ఈడెన్ గార్డెన్స్ లో అరుదైన సీన్! | AbRam and Sharukh khan water spitting game at IPL in Kolkata | Sakshi
Sakshi News home page

ఈడెన్ గార్డెన్స్ లో అరుదైన సీన్!

Published Thu, May 5 2016 11:34 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఈడెన్ గార్డెన్స్ లో అరుదైన సీన్! - Sakshi

ఈడెన్ గార్డెన్స్ లో అరుదైన సీన్!

కోల్ కతా: కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం రాత్రి ఓ ఆసక్తికర సీన్ కనిపించింది. బాలీవుడ్ బాద్షా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ట యజమాని షారుక్ ఖాన్, తన చిన్న కుమారుడు అబ్ రామ్ తో కలిసి స్టేడియంలో కాసేపు సందడిచేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపు ముందు స్టేడియంలోని ప్రేక్షకుల చూపు ఈ తండ్రీకొడుకుల పైనే నిలిపారు. ముఖ్యంగా కోల్ కతా జెర్సీ వేసుకుని మైదానంలోకి అబ్ రామ్ రాగానే స్టేడియం హోరెత్తిపోయింది. స్డేడియంలోని బిగ్ స్క్రీన్ పై అబ్ రామ్ కనిపించినప్పుడల్లా ఈ చిన్నారి పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు మైదానంలో చేసిన సందడి ఇప్పుడు వీడియో రూపంలో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా అబ్ రామ్ అంటూ ట్వీట్ చేశాడు షారుక్.

షారుక్, అబ్ రామ్ ఆడిన వాటర్ గేమ్ ను అందరూ ఆసక్తిగా చూశారు. తాగడానికి అబ్ రామ్ కు షారుక్ ఓ నీళ్ల బాటిల్ ఇస్తాడు. కొన్ని నీళ్లు తాగి, మరికొన్ని నీళ్లు నోట్లో ఉంచుకుని తండ్రి వద్దకు వచ్చి అబ్ రామ్ బయటకు ఊదుతాడు. ఆ వెంటనే షారుక్ కూడా చిన్న పిల్లాడిగాగా కొడుకు చేసిన పనే చేస్తాడు. ఈ సీన్ చూస్తున్న స్టేడియంలోని అభిమానులు విజిల్స్, పెద్ద పెద్ద అరుపులతో వీరిని ఎంకరేజ్ చేశారు. షారుక్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే తమ చేష్టలతో స్టేడియాన్ని హోరెత్తించి ఈ ఆటకు షారుక్, చిచ్చర పిడుగు అబ్ రామ్ మరింత ఊపు తీసుకువచ్చారు. పంజాబ్ పై కోల్ కతా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement