
పైరసీ అరికట్టేందుకు చర్యలు: తలసాని
వేలాది మంది జీవనోపాధి పొందు తున్న చలనచిత్ర రంగాన్ని పరిరక్షించేందుకు
సాక్షి, హైదరాబాద్: వేలాది మంది జీవనోపాధి పొందు తున్న చలనచిత్ర రంగాన్ని పరిరక్షించేందుకు పైరసీని అరికట్టాల్సిన అవసరముందని, దీనిపై అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫ్రీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నార
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ ఇండియన్ కాపీరైట్స్ సంస్థ చైర్మన్ రత్నాకర్, డైరెక్టర్ అరవింద్ మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీంతో పాటు ఇతర రంగాలలో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. తలసానిని కలసిన వారిలో విజిలెన్స్ సంస్థ అడ్మిన్ ఆఫీసర్ శివ, పీఆర్‌వో చంద్రశేఖర్‌శర్మ, బీఆర్ నాయుడు తదితరులు ఉన్నారు.