‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్‌లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు. ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.ఇప్పుడే అదే కరెక్ట్ అయింది. కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశాను’అని నిర్మాత బన్ని వాసు అన్నారు.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బన్నీ వాసు మాట్లాడుతూ.. నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు’ అన్నారు.
‘ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. మా హీరోయిన్ కశ్మీర మున్ముందు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం వల్లే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది’అని నిర్మాత ఎస్.కె.ఎన్ అన్నారు.
‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని హీరోయిన్ కశ్మీర పరదేశీ అన్నారు. 'ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది’ అని దర్శకుడు మురళీ కిషోర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment