Geetha Arts
-
గీతా ఆర్ట్స్ కు చేరుకున్న అల్లు అర్జున్
-
ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.. 'మ్యాడ్' సినిమాతో నటుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఓ మాదిరి యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడి రెండో సినిమా 'ఆయ్'. గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తీశారు. ఆగస్టు 15న భారీ చిత్రాలతో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)'ఆయ్' ట్రైలర్ చూస్తే.. విలేజీలో ముగ్గురు కుర్రాళ్లు. అందులో హీరో ఒకడు. ఒకమ్మాయితో ప్రేమ, తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? అనేది స్టోరీ లైన్ అనిపిస్తోంది. అయితే ఫుల్ ఆన్ కామెడీగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ట్రైలర్లోనూ డబుల్ మీనింగ్ లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే సినిమాలోనూ ఇలాంటివి ఉండొచ్చు. ట్రైలర్ అయితే ఫన్నీగా బాగానే ఉంది. కాకపోతే 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్' సినిమాలతో పోటీని తట్టుకుని ఎంత మేరకు థియేటర్లలో నిలబడుతుందనేద పెద్ద టాస్క్. నిర్మించింది గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చు. కానీ 'ఆయ్'కి హిట్ టాక్ కూడా ముఖ్యమే. ఒకవేళ మిగతా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం 'ఆయ్' పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. తొలి సినిమా 'మ్యాడ్'తో హిట్ కొట్టిన తారక్ బావమరిది.. రెండో సినిమాతో ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్) -
మళ్లీ మాస్ కాంబో
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
తండేల్ జర్నీ ప్రారంభం.. సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్‌తో మరో సినిమా ప్రారంభమైంది. లవ్ స్టోరీ చిత్రం తర్వాత వారిద్దరూ ‘తండేల్’లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేశ్, సాయి పల్లవి, అల్లు అరవింద్‌తో పాటు మూవీ టీమ్ హాజరైంది. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సాయి పల్లవి నిలిచింది. 'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు భారీగానే కసరత్తు చేశాడు. 2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్‌కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. ఈ రియల్ కథకు తనదైన స్టైల్లో తెరకెక్కించేందుకు ఆయన రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెడుతున్నారని పూజా కార్యక్రమంలో నాగ చైతన్య తెలిపాడు. 'లవ్‌స్టోరి' తర్వాత మళ్లీ సాయిపల్లవితో కలిసి ఇందులో నటించడం. తన వల్ల కథకి మరింత బలం చేకూరినట్టైందని ఆయన అన్నాడు. విస్తృత పరిధి ఉన్న కథ కావడంతో కొంత భాగం ఇండియాలో, కొంత భాగం పాకిస్థాన్‌లో చిత్రీకరణ జరుగుతుందని చైతూ తెలిపాడు. ఈ చిత్రానికి సంగాతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. KING @iamnagarjuna garu graces the #Thandel Muhurtham Ceremony to extend his wishes and blessings to the team ❤️🔥 Watch live now! - https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥 Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas… pic.twitter.com/WWnv5evAFH — Geetha Arts (@GeethaArts) December 9, 2023 The ever gracious @Sai_Pallavi92 is here at the #Thandel Muhurtham Ceremony ❤️🔥 Watch live now! - https://t.co/yymBdA4Iz0#Dhullakotteyala 🔥 Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @KarthikTheeda @bhanu_pratapa… pic.twitter.com/GfMxTT5fvc — Geetha Arts (@GeethaArts) December 9, 2023 -
'లింగి లింగి లింగిడి' పాట.. 30 మిలియన్ వ్యూస్ సెలబ్రేషన్స్
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పాట బాగా పాపులర్ అయింది. 'లింగి లింగి లింగిడి' అంటూ సాగే ఈ శ్రీకాకుళం ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. తాజాగా 30 మిలియన్ల వ్యూస్ దాటేసింది. దీంతో ఈ పాట ఉన్న 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా టీమ్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) 30 మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసిన మూవీ టీమ్.. తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బన్నీ వాసు, విద్యా కొప్పినీడితో పాటు నటీనటులు రాహుల్ విజయ్, శివాజీ రాజశేఖర్, దర్శకుడు తేజ మర్ని పాల్గొన్నారు. జీఏ 2 సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని మలయాళ సూపర్‌హిట్ 'నాయట్టు' చిత్రానికి రీమేక్. నవంబరు 24న థియేటర్లలోకి ఈ మూవీ రానుంది. తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
'నాయట్టు' రీమేక్.. తెలుగులో ఇన్నాళ్లకు
2021లో మలయాళంలో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్‌కు రెడీ అయిపోయింది. చాలారోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ ఇన్నాళ్లకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలతో పాటు ఇతర విషయాల్ని ఇన్నాళ్లకు వెల్లడించారు. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) ఈ ప్రాజెక్ట్‌కు 'కోటబొమ్మాళి PS' అనే పేరు ఖరారు చేశారు. రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల ఆధారంగా నడిచే కథ ఇది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో, వరలక్ష్మి శరత్‌కుమార్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. రంజిన్ రాజ్-మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. 'నాయట్టు' కథేంటి? రాష్ట్రంలో ఎన్నికల జరిగే టైమ్. ఓ చిన్న ఊరిలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు ఓ కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న ఘర్షణ జరుగుతుంది. దానికి రాజకీయం తోడవడంతో పరిస్థితులు మారపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సై, కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు ఢీకొని.. గొడవలో ప్రధాన వ్యక్తి స్నేహితుడు చనిపోతాడు. దీంతో వీళ్ల ముగ్గురిని బంధించి హత్య కేసు పెట్టమని ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ తప్పించుకుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే
బేబీ హీరోయిన్ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గా అయినా కొనసాగాలని పలు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ.. ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటున్న తనకు డైరెక్టర్ సాయిరాజేశ్ వల్ల బేబీతో సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. (ఇదీ చదవండి: నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఖాయం) మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో ఒక తెలుగమ్మాయి టాలెంట్‌కు దక్కాల్సిన ఫేమ్ తనకు వచ్చింది. (ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) తాజాగా వైష్ణవి టాలీవుడ్లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్లోనే అల్లు అరవింద్ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్‌లో గీతా ఆర్ట్స్ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది. -
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం రానుందని ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్) దీనిని నిజం చేస్తూ తాజాగా గీతా ఆర్ట్స్ , హారికా- హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా అల్లు అర్జున్- త్రివిక్రమ్‌లతో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు సంబంధించి ట్వీట్ చేశారు. నేడు (జులై 3)న ఉదయం 10 గంటల 8 ని.లకు వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది. We are elated to reunite the much celebrated duo. It's the Icon Star @alluarjun garu & our Darling Director #Trivikram garu coming together for the 4th time 🤩🌟 More Details Soon 🖤 #AlluAravind #SRadhaKrishna @haarikahassine @geethaarts pic.twitter.com/xO7P05IBgY — Naga Vamsi (@vamsi84) July 3, 2023 -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో నాగచైతన్య. రీసెంట్గా కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. దీంతో అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ ఏంటి? ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు? అనే ఆసక్తి మెదలైంది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీవాసు కన్ఫర్మ్ చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏ ఏడాదిలోనే GA2 పిక్చర్స్ బ్యానర్లో నాగచైతన్యతో సినిమా ఉంటుందని తెలిపారు. డైరెక్టర్ ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో గీతా ఆర్ట్స్‌లో చై నటించిన '100% లవ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సెంటిమెంట్‌తో నెక్ట్స్ మూవీ కూడా హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. -
చరణ్ బర్త్‌డే: మెగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అల్లు అరవింద్
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ అందించనున్నారు. చరణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. 13 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది. ఈ సినిమాను రిరిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని రిరిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా గీతా ఆర్ట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు! కాగా మెగా తనయుడిగా చిరుత సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చరణ్ తన రెండవ సినిమా మగధీరతోనే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు మూడింతల లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను చరణ్ బర్త్‌డే సందర్భంగా అల్లు అరవింద్ రిరిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇందులో చరణ్ పోషించిన కాలభైరవ పాత్రకు విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. చదవండి: విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ On the occasion of 𝐌𝐄𝐆𝐀 𝐏𝐎𝐖𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan Birthday! 😎 Re-Releasing the Sensational 𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐘 𝐇𝐈𝐓 #Magadheera in theaters 🔥#MagadheeraReRelease 💥@ssrajamouli @MsKajalAggarwal @mmkeeravaani #AlluAravind @BvsnP @DOPSenthilKumar @GeethaArts pic.twitter.com/aENWnSn23a — Geetha Arts (@GeethaArts) February 23, 2023 -
'అబ్బాయి టచ్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది'.. సాంగ్ ప్రోమో రిలీజ్
కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకెండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.ఈ పూర్తి పాటను జనవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. -
కిరణ్ అబ్బవరం చేతిలో భారీ ప్రాజెక్ట్స్.. 2023లో ఫుల్ బీజీ
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019లో ‘రాజా వారు రాణి గారు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టి, కిరణ్‌ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. 2022లో కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524”ని ప్రయత్నించాడు. ఇందులో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసుగా నటించాడు, అయితే అతని కెరీర్ ప్రారంభ దశలలో ఈ ప్రయత్నం నటుడిగా ప్రశంసించబడినప్పటికీ, ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆ తరువాత సమ్మతమే మే 24, 2022న విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకర్షించింది మరియు మహిళా ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన నేను మీకు బాగా కావాల్సినవాడిని’డిజాస్టర్‌గా నిలిచి అతని కెరీర్లో కుదుపును సృష్టించింది. అయితే చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఆయన క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి పెద్ద బ్యానర్స్‌లో అతని సినిమాలు ఉన్నాయి. 2023లో వరుస ప్రాజెక్ట్స్‌తో కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆయన నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’చిత్రం విడుదల కానుంది. ఆ తర్వాత మరో రెండు పెద్ద సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. మొత్తానికి కిరణ్ అబ్బవరం తన కెరీన్ని బాగా ప్లాన్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. వీటిలో ఏ ఒక్క చిత్రం హిట్ అయినా చాలు..కిరణ్‌కి మరో ఏడాది పాటు ఢోకా ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నా
-
ధనుష్ ‘నేనే వస్తున్నా’నుంచి ‘ఒకే ఒక ఊరిలోనా..’సాంగ్ రిలీజ్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘నానే వరువెన్’. తెలుగు ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’సాగే ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ అలపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు. ‘పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది..పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది’ లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న 4వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
‘గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. ‘గీతా ఆర్ట్స్ ’మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’.. టీజర్ విడుదల
తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’(తెలుగులో నేనే వస్తున్నా). సెల్వ రాఘవన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. 1 నిమిషం 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులో ధనుశ్ క్లాస్, రస్టిక్ రోల్స్‌తో ద్విపాత్రాభినయం చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌కు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా ఉంది. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
బన్నీవాసు మోసం చేశాడు.. గీతా ఆర్ట్స్ ఎదుట సినీ నటి ఆందోళన
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె తనకు న్యాయం కావాలంటూ ఇదే కార్యాలయం ముందు నగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాలంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. రెండు వారాలు గడవకముందే మళ్లీ ఆమె అదే కార్యాలయం ముందు బైఠాయించి గేటుకు వేలాడుతూ నిరసన వ్యక్తం చేసింది. గీతా ఆర్ట్స్ కార్యాలయం ప్రతినిధులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా వినకుండా గేటు ముందే పడుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులను మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటి వరకు ఆమె ఇదే కార్యాలయం ముందు పాతికసార్లు ఆందోళన చేయగా రెండుసార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అయినా ఆమెలో మార్పురాక పోగా తరచూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ధర్నాకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర45లో ఉన్న గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది. కాగా గతంలోనూ సునీత గీతా ఆర్ట్స్ ముందు పలుమార్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. చదవండి: రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే.. -
జీఏ 2 బ్యానర్లో నూతన చిత్రం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూతన చిత్రం ప్రారంభమైంది. వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థగా ఇమేజ్ అందుకున్న జీఏ 2పిక్చర్స్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ 7గా ఈ నూతన చిత్రం రాబోతుంది. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్షకాధరణ అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అంజలి, ప్రముఖ నటలు రావు రమేశ్, ప్రియదర్శీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరక్టర్ మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. -
షాకింగ్ : హీరోకు సమానంగా రావు రమేష్ రెమ్యునరేషన్
Rao Ramesh Remuneration: ప్రముఖ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టినా నటుడిగానే గుర్తింపు సంపాదించుకున్నారు. గమ్యం, కొత్త బంగారు లోకం వంటి పలు సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. మలయాళ సూపర్ హిట్ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ ప్రముఖ పాత్రలోకనిపించనున్నారట. ఇందుకు గాను ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెమ్యునరేషన్ విషయంలో ఇది రికార్డ్ అనే చెప్పవచ్చు. స్టార్లకు సమానంగా రావు రమేష్ పారితోషికం అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా త్వరలోనే స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లనుంది. -
బడా బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన కలర్ ఫోటో దర్శకుడు
తన మొదట చిత్రం ‘కలర్ ఫోటో’ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నదర్శకుడు సందీప్ రాజ్. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే వ్యూస్ ను సంపాదించింది. నూతన దర్శకులకు కూడా ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు, నిర్మాణ సంస్థలు అవకాశాలు ఇస్తున్నారు. కథ నచ్చితే వెంటనే వాళ్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్ రాజ్‌కు కూడా స్టార్ హీరో నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తుంది. నూతన దర్శకుడైన ‘కలర్ ఫోటో’ సినిమాను తెరకెక్కించిన తీరు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రముఖలకు నచ్చింది. అందుకే గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఇప్పటికే సందీప్ రాజ్‌కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు. ఈ సంస్థలో హిట్ అందుకుంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం సందీప్ కి ఉండదు. ఇప్పటికే ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బహుశా ఈ స్టార్ హీరో ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరో ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఏదేమైనా ఈ మధ్య టాలీవుడ్లో నూతన దర్శకుల హవా కొనసాగుతోందనే చెప్పాలి. ( చదవండి: ఒక రాత్రి... నాలుగు కథలు! ) -
అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే అభిమానులంత అతడిని ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. ఇక నటన, డ్యాన్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఎర్పరుచుకున్న బన్నీ ప్యాన్ ఇండియా నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో పాన్ ఇండియా చిత్రం ‘పుష్మ’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ను కలిసి కథ విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక మంగళవారం(ఫిబ్రవరి 9) దర్శకుడు ప్రశాంత్ నీల్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో బన్నీని కలిసి బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బన్నీకి ప్రశాంత్ కథ వివరించాడని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ రానుందంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు బన్నీ అభిమానులను కలిసిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల అర్జున్ తన 10వ వివాహ వార్షికోత్సవ వేడుకను భార్య స్నేహ రెడ్డితో కలిసి జరుపుకున్న సంగతి తెలిసిందే. తాజ్‌మహాల్ వద్ద స్నేహరెడ్డితో కలిసి తీసుకున్న ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లీంగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని తెన్‌కాశీలో జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్, పాట చిత్రీకరిస్తున్నారు చిత్రదర్శకుడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మీక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) చదవండి: బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్ అప్పుడే పదేళ్లు.. తాజ్‌మహల్ వద్ద బన్నీ, స్నేహ హల్చల్ -
డ్రైవర్.. నర్స్... ఓ ప్రేమకథ
‘‘చావు కబురు చల్లగా’ సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథకు నన్ను ఎంచుకున్నందుకు ‘బన్నీ’ వాసుగారికి ధన్యవాదాలు. అల్లు అరవింద్‌గారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ క్లారిటీతో ఈ సినిమా తీశాడు. ఒక మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉంది’’ అని కార్తికేయ అన్నారు. ‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘కదిలే కళ్లనడిగా..’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘ఇదొక లవ్ స్టోరీ. సీరియస్ పాయింట్‌ను ఎంటర్టైనింగ్గా చెప్పాం. ఈ సినిమాలో హీరో డెడ్ బాడీస్‌ను పికప్ చేసుకొనే వెహికల్ డ్రైవర్‌గా, హీరోయిన్ నర్స్‌గా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఫ్రెష్ కంటెంట్‌తో కౌశిక్ చెప్పిన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదని ఈ సినిమా చేశా. ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసినప్పుడు హ్యాపీ. కార్తికేయ, లావణ్య ఈ కథకు పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. సినిమాలో భావోద్వేగాలు బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు. గీతా ఆర్ట్స్‌లో రెండో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.. థ్యాంక్స్ టు వాసుగారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. -
ఏంటి అన్నయ్య.. ప్రతిసారి కొత్త లుక్
ఇంట్లో ఉండి బోర్ కొట్టిందో, తన ఆఫీసు ఎలా ఉందో అనుకున్నారో ఏమో కానీ, హీరో అల్లు అర్జున్ గురువారం హైదరాబాద్‌లోని తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఎప్పుడూ ఉండే సందడి, హంగామా ఇప్పుడు కనిపించలేదని నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. "చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎలాంటి హరీబరీ లేదు. కరోనా వల్ల ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలి" అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీ షర్టు ధరించి, డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఆఫీసు ప్రాంగణంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్) ఈ లుక్‌లో బన్నీని చూసిన అబిమానులు ఆశ్చర్యపోతున్నారు. "ఏంటి అన్నయ్య.. కనపడిన ప్రతీ సారి ఏదో ఒక కొత్త లుక్‌లో దర్శనం ఇస్తూ ఉన్నారు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. "మేము అదే అనుకుంటున్నాం అన్నా.. తొందరగా షూటింగ్ స్టార్ట్ అవాలి. నిన్ను మళ్లీ స్క్రీన్ మీద చూడాలి" అని మరో అభిమాని రాసుకొచ్చారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లు దాటేసిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం "పుష్ప". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు. (మరో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్!) Casually dropped in Geetha Arts after a long time . I miss the hustle . Wishing for these tough times to end soon . #besafe pic.twitter.com/fUu20dABr5 — Allu Arjun (@alluarjun) August 20, 2020 -
మగధీర.. కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రికార్డు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. రామ్‌చరణ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్.. తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా రామ్‌చరణ్.. హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్‌చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.(జూన్ 8 వరకు సుశాంత్‌తోనే ఉన్నా: రియా) Here's the beautiful video tribute to Dr.Srihari garu by @AlwaysRamCharan fans on the 11th anniversary of #Magadheera #11YearsForIHMagadheera#RamCharan #SSRajamouli pic.twitter.com/j9uaFfdt8t — BARaju (@baraju_SuperHit) July 31, 2020 అలాగే రాజమౌళి- డైరెక్షన్, కీరవాణి- సంగీతం, కేకే సెంథిల్- సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్- ఫైట్స్, రమ రాజమౌళి- కాస్ట్యూమ్ డిజైన్స్.. ఇలా ప్రతి ఒక్కటి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. ఆ సినిమా సంగతులను గుర్తుచేసుకుంది. ‘ మగధీర సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. ఫిల్మ్ మేకింగ్‌లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విడుదల తర్వాత దక్షిణాదిలో సన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది’ అని పేర్కొంది.(రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా) తాజాగా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కూడా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మగధీర షూటింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలనున ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. మగధీర నుంచి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ‘#11YearsForIHMagadheera’ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దివంగత నటుడు శ్రీహరికి రామ్‌చరణ్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీహరి తనపై తీసుకున్న కేర్ గురించి రామ్‌చరణ్ గతంలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. Some wonderful memories from #Magadheera.....@AlwaysRamCharan @MsKajalAggarwal @ssrajamouli @GeethaArts pic.twitter.com/DTDa46DoiO — KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) July 31, 2020