![Thandel Movie Producer Bunny Vasu About Movie Piracy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/chaitanya.jpg.webp?itok=GvfCt_0-)
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.
పైరసీపై స్పందించిన తండేల్ నిర్మాత
అయితే తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందన్నారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాను సైతం లోకల్ ఛానెల్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.
తండేల్‌కు సక్సెస్ టాక్..
ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్‌కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లో రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన చూస్తే మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటనుంది. ఈ నేపథ్యంలో తండేల్ మూవీ నిర్మాతలు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment