Kollywood star
-
ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే, తాజాగా జీ5 ఓటీటీ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సీక్వెల్ రిలీజ్‌కు ముందు 'విడుదల-1' సినిమాను జీ5 ఓటీటీలో ఉచితంగా చూడొచ్చని తెలిపింది.విడుదల పార్ట్ 1 సినిమా 2003లో థియేటర్లో సందడి చేసింది. ఆపై జీ5 ఓటీటీలో రిలీజైన ఈ భారీ యాక్షన్ డ్రామా మూవీ వంద మిలియన్లకుపైగానే వ్యూస్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు జీ5 సబ్స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. అయితే, పార్ట్-2 విడుదల నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీని ఉచితంగానే చూడొచ్చని ప్రకటన వచ్చింది. ఈ అవకాశం డిసెంబర్ 20 వరకు మాత్రమే ఉంటుంది. తెలుగు, తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది.పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన విడుదల పార్ట్-1 సినిమా సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ప్రధానపాత్రలలో కనిపించారు. అయితే, పార్ట్-2లో మాత్రం మంజు వారియర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. -
విజయ్ సేతుపతి మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2. గతంలో విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో సూరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. -
ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగు, తమిళంలో ఓకేసారి రిలీజ్ చేశారు.అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజా సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్‌తో మేకర్స్‌కు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.తంగలాన్ కథేంటంటే..'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ. -
సరిపోదా శనివారం టీమ్‌కు సారీ చెప్పిన ఎస్జే సూర్య.. ఎందుకంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాకు సూపర్ హిట్ అందించిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, డీవీవీ ఎంటర్టైన్మెంట్, తెలుగు ప్రేక్షకులకు నా గుండెల నుంచి ధన్యవాదాలు అంటూ తెలుగులో రాసుకొచ్చారు. అదేవిధంగా సక్సెస్ ప్రెస్ మీట్‌కు హాజరు కాకపోవడంపై సారీ చెప్పారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ వల్లే హాజరు కాలేకపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. Telugu prayakshalaku , dir #VivekAthreya gari ki , Natural star @NameisNani gariki , @DVVMovies dhanaya gariki gundal nunchi Dhanyawadalu 🙏🙏🙏 for this great opportunity & accepting this actor with immense love sjsuryah 🥰🙏 sorry couldn’t attend press meet due to unavoidable…— S J Suryah (@iam_SJSuryah) August 31, 2024 -
ధనుశ్ బర్త్ డే స్పెషల్.. ఈ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవల రాయన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే రాయన్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఇవాళ ధనుశ్ బర్త్ డే కావడంతో చిత్రబృందం, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అంతే కాకుండా సన్ పిక్చర్స్ సంస్థ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ధనుశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాయన్ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించారు. -
దసరా రేస్‌లో నిలిచిన భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. ఈ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు సూర్య ట్వీట్ చేశారు. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు టాక్ వినిపించింది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. Dear all It’s 10th October 2024#KanguvaFromOct10 @directorsiva @DishPatani @thedeol @ThisIsDSP @vetrivisuals #MilanArtDir @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar @jayantilalgada @NehaGnanavel @saregamasouth pic.twitter.com/qPkwuSOJmS— Suriya Sivakumar (@Suriya_offl) June 27, 2024 -
దళపతి విజయ్ కీలక నిర్ణయం.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం!
తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. గతేడాది లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని కూడా స్థాపించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు విద్యార్థులను ఆయన త్వరలోనే సన్మానించనున్నారు. ఈ ఏడాది 10,12 తరగతుల్లో టాపర్‌గా నిలిచిన వారికి సర్టిఫికెట్తో పాటు రివార్డులను విజయ్ అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. జూన్ 28, జూలై 3 తేదీలలో చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులను సన్మానించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.కాగా.. విజయ్ ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT)లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5, 2024న థియేటర్లలోకి రానుంది. -
'దయచేసి అది నమ్మొద్దు'.. ఫ్యాన్స్‌ను కోరిన స్టార్ హీరో భార్య
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో పాటు విడాయమర్చి అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అయితే అజిత్ నటి షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో అజిత్ కుమార్- షాలిని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా బయటపడింది. ఈ విషయాన్ని షాలిని అజిత్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరికీ నా మనవి.. ఇది నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్ కాదు.. దయచేసి ఎవరూ కూడా నమ్మి ఫాలో అవ్వొద్దు. ధన్యవాదాలు' అంటూ అభిమానులను కోరింది. షాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
విక్రమ్ తంగలాన్.. ఆ నెలలోనే రిలీజ్‌కు ప్లాన్!
పాత్ర కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాను డైరెక్టర్ పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. స్టూడి యో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్, పార్వతి, డేనియల్ కల్టిగరోన్, పశుప తి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా స్వాతంత్య్రానికి ముందు కర్ణాటకలోని గోల్డ్ మైన్ కార్మికుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. మొదట తంగలాన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.కాగా తాజాగా చిత్రాన్ని జూన్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో తంగలాన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందించారు. -
నెల రోజుల్లోపే ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'రత్నం'. గతనెల ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు సమాజసేవలోనూ దూసుకెళ్తున్నారు. మాత్రం సంస్థ పేరుతో తమిళనాట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పదిమంది పేద రైతు కుటుంబాలకు ట్రాక్టర్లు అందజేశారు. వారిని ప్రత్యేకంగా కలిసి మరి రాఘవ లారెన్స్ ట్రాక్టర్ తాళాలు అందించారు.తాజాగా తాను సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 20 ఏళ్లుగా వారి అన్నీ తానే నడిపిస్తున్నారు. ఆ విద్యార్థులంతా చదువుల్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి రాఘవ లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. తాను కూడా వారితో పాటు కలిసిపోయి ఆటలు ఆడారు. వారిని చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. వారిని కలిసి సమయం వెచ్చించడం నా హృదయం సంతోషంతో నిండిపోయిందంటూ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మీరు గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024 -
కమల్‌హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. నాయగన్(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్‌లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గన్‌తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్‌హాసన్, శింబులతో పాటు ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే ‘థగ్ లైఫ్’ టీమ్ లండన్ వెళుతుందని కోలీవుడ్ సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని.. ఈ ప్లేస్లోనే శింబును ఎంపిక చేశారని టాక్. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ పాత్రను అశోక్ సెల్వన్ చేస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
నయన్‌కు మరో క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్!
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్‌హిట్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్ లోల్డన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్‌ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్. నటుడు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్ చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్‌ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్‌కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
విక్రమ్ తంగలాన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్లుగా నటించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా రోజుల ముందే తెరపైకి రావాల్సింది. అయి తే గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పటికీ దర్శక, నిర్మాతలు తంగలాన్ చిత్రం విడుదల తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈనెల 17న విక్రమ్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తంగలాన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆదివాసి ప్రాంతాలలో నటుడు విక్రమ్ గుర్రమెక్కి వెళుతున్న పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో విక్రమ్ కొండవాసీ గెటప్‌లో కనిపించిన దృశ్యం తంగలాన చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. తంగలాన్ చిత్రం కోసం విక్రమ్ పూర్తిగా మేకోవర్ అయ్యాయన్నారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారన్నారు. ఇతర నటీనటులు ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. ఇది గోల్డ్ మైన్స్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పా.రంజిత్ చెప్పారు. -
'ప్రభాస్ పెళ్లయ్యాకే చేసుకుంటా'.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా క్రేజ్ దక్కించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం హీరో విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్‌కే ఇస్తానని తెలిపారు. అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. 😅 #Vishal Anna during #Rathnam movie promotions 😁 " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb — Prabhas Fan (@ivdsai) April 18, 2024 -
సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్
సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్‌లో మొదలవుతుందని చెప్పారు. దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు. -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. చివరి చిత్రం డైరెక్టర్‌గా ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 69వ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న విజయ్ నటించే చివరి చిత్రం ఇదేననే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రి, కుమారుడిగా ద్విపాత్రాభియనం చేస్తున్నారు. కొడుకు పాత్ర కోసం ఆధునికి టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ 69వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఈ విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. వీరిలో ఓ టాలీవుడ్ డైరెక్టర్‌తో పాటు, వెట్రిమారన్, కార్తీక్‌సుబ్బరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ విజయ్‌తో చిత్రం చేయాలన్నది ఆశే. తాజాగా హెచ్.వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చతురంగవేట్టై, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిపారు. చిత్రం ప్రారంభమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం డ్రాప్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన 69వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం వైరలవుతోంది. దీని గురించి ఇటీవల ఓ భేటీలో నటుడు విజయ్ హీరోగా చేస్తే అది ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు హెచ్.వినోద్ బదులిస్తూ కచ్చితంగా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పారు. విజయ్ హీరోగా రాజకీయ నేపథ్యంలో చిత్రం చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. తాను ఆయనకు చెప్పిన కథలన్నీ అలాంటివేనన్నారు. కాగా విజయ్ 69వ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు అయితే అది కచ్చితంగా ఆయన రాజకీయ జీవితానికి ప్రయోజన కరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టనున్న కోలీవుడ్ హీరో..!
కోలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతేడాది కార్తీ నటించిన 25వ చిత్రం జపాన్ పూర్తిగా నిరాశపరచడంతో ఆయన ఇప్పుడు స్పీడ్ పెంచారు. చిత్రాల విషయంలో జెడ్ స్పీడ్‌లో పరుగెడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాద్ధియారే, 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఖైదీ 2, సర్ధార్ 2 చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటిలో సర్ధార్ -2 చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అర్జున్‌రెడ్డి, యానిమల్తో సంచలన హిట్స్ కొట్టిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో నటించనున్నారన్నదే లేటేస్ట్ టాక్. మరోవైపు ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సందీప్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరువాత నటుడు కార్తీ హీరోగా ఓ చిత్రం చేయనున్నట్లు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వైరలవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబోలో రూపొందే చిత్రానికి ఇంకా చాలా టైమ్ ఉంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. -
స్టార్ హీరోతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చిత్రం.. !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నారు. అగ్రస్టార్‌గా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇంతకుముందే అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విడాయమర్చి చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విశాల్ హీరోగా మార్క్ ఆంటోని వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది. నటుడు అజిత్ ఇంతకుముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరలారు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. ఆ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత అజిత్ మళ్లీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించునున్నారు. ఇది నిజమైతే ఆయన అభిమానులకు ఇక పండగే. -
కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ బ్రో.. ఇంత అందాన్ని మర్చిపోయారా?
కోలీవుడ్ భామ ఇటీవలే హనుమాన్ సినిమాతో అలరించారు. తేజ సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది టాలీవుడ్లో వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. అయితే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన బ్యూటీ.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెనే లేడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మ్యాచ్‌లో తళుక్కున మెరిసింది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వరలక్ష్మి సందడి చేసింది. చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్‌లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్‌లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు.. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మరిచిపోయారు? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Cameraman ka focus Aaj kahan hai 🙄🤪Itna glamor nahi notice kiya ? pic.twitter.com/bJqvmluOo8 — aCute 📐 (@chaoticalm_090) March 26, 2024 -
ఎన్నాళ్లో వేచిన హృదయం.. ఆ స్టార్ హీరో క్రేజ్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే ఇవాళ దాదాపు 14 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ కేరళలో అడుగుపెట్టారు. ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన తిరువనంతపురం చేరుకున్నారు. ఎయిర్ పోర్టు చేరుకున్న దళపతి విజయ్‌కు ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరువనంతపురం ఎయిర్ పోర్టు నుంచి విజయ్ బయటకు రాగానే ఒక్కసారిగా అందరూ కేకలు వేస్తూ సందడి చేశారు. దళపతి.. విజయ్.. విజయ్.. అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. దీంతో కారులో నుంచి సన్‌రూఫ్ ద్వారా నిలబడి అభిమానులను విజయ్ అభివాదం చేశారు. చేతులు ఊపుతూ అభిమానులను పలకరించారు. కేరళలో విజయ్ క్రేజ్ చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో రావడంతో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో రోడ్లు బ్లాక్ అయిపోయాయి. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కాగా.. గతంలో 2011లో కావలాన్ మూవీ షూటింగ్ కోసం చివరగా కేరళకు వెళ్లారు. మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి వెళ్లడంతో ఆయనకు స్వాగతం పలికారు. కాగా.. గోట్ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో దళపతి విజయ్ నటించనున్నారు. Road block completely 🙏🙏#VijayStormHitsKeralapic.twitter.com/cjkzEGUdlk — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 HD Video of Thalapathy’s entry in Trivandrum 🥁 #VijayStormHitsKerala pic.twitter.com/Ga6Qc5KZix — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 -
ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో.. అసలు కారణం ఇదే!
తమిళ స్టార్ హీరో గతేడాది తునివు(తెగింపు) చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్ కుమార్ విడాయమర్చి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమా త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఇదిలా ఉండగా అజిత్ సడన్‌గా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గురువారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇంతకీ తమ హీరోకు అసలు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే వచ్చారంటూ సన్నిహితులు వెల్లడించారు. కానీ తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆయన నరాల వాపుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చెవిని మెదడుకు కలిపే నరంలో వాపు రావడం వల్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని అజిత్ ప్రతినిధి సురేష్ చంద్ర తెలిపారు. అంతే కాకుండా బ్రెయిన్ సిస్ట్‌తో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అజిత్ సర్జరీ గురించి వచ్చిన కథనాలు అవాస్తవమని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సురేష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స పూర్తయిందని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. -
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024