బెంగళూరు: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారమిక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆరంభమైన ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
బెంగళూరు ఓపెనర్ రొసోవ్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ టకవాలె (19), విజయ్ జోల్ (13) కూడా పరుగుల వేటలో తడబడ్డారు. ఈ దశలో యువ సంచలనం విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్లుకు సముచిత స్కోరు అందించాడు. కోహ్లీకి యువీ కాసేపు అండగా నిలిచాడు. 49 బంతులాడిన విరాట్ 2 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. యువరాజ్ 25 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్ నెహ్రా మూడు వికెట్లు తీశాడు.
విరాట్ విజృంభణ.. చెన్నై లక్ష్యం 155
Published Sat, May 24 2014 5:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement