ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడుతున్నాయి.
ముంబై: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమైన ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
హర్భజన్ మళ్లీ ముంబై తుది జట్టులోకొచ్చాడు. గత మ్యాచ్లో పంజాబ్పై విజయం సాధించిన ముంబై అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ముంబై ఓపెనర్లు సిమన్స్, మైకేల్ హస్సీ బ్యాటింగ్కు వచ్చారు.