Eden Garden
-
వరల్డ్ కప్‌లో మరో మ్యాచ్ తేదీ మార్పు.. ఇది కూడా పాక్ మ్యాచే..!
వన్డే వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్ తేదీ మార్పు జరుగనుందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దేవీ నవరాత్రుల ప్రారంభ తేదీ (అక్టోబర్ 15) కావడంతో భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్డ్ తేదీ కంటే ఒక రోజు ముందే జరుగుతుందన్న ప్రచారం నడుస్తుండగానే.. నవంబర్ 12న జరగాల్సిన పాకిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు ఉంటుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. పాక్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు వేదిక అయిన కోల్‌కతాలో నవంబర్ 12న కాళీ పూజ ఘనంగా జరుగనుండటంతో, ఆ రోజు పాక్ మ్యాచ్ నిర్వహిస్తే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు (క్యాబ్) లేఖ రాసారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశాన్ని క్యాబ్ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ కొట్టిపారేయడం విశేషం. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో స్నేహశిష్ మాట్లాడుతూ.. కోల్‌కతా పోలీసుల నుంచి తమకు ఎలాంటి లేఖ రాలేదని చెప్పారు. ఒక వేళ ఇలాంటిది ఏమైనా ఉంటే పరిశీలిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) (ఈ మ్యాచ్ ఒక రోజు ముందే జరగవచ్చు) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వబోయే మ్యాచ్‌లు ఇవే.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2 -
ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం అందింది. లైవ్ మ్యాచ్ చూస్తూనే ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహించినట్లు తేలింది. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్క్వాడ్(ఏఆర్ఎస్) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురు బిహార్‌కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికెత్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ ఐదుగురు స్టేడియంలోని ఎఫ్-1 బ్లాక్‌లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్‌లో మునిగిపోయారు. అనుమానం వచ్చి తోటి ప్రేక్షకులు స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్ వారిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ కోల్‌కతాలోని న్యూ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ రూటర్ చార్జర్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం -
వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!
ఐపీఎల్ 2022 సీజన్లో లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఇవాళ(మే 24న) క్వాలిఫయర్-1 జరగనుంది. కోల్‌కతా వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. గత నాలుగు రోజులుగా కోల్‌కతా నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా వర్షం పడే చాన్స్ ఉండడంతో మ్యాచ్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరగనున్న ఈడెన్ గార్డెన్స్‌లో ఆధునాతన డ్రైనేజీ సౌకర్యం ఉన్నప్పటికి.. మ్యాచ్ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడితే ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నప్పటికి సాయంత్రం వర్షం పడే అవకాశాలు 65 శాతం ఉన్నాయని.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి రెండు గంటల పాటు కుండపోత వర్షం పడే చాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇదే నిజమైతే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారి మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారుతుంది. సమయం లేకపోవడంతో క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే కూడా కేటాయించలేదు. దీంతో మ్యాచ్ రద్దు అయితే ఫైనల్ ఎవరు వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది. వర్షం ముప్పుతో ఆటకు అంతరాయం ఏర్పడితే మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. ఎవరికి ఫైనల్ అవకాశాలు ఉంటాయి అనేది పరిశీలిద్దాం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్లే ఆఫ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. ఏ జట్టు ఫైనల్‌కు వెళ్లాలనే దానిపై మూడు దారులు ఉన్నాయి. ►మొదటిది.. ఇరుజట్ల మధ్య ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు చేరుకుంటారు. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్ ద్వారా మరో చాన్స్ ఉంటుంది. ►రెండోది.. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసి.. ఆ తర్వాత మ్యాచ్‌కు అవకాశం ఉంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేలుస్తారు. ►భారీ వర్షం వల్ల సూపర్ ఓవర్ కూడా సాధ్యపడకపోతే లీగ్‌లో అత్యధిక విజయాలు సాధించి గ్రూఫ్ టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఇదే జరిగితే గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు.. రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు సిద్ధమవుతుంది. ►ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ వర్షం అంతరాయం కలిగిస్తే ఇదే పద్దతిని అనుసరిస్తారు. కాకపోతే ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తే.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. వర్షం వల్ల సూపర్ ఓవర్ సాధ్యపడకపోతే.. మూడో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరిన లక్నో సూపర్ జెయింట్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. చదవండి: IND Vs SA T20 Series: ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత? IPL 2022: ప్లేఆఫ్స్‌లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను: జోస్ బట్లర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తుఫాను దాటికి ఈడెన్ గార్డెన్స్ కుదేలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లేమో అక్కడే!
కోల్‌కతా నగరాన్ని తుఫాన్ ముంచెత్తింది. శనివారం రాత్రి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కుదేలైంది. 90 కిమీ వేగంతో వీసిన ఈదురుగాలుల దాటికి స్టేడియంలోకి ప్రెస్‌బాక్స్ అద్దాలు, పలు హోర్డింగ్స్, మైదానంలో కప్పి ఉంచిన టార్ఫులిన్ కవర్ ధ్వంసమయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షించిన స్టేడియం అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా కోల్‌కతా వేదికగానే ఐపీఎలో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 24న) గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తొలి క్వాలిఫయర్.. మే 25న(బుధవారం) ఆర్సీబీ, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్నాయి. కాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధికారులతో కలిసి ఈడెన్ గార్డెన్‌ను పరిశీలించారు. ''మ్యాచ్‌లకు మరో రెండురోజులు సమయం ఉంది. అప్పటివరకు స్టేడియాన్ని రెడీ చేస్తాం. ప్రెస్ బాక్స్‌లో పగిలిన అద్దాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వర్షం లేదు.. మాములుగానే ఉంది. మైదానంలోని టార్ఫులిన్ కవర్‌ను తొలగించి డ్రెయిన్ సిస్టం ఆన్‌చేశాం. పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో ఉంది'' అని క్యాబ్ అధికారులు తెలిపారు. కాగా వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్ విమానం కాస్త ఆలస్యంగా కోల్‌కతాకు చేరుకుంది. వాస్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో కోల్‌కతాకు రావాల్సిన విమానం.. భారీ వర్షం కారణంగా ఆటగాళ్లు ప్రయాణించిన విమానం బంగ్లాదేశ్ ఎయిర్‌స్పేస్‌లో ల్యాండ్ అయింది. వర్షం ఆగిపోయాకా రెండు గంటల ఆలస్యంగా.. అంటే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చచేరుకుంది. ఆటగాళ్లను బస్‌లో సురక్షితంగా హోటల్ రూంకు తరలించారు. ఇక క్వాలిఫయర్ -2 సహా ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. చదవండి: Jasprit Bumrah: ఐపీఎల్లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్ Eden Gardens damaged after a thunderstorm #Kolkata #Edengardens pic.twitter.com/I2cXOXsCbS — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
పింక్ హుషార్
భారత్‌లో జరిగే తొలి డేనైట్ టెస్టుకు ముందు జరుగుతోన్న పింక్ సందడి అంతాఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఈడెన్ గార్డెన్స్ వేదికనే గులాబీ రేకులతో పరిచేసినట్టుగా ఉందీమాయ. ఇది కొత్తేమీ కాదు. ఈపాటికే ప్రపంచం (మిగతా జట్లు) ఆడిన ఆటే! అయితే అప్పుడు చడీచప్పుడులేదు. కానీ ఇప్పుడు... భారత్ ఆడుతోందంటే మాత్రం ప్రపంచమే ఆడినంత సంబరంగా ఉంది. మన జాతీయ పతాకం మువ్వన్నెలతో మురిసిపోయినట్లుగా మన టెస్టు గులాబీ వన్నెలద్దుకుంటున్న వేళ వచ్చేసింది. భారత్ ‘పింక్’ హుషార్లో ఉంది. క్రికెట్ అభిమానులంతా డే నైట్ టెస్టుపై ఎనలేని ఆసక్తి పెంచుకున్నారు. ఈ మ్యాచ్ ఆడే క్రికెటర్లే కాదు మాజీలు, దిగ్గజాలు సైతం పింక్ బాల్ టెస్టుపైనే చర్చించుకుంటున్నారు. వ్యాఖ్యాతలు కూడా ఈ మ్యాచ్ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక భారత గడ్డపై కొంగొత్త ఆటకు వేదికైన కోల్‌కతా మాత్రం గులాబీమయమైంది. ఈడెన్ గార్డెన్స్ పింక్ షో చూపించేందుకు కొత్త సొబగులు అద్దుకుంది. రహానే కళ్లలో గులాబీ కలలే.. భారత్‌లో చారిత్రక డేనైట్ టెస్టుపై కలలు కంటున్నానని వైస్ కెప్టెన్ రహానే చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి అతను జత చేసిన ఫొటో తెగ వైరల్ అయ్యింది. లైక్‌ల మీద లైక్‌లు పోటెత్తుతున్నాయి. తన తలగడ వద్ద గులాబీ బంతిని పెట్టుకొని నిద్రిస్తున్న ఫొటోను ట్విట్టర్లో పెట్టిన రహానే ‘ఇప్పటికే ఆ టెస్టు కలల్లో మునిగిపోయాను’ అని ట్వీట్ చేశాడు. ఇది ఆ టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య ను అమాంతం పెంచేసింది. సోషల్ మీడి యాలో ‘పింక్’ ఫీవర్ ఎక్కించిన రహానేను భారత కెప్టెన్ కోహ్లి అనుసరించాడు. ‘నైస్ పోజ్ జింక్స్’ అంటూ ట్వీటాడు. కలల్లో మునిగిపోయిన ఫొటో తనకు బాగా నచ్చిందంటూ స్పందించాడు. అతనికి ఓపెనర్ ధావన్ కూడా జత కలిశాడు. ‘ఆ కలలోనే ఫొటో దిగావా ఏంటీ’ అని పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. పింక్ టీ షర్ట్లతో స్వాగతం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో భారత ఆటగాళ్ల కోసం ఆతృతగా ఎదురుచూసిన అభిమానులు పింక్ టీ షర్ట్లతో స్వాగతం పలికారు. దీంతో ఎయిర్పోర్ట్ గులాబీ టీషర్ట్‌లతో సందడి సందడిగా మారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే విమానంలో వచ్చారు. మంగళవారం భారత కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానే ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇలాంటి వాతావరణం ఎదురైంది. ఆటగాళ్లంతా అక్కడి నుంచి బస చేసే హోటల్ గదులకు వెళ్లిపోయారు. భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బంగ్లా కోచ్ రసెల్ డొమింగోలు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను పరిశీలించేందుకు వెళ్తారని బోర్డు మీడియా మేనేజర్ వెల్లడించారు. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, పేసర్లు షమీ, ఉమేశ్‌లు బుధవారం జట్టుతో కలుస్తారని ఆయన తెలిపారు. మంగళవారం ఆటగాళ్లెవరూ ప్రాక్టీస్ చేయలేదు. హోటల్ గదులకే పరిమితమయ్యారు. సౌకర్యాలు మెరుగుపరిస్తే... భారత్‌లో టెస్టు క్రికెట్ బతికేందుకు కొత్త తరహా డే నైట్ టెస్టులతో పాటు మైదానానికి వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతో ఉందని దిగ్గజ బ్యాట్స్‌మన్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ‘ఏదో పింక్ బాల్ టెస్టుతో జనం ఎగబడతారనుకుంటే పొరపాటు. వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, మంచి సీట్లు, కార్లకు పార్కింగ్ లాంటి అవసరాల్ని తీర్చాలి. అలాగే కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను అమలు చేయాలి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో టెస్టులను ఆదరించేందుకు ఎన్నో కారణాలున్నాయి. బాక్సింగ్ డే టెస్టు, కచ్చితంగా జూలైలో లార్డ్స్ టెస్టు ఇలాంటివన్నీ పక్కా ప్రణాళికతో జరిగేవి. అందుకే యాషెస్ సిరీస్ ఇప్పటికీ ప్రభ కోల్పోకుండా విరాజిల్లుతోంది. భారత్‌లో కూడా కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను జతచేస్తే ప్రయోజనం ఉంటుంది’ అని ద్రవిడ్ వివరించాడు. ఒకప్పుడు ఈడెన్‌లో లక్ష మంది మ్యాచ్ చూసేవారని ఇప్పుడా పరిస్థితి లేదన్నాడు. అలాగే డిజిటల్ మీడియా, హెచ్డీ టీవీల రాకతో మైదానానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పాడు. పింక్ బాల్‌కు వారం పడుతుంది పింక్ బాల్ తయారయ్యేందుకు ఏడెనిమిది రోజుల సమయం పడుతుంది. దీని కోసం ప్రత్యేకించి గులాబీ రంగు వేసిన లెదర్‌ను వినియోగిస్తారు. ఇది హార్డ్‌గా మారకుండా సాఫ్ట్‌గా ఉండేలా చూస్తారు. రెండు సగం కప్పులు తయారయ్యాక దాన్ని ఒక గోళాకారంగా చేతితో కుట్లు వేస్తారు. అనంతరం మళ్లీ గులాబీ రంగు వేస్తారు. ఇది రివర్స్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని, షమీ లాంటి బౌలర్‌కు ఆయుధంగా మారుతుందని భారత వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా... చారిత్రక డేనైట్ టెస్టు చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. ఐదు రోజుల మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల టికెట్లన్నీ అయిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. పింక్ బాల్ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారని చెప్పారు. ‘నాలుగు రోజుల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ స్థాయిలో విక్రయం జరగడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. 67 వేల సీట్ల సామర్థ్యమున్న ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 22 నుంచి డేనైట్ టెస్టు జరుగుతుంది -
తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కు అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్లో నవంబర్ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. తొలి డే అండ్ నైట్ మ్యాచ్‌కు రావాల్సిందిగా.. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) ప్రధాని మోదీని, అమిత్ షాను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి షా సానుకూలంగా స్పందించారని.. తొలి డే అండ్ టెస్ట్ మ్యాచ్‌కు హాజరవుతారని క్యాబ్ కార్యదర్శి అవిషేక్ దాల్మియా తెలిపారు. కాగా ఈడెన్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనాతో పాటు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్తో పాటు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని కూడా హాజరుకానున్నారు. కాగా కోల్‌కతా టెస్టు సందర్భంగా షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ పీవీ సింధు తదితర ఒలింపియన్లను ఘనంగా సన్మానించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇదివరకే వెల్లడించాడు. -
‘మంచు’ లేకుంటే బాగుంటుంది!
ముంబై: భారత్‌లో తొలి సారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలన్న బీసీసీఐ ఆలోచనను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు. అయితే కోల్‌కతాలో సాయంత్రం వేళ మంచు ప్రభావం లేకపోతేనే టెస్టు విజయవంతం అవుతుందని అతను అభిప్రాయ పడ్డాడు. ‘మంచు వల్ల ఒక్కసారి బంతి తడిగా మారిపోతే పేసర్లు ఏమీ చేయలేరు. స్పిన్నర్ల పరిస్థితి అలాగే ఉంటుంది. బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతే బౌలర్లకు పరీక్ష ఎదురవుతుంది. వాతావరణ పరిస్థితులు మ్యాచ్ గతిని మార్చరాదు. భారత క్రికెటర్లు ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. గతంలో పింక్ బాల్‌తో ఆడిన సహచరుల అనుభవాలను తెలుసుకుంటే మంచిది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. -
ఇంటిపై ఈడెన్
హైదరాబాద్ వంటి మహానగరాలలో ఇంటి చుట్టూ తోట ఉన్న ఇల్లు అద్దెకు దొరకడం అసాధ్యమే. మరి మొక్కలను పెంచుకోవాలనే కోరిక ఎలా నెరవేరుతుంది? బాల్కనీలో కుండీలు, టెర్రస్ మీద కుండీలతో తృప్తి పడొచ్చు. అంతేకాదు, ఇంటివారు అనుమతిస్తే వంటకు కావలసిన కూరగాయలు కూడా పండించుకోవచ్చు.అందుకు టెర్రస్ గార్డెనింగ్ ఒక మంచి మార్గంఅని చెబుతున్నారు సుజనీరెడ్డి. ‘‘తోటలో పని చేస్తూంటే మనసుకు ప్రశాంతంగా అనిపించి, భూమి మీద స్వర్గసౌఖ్యాలు అనుభవించినట్లు అనిపిస్తుంది’’ అంటారు సుజనీరెడ్డి. హైదరాబాద్‌లోని వెంగళ్రావు నగర్లో ఉంటున్న ఈ మైక్రోబయాలజిస్టు, ఎప్పుడో ఏవో జరుగుతాయి అని కూర్చోవడం కంటే, ఏదో ఒక పని చేస్తూ ఉండటానికి ఇష్టపడతారు. తన అద్దె ఇంటి కప్పు మీదే ఒక స్వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ‘ఈడెన్ గార్డెన్’ లో కేవలం అందమైన మొక్కలు పెంచడం మాత్రమే కాదు, నిత్యం వండుకోవడానికి వీలుగా కూరగాయలు పండిస్తున్నారు. పళ్లు, రంగురంగుల కూరగాయలు, అనేక రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం 300 చదరపు అడుగుల ప్రదేశంలోనే! రైతుల సలహా తీసుకున్నారు ‘‘చిన్నప్పుడే మా బాల్కనీలో చిన్న చిన్న మొక్కలు పెంచేదాన్ని. బయట గార్డెన్లు చూడటానికి వెళ్లేదాన్ని. ప్రకృతికి దగ్గరగా ఉంటుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అభిరుచుల కారణంగానే చదువులో కూడా నా దృష్టి సైన్స్ మీదకు మళ్లింది’’ అంటారు సుజనీరెడ్డి. నాలుగు సంవత్సరాల క్రితం కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సుజనీ ఆ ఇంటి టెర్రస్‌ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. తాజాగా పండిన కూరగాయలతో మాత్రమే వంట చేయాలని సంకల్పించి విషతుల్యం కాని ఆహారం పండించడానికి కావలసిన సమాచార సేకరణ కోసం ఎందరో రైతులను కలిశారు. వారి సలహాలు తీసుకున్నారు. రెండొందల రకాల మొక్కలు! సుజనీ‘టెర్రస్ గార్డెనింగ్’కి సంబంధించిన వర్క్‌షాపులకు కూడా హాజరయ్యారు. వాటికి సంబంధించిన అనేక పుస్తకాలను చదివారు. ఆ అనుభవంతో టెర్రస్ గార్డెన్ ప్రారంభించారు. ఈ గార్డెన్ కోసం ఆమె తన ఇంట్లోని పాత పాత్రలను కుండీలుగా మార్చారు. ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ వంటి పాదులు పెంచారు. మట్టి బాగా గట్టిగా ఉండి, వేళ్లు బాగా లోపలకు చొచ్చుకుని పోలేక, మొక్కలు బాగా ఎదగలేకపోయాయి. కాని ఆమె తన ప్రయత్నం విరమించుకోలేదు. సేంద్రియ విధానంలో మొక్కలు పెంచుతున్న స్నేహితులతో మాట్లాడి, వారి నుంచి సమాచారం సేకరించారు. తెలగపిండి, వేప పిండి వంటివి వేయడం వల్ల మట్టి బాగా గుల్లగా అయ్యి, మొక్కలు పెరుగుతాయని తెలుసుకున్నారు. 40 శాతం మట్టి, 40 శాతం వెర్మి కంపోస్టు, 10 శాతం కొబ్బరి పీచు, 10 శాతం వేప పిండి వంటివి ఉపయోగించి మొక్కలు పెంచడం ప్రారంభించారు. రెండో సంవత్సరానికల్లా దిగుబడి అధికమైంది.ఇప్పుడు అదే మూడొందల చదరపు అడుగుల స్థలంలో సుజనీ 200 రకాలకు పైగా మొక్కలు పెంచుతున్నారు. వంటకు సరిపడేలా కూరలు చక్కగా పండుతున్నాయి. రకరకాల టొమాటోలు, పచ్చి మిర్చితో పాటు, చైనీస్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, ముల్లంగి, వెల్లుల్లి, ఉల్లి, బీన్స్, గ్రీన్ క్యాప్సికమ్... ఎన్నో కూరలు పండించుకుంటున్నారు. ఇంకా సొర, పొట్ల, బీర, కాకర, బూడిద గుమ్మడి, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటివి కూడా పండిస్తున్నారు. జామ, దానిమ్మ, పుచ్చకాయలు కూడా పండిస్తున్నారు. సహజ ఎరువులతో పాటు, సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నారు. వేసవికాలంలో ఎండ బారిన పడకుండా, వలను ఉపయోగిస్తున్నారు. మొక్కలకు చీడ పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాగా చీడ పడితే, వేప నూనెను పదిరోజులకొకసారి స్ప్రే చేస్తున్నారు. పులిసిన మజ్జిగలో నీళ్లు బాగా కలిపి, ఆ మజ్జిగను స్ప్రే చేయడం ద్వారా మొక్కలకు ఫంగల్ వ్యాధులు రాకుండా నివారిస్తున్నారు. సొంతంగా ఎరువుల తయారీ సుజనీ బి.ఎస్.సి. మైక్రోబయాలజీ చదివారు. ఎం.ఎస్.సి కెమిస్ట్రీలో చేరారు. కానీ కొనసాగించలేకపోయారు. పెళ్లి, పిల్లలతో మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. ‘‘మా పూర్వీకులందరూ వ్యవసాయం చేశారు. బహుశా వారి నుంచే మొక్కల మీద మమకారం వచ్చి ఉంటుంది. పెళ్లయినప్పటి నుంచి ఆర్గానిక్ వస్తువులే వాడటం మొదలుపెట్టాను. రసాయనాలు ఉపయోగించిన ఆహారానికి వీలైనంతవరకు దూరంగా ఉండాలన్నదే నా ధ్యేయం. నాలుగేళ్లుగా ఒక్కొక్క మొక్క పెంచుకుంటూ పెద్ద గార్డెన్ తయారు చేశాను. కూరగాయలు పెంచడం ప్రారంభించాను. మొక్కలకు వేయడానికి అనువుగా తెలగపిండి, కొబ్బరి పిండి, చెరకు పిప్పి వంటి వాటితో ఎరువులు చేస్తున్నాను. అన్నిరకాల ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నాను. ఉల్లిపాయలు, బంగాళ దుంపలు వంటివి మాత్రమే పండించట్లేదు. నీటి ఎద్దడి ఉన్నా కూడా ఎంతో జాగ్రత్తగా మొక్కలకు నీళ్లు పోస్తున్నాను’’ అని చెప్పారు సుజనీ. అందుకే ఈ గృహిణిని ఆదర్శ రైతు అని కూడా అనాలి. – వైజయంతి పురాణపండ ఫొటోలు : నోముల రాజేశ్‌రెడ్డి ఎండ.. మట్టి.. నీళ్లు చిన్న చిన్న బాల్కనీలు ఉంటే అక్కడ కనీసం నాలుగు కుండీలు పెట్టి, నాలుగు రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఆకులను తుంపుకుంటే, మళ్లీ చిగుళ్లు వస్తాయి. ఏదైనా మనం ప్రారంభించాలనుకుంటే, ఉత్సాహం అదే వస్తుంది. ఎండ మట్టి నీళ్లు మూడు ప్రధానం. ఇవి సరిగా చూసుకుంటే చాలు. విదేశాలలో ఇళ్లలోనే మొక్కలు పెంచుకుంటున్నారు. మనకు కావలసినంత ఎండ అందుబాటులో ఉన్నప్పుడు ఆ ఎండను వాడుకుని ఇంటి బయట మొక్కలు పెంచుకోవచ్చు కదా. కంటికి ఆనందం, ఒంటికి ఆరోగ్యం, ఇంటికి అలంకారంగా ఉంటాయి మొక్కలు. మొక్కలూ నా పిల్లలే ఇంట్లో పాత చెక్క పెట్టెలు, గ్రో బ్యాగ్స్, వాటర్ క్యాన్లలో పండిస్తున్నాను. పులిసిన పెరుగును మిక్సీ పట్టి, 1:10 నిష్పత్తిలో నీళ్లు కలిపి మొక్కల మీద వచ్చిన ఫంగస్, తెగుళ్ల మీద పిచికారీ చేస్తే, తెగుళ్లన్నీ పోతాయి. ఇది అందరూ అనుసరిస్తున్న పద్ధతే. మార్కెట్లో దొరికే వేపపిండిని కూడా కీటకనాశినిగా వాడుతున్నాను. ప్రతిరోజూ ఒక గంట సేపు మొక్కలతో గడుపుతాను. నేనే స్వయంగా మొక్కలకు నీళ్లు పోస్తాను. ఆ సమయంలోనే మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుగు ఎక్కడ కనపడినా వెంటనే వాటిని చంపేసి, మొక్కలను రక్షించుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప (13), ఒక బాబు (10). వీరితో పాటు మొక్కలన్నీ నా సంతానమే. ఈ ఏడాది సొరకాయలు పెద్ద సైజులో విస్తృతంగా పండాయి. నా ఆనందం ఇంతా అంతా అని చెప్పలేను. -
ప్రత్యర్థి హేళన.. ద్రావిడ్ సమాధానం ఎలాగంటే...
సాక్షి, స్పోర్ట్స్ : అది 2001 ఈడెన్ గార్డెన్ మైదానం. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. భారత్ కేవలం 171 రన్స్‌కే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. ఆటగాళ్ల పేలమైన ఫామ్.. పైగా 274 పరుగులతో వెనుకబడి ఉంది. మ్యాచ్ పోయినట్లేనని అంతా నిరుత్సాహాంలో ఉన్నారు. కానీ, లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్.. ఆపై బంతితో హర్భజన్ సింగ్ చేసిన మ్యాజిక్ భారత్ ను విజయతీరాలకు చేర్చింది. అనూహ్యమైన ఆ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతంగా క్రికెట్ పండితులు అభివర్ణిస్తుంటారు. ఇక మ్యాచ్‌లో ద్రావిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటగాళ్లంతా పెవిలియన్ కు క్యూ కట్టిన క్రమంలో ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ద్రావిడ్ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో మరీ దారుణమైన ప్రదర్శన ఆయన ఇచ్చారు. అందుకే ఆయన్ని ఆరోస్థానంలో బరిలోకి పంపారు. అప్పుడు ఆసీస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ వా స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఏం ద్రావిడ్.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానం.. తర్వాత ఏంటి? 12వ స్థానమా? అంటూ హేళన చేశాడు. కానీ, ద్రావిడ్ మాత్రం అవేం పట్టనట్లు క్రీజులోకి వెళ్లిపోయాడు. లక్ష్మణ్ కు జత కలిసిన ద్రావిడ్.. ఆట స్వరూపమే మారిపోయింది. బౌలర్లు ఎందరు మారుతున్నా... చెమట చిందించినా లాభం లేకపోయింది. ద్రావిడ్-లక్ష్మణ్ ద్వయం చితకబాదుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఇద్దరూ ఓ ఆటాడేసుకున్నారు. వీరోచిత బ్యాటింగ్ కారణంగా 376 పరుగుల భాగస్వామ్యంతో భారత్ 657 పరుగులు చేసింది. ఆపై భజ్జీ మాయాజాలంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలటంతో 171 పరుగుల చరిత్రాత్మక విజయం సాధించింది. తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్రావిడ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ సమయంలో నా ఫామ్ నిజంగా బాగోలేదు. మైదానంలోకి వెళ్లేముందు వా మాటలు నా చెవిని తాకాయి. కానీ, నా దృష్టిని మరలించలేకపోయాయి. అప్పుడు నేను ఆలోచించింది ఒక్కటే. గతం, భవిష్యత్ రెండూ ఇప్పుడు నా చేతుల్లో లేవు. ప్రస్తుతం నా ముందు ఉన్నది ఒక్కటే. వీలైనన్నీ బంతిని ఎదుర్కోవటం... పరుగులు సాధించటం. ఈ క్రమంలో లక్ష్మణ్ తో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నా. జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చూడాలి తప్ప.. వెనకడుగు వేసేందుకు యత్నించకూడదు. ’’ అని ద్రావిడ్ సభికులను ఉద్దేశించి పేర్కొన్నారు. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ (281) చిరస్మరణీయ ఇన్నింగ్స్ గడచిన అర్ధ శతాబ్దపు అత్యుత్తమ ప్రదర్శనగా గౌరవం కూడా అందుకుంది. -
తొలి టెస్టులో శ్రీలంక ఆధిక్యం దిశగా
-
'సెంచరీ కొట్టి.. షాపింగ్ చేసేవాడు'
కోల్ కతా: ఈడెన్ గార్డెన్ లో భారత్-న్యూజిలాండ్ ల మధ్య రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత దిగ్గజ ఆటగాళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ టెస్టు మ్యాచ్ లో సెంచరీ కొట్టిన మరుసటి రోజు షాపింగ్ కు వెళ్లి తనకు ఇష్టమైన బ్రాండ్ల దుస్తులను కొనుగోలు చేసేవాడని దాదా చెప్పుకొచ్చాడు. సచిన్ కు దుస్తులపై మక్కువ ఎక్కువని తెలిపాడు. తనతో జట్టులో ఉన్న సమయంలో సచిన్ వార్డ్ రోబ్ నిండా చక్కని దుస్తులు ఉండేవని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ నిత్యం ఆలస్యంగా వచ్చేవాడని తెలిపాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో బ్యాటింగ్ కు దిగాల్సిన పరిస్ధితి ఉన్నా చివరి నిమిషంలో బస్సు వద్దుకు చేరుకునేవాడని చెప్పాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో రాహుల్ ద్రవిడ్, సచిన్, హర్భజన్, సెహ్వాగ్, కుంబ్లేలు అనుకున్న పనిని తమదైన శైలిలో పూర్తి చేసేవారని కొనియాడాడు. వారి కృషే భారతీయ క్రికెట్ ను ప్రపంచదేశాల వరుసలో అగ్రభాగాన నిలబెట్టిందని అన్నాడు. -
తొలిరోజు కలిసి రాలేదు.. బ్యాడ్ డే: రహానే
కోల్ కతా: పరుగులు చేయడానికి ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ అంత కష్టమైన పిచ్ కాదని టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే అన్నాడు. తొలిరోజు ఆట నిలిపివేసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడాడు. చతేశ్వర్ పుజారా(87)తో కలిసి విలువైన 141 పరుగుల భాగస్వామ్యం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయామని రహానే(77) అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బౌలర్ల లయ దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నించామని, అందులో భాగంగానే స్పిన్నర్ల బంతులను బ్యాక్ ఫుట్ తీసుకుని ఆడినట్లు వివరించాడు. రెండో రోజు వృద్ధిమాన్ సాహా(14), రవీంద్ర జడేజా(0) చేసే స్కోర్లు జట్టుకు ఎంతో కీలకమని, దాంతో కివీస్ పై సులువుగా ఒత్తిడి పెంచుతామన్నాడు. బ్యాట్స్ మన్ అవుట్ కావడానికి కేవలం ఒక్క బంతి చాలునని, అయితే అదే అతగాడు సెంచరీ సాధిస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నాడు. గతంలో కంటే ఈడెన్ పిచ్ భిన్నంగా ఉందని, పేస్ బౌలర్లుకు అనుకూలించిందన్నాడు. రెండో సెషన్లో ఉక్కపోత, భారీగా వేడి ఉండటంతో బ్యాట్స్ మన్ ఇబ్బందులు పడ్డారని తెలిపాడు. తొలుత మంచి బ్యాటింగ్ వికెట్ అని భావించామని, అయితే ఈ రోజు మాకు బ్యాడ్ డే అయిందన్నాడు. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసిన విషయం తెలిసిందే. -
డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ వేదిక ఖరారు
కోల్‌కతా: భారత్‌లో తొలిసారి జరిగే డే అండ్ నైట్ మ్యాచ్ వేదిక ఖారారైంది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్-భారత జట్ల మధ్య జరిగే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరిగే మూడు టెస్టు మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేశారు. డే అండ్ నైట్ మ్యాచ్‌కు కోల్ కతా ఆతిథ్యం ఇస్తుంటే, మిగతా రెండు టెస్టు మ్యాచ్‌లను ఇండోర్, కాన్సూర్లలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించింది. దీనిలోభాగంగా ఈడెన్ లో డే అండ్ నైట్ టెస్టు నిర్వహించేందుకు తాము రాసిన లేఖపై బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధికారి ఒకరు స్పష్టం చేశారు. న్యూజిలాండ్ తన భారత పర్యటనలో మూడు టెస్టు మ్యాచ్‌లతో పాటు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. రాబోవు 2016-17 వ సీజన్లో భారత్ మొత్తంగా 13 టెస్టు మ్యాచ్‌లతో పాటు, ఎనిమిది వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే అంతకుముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను డే అండ్ నైట్ నిర్వహించేందుకు ఇప్పటికే క్యాబ్ రంగం సిద్ధం చేసింది. జూన్ 17వ తేదీ నుంచి 20 వరకూ ఈ జరిగే సూపర్ లీగ్ డే అండ్ నైట్ టెస్టు ఫైనల్ ను నిర్వహించనున్నారు. డే అండ్ నైట్ టెస్టు కోసం మొదటిసారిగా ‘కూకాబుర్రా’ పింక్ బంతులను ఉపయోగించనున్నారు. -
ఈడెన్ గార్డెన్స్ లో అరుదైన సీన్!
కోల్ కతా: కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం రాత్రి ఓ ఆసక్తికర సీన్ కనిపించింది. బాలీవుడ్ బాద్షా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ట యజమాని షారుక్ ఖాన్, తన చిన్న కుమారుడు అబ్ రామ్ తో కలిసి స్టేడియంలో కాసేపు సందడిచేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపు ముందు స్టేడియంలోని ప్రేక్షకుల చూపు ఈ తండ్రీకొడుకుల పైనే నిలిపారు. ముఖ్యంగా కోల్ కతా జెర్సీ వేసుకుని మైదానంలోకి అబ్ రామ్ రాగానే స్టేడియం హోరెత్తిపోయింది. స్డేడియంలోని బిగ్ స్క్రీన్ పై అబ్ రామ్ కనిపించినప్పుడల్లా ఈ చిన్నారి పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు మైదానంలో చేసిన సందడి ఇప్పుడు వీడియో రూపంలో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా అబ్ రామ్ అంటూ ట్వీట్ చేశాడు షారుక్. షారుక్, అబ్ రామ్ ఆడిన వాటర్ గేమ్ ను అందరూ ఆసక్తిగా చూశారు. తాగడానికి అబ్ రామ్ కు షారుక్ ఓ నీళ్ల బాటిల్ ఇస్తాడు. కొన్ని నీళ్లు తాగి, మరికొన్ని నీళ్లు నోట్లో ఉంచుకుని తండ్రి వద్దకు వచ్చి అబ్ రామ్ బయటకు ఊదుతాడు. ఆ వెంటనే షారుక్ కూడా చిన్న పిల్లాడిగాగా కొడుకు చేసిన పనే చేస్తాడు. ఈ సీన్ చూస్తున్న స్టేడియంలోని అభిమానులు విజిల్స్, పెద్ద పెద్ద అరుపులతో వీరిని ఎంకరేజ్ చేశారు. షారుక్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే తమ చేష్టలతో స్టేడియాన్ని హోరెత్తించి ఈ ఆటకు షారుక్, చిచ్చర పిడుగు అబ్ రామ్ మరింత ఊపు తీసుకువచ్చారు. పంజాబ్ పై కోల్ కతా విజయం సాధించిన విషయం తెలిసిందే. Thank u. And yes lil man of the match is our AbRam https://t.co/kvBSogW3xy — Shah Rukh Khan (@iamsrk) 4 May 2016 -
టీమిండియా ప్రాక్టీస్ లో గంగూలీ
కోల్ కతా: భారత్ క్రికెట్ జట్టు శుక్రవారం ఈడెన్ గార్డెన్ ముమ్మర సాధన చేసింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణ ఆటగాళ్లు సాధన చేశారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా రేపు(శనివారం) జరిగే కీలక మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. మరోవైపు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈడెన్ గార్డెన్ లో టీమిండియా ప్రాక్టీస్ ను స్వయంగా పర్యవేక్షించాడు. ఆటగాళ్లకు సలహాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా గంగూలీని యువరాజ్ సింగ్ అప్యాయంగా హత్తుకున్నాడు. అశిష్ నెహ్రా, హర్భజన్, యువరాజ్, రవిశాస్త్రితో గంగూలీ సమాలోచనలు జరిపాడు. -
ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
-
ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
కోల్ కతా: ఐపీఎల్ 7 విజయోత్సవ వేడుకల్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఈడెన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తాజా ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ సభ్యులకు స్టేడియంకు రావడానికి ముందే అక్కడకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యే క్రమంలో పోలీసులు అభిమానులపై లాఠీఛార్జికి దిగారు. ఇందులో పలువురు అభిమానులకు తీవ్ర గాయాలైయ్యాయి. ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మాన ఏర్పాట్లు చేయడం కాస్తా వివాదాలకు దారి తీసింది. -
ఐపీఎల్-7 విజేతలకు ఘనస్వాగతం
కోల్ కతా: ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపెఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా జట్టు యజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, సహ యజమాని జూహీ చావ్లాతో పాటు బెంగాలీ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారు.