బెంగళూరు: ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా శనివారమిక్కడ ఏకపక్షంగా సాగిన లీగ్ మ్యాచ్లో చెన్నై ఎనిమిది వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మరో 14 బంతులు మిగిలుండగా కేవలం రెండు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. ధోనీ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. డుప్లెసిస్ (54 నాటౌట్) హాఫ్ సెంచరీతో పాటు డ్వెన్ స్మిత్ (34) రాణించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్ రొసోవ్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ టకవాలె (19), విజయ్ జోల్ (13) కూడా పరుగుల వేటలో తడబడ్డారు. ఈ దశలో యువ సంచలనం విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్లుకు సముచిత స్కోరు అందించాడు. కోహ్లీకి యువీ కాసేపు అండగా నిలిచాడు. 49 బంతులాడిన విరాట్ 2 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. యువరాజ్ 25 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్ నెహ్రా మూడు వికెట్లు తీశాడు.
మహేంద్ర జాలం.. చెన్నై సూపర్ విన్
Published Sat, May 24 2014 7:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement