కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్- దళపతి విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం లియో. ఈనెల 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరనుంది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ జీవితకాల కలెక్షన్స్‌ను కేవలం ఐదు రోజుల్లోనే లియో అధిగమించింది. కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.
(ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి)
అయితే కలెక్షన్ల పరంగా ఇండియాలో ఆరు రోజుల్లో దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఆరో రోజు రూ.31.50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ జోరు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల మార్క్‌ను దాటేయనుంది. వసూళ్లపరంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 పేరిట ఉన్న రికార్డ్‌ను సైతం లియో బద్దలు కొట్టింది.
గతంలో ఆరు రోజుల్లో రోబో 2.0 రూ. 400 కోట్లు వసూలు చేస్తే.. లియో కేవలం ఐదు రోజుల్లోనే ఆ మార్కును చేరుకుంది. ఈ వారంలోనే లియో ఐదొందల కోట్ల మార్క్ చేరుకుంటే రోబో 2.0, జైలర్ తర్వాత ఆ లిస్ట్‌లో మూడో చిత్రంగా లియో నిలుస్తుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు.
(ఇది చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!)
Comments
Please login to add a commentAdd a comment