కోల్ కతా: ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఐపెఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా జట్టు యజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, సహ యజమాని జూహీ చావ్లాతో పాటు బెంగాలీ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారు.
ఐపీఎల్-7 విజేతలకు ఘనస్వాగతం
Published Tue, Jun 3 2014 3:53 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement