
‘విగ్రహారాధన పాపమని నీకు తెలీదా... నువ్వసలు ముస్లింవేనా? ఆ అల్లా నిన్ను క్షమించడు. విగ్రహ పూజ చేసి నువ్వు పాపాత్ముడివయ్యావు. ఇంకా ముస్లింగానే ఉన్నావా లేదా హిందూ మతం స్వీకరించావా. ఈ ఇడియట్‌ని ఎవరూ ఫాలో అవ్వకండి’ అంటూ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇంతకీ వాళ్లకి అంతగా కోపం తెచ్చేలా షారుఖ్ ఏం చేశాడంటే.. దేశమంతా బొజ్జ గణపయ్య వేడుకల్లో మునిగిపోయిన వేళ తన ఇంట్లో కూడా గణేశుని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా తన చిన్న కుమారుడు అబ్‌రాం గణేశుడికి దండం పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ మా ఇంట్లో గణపతి ‘పప్పా’ నా చిన్నారి ఆ దేవుడిని ఇలాగే పిలుస్తాడంటూ’ క్యాప్షన్ జతచేశాడు. దీంతో కొందరు ముస్లిం నెటిజన్లు షారుఖ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment