
కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈ విషయాన్ని ముందుగానే అంచనావేసిన కంపెనీలు ఏకంగా ఉద్యోగులకు సెలవులిచ్చేశాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
(ఇది చదవండి: బిగ్ హీరోతో సినిమా ఛాన్స్.. ఇంతలోనే హీరోయిన్‌ను మార్చేశారు: యంగ్ హీరోయిన్)
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం 'జైలర్'. ఈ చిత్రాన్ని నెల్సన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చెన్నై, బెంగళూరులోని అనేక ఆఫీసులకు ఆగస్టు 10న సెలవు ప్రకటించారు. యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ అయితే ఏకంగా ఉద్యోగులకు సెలవు ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా మూవీ టికెట్లు కూడా బుక్ చేస్తోందట.
ఎంతైనా తలైవా సినిమా అంటే ఆ మాత్రం ఉంటది మరీ అంటున్నారు ఫ్యాన్స్. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, జాకీష్రాప్, శాండిల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్, వసంత రవి, నటి తమన్న, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: వినాయక చవితికి రజనీకాంత్ ‘జైలర్’!)
Comments
Please login to add a commentAdd a comment