మరోసారి తండ్రి కాబోతున్న హీరో..! | Shahrukh Khan Hint About Having Fourth Child | Sakshi
Sakshi News home page

మరోసారి తండ్రి కాబోతున్న షారుఖ్‌..!

Published Thu, Jun 7 2018 5:03 PM | Last Updated on Thu, Jun 7 2018 8:18 PM

Shahrukh Khan Hint About Having Fourth Child - Sakshi

కుమారుడు అబ్‌రాంతో షారుఖ్‌ ఖాన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానుల చిలిపి ప్రశ్నలకు షారుఖ్‌ ఇచ్చే సమాధానాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షారుఖ్‌.. తనకు ఆకాంక్ష అనే పేరు అంటే ఎంతో ఇష్టమని.. ఒకవేళ తాను మళ్లీ తండ్రి అయ్యే అవకాశం వస్తే పుట్టే బిడ్డకు ఆ పేరే పెడతానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించిన ఓ అభిమాని.. ‘ ఓ మై గాడ్‌.. ఓ మై గాడ్‌.. మీరు నాలుగోసారి తండ్రి కాబోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరబోతుందంటూ’  క్రేజీ కామెంట్‌ చేశాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన షారుఖ్‌.. ‘ఓ మై గాడ్‌.. ఓ మై గాడ్..! ఒకవేళ నీ కల నిజమైతే అబ్‌రాం దుస్తులు ఇప్పటి నుంచే దాచి పెట్టాలి. భవిష్యత్తులో పనికొస్తాయి కదా’  అంటూ చిలిపిగా సమాధానమిచ్చారు. కాగా షారుఖ్‌- గౌరీ ఖాన్‌ దంపతులకు ఆర్యన్‌, సుహాన, అబ్‌రాం అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement