నాయర్ మెరిసినా రాజస్థాన్ కు తప్పని ఓటమి | Mumbai Indians stay afloat with a 25-run win against Royals | Sakshi
Sakshi News home page

నాయర్ మెరిసినా రాజస్థాన్ కు తప్పని ఓటమి

Published Mon, May 19 2014 7:56 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

నాయర్ మెరిసినా రాజస్థాన్ కు తప్పని ఓటమి

నాయర్ మెరిసినా రాజస్థాన్ కు తప్పని ఓటమి

అహ్మదాబాద్: ఐపీఎల్-7లో భాగంగా సోమవారమిక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై  ఇండియన్స్ 25 పరుగులతో విజయం సాధించింది. ముంబై విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కేకే నాయర్(48), హోడ్జ్(40), ఫాల్కనర్(31) మాత్రమే రాణించారు. ఓపెనర్ గా వచ్చిన నాయక్ ప్రారంభంనుంచి ఎదురు చేశాడు. ఒకపైపు వికెట్లు పడుతున్నా జోరు కొనసాగించాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు సాధించాడు.  

మిగతా ఆటగాళ్లు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. ఫాల్కనర్, హోడ్జ్ విజృంభణతో కోలుకుంది. అయితే భారీగా ఉండడంతో రాజస్థాన్ పరాజయం పాలయింది. ముంబై బౌలర్లలో సంతోకి, ప్రజ్ఞాన్ ఓజా, ఎస్. గోపాల్ రెండేసి వికెట్లు తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. మైఖేల్ హసీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement