ఓటీటీలో కిరణ్‌ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ'  | Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha OTT Platform | Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha : ఓటీటీలో కిరణ్‌ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ' 

Published Thu, Feb 23 2023 3:46 PM | Last Updated on Thu, Feb 23 2023 4:39 PM

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha OTT Platform - Sakshi

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో కిరణ్‌ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. ఈ చిత్రంలో కాశ్మీర పరదేశి హీరోయిన్‌గా నటించింది.అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ సినిమాతో మురళీ కిషోర్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈనెల 18న విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

వినరో భాగ్యము విష్ణుకథ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చేనెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement