లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!! | Shocking! Thalapathy Vijay Starrer Latest Movie Leo Leaked Online | Sakshi
Sakshi News home page

Leo Movie: లియోకు బిగ్‌ షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!

Published Thu, Oct 19 2023 11:47 AM | Last Updated on Thu, Oct 19 2023 12:00 PM

Tamil Star Hero Vijay Starrer latest Movie Leo Leaked In Online - Sakshi

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌పై వివాదం తలెత్తగా.. రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. మూవీ రిలీజైన కొద్ది గంట‌ల్లోనే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసింది. అది కూడా హెచ్‌డీ ప్రింట్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(ఇది చదవండి: 'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!)

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం పైర‌సీ సైట్స్‌లో కనిపించడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. అయితే ప్రింట్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొల‌గించేందుకు చిత్ర యూనిట్ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. తాజాగా లీక్‌ అయిన హెచ్‌డీ ప్రింట్‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయనుంది చిత్రయూనిట్.

వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం లియో. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చింది.  ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ నటుడు సంజ‌య్‌ద‌త్‌, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. 

(ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్‌.. ధర ఎన్ని కోట్లంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement