సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే! | Okay in a single sitting! | Sakshi
Sakshi News home page

సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే!

Published Sun, Jan 1 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే!

సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే!

2016లో వరుసగా ‘సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ’ లాంటి హ్యట్రిక్‌ సూపర్‌హిట్స్‌తో దూసుకుపోతున్న గీతా ఆర్ట్స్‌కి అనుభంద సంస్థ జీఏ 2 బ్యానర్‌లో ‘భలే భలే మగాడివోయ్‌’ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్ని వాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతా ఆర్ట్స్‌లో కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విజయాన్ని సాధించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరుశురాం (బుజ్జి) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారు. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై ట్రెండింగ్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న ‘పెళ్ళి చూపులు’తో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్‌ దేవరకొండ ఇందులో హీరో. నాగచైతన్యతో ‘100% లవ్‌’, సాయిధరమ్‌తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, నానితో ‘భలే భలే మగాడివోయ్‌’ వంటి విజయాల తర్వాత ఇప్పడు విజయ దేవరకొండతో బన్ని వాసు ఈ చిత్రం నిర్మించనున్నారు.

2016లో సౌత్‌లో నాలుగు విజయాలు సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్‌
గీతా ఆర్ట్స్‌కి విజయాలు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు అప్‌డేట్‌ అవుతూ నిర్మాత అల్లు అరవింద్‌ తన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా చూసుకుంటారు. అంతే కాదు ఎంతోమంది నిర్మాతలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా అత్యంత భారీగా ఆయన నిర్మించిన మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరైనోడు’. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదలై, భారీ కలెక్షన్లతో బన్ని కెరీర్‌లోనే బెస్ట్‌ రెవిన్యూ ఫిల్మ్‌గా నిలిచింది. అలాగే అల్లు శిరీష్‌ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాన్ని పక్కా ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇది కూడా అల్లు శిరీష్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ గా నిలిచింది. 2016 చివరిలో విడుదలైన స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌గా అందిరి హృదయాలు దోచుకుని మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 2016 బెస్ట్‌ రెవిన్యూ ఫిల్మ్‌గా ‘ధృవ’తో తెలుగులో హ్యాట్రిక్‌ హిట్‌ సాధించారు. అలాగే తెలుగులో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాన్ని కన్నడ భాషలో నిర్మించారు. డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ సక్సెస్‌ సాధించింది. ఇప్పడు పరుశురాం దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా బన్ని వాసు నిర్మాతగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్రేక్షకుడి ఆనందమే ముఖ్యం
చిత్ర సమర్పకులు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘ప్రతి ప్రేక్షకుడు ఆనందం పొందాలనే సంకల్పంతోనే చిత్రాలు రూపొందిస్తున్నాం. 2016లో మాస్‌ ఎంటర్‌టైనర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌... ఇలా మూడు వైవిధ్యమైన జానర్‌లో చిత్రాలు చేశాం. అవి సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలుగా ఆదరణ పొందాయి. ఇక నుండి వచ్చేవి కూడా ఇలానే మంచి చిత్రాలుగా ఆదరణ పొందే విధంగా చేస్తాం. పరుశురాం చెప్పిన కథ చాలా బాగుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు.

సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ – ‘‘అల్లు అరవింద్‌గారు నిర్మాతగా 2016లో నిర్మించిన మూడు చిత్రాలు సూపర్‌హిట్స్‌ కావడం హ్యపీగా వుంది. పరుశురాంగారు చెప్పిన కథ అరవింద్‌గారికి చాలా నచ్చింది. వెంటనే నాకు వినిపించారు. సింగిల్‌ సిట్టింగ్‌లోనే నాకు నచ్చింది. పరుశురాంగారి విజన్‌ సూపర్‌గా వుంటుంది. చాలా చిత్రాలు ప్రూవ్‌ అయ్యాయి కూడా. ‘భలే భలే మగాడివోయ్‌’లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ తరువాత జీఏ2 బ్యానర్‌లో గ్యాప్‌ తీసుకున్నాం. చేస్తే ఆ రేంజి విజయాన్ని సాధించే చిత్రాలు చేయాలనే సంకల్పంతో గ్యాప్‌ తీసుకున్నాం. ఇప్పడీ కథ ఆ రేంజిలో వుందనే నమ్మకంతో ఓకే చేశాం. అల్లు అరవింద్‌ గారు సమర్పణలో ఈ చిత్రం అతి త్వరలో సూపర్‌ టెక్నిషియన్స్‌తో భారీ తారాగణంతో సెట్స్‌ మీదకి వెళ్ళనుంది’’  అన్నారు.

డబుల్‌ లక్‌!
దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ – ‘‘గీతా ఆర్ట్స్‌లో ఒక్క చిత్రం చేయటం లక్‌ అంటారు. నేను వరుసగా రెండవ చిత్రం కూడా చేసే డబుల్‌ లక్‌ని అరవింద్‌గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement