యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019లో ‘రాజా వారు రాణి గారు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టి, కిరణ్‌ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది.
2022లో కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524”ని ప్రయత్నించాడు. ఇందులో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసుగా నటించాడు, అయితే అతని కెరీర్ ప్రారంభ దశలలో ఈ ప్రయత్నం నటుడిగా ప్రశంసించబడినప్పటికీ, ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆ తరువాత సమ్మతమే మే 24, 2022న విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకర్షించింది మరియు మహిళా ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది.
ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన నేను మీకు బాగా కావాల్సినవాడిని’డిజాస్టర్‌గా నిలిచి అతని కెరీర్‌లో కుదుపును సృష్టించింది. అయితే చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఆయన క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి పెద్ద బ్యానర్స్‌లో అతని సినిమాలు ఉన్నాయి.
2023లో వరుస ప్రాజెక్ట్స్‌తో కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆయన నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’చిత్రం విడుదల కానుంది. ఆ తర్వాత మరో రెండు పెద్ద సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు. మొత్తానికి కిరణ్ అబ్బవరం తన కెరీన్‌ని బాగా ప్లాన్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. వీటిలో ఏ ఒక్క చిత్రం హిట్ అయినా చాలు..కిరణ్‌కి మరో ఏడాది పాటు ఢోకా ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment