Bunny Vasu
-
కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ 'క'. తన్వీరామ్, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్‌ను శనివారం నిరవ్హించారు.మనసుకు నచ్చితేనే..ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాసు మాట్లాడుతూ.. నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప ఇలాంటి వేడుకలకు రాను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ అస్సలు ఊహించలేదు. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇది. ఈ సినిమాలో పనిచేసిన అందరికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ విని షాకయ్యా..సినిమా బడ్జెట్ విని షాకయ్యాను. వంశీ నందిపాటి నాకు రేట్ చెప్పకుండా సినిమా హక్కులు కొన్నాడు. ఆ నెంబర్ తెలిసి కంగారు పడ్డాను. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్ అవకాశం క్రియేట్ చేసుకున్నాడు, చాలా కషపడ్డాడు. పోరాటం ఆపలేదుచాలా మంది కిరణ్ పడిపోయాడు.. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను పోరాటం ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేయడమే.. కానీ కిరణ్ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్ గెలిచాడు. కిరణ్‌ను చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సక్సెస్ పాయింట్ వద్దకు వెళ్లే వరకు ఫైట్ చేయాలి. ఈ టీమ్ మరిన్ని విజయాలు అందుకోవాలి అని బన్నీ వాసు అన్నారు. -
దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాసు రియాక్షన్
-
ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాసు రియాక్షన్
టాలీవుడ్లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా థియేటర్‌కు ప్రేక్షకులు రాకుండా తామే చెడగొట్టామని తాజాగా ఆయన కామెంట్ చేశారు. సినిమా బాగున్నా వెంటనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ వైపు వెళ్లడం మానేశారు అనేది ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుంది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యల గురించి నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.‘ఆయ్’ మూవీ సెలబ్రేషన్స్‌లో బన్నీ వాస్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియా వారి నుంచి ఆయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే 'మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాలకే ఓటీటీలో సినిమా విడుదల చేస్తాం.' అని దిల్‌రాజు వ్యాఖ్యానించారు కదా దీనిపై మేరేమంటారు అని ఒకరు ప్రశ్నించగా.. బన్నీ వాసు ఇలా చెప్పుకొచ్చారు. 'ఇండస్ట్రీలో ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా ఐక్యత లేకుంటే ఏమీ చేయలేం. ఈ అంశంపై ఛాంబర్ నుంచి లేదా ఇంకెవరైనా రూల్స్ పెడితే జరిగే పని కాదు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసికట్టుగా కూర్చొని చర్చించాలి. బాలీవుడ్లో మాదిరి 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే.. థియేటర్లు ఇవ్వమని షరతులు పెట్టారు. అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా తీసుకుంటే సరిపోతుంది.' అని ఆయన అన్నారు.ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే తప్పకుండా ఏదైనా సందర్భం ఉండాలని బన్నీ వాసు అన్నారు. రీసెంట్గా మహేశ్ బాబు పుట్టినరోజు కారణం వల్ల 'మురారి'కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అలా ప్రేక్షకుల్లో ఒక మూడ్ క్రియేట్ అయితేనే థియేటర్‌కు వస్తారు. తమ 'ఆయ్' మూవీకి భారీగా పబ్లిసిటీ చేసినప్పటికీ సాధారణ రోజుల్లో విడుదల చేస్తే ఉపయోగం ఉండేది కాదు. కేవలం 25శాతం లోపే ఓపెనింగ్ వచ్చేది. కానీ, ఆగష్టు 15 నుంచి వరుస సెలవులు ఉండటం వల్ల సినిమాకు అడ్వాంటేజ్ దక్కింది. అందుకే ఆయ్ సినిమాకు 45 శాతం ఓపెనింగ్ జరిగిందని బన్నీ వాసు పేర్కొన్నారు. కలెక్షన్ల పరంగా కూడా తమకు గ్రాస్ మాత్రమే కనపడుతుంది కానీ, షేర్ కనిపించడంలేదని ఆయన అన్నారు. గతంలో మాదిరి థియేటర్లలో పరిస్థితిలు ఇప్పుడు లేవని బన్నీ వాసు అన్నారు. -
నా జీవితంలో అలాంటి వ్యక్తి ఆయనొక్కడే: బన్నీవాసు ఆసక్తికర కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన బన్నీపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచే స్నేహితుడు ఆయన ఒక్కడేనన్నారు. ఈ రోజు బన్నీ వాసు ఇక్కడ ఉన్నారంటే కారణం అల్లు అర్జున్ అని ఎమోషనలయ్యారు. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.బన్నీ వాసు మాట్లాడుతూ..' నా లైఫ్‌లో ఒకడున్నాడు. నేను ఎక్కడ ఉన్నా నాకు అండగా వచ్చి నిలబడతాడు. మా మధ్య గ్యాప్ వచ్చిందని డైలాగ్స్ వినిపిస్తున్నాయి. కానీ నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరే ముందుంటారు. ఒకటి మా అమ్మ.. రెండో వ్యక్తి నా స్నేహితుడు బన్నీ. ఆయ్ సినిమా ప్రచారం సరిగ్గా జరగడం లేదని.. బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీమ్ వాళ్లు కోరారు. కానీ నేను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి అని తెలిసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. 20 ఏళ్ల క్రితం నేను ఒక మిస్టేక్ చేశా. గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఆరోజు నా కోసం వాళ్ల నాన్నను కూడా ఎదిరించారు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకే కాదు.. తన లైఫ్‌లో ఎవరికి పడిపోతున్నా బన్నీ సపోర్ట్‌గా నిలుస్తాడు. అంత మంచి వ్యక్తి అల్లు అర్జున్ ఒక్కడే' అంటూ బన్నీ గొప్పతనాన్ని వివరించారు.కాగా... జూనియర్ ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాను గోదావరి నేపథ్యంలో ఫుల్ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్చి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. -
అల్లు అర్జున్, సుకుమార్ గొడవపై బన్నీ వాసు క్లారిటీ
-
మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో కలిసి!
గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్ గురించి తెగ వార్తలొచ్చాయి. 'పుష్ప 2' షూటింగ్ విషయమై డైరెక్టర్ సుకుమార్‌తో గొడవపడ్డాడని, గడ్డం ట్రిమ్ చేయించుకుని ఫారెన్ టూర్‌కి వెళ్లిపోయాడని తెగ గాసిప్స్ వచ్చాయి. అయితే ఇవేవి నిజం కాదని నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశారు. దీనితోపాటు అల్లు అర్జున్ తర్వాత చేయబోయే మూవీ గురించి లీకులు వదిలారు.(ఇదీ చదవండి: 'అందుకే బన్నీ గడ్డం ట్రిమ్ చేశాడు'.. నిర్మాత బన్నీ వాసు)'పుష్ప 2' తర్వాత బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటనేది క్లారిటీ రాలేదు. తాజాగా 'ఆయ్' మూవీ పాట లాంచ్ ఈవెంట్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి బయటపెట్టారు. త్రివిక్రమ్‌తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని, ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్‌తో దీన్ని తీయబోతున్నారని చెప్పారు. ఈ రేంజులో చెబుతున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గతంలో 'రంగస్థలం' తర్వాత సుకుమార్ 'పుష్ప' మూవీ చేశారు. దీంతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవల్లో పరిచయం చేయనున్నాడు. ఒకవేళ ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం ఇప్పటివరకు తెలుగు వరకే పరిమితమైన త్రివిక్రమ్.. పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
రెండు సినిమాల మధ్య మొదలైన క్రికెట్ యుద్ధం
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్‌లో సరికొత్త ప్లాన్‌తో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 'ఆయ్' సినిమాతో పాటు కమిటీ కుర్రోళ్ళు చిత్రాలు ఆగష్టులోనే విడుదల కానున్నాయి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు క్రికెట్లో పోటీ పడ్డారు.ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న 'ఆయ్' సినిమాకు బన్నీ వాస్ నిర్మాతగా ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి నిర్మాతగా నిహారిక కొణిదెల ఉన్నారు. అయితే, వీరిద్దరూ రెండు జట్లగా ఏర్పడి క్రికెట్ పోటీకి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బన్నీ వాస్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన సరదా చాలెంజ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్నీ వాస్ విసిరిన చాలెంజ్‌ను నిహారిక కొణిదెల స్వీకరించారు. కచ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ కమిటీ కుర్రోళ్ళు టీమ్ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.జూలై 19న సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ రెండు సినిమాలు గోదావరి బ్యాక్ డ్రాప్‌తోనే తెరకెక్కాయి. క్రికెట్, మూవీ లవర్స్‌ను ఈ మ్యాచ్ ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.ఆయ్ సినిమా గురించిఫన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకోనుంది ఆయ్ చిత్రం. నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు ఇందులో ప్రధాన తారాగణంగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించినిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగష్టులోనే రిలీజ్ కానుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు, మణికాంత పరుశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట తదితరులు సినిమాలో నటించారు. యదు వంశీ దరక్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు. -
పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు
తెలుగు ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా గీతా ఆర్ట్స్‌కు మంచి పేరు ఉంది. ఈ బ్యానర్లో భాగమైన GA2 నుంచి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్లో 'గీత గోవిందం' చిత్రం వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్‌కు అనుగుణంగా వారి ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు బన్నీ వాస్. GA2 బ్యానర్లో ఆయన చాలా సినిమాలే తీశాడు. గీతగోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్‌తో జరిగిన వివాదం గురించి బన్నీ వాస్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. 'గీత గోవిందం తర్వాత నాతో పరశురామ్ ఒక కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను విజయ్‌కు ఫోన్ చేసి చెప్పాను. సినిమా చేసేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈలోపు దిల్ రాజుతో పరశురామ్ ఇదే కథ చెప్పినట్లు తెలిసింది. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. ఇదే విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం బాగానే బాధపడ్డాం. ఆ సమయంలో మేమంతా కొంచెం కోపంగా ఉన్నాం. అందుకు తగినట్లే పరుశురామ్‌పై రియాక్టయ్యాం. ఆ తర్వాత పరశురామ్ ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. సర్కారు వారి పాట సినిమా సమయంలో ఏదో ఫ్లోలో దిల్ రాజుకు కథ చెప్పాను ఆయన సినిమా ఓకే చేయడం. ఆ తర్వాత విజయ్‌కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇదే విషయం మీతో పొద్దున చెబుదామని అనుకున్నలోపే ఇలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. ఆ వివాదం తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి.. ఇదే సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు వద్దని చెప్పారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు. త్వరలో విజయ్- పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తాం.' అని బన్నీ వాసు పేర్కొన్నాడు. గతంలో ఏం జరిగింది..? గీతగోవిందం చిత్రం హిట్ కొట్టడంతో డైరెక్టర్ పరుశురామ్ చాలా సినిమాలకు ఒకేసారి కమిట్మెంట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆయన వారి నుంచి కొంతమేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ముందుగా అనుకున్నట్లుగా గీతగోవిందం తర్వాత పరశురామ్ అల్లు అరవింద్‌కే సినిమా చేయాల్సి ఉంది. కానీ 14 రీల్స్ బ్యానర్లో నాగచైతన్య సినిమా తీసి వస్తానని అల్లు కాంపౌండ్ నుంచి ఆయన బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కూడా మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా ఛాన్స్ దక్కడంతో నాగచైతన్య సినిమాను పక్కనపెట్టి మహేశ్- మైత్రీ మేకర్స్ వైపు మొగ్గుచూపాడు. ఆ సమయంలో 14 రీల్స్‌తో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో సర్కారు వారి పాటలో 14 రీల్స్‌ను కూడా భాగం అయింది. సర్కారు వారి పాట చిత్రం తర్వాత కూడా దిల్ రాజు- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ప్యామిలీ స్టార్' చిత్రాన్ని పరుశురామ్ ప్రకటించాడు. దీంతో అల్లు అరవింద్‌కు కోపం వచ్చిందని ఇండస్ట్రీలో వైరల్ అయింది. గీతగోవిందం తర్వాత తమతో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఉండగానే దిల్ రాజుతో పరశురామ్ సినిమా ఎనౌన్స్ చేయడం అరవింద్‌కు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని తెలిసింది. -
తెలుగోడి జానపదం దమ్ము చూపించింది
‘‘ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసి ఇదే తొలిసారి. మా ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి...’ పాట తెలుగోడి జానపదం దమ్ము చూపించింది. ఈ పాటకి పి. రఘు సాహిత్యం అందించడంతో పాటు పాడారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ మేక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన స్పందన వస్తోందంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాననే అనుభూతి ఉంది’’ అన్నారు. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే పాట వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో సినిమా కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘నా సినిమాలో జానపదం పాట పెట్టాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు తేజ మార్ని. -
వైష్ణవి చైతన్య ఇకనుంచి నీ టైం స్టార్ట్ అయ్యింది.. జాగ్రత్త..
-
గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో నాగచైతన్య. రీసెంట్గా కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. దీంతో అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ ఏంటి? ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు? అనే ఆసక్తి మెదలైంది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీవాసు కన్ఫర్మ్ చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏ ఏడాదిలోనే GA2 పిక్చర్స్ బ్యానర్లో నాగచైతన్యతో సినిమా ఉంటుందని తెలిపారు. డైరెక్టర్ ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో గీతా ఆర్ట్స్‌లో చై నటించిన '100% లవ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సెంటిమెంట్‌తో నెక్ట్స్ మూవీ కూడా హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. -
గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!
‘‘గీతగోవిందం’ సినిమాను కేరళలో విడుదల చేసి, వసూళ్లను అక్కడ విరాళంగా ఇచ్చాం(కేరళలో 2018 వచ్చిన వరదలను ఉద్దేశిస్తూ). బాహుశా.. అందుకేనేమో మలయాళ హిట్ మూవీ ‘2018’ ని తెలుగులో విడుదల చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ వేణు, ఆంథోనీ, పద్మ కుమార్‌గార్లకు థ్యాంక్స్. హృదయాన్ని హత్తుకునే సినిమా ‘2018’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. టోవినో థామస్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 3న రిలీజైంది. ఈ మూవీని ఈ నెల 26న తెలుగులో ‘బన్నీ’ వాసు విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో టోవినో థామస్ మాట్లాడుతూ–‘‘ఇకపై నేను నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ కార్యక్రమంలో అపర్ణా బాలమురళి, నిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ చేస్తా: టొవినో థామస్
‘2018 ’చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు కేరళలో మాత్రమే కాదు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను’అని మలయాళ హీరో టొవినో థామస్ అన్నారు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న ప్రముఖ నిర్మాత బన్నివాసు రిలీజ్ చేయగా.. మంచి స్పందన లభించింది. తొలి రోజు రూ. కోటికి పైగా వసూళ్లను రాబట్టి దుసూకెళ్తోంది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్. కానీ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను’అన్నారు. ‘నేను 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేశాను.కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. .పబ్లిసిటి కి ఎక్కువ టైం లేకపోయినా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని నమ్మాను. ఇప్పుడు అదే నిజమైంది. అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.చాలా ఆనందంగా ఉంది’అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్ అని అపర్ణ బాలమురళి అన్నారు. -
‘2018’ మూవీ రివ్యూ
టైటిల్: 2018 నటీనటులు: టొవినో థామస్, అసిఫ్ అలీ, లాల్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ తదితరులు నిర్మాతలు : వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ తెలుగులో విడుదల : 'బన్నీ' వాస్ దర్శకత్వం: జూడ్ ఆంథనీ జోసెఫ్ సంగీతం: నోబిన్ పాల్ సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్ విడుదల తేది: మే 26, 2023 ఆ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంటలన్నీ నాశనం అయ్యాయి. రైతుల గోసలు.. ఉద్యోగస్తుల తిప్పలు.. ఇవన్నీ టీవీల్లో చూసి చలించిపోయాం. రెండు, మూడు రోజుల పాటు కురిసి వానకే ఇంత నష్టం వాటిల్లితే.. మరి ఎడతెరపి లేకుండా కొన్ని వారాల పాటు వర్షం పడితే? వరదలు వస్తే? ఆ వరదల్లో కట్టుకున్న ఇళ్లతో పాటు అన్ని కొట్టుకొనిపోతే?.. ఇలాంటి ప్రకృతి విపత్తులు నిత్యం ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉంటాయి. టీవీల్లో వాటికి సంబంధించి వార్తలు చూసి కాసేపటికే చానెల్ మార్చేస్తాం. కానీ అలాంటి ప్రకృతి విపత్తే మన దగ్గర సంభవిస్తే? నిండు గర్భిణీ అయిన మీ భార్య వరదల్లో చిక్కుకొని పోతే? అంగవైకల్యంతో బాధపడుతున్న నీ కొడుకు ఉన్న ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరితే? కష్టపడి డిగ్రీ చదివిన నీ కూతురు సర్టిఫికేట్స్ వరద నీటీలో తడిసిపోతే? ఇష్టపడి కట్టుకున్న ఇల్లు నీ కళ్లముందే కూలిపోతే? తాగడానికి గుప్పెడు మంచి నీళ్లు కూడా లభించపోతే?.. ఇవన్నీ కేరళ ప్రజలు చూశారు. చరిత్రలో ఇంతవరకు చూడని వరదలను 2018లో అక్కడి ప్రజలు చూశారు. ఒకరిఒకరు సహాయం చేసుకొని ప్రకృతి ప్రళయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సంఘటలనే కథగా మలిచి ‘2018’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్. మే 5 కేరళలో విడుదలైన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికే రూ. 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అదే చిత్రాన్ని తెలుగులో 'బన్నీ' వాసు ఈ శుక్రవారం (మే 26) రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ‘2018’ కథేంటంటే.. కేరళలోని అరువిక్కుళం అనే గ్రామానికి చెందిన అనూప్ (టోవినో థామస్) ఎంతో ఇష్టపడి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అయితే అక్కడి కష్టాలు చూసి భయపడి ఉద్యోగం మానేసి ఊరిగి తిరిగొస్తాడు. అతన్ని చూసి జనాలంతా నవ్వుకుంటారు. ఇక మనోడు మాత్రం అవేవి పట్టించుకోకుండా దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన స్కూల్ టీచర్ మంజు(తన్విరామ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు నిక్సన్(అసిఫ్ అలీ) మోడల్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని తండ్రి(లాల్), అన్నయ్య(నరైన్) సముద్రంలో చేపలు పడుతూ జీవిస్తుంటారు. వారిది సముద్ర తర ప్రాంతం కావడంతో వర్షం పడినప్పుడల్లా ఇంటిని వదిలి క్యాంపుల్లోకి వెళ్తుంటారు. ఇక కోషీ(అజు వర్గీస్) ఓ టాక్సీ డ్రైవర్. కేరళ పర్యటనకు వచ్చిన విదేశీయులను తన క్యాబ్‌లో అన్ని ప్రాంతాలు తిప్పి చూపిస్తుంటాడు. సేతుపతి(కలైయారసన్) లారీ డ్రైవర్. డబ్బు కోసం బాంబులను అక్రమంగా సరఫరా చేయడానికి వెళ్తుంటాడు. ఇలా ఒక్కొక్కరిది అక్కడ ఒక్కో జీవితం. వీరందరి జీవితాలను 2018 వరదలు ఎలా తారుమారు చేసింది? ప్రకృతి కన్నెర్ర చేస్తే.. అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకొని ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? వరదల సమయంలో కేరళ ప్రజలు పడిన కష్టాలు ఏంటి? వేలాది మంది ప్రజలు అనుభవించిన బాధలు ఏంటి? అనేది కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమానే ‘2018’. ఎలా ఉందంటే.. 2018 ఆగస్టులో కేరళలో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. కేరళ చరిత్రలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని ‘జూడ్ ఆంథనీ జోసెఫ్’ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి అక్కడి ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇది అక్కడ జరిగిన సంఘటన కాబట్టి అందరికి కనెక్ట్ అయింది. మరి తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది? తెలుగు ప్రజలే కాదు మనుషులంతా ఈ కథను కనెక్ట్ అవుతారు. అయ్యో పాపం.. ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదే? అక్కడ నేనున్నా వెళ్లి వారిని కాపాడేవాడిని అనిపించేలా కొన్ని వరద సన్నివేషాలను తీర్చిదిద్దారు. సినిమా చూస్తున్నంత సేపు వరదల్లో మనవాళ్లు చిక్కుకున్నట్లుగా.. వారికి సహాయం చేసినప్పుడు హమ్మయ్యా.. వాళ్లు సేవ్ అయ్యారు’ అనే పీలింగ్ కలుగుతుంది. కథ మన ఊహకు అందినట్లుగా సాగితే బోరు కొడుతుంది. కానీ మనం కోరుకునేది తెరపై జరిగితే సంతోషం కలుగుతుంది. ఈ సినిమాలో మనం కోరుకునేవి చాలా జరుగుతాయి. కొన్ని సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా వికలాంగుడైన కొడుకుని కాపాడుకోవడం కోసం ఓ జంట పడే కష్టం.. గర్భవతిని హెలిక్యాప్టర్‌లో ఎక్కించే సీన్... సర్టిఫికెట్స్ కోసం ఇంట్లోకి నిక్సన్ వెళ్లే సీన్.. అక్కడ పాము కనిపిస్తే.. నిక్సన్ చేసిన పని.. ఇలా చాలా సన్నివేశాలు మన మనసుల్ని హత్తుకుంటాయి. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి. మరికొన్ని సనివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడకోసం మేమున్నామంటూ మత్స్యకారులు ముందుకొస్తే.. ‘ఇది కదా మానవత్వం’ అనిపిస్తుంది. మొత్తంగా 2018 సినిమా ఆడియన్స్‌ని టెన్షన్ పెడుతుంది. భయపెడుతుంది. బాధపెడుతుంది. చివరకు కులమతాల కంటే మానవత్వం గొప్పదని తెలియజేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. తమ పాత్రల్లో జీవించేశారు.ప్రతి ఒక్కరు తమ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాకొస్తే.. నోబిన్ పాల్ నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సీన్‌ని చాలా సహజంగా, అద్భుతంగా చిత్రీకరించాడు. చమన్ చాకో ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు అన్ని అద్భుతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘2018’ థియేటర్స్‌లో టెన్షన్ పెడుతుంది..క్లాప్స్ కొట్టిస్తుంది: బన్నీవాసు
‘‘2018’ సినిమా తెలుగు కాపీ చూశాను.. నచ్చింది. సెకండాఫ్‌లో మనకు తెలియకుండానే మనం కన్నీళ్ళు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో మనిషి జీవితం తాలూకు విలువ ఏంటో తెలుస్తుంది. 2018లో కేరళలో వరదల సమయంలో అక్కడి ప్రజలు వారి జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇలాంటి రియలిస్టిక్ ఘటనలను కూడా కమర్షియల్ అంశాలతో దర్శకుడు చక్కగా చెప్పారు. ఈ సినిమా ఆడియన్స్‌ను థియేటర్స్‌లో టెన్షన్ పెడుతుంది.. క్లాప్స్ కొట్టిస్తుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలై ఇప్పటికే రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇంకా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా తెలుగులో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో గీతా డిస్ట్రిబ్యూషన్, వైజాగ్‌లో ‘దిల్’ రాజు, మిగతా ఏరియాల్లో ‘బన్నీ’ వాసు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2018’ అందర్నీ మెప్పించే విధంగా ఉంటుంది. ఇక అల్లు అర్జున్‌గారి ‘పుష్ప: ది రూల్’ని డిసెంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. షారుక్ ఖాన్ ‘జవాన్’లో అల్లు అర్జున్‌గారు నటించారన్నది అవాస్తవం. బాలీవుడ్ మూవీ ‘అశ్వథ్థామ ఇమ్మోర్టల్’ ప్రపోజల్ అల్లు అర్జున్‌గారికి వచ్చింది కానీ ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు’’ అన్నారు. -
మా టీమ్ సక్సెస్ సీక్రెట్ అదే
‘‘వినరో భాగ్యము విష్ణు కథ’ విషయంలో కొత్తవారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని కొందరు అడుగుతున్నారు. అల్లు అరవింద్‌గారి క్రమశిక్షణ వల్ల మా ఖర్చు హద్దుల్లో ఉంటుంది. అదే మా టీమ్ సక్సెస్ సీక్రెట్’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రమిది. ఇప్పుడిప్పుడే ‘కేజీఎఫ్, విక్రమ్’ వంటి సినిమాల ఫార్మాట్లకు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘మా చిత్రం కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది’’ అన్నారు మురళీ కిషోర్ అబ్బూరు. నిర్మాత ఎస్కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడారు. -
వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీశా : బన్ని వాసు
‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు. ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.ఇప్పుడే అదే కరెక్ట్ అయింది. కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశాను’అని నిర్మాత బన్ని వాసు అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బన్నీ వాసు మాట్లాడుతూ.. నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు’ అన్నారు. ‘ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. మా హీరోయిన్ కశ్మీర మున్ముందు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం వల్లే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది’అని నిర్మాత ఎస్.కె.ఎన్ అన్నారు. ‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని హీరోయిన్ కశ్మీర పరదేశీ అన్నారు. 'ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది’ అని దర్శకుడు మురళీ కిషోర్ అన్నారు. -
ఎస్ఆర్ కళ్యాణ మండపం నచ్చడంతో ఈ అవకాశం.. ఇది నా అదృష్టం
‘‘గీతా ఆర్ట్స్‌లాంటి మంచి, పెద్ద బ్యానర్లో నటించా లని అందరూ అనుకుంటారు. నా కెరీర్‌ప్రారంభంలోనే ఆ బ్యానర్లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి మంచి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నచ్చడంతో అల్లు అరవింద్, వాసుగార్లు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చేసే అవకాశం ఇచ్చారు. ప్రేమ, వినోదం, థ్రిల్.. ఇలా కుటుంబ సమేతంగా చూడదగ్గ అన్ని అంశాలతో మురళి తెరకెక్కించారు. నా కెరీర్లో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ మంచి కమర్షియల్ హిట్. ఆ సినిమాని మించిన కమర్షియల్ హిట్‌ని ‘వినరో..’ సాధిస్తుంది. ‘కిరణ్ ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అని ప్రేక్షకులతో అనిపించుకోవా లన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మీటర్’ షూటింగ్ పూర్తయింది. ‘రూల్స్ రంజన్’ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. -
అందువల్లే ఆ హీరోలు క్లిక్ అవుతున్నారు – నిర్మాత బన్నీ వాసు
‘‘ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా లేకున్నా కష్టపడాలి. అల్లు అర్జున్, నాని, కిరణ్ అబ్బవరం, నిఖిల్‌లకు సినిమా అంటే తపన.. అందువల్లే వారు క్లిక్ అవుతున్నారు. సినిమా కోసం నిద్రపోకుండా బాగా కష్టపడతారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘వినరో భాగ్యము విష్ణు కథ’లో వినోదం, ప్రేమ, థ్రిల్లింగ్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఈ చిత్రంలో సిగరెట్, మందు తాగే సీన్లు లేవు.. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా రషెస్ చూశాక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే మా నమ్మకం రెట్టింపు అయ్యింది. నా కెరీర్లో గుర్తు పెట్టుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
బన్నీ వాసు బంపరాఫర్.. పుష్ప 2 షూటింగ్ చూసే ఛాన్స్!
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి "వాసవసుహాస" పాటకు, చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో మ్యాచ్ నిర్వహించింది. ఆ మ్యాచ్‌లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్ సైదులుతో "ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం" సాంగ్ రిలీజ్ చేయించింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు. బన్నీ వాసు మాట్లాడుతూ.. 'ఈ సాంగ్‌ను రీల్‌గా చేసి గీతా ఆర్ట్స్‌ను ట్యాగ్ చేయండి. సెలెక్ట్ అయిన 10 మందికి, వాళ్ళ ఫ్యామిలీకి ఈ సినిమాను చూపించడమే కాకుండా వాళ్ళను పుష్ప షూటింగ్‌కు కూడా తీసుకెళ్తాం' అని ప్రకటించారు. వినరో భాగ్యము విష్ణు కథ విషయానికి వస్తే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. చదవండి: పెళ్లిపీటలెక్కిన హీరోయిన్, ఫోటోలు వైరల్ -
ఆ సినిమాతో పోల్చడం సంతోషం
‘‘ఫీల్ గుడ్ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్‌కి ఉన్న ఫీలింగ్ మా ‘18 పేజెస్’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్. ‘‘2022లో టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్‌లో మా ‘18 పేజెస్’ ఉంటుంది. కెరీర్ వైజ్‌గా నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్’’ అన్నారు నిఖిల్. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ. ∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్ -
"వినరో భాగ్యము విష్ణు కథ" ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తిరుమల తిరుపతి నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రెడీ చేస్తుంది చిత్ర బృందం. "వాసవసుహాస" అనే పాటను డిసంబర్ 24 న సాయంత్రం 6:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. -
నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఓ సినీ నిర్మాత తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ నిరసనకు దిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు గురువారం రాత్రి సునీత బోయ నగ్నంగా బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామానికి పంపించారు. వివరాలివీ... తెలుగులో పలు సూపర్‌హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, డిస్ట్రిబ్యూటర్‌గా పేరొందిన బన్నీ వాసు తనను మోసం చేశారని... వాడుకొని వదిలేశాడని ఆమె ఆరోపించింది. బన్నీవాసు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ బైఠాయించడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో తనను బన్నీవాసు బెదిరిస్తున్నాడని మానసికంగా వేధించడమే కాకుండా చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ దుయ్యబట్టింది. రెండు గంటల పాటు ఆమె గీతాఆర్ట్స్ కార్యాలయం ముందు హడావుడి చేశారు. చదవండి: (కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
కమర్షియల్ హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: మారుతి
‘పక్కా కమర్షియల్’ చిత్రం మేము అనుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. నా సినిమాకు వచ్చే అడియన్స్ ఏం ఆశిస్తారో అవన్ని ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు’అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ పతకాలపై బన్నీ వాస్ నిరించారు. జులై 1న ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. (చదవండి: అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది. అనంతరం మారుతి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్‌ని స్టైలీష్‌గా చూపించారని, రాశీఖన్నా ట్రాక్ బాగుందని చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ ఇంకా బెటర్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను’ అని అన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. తొలి రోజే రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు ’అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు నటుడు సప్తగిరి. ‘ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం మేము టికెట్స్ రేట్ తగ్గించాం. ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ’అన్నారు సహ నిర్మాత ఎస్కేఎన్. ఈ చిత్రంలో రావు రమేశ్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
పెద్ద బ్యానర్లో శివానీ రాజశేఖర్ సినిమా!
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ సినిమాతో మరో మారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమైంది. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి బన్నీ వాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. Some journeys are worth waiting for… this one is going to be special :)#AlluAravind garu Presents @GA2Official's #ProductionNo8 launched today with a pooja ceremony.✨Produced by #BunnyVas & #VidhyaMadhuri Directed by #TejaMarni @actorsrikanth @varusarath5 #Shivani pic.twitter.com/u76XITcrnY— Rahul Vijay (@ActorRahulVijay) June 30, 2022 చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి