
ముంబై : త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్న సుహాన ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురైన సుహానా ఫొటో ఒకటి కొద్ది గంటలుగా వైరల్ అయింది. స్విమ్మింగ్‌పూల్‌లో నిలబడి చక్కటి పోజిచ్చిన ఫొటోకు ‘యు ఆర్ మై సన్‌షైన్.. మై ఓన్లీ సన్ షైన్’ వ్యాఖ్యను జోడించారు.
ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోన్న సుహానా.. సినిమాల్లోకి రానుందని, ఆమె అరంగేట్రం సినిమా కోసం ప్రేమకథలు వింటున్నానని షారూఖ్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే ల్యాక్మే ఫ్యాషన్ షో లోనూ పాల్గొన్న సుహానా ఫ్యాషన్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు.
ఒకవైపు కూతురి కోసం కథలు వింటూనే, ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు షారూఖ్. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో బాద్‌షాకు జోడీగా అనుష్క శర్మ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment