piracy
-
అప్పుడు గేమ్ ఛేంజర్.. ఇప్పుడు తండేల్.. వారికి నిర్మాత వార్నింగ్
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.పైరసీపై స్పందించిన తండేల్ నిర్మాతఅయితే తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్లైన్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందన్నారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాను సైతం లోకల్ ఛానెల్లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.తండేల్కు సక్సెస్ టాక్..ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లో రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన చూస్తే మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటనుంది. ఈ నేపథ్యంలో తండేల్ మూవీ నిర్మాతలు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. -
తండేల్‌ను వదలని పైరసీ భూతం.. రెెండో రోజే ఆన్లైన్లో ప్రత్యక్షం!
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ (Thandel Movie) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది.తండేల్‌ను వదలని పైరసీ భూతం..అయితే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. తాజాగా తండేల్ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. సినీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. విడుదలైన రెండో రోజే తండేల్ సినిమా ఆన్లైన్లో పలు వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మీ జిల్లా లాంటి పైరసీ సైట్లో తండేల్ పూర్తి సినిమా అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీంతో తండేల్ మూవీ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు.కాగా.. అంతకుముందే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయార్చి మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ చిత్రం రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో అప్లోడ్ చేసేశారు. సినీ ఇండస్ట్రీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని నిర్మాతలు, సినీ ప్రియులు కోరుతున్నారు. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్..తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది.విదేశాల్లోనూ హవా..విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అజిత్ మూవీకి షాక్.. కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో ప్రత్యక్షం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి అనే సరికొత్త యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఒక పక్కా అభిమానులు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరోపక్క పైరసీ కేటుగాళ్లు చిత్ర బృందానికి షాకిచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో అప్లోడ్ చేసేశారు. దీంతో నిర్మాతలతో పాటు అజిత్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొద్ది గంటల్లోనే నెట్టింట ప్రత్యక్షం..అయితే ఈ సినిమాను కూడా పైరసీ భూతం వదల్లేదు. విదాముయార్చి థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే నెట్టింట దర్శనమిచ్చింది. కొన్ని పైరసీ వెబ్ సైట్స్‌లో ఈ సినిమా కనిపించింది. దాదాపు నాలుగైదు వెబ్‌సైట్స్‌లో విదాముయార్తి ఫుల్ మూవీని అప్లోడ్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. టికెట్ కొని సినిమా చూడమని వేడుకుంటున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసినప్పటికీ పైరసీదారులు అస్సలు పట్టించుకోలేదు.కలెక్షన్లపై తీవ్ర ప్రభావం..విదాముయార్చి పైరసీ బారిన పడడంతో మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం కావడంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణ సంస్థ ముందే విజ్ఞప్తి చేసిన పైరసీకి గురి కావడంతో అజిత్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీ అంచనాలతో రికార్డ్ వసూళ్లు సాధిస్తుందనుకున్న విదాముయార్చికి పైరసీ భూతం అడ్డంకిగా మారింది. కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీని పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు.Every effort counts! 💪 Say NO to piracy and watch VIDAAMUYARCHI only in theatres! 🤩FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial… pic.twitter.com/WigarpFJ34— Lyca Productions (@LycaProductions) February 5, 2025 -
'గేమ్ చేంజర్'టీమ్‌కి భారీ షాక్.. ఆన్లైన్లో పైరసీ ప్రింట్ !
సినిమా అనేది కోట్ల బిజినెస్. పెద్ద పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చు అవుతుంటాయి. అలాంటి సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో వదులుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ పైరసీని అడ్డుకునేందుకు చిత్ర పరిశ్రమ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆ కేటుగాళ్లను అడ్డుకోలేకపోతుంది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాకు కూడా పైరసీ బారిన పడింది. సినిమా రిలీజైన రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీనిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది.మూడేళ్ల కష్టం.. నిమిషాల్లో లీక్కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని చిత్రబృందం ఆరోపిస్తుంది.డబ్బు కోసం బెదిరింపులు..'గేమ్ చేంజర్' విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయట. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారని . 'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హెచ్డీ ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు.45 మందిపై ఫిర్యాదు'గేమ్ చేంజర్' చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలియచేశారు. -
వినోద రంగానికి పైరసీ దెబ్బ
న్యూఢిల్లీ: దేశీ వినోద రంగానికి పైరసీ పెను ముప్పుగా మారింది. పైరసీ దెబ్బతో పరిశ్రమ గతేడాది (2023) ఏకంగా రూ.22,400 కోట్ల మేర నష్టపోయింది. ఈవై, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన ’ది రాబ్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మీడియా వినియోగదార్లలో 51 శాతం మంది పైరసీ అయిన కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అనధికారికంగా కాపీ చేయడం, పంపిణీ చేయడం లేదా కాపీరైట్ హక్కులున్న మెటీరియల్‌ను (సంగీతం, సినిమాలు, సాఫ్ట్వేర్ మొదలైనవి) వినియోగించుకోవడాన్ని పైరసీగా వ్యవహరిస్తారు. ఒరిజినల్ క్రియేటర్ల హక్కులను హరించి, వారిని గణనీయంగా నష్టపరుస్తుంది కాబట్టి దీన్ని ఒక విధంగా దొంగతనంగా కూడా పరిగణిస్తారు. ‘భారత మీడియా–వినోద పరిశ్రమలో సెగ్మెంట్లవారీ ఆదాయపరంగా చూస్తే 2023లో పైరసీ ఎకానమీ రూ. 22,400 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో సినిమా థియేటర్ల నుంచి పైరసీ చేసిన కంటెంట్ పరిమాణం రూ. 13,700 కోట్లుగా, ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి జనరేట్ చేసినది రూ. 8,700 కోట్లుగా ఉంటుంది. పైరసీ కంటెంట్ వల్ల రూ. 4,300 కోట్ల మేర ప్రభుత్వానికి జీఎస్టీ నష్టాలు వాటిల్లి ఉంటుందని అంచనా‘ అని నివేదిక వివరించింది. సబ్ర్స్కిప్షన్ ఫీజులు భారీగా ఉండటమే కారణం పైరేటెడ్ కంటెంట్‌ను చూడటానికి నిర్దిష్ట కారణాలున్నాయని యూజర్లు చెబుతున్నారు. సబ్స్క్రిప్షన్ ఫీజులు అధికంగా ఉండటం, కోరుకునే కంటెంట్ అందుబాటులో లేకపోవడం, ఒక్కో సబ్ర్స్కిప్షన్ను నిర్వహించుకోవడమనేది సమస్యగా మారడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. పైరసీ ఎక్కువగా 19–34 ఏళ్ల ఆడియన్స్‌లో ఉంటోందని, మహిళలు ఓటీటీ షోలను ఇష్టపడుతుండగా, పురుషులు క్లాసిక్ సినిమాలను వీక్షిస్తున్నారని నివేదిక తెలిపింది. పైరేటెడ్ కంటెంట్‌ను చూసే వారు, దాన్ని ఉచితంగా అందిస్తే, ప్రకటనలపరంగా అంతరాయాలు వచి్చనా, అధికారిక చానల్స్‌కి మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. కంటెంట్ ప్రొవైడర్లు ధరల విధానాలను, కంటెంట్‌ను అందుబాటులో ఉంచే వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. పైరేటెడ్ కంటెంట్ వినియోగదారుల్లో 70 శాతం మంది తాము ఏ ఓటీటీ సబ్ర్స్కిప్షన్నూ తీసుకోదల్చుకోలేదని తెలిపారు. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పైరసీ ఎక్కువగా ఉంటోంది. అధికారికంగా కంటెంట్‌ను వీక్షించేందుకు అవకాశాలు తక్కువగా ఉండటం, పైరేటెడ్ కంటెంట్ సులువుగా లభిస్తుండటం, పైరసీ వల్ల వచ్చే నష్టాలపై అవగాహన లేకపోవడం, ఆదాయాల్లో వ్యత్యాసాలు, థియేటర్లు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కూడా పైరసీ విస్తృతికి కారణంగా ఉంటున్నాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోని యూజర్లు సాధారణంగా పాత సినిమాలను వీక్షించేందుకు పైరేటెడ్ కంటెంట్‌ను ఆశ్రయిస్తుండగా, ద్వితీయ శ్రేణి నగరాల్లోని వారు టికెట్టు కోసం ఖర్చు చేయడం ఇష్టం లేక ఈమధ్యే విడుదలైన కొత్త సినిమాలను చట్టవిరుద్ధంగా చూసేందుకు ఉపయోగిస్తున్నారు. సమిష్టిగా పోరాడాలి.. పైరసీ వల్ల వాటిల్లుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని, దాన్ని కట్టడి చేసేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఐఏఎంఏఐ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్ రోహిత్ జైన్ చెప్పారు. ‘దేశీయంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతోందనేది కాదనలేని వాస్తవం. 2026 నాటికి ఫిలిం ఎంటర్టైన్మెంట్ రూ. 14,600 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే, విచ్చలవిడిగా విజృంభిస్తున్న పైరసీ నుంచి దీనికి పెను ముప్పు పొంచి ఉంది. కాబట్టి, ప్రభుత్వం, పరిశ్రమ, వినియోగదారులు అందరూ కూడా కలిసికట్టుగా దీనిపై పోరాడాల్సి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. -
పైరసీకి అడ్డుకట్ట వేస్తాం
‘‘పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఓ సినిమా నిర్మాణానికి పడ్డ కష్టం పైరసీ వల్ల వృథాగా పోతోంది. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించడం జరిగింది’’ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ఈ విషయమై శుక్రవారం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో,ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించాం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న పైరేటెడ్ కంటెంట్‌పై నోడల్ ఆఫీసర్స్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు 48 గంటల్లో ఆ కంటెంట్‌ను ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించేలా చర్యలు చేపడతారు’’ అని చెప్పుకొచ్చారు. -
లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌పై వివాదం తలెత్తగా.. రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. అది కూడా హెచ్డీ ప్రింట్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: 'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!) భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం పైరసీ సైట్స్‌లో కనిపించడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. అయితే ప్రింట్‌ను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా లీక్ అయిన హెచ్డీ ప్రింట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం లియో. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే?
ప్రభాస్ 'ఆదిపురుష్' బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. కలెక్షన్స్ దాదాపు అన్నిచోట్ల తగ్గిపోయాయి. జనాలు ఈ సినిమాని మెల్లగా మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో చిత్రబృందానికి అనుకోని పెద్ద అవాంతరం ఎదురైంది. అలా జరగడంతో ఓటీటీలోకి ఈ చిత్రాన్ని అనుకున్న సమయం కంటే ముందే తీసుకొచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చు? (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) లీక్ చేశారు! రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తీశారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చి ఇన్నిరోజులు అవుతున్నా ఈ చిత్రంపై ఏదో ఓ వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అదంతా కాదన్నట్లు పలువురు అజ్ఞాత వ్యక్తులు.. మొత్తం HD ప్రింట్ ని పైరసీ సైట్స్ లో పెట్టేశారు. అయితే అది తమిళ వెర్షన్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. మరో రెండు వారాల్లో? ఓవైపు థియేటర్లలో ఉండగానే 'ఆదిపురుష్' ఇలా పైరసీ సైట్స్‌లో ప్రత్యక్షమవడం చిత్రబృందానికి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే ఓవైపు సినిమా.. థియేటర్ల దగ్గర ఫెయిల్ కావడం, పైరసీ అయిపోవడం లాంటివి చూసి చిత్రబృందం ఆలోచనలో పడిపోయింది. ఆగస్టులో ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ మరో 1-2 వారాల్లో 'ఆదిపురుష్' ఓటీటీలోకి వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?) -
CII Dakshin Summit 2023: చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం
‘‘చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న చిన్న సమస్యలను ఈ వేదికపై చెప్పారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. పైరసీని అరికట్టే విధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చాం. అదే విధంగా జీఎస్టీ విషయంలో ఒకే పన్ను విధానాన్ని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ అన్నారు. సీఐఐ దక్షిణ్ సమ్మిట్ ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోజరిగింది. సీఐఐ చైర్మన్ టీజీ త్యాగరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటుడు ధనుష్, నటి శోభన, కమల్‌బాలి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. కాగా సీఐఐ దక్షిణ్ నిర్వాహకులు చిరంజీవికి ఐకాన్ అవార్డును, తమిళ నటుడు ధనుష్‌కు యూత్ ఐకాన్ అవార్డును ప్రకటించారు. చిరంజీవి హాజరు కాకపోవడంతో ఆయన అవార్డును సుహాసిని అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణ తెలుపుతూ చిరంజీవి వీడియోను షేర్ చేశారు. -
పైరసీలో సినిమాలు చూస్తున్నారా? ఇకపై ఆ సైట్లు పనిచేయవు!
తమిళ సినిమా: చట్ట విరోధంగా పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లపై చెన్నై హైకోర్టు కొరడా ఝుళిపించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈచిత్రంలో ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. దీంతో పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయన్ సుబ్రహ్మణియన్ హాజరై వాదించారు. పలు నెలలు శ్రమించి, కోట్లలో ఖర్చు చేసి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని, ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
వ్యూస్ కోసం అలాంటి థంబ్‌నైల్స్ పెట్టడం కరెక్ట్ కాదు
‘‘డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో తంబ్‌నైల్స్, పైరసీ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అంతేకానీ కొందరు లైక్‌లు, వ్యూయర్స్ కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్‌నైల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం తగదు. యూట్యూబ్ తంబ్‌నైల్స్, పైరసీ చేసేవారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చర్చిస్తాం.. పైరసీ సెల్‌ను యాక్టివ్ చేస్తాం’’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ ఇండస్ట్రీవారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, పైరసీ వంటి విషయాలపై చర్చించేందుకు 24క్రాఫ్ట్స్ అధక్షులు, సెక్రటరీలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘ఓటీటీలపైనా సెన్సార్ ఉండాలి. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రానికల్లా సినిమా పైరసీ అవుతోంది. ఫిలిం చాంబర్ యాంటీ పైరసీ విభాగం డబ్బున్న వాళ్లకే పని చేస్తోంది.. పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ పాత్ర శూన్యం’’ అన్నారు. ‘‘యూట్యూబ్‌కి కూడా సెన్సార్ విధానం తీసుకురావాలి’’ అని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ అన్నారు. ‘‘మా కుటుంబంపై వచ్చే అసత్య వార్తల వల్ల 25ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాను. మా కష్టాలను అర్థం చేసుకోండి’’ అని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. ‘‘సోషల్ మీడియాలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు.. వారికి ఇష్టమైంది రాసుకుంటున్నారు.. దీన్ని అరికట్టాలి’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. -
‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ శుక్రవారం(డిసెంబర్ 17) విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి భారీ షాక్ తగిలింది. విడుదలైన కొద్ది గంటల్లోపై పుష్ప పైరసీ అయినట్లు తెలుస్తొంది. కాగా చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ పైరసి బెడద తప్పడంలేదు. చదవండి: సమంత స్పెషల్ సాంగ్‌పై పేరడీ, అమ్మాయిలకు కౌంటర్‌గా లిరిక్స్.. ఇప్పటికే ఎన్నో సినిమాలతో పాటు చివరికి బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రం కూడా ఈ పైరసీ బారిన పడింది. తాజాగా పుష్ప మూవీపై కూడా ఈ లీక్ వీరులు కన్నేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే పుష్ప ఫుల్ మూవీ లింక్‌ను ఆన్లైన్లో పెట్టేశారు. చాలా కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్లైన్లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప' మూవీని కూడా లీక్ చేసేశాయి. చదవండి: ‘పుష్ప’ థియేటర్ ఎదుట ఫ్యాన్స్ ఆందోళన, రాళ్లతో దాడి దీంతో కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టిస్తుందని చిత్ర యూనిటితో పాటు నిర్మాతలు పెట్టుకున్న ఆశలకు గండి పడినట్టైంది. దీంతో మూవీ యూనిట్ ఆందోళనలో పడింది. ఇప్పటికే పుష్ప మూవీ ప్రేక్షకుల అంచనాలను చేరుకొలేకపోయిందనే టాక్ నడుస్తోంది. బ్లాక్‌బస్టర్ చిత్రం అనుకున్న ఈ మూవీపై కొందరూ యావరేజ్అనే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ఆన్లైన్లో లీక్ అవ్వడం పుష్ప మూవీకి కలెక్షన్స్ పరంగా దెబ్బ పడినట్టే అని చెప్పుకోవాలి. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
పైరసీ చూస్తే వాట్సాప్ కట్!
న్యూఢిల్లీ: సినిమా పైరసీ విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సినిమాను పైరసీని ప్రొత్సహించే యూజర్ల వాట్సాప్ అకౌంట్లను తాత్కాలికంగా రద్దు చేయాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సూచించింది. రాధే సినిమా పైరసీ కాపీలను షేర్ చేసినవాళ్లతో పాటు చూసిన వాళ్ల, అమ్మిన వాళ్ల వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా అకౌంటన్లను సస్పెండ్ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక సినిమా విషయంలో న్యాయస్థానం ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే రాధే పైరసీ పై మహారాష్ట్రలో క్రిమినల్ కంప్లంయిట్స్ కూడా నమోదు అయ్యింది. కాగా, తమ సినిమా పైరసీ యధేచ్ఛగా జరుగుతోందని, సినిమా క్లిపులు వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున్న సర్క్యులేట్ అవుతున్నాయని రాధే సినిమా హక్కులదారు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇంటీరియమ్ రిలీఫ్ కింద ఈ ఆదేశాలను జారీ చేసింది జస్టిస్ సంజీవ్ ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్ బెంచ్. ఈ విషయంలో తమ సబ్స్క్రయిబర్ల వివరాలివ్వాలని టెలికామ్ ఆపరేటర్లను సైతం కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపింది. పైరసీ కాపీలను చూడడం, కాపీ, అమ్మకం, నిల్వ చేయడం.. ఇలా ఏ రూపంలో రాధే పైరసీ కాపీ ఉన్నా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపింది. డిజిటల్ కంటెంట్ విషయంలో కఠిన నిబంధనలు అమలు రాబోతున్న వేళ.. పైరసీపై ఇలాంటి చర్యలు మునుముందు నిర్మాతలకు ఊరట అందించబోతున్నాయి. కాగా, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే: యువర్ మోస్ట్‌వాంటెడ్ భాయ్’ మే 13న జీ ఫ్లిక్స్‌లో , డిష్, డీ2హెచ్, టాటా స్కై, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ లాంటి డీటీహెచ్ వేదికల్లో ‘పే పర్ వ్యూ’ విధానంలో రిలీజ్ చేశారు. వ్యూయర్షిప్తో దుమ్మురేపినప్పటికీ.. కంటెంట్ ఆడియెన్స్‌ను మెప్పించకపోవడం, నెగెటివ్ రివ్యూలు, ట్రోలింగ్‌తో.. 1.8 ఐఎండీబీ రేటింగ్‌తో సల్మాన్ కెరీర్లోనే వరెస్ట్ మూవీ ట్యాగ్ దక్కించుకుంది రాధే. -
‘రాధే’ మూవీ టీంకు భారీ షాక్, సల్మాన్ ఫైర్
బిగ్ స్క్రీన్‌పై విడుదలవ్వాల్సిన పెద్ద సినిమాలు సైతం కరోనా దెబ్బకు ఓటీటీ బాట పడుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్రాలను పైరసీ భూతం వదలడం లేదు. ఎక్కడైనా సరే పెద్ద సినిమాల దర్శక నిర్మాతలకు ఈ పైరసీ పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా విడుదలైన బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీకి కూడా ఈ సమస్య తప్పలేదు. గతేడాది నుంచి థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘రాధే’ మూవీని సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం జీప్లెక్స్‌లో పే పర్ వ్యూ విధానంలో విడుదల అయ్యింది. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఆన్లైన్లో లీకైయింది. మరోవైపు ఓటీటీ యాప్‌లు డౌన్ అయ్యి సర్వర్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఆన్లైన్లో వచ్చిన పైరసీని ఆశ్రయించారు. అది తెలిసి జీ5 నిర్వహాకులు సైబర్ సెల్లో కేసు నమోదు చేశారు. అంతేగాక సల్మాన్ సైతం పైరసీ వీరులపై మండిపడుతూ.. సోషల్ మీడియా వేదికగా వారికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘కేవలం 249 రూపాయలకే మా సినిమా రాధేను ఓటీటీలో అందుబాటులో ఉంచాం. అయినప్పటికీ సినిమాను మీరు పైరసీ చేయడం చట్టరిత్యా నేరం. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఈ అక్రమ సైట్ల నిర్వహకులతో పాటు, వాటిని వినియోగించిన వారిపై సైతం సైబర్ సెల్ చర్యలు తీసుకుంటుంది. సైబర్ సెల్‌తో మీకు ఇబ్బందులు తప్పవు. పైరసీని ఎవరూ ప్రోత్సహించకండి. దయచేసి అర్థం చేసుకోండి’ అంటూ సల్మాన్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా సినిమాకు విడుదల ముందే సల్మాన్ మూవీని ఎలాంటి పైరసీలకు యత్నించకుండా సరైన వేదికలపైనే మూవీని ఆస్వాధించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. సల్మాన్ సరసన దిశా పటానీ ‘రాధే’లో సందడి చేసింది. pic.twitter.com/bPob7gFKMj — Salman Khan (@BeingSalmanKhan) May 15, 2021 -
’సుల్తాన్‌కు పైరసీ షాక్! రేయ్ నా ట్విట్టర్లోనే పోస్ట్ చేస్తారా?
చెన్నై: ‘నా ట్విట్టర్లోనే పోస్ట్ చేస్తారా.. ఇదిగో వస్తున్నారా..’? అంటూ సుల్తాన్ చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలను పైరసీ బెడద నుంచి కాపాడడం అసాధ్యంగానే మారింది. కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆ చిత్రం చట్టవిరుద్ధంగా వెబ్సైట్లో ప్రసారమవుతుంది. దీన్ని అరికట్టాలని చూసిన ఎవరి ప్రయత్నం కూడా ఫలించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే నటుడు కార్తీ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. చిత్రానికి సక్సెస్ టాక్ రావడంతో ఖుషీలో ఉన్న చిత్ర యూనిట్ ఓ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ నిర్మాతలకు పైరసీ షాక్ తగులుతోంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు ట్విట్టర్లోనే ఒక వ్యక్తి సుల్తాన్ చిత్రం తన టెలిగ్రామ్ చానల్లో పొందుపరచడం జరిగిందని పోస్ట్ చేశాడు. దీంతో షాక్‌కు గురైన నిర్మాత ఎస్ ఆర్.ప్రభు అనంతరం రేయ్ ట్విట్టర్లోకే వచ్చి నా చిత్ర పైరసీకి ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారా? ఇదిగో వస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సంఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: సుల్తాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. యావరేజ్ టాక్ అయినా కూడా.. Adeiii.... yen comment la vanthu en padaththukke piracy promote pandra alavukku valanthutteengala😂😂😂 Itho varandaaa....🤣🤣🤣 https://t.co/UogtsCBBBY — SR Prabhu (@prabhu_sr) April 4, 2021 -
ఆది సాయికుమార్‌కు భారీ షాక్.. ‘శశి’విడులైన తొలి రోజే..
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మార్చి 19న (శుక్రవారం) ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా గత వారం మార్చి 12న విడుదలైన జాతిరత్నాలు మూవీకి షాక్‌నిస్తూ విడుదలైన తొలి రోజే పైరసి భూతం తాకింది. అయినప్పటికి బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కలెక్షన్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈసారి ‘శశీ’ మూవీకి కూడా భారీ షాక్ తగిలింది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీ పైరసీ బారిన పడింది. ఇక ఈ మూవీతో పాటు ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్లు’ సినిమాలు కూడా విడుదల కావడం.. ఇప్పుడు ఈ పైరసీ భూతం వెంటడాటంతో ‘శశి’ మూవీ టీంకు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. అంతేగాక దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై పడే ప్రమాదం ఉంది. కాగా పైరసి వెబ్సైట్లు మూవీరూల్స్, తమిళరాక్స్తో పాలు పలు పైరసి వెబ్సైట్లలో ఈ మూవీ లింకులు వచ్చేశాయి. దీంతో ప్రేక్షకుల్లో అంతగా పాజిటివ్ టాక్ లేకపోవడంతో ఈ మూవీని థీయేటర్లో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ భామకు కరోనా పాజిటివ్ పైరసీ కారణంగా రూ.2,100 కోట్ల నష్టం ‘జాతిరత్నాలు’ టీమ్‌కి భారీ షాక్ -
బాబోయ్ పైరసీ.. వేల కోట్లు ఉఫ్!
సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ కారణంగా మీడియా, వినోద పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఏటా సగటున రూ.2,100 కోట్ల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పైరసీని కట్టడి చేయడం కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిందని, సినిమా హాళ్లలో పైరసీకి పాల్పడేవారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని ఎంపీలు సుకాంత మజుందార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం పైరసీ కట్టడికి కొన్ని సిఫార్సులు చేసిందని, వాటిని పరిశీలించి సినిమాటోగ్రఫీ బిల్లు –2021లో చేర్చుతామన్నారు. వీటితో పాటు కాపీరైట్ చట్టం–1957 ప్రకారం పైరసీపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా పైరసీకి పాల్పడితే ఐటీ యాక్ట్ –2000లోని సెక్షన్ 79 ద్వారా చర్యలు తీసుకోవచ్చని జవడేకర్ పేర్కొన్నారు. చదవండి: ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్ హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు -
పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్లు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమా వాళ్లకు సైబర్ కేటుగాళ్ల ముప్పు తప్పడం లేదు. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే వాటిని ఆన్లైన్లో లీక్ చేసి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఆన్లైన్లో చక్కర్లు కొట్టగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాయింట్ బ్లాంక్' సినిమాను ఇలాగే లీకైంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన 'పాయింట్ బ్లాంక్'. సాయి పవన్ సంగీతం సమకూర్చగా.. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుండగా.. ఇంతలో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. విడుదలకు ముందే ఈ సినిమాను పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అప్లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి తమ ఫిర్యాదు నమోదు చేశారు. ఎంతో కష్టపడి తీసిన తమకు తెలియకుండానే ఇలా ఆన్లైన్లో లీక్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ ప్రింట్ ఆన్లైన్లో తీసేయాలని పోలీసులను కోరారు. -
‘మాస్టర్’ సినిమా లీక్.. దర్శకుడి భావోద్వేగ ట్వీట్
తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' విడుదలకు కొద్ది గంటల ముందే పైరసీ బారిన పడింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం (జనవరి 13)న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కానీ ఇంతలోనే సినిమాకు సంబందించిన కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. నిన్నటి నుంచి ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు తమ స్టాటస్ మెసేజ్ లుగా వీటిని పెడుతుండటంతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. తమకు జరుగుతున్న నష్టంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది’ అని లోకేశ్ కనకరాజ్ ట్వీట్ చేశారు. నగరం, ఖైది చిత్రాల తర్వాత లొకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ప్రోమోలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. Dear all It's been a 1.5 year long struggle to bring Master to u. All we have is hope that you'll enjoy it in theatres. If u come across leaked clips from the movie, please don't share it 🙏🏻 Thank u all. Love u all. One more day and #Master is all yours. — Lokesh Kanagaraj (@Dir_Lokesh) January 11, 2021 -
బొమ్మ బంపర్ హిట్!
పైరసీతో సినీ రంగం నష్టపోతోందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకుల సంఖ్యేమీ తగ్గడం లేదు. సినిమా కలెక్షన్లు అలవోకగా వందల కోట్లు దాటడమూ ఆగడం లేదు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం భయాల్లాంటివి ఎలా ఉన్నా .. సినీ ప్రేమికులు రేటెంతైనా సరే టికెట్టు కొనుక్కుని చూసేందుకు మొగ్గుచూపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. గతేడాదే సినిమాలపై ప్రేక్షకులు ఏకంగా రూ. 10వేల కోట్లపైగానే వెచ్చించారు. న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంటున్న సినిమా టికెట్ల అమ్మకాలు మళ్లీ జోరు అందుకుంటున్నాయి. పైరసీ కష్టాలు ఎలా ఉన్నా.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తేడా లేకుండా సినీ ప్రియులు .. రేటెంతయినా సరే టికెట్లు కొనుక్కుని థియేటర్లలో చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. గతేడాది గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఒర్మాక్స్ మీడియా అనే కన్సల్టింగ్ సంస్థ రూపొందించిన బాక్సాఫీస్ రిపోర్ట్ 2019 ప్రకారం.. భారతీయులు గతేడాది 103 కోట్ల సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 10,948 కోట్లు వెచ్చించారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 11.6 శాతం అధికం. 2018లో దేశీ సినీ ప్రియులు 94.5 కోట్ల టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 9,810 కోట్లు వెచ్చించారు. అమ్ముడైన టికెట్లలో దాదాపు మూడో వంతు వాటా హిందీ సినిమాలదే ఉంది. 19 శాతం తమిళ సినిమాలు, 18 శాతం తెలుగు సినిమాల వాటా ఉంది. హాలీవుడ్, మలయాళం సినిమాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం.. సినిమాలు బంపర్ కలెక్షన్లు సాధించడంలో భాష ప్రధానంగా ఉంటోంది. ప్రభాస్ నటించిన సాహో (హిందీ, తమిళం, తెలుగు) బాక్సాఫీస్ ఆదాయాల్లో అత్యధికంగా 60 శాతం వాటా హిందీ నుంచే వచ్చినట్లు ఒర్మాక్స్ మీడియా సీఈవో శైలేష్ కపూర్ పేర్కొన్నారు. ఇక హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘వార్’ కలెక్షన్లలో గణనీయ భాగం తెలుగు వెర్షన్ నుంచి వచ్చాయని వివరించారు. ఈ నేపథ్యంలో చాలా మటుకు టాప్ 10 సినిమాలు.. బహుభాషల్లో విడుదలవుతున్నాయని కపూర్ చెప్పారు. హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగు, తమిళం, హిందీ తదితర పలు భారతీయ భాషల్లోకి డబ్ చేస్తున్నారని విశ్లేషించారు. ‘అవెంజర్స్ సినిమా బాక్సాఫీస్ ఆదాయాల్లో 40–45 శాతం వాటా హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లదే ఉంది. భారీ సినిమాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వాటి బాక్సాఫీస్ ఆదాయాల్లో సగటున 30–35 శాతం వాటా భారతీయ భాషల వెర్షన్ల నుంచే వస్తోంది. 1917 లాంటి చిన్న సినిమాలు ఇంగ్లీష్‌లో మాత్రమే విడుదలవుతున్నాయి’ అని కపూర్ చెప్పారు. హాలీవుడ్ చిత్రాలైనా .. బాలీవుడ్ సినిమాలైనా .. పలు భాషల్లో డబ్ చేసి, విడుదల చేస్తుండటం వల్ల టికెట్ల అమ్మకాలు.. తద్వారా బాక్సాఫీస్ ఆదాయాలు పెరుగుతున్నాయి. కంటెంటే కింగ్.. అయితే, సినిమాల కలెక్షన్లు పెరగడానికి కారణం పలు భాషల్లో రిలీజ్ చేయడం ఒక్కటే కాదని, కంటెంట్ కూడా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. స్టార్ హీరోలు, యాక్టర్లతో సంబంధం ఉండటం లేదని వివరించింది. హిందీ సినిమాలు.. కలెక్షన్ల కోసం తొలి వారాంతంపై ఆధారపడటమనేది దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. కేవలం తొలి వారానికే పరిమితం కాకుండా కంటెంట్ ఎంత బాగుంటే .. అంత ఎక్కువ కాలం థియేటర్లలో సినిమాలు నడుస్తున్నాయి. ‘గతంలో కహానీ (2012), క్వీన్ (2014) వంటి సినిమాల్లో పెద్ద స్టార్లు లేకపోయినా అవి రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం గొప్పగా ఉండేది. కానీ 2019 విషయం తీసుకుంటే పెద్ద స్టార్లెవరూ లేని చిచోరే సినిమా అలవోకగా రూ. 140 కోట్ల వసూళ్లు సాధించింది. సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్ నటించిన దబాంగ్ 3కి సరిసమాన స్థాయిలో నిల్చింది. కనుక స్టార్లు లేరు కాబట్టి సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటాయని అనుకోవడానికి లేదు. కంటెంట్ బాగుంటే చాలు.. ఆదాయాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది‘ అని కపూర్ చెప్పారు. స్టార్ యాక్టర్ల సినిమాలకు సాధారణంగానే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ, ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతాయి అన్నది కంటెంట్ పైనే ఆధారపడి ఉంటోంది. దబాంగ్ 3 ఓపెనింగ్స్ రూ. 32 కోట్లతో పోలిస్తే చాలా తక్కువగా రూ. 6 కోట్ల ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన చిచోరే.. ఆ తర్వాత అదర గొట్టే కలెక్షన్లు సాధించడం దీనికి నిదర్శన మని కపూర్ తెలిపారు. విదేశీ మార్కెట్ల లోనూ దూకుడు.. వసూళ్లు పెంచుకోవడానికి చిత్రాలను విదేశీ మార్కెట్లలోనూ పెద్ద ఎత్తున విడుదల చేసే ధోరణి పెరిగిందని కేర్ రేటింగ్స్ తెలిపింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమా దీనికి నిదర్శనంగా పేర్కొంది. మొత్తం రూ. 1,968 కోట్ల వసూళ్లలో నాలుగింట మూడొంతుల వాటా విదేశీ మార్కెట్ల నుంచే వచ్చిందని వివరించింది. చైనా, మధ్యప్రాచ్యం, తైవాన్, మలేషియా, హాంకాంగ్, బ్రిటన్ వంటి దేశాల్లో భారతీయ సినిమాలకు ఆదరణ ఉంటోందని కేర్ రేటింగ్స్ తెలిపింది. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి ఓవర్–ది–టాప్ కంటెంట్ ప్లాట్‌ఫాంల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. థియేటర్లలో టికెట్ల రాబడి కూడా పెరగడం గమనార్హమని వివరించింది. ఒకదాని వల్ల మరో దానికి ముప్పు రాకుండా ఓటీటీ ప్లాట్‌ఫాంలు, థియేటర్లు కలిసి ముందుకు సాగగలవని పేర్కొంది. బాక్సాఫీస్‌పై ‘లిప్‌స్టిక్’ ప్రభావం: కేర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పెరగడానికి ‘లిప్‌స్టిక్’ ఎఫెక్ట్ కూడా కారణమని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో వినియోగదారులు .. విలాసవంతమైన భారీ కొనుగోళ్ల జోలికి పోకుండా.. చిన్న చిన్న సరదాలపై ఖర్చు పెట్టే ధోరణిని లిప్‌స్టిక్ ఎఫెక్ట్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రభావంతో పాటు కంటెంట్ మెరుగుపడటం, సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గడం కూడా పరిశ్రమకు తోడ్పడిందని కేర్ రేటింగ్స్ పేర్కొంది. సినిమాల సగటు ఆదాయం 15 శాతం పెరిగి రూ. 23 కోట్లకు చేరిందని వివరించింది. 2018లో ఏడు చిత్రాలు రూ. 100 కోట్ల వసూళ్ల మార్కును దాటగా 2019లో ఇది పదమూడుకు పెరిగింది. గతేడాది ఆరు బాలీవుడ్ సినిమాలు రూ. 200 కోట్ల మార్కును అధిగమించాయి. -
ఆన్లైన్లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో సినిమాకు పైరసీ తప్పలేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ సినిమా పైరసీ వీడియోను ఆన్లైన్లో పెట్టేశారు. థియేటర్లలో ప్రీమియర్ షో ముగిసిన తర్వాత పైరసీ వెబ్సైట్లలో సినిమా ప్రత్యక్షమైంది. తమిల్ రాకర్స్, పైరేట్ బే వంటి పలు వెబ్సైట్లలో ఈ సినిమా పైరసీ వీడియో పెట్టినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను పైరసీ చేయడం పట్ల చిత్రయూనిట్ ఆందోళన చెందుతోంది. మిషన్ మంగళ్, బాట్లాహౌస్, సేక్రేడ్ గేమ్స్-2 కూడా ఆన్‌లైన్‌లోకి లీక్ చేశారు. తమిళ స్టార్ అజిత్ నటించిన తాజా చిత్రం ‘నేర్కొండ పార్వై’ను విడుదలకు ముందే పైరసీ చేశారు. సింగపూర్‌లో ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమా పైరసీ వెబ్సైట్లలోకి వచ్చేసింది. కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఆరంభ వసూళ్లు భారీగానే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: ‘సాహో’ మూవీ రివ్యూ) -
డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు
‘‘డీ సినిమాను అందరూ ప్రోత్సహించాలి. నిర్మాతల కష్టాన్ని పైరసీ ద్వారా వృథా చేస్తున్నారు. దీన్ని ఖండించాలి. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ‘డీ’ సినిమా సేవలు రానున్నాయి. బసిరెడ్డిగారు ఈ టెక్నాలజీ తీసుకురావడం సంతోషం’’ అన్నారు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్. పైరసీని అరికట్టడానికి ‘డీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్’ డెమోను ఏఎంబీ సినిమాస్‌లో ప్రారంభించారు. ‘డిజిక్వెస్ట్’ ఇండియా లిమిటెడ్ సీఎండీ బసిరెడ్డి మాట్లాడుతూ– ‘‘పైరసీ నిర్మూలన కోసం రెండేళ్లు ట్రై చేశాం. కొత్త టెక్నాలజీలో పైరసీ ప్రొటక్షన్ ఇమిడి ఉండటం విశేషం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కామర్స్, డిజిక్విస్ట్ ఇండియా సమాన భాగస్థులుగా దీన్ని ముందుకు తీసుకెళతారు’’ అన్నారు.తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ పి.రామ్మోహన్ రావ్ మాట్లాడుతూ– ‘‘పైరసీని అరికట్టడానికి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. డిజిటల్ డెలివరీ రేట్స్ నిర్మాతలందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇండస్ట్రీలోని వారందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కె.మురళీ మోహన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ వడ్లపట్ల, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ బాల గోవింద్ మూర్తి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, దర్శకుడు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పైరసీ చేస్తే మూడేళ్ల జైలు
చలనచిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారింది పైరసీ భూతం. ఇకపై సినిమాకి చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం సరైన అనుమతులు లేకుండా ౖపైరసీ చర్యలకు పాల్పడిన వ్యక్తులు మూడేళ్ల కారాగార శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా కట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆ రెండిటికీ శిక్షార్హులవుతారు. కేంద్రప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లు గురించి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘మన దేశంలోని మేధావుల సంపత్తిని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన ముందడుగు’’ అని ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ప్రెసిడెంట్ సిద్ధార్థ్‌రాయ్ కపూర్ అన్నారు. -
థ్యాంక్యూ మోదీజీ : అనిల్ కపూర్
సాక్షి, ముంబై : సినీ పరిశ్రమను ముప్పతిప్పలు పెడుతున్న పైరసీని మట్టుబెట్టేందుకు సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. సినిమాలను అనధికారికంగా రికార్డు చేయడం, డూప్లికేషన్‌కు పాల్పడటంపై కఠిన చర్యలు చేపట్టేలా సవరణ బిల్లును కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సినీ పరిశ్రమలకు చెందిన సెలెబ్రిటీలు స్వాగతిస్తున్నారు. సినిమాటోగ్రఫీ చట్టానికి ప్రతిపాదిత సవరణలతో పరిశ్రమ రాబడి పెరిగి, పెద్ద ఎత్తున పరిశ్రమలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పైరసీకి వ్యతిరేకంగా కీలక అడుగులు పడతాయని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై అనిల్ కపూర్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో తాను ప్రధానితో భేటీ అయిన ఫోటోను పోస్ట్ చేశారు. -
హీరో విశాల్ అరెస్ట్..
-
హీరో విశాల్ అరెస్ట్..
తమిళ నిర్మాతల మండలిలో నెలకొన్న విబేధాలు తారస్థాయికి చేరాయి. హీరో అరెస్ట్‌తో గురువారం నిర్మాతల మండలి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌ను తొలుత అభినందించిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సమస్యలను పట్టించుకోవడం లేదని.. పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ సినిమాల వెబ్సైట్ తమిళ్‌రాకర్స్‌లో విశాల్‌కు షేర్ ఉందంటూ ప్రముఖ నిర్మాత అజగప్పన్ ఆరోపించారు. ఇక మీదట నిర్మాతల మండలిలోకి రానిచ్చేది లేదంటూ ఆయన ప్రత్యర్థులు కొందరు కార్యాలయానికి తాళం వేశారు. దాంతో విశాల్ తాళం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకూ చెన్నై పోలీసలు విశాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలంగా విశాల్‌కు, నిర్మాతలకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. దాంతో ఓ వర్గం వారు విశాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేలా పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ చిన్న సినిమాల నిర్మాతలు విశాల్‌ను నిలదీస్తున్నారు. కాగా అరెస్ట్ విషయమై విశాల్ ట్విటర్లో స్పందించారు. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న తమిళ నిర్మాతల మండలికి తాళం వేశారు. అప్పుడు స్పందించని పోలీసులు.. నేడు మా తప్పేం లేకపోయినప్పటికి నన్ను, నా సహచరులను అరెస్ట్ చేశారు. దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ విషయం గురించి పోరాటం చేస్తానం’టూ ట్వీట్ చేశారు. Police who were mute yesterday wen unauthorised ppl locked the doors & gates of TFPC have arrested me & my colleague today for no fault of ours,absolutely unbelievable We will fight back,wil do everything to conduct Ilayaraja sir event & raise funds to help Producers in distress — Vishal (@VishalKOfficial) December 20, 2018 -
షాకింగ్ : ఆన్లైన్లో లీకైన 2.ఓ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో ఎస్ శంకర్ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన 2.ఓ అన్ని రికార్డులను తిరగరాస్తూ అత్యధిక థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఈ మూవీ తొలిరోజు భారీ కలెక్షన్లను కొల్లగొట్టగా, మూవీ మేకర్లను షాకింగ్‌కు గురిచేస్తూ సినిమా పూర్తి హెచ్డీ ప్రింట్‌ను పైరసీ వెబ్సైట్ తమిళ్‌రాకర్స్ లీక్ చేసింది. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్దిగంటలకే హెచ్డీ ప్రింట్ పూర్తిగా లీక్ కావడం నిర్మాతలు, రజనీ అభిమానులను కలవరపరిచింది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ఈ తరహా పైరసీ వెబ్సైట్ల జాబితాతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఆన్లైన్ పైరసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాతలు ఇన్ని ఏర్పాట్లు చేసినా సినిమా లీక్ కావడం దుమారం రేపుతోంది. పలు పైరసీ వెబ్సైట్లను ప్రభుత్వం బ్లాక్ చేసినా తమిళ్రాకర్స్ను బ్లాక్ చేయలేదు. ఇదే వెబ్సైట్ గతంలో ధనుష్ నటించిన వడచెన్నై, విజయ్ హీరోగా తెరకెక్కిన సర్కార్ మూవీలను లీక్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సెల్ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ దుష్ర్పభవాల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. -
పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి
-
‘టాక్సీవాలా’కు మద్దతుగా..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. ఎస్కేఎన్ నిర్మాతగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే లీకై యూనిట్ వర్గాలకు షాక్ ఇచ్చింది. నిర్మాతలు పైరసీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. దీంతో టాక్సీవాలాకు మద్దతుగా ఇండస్ట్రీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ పైరసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో మేసేజ్‌ను పోస్ట్ చేశారు. టాక్సీవాలా చిత్ర సినిమాటోగ్రాఫర్ మెసేజ్‌పై స్పందించిన నిఖిల్, ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా రిలీజ్ కు ముందే లీకైతే గుండె పగిలినంత బాధకలుగుతుంది. ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు టాక్సీవాలాకు జరిగింది. తరువాత నా సినిమాకు కూడా జరగొచ్చు అందుకే అందరూ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాక్సీవాలా విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. -
ఇంకా పూర్తి కాలేదు: విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే లోగా పూర్తి సినిమా లీకైపోయింది. మొబైల్స్‌లో టాక్సీవాలా సినిమా షేర్ అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై చిత్రయూనిట్ ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు. తన సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే విజయ్ దేవరకొండ ఈ ప్రమోషనల్ వీడియోలోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే లీకైన వీడియోలో సినిమా రష్ మాత్రమే ఉందని.. ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ పూర్తయితేనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుందని ఇన్నోవేటివ్‌గా చూపించాడు. ‘ద రియాలిటీ బిహైండ్ టాక్సీవాలా’ పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. విజయ్ సరసన ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్
‘గీత గోవిందం’ సినిమాలోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో టాలీవుడ్లో మరోసారి పైరసీపై చర్చ మొదలైంది. గుంటూరు కేంద్రంగా గీత గోవిందం సినిమా లీకవ్వటం, వెంటనే స్పందించిన చిత్రయూనిట్, పోలీసులు... లీకేజ్‌కు కారణమైన వ్యక్తులతో పాటు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేయటం తెలిసిందే. అయితే ఈ విషయంపై గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్ మరో షాక్ ఇచ్చారు. గీత గోవిందం తో పాటు మరో మూడు సినిమాలు కూడా పైరసీ బారిన పడినట్టుగా వెల్లడించారు అరవింద్. అంతేకాదు వీటిలో ఓ భారీ చిత్రం కూడా ఉందని, ఆ సినిమాల గురించి ఆలోచిస్తే బాధ అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ భారీ చిత్రం ఏదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఇప్పటికే లీకేజ్‌కి కారణమైన వ్యక్తులు పట్టుబడటంతో ఆ సినిమాలు ప్రమాదం నుంచి బయట పడినట్టే అన్న వాదన వినిపిస్తోంది. -
తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే
‘‘ఓ మంచి సినిమా తీసినప్పుడు ఉండే ఆనందం అనుకోని సంఘటనలు జరిగితే బాధగా మారుతుంది. గుంటూరులో ఉన్న తన మరదలి మెప్పు కోసం ఒక కుర్రాడు సినిమాని బయటపెట్టేశాడు. ఇది కావాలని చేసిన నేరమని అనడంలేదు. తెలిసి చేíసినా తెలియక చేసినా పెద్ద నేరమే’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రం కొంత భాగం ఆన్లైన్లో లీక్ అయిందని చిత్రబృందం ఆవేదన వ్యక్తం చేసింది. పైరసీ గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో పైరసీ ఎవరు చేసినా 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. రిలీజ్ కాని మా సొత్తును మీరు (పైరసీదారులు) తీసుకోవడం దొంగతనం. సినిమా తీసేవాళ్లందరం సినిమాను దాచుకోవడానికి డీఐటి అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ పని చేసే ఒక కుర్రాడు చేసిన తప్పు ఇది. అలా మా సినిమా వైరల్ అయింది. పోలీస్ విచారణ జరుగుతోంది’’ అన్నారు. ‘‘రాత్రి (ఆదివారం జరిగిన ప్రీ–రిలీజ్ వేడుక) నేను అరవింద్‌గారి స్పీచ్ విన్నాను. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండాలా? లేదా అని అనడం బాధగా అనిపించింది. ఎవరో కొంతమంది సరదాగా చేసిన పనికి ఇంత పెద్ద మనిషి బాధపడటం ఏంటి? హెచ్చరిక అనుకోండి.. రిక్వెస్ట్ అనుకోండి. ఇటువంటి తప్పులు జరిగితే క్షమించం. సినిమా అనేది మా ప్రాణం’’ అన్నారు ‘దిల్’ రాజు. పి. కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఉద్యోగం కోసం ఇండస్ట్రీకి వస్తుంటారు. నమ్మి ఉద్యోగం ఇస్తే, ఇలాంటి మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? దయ చేసి స్టూడెంట్స్ ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. పైరసీ అనేది ఒక మేజర్ క్రైమ్. చిన్నప్పటి నుంచి పిల్లలకు దొంగతనం చేయకూడదని చెప్పినట్టు పైరసీ కూడా చేయకూడదని ప్రతి ఒక్కరికీ చెప్పాలి’’ అన్నారు. ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ – ‘‘నాకు ఆరున్నర సంవత్సరాల కొడుకు, మూడున్నర సంవత్సరాల పాప ఉన్నారు. వాళ్లను చూసి 12 రోజులు అయింది. ఎడిటింగ్ రూమ్‌లో మేం పని చేసుకుంటుంటే మా సినిమా లీక్ అయిందని ఎవరో చెప్పారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. ఈ విషయంలో సహాయం చేసిన గుంటూరు ఎస్పీకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫిర్యాదు చేసిన గంట లోపలే ఏ సిస్టమ్ నుంచి ఈ వీడియోను అప్లోడ్ చేశారో మాకు సమాచారం ఇచ్చారు. 12 గంటల లోపే 40 మంది టీమ్‌తో ఈ పైరసీ జరుగుతున్న రెండు హాస్టల్స్ మీద దాడి చేశారు. దాదాపు 27 మందిని అరెస్ట్ చేశారు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీశాం. ఇంకో కోటి రూపాయిలు పెట్టి ఆ దొంగలందర్నీ పట్టుకుంటాం. ఇది పైరసీ కేసు కాదు. దొంగతనానికి సంబంధించిన కేసు. దీనిలో భాగస్వాములైన స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది బాధపడాల్సిన విషయం అయినప్పటికీ వాళ్లు శిక్షార్హులని నా అభిప్రాయం’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా కథను ఓకే చేయించుకోవడానికి ప్రతి డైరెక్టర్‌కి దాదాపు రెండున్నరేళ్లు పడుతుంది. ఈ ప్రయాణంలో దాదాపు 100సార్లు ఆ కథ చెప్పాలి. నిర్మాతలకు, ఆర్టిస్టులకు అనుగుణంగా మార్చుకొని తల బద్దలు కొట్టుకొని ఒక సినిమా తీస్తాం. ఇన్ని కష్టాలు పడి సినిమా తీస్తే దాన్ని జనం దాకా తీసుకువెళ్లడానికి ఎన్ని కష్టాలు పడాలి? గర్భంలో బిడ్డను 9 నెలలు మోసి ఆ కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి దానితో సెల్ఫీలు దిగి ఆనందపడే పరిస్థితుల్లో ఉన్నట్లుగా మా సినిమా రిలీజ్‌కి రెడీ అయిన సమయంలో ఊహించని షాక్. మా జీవితాలతో ఆడుకోవద్దు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘మేం సినిమా చేసేదే థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూద్దాం అని. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థకి జరిగింది కాబట్టి ‘మేం ఉన్నాం. నువ్వేం బాధపడొద్దు’ అని అరవింద్‌గారు ధైర్యం చెప్పారు. అదే ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి చిన్న సినిమాలకు ఇలా జరిగితే మేం ఉండేవాళ్లం కాదు. స్టూడెంట్స్ అంతా మనవాళ్లే అని ముద్దుగా వాళ్లను రౌడీస్ అని పిలుచుకుంటాను. స్టూడెంట్సే నన్ను అర్థం చేసుకోకుండా నా సినిమాను బయటకు తీసుకువస్తే నేనెవరికి చెప్పుకోవాలి? ఎడిటింగ్, సౌండ్ సరిగ్గా లేని కంటెంట్‌ని చూస్తే ఏం మజా వస్తుంది? ఇప్పుడు సినిమా చేయడంకంటే ఆ సినిమా పైరసీ కాకుండా చూడటమే ముఖ్యం అనిపిస్తోంది’’ అన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ పాల్గొన్నారు. -
‘గీత గోవిందం’ సినిమా కేసును చేదించిన పోలీసులు
-
‘గీత గోవిందం’ సినిమా లీక్‌పై విజయ్ స్పందన!
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ నెల 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న గీత గోవిందం సినిమాకు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో చిత్రయూనిట్ షాక్ అయ్యింది. లీకేజ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఈ విషయంపై హీరోగా విజయ్ దేవరకొండ ఒకింత ఆవేదనతో స్పందించారు. సినిమా క్లిప్స్ లీకైన విషయాన్ని ప్రస్తావించకుండా ‘నేను నిరాశకు గురయ్యాను, బాధపడుతున్నాను. ఒకసారి కొపమొస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు విజయ్. దీంతో విజయ్ పైరసీని ఉద్దేశించే ఈ విధంగా ట్వీట్ చేశారని భావిస్తున్నారు ఫ్యాన్స్. I feel let down, disappointed, hurt. Okka sari kopam osthundi, inko sari edupostundi. — Vijay Deverakonda (@TheDeverakonda) 12 August 2018 చదవండి : ‘గీత గోవిందం’కు షాక్.. సోషల్ మీడియాలో సీన్స్ -
సోషల్ మీడియాలో లీకైన గీత గోవిందం సీన్స్
-
‘గీత గోవిందం’కు షాక్.. సోషల్ మీడియాలో సీన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీని లీకులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ లీకులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమా కూడా పైరసీ భారిన పడింది. సినిమాలోని కొంత భాగాన్ని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు కొంత మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న గీత గోవిందం సినిమాలోని కొంత భాగాన్ని దొంగిలించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. గుంటూరు చుట్టుపక్కల రెండు ప్రైవేట్ కాలేజీల విద్యార్ధులు సినిమాను షేర్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో చిత్ర టెక్నికల్ టీంకు చెందిన వ్యక్తి సినిమాలో కొంత భాగాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. వారు మరింత మందికి పంపించటంతో ఆ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే వీడియో క్లిప్స్‌ను సర్క్యూలేట్ చేసిన విద్యార్థులతో పాటు లీకేజికి పాల్పడిన అసలు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో తిరుగుతున్న సీన్స్‌ను డిలీట్ చేయించేందుకు చిత్ర నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు. -
‘నా సినిమా పైరసీలో అయినా చూడండి’
సినీ రంగాన్ని వేదిస్తున్న తీవ్ర సమస్యల్లో పైరసీ ఒకటి. ఇండస్ట్రీ వర్గాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. అందుకే తమ సినిమాల ప్రమోషన్ సమయంలో పైరసీ వ్యతికేరంగా అభిమానులకు పిలుపునిస్తుంటారు స్టార్స్. అయితే తాజాగా ఓ దర్శకుడు తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పిలుపునివ్వటం హాట్ టాపిక్ మారింది. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ముల్క్. హిందూ ముస్లింల మధ్య స్నేహానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై పాకిస్తాన్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించటంపై స్పందించిన దర్శకుడు అనుభవ్ సిన్హా తన సినిమాను పైరసీలో అయినా చూడండి అంటూ పాక్ ప్రజలకు పిలుపు నిచ్చారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనుభవ్ ‘ప్రియమైన నా పాకిస్తాన్ ప్రజలకు.. నేను తీసిన ముల్క్ సినిమాపై పాక్ సెన్సార్‌బోర్డ్ నిషేదం విధించింది. మీరంతా చట్టబద్ధంగా థియేటర్లలోనే నా సినిమా చూడాలని నాకూ ఉంది. కానీ అలా చూసే అవకాశం లేకపోతే పైరసీలో అయిన చూడండి. సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డ్ ఈ చిత్రాన్ని నిషేందించిందో మీకే అర్ధమవుతుంది. ప్రస్తుతం పరిస్థితులు, నిజా నిజాలు మీకు తెలియకూడదనే సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది’ అన్నారు. అయితే అనుభవ్ సిన్హా వ్యాఖ్యలు పైరసీ ప్రొత్సహించే విధంగా ఉన్నయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
షాకింగ్ : పైరసీలో భాగమతి, రంగస్థలం టాప్
సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బయటికొచ్చేస్తుంది. కొన్ని సినిమాలైతే విడుదలకు ముందే పైరసీ భారినపడుతున్నాయి. దీనిపై పరిశ్రమ వర్గాలు ఎన్నిరకాలు చర్యలు చేపట్టిన పైరసీకి అడ్డుకట్ట పడటం లేదు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొన్ని ముఠాలు చిత్ర పరిశ్రమను హడలెత్తిస్తున్నాయి. జర్మన్ కేంద్రంగా పనిచేస్తున్న టెక్సిపియో సంస్థ గత ఆరేళ్ల నుంచి పైరసీ వెబ్సైట్లపై అధ్యయనం చేస్తోంది. ఆ డేటా ఆధారంగా 2018లో ప్రథమార్ధంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధికంగా పైరసీకి గరయిన టాప్-10 సినిమాల జాబితాను ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. పైరసీ జాబితాలో అనుష్క నటించిన భాగమతి 19లక్షల డౌన్లోడ్లతో అగ్రభాగాన నిలువగా, రామ్ చరణ్ , సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం 16 లక్షలతో రెండో స్థానంలోనిలిచింది.టెక్సిపియో ప్రతినిధి మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ షేరింగ్ భారత్‌లోనే కాకుండా యూఎస్, శ్రీలంక, సౌదీ అరేబియా, యూఏఈ, పశ్చిమాసియా దేశాల్లో అధికంగా ఉన్నట్టు తమ పరిశీలనలో బయటపడిందన్నారు. అదే విధంగా భారత్‌లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, ముంబై నగరాల్లో పైరసీ ఎక్కువగా చూస్తున్నారని తెలిపారు. పైరసీ టాప్-10లో నిలిచిన ఇతర సినిమాలు 3. భరత్ అనే నేను 4. మహానటి 5. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 6. తొలిప్రేమ 7. ఛలో 8. అజ్ఞాతవాసి 9. జై సింహా 10. టచ్ చేసి చూడు -
పైరసీని ఎంకరేజ్ చేయవద్దు – డి. సురేశ్‌బాబు
‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. తరుణ్, ఇతర నటీనటులకు థ్యాంక్స్. వాళ్ల కృషికి ప్రేక్షకులు మంచి ఫలితాన్ని ఇచ్చారు. సినిమా చూసిన వారందరూ మా చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తుకు తెస్తోందని, చాలా ఎంటర్టైనింగ్గా ఉందని అంటున్నారు’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. విశ్వక్సేన్, సాయిసుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య తారలుగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. డి. సురేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా అనేది చాలా మంది కష్టం. ఎంతోమంది భవిష్యత్ సినిమాపై ఆధారపడి ఉంటుంది. అందుకే పైరసీని ఎంకరేజ్ చేయవద్దు. సినిమా విడుదలైన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వస్తున్నందున పైరసీలో చూడాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాను కొందరు ‘పెళ్ళిచూపులు’తో పోల్చుకుంటున్నారు. కానీ ఇది డిఫరెంట్ మూవీ. రెండింటికీ పోలిక లేదు. రివ్యూస్ అనేవి బాధ్యతతో రాయాలి. ఎందుకంటే సినిమాను చాలా కష్టపడి తీస్తాం. రివ్యూస్ వల్లనే ‘పెళ్ళిచూపులు’ పెద్ద హిట్ అయ్యింది. ‘ఈ నగరానికి ఏమైంది?’కి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఓ రివ్యూ చదివి డిస్ట్రబ్ అవడం వల్లే అలా మెసేజ్ పెట్టాను. ఇకపై సోషల్ మీడియాలో ఉండకూడదని నిర్ణయించుకున్నా’’ అన్నారు తరుణ్ భాస్కర్. నటీనటులు అభినవ్ గోమటం, విశ్వక్ సేన్, సాయిసుశాంత్, సిమ్రాన్ చౌదరి పాల్గొన్నారు. -
‘సంజు’కు భారీ షాక్...
సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీస్‌ల వద్ద కలేక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క భాషలోనే 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్డీ ప్రింట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్ మీడియా యూజర్లు ఆ వెబ్సైట్ లింక్‌ను స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్ అయిన విషయం తెలుసుకున్న రణ్‌బీర్ కపూర్ అభిమానులు మాత్రం ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘నిజమైనా సిని అభిమానులు ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సాహించరు. వారు థియేటర్‌కి వెళ్లి, టిక్కెట్ కొని సినిమా చూస్తార’ని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్ అయ్యింది. దయచేసి ఈ లింక్‌లను ఎవరికీ షేర్ చేయకండి’ అంటూ రణ్‌బీర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయం గురించి సీబీఎఫ్‌సీని విమర్శిస్తున్నారు. గతంలో సంజు సినిమాలోని టాయిలెట్ దృశ్యాలు విడుదలయినప్పడు సీబీఎఫ్సీ నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూ ‘టాయిలెట్ సీన్లు విడుదలైతే దేశ గౌరవాన్ని కించపరిచామని వాదించిన వారు ఇప్పుడు సినిమా మొత్తం లీక్ అయింది. అయినా ఎందుకు మాట్లడటం లేదు’ అని విమర్శిస్తున్నారు. -
'కాలా'కు తప్పని పైరసీ భూతం
-
ఆర్టీసీ బస్సులో ‘పైరసీ’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో పైరేటెడ్ సినిమా ప్రదర్శిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. హీరో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా విడుదలైన రెండో రోజే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ ప్లస్ బస్సులో ప్రదర్శిస్తున్న తీరును ఓ ప్రయాణికుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీటర్ ద్వారా ఫిర్యా దు చేశారు. ‘ప్రభుత్వ సంస్థలే పైరసీని ప్రోత్సహిస్తే దీనికి ఎలా అడ్డుకట్ట పడుతుంది’అని ప్రశ్నించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేటీఆర్ తగిన చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ రమణరావును ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ గరుడ, గరుడ ప్లస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో సినిమాలు ప్రదర్శించే అంశాన్ని ప్రైవేట్ సంస్థ కు అప్పగించినట్లు ఆర్టీసీ ఎండీ రమణరావు ‘సాక్షి’కి తెలిపారు. పైరసీ సినిమాలు ప్రదర్శిం చకూడదన్న ఒప్పందం ఉందని, దీనిపై చర్యలు చేపడతామని ఆయన అన్నారు. -
ఆర్టీసీ బస్సులో పైరసీ సినిమా.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమాలు ప్రదర్శించడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదలైన మరుసటి రోజే టీఎస్ఆర్టీసీ గరుడ బస్సులో ప్రదర్శించారు. ఈ విషయాన్ని సునీల్ కొప్పరపు అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గరుడ బస్సులో కృష్ణార్జున యుద్దం పైరసీని వేశారని స్క్రీన్ షాట్‌తో సహా కేటీఆర్‌కు ట్వీట్లో తెలిపాడు. ప్రభుత్వ సంస్థల్లోనే పైరసీ జరుగుతుంటే, ఫైరసీనీ నియంత్రించాలని సామాన్యుడిని ఎలా అడుగుతారని సునీల్ ప్రశ్నించాడు. దీంతో యువకుడి ట్వీట్‌కు కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆర్టీసీ సిబ్బంది తీరుపై మండిపడిన ఆయన.. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని సంస్ధ ఎండీని కోరారు. కాగా, కేటీఆర్ వెంటనే స్పందించడంతో సునీల్ ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కేటీఆర్ స్పందించే తీరుపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. @NameisNani @tsrtc @KTRTRS privacy failure on bus travel. Garuda Volvo bus trip to Bengaluru from hyd. How can you ask a common man avoid privacy when an institute fails. Movie released yesterday. #krishnarjunayudham #avoidprivacy details of bus can be given on DM pic.twitter.com/VLPP0ks6xU — Sunil Kopparapu (@Sunil_santiago) April 15, 2018 That’s extremely irresponsible on the part of the @TSRTCHQ staff of this bus. Request JMD of @TSRTCHQ to make sure to act and prevent recurrence https://t.co/lR2Ga8Wy70 — KTR (@KTRTRS) April 15, 2018 Typo Piracy. @KTRTRS thanks for quick response. Happy to see your quick actions everytime you see something wrong happens. https://t.co/bJuiNokFWQ — Sunil Kopparapu (@Sunil_santiago) April 15, 2018 -
‘ఖర్మ’ అంటూ పోస్ట్ పెట్టిన టాప్‌డైరెక్టర్
సినిమా పరిశ్రమ పైరసీ భూతం కొత్తేం కాదు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో పైరసీ నానాటికి పెరుగుతోంది. పైరసీకి గురికాని సినిమా ఉండదేమో అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. విడుదలైన సినిమాలనే కాదు విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను కూడా పైరసీ చేసేస్తున్నారు. పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా పైరసీని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. టాలీవుడ్లో గతేడాది విడుదలైన సినిమాల్లోబాహుబలి2, డీజే సినిమాలు ఎక్కవగా పైరసీకి గురయ్యాయని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఈ రెండు సినిమాలను ఎక్కువ మంది షేర్ చేసుకున్నారనీ, పైరసీ ద్వారా వీక్షించారనీ ఆ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో అర్జున్‌రెడ్డి మూడో స్థానంలో ఉంది. ఈ పైరసీ విషయంపై డీజే డైరెక్టర్ హరీష్‌శంకర్ ట్విటర్లో స్పందిస్తూ...‘ఖర్మ!!!’ అంటూ పోస్ట్ చేశారు. ఖర్మ !!!!! https://t.co/jnFROXBi9u pic.twitter.com/UbmYEJC6ZZ — Harish Shankar .S (@harish2you) March 22, 2018 -
అలా రిలీజ్.. ఇలా ఆర్టీసీ బస్సులో సినిమా..
సాక్షి, ముంబయి : భారీ అంచనాలతో విడుదలై కనీస మొత్తాలను కూడా రాబట్టలేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ చిత్రం 'అయ్యారే'కు అప్పుడే పైరసీ భూతం పట్టేసింది. ఈ సినిమా అలా విడుదలైందో లేదో ఏకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు(మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)లో పైరసీ సీడీ ద్వారా ప్రదర్శించారు. పైరసీ అడ్డుకునేందుకు సహకరించాల్సిన ప్రభుత్వమే ఇలా స్వయంగా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులో పైరసీ చిత్రం ప్రదర్శిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్‌బాజ్‌పాయ్, రకుల్ ప్రీత్ సింగ్, నసీరుద్దీన్‌షా, కుముద్ మిశ్రావంటి ప్రముఖ నటులతో తెరకెక్కిన చిత్రం అయ్యారే. పలు సమస్యలను అధిగమించిన ఈ చిత్రం ఈ నెల (ఫిబ్రవరి) 16న విడుదలైంది. అయితే, చిత్ర నిర్మాత జయంతిలాల్ గడ తెలిపిన ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం నడిపే అశ్వమేధ బస్సులో ఉదయం 7.30గంటల ప్రాంతంలో పైరసీ సీడి ద్వారా ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ సమయంలో బస్సు ముంబయి గోవా మధ్య ప్రయాణిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో చిత్ర నిర్మాత చట్ట ప్రకారం సదరు బస్సు సంస్థపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. -
‘గాయత్రి’ పైరసీపై మోహన్ బాబు ఆగ్రహం
-
‘గాయత్రి విషయంలో నా మనసు ఏడుస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన గాయత్రి చిత్రం పైరసీపై నటుడు మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు. గాయత్రి సినిమా విషయంలో నా మనసు ఏడుస్తోంది. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవించకతప్పదు. సినిమా కోసం నిర్మాతగా ఎనిమిది నెలలు కష్టపడ్డా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మంచు విష్ణు, శ్రియ నటించిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత మోహన్‌బాబు హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
కోన ట్వీట్‌పై కేటీఆర్ స్పందన ఏది?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్వీటర్ ద్వారా తన దృష్టికి వచ్చిన అంశాలపై వెంటనే స్పందిస్తూ సదరు శాఖలను అప్రమత్తం చేస్తుంటారు. సినీరంగంతోనూ కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా వేడుకలకు అతిథిగా హాజరవ్వటమే కాదు, తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు కేటీఆర్. అయితే సినీరంగంతో ఇంత సన్నిహితంగా ఉండే కేటీఆర్.. సినీ రచయిత కోన వెంకట్ చేసిన ఓ ట్వీట్‌పై స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాకు ప్రమాదకరంగా మారిన మూవీ రూల్స్ (movierulz) వెబ్‌సైట్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాల్సిందిగా కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను కోరారు. తన మెసేజ్‌తోపాటు గత వారం విడుదలైన గాయత్రి, ఇంటిలిజెంట్, తొలిప్రేమ సినిమాలు మూవీరూల్స్ సైట్లో ఉన్న స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. కానీ ఈ విషయంపై కేటీఆర్ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఈ సైట్లో తెలుగు సినిమాలతో పాటు తమిళ, హిందీ సినిమాల పైరసీ లింక్‌లు కూడా రిలీజ్ అయిన 24 గంటలలోపే దర్శనమిస్తున్నాయి. @KTRTRS .. we request ur immediate intervention in taking severe action against this particular website called “movierulz” which is a major threat to TFI.. Please instruct concerned authorities to lock these people up for good and save us 🙏 Here’s is the evidence sir.. pic.twitter.com/r1tG5rDPKd — kona venkat (@konavenkat99) 12 February 2018 -
స్కూలు పిల్లలతో పైరసీ!
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలను వివిధ మార్గాల్లో రికార్డు చేసే ఈ ముఠాలు స్కూలు విద్యార్థులను వాడుకుంటున్నట్లు వెల్లడైంది. కొన్నాళ్లుగా తమ దృష్టికి వచ్చిన 7 కేసుల్ని అధ్యయనం చేసి ఈ విషయం గుర్తించామని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఆయనతో పాటు సినీ హీరో అల్లు శిరీష్ తదితరులు బుధవారం సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి, సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలిశారు. పైరసీతో సినీరంగానికి చెంది న వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, దీన్ని నిరోధించడానికి పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరారు. దిల్ రాజు మాట్లాడుతూ... ‘స్కూలు, కాలేజీ పిల్లలకు పైరసీ ముఠాలు ఎరవేస్తున్నాయి. చిత్రం విడుదల రోజు మార్నింగ్ షో చూడాల్సింది గా వారికి చెప్పి ఆ సినిమాను సెల్‌ఫోన్ లేదా కెమెరాలో రికార్డు చేస్తే రూ.500 నుంచి రూ.1000 ఇస్తామంటూ వాడుకుంటున్నాయి. ఇలాంటి వాటికి చెక్ చెప్పడానికి సైబర్ క్రైమ్ పోలీసులతో కలసి ఫిల్మ్ చాంబర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పైరసీకి వ్యతిరేకంగా లఘుచిత్రాలు రూపొందించి థియేటర్లలో ప్రదర్శించనున్నాం. భారీస్థాయిలో కరపత్రా లు, పోస్టర్లు సైతం వేస్తాం. థియేటర్లో ఎవరైనా పైరసీ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన వారికి చాంబ ర్ తరఫున నగదు పారితోషికం ఇవ్వనున్నాం’ అని అన్నారు. సినీ హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ‘తెలిసీ తెలియని వయసులో పైరసీ ముఠాల వలలో పడి విద్యార్థులు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. సినిమా రంగం దెబ్బతినడం అంటే నిర్మాతలు, హీరో హీరోయిన్లు మాత్రమే కాదు. దీనిపై ఆధారపడిన కిందిస్థాయి వర్గాలు అనేకం ఉన్నాయి’అని వివరించారు. పీడీ యాక్ట్‌కు యోచన... వారం క్రితం ఫిల్మ్ చాంబర్ సినీ రంగ ప్రముఖులతో భేటీ అయ్యాం. ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. పైరసీపై పోరాటానికి ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. పోలీసు విభాగం సిఫార్సు ఆధారంగా వీరు ఆయా వెబ్‌సైట్స్ బ్లాక్ చేయడం తదితర చర్యలు తీసుకుంటారు. పదేపదే పైరసీ చేస్తూ చిక్కేవారిపై పీడీ యాక్ట్ నమోదుకు ఆస్కారం ఇవ్వాలంటూ జయేశ్ రంజన్‌ను కోరాం. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. పైరసీకి చెక్ చెప్పడానికి ఇంటర్నెట్, సర్వీసు ప్రొవైడర్ల సహకారం కూడా తీసు కోనున్నాం’. – కేసీఎస్ రఘువీర్, అదనపు డీసీపీ -
పేరడీ సినిమా టీం షాకింగ్ ఎనౌన్స్ మెంట్
సాధారణంగా సినిమా పోస్టర్ తో పాటు ఆడియో రిలీజ్ డేట్, సినిమా రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేయటం చూస్తుంటాం. కానీ ఓ తమిళ సినిమా నిర్మాతలు ఏకంగా ఈ సినిమా ఎప్పుడు పైరసీ వర్షన్ వస్తుందో కూడా ఎనౌన్స్ చేశారు. కోలీవుడ్ ఘన విజయం సాధించిన తమిళపడం సినిమాకు సీక్వల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ పడం 2.0 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను వినూత్నంగా ప్రకటించారు చిత్రయూనిట్. తమిళ హీరో సిద్ధార్థ్ రిలీజ్ చేసిన పోస్టర్ లో టైటిల్ లోగోతో పాటు సినిమాను 25 మే 2018 న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆ మరుసటి రోజు 26 మే 2018న సినిమా తమిళ రాకర్స్ వెబ్ సైట్ లో పైరసీ వర్షన్ రిలీజ్ అవుతుందని అదే పోస్టర్ లో ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోల సినిమాల పేరడీ సీన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అముదన్ దర్శకుడు. Ellame inimey oru maadhiriya dhaan nadakkum! Happy to launch the release poster of #TP2point0 No theory. Only practical. A @csamudhan classic. Starring Akila Ulaga Superstar @actorshiva Puratchi producer @sash041075 Joooot!!! pic.twitter.com/q4BDw9ZcjH — Siddharth (@Actor_Siddharth) 9 December 2017 -
పైరసీ చూస్తివా.. సిగ్గు లేదా?
సాక్షి, చెన్నై : మెర్సల్ సినిమాలో అభ్యంతరకర డైలాగులను తొలగించేందుకు నిర్మాతలు సిద్ధమైనప్పటికీ.. వివాదం ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈ విషయంలో చిత్ర యూనిట్‌కు ఊహించని మద్దతు లభించింది. తమిళనాడుకే చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు మెర్సల్ డైలాగులు ఏ మాత్రం తప్పు కాదని వ్యాఖ్యానించారు. దక్షిణ చెన్నై బీజేపీ విభాగానికి చెందిన సీనియర్ నేత సిధార్త్ మణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మెర్సల్‌లో జీఎస్టీ వ్యతిరేక డైలాగులు తప్పేం కాదని చెప్పారు. అది చిత్ర యూనిట్ అభిప్రాయం. సినిమా మూలంగా గౌరవం దెబ్బతింటుందన్న వాదన అస్సలు సరికాదు. అనవసరంగా పార్టీకి ఆపాదించి ఈ సమస్యను కొందరు పెద్దది చేశారు అంటూ ఆయన సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజాపై హీరో విశాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఓ ఇంటర్వ్యూలో రాజా.. తాను మెర్సల్ సినిమా పైరసీ కాపీని చూశానని, అందులోని డైలాగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాల్ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఓ జాతీయ నేత అయి ఉండి ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్న పైరసీని ప్రొత్సహించటం దారుణమన్నాడు. పైగా సినిమాను పైరసీలో చూశానని చెప్పటం మరింత ఘోరమని విశాల్ పేర్కొన్నాడు. ‘‘మీరోక బాధ్యతగల పదవిలో ఉన్నారు. పైగా సంఘంలో గౌరవం ఉన్న పెద్ద మనిషి. పైరసీ చూశానని చెబుతున్నారు. సిగ్గు లేదా?’’ అంటూ ఘాటుగా రాజాకు చురకలంటించాడు. తక్షణమే క్షమాపణలు తెలియజేసి, పైరసీ లింకులు తొలగించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విశాల్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. మరో సీనియర్ నటుడు పార్తీబన్ కూడా రాజా చేసిన పనిని తప్పుబడుతూ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. மரியாதைக்குரிய எச்.ராஜா அவர்களுக்குரிய மரியாதையை குறைக்க வேண்டும்-அவர் களவாடி(யாய்) மெர்சல் கண்டிருந்தால்..! — R.Parthiban (@rparthiepan) October 22, 2017 It mUSt be created by some of US pic.twitter.com/44FzIlgi37 — R.Parthiban (@rparthiepan) October 23, 2017 -
'రాజా ది గ్రేట్' దర్శకుడి ఆవేదన
తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. రిలీజ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే పైరసీ వెబ్ సైట్లలో సినిమాల లింకులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన రవితేజ సినిమా రాజా ది గ్రేట్ కు కూడా పైరసీ బారిన పడింది. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా స్పందించారు. ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోను అనిల్ రీ ట్వీట్ చేశారు. శ్రీనివాస్ కుమార్ అనే వ్యక్తి ' ఎయిర్ పోర్ట్ లాంజ్ లో మేడమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరి చూస్తున్నారు రాజా ది గ్రేట్ సినిమా. చాలా బాధగా ఉంది. సినిమాలను బతికించండి, కిల్ పైరసీ' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన దర్శకుడు 'ఫేస్ బుక్ లో చాలా మంది ఈ సినిమాను షేర్ చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రొత్సహించకండి. థియేటర్లలోనే సినిమాను చూడండి' అంటూ ట్వీట్ చేశారు. #Rajathegreat movie ...sharing by so many people on Facebook wall....plz friends don't encourage piracy..nd watch it only in theatres — Anil Ravipudi (@AnilRavipudi) 21 October 2017 Airport lounge lo madam headphones pettukoni Mari chustunnaru Raja The great film, felt very bad Cinema Lani batikinchandi pls Kill Piracy 🙏 pic.twitter.com/BM3k8DJ2Df — Sreenivasa Kumar (@SKNonline) 21 October 2017 -
'మెర్సల్' సినిమాపై పైరసీ దాడి..!
విజయ్ తాజా సినిమా 'మెర్సల్'ను పైరసీ భూతం వెంటాడుతోంది. తాజాగా విడుదలై భారీగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా డౌన్లోడ్ లింకులు టోరెంట్ సైట్లలో కుప్పులుతెప్పలుగా కనిపిస్తున్నాయి. సినిమా పైరసీ బారిన పడకుండా చిత్ర నిర్మాతలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయినా, విడుదల రోజు 'మెర్సల్' ఫుల్మువీ పైరసీ సైట్లలో కనిపించడం గమనార్హం. పైరేట్బే, తమిళ్‌రాకర్స్ వంటి టోరెంటో సైట్లలో ఈ సినిమా డౌన్లోడ్ లింక్స్ యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. పైరేట్ బే వెబ్సైట్లో ఈ సినిమాను ఇప్పటికే 8వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక తమిళరాకర్స్ వెబ్సైట్ కొత్త హోస్ట్ సైట్‌ను క్రియేట్ చేసి.. ఈ సినిమా డౌన్లోడ్ లింక్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా మరో ప్రాక్సీ సర్వర్ (tamilrocker.fi) ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. మెర్సల్ వర్సెస్ మోదీ వివాదం తెరపైకి రావడంతో ఈ సినిమా డౌన్లోడ్లు బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది. విజయ్ సరసన కాజోల్, సమంత, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా అవినీతి వైద్యులు, వైద్య వ్యవస్థ నేపథ్యంగా తెరకెక్కింది. దేశంలో అత్యధిక మొత్తంలో పన్ను వసూలు చేస్తున్నా.. ఎందుకు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం లేదని నిలదీస్తూ.. ఈ సినిమాలో విజయ్ చేసిన డైలాగులు సంచలనం రేపాయి. జీఎస్టీని ప్రశ్నిస్తూ.. సాగిన ఈ డైలాగులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేయడం రాజకీయ రంగు పులుముకుంది. ఇక, ఈ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియాలపై విమర్శలు చేస్తూ విజయ్ డైలాగులు చెప్పే సీన్లు సైతం ట్విట్టర్, ఫేస్బుక్లో లీక్ అయ్యాయి. -
స్టార్ హీరోకు షాక్
తమిళసినిమా: తుప్పరివాలన్ చిత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ విశాల్‌కు షాక్ ఇచ్చింది. విశాల్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం పైరసీకి గురి కాకుండా విశాల్ పలు జాగ్రత్తలు తీసుకున్నా రు. తన అభిమానులను కొన్ని బృందాలుగా విభజించి రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో నిఘాను పెట్టారు. ఎవరూ సెల్‌ఫోన్ లో చిత్రీకరించకుండా ఈ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. విశాల్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయనకు సవాల్ విసిరేలా తమిళ్ రాకర్స్ వెబ్సైట్ తుప్పరివాలన్ చిత్రాన్ని శుక్రవారం ప్రసారం చేసి షాక్ ఇచ్చింది. దీంతో కొత్త చిత్రాలను అనధికారంగా ప్రసారం చేస్తున్న వెబ్సైట్లను కట్టడిచేసేందుకు విశాల్ పెద్ద పోరాటమే చేస్తున్నారు. అలాంటి వెబ్సైట్లపై తగిన చర్యలు చేపట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక సమయంలో తమిళ్ రాకర్స్ వెబ్సైట్ అంతం చూస్తానని ఛాలెంజ్ చేశారు కూడా. కొత్త చిత్రాలు ఇంటర్నెట్లో అనధికారంగా ప్రచారం కాకుండా ఉండటానికి ఇంటర్నెట్ పరిజ్ఞాన నిపుణులతో ఆలోచనలు జరిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ్‌గన్ వెబ్సైట్ నిర్వాహకుడు గౌరీశంకర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై విశాల్ బృందం సుధీర్ఘాలోచనలో తలమునకలైంది. -
పైరసీ అరికట్టేందుకు చర్యలు: తలసాని
సాక్షి, హైదరాబాద్: వేలాది మంది జీవనోపాధి పొందు తున్న చలనచిత్ర రంగాన్ని పరిరక్షించేందుకు పైరసీని అరికట్టాల్సిన అవసరముందని, దీనిపై అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫ్రీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నార విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ ఇండియన్ కాపీరైట్స్ సంస్థ చైర్మన్ రత్నాకర్, డైరెక్టర్ అరవింద్ మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీంతో పాటు ఇతర రంగాలలో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. తలసానిని కలసిన వారిలో విజిలెన్స్ సంస్థ అడ్మిన్ ఆఫీసర్ శివ, పీఆర్వో చంద్రశేఖర్‌శర్మ, బీఆర్ నాయుడు తదితరులు ఉన్నారు. -
పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన దిల్ రాజు
తన 25వ సినిమాగా డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, సినిమా టాక్ ఎలా ఉన్న కలెక్షన్లతో ఫుల్ ఖుషీ అవుతున్నాడు. తొలి వారాంతానికి అల్లు అర్జున్ కెరీర్లో హయ్యస్ట్ వీకెండ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా డీజే నిలిచింది. అయితే ఈ సినిమాపై పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. దీంతో సినిమా పైరసీకి పాల్పడిన వారిపై చిత్రయూనిట్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్లు స్వయంగా ఈ కంప్లయింట్ ఇచ్చారు. కొన్ని వెబ్ సైట్స్‌తో పాటు ఫేస్ బుక్ పేజ్లపైన కూడా కంప్టయింట్ ఇచ్చినట్టుగా తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ గత శుక్రవారం రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ సాధించింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు బాగానే వస్తుండటంతో సినిమా టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్ లిస్ట్‌లో చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Filed complaints against multiple FB ids and social media handles regarding #DuvvadaJagannadham piracy. Please refrain & stay out of trouble pic.twitter.com/CTGWHYXyok — S V C (@SVC_official) 28 June 2017 -
డబ్బులిస్తారా.. నెట్లో పెట్టమంటారా!
► బాహుబలి నిర్మాతలకే బెదిరింపు ►బ బరి తెగించిన పైరసీ ముఠా ► ఆరుగురిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతలతో బేరసారాలకు దిగింది. ఢిల్లీ, బిహార్ కేంద్రాలుగా జరిగిన ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఇదీ సినిమా ప్రదర్శితమయ్యే విధానం.. చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాతలు దాన్ని సాఫ్ట్‌కాపీ రూపంలోకి మారుస్తారు. దీన్ని బ్రాడ్కాస్టర్లకు అందించడంతో వారి సర్వర్‌లో నిక్షి ప్తంచేస్తారు. ఈ బ్రాడ్కాస్టర్లు సినిమా సాఫ్ట్‌కాపీని ఎన్క్రిప్షన్లోకి (కోడ్ లాంగ్వేజ్) మార్చేస్తారు. దీన్ని డీక్రిప్షన్కు (సాధారణ చిత్రరూపం) చేసే ‘కీ’ నిర్మా తలకు అందిస్తారు. ఈ ‘కీ’ని వాడుకునే థియేటర్ల యాజమాన్యాలు చిత్రాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న లోపం పసిగట్టిన పాత ఉద్యోగి.. బాహుబలి–2 నిర్మాతలు ఆరుగురు బ్రాడ్కాస్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిలో యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్ ఒకటి. గతంలో ఈ సంస్థలో మోను అలియాస్ అంకిత్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. థియేటర్లోని సర్వర్‌లో సినిమా కాపీ అవుతుందని తెలుసుకున్నాడు. దీంతో బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని బిహార్‌కు చెందిన దివాకర్‌ను సంప్రదించాడు. అతడి థియేటర్లోనే సర్వర్‌కు ఓ ల్యాప్‌టాప్ అనుసంధానించి చిత్రానికి సంబం ధించిన హెచ్డీ ప్రింట్‌ను వాటర్‌మార్క్‌తో పాటు కాపీ చేశాడు. ఈ కాపీని వినియోగించి వీలున్నంత సంపాదించడానికి పట్నాకు చెందిన చందన్‌కు సమాచారం ఇచ్చాడు. పాత ముఠాతో జతకట్టిన చందన్.. 2015లో విడుదలైన బాహుబలి చిత్రం సైతం పైరసీకి గురైంది. నిర్మాతల ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు ఢిల్లీకి చెందిన రాహుల్ మెహతాతో పాటు అతడి అనుచరులు జితేందర్‌కుమార్ మెహతా, తౌఫీఖ్, మహ్మద్ అలీల్ని అరెస్టు చేశారు. వీరి ద్వారానే బాహుబలి–2 కాపీని కూడా క్యాష్ చేసుకోవాలని భావించిన చందన్ విషయం వారికి చెప్పాడు. దీంతో రాహుల్ రంగంలోకి దిగాడు. వారానికి రూ.15 లక్షల చొప్పున డిమాండ్.. హైదరాబాద్ వచ్చిన రాహుల్ నిర్మాతలైన ఆర్కా మీడియాను సంప్రదించాడు. తన వద్ద చిత్రం హెచ్డీ ప్రింట్ ఉందని.. సినిమా ప్రదర్శితమైనన్ని రోజులూ వారానికి రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఏ వారానికి చెల్లించకపోయినా వెంటనే ఇంటర్నెట్లో పెట్టేస్తానంటూ బెదిరించాడు. దీనిపై ఫిర్యాదును అందుకున్న ఇన్స్పెక్టర్ చాంద్‌భాష నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి మూలాలు కనుగొంది. ఢిల్లీ, బిహార్‌ల్లో వరుసదాడులు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీ, దివాకర్, చందన్‌లను అరెస్టు చేశారు. గతంలోనే అనేక సినిమాల పైరసీ ఈ ముఠా అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసింది. ఢిల్లీలో పట్టుకున్న రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీలను న్యాయస్థానం ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసి హైదరాబాద్ వెళ్లి పోలీసుల ఎదుట హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. మిగిలిన ఇద్దరినీ బిహార్ నుంచి తీసుకువస్తున్నాం. పరారీలో ఉన్న మోను కోసం గాలిస్తున్నాం. – అవినాష్ మహంతి, సీసీఎస్ డీసీపీ -
ఉగ్ర పోరుకు సహకారం
జకార్తా: ఉగ్రవాదం, పైరసీ తదితర సరిహద్దు సమస్యలపై పరస్పరం సహకరించుకోవాలని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) తీర్మానించింది. భారత్, 20 హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో ఏర్పడిన ఈ అసోసియేషన్ జకార్తాలో భేటీ అయింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి అన్సారీతోపాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. ఐఓఆర్‌ఏలో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇరాన్ , కెన్యా, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర 21 దేశాలకు సభ్యత్వం ఉంది. సముద్ర ప్రాంత రక్షణ, భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ, టూరిజం, సంస్కృతి తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. ఉగ్రవాదంపై పోరుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సమావేశం ప్రత్యేకంగా మరో తీర్మానం చేసింది. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ అభివృద్ధికి ఉగ్రవాదం అడ్డంకిగా నిలుస్తోందని అన్నారు. -
ఫేస్బుక్లో దంగల్ లీక్.. కలకలం!
ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం శుక్రవారమే విడుదలైంది. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. భారీ రికార్డులపై కన్నేసిన ఈ చిత్రం అంతలోనే సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం సృష్టించింది. ఓ ఫేస్బుక్ యూజర్ సోషల్ మీడియాలో దంగల్ పూర్తి సినిమాను ఉంచగా ఇప్పటికే 4 లక్షల మంది వీక్షించారు, 50 మందికి పైగా దీనిని షేర్ చేశారు. ఆధునిక పైరసీకి ఉదాహారణగా మారిన ఈ ఘటనకు పాల్పడింది ఓ పాకిస్తానీ ఫేస్బుక్ యూజర్‌గా గుర్తించారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తొలగించారు. సోషల్‌మీడియాలో ఈ తరహా పైరసీలు చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు మేవెదర్, పకియావ్ల మధ్య జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌ను సైతం పెరిస్కోప్‌లో యూజర్లు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ ఘటనతో పెరిస్కోప్ యూజర్లకు కఠినమైన నియమనిబంధనలు తీసుకొచ్చింది. -
బాహుబలే కాదు.. మరో సినిమా సీన్స్ లీక్!
విజయవాడ: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పలు టాలీవుడ్ సినిమాలకు లీకుల బెడద వెంటాడుతూనే ఉంది. నిన్నటికి నిన్న రాజమౌళి 'బాహుబలి-2' సినిమా దృశ్యాలు లీకవ్వగా.. తాజాగా మరో ప్రతిష్టాత్మక సినిమా దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. విజయవాడ కుర్రకారు చేతిలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'బాహుబలి-2', నాగార్జున 'నమో వెంకటేశాయ' దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. 'బాహుబలి-2' సినిమా దృశ్యాల లీకైన ఘటనపై చిత్రయూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన విజయవాడ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ విచారించారు. దీంతో హైదరాబాద్ ఆర్కా మీడియా ఉద్యోగి దయానంద్ వల్లే సినిమా విజువల్స్ లీకైనట్టు పోలీసులు నిర్ధారించారు. 'బాహబలి-2' దృశ్యాల లీక్‌పై దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురైంది. 'బాహబలి-2' సినిమానే కాదు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'నమో వెంకటేశాయ' దృశ్యాలు కూడా లీకైనట్టు వెల్లడైంది. చైతన్య అనే యువకుడి ల్యాప్‌ట్యాప్‌లో లీకైన నమోవెంకటేశాయ దృశ్యాలు కనిపించాయి. దీంతో నిందితులపై కాపీరైట్స్, ఐటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు లీకైన రెండు కొత్త సినిమాల దృశ్యాలు విజయవాడలోని యువకుల వాట్సాప్, సోషల మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
'సినిమాలపై నిషేధంతో పైరసీ ముప్పు'
కరాచి: ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత చలనచిత్రాలను పాకిస్థాన్‌లో పూర్తిగా నిషేధించడం పైరసీ వేళ్లూనుకునేందుకు దారితీస్తుందని ఆ దేశ సినీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనతోనే సుమారు 50–60 శాతం ఆదాయం పొందే సినిమా థియేటర్ల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ కళాకారులపై భారత్‌లో నిషేధం విధించిన పిమ్మట పాక్‌లోనూ భారత సినిమాల ప్రదర్శనను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సినిమా థియేటర్ల యజమానులు పాక్ ప్రభుత్వానికి సంఘీభావంగా నిలిచారని డాన్ పత్రిక పేర్కొంది. ‘ భారీగా ఆదాయం వస్తున్నా భారత సినిమాల ప్రదర్శనను నిలిపేయాలన్నది స్థానిక భాగస్వాముల అగత్య నిర్ణయం. భారత సినీ పరిశ్రమ వర్గాలు మా కళాకారులపై నిషేధం విధించకుంటే మేమూ ప్రతిచర్యకు పాల్పడం. భారత చలన చిత్రాలకు పాకిస్థాన్ మూడో అతిపెద్ద మార్కెట్ అన్న సంగతిని వారు మరవకూడదు’ అని లాహోర్‌లోని సూపర్ సినిమా జనరల్ మేనేజర్ ఖోరెమ్ గుల్తాసాబ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విడుదలైన వాటితో పాటు పాత చిత్రాలతో పాకిస్థాన్ లో థియేటర్లు నడిపిస్తున్నారు. గతేడాది కేవలం 6 పాక్ చిత్రాలే విడుదలయ్యాయి. ప్రస్తుతానికైతే వీక్షకుల సంఖ్య తగ్గకున్నా, నిషేధం దీర్ఘకాలం కొనసాగితే పాకిస్తాన్ చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. -
వివాదంలో విశాల్
తమిళసినిమా: నటుడు, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకు ముందు గత దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గ నిర్వాహకంపై విమర్శనాస్త్రాలు సంధించి వారి ఆగ్రహానికి గురైన విశాల్ ఆ తరువాత ఆ కార్యవర్గానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల తమిళ నిర్మాతల కార్యవర్గంపై విమర్శలు చేసి మరో సారి వివాదాల్లో చిక్కుకున్నారు. పైరసీని అరికట్టడానికి తమిళ నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఒక భేటీలో ఆరోపణలు గుప్పించారు. ఆ సంఘంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, నడిగర్ సంఘం తరహాలోనే ఆ సంఘాన్ని చేజిక్కించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాల్ విమర్శలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న తమిళ నిర్మాతల మండలి కార్యవర్గం మంగళవారం స్థానిక ఫిలించాంబర్ ఆవరణలో సంఘం అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో విశాల్ చర్యల్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అయితే నటుడు మన్సూర్ అలీఖాన్‌తో పాటు కొందరు మాత్రం విశాల్‌కు మద్దతుగా మాట్లాడడం విశేషం. విశాల్ తమిళ నిర్మాతల మండలిని అవమానించే విధంగా ఒక భేటీలో పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, వారంలోపు ఈ వ్యవహారంలో తన విచారాన్ని వ్యక్తం చేయాలని లేని ఎడల దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆయన నటిస్తున్న కత్తిసండై చిత్రంతో పాటు ఆయన నటించే ఏ చిత్రానికి తమిళ నిర్మాతల మండలి, తమిళ నిర్మాతలు సహకరించరని తెలిపారు. ఈ వ్యవహారంపై విశాల్‌ను స్పందించాల్సిందిగా కోరగా తమిళ నిర్మాతల మండలి తరఫున ఇంత వరకూ తనను ఈ విషయమై వివరణ అడగలేదన్నారు. దీని గురించి వారు తనను అడిగినా, లేఖ పంపినా తగిన వివరణ ఇస్తానని అన్నారు. మొత్తం మీద ఈ అంశం కోలీవుడ్‌లో మంచి వేడినే పుట్టిస్తోందని చెప్పవచ్చు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. -
సెల్ ఫోన్ దుకాణాలపై దాడులు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని పలు సెల్‌ఫోన్ దుకాణాలపై పైరసీ అధికారులు (ఐఎంఐ) యు.వి.సూర్యనారాయణ, బండారు జీవరత్నం శనివారం దాడులు నిర్వహించారు. మూడు సెల్ ఫోన్ దుకాణాల్లో కంప్యూటర్ల నుంచి మెమెరీ కార్డులకు అనధికారికంగా పాటలు ఎక్కిస్తున్నట్టు గుర్తించారు. ఆ దుకాణాల్లోని కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణాల యజమానులపై ఎస్ఐ కె. గోవిందరావు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా మేం ఏ అక్రమాలు చేయడంలేదని, ఏటా మా వద్ద నుంచి దుకాణానికి సుమారు రూ. 22 వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని సెల్‌ఫోన్ దుకాణ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైసెన్సు పేరుతో డీడీలు తీస్తున్న సొమ్ములు ఎవరికి చెందుతున్నాయోనని పోలీసులను ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తిని పిలిపించి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్ఐ సెల్‌ఫోన్ దుకాణదారులకు హామీ ఇచ్చారు. -
పైరసీ పాగా
-
అది చాలా చెడ్డ పని: కంగనా
ముంబయి: పైరసీ భూతం బాలీవుడ్ నటులను తెగ భయపెడుతోందట. షారుక్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, కంగనా రనౌత్ తోపాటు దర్శకుడు ఇంతియాజ్ అలీ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు అతిపెద్ద ముప్పు ఏదైనా ఉంటే అది పైరసీనే అని దాన్ని ఎట్టి పరిస్ధితుల్లో నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటీవల తీవ్ర పోరాటం అనంతరం విడుదలైన ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ వంటి చిత్రాలు థియేటర్ లోకి రాకముందే ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కంగనా స్పందనా కోరగా ..'ఇది సినిమా పరిశ్రమకు పెద్ద చేటు. మేం ఎంతో కష్టపడి పనిచేస్తాం. ఇది ఒక రకంగా అతిక్రమణే.. వెంటనే ఆ పనిచేసేవాళ్లు ఆపేయాలి. పైరసీ అంటే దొంగతనమే. దాన్ని ఎవరూ ప్రోత్సహించవద్దు. ఇది ఒక రకంగా చెడు ప్రవర్తన' అంటూ చెప్పింది. అలాగే మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు పైరసీ విషయం లో స్పందించారు. -
అంతా ఉత్తిదే.. కబాలి లీక్ అవ్వలేదు
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా కబాలి సినిమా ఆన్లైన్లో లీక్ అయ్యిందంటూ వార్తలు వస్తుండటంపై స్పందించిన చిత్రయూనిట్, అలాందేమి లేదంటూ తేల్చేసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలు ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీలు రిలీజ్‌కు ముందే లీక్ అవ్వటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. రజనీ కబాలి విషయంలో ఇప్పటికే భారీగా బిజినెస్ జరగటంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 250కి పైగా వెబ్సైట్ల మీద నిఘా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పైరసీ వెబ్సైట్లపై చర్యలు తీసుకున్న చెన్నై పోలీసులు, పైరసీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. అయితే వారం రోజులుగా కబాలి లీక్ పై ప్రచారం జరుగుతున్నా.. చిత్రయూనిట్ ఇంత ఆలస్యంగా స్పందించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమోషన్ కోసం ఇలాంటి రూమర్స్ ను ప్రోత్సహించారన్న వాదన వినిపిస్తోంది. -
'ఇది హత్య చేయడం కంటే ఎక్కువ'
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసి. గతంలో సినిమా రిలీజ్ తరువాత ఇండస్ట్రీ పెద్దలను ఇబ్బంది పెట్టే ఈ భూతం. టెక్నాలిజీ పెరగటంతో సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలు పైరసీ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. మాంజీ, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలను పైరసీ తీవ్రంగా దెబ్బతీసింది. ఈ శుక్రవారం విడుదలైన గ్రేట్ గ్రాండ్ మస్తీ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది. మస్తీ సీరిస్‌లో విడుదలైన తొలి రెండు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో గ్రేట్ గ్రాండ్ మస్తీపై కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అడల్ట్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని భావించారు. కానీ సినిమా రిలీజ్‌కు 17 రోజుల ముందే నెట్లో వచ్చేయటంతో అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు కనీసం 15 కోట్ల వసూళ్లు సాధిస్తుందనుకున్న సినిమా 2 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్ పైరసీ వల్ల తమకు జరిగిన నష్టాన్ని అభిమానులకు తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా 'సినిమా 17 రోజుల ముందే లీక్ అయిపోయింది. అది చూసిన అందరూ సూపర్బ్‌గా చేశారని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఇది హత్య చేయడం కన్నా ఎక్కువ' అంటూ ఏడ్చేసింది. -
సుల్తాన్ కూడా లీక్ అయ్యిందా..!
బాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో లీకైపోతున్నాయి. ఆఖరికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సుల్తాన్‌కు కూడా ఈ కష్టాలు తప్పలేదు. ఇటీవల బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉడ్తా పంజాబ్ రిలీజ్‌కు ముందే నెట్లో దర్శనమిచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోకముందే, వివేక్ ఒబరాయ్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రేట్ గ్రాండ్ మస్తీ కూడా రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో వచ్చేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మాదిరిగా అన్ని టోరెంట్ సైట్లలో అందుబాటులో లేకున్నా కొన్ని వెబ్ సైట్స్ నుంచి ఇప్పటికే సుల్తాన్ సినిమాను డౌన్ లోడ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ముంబై సైబర్ క్రైం ఎక్స్పర్ట్స్ ధృవీకరించారు. ఇప్పటికే నష్ట నివారణా చర్యలు చేపట్టిన చిత్ర యూనిట్ పలు వెబ్ సైట్స్ బ్లాక్ చేయిస్తున్నప్పటికీ.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. -
పైరసీ చట్టబద్ధం చేయాలి
చిత్ర పరిశ్రమను కృంగదీస్తున్న వాటిలో పైరసీ ప్రధానమైంది. అలాంటి పైరసీని చట్టబద్ధం చేయాలంటున్నారు యువ నిర్మాత సురేశ్ కామాక్షి. లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం పకిరి. ప్రభురణవీరన్, శార్వియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇసక్కీకార్వన్నర్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు, శాసనసభ సభ్యుడు కరుణాస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది.ఈ చిత్ర ఆడియోను దర్శకుడు వసంతబాలన్ ఆవిష్కరించగా చాయాగ్రాహకుడు చెళియన్ తొలి సీడీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న యువ నిర్మాత సురేశ్కామాక్షీ మాట్లాడుతూ ఇవాళ చిత్ర పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. చిన్న చిత్రాలకు ఏకైక నమ్మకం ప్రచార మాధ్యమాలన్నారు. అయితే అలాంటి పత్రికల్లో రివ్యూలు ప్రచారమయ్యే వరకు కూడా థియేటర్లలో చిత్రాలు ఉండడం లేదన్నారు. థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులు సినిమాలు చూడడానికి రావడం లేదంటున్నారన్నారు. ఇవాళ ఒక కుటుంబం థియేటర్లో చిత్రం చూడాలంటే కనీసం రూ.2వేలు ఖర్చు అవుతుందన్నారు. సినిమా టికెట్ వెల కంటే పార్కింగ్ ధర అధికం అవుతుందని పేర్కొన్నారు.ఉదయం,మధ్యాహ్నం క్యాంటీన్లలో వ్యాపారం లేక పోతే చిత్రాలను తీసేస్తున్నారని ఆరోపించారు. క్యాంటీన్ల వ్యాపారం కోసం నిర్మాత కష్టపడి సినిమాలు తీయాలా అని ప్రశ్నించారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు ఎలా వస్తారని ప్రశ్నించారు. నిజానికి ప్రేక్షకులు సినిమాలు చూడకుండా ఉండటం లేదన్నారు.పైరసీ సీడీలను కొనుక్కుని,ఇంటర్నెట్లో డబ్బు వెచ్చించి సినిమాలు చూస్తున్నారన్నారు.ఆ ఆదాయాన్ని నిర్మాతలు ఎందుకు కోల్పోవాలి అని ప్రశ్నించారు. దొంగ సారాను అరికట్టడానికి టాస్మాక్‌ను తీసుకొచ్చినట్లు పైరసీని అరికట్టడానికి దాన్ని చట్టబద్ధం చేయాలనే అభిప్రాయాన్ని సురేశ్‌కామాక్షి వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే విడుదలైన చిత్రాలకు థియేటర్లలో మార్నింగ్‌షో కూడా ఫుల్ కావడం లేదని, అందులో నటించిన కథానాయకులు మాత్రం కోట్ల రూపాయల పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విధానాల్లో మార్పు రావాలని ఆయన అన్నారు. -
'24' నిర్మాత సంచలన నిర్ణయం
చెన్నై: పైరసీ భూతం చలన చిత్రసీమను పట్టిపీడిస్తోంది. పైరసీ వెబ్ లో చిక్కుకున్న పరిశ్రమ ఎనలేని నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుండగా.. చాప కింద నీరులా పైరసీ భూతం విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బెంగళూరులో '24 ' సినిమా విడుదల రోజే పెద్ద ఎత్తున పైరసీ సీడీలు పట్టుబడటం ఆందోళకు దారి తీసింది. పైరసీకి వ్యతిరేకంగా దృఢమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్రా నిర్మాత జ్ఞానవేల్ రాజా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా చిత్రపరిశ్రమ ముందుకు వచ్చి సంబంధిత చర్యలు తీసుకోవాలని రాజా కోరారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాననీ, పరిశ్రమ సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చిందని రాజా మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమ స్పందించి, సరైన చర్యలు చేపట్టేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రముఖ డిజిటల్ సినిమా ప్రొవైడర్ క్యూబ్, ద్వారా జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమా చట్టవిరుద్ధంగా బెంగళూరు పీవీఆర్ ఓరియన్ మాల్ లో మే 6 న 9.45 గంటలకు షో ( విడుదలైన మొదటి రోజు) సమయంలో రికార్డు చేయబడిందని ఆరోపించారు. ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా తాము దీన్ని గుర్తించామని రాజా ఆరోపించారు. ప్రతి థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్ ద్వారా ఇలా గుర్తించడం సాధ్యమని పేర్కొన్నారు. కాగా తమిళ స్టార్ హీరో సూర్య, విక్రం కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయగా, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. టైం మిషన్ బ్యాక్ గ్రౌండ్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. -
'అది తప్ప అంతా సేమ్ టు సేమ్'
ముంబై: చరిత్ర పొడవునా ఒకటిగా ఉండి, 60 ఏళ్ల కిందట విడిపోయిన పాకిస్థానీ, హిందుస్థానీల మధ్య ప్రధాన తేడా ఏంటి? బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మాటల్లో చెప్పాలంటే.. 'రూపం, భాష, వేషం, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం.. అన్నీ సేమ్ టు సేమ్. ఒక్క క్రికెట్ విషయంలోతప్ప! ఇన్ని సిమిలారిటీస్ ఉన్న దేశాల మధ్య కళాసంబంధాలు క్షీణించడానికి రాజకీయపరమైన కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ నిజజీవిత గాథ ఆధారంగా రూపొందించిన 'నీర్ జా' లాంటి సినిమాను పాకిస్థాన్ లో నిషేధించడం దారుణం' అని అంటోదామె. అంతేకాదు, అసలు నీర్ జా సినిమాను ఎందుకు బ్యాన్ చేశారో బాహాటంగా వెల్లడించాలని దాయాది దేశాన్ని డిమాండ్ చేస్తోంది. ఆమె ఆగ్రహం వెనుక బలమైన కారణం ఉంది. అది ఏంటంటే.. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా నీర్ జా ఘన విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సోనమ్.. తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ గంటలుగంటలు లైవ్ చాటింగ్ లు చేస్తోంది. ఆ క్రమంలో పాకిస్థాన్ లోని ఆమె అభిమానులు కూడా 'మేడం.. సినిమా చాలా బాగుంది. మీరు అద్భుతంగా నటించారు' అని కాంప్లిమెంట్లు ఇచ్చారట. పాక్ లో రిలీజ్ కాకున్నా వాళ్లెలా చూశారు చెప్మా? అని ఆరా తీయగా.. ఆ దేశంలో నీర్ జా పైరసీ డీవీడీలు లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్నట్లు తెలుసుకుంది. అంతే.. ప్రెస్ మీట్ పెట్టిమరీ పాక్ ను కడిగేసింది సోనమ్. 'ఇది బాధాకరమైన విషయం. పాకిస్థాన్ తీరు నన్ను నిరాశపర్చింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. రెండువైపులా రాజకీయాలు ఉండొచ్చు. కానీ నేను ముందు నుంచి చెబుతున్నట్లు కళలు, క్రీడా రంగాలకు రాజకీయాలను ముడిపెట్టొద్దు' అని సోనమ్ కపూర్ అభ్యర్థించింది. హైజాకర్ల చెరనుంచి ప్రయాణికులను కాపాడే క్రమంలో తాను ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ హోస్టెస్ నిర్ జా బానోత్ జీవితం ఆధారంగా రూపొందించిన నీర్ జా సినిమా భారత్ లో ఫిబ్రవరి 19న విడుదలైన సంగతి తెలిసిందే. -
బతిమాలినా అతను కనికరించలేదు!
కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరైనా లూఠీ చేస్తే, ఎంత బాధ అనిపిస్తుందో... కళ్లెదుటే పైరసీ సీడీ కొనుక్కుని, సినిమా చూస్తున్నప్పుడు అందులో నటించినవాళ్లకూ, ఆ సినిమా తీసినవాళ్లకూ అంతే బాధగా ఉంటుంది. ఇటీవల కృతీ సనన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏదో పని మీద ఆమె ఢిల్లీ వెళ్లారు. విమానంలో ఓ వ్యక్తి ‘దిల్వాలే’ సినిమాను మొబైల్ ఫోన్లో చూడడం కృతీ సనన్ దృష్టిలో పడింది. షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతీ సనన్ తదితరుల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం వారం రోజుల క్రితం విడుదలైంది. ఆ సినిమా పైరసీ కాపీనే ఆ ప్రయాణీకుడు చూస్తున్నాడు. కృతి ఆగ్రహం, ఆవేదనతో అతగాడి దగ్గరికెళ్లి, ‘ప్లీజ్... ఇలా ఫోన్లోకన్నా థియేటర్లో చూస్తే, మీరింకా ఎంజాయ్ చేస్తారు’ అని చాలా రిక్వెస్టింగ్‌గా చెప్పారు. కానీ, అతను కనికరించలేదు. ఈ బ్యూటీ మాటలను ఖాతరు చేయకుండా హాయిగా సినిమా చూశాడు. ఈ తతంగాన్ని ఫొటో తీసి, తన ట్విట్టర్లో కృతి పోస్ట్ చేశారు. ‘‘నా కళ్లెదుటే పైరసీ కాపీ చూశాడు. నేను తట్టుకోలేకపోయా. ఎంతోమంది కష్టంతో ఓ సినిమా రూపొందుతోంది. పైరసీ కాపీ చూసి, మా కష్టాన్ని వృథా చేయకండి. దయచేసి థియేటర్లకు వెళ్లి, సినిమా చూడండి’’ అని కూడా కృతి పేర్కొన్నారు. -
చట్టం అమలు ఓ జోకైపోయింది: రాజమౌళి
మన దేశంలో చట్టాల అమలు అంటే ఓ పెద్ద జోకుగా మారిపోయిందని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలంటూ ఎన్ని కోర్టులు చెబుతున్నా, ఎంత పటిష్ఠమైన చట్టాలున్నా కూడా బాహుబలి లాంటి సినిమాలు సైతం ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయంటూ సాక్షి ఖన్నా అనే పాత్రికేయురాలు చేసిన ట్వీట్‌కు సమాధానంగా రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టాలంటూ టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, ఇతర ప్రముఖులు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇలా కామెంట్ చేశారు. Sadly, law enforcement is a joke In our country https://t.co/YAnqovSeBb — rajamouli ss (@ssrajamouli) September 3, 2015 -
సొంత మ్యూజిక్ సైట్‌ను ప్రారంబించిన మాస్ట్రో
-
ఇంటర్నెట్ లో హిట్ సినిమా; ముగ్గురు అరెస్ట్
తిరువనంతపురం: మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్'ను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ముగ్గురు స్కూల్ విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లామ్ లో మంళవారం తెల్లవారుజామున వీరిని యాంటీ పైరసీ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా, ఆకతాయితనంగా చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ప్రేమమ్' సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. రిలీజైన రెండు వారాల్లో... ఒక్క కేరళలోనే రూ. 20 కోట్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించి, 'మల్లు' ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
భవిష్యత్తు క్లౌడ్ కంప్యూటింగ్‌దే!
♦ ఐటీ, సేవల రంగంతో పాటు ఇప్పుడు వైద్యానికి క్లౌడే ♦ పేషెంట్ మెడికల్ ఇమేజెస్, నివేదిక విశ్లేషణ అన్నీ దీంతోనే ♦ ‘పికాసో’తో సగానికి సగం తగ్గనున్న వ్యయం, సమయం ♦ ‘సాక్షి’తో రికో ఎండీ మనోజ్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పైరసీ అంటే టక్కున గుర్తొచ్చేది సినిమాలే. కానీ, ఇప్పుడీ భయం సాఫ్ట్వేర్ కంపెనీలకూ పట్టుకుంది. ఉదయం విడుదలైన సినిమాలు సాయంత్రానికల్లా పైరసీ రూపంలో బయటికొచ్చేస్తే ఎలాగైతే నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టమొస్తుందో.. అంతకు రెట్టింపు నష్టం సాఫ్ట్వేర్ ఆప్లికేషన్ల పైరసీతోనూ కలుగుతోందంటున్నారు రికో ఇండియా ఎండీ మనోజ్ కుమార్. గతేడాది దేశంలో సాఫ్ట్వేర్ పైరసీల నష్టం విలువ రూ.3.5-4 బిలియన్ డాలర్లుంటుందని అంచనా వేశారాయన. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో సాఫ్ట్వేర్ పైరసీని పూర్తిగా అడ్డుకోవచ్చని చెప్పారాయన. ‘‘క్లౌడ్ కంప్యూటింగ్ మున్ముందు ఐటీ, సేవల రంగానికే కాక విద్యా, వైద్యం, సినిమా, ఇండస్ట్రీ.. ఇలా పలు రంగాలకూ విస్తరిస్తుంది’’ అన్నారాయన. పికాసో పేరిట దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ ఎనేబుల్డ్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. - క్లౌండ్ కంప్యూటింగ్ విధానం అటు కంపెనీలకు, ఇటు వినియోగదారులకు ఇద్దరికీ లాభమే. ఇప్పటివరకు ఒక సాఫ్ట్‌వేర్‌ను కొనాలంటే వేలు, లక్షల్లో చెల్లించాలి. అలా కొన్న సాఫ్ట్వేర్లు కొన్ని కంప్యూటర్లకే పరిమితమయ్యేవి. ఎక్కువ కంప్యూటర్లకు వాడాలంటే మళ్లీ కొనాల్సి వచ్చేది. దీంతో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు పైరసీకి గురయ్యేవి. ఇప్పటికీ పైరసీ సాఫ్ట్వేర్లు ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఆప్లికేషన్లు రూపొందించే కంపెనీలకు నష్టం కలుగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్‌తో సాఫ్ట్వేర్ పైరసీకి అడ్డుకట్ట వేయవచ్చు. అదే సమయంలో సాఫ్ట్వేర్ వాడకంలోనూ ఖర్చును తగ్గించుకునే వీలుంది. అందుకే భవిష్యత్తు క్లౌడ్ కంప్యూటింగ్‌దే. ఎంత వాడుకుంటే అంతే రుసుము చెల్లించే విధానం వల్ల వినియోగదారులూ ఇటే మొగ్గు చూపుతున్నారు. - ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), సేవల రంగాలకే పరిమితమైన క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఇప్పుడు వైద్య రంగానికీ తీసుకొచ్చాం.వెబ్ ఆధారితమైన పికాసో.. ఆసుపత్రులకు, రోగులకు విస్రృతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వైద్య ప్రక్రియ సులభతరం అవ్వడమే కాక, వేగవంతమవుతుంది కూడా. రేడియాలజీ, ఆర్థోపీడిక్, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ, ఆంకాలజీ చికిత్సల్లో పికాసోను వినియోగించుకోవచ్చు. -
వెయ్యి కొట్టు... ఏడాదంతా సినిమా చూడు
తమిళనాడు : ఆషాఢమాసం తగ్గింపు ధరలంటూ వ్యాపారస్తులు గల్లాపెట్టెలు నింపుకునే ప్రయత్నం చేస్తుండటం చూస్తుంటాం. ఈ వ్యాపార ట్రిక్కు సినిమా వాళ్లు ఉపయోగించుకునే ప్రయత్నంలో పడ్డారు. పైరసీని అరికట్టేందుకేనంటున్నారు ఒక సినీ థియేటర్ అధినేత. వివరాల్లో కెళితే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో షణ్ముగ సినిమా థియేటర్ ఉంది. ఈ థియేటర్ అధినేత ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. ఒక ప్రేక్షకుడు వెయ్యి రూపాయలు టికెట్ కొంటే ఆ ఏడాదంతా ఆ థియేటర్లో ఆడే కొత్త చిత్రాలను ఒకసారి చూడవచ్చట. ఒకవేళ అతడికి చిత్రం చూసేందుకు ఆసక్తి లేకపోతే తన తరపున ఎవరినైనా పంపవచ్చు. ఈ విధానాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ విధానంలో రెండు వేల టికెట్లు విక్రయించారట. పదివేల టికెట్లు అమ్మాలన్నది థియేటర్ యాజమాన్యం లక్ష్యం. ఈ కొత్త పథకానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందట. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా టికెట్ కొన్న వారికి ఆ ఊరులోని పది దుకాణాల్లో ఏదైనా కొనుగోలు చేస్తే ఐదు శాతం తగ్గింపు ఉంటుందట. వాటిల్లో ఒక బంగారు దుకాణం కూడా ఉంది. అందులో సవరం బంగారం కొనుగోలు చేస్తే రూ.1250 తగ్గింపు ఉంటుందట. ఈ పథకం సక్సెస్ అయితే రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది. -
తెలుగు చిత్ర పరిశ్రమకు ఢోకా లేదు
రాష్ట్రాలు విడిపోయినా తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన ఇబ్బందే మీ లేదని ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ అన్నారు. తన తనయుడు ఆకాశ్‌పూరి హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రాపోరి’ సినిమా షూటింగ్‌ను చూసేందుకు శుక్రవారం పాల్వంచ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ⇒ రాష్ట్రాలు విడిపోయినా ఇబ్బందేమీ లేదు ⇒ హైదరాబాద్‌లోనే ఇండస్ట్రీ ఉంటుంది ⇒ పైరసీని అరికట్టే వ్యవస్థ రావాలి ⇒ ప్రముఖ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ పాల్వంచ : రాష్ట్రాలు విడిపోయినా తెలుగు చిత్ర పరిశ్రమకు ఇబ్బందేమీ లేదని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇండస్ట్రీ ఉంటుందని తెలిపారు. తన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నిర్మిస్తున్న ‘ఆంధ్రాపోరి’ షూటింగ్ చూడ్డానికి జగన్నాథ్ శుక్రవారం పాల్వంచకు వచ్చారు. ఈ సందర్భంగా బృందావన్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన ‘టెంపర్’ చిత్రం అంచనాలకు మించి విజయవంతమైందని తెలిపారు. దేశ విదేశాల్లో ఈ సినిమా అత్యధిక థియోటర్లలో ఆడుతుండడం ఆనందంగా ఉందన్నారు. మహేష్‌బాబుతో తన తదుపరి చిత్రం ఉంటుందని, జ్యోతిలక్ష్మితో మరో చిత్రం తీస్తున్నానని తెలిపారు. పైరసీల కారణంగా చిత్రపరిశ్రమ నష్టాలు చవిచూడాల్సి వస్తోందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుండగా పైరసీ కారణంగా కలెక్షన్లు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాల్లో చిత్రాలను నెట్లో డౌన్లోడ్ చేసుకోగానే పోలీసులకు సమాచారం వెళ్లిపోతుందని, పైరసీ చేసిన వారి వివరాలు తెలిసిపోతాయని అన్నారు. అలాంటి టెక్నాలజీ ఈ దేశంలోకి రావాలని కోరుకుంటున్నానన్నారు. చక్రీ అకాల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. దర్శకుడు రాజు మదిరాజ్ వచ్చి ఆకాశ్‌తో సినిమా చేస్తానంటూ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అనేశానని అన్నారు. భవిష్యత్తులో తన దర్శకత్వంలో ఆకాశ్ సినిమా ఉంటాయని చెప్పారు. షూటింగ్ స్పాట్లకు ఖమ్మం చాలా బాగుంటుందని, త్వరలో తన చిత్రాలను ఇక్కడే నిర్మాస్తానని అన్నారు. -
పైరసీని అరికట్టడానికి కొత్త టెక్నిక్
పైరసీకి చెక్ పెట్టే విధంగా పులన్‌విచారణై -2 చిత్ర యూనిట్ కొత్తగా సాంకేతికపరమైన టెక్నిక్‌ను కనిపెట్టింది. విజయకాంత్ హీరోగా నటించిన పులన్‌విచారణై చిత్రం ఎంతో ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు ఆర్ కె సెల్వమణి, ప్రశాంత్ హీరోగా పులన్ విచారణై -2, తెరకెక్కించారు. రావేదర్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఇబ్రహీం రావుత్తర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పైరసీకి గురి కాకుండా సాంకేతిక పరమైన కొత్త టెక్నిక్‌ను కనుగొన్నట్లు చిత్ర దర్శకుడు ఆర్కె సెల్వమణి పేర్కొన్నారు. పులన్‌విచారణై -2 చిత్రాన్ని తాను తమిళనాడు, పాండిచ్చేరిలలో మాత్రమే ముందుగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర సీడీ, డీవీడీ, శాటిలైట్, వెబ్సైట్, ఇంటర్నెట్, కేబుల్‌టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ హక్కులను ఎవరికీ విక్రయించలేదని తెలిపారు. చిత్రం ఎస్ఎంఎస్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మొదట విజయం : పులన్ విచారణ -2 చిత్ర యూనిట్ పైరసీని అరికట్టడలో తొలి విజయం సాధించారన్నారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసు కమిషనర్ ఆమ్నీ బస్ నిర్వాహకులందరినీ పిలిపించి కొత్త చిత్రాలను ప్రదర్శించకుండా హెచ్చరించారని తెలిపారు. పైరసీకి పాల్పడితే కనుగొనడానికి తాముకొత్త టెక్నిక్‌ను కనిపెట్టినట్లు చెప్పారు. తమ చిత్ర పైరసీ సీడీలకు పాల్పడినట్లయితే ఏ థియేటర్ల్లో పైరసీకి పాల్పడుతున్నారన్నది ఆ ప్రాంత సెల్‌ఫోన్ టవర్స్ కోడ్ నెంబర్ నమోదవుతోందన్నారు. అదే విధంగా ఎక్కడ డీవీడీలను తయారు చేస్తున్నారు ఆ తరువాత దానికి ఎక్కడ కాపీ రూపొందిస్తున్నారన్న అంశాలు కూడా రిజిస్టర్ అవుతాయని తెలిపారు. ఇలాంటి కొత్త టెక్నిక్‌తో విడుదలవుతున్న తొలి చిత్రం పులన్ విచారణై -2 అని ఆర్కె సెల్వమణి పేర్కొన్నారు. నిర్మాత ఇబ్రహీం రావుత్తర్ నియాఖత్ అనీఖాన్, షణ్ముగధరన్ పాల్గొన్నారు. -
‘పీకే’ పైరసీ సినిమా చూసిన అఖిలేశ్!
లక్నో: బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించే క్రమంలో అఖిలేశ్ మాట్లాడుతూ ‘కొన్ని రోజుల కిందట ఈ సినిమాను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా దీన్ని చూసేందుకు మాత్రం గత రాత్రే సమయం లభించింది’ అని అన్నారు. అఖిలేశ్‌పై కేసు పెట్టాలని తహ్రీర్ అనే హక్కుల సంఘం నేత సంజయ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూఎఫ్‌వో మూవీజ్ ద్వారా సినిమాలను డౌన్లోడ్ చేసుకునేందుకు అఖిలేశ్ లెసైన్స్ కలిగి ఉన్నారని సీఎం కార్యాలయం తెలిపింది.