IPL-7
-
ఈడెన్‌లో లాఠీచార్జి
కోల్‌కతా: ఐపీఎల్-7 విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఆటగాళ్ళను అభినందించేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున అభిమానులు చొచ్చుకురావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వాస్తవానికి ఉదయం 9 గంటలనుంచే ఈడెన్‌కు అభిమానులు పోటెత్తారు. అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రాంతానికి వేలాది మంది రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్టేడియం గేట్లు మూసివేసి ఉండడంతో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. చివరికి లాఠీలకు పనిచెప్పారు. ఈఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలున్నారు. ఈ విషయంపై బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీంని మీడియా ప్రశ్నిస్తే.. స్టేడియం దగ్గర గొడవ మీకు కనిపిస్తుందేమో కానీ నాకైతే ఏమీ కనిపించడం లేదంటూ సమాధానమిచ్చారు. అయితే స్టేడియంలో ప్రవేశం ఉచితమనే భావనతో పెద్ద ఎత్తున అభిమానులు ఈడెన్‌కు చేరుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్లలో, క్యాబ్ గుర్తింపు పొందిన క్లబ్బులలో కాంప్లిమెంటరీ పాస్‌లు మంజూరు చేశారు. ఉదయం 11 గంటల నుంచి స్టేడియంలోనికి అనుమతించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం ఆలస్యంగా మొదలైంది. నాలుగు గంటల ప్రాంతంలో సీఎం వచ్చిన తర్వాత ఆమె ఆదేశాల మేరకు బయట ఉన్న అభిమానులు కూడా స్టేడియంలో లోపలికి పంపారు. -
మళ్లీ భారత జట్టులోకి వస్తా
హర్భజన్ సింగ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: ఐపీఎల్లో సత్తా చాటినప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం తనకు బాధ కలిగించిందని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. జట్టును ఎంపిక చేసిన ప్రతీసారి తనను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల తాను నిరాశకు గురికానని, మళ్లీ సత్తా చాటి భారత జట్టులో చోటు సంపాదిస్తానని చెప్పాడు. ‘భారత జట్టులోకి ఎంపిక కానప్పుడు నేను బాధపడ్డా. ఈ ఐపీఎల్లో నా ఆటతీరు ఎలా ఉందో అందరూ చూసే ఉంటారు. భారత స్పిన్నర్లలో నేనే బాగా బౌలింగ్ చేశా. జట్టులోకి ఎంపిక కాకపోయినంత మాత్రాన నేనేమీ నిరాశ చెందను. కచ్చితంగా మళ్లీ జట్టులో చోటు సంపాదిస్తా’ అని భజ్జీ అన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-7లో హర్భజన్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. నరైన్, అక్షర్ పటేల్ తర్వాత బౌలింగ్ ఎకానమీ మెరుగ్గా ఉన్న స్పిన్నర్ హర్భజనే. ఓ వైపు నరైన్, అక్షర్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో ఇబ్బంది పడితే హర్భజన్ మాత్రం మ్యాక్స్‌వెల్, గేల్ లాంటి విధ్యంసకర బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపడంలో విజయవంతమయ్యాడు. ఇక తన ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు భజ్జీ ఈ ఏడాది కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. -
ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
-
ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
కోల్ కతా: ఐపీఎల్ 7 విజయోత్సవ వేడుకల్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఈడెన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తాజా ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ సభ్యులకు స్టేడియంకు రావడానికి ముందే అక్కడకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యే క్రమంలో పోలీసులు అభిమానులపై లాఠీఛార్జికి దిగారు. ఇందులో పలువురు అభిమానులకు తీవ్ర గాయాలైయ్యాయి. ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మాన ఏర్పాట్లు చేయడం కాస్తా వివాదాలకు దారి తీసింది. -
ఐపీఎల్-7 విజేతలకు ఘనస్వాగతం
కోల్ కతా: ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపెఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా జట్టు యజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, సహ యజమాని జూహీ చావ్లాతో పాటు బెంగాలీ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారు. -
ఐపీఎల్ : ఏడెవరికో.. ఏడుపెవరికో..!
-
పంజాబ్‌దే పై చేయి
-
పంజాబ్‌దే పై చేయి
ఫైనల్లో కింగ్స్ ఎలెవన్ 24 పరుగులతో చెన్నైపై విజయం సెహ్వాగ్ సూపర్ సెంచరీ రైనా అద్భుత పోరాటం వృథా ఆదివారం కోల్‌కతాతో తుదిపోరు అద్భుతం...మహాద్భుతం...20 ఓవర్ల ఆటలో ప్రేక్షకులకు అపరిమిత ఆనందం... బ్యాట్స్‌మెన్ వీర విహారం ముందు బౌలర్లకు చుక్కలు కనిపించాయి. గెలుపోటముల తేడా 24 పరుగులే కనిపిస్తున్నా వాస్తవానికి జరిగిన పోరాటం వేరు. ఈ సీజన్‌కే ది బెస్ట్ అనదగ్గ ఆటను చూపిస్తూ ఆ రెండు జట్లు మరో సారి విధ్వంసాన్ని సృష్టించాయి. తొలుత వీర విహారంతో పంజాబ్ భారీ స్కోరు నమోదు చేస్తే, తామేమీ తక్కువ కాదంటూ చెన్నై ఆఖరి వరకూ పోరాడింది. ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడ్డ పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్ ముందు సూపర్ కింగ్స్ తలవంచింది. సెహ్వాగ్ సూపర్ సెంచరీ, రైనా అసాధారణ ఆట ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేశాయి. సీజన్ ఆసాంతం సంచలన విజయాలతో దూసుకుపోయిన బెయిలీ బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లాగే ఇదీ సంపూర్ణ వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 428 పరుగులు నమోదు కావడం విశేషం. ముంబై: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో సారి జూలు విదిల్చింది. అద్భుత ప్రదర్శనతో తొలి సారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 24 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ (58 బంతుల్లో 122; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ సెంచరీ సాధించగా, మిల్లర్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (31 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా (25 బంతుల్లో 87; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేయగలిగింది. ధోని (31 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోయింది. సెహ్వాగ్ దూకుడు... తొలి ఓవర్‌నుంచే సెహ్వాగ్, వోహ్రా జోరు ప్రదర్శించారు. చెన్నై బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో పవర్ ప్లేలో జట్టు 70 పరుగులు చేయగా...9.1 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. 21 బంతుల్లో సెహ్వాగ్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే వీరూ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. అర్ధ సెంచరీ తర్వాత అతను మరింత వేగంగా దూసుకుపోయాడు. మిల్లర్ అండగా నిలవడంతో 50 బంతుల్లో సెహ్వాగ్ ఐపీఎల్లో రెండో సెంచరీని అందుకున్నాడు. వీరూ వెనుదిరిగాక బెయిలీ (1), మిల్లర్, సాహా (6) తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. ఆకాశమే హద్దుగా... అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై రెండో బంతికే డు ప్లెసిస్ (0) వికెట్ కోల్పోయింది. అయితే ఆ ఆనందం పంజాబ్‌కు ఎంతో సేపు నిలవలేదు. సురేశ్ రైనా అత్యద్భుతమైన ఆటతో చెన్నై ఇన్నింగ్స్‌ను ఆకాశంలో నిలబెట్టాడు. మరో వైపు స్మిత్ (7) విఫలమయ్యాడు. అవానా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రైనా రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లు (ఒక నోబాల్) కొట్టాడు. ఈ ఓవర్లో ఏకంగా 33 పరుగులు వచ్చాయి. రైనా రనౌట్ అయ్యాక... జడేజా జడేజా (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) , ధోని కొద్దిసేపు పోరాడినా... పంజాబ్ పట్టు విడవలేదు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) డు ప్లెసిస్ (బి) నెహ్రా 122; వోహ్రా (సి) రైనా (బి) పాండే 34; మ్యాక్స్‌వెల్ (సి) రైనా (బి) అశ్విన్ 13; మిల్లర్ (రనౌట్) 38; బెయిలీ (బి) నెహ్రా 1; సాహా (సి) స్మిత్ (బి) మోహిత్ 6; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1-110; 2-148; 3-211; 4-218; 5-225; 6-226. బౌలింగ్: నెహ్రా 4-0-51-2; పాండే 4-0-35-1; మోహిత్ 4-0-46-1; అశ్విన్ 4-0-44-1; జడేజా 4-0-48-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) సందీప్ 7; డు ప్లెసిస్ (సి) బెయిలీ (బి) జాన్సన్ 0; రైనా (రనౌట్) 87; మెకల్లమ్ (రనౌట్) 11; జడేజా (సి) జాన్సన్ (బి) అవానా 27; డేవిడ్ హస్సీ (సి) సెహ్వాగ్ (బి) అవానా 1; ధోని (నాటౌట్) 42; అశ్విన్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ 10; మోహిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1-1; 2-67; 3-100; 4-140; 5-140; 6-142; 7-167. బౌలింగ్: జాన్సన్ 4-0-44-1; సందీప్ శర్మ 3-0-32-1; అవానా 4-0-59-2; కరణ్వీర్ 4-0-32-0; మ్యాక్స్‌వెల్ 1-0-4-0; అక్షర్ పటేల్ 4-0-23-1. టర్నింగ్ పాయింట్... పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై స్కోరు 100 పరుగులు. అందులో రైనా ఒక్కడే 87 చేశాడు. మ్యాచ్ పంజాబ్‌నుంచి చేజారుతున్నట్లే అనిపించింది. ఈ దశలో ఏడో ఓవర్ తొలి బంతిని కవర్స్ వైపు కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించిన మెకల్లమ్ కాస్త సంకోచించినా...మరో ఎండ్‌లో ఉన్న రైనా పరుగు పూర్తి చేసుకోగలననే విశ్వాసంతో మెకల్లమ్‌ను పిలిచాడు. అయితే చురుగ్గా స్పందించి బెయిలీ విసిరిన త్రో నేరుగా స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను తగిలింది. రైనా డైవ్ చేసినా లాభం లేకపోయింది. ఈ రనౌట్‌తోనే మ్యాచ్ మలుపు తిరిగింది. ఆర్యా... సంతోషమేనా! ‘ఎందుకు డాడీ.. ఊరికే అవుట్ అవుతున్నావు? మీ డాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్లో నా స్నేహితులు ఏడిపిస్తున్నారు’ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్‌కు ఫోన్ చేసిన అతని కొడుకు ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘చిన్నా బాధపడకు... కచ్చితంగా నేను భారీ స్కోరు చేస్తా’ అని సమాధానం చెప్పిన వీరూ... చెన్నైతో కీలక మ్యాచ్‌లో పెను విధ్వసం సృష్టించి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. అంతేకాదు... పంజాబ్ జట్టు ఓనర్లలో ఒకరైన నెస్ వాడియాకు మరచిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. వీరేంద్రుడి విశ్వరూపం వీరేంద్ర సెహ్వాగ్ యుద్ధం ప్రకటించాడు..! ప్రత్యర్థిగా ఉన్న చెన్నై జట్టు బౌలర్లపైనా...తనను లెక్కే చేయని ఢిల్లీ జట్టు యాజమాన్యంపైనా...మాజీ సహచరుడు గంభీర్‌కు భారత జట్టులో చోటిచ్చి తనను కనీసం పట్టించుకోని సెలక్టర్లపైనా...వీరూ వీరావేశానికి స్ఫూర్తినిచ్చిన కారణం ఏదైనా కావచ్చు. కానీ చాన్నాళ్ల తర్వాత తనలోని అసలైన ఆటను బయట పెట్టాడు. మ్యాక్స్‌వెల్, పొలార్డ్, పఠాన్, అండర్సన్‌ల మత్తులో ఉన్న ఐపీఎల్ అభిమానులకు తానేంటో మళ్లీ గుర్తు చేశాడు. తానెంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూనే వీరందరికీ విధ్వంసక ఆటలో తానే ‘బాప్’నని రుజువు చేసుకున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. తనకు అలవాటైన రీతిలో తొలి బంతిని బౌండరీతో వీరూ ఆరంభించలేదు. కానీ ఆ తర్వాత అతని బ్యాట్ పదునెక్కింది. కవర్స్, పాయింట్, థర్డ్మ్యాన్ల దిశగా అద్భుతమైన టైమింగ్‌తో ఫోర్లు కొట్టిన వీరూ...తన ఫేవరేట్ అప్పర్ కట్‌తో సిక్సర్ల ఖాతా తెరిచాడు. నెహ్రా బౌలింగ్‌లో వరుసగా కొట్టిన మూడు ఫోర్లు క్లాసిక్‌గా కనిపించాయి. వీరూ వేగానికి జడేజా పెద్ద బాధితుడయ్యాడు. అతను వేసిన 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు రాబట్టాడు! గత ఐపీఎల్లో ఘోరంగా విఫలమైనసెహ్వాగ్ ఈ సీజన్లోనూ ఆరంభంలో అంతంతే అనిపించాడు. చాలా ఇన్నింగ్స్‌లో మెరుపు ఆరంభం చేస్తున్నా అది చివరి వరకు కొనసాగలేదు. అయితే కటక్‌లో కోల్‌కతాపై అర్ధ సెంచరీ చేసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా...ఆ తర్వాత ఆరు ఇన్నింగ్స్ మళ్లీ తిరోగమనం వైపే వెళ్లాయి. అయితే శుక్రవారం ఇన్నింగ్స్‌తో అతను ఐపీఎల్లో రెండో సారి ‘సెంచరీ పంచ్’ విసిరాడు. ఎన్ని మారినా...ఎందరు ‘విలయకారులు’ వచ్చినా తన తర్వాతే అనే ఆనందం, ఆత్మవిశ్వాసం ఆ అద్దాల మాటున కనిపించింది. అన్నట్లు... కింగ్స్ ఎలెవన్ టీ షర్ట్ వేసుకొని వీరూ జోరుకు చప్పట్లతో ఊగిపోయిన అర్జున్ టెండూల్కర్‌ని చూస్తే తెలుస్తుంది ఈ ఇన్నింగ్స్‌పై సెహ్వాగ్ అభిమానుల స్పందన ఏమిటో! -
ఐపీఎల్-7 ఫైనల్లో పంజాబ్
ముంబై: కింగ్స్ లెవెన్ పంజాబ్ ఐపీఎల్ ఏడో అంచె ఫైనల్‌కు దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ 24 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. పంజాబ్ ఫైనల్లో కోల్‌కతాతో తలపడనుంది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, డ్వెన్ స్మిత్ నిరాశ పరిచినా సురేష్ రైనా (25 బంతుల్లో 87) మెరుపు ఇన్నింగ్స్‌తో విజయం దిశగా నడిపించాడు. దీంతో ఆరు ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరుకుంది. అయితే ఈ దశలో రైనా రనౌటవడంతో పరిస్థితి మారింది. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడటంతో మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గింది. జడేజా (27)తో పాటు ధోనీ (42 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నయ్‌కు పంజాబ్ బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ చాలా రోజుల తర్వాత పరుగుల సునామీ సృష్టించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో రెచ్చిపోయి తనలో మునుపటి వాడి తగ్గలేదని నిరూపించుకున్నాడు. సెహ్వాగ్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. వీరూ 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. దీంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్లు వీరూ, మనన్ వోహ్రా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించారు. వోహ్రా (34) కాస్త సంయమనంతో ఆడినా వీరూ మెరుపు విన్యాసాలతో రెచ్చిపోయాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరూ మరో 29 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వోహ్రా అవుటయ్యాక.. మ్యాక్స్‌వెల్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. కాగా వీరూ అదే జోరు కొనసాగించగా, డేవిడ్ మిల్లర్ (38) అండగా నిలిచాడు. ఎట్టకేలకు నెహ్రా బౌలింగ్‌లో వీరూ అవుటయినా పంజాబ్ స్కోరు అప్పటికే 200 దాటిపోయింది. -
ఐపీఎల్-7: వీరేంద్ర సెహ్వాగ్ పరుగుల సునామీ
ముంబై: పేలవ ఆటతీరుతో టీమిండియాలో చోటు కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్ చాలా రోజుల తర్వాత పరుగుల సునామీ సృష్టించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో రెచ్చిపోయి తనలో మునుపటి వాడి తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఐపీఎల్-7లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సెహ్వాగ్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. వీరూ 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. దీంతో కింగ్స్ లెవెన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నయ్‌కు పంజాబ్ బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ఓపెనర్లు వీరూ, మనన్ వోహ్రా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభం అందించారు. వోహ్రా (34) కాస్త సంయమనంతో ఆడినా వీరూ మెరుపు విన్యాసాలతో రెచ్చిపోయాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరూ మరో 29 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వోహ్రా అవుటయ్యాక.. మ్యాక్స్‌వెల్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. కాగా వీరూ అదే జోరు కొనసాగించగా, డేవిడ్ మిల్లర్ (38) అండగా నిలిచాడు. ఎట్టకేలకు నెహ్రా బౌలింగ్‌లో వీరూ అవుటయినా పంజాబ్ స్కోరు అప్పటికే 200 దాటిపోయింది. కాగా వీరూ అవుటయ్యాక చివర్లో కీలక వికెట్లు పడటంతో పంజాబ్ స్కోరు కాస్త తగ్గింది. -
కోల్‌కతా ఫైనల్‌కి...
క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఘన విజయం రాణించిన ఉతప్ప, ఉమేశ్ సంచలనాల మీద నిలకడదే పైచేయి. ఐపీఎల్-7లో లీగ్ దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లే రేసులో నిలబడ్డాయి. ఒకే ఒక్క మ్యాచ్‌లో పెను విధ్వంసం ద్వారా నాకౌట్‌కు చేరిన ముంబై కథ ఎలిమినేటర్‌లోనే ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ నైపుణ్యం ముందు ముంబై తేలిపోయింది. ఇక వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న కోల్‌కతా... క్వాలిఫయర్లోనూ ఏ మాత్రం తడబాటు లేకుండా పంజాబ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. పంజాబ్ ఓడినా లీగ్ దశలో నిలకడ పుణ్యమాని ఫైనల్‌కు చేరడానికి మరో అవకాశం ఉంది. ఇక క్వాలిఫయర్-2లో చెన్నైతో పంజాబ్ అమీతుమీ తేల్చుకోనుంది. కోల్‌కతా: లీగ్ ఆరంభంలో తొలి ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చివర్లో మాత్రం అద్భుతాలు చేసింది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గి నాకౌట్‌కు చేరుకోవడంతో పాటు క్వాలిఫయర్లోనూ సంచలనం సృష్టించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతూ వస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కట్టడి చేసి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వర్షం అంతరాయం మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బెయిలీసేన ఏ దశలోనూ కోల్‌కతాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఉతప్ప (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పాండే (20 బంతుల్లో 21; 3 ఫోర్లు), యూసుఫ్ పఠాన్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) సూర్యకుమార్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కరణ్వీర్ 3 వికెట్లు, జాన్సన్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. సాహా (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ వోహ్రా (19 బంతుల్లో 26; 3 సిక్సర్లు), బెయిలీ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమేశ్ 3, మోర్కెల్ 2 వికెట్లు తీశారు. ఉతప్ప జోరు... గంభీర్ (1) రెండో ఓవర్లోనే అవుట్ కావడంతో కోల్‌కతా ఆరంభంలో కాస్త తడబడింది. అయితే ఉతప్ప, మనీష్ పాండేలు వికెట్‌ను కాపాడుకుంటూనే వేగంగా ఆడారు. దీంతో పవర్‌ప్లేలో గౌతీసేన వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మెరుగైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఆదుకున్న ఈ జోడిని అక్షర్ పటేల్ దెబ్బతీశాడు. 9వ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో ఇద్దర్ని అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 42 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో ఉన్న షకీబ్ (16 బంతుల్లో 18; 2 ఫోర్లు), యూసుఫ పఠాన్ నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు. 15వ ఓవర్లో కరణ్వీర్.... వరుస బంతుల్లో షకీబ్, యూసుఫ్‌లను అవుట్ చేశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 113/5 ఉన్న దశలో 25 నిమిషాల పాటు వర్షం అంతరాయం కలిగించింది. తర్వాత సూర్యకుమార్, టెన్ డస్కెట్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 21 బంతుల్లో 37 పరుగులు జోడించి వెంటవెంటనే అవుటైనా కోల్‌కతా మాత్రం పోరాడే స్కోరును సాధించింది. తడబడుతూ... ఓపెనర్లలో సెహ్వాగ్ (2) వెంటనే అవుటైనా.. వోహ్రా ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఫలితంగా పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరు 46/2. సాహా నిలకడను కనబర్చినా... ఉమేశ్ నాణ్యమైన బంతితో మాక్స్వెల్ (6)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పంజాబ్ 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. వ్యక్తిగత స్కోరు ఒక పరుగు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మిల్లర్ (8).. సాహాతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మూడు బంతుల తేడాతో ఈ ఇద్దరు అవుటయ్యారు. కొద్దిసేపటికే అక్షర్ పటేల్ (2) కూడా వెనుదిరిగడంతో పంజాబ్ 87 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. చివర్లో బెయిలీ, ధావన్ (14), జాన్సన్ (10 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మిల్లర్ (బి) పటేల్ 42; గంభీర్ (సి) బెయిలీ (బి) జాన్సన్ 1; పాండే (బి) పటేల్ 21; షకీబ్ (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 18; యూసుఫ్ (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 20; టెన్ డస్కెట్ (సి) వోహ్రా (బి) జాన్సన్ 17; సూర్య కుమార్ (బి) కరణ్వీర్ 20; చావ్లా నాటౌట్ 17; నరైన్ రనౌట్ 0; మోర్కెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1-2; 2-67; 3-67; 4-108; 5-108; 6-145; 7-147; 8-159. బౌలింగ్: అవానా 4-0-33-0; జాన్సన్ 4-0-31-2; అక్షర్ పటేల్ 4-1-11-2; రిషీ ధావన్ 4-0-44-0; కరణ్వీర్ 4-0-40-3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) షకీబ్ (బి) ఉమేశ్ 2; వోహ్రా (సి) ఉమేశ్ (బి) మోర్కెల్ 26; సాహా (సి) ఉమేశ్ (బి) మోర్కెల్ 35; మాక్స్వెల్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 6; మిల్లర్ (బి) చావ్లా 8; అక్షర్ పటేల్ రనౌట్ 2; బెయిలీ (సి) పాండే (బి) ఉమేశ్ 26; ధావన్ (స్టంప్డ్) ఉతప్ప (బి) షకీబ్ 14; జాన్సన్ నాటౌట్ 10; కరణ్వీర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1-5; 2-45; 3-55; 4-80; 5-82; 6-87; 7-117; 8-134 బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-23-2; ఉమేశ్ 4-0-13-3; నరైన్ 4-0-30-0; షకీబ్ 4-0-43-1; చావ్లా 4-0-23-1. -
బదులు తీర్చుకున్న ధోని సేన
ముంబై: గత ఏడాది ఐపీఎల్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ బదులు తీర్చుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించి రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ తో పోరుకు ధోని సేన సిద్దమయింది. ముంబై నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 8 బంతులు మిగులుండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సురేష్ రైనా అర్థ సెంచరీతో రాణించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. డేవిడ్ హస్సీ 40, ప్లెసిస్ 35, డ్వేన్ స్మిత్ 24 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఓజాకు ఒక వికెట్ దక్కింది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుంది. రైనా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
చెన్నై టార్గెట్ 174 పరుగులు
ముంబై: ఐపీఎల్-7లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబై ఇండియన్స్ 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ సిమన్స్ అర్థ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. మైక్ హస్సీ 39, ఆండర్సన్ 20, రోహిత్ శర్మ 20, పొలార్డ్ 14 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. నెహ్రా, జడేజా రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
పంజాబ్ ఓటమి: ఫైనల్లో కోల్ కతా
కోల్ కతా: గంభీర్ సేన ఐపీఎల్ -7 ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను కంగు తినిపించి తుదిపోరుకు కోల్ కలా నైట్ రైడర్స్ సిద్దమయింది. బుధవారమిక్కడ జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ పై కోల్ కతా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా 8 విజయాలు సాధించి గంభీర్ సేన ఫైనల్ కు చేరడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మరోసారి రాణించాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లుకోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. కోల్ కతా అన్ని విభాగాల్లో రాణించి పంజాబ్ ను కట్టడి చేసింది. మ్యాక్స్ వెల్(6), మిల్లర్(8) విఫలమవడంతో పంజాబ్ ఓటమి ఖాయమయింది. సాహా 35, వోహ్రా 26, బైయిలీ 26 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3, మోర్కల్ 2 వికెట్లు పడగొట్టారు. షకీబ్, చావ్లా చెరో వికెట్ తీశారు. -
వరుణుడు కరుణించలేదు
క్వాలిఫయర్-1 నేటికి వాయిదా కోల్‌కతా: భారీ వర్షం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన ఐపీఎల్-7 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ వాయిదా పడింది. ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లోనే ఈ మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో సాయంత్రం 5.15 గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నీజెల్ లాంగ్, ఎస్.రవి, క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీలు ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాదని తేల్చారు. దీంతో ఈ ముగ్గురూ మ్యాచ్‌ను వాయిదా వేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ‘సూపర్ ఓవర్’ బుధవారం కూడా పూర్తి మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ‘సూపర్ ఓవర్’ను నిర్వహిస్తారు. దీనికి కూడా మైదానం అనుకూలంగా లేకపోతే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన పంజాబ్ (11) జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కేవలం తొమ్మిది విజయాలు మాత్రమే సాధించిన కోల్‌కతా రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది. రద్దయితేనే డబ్బులు వాపస్ కోల్‌కతా, పంజాబ్ మ్యాచ్ కోసం కొనుగోలు చేసిన టిక్కెట్లు బుధవారం కూడా చెల్లుబాటు అవుతాయని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఒక బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే టిక్కెట్ల డబ్బులు వాపస్ ఇస్తామని, ఇందుకోసం మరో ప్రకటన చేస్తామని వెల్లడించారు. -
రైజర్స్ కాదు లూజర్స్!
ఐపీఎల్లో హైదరాబాద్ విఫలం చెత్త వ్యూహాలతో వరుస ఓటములు సమష్టి వైఫల్యంతో ఆరో స్థానం చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు సాక్షి, హైదరాబాద్: అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ల వైఫల్యం... అందివచ్చిన అవకాశాలు జారవిడవటం... అర్థం లేని వ్యూహాలు... ఫలితమే ఐపీఎల్-7లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పరాభవం. గత ఏడాది పరిమిత వనరులతోనే రైజర్స్ సంచలన విజయాలు సాధించింది. 16 మ్యాచుల్లో 10 గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగలిగింది. కానీ ఈసారి జట్టులో భారీతనం కనిపిస్తున్నా టోర్నీలో ఏ దశలోనూ తనదైన ముద్ర వేయలేకపోయింది. 14 మ్యాచుల్లో 6 మాత్రమే గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో అభిమానులను సంతృప్తిపరిచే విధంగా రైజర్స్ చెలరేగి ఆడిన మ్యాచ్ ఒక్కటీ లేకపోగా... ఒక్క ఆటగాడు కూడా అద్భుతం అనిపించే ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. వార్నర్ ఒక్కడే... ప్రపంచ క్రికెట్లో భారీ హిట్టర్లుగా పేరున్న డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లతో పాటు శిఖర్ ధావన్‌లాంటి ఆటగాడు టాప్-3లో ఉండటం ఏ జట్టుకైనా బలమే. కానీ ఇది రైజర్స్ విషయంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. వార్నర్ ఒక్కడే నిలకడగా అన్ని మ్యాచ్‌లు ఆడినా అవన్నీ మరో ఎండ్‌లో చేసిన ఒంటరి పోరాటాలే అయ్యాయి. 14 ఇన్నింగ్స్‌లో వార్నర్ 6 అర్ధ సెంచరీలు సహా 528 పరుగులు చేయడం విశేషం. ఫించ్, ధావన్ మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టలేకపోయారు. ఫించ్ రెండు అర్ధ సెంచరీలు చేసినా అతని స్థాయి దూకుడు (117.49 స్ట్రైక్ రేట్) లేకపోవడంతో జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. కెప్టెన్సీ భారంతో ఇబ్బందులు పడిన ధావన్... వరుస వైఫల్యాల తర్వాత చివర్లో రెండు అర్ధ సెంచరీలు చేసినా అప్పటికే జట్టు పరిస్థితి చేజారిపోయింది. ఇక వికెట్ కీపర్ నమన్ ఓజా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడినా... అది టోర్నీ చివర్లోనే. ఆల్‌రౌండర్‌గా పనికొస్తారనుకున్న స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, హెన్రిక్స్ రెండు రకాలుగానూ విఫలమయ్యారు. దేశవాళీ ఆటగాళ్లు వేణుగోపాలరావు, లోకేశ్ రాహుల్ ఇతర జట్లలోని భారత ఆటగాళ్ల తరహాలో ఏ మాత్రం కీలక ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడంతో రైజర్స్ బ్యాటింగ్ వనరులు పరిమితంగా మారిపోయాయి. ఆకట్టుకున్న భువనేశ్వర్... బౌలింగ్‌లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాణించడమే ఈ సీజన్లో సన్ జట్టుకు ఊరట కలిగించే అంశం. భారత ప్రధాన బౌలర్‌గా తనకున్న స్థాయిని నిలబెట్టుకుంటూ భువీ 14 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఆరంభ ఓవర్లలోనే కాకుండా చివర్లో కూడా అతను చాలా వరకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగాడు. ఈసారి వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ గత సీజన్‌లాగే ఈసారి కూడా ఆకట్టుకున్నాడు. 7.42 ఎకానమీతో అతను 15 వికెట్లు తీశాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లే అతను ఎక్కువగా తీయడం విశేషం. పొదుపుగా కూడా బౌలింగ్ చేస్తూ సహచరుడు అమిత్ మిశ్రాను వెనక్కి నెట్టి అన్ని మ్యాచ్‌లు ఆడిన కరణ్... తన ఫీల్డింగ్‌తో కూడా ప్రభావం చూపించగలిగాడు. అయితే వరల్డ్ నంబర్ వన్ బౌలర్ డేల్ స్టెయిన్ వైఫల్యం మాత్రం హైదరాబాద్ టీమ్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. చివరి ఓవర్లలో స్టెయిన్ ఆదుకుంటాడనుకున్న ప్రతీసారి అతనిపై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ప్రదర్శించడంతో రైజర్స్ ఆశలు దెబ్బ తిన్నాయి. ఈసారి అతని బౌలింగ్‌లో మూడు సార్లు ఒక్కో ఓవర్లో 22, 24, 26 పరుగులు బాదటం స్టెయిన్ పరిస్థితిని సూచిస్తోంది. అమిత్ మిశ్రా ఘోరంగా విఫలం కాగా... 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శర్మ ఆ తర్వాత బెంచీకే పరిమితయ్యాడు. వ్యూహాత్మక తప్పిదాలు... కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌కు ముందే హైదరాబాద్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు లేకపోవచ్చు గాక... కానీ ఏ జట్టైనా విజయంతో ముగించాలని భావిస్తుంది. ఇలాంటి మ్యాచ్‌లో ఫించ్‌లాంటి అంతర్జాతీయ ఆటగాడి స్థానంలో అనిరుధ శ్రీకాంత్‌కు అవకాశం ఇవ్వడం ఏ రకమైన వ్యూహమో అర్థం కాదు. ఈ మ్యాచ్‌కు ముందు అనిరుధ గత రెండు ఐపీఎల్‌లలో కలిపి ఎదుర్కొన్న బంతులు 2 మాత్రమే! ఇదొక్కటే కాదు... టోర్నీ ఆరంభం నుంచి జట్టు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూనే వచ్చింది. కోచ్ టామ్ మూడీ, మెంటర్లు శ్రీకాంత్, లక్ష్మణ్‌లతో కూడిన బృందం ఏం ఆలోచించిందో అర్ధం కాదు. ధావన్ కెప్టెన్సీకి పనికి రాడని 11 మ్యాచ్‌ల తర్వాత గానీ వారికి తెలియలేదు. ఓ వైపు మిశ్రాను చితకబాదుతున్నా, భువీ, స్టెయిన్‌లాంటి బౌలర్ల ఓవర్లు మిగిలి ఉన్నా అతనితో బౌలింగ్ కొనసాగించడం... స్ట్రైక్ పేసర్‌గా విండీస్ తరఫున ఆడిన స్యామీకి అసలు బౌలింగే ఇవ్వకపోవడం, లెఫ్ట్ హ్యాండర్ ఆడుతుంటే లెగ్‌స్పిన్నర్‌ను కొనసాగించడం... ఇలా ధావన్ పేలవ వ్యూహాలు టోర్నీ అంతా సాగాయి. వైవిధ్యం కోసమైనా ఆఫ్‌స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌ను ఆడించాలని ఎవరూ భావించలేదు. ఈసారికి ఇంతే... పేరుకు హైదరాబాద్ జట్టే అయినా స్థానిక ఆటగాళ్లను అసలు రైజర్స్ మేనేజ్మెంట్ ఏ మాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి, ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ పరిస్థితి కూడా ఇదే. వేణుగోపాలరావు ఒక్కడికే 7 మ్యాచ్‌లు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో హోల్డర్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాగా... బ్రెండన్ టేలర్‌కు అదీ దక్కలేదు. దేశవాళీ ఆటగాళ్లలో మన్‌ప్రీత్ జునేజా, ప్రశాంత్ పరమేశ్వరన్, అమిత్ పౌనికర్ డగౌట్లోనే కూర్చోగా... ‘డాడీ శ్రీకాంత్’ అండతో అనిరుధ ఒక మ్యాచ్ ఆడగలిగాడు! మొత్తానికి సన్‌రైజర్స్ నిరాశజనక ఆటతీరుతో సీజన్‌ను ముగించింది. దాదాపుగా ఇదే జట్టు మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. అప్పుడైనా మంచి ప్రణాళికతో ముందుకొచ్చి విజయాలు సాధిస్తుందేమో చూడాలి. -
ఆండర్సన్ అదుర్స్; ప్లే ఆప్ లో ముంబై
ముంబై: ఐపీఎల్-7లో మరో అద్భుతం నమోదయింది. అసాధ్యమనుకున్న దాన్ని సొంత మైదానంలో సుసాధ్యం చేసి చూపింది ముంబై ఇండియన్స్ జట్టు. చావురేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విజృంభించి ఆడి విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యాన్ని 14.4 ఓవర్లలోనే ఛేధించి ప్లే ఆప్ లోకి దూసుకెళ్లింది. వాంఖేడ్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ తో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోవై ఆండర్సన్ విజృంభించి ఆడి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 10 బంతుల్లో 30 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. 14.3 ఓవర్లలో ముంబై లక్ష్యాన్ని ఛేదించాల్సివుంది. అయితే 14.3 ఓవర్లలో ముంబై 189 పరుగులు చేసి స్కోరు సమం చేసింది. తర్వాతి బంతికి ఫోర్ కొడితే ముంబై ప్లే ఆప్ కు చేరుతుందని ప్రకటించారు. దీంతో ఇరు జట్లతో పాటు ప్రేక్షకులు ఉత్కంఠకు లోనయ్యారు. ఫాల్కనర్ బౌలింగ్ లో తారే సిక్స్ బాది ముంబైను ప్లే ఆప్ కు చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. కోవె ఆండర్సన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 14.2 ఓవర్లలో 161 పరుగులు ఛేదిస్తే ముంబై ఏకంగా 14.4 ఓవర్లలోనే 195 పరుగులు చేసి అత్యద్భుత మనిపించింది. కోల్ కతాలో యూసఫ్ పఠాన్ చెలరేగితే, ముంబై జట్టులో ఆండర్సన్ అద్భుతం చేశాడు. అత్యంత ధర చెల్లించి దక్కించుకున్న ఆండర్సన్ ఇప్పటివరకు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ సరైన సమయంలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును ప్లే ఆప్ కు చేర్చాడు. -
ముంబై విజయ లక్ష్యం 190 పరుగులు
ముంబై: ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ముంబై ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సంజూ శామ్సన్, కుమార్ నాయర్ రాణించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. శామ్సన్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. నాయర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఫాల్కనర్ 23, హోడ్జ్ 29 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పొలార్డ్, గోపాల్, హర్భజన్ సింగ్, బుమరాహ్ తలో వికెట్ తీశారు. -
చేతులతో గీటార్ వాయించిన పొలార్డ్
ముంబై: ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ స్టేడియంలో గీటార్ వాయించాడు. అయితే మీటింది నిజం గీటార్ కాదండోయ్. తన చేతులను గీటార్ లా పెట్టి వాయించి చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై వాంఖేడ్ మైదానంలో జరుగుతున్న కీలక మ్యాచ్ లో అతడీ విన్యాసం ప్రదర్శించాడు. హర్భజన్ సింగ్ బౌలింగ్ లో రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ ఇచ్చిన క్యాచ్ ను పరుగెత్తికొచ్చి ఒడుపుగా పట్టాడు పొలార్డ్. క్యాచ్ పట్టిన తర్వాత ఒక చేతిని అడ్డంగా పెట్టి, మరో చేత్తో గీటార్ ను మీటుతున్నట్టుగా విన్యాసం చేశాడు. మైదానంలో ఉన్న ప్రేక్షకులు అతడి విన్యాసాన్ని కళ్లప్పగించి చూశారు. రాజస్థాన్ తోనే జరిగిన గత మ్యాచ్ లోనూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు పొలార్డ్. హర్భజన్ బౌలింగ్ లోనే బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యంకాని క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. -
తుది పోరుకు వెళ్లేదెవరో?
ముంబై: ఐపీఎల్ -7లో ప్లేఆప్ కు చేరుకునే చివరి జట్టు ఏదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్లే ఆప్ రేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు వాంఖేడ్ మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థికి ముందు బ్యాటింగ్ అప్పగించాడు. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆప్ కు వెళుతుంది. అయితే రోహిత్ సేన ప్లే ఆప్ లో అడుగు పెట్టాలంటే భారీ రన్ రేట్ తో మ్యాచ్ నెగ్గాలి. కీలక మ్యాచ్ లో విజయం కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాజస్థాన్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. బిన్నీ స్థానంలో అభిషేక్ నాయర్, విక్రం మాలిక్ ప్లేస్ లో ధావల్ కులకుర్ణి, రాహుల్ తెవాటియా స్థానంలో అంకిత్ శర్మను జట్టులోకి వచ్చారు. ఇక ముంబై టీమ్ లో మర్చంట్ డీ లాంగె స్థానంలో కోవె ఆండర్సర్ ను తీసుకున్నారు. -
బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్
కోల్‌కతా: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ బ్యాటింగ్‌కు వచ్చారు. వార్నర్ ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డయ్యాడు. ప్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. కాగా కోల్ కతా ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు సొంతం చేసుకుంది. -
మహేంద్ర జాలం.. చెన్నై సూపర్ విన్
బెంగళూరు: ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా శనివారమిక్కడ ఏకపక్షంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మరో 14 బంతులు మిగిలుండగా కేవలం రెండు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. ధోనీ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. డుప్లెసిస్ (54 నాటౌట్) హాఫ్ సెంచరీతో పాటు డ్వెన్ స్మిత్ (34) రాణించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్ రొసోవ్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ టకవాలె (19), విజయ్ జోల్ (13) కూడా పరుగుల వేటలో తడబడ్డారు. ఈ దశలో యువ సంచలనం విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్లుకు సముచిత స్కోరు అందించాడు. కోహ్లీకి యువీ కాసేపు అండగా నిలిచాడు. 49 బంతులాడిన విరాట్ 2 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. యువరాజ్ 25 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్ నెహ్రా మూడు వికెట్లు తీశాడు. -
విరాట్ విజృంభణ.. చెన్నై లక్ష్యం 155
బెంగళూరు: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారమిక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆరంభమైన ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్ రొసోవ్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ టకవాలె (19), విజయ్ జోల్ (13) కూడా పరుగుల వేటలో తడబడ్డారు. ఈ దశలో యువ సంచలనం విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్లుకు సముచిత స్కోరు అందించాడు. కోహ్లీకి యువీ కాసేపు అండగా నిలిచాడు. 49 బంతులాడిన విరాట్ 2 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. యువరాజ్ 25 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్ నెహ్రా మూడు వికెట్లు తీశాడు. -
ఇక ముంబైపై గెలిస్తేనే..!
-
ఇక ముంబైపై గెలిస్తేనే..!
చావోరేవో స్థితికి చేరిన రాజస్థాన్ కీలక మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమి రాణించిన మార్ష్, మిల్లర్ బెయిలీ సేనకే అగ్రస్థానం ఐపీఎల్ అంటేనే అనూహ్య ఫలితాలకు, సంచలనాలకు పెట్టింది పేరు. వారం రోజుల క్రితం కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరుతామనే ధీమాతో ఉన్న రాజస్థాన్... ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితికి చేరింది. పంజాబ్ చేతిలో ఓటమితో... ఇక చివరి మ్యాచ్‌లో ముంబైపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమైనా... ఆఖరి లీగ్ మ్యాచ్ (ఆదివారం) ద్వారానే ప్లే ఆఫ్ తుది బెర్త్ ఖరారు కానుంది. మొహాలీ: ఐపీఎల్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ చివర్లో మాత్రం తడబడుతోంది. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇక నాకౌట్‌కు చేరుకోవాలంటే ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే ముంబైతో పోలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటం వాట్సన్ సేనకు కాస్త ఊరటనిచ్చే అంశం. మరోవైపు ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన పంజాబ్ 16 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. మార్ష్ (35 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), మిల్లర్ (20 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు), సాహా (20 బంతుల్లో 27; 4 ఫోర్లు), బెయిలీ (18 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), వోహ్రా (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు జత చేశారు. బెయిలీ, మిల్లర్ ఐదో వికెట్‌కు 32 బంతుల్లో అజేయంగా 60 పరుగులు జోడించడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫాల్క్‌నర్ (13 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), హాడ్జ్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (29 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), రహానే (26 బంతుల్లో 23; 2 ఫోర్లు) రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ కోలుకోలేకపోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్‌నర్ మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) మాలిక్ (బి) ఫాల్క్‌నర్ 18; వోహ్రా రనౌట్ 25; మార్ష్ (సి) రహానే (బి) మాలిక్ 40; సాహా (సి) రహానే (బి) తెవాటియా 27; మిల్లర్ నాటౌట్ 29; బెయిలీ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1-24; 2-54; 3-113; 4-119. బౌలింగ్: విక్రమ్‌జీత్ మాలిక్ 3-0-29-1; వాట్సన్ 2-0-16-0; ఫాల్క్‌నర్ 3-0-39-1; కూపర్ 4-0-25-0; తెవాటియా 4-0-24-1; ప్రవీణ్ తాంబే 4-0-36-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) ధావన్ 23; నాయర్ (సి) బెయిలీ (బి) బాలాజీ 11; శామ్సన్ (స్టంప్డ్) సాహా (బి) కరణ్వీర్ 30; వాట్సన్ (బి) ధావన్ 0; బిన్ని (సి) మార్ష్ (బి) కరణ్వీర్ 7; తెవాటియా (సి) కరణ్వీర్ (బి) అక్షర్ పటేల్ 16; హాడ్జ్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ పటేల్ 31; ఫాల్క్‌నర్ నాటౌట్ 35; కూపర్ (సి) మార్ష్ (బి) అక్షర్ పటేల్ 2; మాలిక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1-21; 2-56; 3-56; 4-70; 5-83; 6-101; 7-128; 8-130. బౌలింగ్: బాలాజీ 4-0-37-1; హెండ్రిక్స్ 4-0-57-0; రిషీ ధావన్ 4-0-25-2; అక్షర్ పటేల్ 4-0-24-3; కరణ్వీర్ సింగ్ 4-0-16-2. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
చండీగఢ్: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు చండీగఢ్‌లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు సొంతం చేసుకుంది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. కోల్‌కతాకు కూడా బెర్తు ఖాయమవుతుంది. పంజాబ్, చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన సంగతి తెలిసిందే. -
సొంతగడ్డపై మెరిసిన ముంబై
ముంబై: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ మెరిశారు. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 15 పరుగులతో విజయం సాధించారు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని ముంబై పూర్తి ఓవర్లలో 158/4 స్కోరుకు కట్టడి చేసింది. పీటర్సన్ (44), మనోజ్ తివారి (41), డుమినీ (45 నాటౌట్) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై 19.3 ఓవర్లకు 173 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఆరంభంలో అద్భుతంగా ఆడినా చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సిమ్మన్స్, మైకేల్ హస్సీ జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చారు. సిమ్మన్స్ (35), హస్సీ (56) తొలి వికెట్‌కు 8 ఓవర్లలోనే 87 పరుగులు జోడించారు. సిమ్మన్స్ అవుటయినా హస్సీ.. రోహిత్ శర్మ (30)తో కలసి ఇదే జోరు కొనసాగించాడు. రన్‌రేట్ పదికి తగ్గకుండా పరుగులు సాధించారు. దీంతో ముంబై స్కోరు సునాయాసంగా 200 దాటడం ఖాయమనిపించింది. కాగా 15 వ ఓవర్లో ఢిల్లీ బౌలర్ ఉనాద్కట్ విజృంభించి ముంబై జోరును అడ్డుకున్నాడు. 140/2 స్కోరు వద్ద రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఉనాద్కట్.. ఇదే ఓవర్లో పొలార్డ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అంబటి రాయుడు, తరె, హర్భజన్, డి లాంగ్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పరుగుల వేటలో ముంబై జోరు తగ్గింది. మరో మూడు బంతులు మిగిలుండగా ముంబై ఆలౌటైంది. ముంబై 33 పరుగుల తేడాతో చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దీంతో స్కోరు 180 కూడా దాటలేకపోయింది. -
ఆరంభం అదిరినా.. చివర్లో బ్యాట్లెత్తేశారు
ముంబై: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై 19.3 ఓవర్లకు 173 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఆరంభంలో అద్భుతంగా ఆడినా చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సిమ్మన్స్, మైకేల్ హస్సీ జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చారు. సిమ్మన్స్ (35), హస్సీ (56) తొలి వికెట్‌కు 8 ఓవర్లలోనే 87 పరుగులు జోడించారు. సిమ్మన్స్ అవుటయినా హస్సీ.. రోహిత్ శర్మ (30)తో కలసి ఇదే జోరు కొనసాగించాడు. రన్‌రేట్ పదికి తగ్గకుండా పరుగులు సాధించారు. దీంతో ముంబై స్కోరు సునాయాసంగా 200 దాటడం ఖాయమనిపించింది. కాగా 15 వ ఓవర్లో ఢిల్లీ బౌలర్ ఉనాద్కట్ విజృంభించి ముంబై జోరును అడ్డుకున్నాడు. 140/2 స్కోరు వద్ద రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఉనాద్కట్.. ఇదే ఓవర్లో పొలార్డ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అంబటి రాయుడు, తరె, హర్భజన్, డి లాంగ్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పరుగుల వేటలో ముంబై జోరు తగ్గింది. మరో మూడు బంతులు మిగిలుండగా ముంబై ఆలౌటైంది. ముంబై 33 పరుగుల తేడాతో చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దీంతో స్కోరు 180 కూడా దాటలేకపోయింది. -
బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. ఢిల్లీతో మ్యాచ్
ముంబై: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హర్భజన్ మళ్లీ ముంబై తుది జట్టులోకొచ్చాడు. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించిన ముంబై అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ముంబై ఓపెనర్లు సిమన్స్, మైకేల్ హస్సీ బ్యాటింగ్‌కు వచ్చారు. -
ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించారు
ఐపీఎల్-7లో బుకీలపై సునీల్ గవాస్కర్ కోల్‌కతా: గతేడాది ఐపీఎల్‌ను కుదిపేసిన బుకీలు ఈసారి కూడా పంజా విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఇద్దరు ఆటగాళ్లను బుకీలు సంప్రదించినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ విషయాన్ని అవినీతి వ్యతిరేక మరియు భద్రతా యూనిట్ (ఏసీఎస్‌యూ) అధికారులకు తెలిపినట్టు చెప్పారు. మెకల్లమ్ వ్యవహారంలో మీడియాకు లీక్ ఐపీఎల్ నుంచి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. ‘మెకల్లమ్ ఐసీసీకి ఇచ్చిన వాంగ్మూలం మీడియా చేతికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఐపీఎల్ ద్వారా మాత్రం వెళ్లలేదు. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశమే. ఈసారి ప్రతీ జట్టుకు ఇంటెగ్రిటీ అధికారి (ఐఓ)ని నియమించాం. దీంతో ఆటగాళ్లు తమకు తెలిసిన విషయాలను సులువుగా చెప్పగలుగుతున్నారు. ఒక్కోసారి బుకీలు ఆటగాళ్లను సంప్రదించినప్పుడు వారికేం చేయాలో అర్థం కాదు. వారి దగ్గర ఏసీఎస్‌యూ నంబర్ ఉంటుంది కానీ ఒకసారి వారితో కాంటాక్ట్ అయితే ఇక ఎప్పటికీ నిఘాలో ఉండిపోతామేమోననే భయం ఉంటుంది. అదే ఐఓకు విషయం చెబితే ఆయనే ముందుకు తీసుకెళతాడు’ అని గవాస్కర్ పేర్కొన్నారు. -
కోహ్లి సేనపై కోల్‌కతా గెలుపు
కోల్ కతా: కీలక మ్యాచ్ లో విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-7లో ప్లేఆప్‌కు చేరుకుంది. ఊతప్ప బాదుడుకు, సునీల్ నరైన్ స్పిన్ తోడవడంతో నేడిక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను గంభీర్ సేన 30 పరుగుల తేడాతో ఓడించింది. కోల్ కతా నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోహ్లి సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. తకావలే 45, కోహ్లి 38, యువరాజ్ 22, రానా 19, డీవిలియర్స్ 13 పరుగులు చేశారు. క్రిస్ గేల్(6) విఫలమయ్యాడు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 4 వికెట్లు నేలకూల్చాడు. యాదవ్ ఒక వికెట్ తీశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఊతప్ప, హసన్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. 83 పరుగులు చేసిన ఊతప్పకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ఉతికి ఆరేసిన ఊతప్ప, షకీబ్
కోల్ కతా: సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి విజృంభించింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప, షకీబ్ హసన్ రాణించడంతో ప్రత్యర్థి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్-7లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఊతప్ప, హసన్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. షకీబ్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. ఊతప్ప 51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. యూసఫ్ పఠాన్ 22, మనీష్ పాండే 13 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో స్టార్క్, దిండా, అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. -
‘శతక’బాదిన సిమ్మన్స్
ఈ సీజన్ ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు పంజాబ్‌పై ముంబై ఘన విజయం ప్లే ఆఫ్ ఆశలు సజీవం మొహాలీ: ఐపీఎల్లో విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న పంజాబ్ జట్టును ముంబై ఇండియన్స్ మాత్రం చక్కగా కట్టడి చేస్తోంది. అందరికీ కొరకరాని కొయ్యగా కనిపిస్తున్న పంజాబ్‌ను ఈ సీజన్లో రెండోసారి ఓడించింది. లెండిల్ సిమ్మన్స్ (61 బంతుల్లో 100 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ సీజన్ ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో... బుధవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పీసీఏ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. బెయిలీ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వోహ్రా (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్లు), మార్ష్ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బుమ్రా, గోపాల్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది. సిమ్మన్స్‌కు తోడు రోహిత్ (18), రాయుడు (17) ఫర్వాలేదనిపించారు. హెండ్రిక్స్, అక్షర్, ధావన్ తలా ఓ వికెట్ తీశారు. తడబడి పుంజుకుని... ఓపెనర్లలో సెహ్వాగ్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సర్లు) వచ్చి రావడంతోనే ఫోర్, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ మూడో ఓవర్ తొలి బంతికే అనూహ్యంగా రనౌటయ్యాడు. పవర్‌ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. గోపాల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపుమీదున్న మార్ష్‌ను సంతోకి బోల్తా కొట్టించాడు. దీంతో రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 11వ ఓవర్లో గోపాల్ పంజాబ్‌ను ఘోరంగా దెబ్బతీశాడు. మూడు బంతుల వ్యవధిలో వోహ్రా, ‘డేంజర్ మ్యాన్’ మాక్స్వెల్ (2)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో పంజాబ్ 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో బెయిలీ, ధావన్ (14 నాటౌట్) ఏడో వికెట్‌కు 20 బంతుల్లో 38 పరుగులు జోడించడంతో పంజాబ్ పోరాడే స్కోరు సాధించింది. కీలక భాగస్వామ్యాలు హస్సీ (6)ని క్రీజులో నిలబెట్టి ఓ ఎండ్‌లో సిమ్మన్స్ విజృంభించాడు. బౌలర్ ఎవరైనా ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో ముంబై స్కోరు వేగంగా కదిలింది. ఈ క్రమంలో 27 బంతుల్లోనే సిమ్మన్స్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. హస్సీని క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సిమ్మన్స్‌తో జత కలిసిన రాయుడు (17) చక్కని సహకారం అందించాడు. రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించాక రాయుడు వెనుదిరిగాడు. అప్పటికే రెండు కీలక భాగస్వామ్యాలు జోడించిన సిమ్మన్స్‌కు రోహిత్ కూడా అండగా నిలిచాడు. సహచరుడికి ఎక్కువగా స్ట్రయికింగ్ ఇవ్వడంతో విండీస్ ప్లేయర్ బ్యాట్ ఝుళిపించాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ రనౌట్ 17; వోహ్రా (బి) గోపాల్ 36; మార్ష్ (సి) పొలార్డ్ (బి) సంతోకి 30; మాక్స్వెల్ (సి) అండ్ (బి) గోపాల్ 2; బెయిలీ (సి) రాయుడు (బి) బుమ్రా 39; సాహా రనౌట్ 3; అక్షర్ పటేల్ (సి) రోహిత్ (బి) ప్రవీణ్ 6; రిషీ ధావన్ నాటౌట్ 14; హెండ్రిక్స్ (బి) బుమ్రా 0; శివం శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1-23; 2-87; 3-92; 4-93; 5-105; 6-116; 7-154; 8-155 బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-20-1; సంతోకి 4-0-40-1; బుమ్రా 4-0-31-2; ఓజా 4-0-28-0; గోపాల్ 4-0-32-2 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ నాటౌట్ 100; మైక్ హస్సీ (బి) అక్షర్ 6; రాయుడు (సి) సెహ్వాగ్ (బి) ధావన్ 17; రోహిత్ (సి) సందీప్ (బి) హెండ్రిక్స్ 18; పొలార్డ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-68, 2-111; 3-148 బౌలింగ్: సందీప్ 3-0-37-0; హెండ్రిక్స్ 4-0-33-1; అక్షర్ పటేల్ 4-0-27-1; రిషీ ధావన్ 4-0-30-1; శివం శర్మ 4-0-32-0. 29 ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది 29వ సెంచరీ చాలా సంతోషంగా ఉంది. సెంచరీ చేస్తానని అనుకోలేదు. ఐపీఎల్ కోసం ముంబై జట్టు నుంచి పిలుపు వచ్చినప్పుడు చాలా ఉద్వేగంగా అనిపించింది. - లెండిల్ సిమ్మన్స్ ‘క్లాస్’ ఇన్నింగ్స్ టి 20 క్రికెట్ అంటే బాదుడు. ఎవరైనా ఆటగాడు సెంచరీ చేశాడంటే కచ్చితంగా అది పెను విధ్వంసంలా కనిపిస్తుంది. రకరకాల ప్రయోగాలతో కొత్త షాట్లు ఆడితేనే శతకం సాధ్యమవుతుంది. కానీ బుధవారం సిమ్మన్స్ చేసిన సెంచరీ వీటికి పూర్తిగా భిన్నం. ఏ మాత్రం తడబాటు, హడావుడి లేకుండా... కామ్‌గా తన పని తాను చేసుకుపోతూ సెంచరీ చేశాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా పిచ్చి షాట్ లేదు. అడ్డంగా బాదటం అసలే లేదు. అన్నీ పూర్తిగా క్రికెటింగ్ షాట్స్. ఆఫ్‌సైడ్ కట్ షాట్స్‌తో క ళ్లుచెదిరాయి. బౌలర్ తలపైనుంచి బలంగా బాదిన బంతిని చూడటం ఓ ఆహ్లాదం. రివర్స్ స్వీప్‌లు, స్విచ్ హిట్లు ఏమీ లేవు. టి20 క్రికెట్లో ఇలాంటి సెంచరీ అరుదు. పవర్‌ప్లేలో పూర్తి దూకుడు ప్రదర్శించిన సిమ్మన్స్... ఆ తర్వాత లక్ష్యానికి తగ్గట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. ఏ మాత్రం చెత్త బంతి పడ్డా చుక్కలు చూపించాడు. ఈ సీజన్లో సెంచరీ సిమ్మన్స్ నుంచి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్వతహాగా తను బాగా వేగంగా ఆడే ఆటగాడు కాదు. మొత్తానికి ఈ సీజన్లో తొలి సెంచరీ వెస్టిండీస్ క్రికెటర్ నుంచి రావడమే అసలు విశేషం. బంతులు పరుగులు 110 : 17 1120 : 17 2130 : 25 3140 : 16 4150 : 16 5161 : 9 మొత్తం: 100 నాటౌట్ (61బంతుల్లో ) 14 ఫోర్లు, 2 సిక్సర్లు -
సిమన్స్ సూపర్ సెంచరీ.. ముంబై గ్రాండ్ విన్
చండీగఢ్: కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. ముంబై ఇండియన్స్ ఏడు వికెట్లతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై మరో .ఆరు బంతులు మిగిలుండగా కేవలం మూడు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. సిమన్స్ 61 బంతుల్లో మెరుపు సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. సిమన్స్ 12 ఫోర్లు, 2 సిక్సర్లతో కనువిందు చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ 17, మనన్ వోహ్రా 36 పరుగులు చేశారు. కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న మ్యాక్స్ వెల్ రెండే పరుగులకు వెనుదిరిగాడు. షాన్ మార్ష్ (30), జార్జి బెయిలీ (39) రాణించారు. ముంబై బౌలర్లు శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. -
ఐపీఎల్-7: ముంబై లక్ష్యం 157
చండీగఢ్: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కింగ్స్ లెవెన్ పంజాబ్ 157 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌కు నిర్దేశించింది. బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ 17, మనన్ వోహ్రా 36 పరుగులు చేశారు. కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న మ్యాక్స్ వెల్ రెండే పరుగులకు వెనుదిరిగాడు. షాన్ మార్ష్ (30), జార్జి బెయిలీ (39) రాణించారు. ముంబై బౌలర్లు శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. -
ఐపీఎల్-7: కోల్‌కతా ఘనవిజయం
కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఎనిమిది వికెట్లతో చెన్నైసూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మరో రెండు ఓవర్లు మిగిలుండగా కేవలం రెండు వికెట్ల నష్టానికి అలవోకగా విజయతీరాలకు చేరింది. రాబిన్ ఊతప్ప (39 బంతుల్లో 67), షకీబల్ (21 బంతుల్లో 46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్ 5 పరుగులకు వెనుదిరగగా, సురేష్ రైనా మరో ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలసి జట్టును ఆదుకున్నాడు. మెకల్లమ్ (28) అవుటయ్యాక.. రైనాకు డుప్లెసిస్ (23) కాసేపు అండగా నిలిచాడు. ఈ క్రమంలో రైనా (65) హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో చెన్నై 122/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, రైనా, డెప్లెసిస్ వెంటవెంటనే అవుటయ్యారు. చివర్లో ధోనీ, జడేజా స్కోరు 150 దాటించారు. కమిన్స్, నరైన్, చావ్లా తలా వికెట్ తీశారు. -
ఐపీఎల్-7: రాణించిన రైనా.. కోల్‌కతా లక్ష్యం 155
కోల్‌కతా: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మంగళవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్ 5 పరుగులకు వెనుదిరగగా, సురేష్ రైనా మరో ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలసి జట్టును ఆదుకున్నాడు. మెకల్లమ్ (28) అవుటయ్యాక.. రైనాకు డుప్లెసిస్ (23) కాసేపు అండగా నిలిచాడు. ఈ క్రమంలో రైనా (65) హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో చెన్నై 122/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, రైనా, డుప్లెసిస్ వెంటవెంటనే అవుటయ్యారు. చివర్లో ధోనీ, జడేజా స్కోరు 150 దాటించారు. కమిన్స్, నరైన్, చావ్లా తలా వికెట్ తీశారు. -
ప్లేఆప్ ఆశలు నిలుపుకున్న హైదరాబాద్
హైదరాబాద్: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు తమ ముందుంచిన 161 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(50), వార్నర్(59)తో రాణించారు. నమన్ ఓజా 24, ఫించ్ 11, స్యామీ 10 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ ఓటమితో బెంగళూరుకు ప్లేఆప్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. హైదరాబాద్ ఆశలు నిలుపుకుంది. -
కోహ్లి హాఫ్ సెంచరీ; బెంగళూరు 160/6
హైదరాబాద్: ఐపీఎల్-7లో భాగంగా సోమవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 161 పరుగుల విజయ్ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. గేల్(14) నిరాశపరిచాడు. యువరాజ్ 21, డీవిలియర్స్ 29 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. రసూల్, కేవీ శర్మ, యూసఫ్ పఠాన్ ఒక్కో వికెట్ తీశారు. -
ఐపీఎల్-7: పంజాబ్ జోరు.. ఢిల్లీ ఓటమి
ఢిల్లీ: ఐపీఎల్ ఏడో అంచెలో కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగా ఆరు వికెట్లకు విజయతీరాలకు చేరింది. ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్ (23), మనన్ వోహ్రా (42) రాణించారు. కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ 14 పరుగులకు వెనుదిరిగాడు. చివర్లో అక్షర్ పటేల్ (42 నాటౌట్) రాణించి జట్టును గెలిపించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్ మురళీ విజయ్ 5 పరుగులకే వెనుదిరిగినా మరో ఓపెనర్ కెవిన్ పీటర్సన్ (49) రాణించాడు. దినేష్ కార్తీక్ (69) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు డుమినీ 17 పరుగులు చేశాడు. కాగా ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీసి ఢిల్లీ జోరుకు బ్రేక్ వేశారు. పంజాబ్ బౌలర్లు సందీప్ శర్మ, హెండ్రిక్స్ మూడేసి వికెట్లు తీశారు. -
ఐపీఎల్-7: పంజాబ్ లక్ష్యం 165
ఢిల్లీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా సోమవారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 165 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్ మురళీ విజయ్ 5 పరుగులకే వెనుదిరిగినా మరో ఓపెనర్ కెవిన్ పీటర్సన్ (49) రాణించాడు. దినేష్ కార్తీక్ (69) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు డుమినీ 17 పరుగులు చేశాడు. కాగా ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీసి ఢిల్లీ జోరుకు బ్రేక్ వేశారు. పంజాబ్ బౌలర్లు సందీప్ శర్మ, హెండ్రిక్స్ మూడేసి వికెట్లు తీశారు. -
నాయర్ మెరిసినా రాజస్థాన్ కు తప్పని ఓటమి
అహ్మదాబాద్: ఐపీఎల్-7లో భాగంగా సోమవారమిక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 25 పరుగులతో విజయం సాధించింది. ముంబై విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కేకే నాయర్(48), హోడ్జ్(40), ఫాల్కనర్(31) మాత్రమే రాణించారు. ఓపెనర్ గా వచ్చిన నాయక్ ప్రారంభంనుంచి ఎదురు చేశాడు. ఒకపైపు వికెట్లు పడుతున్నా జోరు కొనసాగించాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు సాధించాడు. మిగతా ఆటగాళ్లు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. ఫాల్కనర్, హోడ్జ్ విజృంభణతో కోలుకుంది. అయితే భారీగా ఉండడంతో రాజస్థాన్ పరాజయం పాలయింది. ముంబై బౌలర్లలో సంతోకి, ప్రజ్ఞాన్ ఓజా, ఎస్. గోపాల్ రెండేసి వికెట్లు తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. మైఖేల్ హసీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
సూపర్ క్యాచ్ పట్టిన పొలార్డ్
అహ్మదాబాద్: ఐపీఎల్-7లో మరో అద్భుతం జరిగింది. ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ అద్భుత ఫీట్ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో పొలార్డ్ కళ్లుచెదిరే విన్యాసంతో బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ పట్టాడు. గ్రేట్ క్యాచ్‌తో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ కూపర్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో కూపర్ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ దాటేలోపు బంతిని పైకెగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ అవతల పడిపోబోయాడు. అయితే చేతిలో ఉన్న బంతిని గ్రౌండ్లోకి విసిరేసి బౌండరీ దాటేశాడు. తర్వాత మళ్లీ మైదానంలోని పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి డ్రైవ్ చేసి మరోసారి క్యాచ్ అందుకున్నాడు. మైదానంలో ఉన్నవారు, టీవీలో మ్యాచ్ చూస్తున్నవారు... పొలార్డ్ విన్యాసంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. -
రోహిత్ శర్మ మెరుపులు
అహ్మదాబాద్: మైఖల్ హసీ, సిమన్స్ అర్థ సెంచరీలు... రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 178 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ ముందు 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. మైఖల్ హసీ 39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. సిమన్స్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 19 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పొలార్డ్ 14 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. -
రాజస్థాన్ జోరును ముంబై అడ్డుకుంటుందా?
అహ్మదాబాద్: ఐపీఎల్-7లోఇప్పటికే ప్లే ఆప్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జోరును అడ్డుకుని ప్లే ఆప్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా గత మ్యాచ్‌లో అతడు ఆడలేదు. అజింక్య రహానే స్థానంతో ఉన్ముక్త్ చాంద్‌ను తీసుకున్నారు. స్టీవెన్ స్మిత్ బదులు బ్రాడ్ హగ్, ప్రవీణ్ తాంబే స్థానంలో అంకిత్ శర్మ జట్టులోకి వచ్చారు. ముంబై కూడా మూడు మార్పులతో బరిలోకి దిగింది. లసిత్ మలింగ, సీఎం గౌతమ్, ఆండర్సన్ స్థానంలో క్రిష్ మార్ సంతోకి, శ్రేయాస్ గోపాల్, మైఖల్ హసీని తీసుకున్నారు. -
సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో పరాజయం
-
బెంగళూరే ‘ఫైనల్’
ఐపీఎల్ పాలక మండలి స్పష్టీకరణ ముంబై: ఐపీఎల్-7 ఫైనల్ ఎక్కడ జరుగుతుందనే సస్పెన్స్‌కు తెర పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే జూన్ 1న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్నట్టు ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ప్రకటించింది. వాస్తవానికి ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ జట్టు వేదికపై ఫైనల్ జరగడం ఆనవాయితీ. దీని ప్రకారం గతేడాది విజేత ముంబై ఇండియన్స్ వేదిక అయిన వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే జీసీ దీన్ని బెంగళూరుకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబై క్రికెట్ సంఘ (ఎంసీఏ) తమ నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. దీనికి ప్రతిగా తమ షరతులు అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని లీగ్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ ఎంసీఏకు లేఖ రాశారు. దీనికి వారు అంగీకరించినా శనివారం రాత్రి జరిగిన లీగ్ పాలక మండలి సమావేశంలో మాత్రం తాము ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడింది. ‘జీసీలో ఫైనల్ ఎక్కడ జరపాలనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎంసీఏ వినతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. అయితే చివరకు బెంగళూరే ఉత్తమమని ఏకగ్రీవంగా నిర్ణయించాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. -
ఆశలు సజీవం
కీలక మ్యాచ్‌లో నెగ్గిన బెంగళూరు రాణించిన గేల్, డివిలియర్స్ రైనా శ్రమ వృథా ఐపీఎల్-7 రాంచీ: ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సర్వశక్తులు ఒడ్డింది. పటిష్టమైన చెన్నై సూపర్‌కింగ్స్‌ను మొదట బౌలింగ్‌తో కట్టడి చేసి... ఆ తర్వాత నిలకడైన బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లి సేన 5 వికెట్ల తేడాతో ధోని బృందంపై విజయం సాధించింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసింది. సురేశ్ రైనా (48 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ హస్సీ (29 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్సర్), మెకల్లమ్ (13 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఆరోన్ 2, మురళీధరన్, అబూనెచిమ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. గేల్ (50 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్సర్), డివిలియర్స్ (14 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. అశ్విన్, హస్సీ చెరో రెండు వికెట్లు తీశారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రైనా జోరు... ఓపెనర్లలో స్మిత్ (9) తడబడగా మెకల్లమ్ రెండు సిక్సర్లతో దూకుడును కనబర్చాడు. అయితే మూడు బంతుల వ్యవధిలో ఆరోన్ ఈ జోడిని విడదీశాడు. దీంతో చెన్నై 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 39/2. ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్న రైనా, డేవిడ్ హస్సీలు నెమ్మదిగా ఆడారు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ జోడి ఆడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేసింది. చాహల్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు చెరో సిక్సర్ కొట్టి ఊపుతెచ్చారు. నిలకడగా ఆడుతున్న ఈ జంటను చివరకు మురళీధరన్ విడగొట్టాడు. షార్ట్ బంతిని ఫుల్ చేసిన హస్సీ... స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 35 బంతుల్లో రైనా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... అప్పుడే వచ్చిన ధోని (7) వేగంగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివర్లో జడేజా (10 నాటౌట్), రైనా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడంతో చెన్నై ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తడబడి... పుంజుకుని ఓపెనర్లు బ్యాట్ ఝుళిపించకపోవడంతో బెంగళూరు ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది. విధ్వంసకర హిట్టర్ గేల్‌ను మోహిత్ శర్మ బాగా కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో బెంగళూరు వికెట్ నష్టానికి 17 పరుగులు మాత్రమే చేసింది. అయితే బద్రీ బౌలింగ్‌లో సిక్సర్ సంధించిన గేల్... ఆ తర్వాత కూడా క్రీజ్‌లో చురుకుగా కదల్లేకపోయాడు. ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించిన కోహ్లి అనూహ్యంగా స్టంపౌట్ అయ్యాడు. గేల్‌తో కలిసి అతను రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. జడేజా బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్‌తో గేల్ భారీ షాట్లకు తెరలేపాడు. దాన్ని కొనసాగిస్తూ డివిలియర్స్... హస్సీ, అశ్విన్ ఓవర్లలో మూడు సిక్సర్లు సంధించాడు. అయితే వీరిద్దరు 17 బంతుల్లో 35 పరుగులు జోడించి స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన దశలో యువరాజ్ (13 నాటౌట్) సిక్సర్ కొట్టి గెలిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 9; బ్రెండన్ మెకల్లమ్ (సి) స్టార్క్ (బి) ఆరోన్ 19; రైనా నాటౌట్ 62; డేవిడ్ హస్సీ (సి) స్టార్క్ (బి) మురళీధరన్ 25; ధోని (సి) గేల్ (బి) అహ్మద్ 7; జడేజా నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 138 వికెట్ల పతనం: 1-29; 2-29; 3-104; 4-115. బౌలింగ్: మురళీధరన్ 4-0-29-1; స్టార్క్ 4-0-23-0; ఆరోన్ 3-0-29-2; అహ్మద్ 4-0-18-1; చాహల్ 4-0-27-0; రైనా 1-0-9-0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) అశ్విన్ 46; పార్థివ్ (సి) రైనా (బి) అశ్విన్ 10; కోహ్లి (స్టంప్డ్) ధోని (బి) జడేజా 27; డివిలియర్స్ (సి) జడేజా (బి) హస్సీ 28; యువరాజ్ నాటౌట్ 13; సచిన్ రాణా (బి) మెకల్లమ్ (బి) హస్సీ 1; అబూనెచిమ్ అహ్మద్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-14; 2-75; 3-110; 4-125; 5-138 బౌలింగ్: మోహిత్ శర్మ 2-0-13-0; అశ్విన్ 4-1-16-2; బద్రీ 3-0-15-0; రైనా 4-0-20-0; జడేజా 4-0-31-1; హస్సీ 2.5-0-38-2. -
హైదరాబాద్ ‘హ్యాట్రిక్’
సన్‌రైజర్స్‌కు వరుసగా మూడో పరాజయం ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం 7 వికెట్లతో కోల్‌కతా విజయం రాణించిన ఉమేశ్, ఉతప్ప, యూసుఫ్ పఠాన్ గత సీజన్లో సొంతగడ్డపై నిలకడగా రాణించిన సన్‌రైజర్స్‌కు ఈసారి ఉప్పల్ స్టేడియం అచ్చి రావడంలేదు. సమష్టి వైఫల్యంతో హైదరాబాద్ జట్టు ఈ మైదానంలో పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలుత బ్యాట్స్‌మెన్ రాణించకపోగా, ఆ తర్వాత బౌలర్లూ ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా ఏడో పరాజయంతో సన్‌రైజర్స్ జట్టు అవకాశాలు అస్తమించినట్లే! మరోవైపు గంభీర్ సేన మాత్రం తాజా విజయంతో ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది. సాక్షి, హైదరాబాద్ ఐపీఎల్-7లో ప్లే ఆఫ్ చేరాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరేలా లేవు. జట్టు ఖాతాలో మరో ఓటమి చేరడం రైజర్స్ అవకాశాలను దెబ్బ తీసింది. ఆదివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), యూసుఫ్ పఠాన్ (28 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్ పాండే (32 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఉమేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వార్నర్ ఒక్కడే... సన్‌రైజర్స్‌కు ఈసారి శుభారంభం లభించలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఫించ్ (8) వెనుదిరగ్గా... ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) కూడా తొందరగానే అవుటయ్యాడు. పవర్ ప్లేలో జట్టు 2 వికెట్లకు 41 పరుగులు చేయగలిగింది. 9 పరుగుల వద్ద ఉతప్ప స్టంప్ మిస్ చేయడంతో బతికిపోయిన నమన్ ఓజా (24 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ (14) పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు వార్నర్ మాత్రం దూకుడు ప్రదర్శించాడు. తనదైన శైలిలో భారీ సిక్సర్లతో పాటు కొన్ని చక్కటి షాట్లు కొట్టాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఉమేశ్ బౌలింగ్‌లో వార్నర్ వెనుదిరగడంతో స్కోరు వేగం మందగించింది. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా పెద్దగా పరుగులు రాలేదు. స్యామీ (16 బంతుల్లో 7) బంతులు వృథా చేయగా, చివరి 5 ఓవర్లలో సన్ 33 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... కోల్‌కతా కూడా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. స్టెయిన్ వేసిన రెండో ఓవర్లో అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో గంభీర్ (6) వెనుదిరిగాడు. రైజర్స్ చక్కటి బౌలింగ్, మెరుగైన ఫీల్డింగ్‌తో ఒత్తిడి పెంచడంతో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డ నైట్ రైడర్స్ పవర్ ప్లేలో కేవలం 30 పరుగులే చేయగలిగింది. అయితే మనీశ్ పాండే అండతో ఉతప్ప ధాటిగా ఆడాడు. 9 పరుగుల వద్ద ధావన్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతను, ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అనవసరపు పరుగులు ప్రయత్నించి రనౌట్ కావడంలో ఉతప్ప ఇన్నింగ్స్ ముగిసింది. పాండే కూడా చెలరేగి మిశ్రా వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టాడు. కొద్దిసేపటికే స్యామీ క్యాచ్ వదిలేసినా తర్వాతి బంతికే అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఈ దశలో యూసుఫ్ పఠాన్ చాలా కాలం తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడగా... చివర్లో టెన్ డస్కటే (15 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి బ్యాటింగ్‌తో నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు. భువనేశ్వర్ వేసిన 18, 20 ఓవర్లలో కలిపి 27 పరుగులు రాబట్టడంతో ఆ జట్టు విజయం సులువైంది. గౌతముని ఆగ్రహం... మైదానంలో అనుచిత ప్రదర్శనతో వివాదాల్లో నిలిచిన గంభీర్ కొన్నాళ్లుగా నియంత్రణలోనే ఉంటున్నాడు. కానీ ఆదివారం మ్యాచ్‌లో అతని కోపం పాత గంభీర్‌ను గుర్తుకు తెచ్చింది. స్టెయిన్ బౌలింగ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని ఒకే పరుగు చేసి అసహనంతో ఉన్న గౌతీ, ఆ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు. వికెట్‌కు దూరంగా వెళుతున్న బంతిని ఆడే ప్రయత్నం చేశాడు. అతని బ్యాట్‌కు బాల్ తగలకపోయినా స్వింగ్‌తో బంతి తన దిశ మార్చుకున్నట్లు కనిపించింది. దాంతో అంపైర్ గంభీర్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అంతే... అక్కడే బూతు పురాణం అందుకున్న గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డగౌట్ చేరే వరకు తిట్టుకుంటూనే వచ్చిన అతను బౌండరీ లైన్ బయటినుంచే బ్యాట్, గ్లవ్స్ విసిరేశాడు. కీలక మ్యాచ్‌లో ఇలా అవుట్ కావడంతో అతను పట్టరాని కోపం ప్రదర్శించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) మోర్కెల్ (బి) ఉమేశ్ 8; ధావన్ (సి) గంభీర్ (బి) నరైన్ 19; నమన్ ఓజా (సి) యూసుఫ్ (బి) షకీబ్ 22; వార్నర్ (సి) యూసుఫ్ (బి) ఉమేశ్ 34; రాహుల్ (ఎల్బీ) (బి) చావ్లా 14; ఇర్ఫాన్ పఠాన్ (నాటౌట్) 23; స్యామీ (సి) పాండే (బి) షకీబ్ 7; కరణ్ శర్మ (రనౌట్) 4; స్టెయిన్ (బి) ఉమేశ్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-14; 2-41; 3-64; 4-98; 5-104; 6-129; 7-139; 8-142. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-39-0; ఉమేశ్ యాదవ్ 4-0-26-3; నరైన్ 4-0-21-1; షకీబ్ 3-0-22-2; డస్కటే 1-0-8-0; చావ్లా 4-0-24-1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (రనౌట్) 40; గంభీర్ (సి) ఓజా (బి) స్టెయిన్ 6; పాండే (సి) ఫించ్ (బి) కరణ్ 35; యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 39; డస్కటే (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-8; 2-59; 3-104. బౌలింగ్: భువనేశ్వర్ 3.4-0-37-0; స్టెయిన్ 4-0-24-1; కరణ్ శర్మ 4-0-19-1; స్యామీ 1-0-7-0; మిశ్రా 4-0-38-0; ఇర్ఫాన్ 3-0-20-0. కెప్టెన్‌గా స్యామీ... ఐపీఎల్లో పది మ్యాచ్‌లు ఆడిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించింది. ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ కావడంతో హైదరాబాద్ అప్పట్లో మరో మాటకు తావు లేకుండా శిఖర్ ధావన్‌కే కెప్టెన్సీ అప్పగించింది. అయితే టోర్నీలో ఏ దశలోనూ శిఖర్ నాయకుడిగా తన ముద్ర చూపించలేకపోయాడు. పైగా కీలక సమయాల్లో అనేక చెత్త, ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకొని తన వైఫల్యాన్ని బయటపెట్టాడు. దాంతో వెస్టిండీస్ జాతీయ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీని ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా నియమించారు. గత ఏడాది కూడా సంగక్కర కెప్టెన్‌గా టోర్నీని ఆరంభించిన ఈ జట్టు సగం ముగిశాక కామెరాన్ వైట్‌కు బాధ్యతలు అప్పగించింది. ధావన్ తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. కెప్టెన్‌గా స్యామీ... ఐపీఎల్లో పది మ్యాచ్‌లు ఆడిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించింది. ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ కావడంతో హైదరాబాద్ అప్పట్లో మరో మాటకు తావు లేకుండా శిఖర్ ధావన్‌కే కెప్టెన్సీ అప్పగించింది. అయితే టోర్నీలో ఏ దశలోనూ శిఖర్ నాయకుడిగా తన ముద్ర చూపించలేకపోయాడు. పైగా కీలక సమయాల్లో అనేక చెత్త, ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకొని తన వైఫల్యాన్ని బయటపెట్టాడు. దాంతో వెస్టిండీస్ జాతీయ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీని ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా నియమించారు. గత ఏడాది కూడా సంగక్కర కెప్టెన్‌గా టోర్నీని ఆరంభించిన ఈ జట్టు సగం ముగిశాక కామెరాన్ వైట్‌కు బాధ్యతలు అప్పగించింది. ధావన్ తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్ ఆనందించండి... కామెంటరీలో రవిశాస్త్రి శైలే వేరు. ఆకాశం బద్దలయ్యేలా గొంతు చించుకొని మాట్లాడతారు. చేతిలో మైక్ ఉన్నా... దాని అవసరం లేనట్లే అరిచే ఆ గొంతు మైక్ లేకుండానే మైదానం అంతా వినిపించగలదు. ఆదివారం కూడా టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ప్రేక్షకులవైపు తిరిగారు. ‘హైదరాబాద్... ఆనందించండి’ అంటూ తెలుగులో పెద్దగా వేసిన కేకకు స్టేడియం అదిరిపోయింది. అభిమానులు కూడా దీటుగా స్పందించడంతో మైదానం హోరెత్తిపోయింది. -
హౌస్‌ఫుల్...
ఐపీఎల్-7లో హైదరాబాద్‌కు దక్కిన నాలుగు మ్యాచుల్లో ఆదివారం వచ్చిన ఏకైక మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికే చాలా వరకు స్టేడియంలో జనం ఉండగా, ఆ తర్వాత కొద్ది సేపటికే సీట్లు ఫుల్ అయిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం మ్యాచ్‌కు 28,584 మంది ప్రేక్షకులు వచ్చారు. స్టేడియంలో వేర్వేరు కారణాలతో అనుమతించని గ్యాలరీలు మినహా మిగతా స్టేడియం పూర్తిగా అభిమానులతో నిండింది. మధ్యాహ్నం సమయంలో నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురవడంతో ఉప్పల్‌లో కూడా అలాంటి పరిస్థితి రావచ్చని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఎలాంటి వర్షం ప్రభావం ఉండకపోవడంతో సరైన సమయానికే మ్యాచ్ ఆరంభమైంది. ప్రేక్షకులు కూడా పూర్తిగా ఎంజాయ్ చేశారు. -
సొంతగడ్డపై సన్ రైజర్స్ ఓటమి
హైదరాబాద్: సొంతగడ్డపై హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు నిరాశ ఎదురైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్లతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మరో రెండు బంతులు మిగిలుండగా మూడు వికెట్లకు విజయతీరాలకు చేరింది. రాబిన్ ఊతప్ప 40, మనీష్ పాండే 35, యూసుఫ్ పఠాన్ 39 (నాటౌట్), టెన్ డస్కాటే 25 (నాటౌట్) పరుగుల చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 142 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 19, నమన్ ఓజా 22, డేవిడ్ వార్నర్ 34, ఇర్ఫాన్ పఠాన్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లు ఉమేష్ మూడు, షకీబల్ రెండు వికెట్లు తీశారు. -
కోల్‌కతా లక్ష్యం 143 : హైదరాబాద్‌తో మ్యాచ్
హైదరాబాద్: సొంతగడ్డపై హైదరాబాద్ సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ ఫర్వాలేదనిపించారు. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హైదరాబాద్ 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 142 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 19, నమన్ ఓజా 22, డేవిడ్ వార్నర్ 34, ఇర్ఫాన్ పఠాన్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లు ఉమేష్, షకీబల్ రెండేసి వికెట్లు తీశాడు. -
రైజర్స్‌కు చావో.. రేవో
కోల్‌కతాతో నేడు కీలక మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇక దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సొంత వేదిక ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలిమ్యాచ్‌లో ముంబైపై బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా ఓడినా.. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 205 పరుగుల భారీస్కోరు చేసి కూడా కాపాడుకోలేకపోయింది. డేల్ స్టెయిన్, భువనేశ్వర్, అమిత్ మిశ్రా, కరణ్ శర్మ వంటిబౌలర్లున్నా పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయారు. అయితే ప్రధానంగా బౌలింగ్ బలంపైనే ఆధారపడిన సన్‌రైజర్స్.. పంజాబ్‌పై ఓడినా భారీస్కోరు చేయడం జట్టుకు శుభసూచకమే. ఫించ్, వార్నర్, నమన్ ఓజాలు ఫామ్‌ను ప్రదర్శిస్తుండగా... తాజాగా కెప్టెన్ ధావన్ కూడా గాడిలో పడ్డాడు. అయితే వీరంతా సమష్టిగా రాణించడంపైనే భారీస్కోరు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. సూపర్‌ఫామ్‌లో నైట్‌రైడర్స్ మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుస విజయాలతో ఊపుమీదుంది. లీగ్‌లో తొలుత అనూహ్య పరాజయాలతో వెనకబడినా.. ఆపై తేరుకొని మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. ఈ సీజన్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న పంజాబ్‌ను ఓడించడంతో పాటు ఆ తర్వాత వరుసగా మరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో... రెట్టించిన ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. సన్‌రైజర్స్‌తో పోలిస్తే.. 10 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉన్న కోల్‌కతా ప్లే ఆఫ్‌కు చేరువగా ఉంది. కెప్టెన్ గంభీర్, ఉతప్పలు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతోపాటు నాణ్యమైన విదేశీ, దేశవాళీ బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉన్నారు. బౌలింగ్‌లోనూ కలిస్, మోర్కెల్, వినయ్‌కుమార్, చావ్లా వంటి వారితో పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో కోల్‌కతా జైత్రయాత్రకు హైదరాబాద్ ఏ మేరకు బ్రేక్ వేయగలుగుతుందనేది ఆసక్తికరం. -
ఒక్క బెర్త్... మూడు జట్లు!
ఆసక్తికరంగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు మూడు జట్లకు బెర్త్‌లు దాదాపు ఖాయం రెండు జట్లకు ఆశలు లేవు ఐపీఎల్-7 కీలక దశకు చేరింది. ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 15 మ్యాచ్‌లు. మూడు జట్లు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ఖాయం చేసుకోగా... రెండు జట్లు అవకాశం లేని స్థితిలో నిలిచాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం మూడు జట్లు రేస్‌లో నిలిచాయి. కనీసం 16 పాయింట్లకు చేరుకునే జట్లు ప్లే ఆఫ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. ఇక లీగ్ దశలో టాప్-2లో నిలవడం కూడా కీలకం. ప్లే ఆఫ్ దశలో ఒక మ్యాచ్‌లో ఓడిపోయినా ఫైనల్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెన్నై, పంజాబ్, రాజస్థాన్ లాంటి జట్ల లక్ష్యం ఇది. ప్రస్తుత సమీకరణాలను బట్టి లీగ్‌లో ముందంజ వేసేందుకు ఆయా జట్లకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం. - సాక్షి క్రీడావిభాగం కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుత స్థితి: ఐదు మ్యాచ్‌లు గెలిచి ఐదు ఓడటంతో జట్టు ఖాతాలో 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. జట్టుకు మిగిలిన నాలుగు మ్యాచుల్లో కనీసం మూడు విజయాలు అవసరం. ఆడాల్సిన మ్యాచ్‌లు: హైదరాబాద్‌తో రెండు, చెన్నై, బెంగళూరులతో ఒక్కోటి ఆడాల్సి ఉంది. అవకాశాలు: వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గి ఫామ్‌లోకి రావడంతో ప్లే ఆఫ్‌పై ఆశలు నిలిచాయి. చెన్నై పటిష్టమైన ప్రత్యర్థి కాబట్టి ఇతర మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలి. నాలుగులో మూడు మ్యాచ్‌లు సొంతగడ్డపైనే జరుగుతుండటం అనుకూలాంశం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్తుత స్థితి: టోర్నీలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 2 మాత్రమే ఓడింది. ఆడాల్సిన మ్యాచ్‌లు: ఢిల్లీతో రెండు, ముంబై, రాజస్థాన్లతో ఒక్కో మ్యాచ్ అవకాశాలు: ప్లే ఆఫ్‌కు దాదాపుగా చేరినట్లే. మరో విజయం ఆ జట్టు ఖాతాలో చేరితే ఖరారు అవుతుంది. ఫామ్‌ను బట్టి చూస్తే కనీసం రెండు మ్యాచ్‌లు సునాయాసంగా గెలవవచ్చు. అయితే టాప్-2లో నిలవాలని జట్టు భావిస్తోంది. అలా అయితే తొలి ప్లే ఆఫ్‌లో ఓడినా మరో మ్యాచ్ అవకాశం దక్కుతుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత స్థితి: 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం కాకపోయినా చేరువలోనే ఉంది. ఆడాల్సిన మ్యాచ్‌లు: ముంబైతో రెండు, పంజాబ్‌తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అవకాశాలు: మ్యాచ్ ఆరంభానికి ముందు సాధారణంగా కనిపిస్తున్నా...మైదానంలో దిగాక రాజస్థాన్ జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో కొన్ని సంచలన విజయాలు నమోదు చేసిన ఈ టీమ్ ముంబైని కనీసం ఒక మ్యాచ్‌లో ఓడించినా 16 పాయింట్లకు చేరుకొని అవకాశాలు మెరుగు పర్చుకుంటుంది. పంజాబ్ బలంగా ఉంది కాబట్టి ముంబైపై రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్-2 ఆశలు ఉంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత స్థితి: ఇప్పటి వరకు నాలుగే విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉంది. సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిన ఈ జట్టు సత్తాను విశ్లేషిస్తే నిరాశాజనకంగా కనిపిస్తుంది. ఆడాల్సిన మ్యాచ్‌లు: కోల్‌కతాతో రెండు, బెంగళూరు, చెన్నైలతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. అవకాశాలు: మిగిలిన నాలుగూ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరవచ్చు. కనీసం మూడు నెగ్గితే ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. కానీ ఫామ్ చూస్తే అది అంత సులువు కాదు. ఉప్పల్‌లో మిగిలిన రెండూ గెలిచినా చెన్నైపై విజయం అంత సులువు కాదు. కాబట్టి కోల్‌కతాను రెండుసార్లూ ఓడించాల్సిందే. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రస్తుత స్థితి: గత ఏడాదిలాగే ఈ సారి కూడా అందరికంటే ముందే లీగ్‌నుంచి ఈ జట్టు నిష్ర్కమించింది. 11 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచిన ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. ఆడాల్సిన మ్యాచ్‌లు: రెండు పంజాబ్‌తో, ఒక మ్యాచ్ ముంబైతో ఆడాల్సి ఉంది. అవకాశాలు: ఏ మాత్రం లేవు. ఇతరుల అవకాశాలు చెడగొట్టం కూడా ఆ జట్టుకు సాధ్యం కాదు. ఎందుకంటే దాదాపు ప్లే ఆఫ్‌కు చేరిన పంజాబ్‌తో, దాదాపుగా నిష్ర్కమించిన ముంబైతోనే మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక వేళ ముంబైని ఓడించగలిగినా పంజాబ్‌పై రెండు మ్యాచ్‌ల్లో గెలుపు అనేది ప్రస్తుత ఫామ్‌తో అత్యాశే అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత స్థితి: పాయింట్లలో పంజాబ్‌తో సమానంగా (16) ఉన్నా... రన్‌రేట్ కాస్త తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. ఆడాల్సిన మ్యాచ్‌లు: బెంగళూరుతో రెండు, హైదరాబాద్, కోల్‌కతాలతో ఒక్కోటి ఆడాల్సి ఉంది. అవకాశాలు: ఈ స్థితిలో ధోని సేన కూడా ప్లే ఆఫ్‌కు చేరువైనట్లే. ప్రత్యర్థి బలాలను బట్టి చూస్తే మరో రెండు మ్యాచ్‌లు కూడా నెగ్గవచ్చు. ఈ జట్టు కూడా కచ్చితంగా టాప్-2లో ఉండాలనే లక్ష్యంతో ఉంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుత స్థితి: సరిగ్గా సన్‌రైజర్స్ స్థితిలోనే బెంగళూరు కూడా నిలిచింది. ఆ జట్టుకూ 8 పాయింట్లే ఉన్నాయి. తమతో పోటీలో ఉన్న కోల్‌కతా, హైదరాబాద్‌లను వెనక్కి నెట్టాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు నెగ్గడం ఒక్కటే మార్గం. ఆడాల్సిన మ్యాచ్‌లు: చెన్నైతో రెండు, హైదరాబాద్, కోల్‌కతాలతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అవకాశాలు: గత మ్యాచ్‌లో భారీ విజయంతో టీమ్ అదృష్టం మారినట్లు కనిపించినా...లీగ్‌లో కీలక సమయాల్లో ఈ జట్టు మ్యాచ్‌లు చేజార్చుకుంటోంది. చెన్నైని కనీసం ఒక సారి ఓడించడంతో పాటు, ఇతర మ్యాచ్‌లు గెలిస్తే ప్రత్యర్థుల గణాంకాలపై ఆధార పడవచ్చు. కానీ వాస్తవికంగా ఇది అంత సులభం కాదు. ముంబై ఇండియన్స్ ప్రస్తుత స్థితి: ఆడిన 10లో ఏడు మ్యాచ్‌లు ఓడి 6 పాయింట్లతోనే ఉన్న ఈ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు నెగ్గినా 14 పాయింట్లకే పరిమితమవుతుంది. ఆడాల్సిన మ్యాచ్‌లు: రాజస్థాన్‌తో రెండు, ఢిల్లీ, పంజాబ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. అవకాశాలు: సీజన్లో ఘోర వైఫల్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న ఫామ్‌తో పంజాబ్, రాజస్థాన్‌లను ఓడించటం దాదాపుగా కష్టమే. కాబట్టి ముంబైకి దారులు మూసుకుపోయినట్లే. దీనికి తోడు మలింగ కూడా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లండ్‌తో టి20ల కోసం మలింగ లంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు వెళ్లాడు. -
రాజస్థాన్ రాజసం
ఐపీఎల్-7లో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌ల్లో మరొకటి చేరింది. ఈసారి కూడా అందులో ఢిల్లీ పాత్ర ఉంది. రాజస్థాన్ సమష్టి ప్రదర్శనతో రెండొందలకు పైగా స్కోరు చేస్తే...పది ఓవర్లు ముగిసే సరికే ఢిల్లీ చేతులెత్తేసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించినా ఆ జట్టు ఆటతీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. మరో వైపు భారీ విజయంతో రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగు పర్చుకుంది. అహ్మదాబాద్: ఐపీఎల్ మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ దశకు మరింత చేరువైంది. బ్యాటింగ్‌లో రహానే (50 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్), శామ్సన్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 62 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. గురువారం అహ్మదాబాద్‌లోని మొతేరాలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. రహానే, శామ్సన్తో పాటు కూపర్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (8 బంతుల్లో 23 నాటౌట్; 3 సిక్స్‌లు) రాణించారు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనోజ్ తివారి (44 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రహానే, శామ్సన్ మెరుపులు కెప్టెన్ షేన్ వాట్సన్ తుది జట్టులో లేకుండానే బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు రహానే, కరుణ్ నాయర్ శుభారంభాన్ని ఇచ్చారు. ఢిల్లీ బౌలర్లపై మొదటినుంచి వీరు ఆధిక్యం ప్రదర్శించడంతో పవర్ ప్లేలో స్కోరు 52 పరుగులకు చేరింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెవాన్ కూపర్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టి జోరుమీదున్న కూపర్ (32)ను డుమిని వెనక్కిపంపాడు. కూపర్ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన సంజు శామ్సన్ జట్టు స్కోరును పెంచే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. కౌల్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రాజస్థాన్ స్కోరు 150 పరుగులు దాటిన తర్వాత రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మరింతగా విజృంభించారు. స్కోరు పెంచే ప్రయత్నంలో రహానే(64) అవుటయ్యాడు. మూడో వికెట్‌కు శామ్సన్తో కలిసి రహానే 74 పరుగులు జోడించారు. చివర్లో ఫాల్క్‌నర్ (23 నాటౌట్) విజృంభించడంతో రాయల్స్ స్కోరు రెండొందలు దాటింది. చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్ 60 పరుగులు రాబట్టింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం లక్ష్యఛేదనను ధాటిగా ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మూడో ఓవర్లోనే తొలి వికెట్ చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరు 4 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అగర్వాల్ (17) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కార్తీక్ (3) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. జట్టు స్కోరు నెమ్మదించడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 34 పరుగులు మాత్రమే చేసింది. డుమిని (8)ని తాంబే వెనక్కి పంపగా... భాటియా వరుస ఓవర్లలో పీటర్సన్ (13), టేలర్ (4)లను అవుట్ చేశాడు. దీంతో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆ తర్వాత ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇక 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మనోజ్ తివారి ధాటిగా బ్యాటింగ్ చేసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ జాదవ్ (3), నదీమ్ (1), తాహిర్ (4), శుక్లా (14) విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా ఆరో ఓటమి తప్పలేదు. పీటర్సన్...రనౌట్ కథ! రనౌట్‌లో కూడా నాటౌట్‌గా మిగలడం ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్కే సాధ్యమేమో...ఈ సారి ఐపీఎల్లో ఒకటి కాదు రెండు సార్లు, అదీ రాజస్థాన్‌తో మ్యాచుల్లోనే ఇది చోటు చేసుకోవడం విశేషం. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో కార్తీక్ షాట్ ఆడగా పీటర్సన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే పాయింట్ స్థానంనుంచి ఉన్ముక్త్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకింది. అయితే పీటర్సన్ క్రీజ్‌లోకి చేరుకున్నాడని భావించిన రాజస్థాన్ పెద్దగా అప్పీలు చేయలేదు. దాంతో అంపైర్లూ పట్టించుకోలేదు. అయితే రీప్లేలో చూస్తే కెవిన్ ఖచ్చితంగా అవుటే! అతని బ్యాట్ క్రీజ్‌కు కాస్త బయటే ఉండిపోయింది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో కేపీ బతికిపోయాడు. రాజస్థాన్‌తోనే జరిగిన గత మ్యాచ్‌లో కూడా పీటర్సన్ రనౌట్ అయినట్లు స్పష్టంగా కనిపించినా ఫీల్డ్ అంపైర్ రీప్లే కోరకపోవడంతో నాటౌట్‌గా మిగిలాడు. దీనిపై జట్టు కెప్టెన్ వాట్సన్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆ తర్వాత అంపైర్ సంజయ్ హజారేను లీగ్‌నుంచి సస్పెండ్ చేశారు. అయితే రెండు సార్లు రనౌట్ అయి కూడా నాటౌట్‌గా ప్రకటించుకోగలగడం పీటర్సన్‌ను కూడా ఆశ్చర్యపరచి ఉంటుంది. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) నదీమ్ 64; నాయర్ ఎల్బీడబ్ల్యూ (బి) నదీమ్ 19; కూపర్ (సి) శుక్లా (బి) డుమిని 32; శామ్సన్ (సి) జాదవ్ (బి) తాహిర్ 40; స్టువర్ట్ బిన్ని (స్టంప్డ్) కార్తీక్ (బి) తాహిర్ 0; కటింగ్ రనౌట్ 8; ఫాల్క్‌నర్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) : 201. వికెట్ల పతనం: 1-44; 2-93; 3-167; 4-168; 5-169; 6-201. బౌలింగ్: డుమిని 3-0-25-1; రాహుల్ శుక్లా 4-0-44-0; కౌల్ 3-0-34-0; నదీమ్ 4-0-35-2; తాహిర్ 4-0-25-2; మనోజ్ తివారి 2-0-28-0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) భాటియా 13; అగర్వాల్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 17; కార్తీక్ (సి) కటింగ్ (బి) కులకర్ణి 3; డుమిని (సి) నాయర్ (బి) తాంబే 8; తివారి నాటౌట్ 61; రాస్ టేలర్ (సి) అండ్(బి) భాటియా 4; జాదవ్ రనౌట్ 3; నదీమ్ (బి) కటింగ్ 1; తాహిర్ (బి) బిన్ని 4; శుక్లా (సి) స్మిత్ (బి) కూపర్ 14; కౌల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం ( 20 ఓవర్లలో 9 వికెట్లకు) : 139. వికెట్ల పతనం: 1-19; 2-30; 3-43; 4-48; 5-58; 6-75; 7-86; 8-91; 9-120. బౌలింగ్: కులకర్ణి 4-1-24-1; కటింగ్ 4-0-31-1; ఫాల్క్‌నర్ 1-0-6-1; కూపర్ 3-0-19-1; తాంబే 3-0-24-1; భాటియా 3-0-18-2; బిన్ని 2-0-14-1. -
స్మిత్ వర్సెస్ పీటర్సన్
న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో ప్లేఆప్ ఆశలు వదులుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ గురువారమిక్కడ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా రాజస్థాన్ జట్టుకు యువ క్రికెటర్ స్టీవెన్ స్మిత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వాట్సన్ ఈ మ్యాచ్‌కు దూరంగా కావడంతో స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించారు. రాజస్థాన్ జట్టులో శామ్సన్, ధావన్ కులకర్ణి, బెన్ కటింగ్ వచ్చారు. ఢిల్లీ జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. మనోజ్ తివారి, రాస్ టేలర్, నదీమ్ జట్టులోకి వచ్చారు. ప్లేఆప్ రేసు నుంచి దాదాపుగా వైదొలగిన ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలవాలని భావిస్తోంది. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో నెగ్గి ప్లేఆప్ కు మరింత దగ్గర కావాలన్న పట్టుదలతో ఉంది. -
మూడో స్థానమే ఇష్టం: నమన్ ఓజా
హైదరాబాద్: మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయడం తనకిష్టమని హైదరాబాద్ సన్‌రైజర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నమన్ ఓజా పేర్కొన్నాడు. ఈ స్థానంలో కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పాడు. మంచి భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఇది సరైన స్థానమని అభిప్రాయపడ్డాడు. ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగితే మొదటి బంతి నుంచి బాదడం కష్టమవుతుందన్నాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగితే ఇన్నింగ్స్ నిర్మించేందుకు సమయం దొరుకుతుందని వివరించాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓజా అర్థసెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. -
ఉతప్ప ‘మోత'
కోల్‌కతా విజయాల హ్యాట్రిక్ ముంబైపై 6 వికెట్ల తేడాతో గెలుపు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం రోహిత్‌సేనకు సంక్లిష్టం వారం రోజుల్లోనే ఎంత తేడా..! వరుస ఓటములతో, బ్యాటింగ్ సమస్యలతో అల్లాడిన జట్టు ఇదేనా..! ఇప్పుడు కోల్‌కతాను చూస్తే ఇదే అనిపిస్తోంది. ముఖ్యంగా ఉతప్ప.... వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాను గెలిపించాడు. గంభీర్ సేనకు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. కటక్: ఐపీఎల్-7లో కాస్త ఆలస్యంగా కోలుకున్నా... కోల్‌కతా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. బుధవారం ఇక్కడి బారాబతి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేస్తే.. ఆపై ఉతప్ప (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా ఛేదించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాయుడు (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఉతప్పకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ముంబై నత్త నడక.. స్లో పిచ్‌పై నత్త నడకన ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబైకి పవర్ ప్లే ముగిసేటప్పటికే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. గౌతమ్ (8)ను మోర్నీ మోర్కెల్, సిమ్మన్స్ (12)ను షకీబ్ అవుట్ చేశారు. దీంతో ఆరు ఓవర్లలో ముంబై 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత రోహిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించాక రాయుడు కూడా వెనుదిరిగాడు. కోరీ అండర్సన్ క్రీజులోకి వస్తూనే ఓ సిక్స్, ఫోర్‌తో ఎదురుదాడికి దిగి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. మోర్కెల్ వేసిన 16వ ఓవర్లో రోహిత్ రెండు భారీసిక్స్లు బాదినా.. అదే ఓవర్లో అండర్సన్ (18) ఔటయ్యాడు. రోహిత్‌కు పొలార్డ్ జత కలిసినా.. చివరి ఐదు ఓవర్లలో ముంబై 42 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉతప్ప నిలకడ.. లక్ష్యఛేదనలో కోల్‌కతాకు గంభీర్-ఉతప్ప మరోసారి శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఆ తరువాత మనీష్ పాండేతో కలిసి ఛేజింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో పాండే (14), లక్ష్యానికి 26 పరుగుల దూరంలో ఉతప్ప అవుటయ్యాడు. విజయం ముంగిట షకీబ్ (9) కూడా అవుటైనా..యూసుఫ్ పఠాన్ (13 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) కోల్‌కతాను గమ్యానికి చేర్చాడు. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి) షకీబ్ 12, గౌతమ్ (సి) సూర్యకుమార్ (బి) మోర్నీ మోర్కెల్ 8, రాయుడు (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 33, రోహిత్ (బి) నరైన్ 51, అండర్సన్ (సి) చావ్లా (బి) మోర్కెల్ 18, పొలార్డ్ (నాటౌట్) 10, తారే (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1-12, 2-35, 3-70, 4-115, 5-138. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-35-2, ఉమేశ్ యాదవ్ 3-0-24-0, షకీబ్ 4-0-21-1, నరైన్ 4-0-18-1, చావ్లా 4-0-32-1, యూసుఫ్ పఠాన్ 1-0-10-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) సిమ్మన్స్ 80, గంభీర్ (బి) హర్భజన్ 14, మనీష్ పాండే (బి) హర్భజన్ 14, యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 20, షకీబ్ అల్ హసన్ (సి) రాయుడు (బి) మలింగ 9, టెన్ డెస్కాటె (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం: (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-50, 2-96, 3-116, 4-138. బౌలింగ్: మలింగ 3.4-0-30-1, బుమ్రాహ్ 3-0-23-0, హర్భజన్ 4-0-22-2, ఓజా 4-0-25-0, సిమ్మన్స్ 3-0-34-1, పొలార్డ్ 1-0-7-0. -
భారీ స్కోరు చేసినా హైదరాబాద్ ఓటమి
-
భారీ స్కోరు చేసినా హైదరాబాద్ ఓటమి
హైదరాబాద్: సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్‌కు నిరాశ ఎదురైంది. భారీ స్కోరు సాధించినా విజయం వరించలేదు. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా బుధవారం కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్లతో ఓటమి చవిచూసింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగా నాలుగు వికెట్ల నష్టానికి అలవోకగా విజయతీరాలకు చేరింది. సెహ్వాగ్ 4 పరుగులకే వెనుదిరిగినా మనన్ వోరా (47), సాహా (54), మ్యాక్స్‌వెల్ (43), డేవిడ్ మిల్లర్ విజృంభించడంతో పంజాబ్ గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు సాధించింది. సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (45), అరోన్ ఫించ్ (20) 65 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం నమన్ ఓజా (36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఓజాకు డేవిడ్ వార్నర్ (23 బంతుల్లో 44) జతకలవడంతో హైదరాబాద్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. స్కోరు 200 దాటింది. పంజాబ్ బౌలర్ రుషి ధావన్ రెండు వికెట్లు తీశాడు. -
హైదరాబాద్‌లో చెలరేగిన సన్‌రైజర్స్
ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 206 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు నిర్దేశించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (45), అరోన్ ఫించ్ (20) 65 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం నమన్ ఓజా (36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఓజాకు డేవిడ్ వార్నర్ (23 బంతుల్లో 44) జతకలవడంతో హైదరాబాద్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. స్కోరు 200 దాటింది. పంజాబ్ బౌలర్ రుషి ధావన్ రెండు వికెట్లు తీశాడు. -
ఐపీఎల్-7: చెన్నై ఐదు వికెట్లతో రాజస్థాన్‌పై విజయం
రాంచీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మరో రెండు బంతులు మిగిలుండగా ఐదు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. డ్వెన్ స్మిత్ (44), డుప్లెసిస్ (38) రాణించారు. చివర్లో ధోనీ , జడేజా జట్టును గెలిపించారు. అంతుకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ (36 బంతుల్లో 51) మెరుపు హాప్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ అంకిత్ శర్మ (30)తో కలసి 60 పరుగుల భాగస్వామంతో జట్టుకు శుభారంభం అందించాడు. కాగా వీరిద్దరూ అవుటయ్యాక రాజస్థాన్ జోరు కాస్త తగ్గింది. చివర్లో స్టువర్ట్ బిన్నీ (22) రాణించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలయ్యారు. చెన్నయ్ బౌలర్లు మోహిత్ శర్మ మూడు, రవీంద్ర జడేజా రెండు రెండేసి వికెట్లు తీశారు. -
రాజస్థాన్‌తో మ్యాచ్: చెన్నయ్ లక్ష్యం 149
రాంచీ: ఐపీఎల్ ఏడో అంచెలో రాజస్థాన్ రాయల్స్ 149 పరుగుల లక్ష్యాన్ని చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు నిర్దేశించింది. మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ (36 బంతుల్లో 51) మెరుపు హాప్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ అంకిత్ శర్మ (30)తో కలసి 60 పరుగుల భాగస్వామంతో జట్టుకు శుభారంభం అందించాడు. కాగా వీరిద్దరూ అవుటయ్యాక రాజస్థాన్ జోరు కాస్త తగ్గింది. చివర్లో స్టువర్ట్ బిన్నీ (22) రాణించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలయ్యారు. చెన్నయ్ బౌలర్లు మోహిత్ శర్మ మూడు, రవీంద్ర జడేజా రెండు రెండేసి వికెట్లు తీశారు. -
చెన్నైతో మ్యాచ్: బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్
రాంచీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. మంగళవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నయ్ జట్టులో మిథున్ మన్హాస్ స్థానంలో యువ బ్యాట్స్‌మన్ విజయ్ శంకర్‌కు అవకాశమిచ్చారు. ఇక రాజస్థాన్ జట్టులో మూడు మార్పులు చేశారు. సంజు శామ్సన్, కేన్ రిచర్డ్స్‌న్,రాహుల్ టెవాటియాను పక్కనబెట్టి, యగ్నిక్, కెవోన్ కూపర్, అంకిత్ శర్మలను జట్టులోకి తీసుకున్నారు. -
రైజర్స్‌కు ‘సొంత’ దెబ్బ
- ముంబైని గెలిపించిన రాయుడు - మెరిసిన సిమ్మన్స్ - ఫించ్, వార్నర్‌ల శ్రమ వృథా - సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలతో సొంతగడ్డపై వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చిన సన్‌రైజర్స్‌కు... హైదరాబాద్‌లోని తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ జట్టులోని హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు సొంతగడ్డపై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రైజర్స్‌ను దె బ్బతీశాడు. సిమ్మన్స్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడటంతో ఈ సీజన్లో ఉప్పల్‌లో తొలి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. సాక్షి, హైదరాబాద్: తెలుగు తేజం అంబటి రాయుడు (46 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్స్‌లు) చేతిలో హైదరాబాద్ జట్టు ఓడింది. సోమవారం ఉప్పల్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌ను ఒక్కమాటలో ఇలాగే చెప్పాలి. సొంత మైదానంలో, సొంత ప్రేక్షకుల మధ్య రాష్ట్రానికి చెందిన ఆటగాడు ప్రత్యర్థి జట్టును గెలిపించడం వింతగా అనిపించినా అదే జరిగింది. రాయుడుతో పాటు సిమ్మన్స్ (50 బంతుల్లో 68; 5 ఫోర్లు; 4 సిక్స్‌లు) కూడా రాణించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు సన్‌రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఫించ్ (62 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్స్), వార్నర్ (31 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్స్) మాత్రమే రాణించారు. మలింగకు రెండు వికెట్లు దక్కాయి. భువనేశ్వర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాయుడుకు దక్కింది. రాణించిన ఫించ్ టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓ మోస్తరు శుభారంభం దక్కింది. మూడో ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు బాది 13 పరుగులు సాధించాడు. అయితే మలింగ తన తొలి ఓవర్లో కెప్టెన్ ధావన్ (11 బంతుల్లో 11; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేశాడు. ఓజా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఫించ్ 6, 4 బాదడంతో పవర్ ప్లేలో 43 పరుగులు వచ్చాయి. అటు ఫించ్ తన జోరును ప్రదర్శించాడు. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ స్థానంలో బరిలోకి దిగిన ఓజాను లక్ష్యం చేసుకుని పరుగులు బాగానే పిండుకున్నాడు. ఈ సమయంలో లేని పరుగు కోసం యత్నించి లోకేశ్ రాహుల్ (13 బంతుల్లో 10; 1 ఫోర్) రనౌట్ అయ్యాడు. కవర్లో బంతిని పుష్ చేసిన తను పరుగు కోసం వెళ్లాడు. అయితే రోహిత్ వేగంగా స్పందించడంతో రనౌట్ అయ్యాడు. రెండో వికెట్‌కు 39 పరుగులు వచ్చాయి. ఈ దశలో ఫించ్‌కు వార్నర్ జత కలిశాడు. ఫించ్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్ కూడా బ్యాట్‌ను ఝళిపించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఈ దశలో మలింగ్ బౌలింగ్‌లో ఫించ్ లాంగ్ ఆఫ్‌లో భారీ సిక్స్‌కు యత్నించి పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్లో నమన్ ఓజా (3 బంతుల్లో 7 నాటౌట్; 1 సిక్స్) ఓ సిక్స్‌తో పాటు వార్నర్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ 33 పరుగులు సాధించింది. సిమ్మన్స్, రాయుడు జోరు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభంలో సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుత రీతిలో అడ్డుకున్నారు. తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులే రాగా రెండో ఓవర్లో ఓపెనర్ గౌతమ్ (1)ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. అయితే మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్, అంబటి రాయుడు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇర్ఫాన్ తొలి ఓవర్లో సిమ్మన్స్ 6, 4, 6 తో విరుచుకుపడ్డాడు. ఇదే ఊపును కొనసాగిస్తూ కరణ్ శర్మ బౌలింగ్‌లోనూ 4, 6తో రెచ్చిపోగా.... రాయుడు పఠాన్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో ఆడుకున్నాడు. ఆ తర్వాత కూడా హైదరాబాద్ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో వీరు యథేచ్ఛగా ఆడారు. 39 బంతుల్లో సిమ్మన్స్ అర్ధ సెంచరీ చేసుకోగా.. రాయుడు 34 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని భువనేశ్వర్ విడదీశాడు. ర్యాంప్ షాట్‌కు యత్నించిన సిమ్మన్స్ భువీ యార్కర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రాయుడు, సిమ్మన్స్ రెండో వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ మరుసటి ఓవర్లోనే రాయుడు... హెన్రిక్స్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే మ్యాచ్‌లో పైచేయి సాధించిన ముంబై ఒత్తిడికి లోను కాకుండా రోహిత్ (6 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు), పొలార్డ్ (7 బంతుల్లో 6 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) పొలార్డ్ (బి) మలింగ 68; ధావన్ (బి) మలింగ 11; రాహుల్ (రనౌట్) 10; వార్నర్ నాటౌట్ 55; నమన్ ఓజా నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 5) 6; మొత్తం (20 ఓవర్లలో మూడు వికెట్లు) 157. వికెట్ల పతనం: 1-31; 2-70; 3-133. బౌలింగ్: అండర్సన్ 2-0-17-0; బుమ్రా 4-0-24-0; హర్భజన్ 4-0-27-0; మలింగ 4-0-35-2; ఓజా 4-0-32-0; పొలార్డ్ 2-0-21-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి) భువనేశ్వర్ 68; గౌతమ్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 1; రాయుడు (సి అండ్ బి) హెన్రిక్స్ 68; రోహిత్ నాటౌట్ 14; పొలార్డ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (వైడ్లు 3) 3; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు)160. వికెట్ల పతనం: 1-2; 2-132; 3-141; బౌలింగ్: స్టెయిన్ 4-0-29-0; భువనేశ్వర్ 4-0-21-2; ఇర్ఫాన్ 2-0-29-0; మిశ్రా 3-0-33-0; శర్మ 2.4-0-25-0; హెన్రిక్స్ 3-0-23-1. -
సొంతగడ్డపై తొలి పోరు
నేడు ఉప్పల్‌లో ముంబైతో సన్‌రైజర్స్ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే సన్‌రైజర్స్ సొంతగడ్డపై సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో సోమవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్లో ఉప్పల్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్ 4 గెలిచి, 4 ఓడగా...ముంబై 2 గెలిచి, 6 ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఉప్పల్ స్టేడియంలో రైజర్స్‌కు చక్కటి రికార్డు ఉంది. గత సీజన్లో పెద్దగా భారీ స్కోర్లు నమోదు కాని ఇక్కడి పిచ్‌పై ఈ ఏడాది కూడా రైజర్స్ బౌలింగ్‌నే నమ్ముకుంది. మరో వైపు ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిలో పడాలని భావిస్తోంది. -
ముదురుతున్న వివాదం
బీసీసీఐతో అమీతుమీకి సిద్ధమవుతున్న ఎంసీఏ నేడు అత్యవసర సమావేశం ముంబై: బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ల మధ్య వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్‌ను వాంఖడే నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలించాలని గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంసీఏ.. బీసీసీఐతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం ఎంసీఏ మేనేజింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది. బీసీసీఐతో భవిష్యత్ సంబంధాలను నిర్ణయించే దిశగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తరలింపునకు గల అసలు కారణమేంటో చెప్పాలని ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తోపాటు బీసీసీఐ సభ్యులకు శనివారమే లేఖ రాశారు. దీనికితోడు ఐపీఎల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంసీఏ అధికారులు ఇప్పటికే తమ అక్రిడిటేషన్లను కూడా నిర్వాహకులకు తిరిగి ఇచ్చేశారు. స్పష్టమైన కారణం తెలపకుండానే మ్యాచ్‌ను తరలిస్తూ తీసుకున్న నిర్ణయానికి నిరసనగానే తమ అక్రిడిటేషన్లు వెనక్కి ఇచ్చేశామని ఎంసీఏ మీడియా మేనేజర్ వినోద్ దేశ్‌పాండే తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం వాంఖడేలో ఐదు లీగ్ మ్యాచ్‌లతోపాటు ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. అయితే ఎలిమినేటర్‌ను బ్రబౌర్న్ స్టేడియానికి, ఫైనల్‌ను బెంగళూరుకు తరలించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికి మూడు లీగ్ మ్యాచ్‌లు జరగగా, మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు మ్యాచ్‌లను కూడా వేరే చోట నిర్వహించుకోవాల్సిందిగా ఎంసీఏలో ఎక్కువ మంది సూచిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
ఐపీఎల్-7: సన్ రైజర్స్ విజయం
ఐపీఎల్-7లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఎనిమిది వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విజయం సాధించింది. 5 ఓవర్లలో 43 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మరో నాలుగు బంతులు మిగిలుండగా గెలుపొందింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని పలుమార్లు కుదించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 143 పరుగులు సాధించింది. దినేష్ కార్తీక్ 39, పీటర్సన్ 35, అగర్వాల్ 25, లక్ష్మీ శుక్లా 21 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లు స్టెయిన్, అమిత్ మిశ్రా, హెన్రిక్స్ రెండేసి వికెట్లు తీశారు. కాగా ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 103 పరుగుల స్కోరుతో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తెరిపి ఇచ్చాక మళ్లీ మ్యాచ్ కొనసాగించారు. -
హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా భారీ వర్షం ప్రారంభం కావడంతో ఆట ఆగిపోయింది. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ కొనసాగించనున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ జరుగుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆట నిలిచేపోయే సమయానికి ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్(17), శుక్లా(14) క్రీజ్‌లో ఉన్నారు. పీటర్సన్ 35, అగర్వాల్ 25, డీకాక్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. స్టెయిన్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తప్పనిసరిగా నెగ్గాలి. -
ఐపీఎల్-7: బ్యాటింగ్ దిగిన ఢిల్లీ.. హైదరాబాద్‌తో మ్యాచ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ఢిల్లీ డేర్ డేవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. శనివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలింగ్‌లో బలోపేతంగా ఉన్న హైదరాబాద్ గత మ్యాచ్‌లో తక్కువ స్కోరు లక్ష్యాన్ని కాపాడుకుంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, స్టెయిన్, అమిత్ మిశ్రా కీలకం. ఢిల్లీ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. -
జహీర్‌ఖాన్ స్థానంలో ప్రవీణ్ కుమార్
ముంబై: గాయం కారణంగా ఐపీఎల్-7కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది. జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... కుమార్‌ను తీసుకుంది. ఢిల్లీ బాట్స్ మన్ సౌరభ్ తివారి కూడా గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. -
కోహ్లిదే అగ్రస్థానం
న్యూఢిల్లీ: ఐపీఎల్-7కు సంబంధించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి అగ్రస్థానం లభించింది. చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ధోని, డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (ఆర్సీబీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. క్రికెట్ చరిత్రలో సంచలన క్యాచ్ పట్టిన క్రిస్ లిన్ (కేకేఆర్)కు నాలుగో స్థానం దక్కింది. మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న పంజాబ్ బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ ఐదో స్థానం సాధించాడు. గంభీర్, మాక్స్వెల్, క్రిస్ గేల్, రైనా, శిఖర్ ధావన్‌లు టాప్-10లో చోటు సంపాదించారు. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ కోసం చాలా మంది అభిమానులు గూగుల్‌లో సెర్చ్ చేయడం విశేషం. -
‘ఫిక్సింగ్’ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆటగాళ్లకు ద్రవిడ్ సూచన అహ్మదాబాద్: ఐపీఎల్-7లో స్పాట్‌ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి వివాదాలేవీ లేకుండా టోర్నీ సాఫీగా సాగిపోతుండడం పట్ల రాజస్థాన్ రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఆటగాళ్లు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు. ‘ఎటువంటి వివాదాలకు తావులేకుండా లీగ్ కొనసాగుతుండడం సంతోషకరం. కానీ, క్రికెట్‌ను దెబ్బతీయాలని చూసే వ్యక్తులూ ఉన్నందున ఆటగాళ్లు, జట్లు అప్రమత్తంగా ఉండాలి’ అని ద్రవిడ్ అన్నాడు. ఈ ఏడాది రాజస్థాన్‌కు సొంత వేదికగా ప్రకటించిన అహ్మదాబాద్ తమకు కలిసివచ్చే వేదికేనని, గతంలో ఇక్కడ తమ జట్టుకు మంచి రికార్డే ఉందని ద్రవిడ్ తెలిపాడు. -
ఐపీఎల్-7: మ్యాక్స్‌వెల్ పరుగుల మోత.. పంజాబ్ ఘనవిజయం
కటక్: ఐపీఎల్ ఏడో అంచెలో పంజాబ్ జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ 44 పరుగులతో చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పూర్తి ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులే చేయగలిగింది. డుప్లెసిస్ (52) హాఫ్ సెంచరీతో పాటు రైనా (35), బ్రెండన్ మెకల్లమ్ (33) రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూపర్ ఫామ్‌లో మ్యాక్స్‌వెల్ మరోసారి (38 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) విధ్వంసక విన్యాసాలతో రెచ్చిపోయాడు. కాగా మరోసారి సెంచరీకి చేరువలో అవుటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌తో డేవిడ్ మిల్లర్ (47), బెయిలీ (13 బంతుల్లో 40 నాటౌట్), సెహ్వాగ్ (30) ఆకట్టుకున్నారు. చెన్నై బౌలర్ మోహిత్ శర్మ రెండు వికెట్లు తీశాడు. -
గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్... కోల్‌కతా విన్
న్యూఢిల్లీ: గౌతమ్ గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్-7లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో బుధవారం ఫిరోజ్ షా కోట్లా మైదానం జరిగిన మ్యాచ్‌లో గంభీర్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లో ఛేదించింది. గంభీర్ అర్థ సెంచరీతో రాణించాడు. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. రాబిన్ ఊతప్ప 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేశారు. మనీష్ పాండే 23 పరుగులు సాధించాడు. ఢిల్లీ బౌలర్లలో పార్నెల్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. డుమిని 40, దినేష్ కార్తీక్ 36, జాదవ్ 26, మురళీ విజయ్ 24 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో కల్లిస్, యాదవ్, షకీబ్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. గంభీర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ఐపీఎల్లో పాకిస్థాన్ సంతతి స్పిన్నర్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడనున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున అతడు బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె గాయపడడంతో అతడి స్థానంలో తాహిర్‌ను తీసుకున్నారు. దీనికి ఐపీఎల్ సాంకేతిక సంఘం ఆమోదముద్ర వేసింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో తాహిర్ ఆడనున్నాడు. ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ గాయపడ్డాడు. జహీర్‌ఖాన్, సౌరవ్ తివారి కూడా గాయాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. -
‘షేన్’దార్ రాయల్స్
అద్భుతం... అసాధ్యాలు సుసాధ్యం కావడం... ఒక్క ఓవర్లో మ్యాచ్ ఫలితం తారుమారు కావడం... ఇవన్నీ టి20 ఫార్మాట్లోనే సాధ్యం. వారం క్రితం సూపర్ ఓవర్‌ను కూడా టై చేసుకున్న రాజస్థాన్, కోల్‌కతా.. మరోసారి టి20 క్రికెట్లోని మజాను రుచి చూపించాయి. అసలు ఇదెలా సాధ్యం..! అని ఆశ్చర్యపోయేలా రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్న మ్యాచ్‌ను అనూహ్యంగా గెలిచారు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టూ ఓడిపోని విధంగా... అత్యంత నాటకీయంగా కోల్‌కతా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. - రాజస్థాన్ సంచలన విజయం - షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ షో - పవీణ్ తాంబే హ్యాట్రిక్ - నాటకీయంగా కుప్పకూలిన కోల్‌కతా రెండు బంతుల్లో హ్యాట్రిక్ ! తాంబే ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించినా... లీగల్‌గా తను వేసింది రెండు బంతులే. తొలి బంతి వైడ్ అయినా స్టంపౌట్ రూపంలో వికెట్ వచ్చింది. తర్వాతి రెండు లీగల్ బంతులకు రెండు వికెట్లు వచ్చాయి. టి20ల్లో ఇలా రెండు బంతుల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి భారత క్రికెటర్ తాంబే. గతంలో చాంపియన్స్‌లీగ్‌లో ఇసురు ఉదాన (శ్రీలంక) రెండు బంతుల్లో ఇలాగే హ్యాట్రిక్ సాధించాడు. అహ్మదాబాద్: లక్ష్యం 171... స్కోరు 14 ఓవర్లలో 121/0... ఈ దశలో ఏ జట్టైనా అలవోకగా గెలుస్తుంది. కానీ కోల్‌కతా మాత్రం నాటకీయంగా కుప్పకూలి అనూహ్యంగా ఓడిపోయింది. కేవలం 8 బంతుల వ్యవధిలో రెండే పరుగులు జతచేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆడుతూ పాడుతూ గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘోర పరాజయం పాలైంది. షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ నైపుణ్యానికి.. స్పిన్నర్ ప్రవీణ్ తాంబే హ్యాట్రిక్ తోడవడంతో... సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచింది. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే (22 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్), కరుణ్ నాయర్ (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. సంజు శామ్సన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు), వాట్సన్ (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మొత్తం బ్యాట్స్‌మెన్ అంతా సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ భారీస్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వినయ్ కుమార్, నరైన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు గంభీర్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్), ఉతప్ప (52 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీలు చేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి... విజయానికి కావలసిన ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. అయితే వాట్సన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడం... ఆ వెంటనే తర్వాతి ఓవర్లోనే తాంబే హ్యాట్రిక్ సాధించడంతో కేవలం 2 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఇక కోలుకోలేకపోయింది. చివర్లో షకీబ్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, తాంబే మూడేసి వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ తాంబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 30; కరుణ్ నాయర్ (స్టం) ఉతప్ప (బి) షకీబ్ 44; శామ్సన్ (సి) పాండే (బి) నరైన్ 37; వాట్సన్ (సి) యాదవ్ (బి) నరైన్ 31; బిన్నీ (సి) టెన్ డష్కటే (బి) వినయ్ 11; స్టీవ్ స్మిత్ (సి) యాదవ్ (బి) వినయ్ 3; ఫాల్క్‌నర్ నాటౌట్ 1; భాటియా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 2, నోబాల్ 1) 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1-52; 2-105; 3-136; 4-153; 5-163; 6-163. బౌలింగ్: వినయ్ కుమార్ 4-0-42-2; ఉమేశ్ యాదవ్ 3-0-31-0; షకీబ్ అల్ హసన్ 4-0-25-1; నరైన్ 4-0-28-2; రస్సెల్ 3-0-27-0; టెన్ డష్కటే 2-0-14-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) భాటియా (బి) వాట్సన్ 65; గంభీర్ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 54; రస్సెల్ (బి) వాట్సన్ 1; పాండే (స్టం) శామ్సన్ (బి) తాంబే 0; షకీబ్ నాటౌట్ 21; యూసుఫ్ పఠాన్ (సి) అండ్ (బి) తాంబే 0; డష్కటే ఎల్బీడబ్ల్యు (బి) తాంబే 0; సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 5, వైడ్లు 3, నోబాల్స్ 2) 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 160. వికెట్ల పతనం: 1-121; 2-122; 3-122; 4-123; 5-123; 6-123. బౌలింగ్: వాట్సన్ 4-0-21-3; సౌతీ 3-0-33-0; తాంబే 4-0-26-3; ఫాల్క్‌నర్ 4-0-27-0; భాటియా 3-0-30-0; టెవాటియా 2-0-18-0. కళ్లుచెదిరే క్యాచ్‌లు తొలుత రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా నిర్మించారు. రహానే, నాయర్, శామ్సన్13 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుతూనే 105 పరుగులు చేశారు. దీంతో వాట్సన్ హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధమైంది. కెప్టెన్ వాట్సన్ అంచనాలను నిలబెట్టుకుంటూ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ దశలో రాయల్స్ 180-190 పరుగులు దిశగా సాగింది. కానీ కోల్‌కతా ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లతో నియంత్రించారు. ముఖ్యంగా వాట్సన్ క్యాచ్‌ను సూర్యకుమార్ అత్యద్భుతంగా అందుకున్నాడు. అలాగే బిన్నీ క్యాచ్‌ను టెన్డష్కటే అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రాయల్స్ 170 పరుగులకు పరిమితమైంది. 121/0.... 123/6 కోల్‌కతాకు గంభీర్, ఉతప్ప కళ్లుచెదిరే ఆరంభాన్నిచ్చారు. టోర్నీలో తొలిసారి గంభీర్ అర్ధసెంచరీ చేయగా... ఉతప్ప అద్భుతమైన షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ ఎక్కడా తడబడకుండా ఆడి కోల్‌కతాను పటిష్ట స్థితిలో నిలిపారు. 15వ ఓవర్లో డ్రామా మొదలైంది. వాట్సన్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికే గంభీర్ అవుట్ అయ్యాడు. మూడో బంతిని పుల్ చేసిన ఉతప్ప బౌండరీ దగ్గర సులభమైన క్యాచ్ ఇచ్చాడు. చాలా నిర్లక్ష్యపు షాట్ ఇది. ఇదే ఓవర్ ఐదో బంతికి వాట్సన్... రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు (అది కూడా ఓవర్ త్రో) మాత్రమే వచ్చింది. తర్వాతి ఓవర్లో తాంబే తొలి బంతిని వైడ్ వేశాడు. కానీ మనీష్‌పాండే ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. దీంతో మళ్లీ ఇదే ఓవర్ తొలి బంతి వేసిన తాంబే... యూసుఫ్ పఠాన్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి బంతి టెన్ డష్కటే ఎల్బీగా అవుట్ కావడంతో తాంబేకు హ్యాట్రిక్ దక్కింది. కేవలం రెండు పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఇక ఆ తర్వాత కోలుకోలేకపోయింది. -
ఐపీఎల్-7: వాట్సన్ ఆల్ రౌండ్ షో, టంబె హ్యాట్రిక్
అహ్మదాబాద్: ఐపీఎల్ ఏడో అంచెలో రాజస్థాన్ రాయల్స్ పది పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. సోమవారమిక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. కోల్‌కతా ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (65), గంభీర్ (54) హాఫ్ సెంచరీలతో రాణించి విజయానికి బాటలు వేశారు. దీంతో 14 ఓవర్లలో స్కోరు 121 పరుగులకు చేరుకుంది. దీంతో కోల్‌కతా విజయం ఖాయమనిపించింది. కాగా ఆ మరుసటి ఓవర్లో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. షేన్ వాట్సన్ 15వ ఓవర్లో గంభీర్, ఊతప్ప, రసెల్‌ను అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో ప్రవీణ్ టంబె హ్యాట్రిక్ వికెట్‌తో కోల్‌కతాను చావు దెబ్బతీశాడు. మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, టెన్ డష్కాటేను పెవిలియన్ చేర్చాడు. దీంతో కోల్ కతా రెండు పరుగుల తేడాతో ఆరు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది. ఆనక షకీబల్, సూర్యకుమార్ యాదవ్ పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. అంతకుముందు రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (30), కరుణ్ నాయర్ (44) జట్టుకు శుభారంభం అందించారు. సంజు శామ్సన్ (37), షేన్ వాట్సన్ (31) ఇదే జోరు కొనసాగించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు సునీల్ నరైన్, వినయ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. -
ఐపీఎల్-7: కోల్‌కతా లక్ష్యం 171
అహ్మదాబాద్: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ 171 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నిర్దేశించింది. సోమవారమిక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (30), కరుణ్ నాయర్ (44) జట్టుకు శుభారంభం అందించారు. సంజు శామ్సన్ (37), షేన్ వాట్సన్ (31) ఇదే జోరు కొనసాగించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు సునీల్ నరైన్, వినయ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. -
డివిలియర్స్ విధ్వంసం
సన్‌రైజర్స్ చిత్తు 4 వికెట్లతో బెంగళూరు గెలుపు వార్నర్, కరణ్ శ్రమ వృథా ఐపీఎల్-7లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డివిలియర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపాడు. సిక్సర్ల వర్షంతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 73 పరుగులే చేసిన ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ అసలు సమయంలో వీరబాదుడు బాదాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే అజేయంగా 89 పరుగులు చేసి బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చివర్లో బౌలర్లు విఫలం కావడంతో ‘సన్’కు పరాజయం తప్పలేదు. బెంగళూరు: గేల్ దుమారం లేకపోయినా... కోహ్లి వెనుదిరిగినా... యువీ మెరుపులు మెరిపించకపోయినా...ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో బెంగళూరు జట్టును గట్టెక్కించాడు. 95 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకున్నా... లోయర్ ఆర్డర్ సహకారంతో లక్ష్యాన్ని ఛేదించాడు. ఫలితంగా ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. వార్నర్ (49 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా, ధావన్ (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు. బెంగళూరు 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. డివిలియర్స్‌తో పాటు గేల్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వార్నర్ దూకుడు ధావన్ నెమ్మదిగా ఆడినా... రెండో ఓవర్లో సిక్సర్, ఫోర్‌తో విరుచుకుపడ్డ ఫించ్ (13) తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. బౌండరీతో ఖాతా ప్రారంభించిన రాహుల్ (6) కూడా వెంటనే అవుట్ కావడంతో ‘సన్’ తడబడింది. వార్నర్, ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా రన్‌రేట్ మాత్రం తగ్గకుండా చూశారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లు కుదురుకోవడంతో వార్నర్, ధావన్‌లు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. చివరకు ఆరోన్ ఈ జోడిని విడగొట్టాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 9 ఓవర్లలో 62 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దిండా వేసిన 18వ ఓవర్లో వార్నర్ రెండు సిక్సర్లు కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే ఐదు బంతుల వ్యవధిలో ఓజా, వార్నర్ వెనుదిరిగారు. చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు రావడంతో హైదరాబాద్ పోరాడే స్కోరు చేయగలిగింది. డివిలియర్స్ సిక్సర్ల వర్షం ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భువనేశ్వర్... పార్థివ్ (3), కోహ్లి (0)లను అవుట్ చేయడంతో బెంగళూరు తడబడింది. ఆరంభంలో పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గేల్ షాట్లు కొట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. దీంతో పరుగుల వేగం మందగించింది. స్టెయిన్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గేల్, ఆ తర్వాత ఇషాంత్‌కు ఓ ఫోర్, రెండు సిక్సర్లు రుచి చూపించాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన గేల్ బౌండరీ వద్ద స్యామీ చేతికి చిక్కాడు. దీంతో ఆర్సీబీ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోసో, గేల్ మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. డివిలియర్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించాక రోసో (14) అవుటయ్యాడు. తర్వాత వచ్చిన యువరాజ్ (14) నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తే.. డివిలియర్స్ మాత్రం వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 30 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. యువరాజ్ అవుటయ్యాక డివిలియర్స్ షో మొదలైంది. బౌలర్ ఎవరైనా సిక్సర్ల వర్షం కురిపించాడు. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించాడు. స్టార్క్‌తో కలిసి ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. స్యామీ ఓవర్లో 19, స్టెయిన్ ఓవర్లో 24 పరుగులు రావడంతో బెంగళూరు విజయం సులువైంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) పార్థివ్ (బి) స్టార్క్ 13; ధావన్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 37; రాహుల్ (సి) గేల్ (బి) దిండా 6; వార్నర్ (బి) స్టార్క్ 61; స్యామీ (సి) స్టార్క్ (బి) హర్షల్ పటేల్ 8; ఓజా (సి) స్టార్క్ (బి) ఆరోన్ 15; ఇర్ఫాన్ నాటౌట్ 4; కరణ్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-20; 2-29; 3-91; 4-115; 5-149; 6-150 బౌలింగ్: స్టార్క్ 4-0-21-2; దిండా 4-0-39-1; ఆరోన్ 4-0-33-2; హర్షల్ పటేల్ 4-0-29-1; చాహల్ 4-0-30-0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) స్యామీ (బి) కరణ్ శర్మ 27; పార్థివ్ (బి) భువనేశ్వర్ 3; కోహ్లి (సి) ఓజా (బి) భువనేశ్వర్ 0; రోసోవ్ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ శర్మ 14; డివిలియర్స్ నాటౌట్ 89; యువరాజ్ (సి) (సబ్) హెన్రిక్స్ (బి) కరణ్ శర్మ 14; స్టార్క్ రనౌట్ 5; హర్షల్ పటేల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-5; 2-6; 3-38; 4-59; 5-95; 6-152. బౌలింగ్: స్టెయిన్ 4-0-39-0; భువనేశ్వర్ 4-0-16-2; ఇషాంత్ 3-0-35-0; కరణ్ శర్మ 4-0-17-3; ఇర్ఫాన్ 2.5-0-25-0; స్యామీ 2-0-25-0.