూస్తామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
స్విమ్‌సూట్‌లో సుహానా.. వైరల్
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్.. సోషల్ మీడియాలో మరోసారి హల్చల్ చేస్తోంది. స్విమ్‌సూట్‌లో ఉన్న సుహానా ఖాన్ తాజా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘ఫ్యూచర్ బాలీవుడ్’ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఓ గుర్తుతెలియని ఐడీ ఈ ఫొటోలను పోస్టు చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో సుహానా తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు, ఓ వీడియోను ఈ పేజీ షేర్చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వెంటనే వైరల్‌గా మారిపోయాయి. సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందని తెలుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుక్ తనయ ఫొటోలు ఎప్పుడూ సోషల్‌మీడియాలో కనిపించినా వైరల్ అవుతూ ఉంటాయి. -
సుహానా.. అదిరెన్!
ముంబై : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్.. సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్న సుహానా.. ఒక పెళ్లిలో సందడి చేసిన ఫొటోలు.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికితే చాలు షారుఖ్ ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు. భార్య గౌరి, కుమార్తె సుహానా, కొడుకు రేహాన్లతో ఫారిన్ టూర్‌కు చెక్కేస్తారు. సుహానా సరిగ్గా తండ్రినే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్య సుహానా.. బంధువుల పెళ్లికి హాజరయింది. ఈ పెళ్లిలో అందరితో బాగా కలిసిపోయింది. బంధువులు, స్నేహితులతోనూ సరదాగా గడిపేసింది. అన్నట్లుగా ఇక్కడ కూడా సుహానా.. తన డ్రెస్సింగ్‌తో అదరహో అనిపించింది. #captionthis A post shared by Suhana Khan (@suhanakhan8) on Dec 30, 2017 at 11:03am PST #newbeginnings #mehendinight A post shared by Suhana Khan (@suhanakhan8) on Jan 2, 2018 at 9:40am PST Suhana Khan looking so Gorgeous & Vibrant in our white floral overlay lehenga with pretty flower jewelry to complete the look...😍🏵🏵. . . . #seemakhan #suhanakhan #floral #princess #lehengacholi #overlay #cutwork #fashionista #indianwedding #outfitinspiration #shopseemakhan #bandra190 Watsapp 9870030555 Call us 022 64543666 Email us shopseemakhan@gmail.com A post shared by Seema Khan (@seemakhan76) on Jan 2, 2018 at 10:38pm PST #wedding #lehenga #suhanakhan A post shared by Suhana Khan (@suhanakhan8) on Dec 30, 2017 at 10:59am PST #wedding #friends❤ #goodnight🌙 A post shared by Suhana Khan (@suhanakhan8) on Dec 30, 2017 at 11:00am PST -
ఈ స్టార్ కిడ్ దారెటు..?
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ స్టార్ కిడ్‌గా అందరి చూపునూ తనవైపు తిప్పుకొంటోంది. పార్టీల్లో తరచూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే సుహానా ఇటీవల ఓ ఫ్యామిలీ వెడ్డింగ్లోనూ ఆకట్టుకుంది. వివాహ వేడుకలో మెరిసిన సుహానా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నాయి. సోహైల్ ఖాన్ భార్య, డిజైనర్ సీమా ఖాన్ సుహానా ఫోటోలను షేర్ చేశారు.ఇక ఈ ఏడాది జాన్వి కపూర్, ఇషాన్ కటర్, సారా అలీ ఖాన్ వంటి పలువురు స్టార్ కిడ్స్ ఆన్‌స్ర్కీన్ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో సుహానా సైతం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే సందేహాలు వెంటాడుతున్నాయి. -
బాద్షా వారసురాలు రెడీ!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ అంటే అభిమానులు పడి చస్తారు. సంవత్సరాలుగా సూపర్‌స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఆయన కొత్తతరం సినిమాకు, ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కు ఒక కొత్త కళను తీసుకొచ్చారు. ఇప్పటికీ షారూక్ హవా అలా కొనసాగుతూనే ఉంటే, ఆయన వారసులు కూడా త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్. రేపో, మాపో హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తాడని కూడా అంటున్నారు. ఆర్యన్‌తో పాటు షారూక్ కూతురు సుహానా ఖాన్ కూడా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. కొద్దికాలంగా సుహానా ఫోటోషూట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆమెకూ క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా షారూక్ భార్య గౌరీఖాన్.. సుహానా ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు..’’ అంటూ ఒక పార్టీకి హాజరైన కూతురు ఫొటోను పోస్ట్ చేసింది గౌరి. ఈ ఫొటోలో ట్రెండీ లుక్‌లో, స్టైలిష్‌గా, బాలీవుడ్ హీరోయిన్ లెవెల్లో పోజులిచ్చింది సుహానా! పక్కాగా ఫ్యూచర్లో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ సుహానాకు ఉన్నాయని అభిమానులు ఆమెకు ఫిదా అయిపోయారు. షారూక్ ఖాన్ మాత్రం పిల్లల చదువంతా అయ్యాకే సినిమాలు అన్నారట. అదే విధంగా ఆయన పిల్లలు షారూక్ బ్రాండ్‌కు దూరంగా తమదైన మార్క్ చూపించాలన్న ఆలోచనతో యాక్టింగ్ షారూక్ దగ్గర కాకుండా బయటే నేర్చుకుంటున్నారట! మరి ఈ సూపర్‌స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చే టైమ్‌కి బాలీవుడ్ ఎలా ఉంటుందో కానీ అభిమానులైతే ఇప్పట్నుంచే ఎదురుచూడడం మొదలుపెట్టేశారు!! -
అదిరె.. అదిరె స్టైల్!
బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ, అటు మీడియాలోనూ వారికి ఫుల్ పాపులారిటీ ఉంది. వారు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ ఫాలో కావడంలో ముందుంటారు. కెమెరా కంట ఎప్పుడు కనపడినా.. తమ స్టైలిష్ లుక్‌తో అబ్బో అనిపిస్తున్నారు. అలా ఈ నలుగురు సుందరాంగులు తాజాగా కెమెరా కంటికి చిక్కారు. వారి స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్ వేయండి. బ్లాక్ డ్రెస్‌లో.. కింగ్ ఖాన్ షారుఖ్ గారాలపట్టి సుహానా ఖాన్. ఇటీవల తల్లి గౌరీఖాన్‌తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో తళుక్కుమంది ఈ సుందరాంగి. బ్లాక్ అసిమెట్రిక్ టాప్, హాట్ప్యాంట్స్ ధరించి.. నడుముకు గోల్డ్లేస్ విస్ట్బ్యాండ్తో ఫ్యాబులస్ లుక్‌తో సుహానా అదరగొట్టింది. ఆహా.. అనన్య..! నటుడు చుంకీ పాండ్యా తనయ అనన్య పాండ్యా గురించి తెలియనివారుండరు. సుహానా ఖాన్ బెస్టీ అయిన అనన్య ఇటీవల తన కజిన్ బర్త్‌డేలో అదిరె లుక్‌తో కనిపించింది. మెటాలిక్ షేడ్ స్లిప్ డ్రెస్‌తో అందరి లుక్స్‌ను తనవైపునకు తిప్పుకుంది. అబ్బో.. అలన్నా..! అనన్య పాండే చిట్టిచెల్లెలు అలన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. మోనిషా జైసింగ్ డిజైన్ చేసిన డ్రెస్‌లో ఈ అమ్మడు అదరగొట్టింది. స్టైలిష్ జాన్వీ..! జాన్వీ ఆ పేరు వింటేనే కుర్రకారు పడిచస్తారు.. ఆమె అందానికి ఫిదా అవుతారు. అతిలోక సుందరి శ్రీదేవి గారాల తనయ అయిన జాన్వీ ఇటీవల జిమ్ సెషన్‌ను ముగించుకొని.. అదిరే స్టైలిష్ డ్రెస్‌లో ఇలా దర్శనమిచ్చింది. -
ఆమె వేసుకున్న షూస్ ఖరీదు ఎంతో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సరా అలీఖాన్ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్ గర్ల్స్ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా.. లెటెస్ట్ స్టైల్ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం తీసిపోదు. తాజాగా ఈ టీనేజ్ బ్యూటీ దీపావళి సందర్భంగా ముంబైలో సందడి చేసింది. తన స్నేహితులు ఆహనా పాండే, షనాయ కపూర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది. ప్లెయిన్ వైట్ స్లీవ్‌లెస్ టీ, రిపెడ్ జీన్స్ వేసుకున్న ఈ అమ్మడు చూపరుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సుహానా వేసుకున్న స్నీకర్స్ (షూస్) అందరి దృష్టి ఆకర్షించాయి. గ్యిసెప్ జానొట్టి కంపెనీకి చెందిన 'జెన్నిఫర్' వెడ్జ్ స్నీకర్స్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల 995 డాలర్లు. అంటే రూ. 64వేలు అన్నమాట. ఈ మొత్తం డబ్బుంటే ఒకసారి హాయిగా థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిరావొచ్చు. -
స్విమ్మింగ్‌పూల్‌లో సుహానా.. వైరల్
ముంబై : త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్న సుహాన ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురైన సుహానా ఫొటో ఒకటి కొద్ది గంటలుగా వైరల్ అయింది. స్విమ్మింగ్‌పూల్‌లో నిలబడి చక్కటి పోజిచ్చిన ఫొటోకు ‘యు ఆర్ మై సన్‌షైన్.. మై ఓన్లీ సన్ షైన్’ వ్యాఖ్యను జోడించారు. ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోన్న సుహానా.. సినిమాల్లోకి రానుందని, ఆమె అరంగేట్రం సినిమా కోసం ప్రేమకథలు వింటున్నానని షారూఖ్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే ల్యాక్మే ఫ్యాషన్ షో లోనూ పాల్గొన్న సుహానా ఫ్యాషన్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఒకవైపు కూతురి కోసం కథలు వింటూనే, ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు షారూఖ్. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో బాద్షాకు జోడీగా అనుష్క శర్మ నటిస్తున్నారు. -
న్యూ ఇయర్ పార్టీతో దుమ్మురేపిన స్టార్ కిడ్స్!
ముంబై: కింగ్ ఖాన్ షారుఖ్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో రోజురోజుకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతోంది. తన తండ్రి 51వ జన్మదిన వేడుకల్లో రెడ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించి.. మీడియా దృష్టిని ఆకర్షించిన ఈ టీనేజర్ తాజాగా నూతన సంవత్సర వేడుకలతో దుమ్మురేపింది. తన గ్యాంగ్‌ను వేసుకొని ముంబై సబర్బన్‌లోని ఓ హాట్‌స్పాట్‌లో న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేసింది. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు పలువురు పాల్గొన్నారు. భవిష్యత్తులో బాలీవుడ్ తెరపై కనిపించే అవకాశమున్న స్టార్ కిడ్స్ అంతా ఇలా న్యూఇయర్ ఎంజాయ్ చేయడమే కాకుండా ఆహార్ పాండే జన్మదిన వేడుకల్ని కూడా నిర్వహించారు. ఈ పార్టీకి బ్లాక్ డ్రెస్‌తో అటెండ్ అయిన సుహానా ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వీరి పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.