మా అమ్మ పేరు గీత కాదు నిర్మల | allu sirish about geetha arts name | Sakshi
Sakshi News home page

మా అమ్మ పేరు గీత కాదు నిర్మల

Published Thu, Aug 25 2016 10:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

మా అమ్మ పేరు గీత కాదు నిర్మల

మా అమ్మ పేరు గీత కాదు నిర్మల

ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్న అల్లు శిరీష్ అభిమానులకు చేరువయ్యేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శిరీష్, ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన శిరీష్, ప్రపంచానికి భగవద్గీతను అందించిన కృష్ణ భగవానుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ పేరు వెనక ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు. మా నాన్న భగవద్గీత ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు, అందుకే మా బ్యానర్కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు. కానీ చాలా మంది మా అమ్మ పేరు గీత అనుకుంటారు.. కానీ ఆమె పేరు నిర్మల అని ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement