AbRam Khan
-
గర్వంగా ఫీల్ అవుతున్నా: షారూఖ్
ముంబై : పిల్లలు చేసే చిన్న చిన్న పనులే తల్లిదండ్రులకు కొత్త అనుభూతినిస్తాయి. వాళ్ల చిట్టి చేతులతో ఏం చేసినా మురిసిపోతుంటారు. అయితే సెలబ్రిటీలు వారి బిజీ షెడ్యూల్లో పడి పిల్లలను ఏం పట్టించుకుంటారులెండి అని అనుకోకండి. ఎంత సంపాదించినా పిల్లలకు మించిన ఆస్తి మరొకటి లేదనుకుని బతికేవారు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. కాగా షారుక్ కొడుకు అబ్రామ్, కరీనా- సైఫ్ కొడుకు తైమూర్, ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్.. వీళ్లకు ఇప్పటికే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న వయస్సులోనే సెలబ్రిటీలుగా మారి అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా షారుక్ తన గారాల కొడుకు అబ్రామ్ చేసిన ఓ పనికి తెగ సంబరపడిపోతున్నాడు. అబ్రామ్, పప్పా అని రాసి ఇద్దరి బొమ్మలను గీయగా దీన్ని షారుక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఓ తండ్రిగా నాకు గర్వంగా ఉందంటూ అబ్రామ్ డ్రాయింగ్‌ను ప్రశంసించాడు. నేను గర్వంగా ఫీల్ అవడానికి నా కొడుకు ఓ కారణం. తన వినయం, ప్రేరణ, విజయం నాకు ఎన్నో నేర్పాయి. డ్రాయింగ్‌లో నేను ఏ కారణం లేకుండా నవ్వుతున్నానంటా. అందుకే నా కొడుకు కంటే నేను బాగా కనిపిస్తున్నానని అబ్రామ్ చెప్పాడు’ అని పేర్కొన్నాడు. ఇక కింగ్‌ఖాన్ షారుక్ తన కొడుకును ప్రశంసించడం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే తన పెద్ద కొడుకు ఆర్యన్, కూతురు సుహానా సాధించిన విజయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవవల టైక్వాండో టోర్నమెంట్లో సాధించిన బంగారు పథకాన్ని కూడా అభిమానులతో పంచుకున్నాడు. (చదవండి: ఆయన మొదటి జీతం ఎంతో తెలుసా!) Being a father (3x) has been, my greatest source of pride, humility, inspiration & even achievement. It has taught me to choose innocent honesty over smarts....in every aspect of life. My lil one told me I look better than him in his drawing cos I am smiling without a reason.... pic.twitter.com/PJu3zRhDAP — Shah Rukh Khan (@iamsrk) March 2, 2020 -
ఇక చాలు.. అడ్డు తప్పుకోండి!
బీ టౌన్ స్టార్ కిడ్స్ అబ్రామ్ ఖాన్, తైమూర్ అలీఖాన్, ఆరాధ్య బచ్చన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అందుకే ఈ చోటా సెలబ్రిటీలు కనబడగానే క్షణం ఆలస్యం చేయకుండా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరా కన్నును క్లిక్‌మనిపిస్తారు. ఇక పేరెంట్స్‌తో కలిసి బుల్లి స్టార్స్ కనబడితే పండుగ చేసుకునే పాపరాజీలు వివిధ భంగిమల్లో వారిని ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ తతంగమంతా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్- గౌరీఖాన్‌ల ముద్దుల తనయుడు అబ్రామ్ ఖాన్(6)కు విసుగు తెప్పించింది. తమ కారు వెళ్లకుండా అడ్డుకుంటూ.. తనపై ఫ్లాష్ల వర్షం కురిపిస్తున్న ఫొటోగ్రాఫర్లపై అబ్రాం అసహనం వ్యక్తం చేశాడు. కారుకు అడ్డుతప్పుకోవాలని చేతులతో సైగలు చేస్తూ.. తన ముఖాన్ని దాచుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘చిన్నారిని తన బాల్యం ఎంజాయ్ చేయనివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రా- నటి రాణీ ముఖర్జీల గారాలపట్టి ఆదిరా పుట్టినరోజు సందర్భంగా.. పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో అబ్రాం ఇలా అసహానికి లోనయ్యాడు. ఈ పార్టీలో అబ్రాంతో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు కూడా సందడి చేశారు. ఇక అబ్రాం ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లకు చిక్కకుండా తన బొమ్మను అడ్డుపెట్టుకున్నాడు. అదే విధంగా మరో ఈవెంట్లో సైతం తన ఫొటోలు తీయొద్దంటూ కెమెరామెన్లను హెచ్చరించాడు. View this post on Instagram #AbramKhan #shahrukhkhan #ranimukerji #Srk #srkabram #Shahrukh A post shared by Entertainment Fan Page (@facc2911) on Dec 12, 2019 at 11:05am PST -
‘ఈ ఇడియట్‌ని ఫాలో అవ్వకండి’
‘విగ్రహారాధన పాపమని నీకు తెలీదా... నువ్వసలు ముస్లింవేనా? ఆ అల్లా నిన్ను క్షమించడు. విగ్రహ పూజ చేసి నువ్వు పాపాత్ముడివయ్యావు. ఇంకా ముస్లింగానే ఉన్నావా లేదా హిందూ మతం స్వీకరించావా. ఈ ఇడియట్‌ని ఎవరూ ఫాలో అవ్వకండి’ అంటూ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ వాళ్లకి అంతగా కోపం తెచ్చేలా షారుఖ్ ఏం చేశాడంటే.. దేశమంతా బొజ్జ గణపయ్య వేడుకల్లో మునిగిపోయిన వేళ తన ఇంట్లో కూడా గణేశుని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా తన చిన్న కుమారుడు అబ్రాం గణేశుడికి దండం పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ మా ఇంట్లో గణపతి ‘పప్పా’ నా చిన్నారి ఆ దేవుడిని ఇలాగే పిలుస్తాడంటూ’ క్యాప్షన్ జతచేశాడు. దీంతో కొందరు ముస్లిం నెటిజన్లు షారుఖ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. View this post on Instagram Our Ganpati ‘Pappa’ is home, as the lil one calls him. A post shared by Shah Rukh Khan (@iamsrk) on Sep 16, 2018 at 7:12am PDT -
కొంచెం కష్టంగా ఉంది: షారుఖ్ కూతురు
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గారాల పట్టీ సుహానా ఖాన్(18) సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సుహానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో టూ పీస్ బికినీ ఫోటోను అప్లోడ్ చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ పిక్ హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్ కూడా ఉండటంతో ఆమెపై పలువురు ఘాటుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా సుహానా ఓ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఇంట్లో బానే ఉంది. కానీ బయటే కొంచెం కష్టంగా ఉంది. ప్రజలు ఏదైనా నిర్ణయిస్తామనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ దోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా ప్రయివేట్ ఇన్స్టాగ్రామ్ నుంచి లీకయ్యాయి. చాలా మంది వాటి గురించి మాట్లాడుతున్నారు. వారికేం తెలియకున్నా.. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శించే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఈ విమర్శలతో నేను బాధపడటం లేదు అని మనస్పూర్తిగా చెప్పలేకపోతున్నా. ఇది చాలా బాధను కలిగిస్తోంది. విమర్శించే వారికి నేనో పెద్ద సమస్యగా మారాను’ అని సుహాన ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: సుహానా..‘నీకసలు సిగ్గుందా?’ -
అందుకే గౌరీని పెళ్లాడాను : హీరో
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు షారుఖ్ చాలా ఓపికగా సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘మీరెందుకు సార్ అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు’ అంటూ అభిమాని ప్రశ్నించగా.. ‘భాయ్.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా వస్తాయి. అయితే నా విషయంలో ఈ రెండు గౌరీ రూపంలో ఒకేసారి వచ్చేశాయి’ అంటూ తాను అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పారు. షారుఖ్ సమాధానానికి ఫిదా అయిన నెటిజన్లు.. ‘కింగ్ ఆఫ్ రొమాన్స్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని, గౌరీపై తనకు ఉన్న ప్రేమని ఎంత హృద్యంగా చెప్పారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీవీ షోలు చేస్తున్న సమయంలోనే షారుఖ్ ఖాన్ గౌరీని ప్రేమించారు. సినిమాల్లో అంతగా గుర్తింపు పొందకముందే 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ జంటగా పేరొందిన వీరికి ఆర్యన్, సుహానా, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. -
‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుటుంబం ప్రస్తుతం సెలవుల్లో భాగంగా యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు షారుఖ్ పిల్లలు. ట్రిప్‌లో భాగంగా నేపుల్స్ చేరుకున్న సందర్భంగా షారుఖ్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ తన చిన్నారి సోదరుడు అబ్రామ్తో కలిసి దిగిన ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అబ్రామ్మై చెయ్యి వేసి నిల్చున్న ఫొటోను పోస్ట్ చేసిన ఆర్యన్... ‘నా తమ్ముడిపై ఎవరూ చెయ్యి వేయలేరు’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనికి స్పందించిన నెటిజన్లు ‘ఒక పెద్దన్న ఎలా ఉంటారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. మీ సోదరులిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చెల్లెలు సుహానా ఖాన్‌తో పోలిస్తే సోషల్ మీడియాలో ఆర్యన్ కాస్త అరుదుగానే ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్లోడ్ చేసిన ప్రతిసారీ తండ్రి లాగే చమత్కారంతో కూడిన కామెంట్లతో ఆకట్టుకుంటాడు. గతంలో అబ్రామ్ను తలకిందులుగా వేలాడదీస్తూ పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్ చేసిన ఆర్యన్.. ‘హ్యాంగింగ్ ఔట్ విత్ బ్రదర్’ అంటూ చమత్కరించాడు. Nobody lays a hand on my brother. A post shared by Aryan Khan (@___aryan___) on Jul 6, 2018 at 9:49am PDT Hanging out with the brother A post shared by Aryan Khan (@___aryan___) on Feb 5, 2017 at 3:47am PST -
‘నీకసలు సిగ్గుందా?’
మతపరమైన అంశాల విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాసరే సెలబ్రిటీలను ఏకీపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్(18) మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసి విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్ కూడా ఉండటంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘నువ్వొక ముస్లింవి అన్న విషయం మరిచిపోకు. సిగ్గు లేదా?.. చెండాలం.. నీ ప్రైవసీ నీది కావొచ్చు, కానీ, ఇలాంటి ఫోటోలు దేశమంతా చూస్తుందన్న విషయం మరిచిపోకు. నువ్వు సంప్రదాయాలను కూడా పాటిస్తే మంచిది... మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ, గలీజు పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదేం కొత్త కాకపోవటంతో సుహానా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది. గతంలో మెహరీన్ ఖాన్, సానియా మీర్జా, హీనా ఖాన్ తదితరులు ఇలా ట్రోలింగ్‌ను ఎదుర్కున్న వాళ్లే... My hotty babeis 🔥❤ A post shared by suhana khan (@suhanakha2) on Jul 4, 2018 at 5:53am PDT -
మరోసారి తండ్రి కాబోతున్న హీరో..!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో సరదాగా ముచ్చటించడమంటే మహా సరదా. అలాగే అభిమానుల చిలిపి ప్రశ్నలకు షారుఖ్ ఇచ్చే సమాధానాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షారుఖ్.. తనకు ఆకాంక్ష అనే పేరు అంటే ఎంతో ఇష్టమని.. ఒకవేళ తాను మళ్లీ తండ్రి అయ్యే అవకాశం వస్తే పుట్టే బిడ్డకు ఆ పేరే పెడతానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ట్విటర్లో స్పందించిన ఓ అభిమాని.. ‘ ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. మీరు నాలుగోసారి తండ్రి కాబోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరబోతుందంటూ’ క్రేజీ కామెంట్ చేశాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన షారుఖ్.. ‘ఓ మై గాడ్.. ఓ మై గాడ్..! ఒకవేళ నీ కల నిజమైతే అబ్రాం దుస్తులు ఇప్పటి నుంచే దాచి పెట్టాలి. భవిష్యత్తులో పనికొస్తాయి కదా’ అంటూ చిలిపిగా సమాధానమిచ్చారు. కాగా షారుఖ్- గౌరీ ఖాన్ దంపతులకు ఆర్యన్, సుహాన, అబ్రాం అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే. OMG OMG I JUST REMEMBERED I HAD THIS DREAM WHERE YOU WERE EXPECTING YOUR 4TH CHILD IT WAS SO CRAZYY AND SWETTTT #AskSRK — RAAZ SRK❤️ (@RazJabra) June 6, 2018 OMG OMG!! Better save AbRam’s clothes just for in case your dream comes true..kaam aa jayenge https://t.co/alixtVHmV6 — Shah Rukh Khan (@iamsrk) June 6, 2018 -
ఈడెన్ గార్డెన్స్ లో అరుదైన సీన్!
కోల్ కతా: కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం రాత్రి ఓ ఆసక్తికర సీన్ కనిపించింది. బాలీవుడ్ బాద్షా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ట యజమాని షారుక్ ఖాన్, తన చిన్న కుమారుడు అబ్ రామ్ తో కలిసి స్టేడియంలో కాసేపు సందడిచేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపు ముందు స్టేడియంలోని ప్రేక్షకుల చూపు ఈ తండ్రీకొడుకుల పైనే నిలిపారు. ముఖ్యంగా కోల్ కతా జెర్సీ వేసుకుని మైదానంలోకి అబ్ రామ్ రాగానే స్టేడియం హోరెత్తిపోయింది. స్డేడియంలోని బిగ్ స్క్రీన్ పై అబ్ రామ్ కనిపించినప్పుడల్లా ఈ చిన్నారి పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు మైదానంలో చేసిన సందడి ఇప్పుడు వీడియో రూపంలో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా అబ్ రామ్ అంటూ ట్వీట్ చేశాడు షారుక్. షారుక్, అబ్ రామ్ ఆడిన వాటర్ గేమ్ ను అందరూ ఆసక్తిగా చూశారు. తాగడానికి అబ్ రామ్ కు షారుక్ ఓ నీళ్ల బాటిల్ ఇస్తాడు. కొన్ని నీళ్లు తాగి, మరికొన్ని నీళ్లు నోట్లో ఉంచుకుని తండ్రి వద్దకు వచ్చి అబ్ రామ్ బయటకు ఊదుతాడు. ఆ వెంటనే షారుక్ కూడా చిన్న పిల్లాడిగాగా కొడుకు చేసిన పనే చేస్తాడు. ఈ సీన్ చూస్తున్న స్టేడియంలోని అభిమానులు విజిల్స్, పెద్ద పెద్ద అరుపులతో వీరిని ఎంకరేజ్ చేశారు. షారుక్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే తమ చేష్టలతో స్టేడియాన్ని హోరెత్తించి ఈ ఆటకు షారుక్, చిచ్చర పిడుగు అబ్ రామ్ మరింత ఊపు తీసుకువచ్చారు. పంజాబ్ పై కోల్ కతా విజయం సాధించిన విషయం తెలిసిందే. Thank u. And yes lil man of the match is our AbRam https://t.co/kvBSogW3xy — Shah Rukh Khan (@iamsrk) 4 May 2016