టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో దేవిశ్రీ ప్రసాద్ ముందు వరుసలో ఉంటాడు. 40 ఏళ్ల వయసు దాటిన ఆయన ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. కారణం ఏంటనేది తెలియదు కానీ కెరీర్ పరంగా బిజీగా ఉండడంతోనే పెళ్లి చేసుకోవట్లేదని కొంతమంది అంటుంటారు. గతంలో పలుమార్లు దేవిశ్రీ ప్రసాద్‌కు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. హీరోయిన్, నటి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. కొన్నాళ్ల తర్వాత ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడని..త్వరలోనే పెళ్లి అనే వార్తలు వినిపించాయి. అదీ జరగలేదు. ఇక ఆ మధ్య బంధువుల అమ్మాయితో పెళ్లి ఫిక్సయిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ దేవీశ్రీ సింగిల్‌గానే ఉన్నాడు. అయితే తాజాగా ఈ రాక్‌స్టార్ పెళ్లిపై నిర్మాత బన్నీవాసు(Bunny Vasu ) ఫన్నీ కామెంట్స్ చేశాడు.
తాజాగా జరిగిన తండేల్(Thandel) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి దేవిశ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) హాజరయ్యాడు. స్టైజ్‌పై ఒక్కొరు మాట్లాడుతూ.. సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. సినిమా ఇంతగొప్పగా రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమే కారణమని చెప్పాడు. మా చిత్రానికి అదిరిపోయే పాటలు అందించాడాని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేవి పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘దేవిని ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జితల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు.. ఆ తల్లి(దేవికి కాబోయే భార్య) ఎక్కడ ఉందో(నవ్వుతూ..). మా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారు. కానీ దేవి బ్యాచిలర్‌గానే ఉన్నాడు. త్వరలోనే దేవికి కూడా పెళ్లి జరగాలి. ఆయన పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి(నవ్వుతూ)’అని అన్నాడు. అక్కడే ఉన్న దేవి..‘పెళ్లి మన చేతుల్లో లేదు..రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది’ అన్నట్లుగా సైగలు చేశాడు. ఇక బన్నీవాసు దేవి పెళ్లి గురించి మాట్లాడినప్పుడు.. పక్కనే ఉన్న దిల్‌రాజు పగలబడి నవ్వుతూ దేవిని గట్టిగా హత్తుకున్నాడు.
దేవి కెరీర్ విషయానికొస్తే.. చిన్న వయసులోనే ‘దేవి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించాడు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ కంపోజర్‌గా ఎదిగాడు. చిరంజీవి మొదలుకొని నాని వరకు అందరి హీరోల సినిమాలతకు సంగీతం అందించాడు.లవ్ సాంగ్స్ తో పాటు.. మాస్ , రొమాన్స్, డెవోషినల్, సెంటిమెంట్, పాప్ సాంగ్స్ ఇలా అన్నిరకాల పాటలు అద్భుతంగా కంపోజ్ చేసి.. అదరగొట్టాడు. దేవి సంగీతం అందించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment