బతిమాలినా అతను కనికరించలేదు! | Sad to c the hardwork of so many ppl bein watched in such pathetic quality!Pls enjoy films in cinemas | Sakshi

బతిమాలినా అతను కనికరించలేదు!

Dec 29 2015 12:40 AM | Updated on Sep 3 2017 2:42 PM

బతిమాలినా అతను  కనికరించలేదు!

బతిమాలినా అతను కనికరించలేదు!

కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరైనా లూఠీ చేస్తే, ఎంత బాధ అనిపిస్తుందో...

కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరైనా లూఠీ చేస్తే, ఎంత బాధ అనిపిస్తుందో... కళ్లెదుటే పైరసీ సీడీ కొనుక్కుని, సినిమా చూస్తున్నప్పుడు అందులో నటించినవాళ్లకూ, ఆ సినిమా తీసినవాళ్లకూ అంతే బాధగా ఉంటుంది. ఇటీవల కృతీ సనన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏదో పని మీద ఆమె ఢిల్లీ వెళ్లారు. విమానంలో ఓ వ్యక్తి ‘దిల్‌వాలే’ సినిమాను మొబైల్ ఫోన్‌లో చూడడం కృతీ సనన్ దృష్టిలో పడింది. షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతీ సనన్ తదితరుల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం వారం రోజుల క్రితం విడుదలైంది.

ఆ సినిమా పైరసీ కాపీనే ఆ ప్రయాణీకుడు చూస్తున్నాడు. కృతి ఆగ్రహం, ఆవేదనతో అతగాడి దగ్గరికెళ్లి, ‘ప్లీజ్... ఇలా ఫోన్‌లోకన్నా థియేటర్‌లో చూస్తే, మీరింకా ఎంజాయ్ చేస్తారు’ అని చాలా రిక్వెస్టింగ్‌గా చెప్పారు. కానీ, అతను కనికరించలేదు. ఈ బ్యూటీ మాటలను ఖాతరు చేయకుండా హాయిగా సినిమా చూశాడు. ఈ తతంగాన్ని ఫొటో తీసి, తన ట్విట్టర్‌లో కృతి పోస్ట్ చేశారు. ‘‘నా కళ్లెదుటే పైరసీ కాపీ చూశాడు. నేను తట్టుకోలేకపోయా. ఎంతోమంది కష్టంతో ఓ సినిమా రూపొందుతోంది. పైరసీ కాపీ చూసి, మా కష్టాన్ని వృథా చేయకండి. దయచేసి థియేటర్లకు వెళ్లి, సినిమా చూడండి’’ అని కూడా కృతి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement